5, ఆగస్టు 2023, శనివారం

నిర్మించడం చాలా కష్టం

*

*కం*

నిర్మించుట కడుకష్టము

నిర్మూలించుట సులభము నిక్కంబెరుగన్

నిర్మాణములను కాచుట

ధర్మం బౌ నరులకెల్ల ధరణిని సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నిర్మించడం చాలా కష్టం కానీ కూల్చడం సులభం. కానీ నిజం తెలుసుకోవాలంటే నిర్మాణాలను కాపాడటం మనుషులకు ధర్మం.

*సందేశం*:-- ఏ నిర్మాణాలనైనా,చెట్లనైనా నిర్మూలించడం కంటే ఏదో ఒక విధంగా కాపాడటం ధర్మము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

జీవితమను పెనుపాఠము

జీవించగ బోధపడును జీవులకెపుడున్.

చావను తుదిపాఠంబే

జీవికినవగతముగాని జిగిబిగి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! జీవితమనే పెద్ద పాఠము జీవించినప్పుడే జీవులకు తెలియును. ఇందులో చావు అనే చివరి పాఠం ఏ జీవికీ అర్థం కాని ప్రవల్లిక(జిగిబిగి = puzzle).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: