6, మే 2024, సోమవారం

*శ్రీ గౌరీశ్వర దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 309*


⚜ *కర్నాటక  : యలందూరు - చామరాజనగర్*


⚜  *శ్రీ గౌరీశ్వర దేవాలయం*


 

💠 గౌరీశ్వర దేవాలయం  ద్రావిడ శిల్పకళకు దీపస్తంభం , భారతదేశంలోని కర్ణాటకలోని యెలందూర్ నడిబొడ్డున ఉంది .


💠 గౌరీశ్వర దేవాలయం విజయనగర సామ్రాజ్య పాలనలో ప్రత్యేకంగా 16వ శతాబ్దంలో చిక్క తిమ్మరస అనే స్థానిక నాయకునిచే నిర్మించబడింది. 

ఈ కాలం కళ మరియు వాస్తుశిల్పం యొక్క పోషణకు ప్రసిద్ధి చెందింది మరియు ఆలయం దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది.


💠 శివుని యొక్క గొప్ప భక్తుడైన చిక్క తిమ్మరుసు తన భక్తిని చాటుకోవడానికి ఆలయ నిర్మాణాన్ని అప్పగించాడు. 

అతను ఈ ప్రాంతంలో ప్రముఖ వ్యక్తి, 

అతని పరిపాలనా చతురత మరియు సాంస్కృతిక అభివృద్ధికి అంకితభావంతో ప్రసిద్ధి చెందాడు.


💠 విశిష్ట లక్షణాలలో క్లిష్టమైన రీతిలో చెక్కిన ఎత్తైన ప్రవేశ ద్వారం మరియు ప్రత్యేకంగా రూపొందించిన గర్భగుడి ఉన్నాయి. 

ఈ ప్రాంతం యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అయిన ఈ ఆలయం చరిత్ర ప్రియులను మరియు ఆధ్యాత్మిక అన్వేషకులను ఆకర్షిస్తూనే ఉంది.


💠 ఈ ఆలయం వివిధ రాతి గొలుసులకు కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం.

400 వందల సంవత్సరాల చరిత్రగల దేవాలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా రమణీయంగా ఉంటుంది.

గర్భాలయంలో కొలువైన దేవత మూర్తులు చూడా చక్కగా ఉంటాయి.

స్తంభాల పైన చెక్కబడిన శిల్పాలు చాలా చక్కగా ఉంటాయి.


💠 మండపం దీర్ఘచతురస్రాకారంలో రామాయణ చిత్రాలతో ఉంటుంది.  మహాభారతం & శివపురాణాలు వర్ణించబడ్డాయి, వాటిలో కొన్ని నల్లరాళ్లతో చెక్కబడ్డాయి.


💠 ఆలయ సముదాయంలో ప్రత్యేక మంటపంలో ఉన్న శివుని వాహనం అయిన పెద్ద నంది (ఎద్దు) కూడా ఉంది.  

ఈ నంది ఒకే రాతితో చెక్కబడింది మరియు ఇది కర్ణాటకలో అతిపెద్దది.


💠 గౌరీశ్వర దేవాలయానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు మరియు వివరణలు ఉన్నాయి.  విజయనగర సామ్రాజ్యం అందించిన రాజకీయ స్థిరత్వం ద్వారా ఆలయ నిర్మాణం ప్రభావితమైందని, కళ మరియు వాస్తుశిల్పం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించిందని కొందరు నమ్ముతారు.


💠 పెద్ద నంది శిల్పం ఉండటం వల్ల ఈ ఆలయం నందిని ఆరాధించే ప్రముఖ కేంద్రంగా ఉండవచ్చని కొందరు భావించారు.  

ఆలయ పోషకుడు చిక్క తిమ్మరసకు చెందిన శైవ మతంలో నంది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే వాస్తవం ఈ సిద్ధాంతానికి మద్దతు ఇస్తుంది.


💠 ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఇది చాలా విలక్షణమైనది. మహోన్నతమైన ప్రవేశ గోపుర (దక్షిణ భారత దేవాలయాలలో సాధారణం) లేనప్పటికీ, ఇది "బలే మంటప" (కంకణ ద్వారం) అని పిలువబడే ఒక మహాద్వారం లేదా ద్వారం కలిగి ఉంది, ఇది అంధకాసురుని పౌరాణిక కథలను వర్ణించే గోడలు మరియు స్తంభాలపై అద్భుతంగా రాతితో చెక్కబడిన ఇతివృత్తాలను కలిగి ఉంది.

(అంధకాసుర రాక్షసుడిని వధించడం), నరసింహ (సగం మనిషి - సగం సింహము)

దక్షిణామూర్తి మరియు శరబ , భైరవ , కళింగమర్ధన కృష్ణ , వాలి మరియు సుగ్రీవుల యొక్క వివిధ రూపాలలో . 

ఏకశిలా రాతి గొలుసులు (రాతి చెక్కిన వలయాలు - ఒక్కొక్కటి 20 సెం.మీ.) నాలుగు మూలలు మరియు ప్రవేశ ద్వారం వైపు అలంకరించబడి ఉంటాయి, ఇది ఆలయ ప్రవేశ ద్వారంకి బాలే (బంగల్) మంటపం అని పేరు పెట్టింది.


💠 పట్టణంలోని మరో ముఖ్యమైన దేవాలయం వరాహస్వామి దేవాలయం . వరాహము విష్ణువు యొక్క మూడవ అవతారం . 

ఇది అరుదైన దేవాలయం.

 ప్రతి సంవత్సరం హోలీ రోజున, రంగుల పండుగలో ఆలయం చుట్టూ వరాహ దేవుని ఊరేగింపు ఉంటుంది. 


💠 ఆలయంలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నైరుతి మూలలో ఉన్న గణేశ విగ్రహం, పట్టణంలో ఎక్కువగా ఆరాధించబడే దేవుడని నమ్ముతారు. 

ఇది చాలా చిన్న విగ్రహం మరియు ఇది వినాయకుడి ఆకారంలో పెరుగుతోందని ఆధారాలు ఉన్నాయి.


💠 ప్రముఖ కన్నడ కవి శ్రీ షడక్షర యలందూరుకు చెందినవారు. పట్టణంలోని ఆలయం గ్రానైట్ రాతితో చెక్కబడిన అలంకరించబడిన గొలుసులకు ప్రసిద్ధి చెందింది.


💠 గర్భగుడిలో  శివుని సార్వత్రిక చిహ్నం అయిన లింగం ఉంది . మూసివున్న హాలులో వివిధ హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి; విష్ణువు , షణ్ముఖ, పార్వతి , మహిషాసురమర్దిని , భైరవ , దుర్గ, వీరభద్ర (శివుని మరొక రూపం) మరియు గణపతి కలవు. 


💠 ఈ ఆలయానికి కర్ణాటకలోని ప్రధాన నగరాల నుండి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు.  ఆలయ చరిత్ర మరియు వాస్తుశిల్పాన్ని బాగా అర్థం చేసుకోవడానికి స్థానిక గైడ్‌ని నియమించుకోవడం మంచిది.


💠 బెంగుళూరు నుండి 155 కి.మీ దూరంలో యలందూర్ ఉంది. బెంగుళూరు, మైసూర్ మరియు ఇతర ప్రాంతాల నుండి బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.

Panchang


 

ఎండా కాలం

 *


*శీర్షిక: ఎండా కాలం 2024*


ఆడాళ్ళూ,

బస్సు ప్రయాణం ఉచితమని 

అనవసరంగా తిరగకండి

వడదెబ్బ కూడా ఉచితమే...


ఎండా కాలంలో

చల్లగా బ్రతకాలంటే

చల్ల త్రాగాడం ఒక్కటే మార్గం.


ఎండలో 

శీతల పానీయ సేవనం

ప్రాణ గండంతో సమానం.

చిన్న కథ

 ద్వాపరయుగపు చివరి రోజులు, కలియుగపు ప్రారంభపు రోజుల్లోని ఒక చిన్న కథను *వివేకానందులవారు* వారి శిష్యులకు చెప్పేవారు -


మత్స్యదేశపు రాజుల్లో ధర్మానికి ప్రతిరూపంగా కొనియాడబడిన ధర్మసేన మహారాజు తాను సుభిక్షంగా పరిపాలిస్తున్నానని, తానెంత ధర్మనిరతుడో తన ప్రజలు కూడా అంతే ధర్మాన్ని పాటిస్తారని, తన మాట జవదాటరని పొంగిపోతూ పరిపాలన చేయసాగాడు. 


ఇది గమనించిన వరుణదేవుడు ఈ రాజుకు ప్రజల ధర్మబుద్ధిని, రాజభక్తిని తెలియచేయాలని ఒక మహర్షి వేషం ధరించి భూమి మీదకు, ఆ రాజ్యానికి వచ్చి వరిణ్యేన మహర్షుల వారు వస్తున్నారని తన శిష్యులతో రాజుగారికి కబురు పంపించాడు.

 

ధర్మసేన మహారాజు ఆ మహర్షి పేరు ఇంతకు ముందెన్నడూ వినకపోయినా, ఋషిపుంగవులు అనేసరికి సంతోషంతో ఎదురెళ్ళి తన అంతపురానికి సాదరముగా ఆహ్వానించి సకల మర్యాదలూ చేసి కుశలమడిగాడు.


మహర్షి కూడా రాజు యొక్క పరిపాలన, రాజు యొక్క, ప్రజల యోగక్షేమాల గురించి పలు ప్రశ్నలడిగాడు. అంత మహారాజు - తన పరిపాలన సర్వోన్నతంగా ఉన్నదనియూ, ప్రజలు కూడా ధర్మాచరణను, రాజుగా తన మాటను జవదాటరని జవాబిచ్చాడు.


రాజు మాటలకు నవ్వి, ఆ మహర్షి నీ ప్రజల నిబద్దత నీకు తెలియచేస్తాను, నేనూ పరీక్షిస్తాను అని చెప్పి రాజ్యంలో ఈ విధంగా చాటింపు వేయించమన్నాడు - "ప్రజల యోగక్షేమాలు, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రేపు ఉదయం దేవునికి అభిషేకములు, హోమములు చేయబోతున్నాము. దానికి కొన్ని వేల శేర్లు పాలు అవసరమవుతాయి కాబట్టి రాజ్యంలో ప్రతీ కూడలిలో పెద్ద పెద్ద గిన్నెలు ఉంచుతాము, మీ స్థోమతను బట్టి ప్రతీ ఇంటి నుండీ కనీసం ఒక్క శేరు పాల చొప్పున ఈనాటి రాత్రి మొదటి జాము దాటాక తీసుకొచ్చి ఆ కూడలిలో ఉంచిన పెద్ద గిన్నెలో పోయాలి" ఇది చాటింపు సారము. 


రాజు మహర్షితో - "స్వామీ! నా రాజ్యంలో ప్రజలు పాడిపంటలతో తులతూగే మహా ఐశ్వర్యవంతులు. అందునా రాజుగా నా మాట జవదాటరు. అందువలన రేపటి ఉదయానికి అన్ని కూడళ్ళ కడవలూ చక్కటి, చిక్కటి పాలతో పొంగిపొర్లుతూ ఉంటాయి." అన్నాడు. దానికి సమాధానంగా మహర్షి నవ్వి ఊరుకున్నాడు.


తెల్లవారుతూనే సభ తీరిన మహారాజు, మహర్షి కూడా సభకు వేంచేసి రాగా తన మనుషులను రాజ్యామంతా పంపి కూడళ్ళలో ఉంచిన పెద్ద గిన్నెలను సభకు తీసుకురమ్మన్నాడు. వారు ఒక మూహూర్త కాలంలో కొన్ని గిన్నెలను సభకు తీసుకొచ్చి రాజు ముందు ఉంచి, మిగిలిన అన్ని గిన్నెలలోనూ ఇదే పరిస్థితి అని చెప్పారు. ఏ గిన్నెలోనూ ఒకటి, రెండు గ్లాసుల నీరు మించి లేదు. అది చూసిన రాజు నిట్టనిలువునా కుప్పకూలిపోయాడు. ఆ గాబులను చూసి ఎంతో హతాశయుడయ్యాడు.


జరిగింది చెప్పడం మాత్రమే కాదు, మనసులను కూడా చదవగలిగే ఆ మహర్షి రాజుతో రాత్రి ఏమిజరిగిందో, ప్రజల మనోభావలను ఇట్లు చెప్పడం ప్రారంభించాడు.


"రాజా! నీ రాజ్యంలో ప్రజలు రాత్రి ముఖ్యంగా ఇలా రెండు రకాలుగా ఆలోచన చేసారు - 

1) మనం ఒక్కరిమే మొదటి జాము వరకు మెలకువగా ఉండి కూడలి వద్దకు వెళ్ళి గాబులో పాలు పొయ్యకపోయనంత మాత్రాన రాజుగారు చేసే రేపటి పూజలు ఆగిపోవు. ఇంకా ఎంతో మంది ఉన్నారు, వేరేవాళ్ళు పాలు పట్టుకునివెళ్ళి పోస్తారు - అని హాయిగా నిద్రపోయారు.  

2) అందరూ పాలు పోస్తారు, మనం నీళ్ళు పోసినా ఆ పాలలో కలిసిపోతాయి. మనం నీళ్ళు పోసినట్టు ఎవ్వరూ గుర్తించలేరు. మనకు పాలు మిగులు - అని కొందరు నీళ్ళు పోసివచ్చారు."


రాజుకు సత్యం తెలిసివచ్చింది.

 

సుపరిపాలన అందుకున్న ఆనాటి ప్రజలు ఆవిధంగా ఆలోచించారు. మరి పాలన బాగోలేదని బాధపపడ్తున్న మనం కూడా ఆ రాజ్యంలో ప్రజల వలెనే ఆలోచిస్తున్నామా? 


1) మనం ఒక్కరిమే మొదటి జాము వరకు మెలకువగా ఉండి కూడలి వద్దకు వెళ్ళి గాబులో పాలు పొయ్యకపోయనంత మాత్రాన రాజుగారు చేసే రేపటి పూజలు ఆగిపోవు. ఇంకా ఎంతో మంది ఉన్నారు, వేరేవాళ్ళు పాలు పట్టుకునివెళ్ళి పోస్తారు. - 


మనం ఒక్కరం ఓటు వెయ్యకపోతే ఎలక్షన్స్ ఆగిపోతాయా? ఇంత ఎండల్లో అంతంత దూరాలు వెళ్ళి ఓటు వెయ్యకపోతే గెలిచేవాడు గెలవకపోతాడా? ఎవ్వరొస్తే మనకు ఒరిగేదేముంది?

ఒక్కటి గుర్తు పెట్టుకోండి - *ఒకేఒక్క నిజాయితీపరుడు ఓటుహక్కును వినియోగించుకోకపోయినా కూడా అవినీతిపరుడు, దుర్మార్గుడు రేపు ఎలక్షన్స్ లో గెలిచి నాయకుడై మనమీద ఐదు సంవత్సరాలు పెత్తనం చెలాయిస్తాడు.. నిలువు దోపిడీ చేస్తాడు. జరుగుతున్నదదే..*


నిజమైన మంచి నాయకుడు గెలవడం గొప్పకాదు. గెలుపులో మనమంతా భారీ మెజార్టీ చేకూర్చిపెడితే నైతిక మద్దతు అందించినట్టు. ప్రతీఒక్కరి ఓటూ విలువైనదే.    


2) అందరూ పాలు పోస్తారు, మనం నీళ్ళు పోసినా ఆ పాలలో కలిసిపోతాయి. మనం నీళ్ళు పోసినట్టు ఎవ్వరూ గుర్తించలేరు. మనకు పాలు మిగులు. -


*మనకి ముట్టేది ముట్టింది, మనకు మిగిలేది మిగిలింది అనుకుంటే - చివరికి నట్టేట మునిగేది మనమే.* ప్రలోభాలు, తాయిలాలు తాత్కాలిక ఆనందాన్నిస్తాయి. అవి శాశ్వతంగా నిలిచిపోవు. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించకండి. మార్పు రావాలి. పోటీకి నిల్చున్న నాయకులలో దార్శినికతను చూడండి. వారి దార్శినికతలో మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్, పరిరక్షింపబడే సమాజ శ్రేయస్సు, సనాతనవిజయం కనబడాలి.


మన దేశం, మన రాష్ట్రం, మనం సంథి సమయంలో ఉన్నాము ప్రస్తుతం. అందువలన ఆలోచించి ఓటు వెయ్యండి. ఓటు వెయ్యడం మానకండి. అందరిచేత ఓటువెయ్యిచండి. సమాజానికి ఒక మంచి నాయకుడ్నివ్వండి.


నలుగురికీ ఈ సందేశాన్ని దయచేసి మీవంతుగా పంపండి.

voting

 పవిత్రమైన రోజు *voting* 

ఎవ్వరితో వద్దు ఆ రోజు *meeting* 

మీకోసం అభ్యర్థులు *waiting*

జాగ్రత్త మీ *timing*

ఎవరికో ముందే చేసుకోండి *thinking* 

అసెంబ్లీ  మరియు పార్లమెంట్ *linking*

ఒక్క ఓటు కూడా కాకూడదు *missing* 

మీరు వెళ్ళక పోతే తారుమారు అవుతుంది *leading* 

మారిపోతుంది *ranking* 

TV లలో గందరగోళ *breaking* 

బూత్ లో ఉదయం 7నుంచి 10లోపల అవండి *standing* 

ఓటు వేయడం భారతీయునికి ఒక *thrilling* 

ఎవరి రాజకీయ భవిష్యత్ అవుతుందో *killing*

ఎవరికి వెయ్యాలిఅనేది మీ *willing*

ఓటు వేయాలి అని రావాలి ఓటరుకు *feeling* 

వెళుతుంటే ముఖములో భలే *smiling* 

వెళ్ళక పోతే పవిత్రమైన ఓటు కు మనమే వేసినట్టు *hanging* 

మన చట్టాలను మనమే చేసినట్టు *ragging* 

ఎవరు అవుతారో తెలపాలి చట్ట సభలలో *landing* 

మనదేశ భవిష్యత్తును అక్కడ చేస్తారు *reading* 

May13 చెప్పండి మిత్రమా మంచి *greeting*

ఎన్నికైన వారిని చూసి ఓడిన వారు పడవద్దు *greeding* 

కొట్లాటలకు కట్టవద్దు *grouping* 

మంచి వారిని చేసుకోండి *making* 

చట్ట సభలలో బాగుండాలి వల్ల *taking*

భలే ఉండాలి అక్కడ subject పై *talking*

బూతులు తో చేయవద్దు మన ప్రతిష్టను *laughing* 

ప్రజలు సంతోషం తో ఉండాలి *living*

ఇంతటి తో ఈ రాతలకు *leaving* 

ఆపేస్తున్న ఇక నా *writing*

నచ్చితే ఇవ్వండి మీ *,,Blessing*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*06-05-2024 / సోమవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది.  సంఘంలో  ప్రముఖులతో  పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల  నుండి  శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మిధునం


కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

---------------------------------------

కర్కాటకం


ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి  ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

సింహం


వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అనుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.

---------------------------------------

తుల


వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో చేయడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

---------------------------------------

ధనస్సు


గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.  ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.

---------------------------------------

మకరం


నూతన గృహ వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

---------------------------------------

కుంభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

మీనం


ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

అనువాద చాతుర్యం!!

 శు భోదయం🙏


అనువాద చాతుర్యం!!


                     


        అనువాదంకూడా ఒక కళే! మూలంలో ఉన్నదానికి సొగసులద్దుతూ మనభాషకు నుడికారానికి ప్రాణపోస్తూ 

  అను వాదం చేయటం మాటలుకాదు. దానికెంతో నేర్పుండాలి. మనసాహిత్యం అనువాదంతోనే ప్రారంభం.ఆదికవి నన్నయభట్టారకుడు. జయేతిహాసానికి  తెలుగులో భావానువాదాన్ని నిర్వహించాడు. ఆమార్గమే ఆగామికవులందరకు మర్గదర్శకంగాఃమారింది. భావానువాద పధ్ధతిలోనే తెలుగున అనేక కావ్య నాటకాదులు అనువదింపబడి సాహిత్యానికి పుష్టినికలిగించాయి. 


                            ఆధునిక యుగంలో  పుంఖానుపుంఖంగా సంస్కృత నాటకానువాదాలు వెలుగును చూశాయి . ఆమార్గంలో వెలువడినదే " ఉత్తర రామచరితం" నాటకానువాదం.బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు దీనియనువాదాన్నెలా నిర్వహించారో స్థాలీపులాకంగా పరశీలనచేద్దాం. 

       

                      సంస్కృతంలో దీవిని భవభూతి వ్రాశాడని వేరే చెప్పేపనిలేదు. ఆపేరువినగానే ఆయనేగుర్తుకు రాకమానడు.


ఇకఅనువాదకర్త బ్ర:శ్రీ:మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారిగురించి రెండుమాటలు.వీరు మహాపండితులు.కందుకూరి సమకాలికులు. తూ:గో: ధవళేశ్వరము(కాటన్ బేరేజీ) వీరినివాసం.అనేక కావ్యాలు వ్రాసిన ఉద్దండ పండితులు.


                        ఉత్తర రామచరితం  ప్రథమాంకంలో చిత్రపట ప్రదర్శనమనే ఘట్టంఉంది. అందులో ఒకశ్లోకాన్ని పరిశీలిద్దాం. 

   సందర్భం:రావణ వధానంతరం రాముడు పట్టాభిషక్తుడై అయోధ్యనేలుచుండ,సీత గర్భవతియౌతుంది. ఆమెకు వినోదార్ధమై చిత్రపట సందర్శవమేర్పాటయినది. చూచుటకు సీతాలక్ష్మణ సమేతుడై రాముడేగినాడు. సీతా వివాహానంతరము రామాదులు అయోధ్యలో హాయిగా కాలమును గడుపుచున్న దృశ్యములు కనబడినవి.వానిని చూడగనే రాముడు స్పందించి లక్ష్మణునితో నిట్లనినాడు." లక్ష్మణా! 


      శ్లో: జీవత్సు తాతపాదేషు, నూతనే దారసంగ్రహే / 

           మాతృభిః చిత్యమానాయాః, తేహి నో దివసాః గతాః//


                    భావం: నాన్నగారుజీవించి యుండగా, కొత్తగా పెండ్లియాడినవారమై,తల్లులుసౌకర్యములను 

జూచుచుండ,(సుఖముగానున్నాము.) ఆరోజులు వెళ్ళిపోయాయిగదా! - అని; 


                            దీనికి శాస్త్రి గారి యనువాదం చూడండి!! 


           ఉ: నాయన గారు పాలన మొనర్చుచు హాయిగ నుండ, యింట లే 

               బ్రాయపు కొత్తభార్య లలరారుచు నుండగ ,మువ్వురమ్మ లెం 

               తేయనురక్తి  బ్రోవ , సుఖియించితి మన్నివిధాల , నాసుధా 

               ప్రాయములైన రోజు లిక రావికరావిక రావు,తమ్ముడా!!! 


                 నాల్గవ పాదమంతా అనువాద కర్త ప్రతిభే! మూలంలో లేదు.కానీ యికరావికరావు అంటూ ఆమ్రేడితంగా చెప్పటం యెంతబాగుంది? యీపద్యమీద యెన్నోతర్జనృభర్జనలు. మూలానికి మెఱుగు పెట్టినందుకు శాస్త్రిగారిని కొందరు దూషిస్తే,మరికొందరు భూషించారు. అయితే మల్లాది వారి యనువాదం బాగుంది అనికందుకూరి మెచ్చటం కొసమెరుపు!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హాస్యం పరమౌషధం

 హాస్యం పరమౌషధం:


హాస్యం అనేది ఇష్టపడని వారుండరు. అందుకే అప్పటిలో రాజాస్థానాలలో కూడా విదూషకులు ఉండేవారు. మన రాయలవారి ఆస్థానములో విదూషకుల సంగతి తెలియదు గానీ మన తెనాలి రామలింగ కవి గూర్చి ఇప్పటికీ ఆబాలగోపాలం కథలు కథలుగా చెప్పుకుంటారు.సీరియస్ గా దు:ఖమయమై సాగే కథలో కూడా కాస్త హాస్యం ఉండాలని అంటారు మన వాళ్లు.నవ్వు నవ్వించు నవ్వలేని వారికి నీ నవ్వులు పంచు అన్నారో సినీకవి భాగస్తులు 1974 సినిమా కోసం. ఇంక నవ్వడం ఓ భోగం , నవ్వక పోవడం ఓ రోగమే అని అనేశారు మన హాస్య రచయితా దర్శక చక్రవర్తి జంధ్యాల గారు. 


ఇంక మన ముళ్లపూడి వారి గూర్చి చెప్పేదేముంది .. సునిశిత పదాలతో కిసుక్కున నవ్వించడం లో అందె వేసిన  చేయి.. చతురోక్తులు విసరడములో వారిదో విభిన్న శైలి.ఎన్నో ఉన్నతమైన చిత్రాలలో ఆయన పండించిన హాస్యం అద్భుతంగా పండింది. సీరియస్ గా సాగే అన్నా చెల్లెళ్ల బంధాలతో తీసిన రక్త సంబంధములో రేలంగి లవ్ కామెడీ ట్రాక్ , నిరాహార దీక్షలు పెట్టించి హాస్యం కురిపించడం ముళ్ళపూడి వారికే చెల్లింది. సీరియస్ గా సాగే సన్నివేశాలలో కూడా కాస్త సమయస్పూరకంగా  హాస్యాన్ని ప్రవేశ పెట్టడం ముళ్లపుడి వారి  ప్రత్యేకత. అంతెందుకు మాయబజార్ చిత్రం అంతగా ఆడిందంటే , ఇప్పటికీ జనాలు చూస్తున్నారంటే అందులోని సంగీత దర్శకత్వ, నటనా ప్రతిభలే కాదు.. అందులోని సునిశిత హాస్యం కూడా.


అందరూ వ్రాయగలరు గానీ గిలిగింతలు పెట్టేట్టు చక్కని చమక్కులతో వ్రాయగలడం ఓ ప్రత్యేకత . అంతెందుకు విశ్వనాథ వారు తమ స్వర్ణకమలం చిత్రం కోసం ప్రత్యేకంగా హాస్య సన్నివేశాలు జంధ్యాల వారి చేత వ్రాయించుకున్నారంటే అర్థం అవుతుంది.  ఇంకా తోలుబొమ్మలాట లో కూడా బంగారక్క, జుట్టు పోలిగాడు , కేతిగాడు ఇలా ప్రత్యేక పాత్రలు ఉండేవి హాస్యం పండించేవి . కొంత హాస్యం మోటుగా ఉండేది , మరికొంత హాస్యం అందరు చక్కగా మళ్ళీ కుటుంబ సభ్యులతో చెప్పుకుని మరీ నవ్వుకోగలిగేవిగా ఉండేవి .


ఇంక అరవై నాలుగు  ఏళ్ళ క్రితం  వచ్చిన మన బుడుగ్గాడు లాంటి వాడే పంతొమ్మిది వందలాది యాభై తొమ్మిదిలో డెన్నిస్  ది మెనేస్  గా అనేక భాషల్లో వచ్చి కిత కితలు పెట్టింది .  అంతెందుకు నేను బుడుగు ని పదమూడు సార్లు కొన్నాను . పండ్రెండు సార్లు మాయామయ్యాడంటే వాడు అందరికీ ఎంత నచ్చునుండాలి . వాడు వెళితే వారింటిలో ఒకడై పోతాడు గానీ మళ్ళీ తిరిగి రాడు.ముళ్ళపూడి వారి చతురోక్తులు ఇప్పటికీ మన అందరినీ హాస్యం లో ముంచెత్తుతున్నాయి. ఓ  ఫైవ్ అంటూ అప్పడిగే ఋణానందలహరి  నాయకుడు అప్పారావు , చిచ్చుల పిడుగు బుడుగు ఇలాంటి వన్నీ మన ముళ్ళపూడి వారి మానస పుత్రులే.

ఆరోగ్యంగా ఉండండి…

 ఆమె వయస్సు 65 ఏళ్లు… 

మదనపల్లె నుంచి బెంగుళూర్ కు వెళ్లిపోతోంది… 

అక్కడ l ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు… 

అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి… 


ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… 

ఆమె చదువుకున్నదే… 

ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది.

వాళ్లందరూ అమెరికా పౌరులు.

అందరికీ ఇద్దరేసి పిల్లలు…

వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు

ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… 

కాన్పులు చేసింది…


వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… 

ఇక చాలు అనుకుంది… 

ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. 

అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… 

ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… 

అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోంకు వెళ్లిపోతోంది

వాటినే రిటైర్‌మెంట్ హోమ్స్ అనండి… 

అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట


ఆమె ఏమంటున్నదో చదువండి......


‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను…

నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను… వెళ్లకతప్పదు…

తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ… 

ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను…


నేనిప్పుడు ...

ఎవరికీ ఏమీ కాను…

ఎవరికీ అక్కరలేదు…


ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు…

అది రిటైర్‌మెంట్ హోం… బాగానే ఉంది…

ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం…

మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు…

టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు…

ఏసీ కూడా ఉంది…

కిటికీ తెరిస్తే బయటి గాలి…

ఫుడ్డు కూడా బాగుంది…

సర్వీస్ బాగుంది…

కానీ ఇవేమీ చవుక కాదు…

ప్రియమైనవే…నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది…


సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే…

అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు…

నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది…

సో, ఆ చీకూచింత ఏమీ లేదు…

‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’ అన్నాడు నా వారసుడు…


వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను…

ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..?

కాదుగా…


బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు…

అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు…

సేకరణ అంటే నాకిష్టం…

లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నయ్…

చాయ్ కప్పులున్నయ్…

అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు…అల్మారాల నిండా అవే…

డజన్లకొద్దీ విదేశీ మద్యం సీసాలున్నయ్…

బోలెడంత వంట సామగ్రి ఉంది…

అరుదైన మసాలాలు…

ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి?

నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు…

నా జ్ఞాపకాల్ని అది మోయలేదు…

అది భద్రపరచదు కూడాఏముంది ఆ గదిలో…?

మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్…

అన్నీ అవసరాలే…

కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు…


నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను…

అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది…

అన్నీ నేను వాడుకున్నాను, అంతే…

అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే…నావి ఎలా అవుతాయి..?

నా తరువాత ఎవరివో…

రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు…

కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో…

నిజానికి ప్రపంచ సంపద కదా…


మనతోపాటు వచ్చేదేముంది..?

వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా…

అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను…

కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..?

నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..?

వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా…

బుక్స్ అమ్మేస్తారు

నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు…

ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు…

బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు…

వాళ్లకేం పని..?


మరి నేనేం ఉంచుకోవాలి..?

నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను

అత్యవసర వంట సామగ్రి కొంత…

తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు…

ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు…

చాలు…

అన్నీ వదిలేశాను…

బంధం తెంచేసుకున్నాను…

నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను…

డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను…

ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను…


ఎవరో చెప్పినట్టు… ఏముంది.?

ఓ దశ దాటాక… 

కావల్సింది ఒక మంచం…

ఓ గది ...అత్యవసరాలు…

మిగిలినవన్నీ గురుతులు మాత్రమే…

ఇప్పుడు అర్థమవుతుంది మనకు…

మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు…

మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు…

వదిలేయాలి…

వదిలించుకోవడమే…


కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్…

లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే

నిజంగా అంతే…

అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి…

ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి…

అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి…

మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించ లేనివి వదిలేయక తప్పదు…

అందుకే బంధం పెంచుకోవడమే వృథా…

సో....


ఆరోగ్యంగా ఉండండి…

ఆనందంగా ఉండండి…

ఏదీ మనది కాదు…

ఎవరూ మనవాళ్లు కారు…

మనిషి ఒంటరి…

మహా ఒంటరి…

వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!!


నీతి : ఎవరికి ఏం అర్ధమయితే అది...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

సోమవారం, మే 6, 2024

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

*సోమవారం, మే 6, 2024*

       *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

       *చైత్ర మాసం - బహళ పక్షం*   

తిథి      : *త్రయోదశి* మ1.14 వరకు

వారం   : *సోమవారం* (ఇందువాసరే )

నక్షత్రం  : *రేవతి* సా4.41 వరకు

యోగం : *ప్రీతి* రా11.54 వరకు

కరణం  : *వణిజ* మ1.14 వరకు

           తదుపరి *భద్ర* రా12.06 వరకు

వర్జ్యం   :  *ఉ.శే.వ.6.58 వరకు*

దుర్ముహూర్తము :  *మ12.21 - 1.12* &

                  మరల *మ2.54 - 3.44*

అమృతకాలం    :  *మ2.26 - 3.56* 

రాహుకాలం       : *ఉ7.30 - 9.00*

యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *మేషం* || చంద్రరాశి: *మీనం*

సూర్యోదయం: *5.36* || సూర్యాస్తమయం:* *6.17*


🌹 *ఓం నమః శివాయ* 🌹


    👉 *మాస శివరాత్రి*

*సర్వేజనా సుఖినో భవంతు* 

        *శుభమమస్తు* 🙏

----------------------------------------

 *_గోమాతను పూజించండి_* 

        *_గోమాతను సంరక్షించండి_*


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

రాత్రింబవళ్ళు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *తే పుత్రా యే పితుర్భక్తాః స పితా యస్తు పోషకః* ||

      *తన్మిత్రం యస్య విశ్వాసః సా భార్యాయత్రనిర్వృతిః* ||


తా𝕝𝕝 తండ్రియందు భక్తి కలవారే పుత్రులు....బిడ్డల పాలన పోషణ చేయువాడే తండ్రి, విశ్వాసపాత్రుడైన వాడే మిత్రుడు....ఏ స్త్రీ వలన భర్తకు సుఖము ప్రాప్తించునో అట్టి స్త్రీయే భార్య.


     👇 //------- ( *భజగోవిందం* )------// 👇


శ్లో𝕝𝕝  

*దినయామిన్యౌ సాయం ప్రాతః*

*శిశిరవసంతవ్ పునరాయాతః* 

*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః*

*తదపి న ముంచత్యాశాపాశః* ॥12॥


భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ *మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు*.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*06-05-2024 / సోమవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మిధునం


కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

---------------------------------------

కర్కాటకం


ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

సింహం


వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి.

---------------------------------------

కన్య


ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అనుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.

---------------------------------------

తుల


వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో చేయడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

---------------------------------------

ధనస్సు


గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.

---------------------------------------

మకరం


నూతన గృహ వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

---------------------------------------

కుంభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

మీనం


ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

నేను

 కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 

సాగే ప్రస్థానం పేరే *నేను*


ఈ *నేను* ప్రాణశక్తి అయిన 

"ఊపిరి"కి మారుపేరు. ఊపిరి ఉన్నంతదాకా *నేను*’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది. జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో 

ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

ఈ *నేను* లోంచే *నాది* అనే భావన పుడుతుంది! 

ఈ *నాది* లోంచి  

నావాళ్ళు, 

నాభార్య, 

నాపిల్లలు, 

నాకుటుంబం, 

నాఆస్తి, 

నాప్రతిభ, 

నాప్రజ్ఞ, 

నాగొప్ప... 

అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ *నేను* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, 

నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


*అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *నేను* *నేనే సర్వాంతర్యామిని* 

అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.


పంతాలతో, పట్టింపులతో, 

పగలతో, ప్రతీకారాలతో 

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.


బాల్య,కౌమార,యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన *నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.


*నేనే* శాసన కర్తను, 

*నేనే* ఈ భూమండలానికి అధిపతిని, *నేనే* జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. 

రోజు మారుతుంది.


ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే 

*నేను* గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.


చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే. 

అది శాశ్వతం కానే కాదు. *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం. తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.


స్వర్గనరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమ్ స్వర్గం. ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.


నిజాయతీగా, నిస్వార్థంగా, 

సద్వర్తనతో, సచ్ఛీలతతో 

భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి

అంటే *అన్నీ నేనే* అనే స్థితి నుంచి *త్వమేవాహమ్‌* అంటే, *నువ్వేనేను* అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్యస్థితిని చేరుకోగలిగితేనే *మానవజన్మకు సార్థకత.*

కళ్ళజోడు

కళ్ళజోడు 

కళ్ళజోడు అంటే తెలియనివారు వుండరు. దృష్టి దోషం ఉన్నవారు కళ్ళజోడు పెట్టుకోక తప్పదు. కానీ ఈ ఆధునిక కాలంలో చాలామంది రంగు రంగుల కళ్లజోళ్లు, సన్ గ్లాస్, అని ఫోటో గ్రే అని ఇలా అనేక రకాల కళ్ళ జోళ్ళు వాడటం కూడా పరిపాటి. స్థూలంగా చెప్పాలంటే సాదారణంగా కళ్ళు సరిగా కనపడని వారు అంటే చేత్వారం వచ్చిన వాళ్ళు లేక దూర దృష్టి సరిగా లేనివారు ముఖ్యంగా (చిన్న పిల్లలు ఈ కోవకు చెబుతారు.) కళ్ళ జోడులు వాడతారు. నిజానికి కళ్ళ జోడు లేకపోయినా మనిషికి  కనపడుతుంది కానీ స్పష్టంగా కనపడదు. సాధారణ మనుషులకు 6/6 దృష్టి (sight ) వుండాలని వైద్యులు అంటారు. 5/5 దృష్టి (sight ) ఉంటే వారి చూపు పరిపూర్ణంగా ఉన్నట్లు లెక్క. దృష్టిలో వున్న దోషాలకు తగిన కళ్ళ జోడు ఇచ్చి వైద్యులు దృష్టిని 6/6 వచ్చేటట్లు సవరిస్తారు. అట్లా చేయటం వలన సాధారణంగా చూడగలరు.  నిజానికి కళ్ళజోడు ద్రుష్టి దోషాన్ని సవరిస్తుంది కానీ అంధులకు దృష్టిని ఇవ్వదు. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్లజోడుతో ఒక మనిషి తన దృష్టిని పెంచుకుంటాడు కానీ చూడలేనివాడు వైద్యుడు ఇచ్చే కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన చూడలేడు.  ఇది బౌతికంగా ప్రతి మనిషికి తెలిసిన విషయం.  ఇక అసలు విషయానికి వస్తే ఒక సాధకుడు మోక్షాన్ని పొందటానికి ఒక గురువు వస్తాడు అని అతని వలన తనకు మోక్షం సిద్ధిస్తుందని మనలో చాలామంది సాధకులు ఒక అభిప్రాయాన్ని కలిగి వుంటారు.  కానీ అది ఎంతమాత్రమూ నిజాము కాదు. ఒక సాధకునిని ఒక గురువు ఎట్టి పరిస్థితిలోను మోక్షాన్ని ప్రసాదించలేడు.  గురువు సాధకునికి కొంతవరకు మాత్రమే మోక్షమార్గానికి దోశదపడతాడు.  అందునికి కళ్ళజోడు పెట్టుకున్నా ఏరకంగా కనపడదో అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో లేనివారికి గురువు చేసే ఉపదేశాలు చెవిటి ముందు ఊదిన శంఖం లాగ  ఏరకంగాను దోహదపడవు. కాబట్టి ముందుగా ప్రతి సాధకుడు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ముందుగా తనకు తానుగా తానూ ఎంతవరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగాను అని పరిశీలనచేసుకోవాలి, తరువాత తనకు తన మార్గంలో అవరోధంగా వున్నవి ఏమిటి అన్నవి గుర్తించాలి. కొందరికి అరిషడ్వార్గం మొత్తంగా లేక ఏదోఒకటి లేక ఒకటికన్నా ఎక్కువ అవరోధంగా ఉండవచ్చు. ఉదాహరణకు ఒక సాధకుడు కామ క్రోధాదులను జయించిన కూడా జిహ్వ చాపల్యానిని  త్యజించక పోవచ్చు.  నాకు ఫలానా వంటలే కావలి ఫలానా తినుబండారాలే కావలి అని అనుకున్నాడనుకోండి. తానూ కోరిన తినుబండారం దొరికితే సరే లేకపోతె మనస్సు తాను కోరుకున్న వస్తువు (వంటకం) మీదకు పరిపరి విధాలుగా వెళ్లి దానిని సాదించటానికి ప్రయత్నం చేస్తుంది. మనకు తెలుసు సాధకుని మనస్సు స్వాధీనంలో లేకపోతె సాధన కుదరదు. మనందరకు తెలిసిన సాధారణ ఆధ్యాత్మిక నియమం " మనః ఏవ కారణః మనుష్యాణాం బంధః ఏవ మోక్షహ" కాబట్టి తాను కోరుకున్న వంటకం మీదకు మనస్సు మళ్లినప్పుడు సాధకుడు సాధనలో ముందుకు సాగలేడు . నేను చాలా చిన్న ఉదాహారణ ఇచ్చాను. సాధకుడిని  కామ క్రోధ, మొహా, మద మాత్సర్యాలు పరిగెట్టే గుర్రాలుగా వచ్చి దాడి చేస్తాయి. సాధకుడు కొంత మేరకు సాధనలో ముందుకు సాగితే తనకు తెలియకుండానే కొన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఉదాహరణకు సంకల్ప సిద్ది. అంటే సాధకుడు తాను తన మనస్సులో ఏది అనుకుంటే అది సిద్దించటం అనుమాట. అలాగే సాధకునికి వాక్సుద్ధి  కలుగుతుంది. ప్రారంభంలో ఇలాటివి సంక్రమిస్తాయి. వాటికి తాను  ఉప్పొంగిపోయి తాను ఏదో సాదించాననే భావన మదిలో కలిగిందా ఇక ఇంతే కొండమీద నుండి జారీ క్రిందపడ్డ వాడి గతే మరల తాను సాధనలో ముందుకు వెళ్ళటానికి చాలా సమయం పట్టవచ్చు లేక చాలా జన్మలు పట్టవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి 84 లక్షల జీవరాసులలో మనుష్య జన్మ ఒకటి. తాను ఈ దేహం వదలిన తరువాత తిరిగి మనుష్య జన్మ సిద్దిస్తుందనటానికి నమ్మకం లేదు. ఈ జీవన మరణ భ్రమణలో ఎప్పటికో తిరిగి తన పుణ్య ఫలం కొద్దీ తిరిగి మనుష్య జనమ లభించ వచ్చు. అది ఏంటో  దుర్లభామ్. కాబట్టి ఈ జన్మను సార్ధకత చేసుకోవటానికే సదా సాధకుడు కృషి చేస్తే మంచిది. . సాధకుడు సదా తన మనస్సును నిర్మలంగా నిర్వికల్పంగా ఉంచుకోవాలి. నిరంతరం ద్రుష్టి భగవంతుని మీదనే లగ్నాత చేయాలి. తన చుట్టూ ప్రక్కల అనేక విషయాలు తనని మాయలో పడేసేవి ఉంటాయి. అవి సుందరమైన స్త్రీలే కావచ్చు, ధన కనక వస్తు వాహనాదివి అయినా  కావచ్చు. వేటికికూడా సాధకుని మనస్సు చెలించనీయకుండా చూసుకోవాలి. అప్పుడే సాధకుని సాధన ముందుకు వెళుతుంది. 

సాధకుడు ఎంతో శ్రమదమాలకు ఓర్చి నిరంతర కృషిచేస్తేనో సాధన చతుష్టయాన్ని సాధించగలరు. నిరంతర సాధనతో ముముక్షత్వన్ని సాధిస్తే అప్పుడు గురువు తనకు మార్గదర్శనం చేస్తాడు. ఇక్కడ అసలు ప్రశ్న ఉదయిస్తుంది. ముముక్షత్వస్థితిని  చేరిన సాధకునికి ఇంకా గురువు ఆవశ్యకత ఏముంది అని అనుకుంటాము. ఎప్పుడైతే సాధకుడు నిరంతరం సాధన చేస్తూ భగవంతునివైపు పయనం అవుతుంటాడో అప్పుడు అనుకోకుండా ఎన్నో అడ్డంకులు వస్తూవుంటాయి. కొన్ని అవరోధాలు ఎలా ఉంటాయి అంటే తాను సరైన మార్గంలో లేడు అని అనిపించేవిధంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో తాను   సాధనలో విఫలమైనాను అని తలచేవిధంగా కూడా భావనలు మదిలో మెలగవచ్చు. అట్టి తరి ఒక సద్గురువు తారసపడి తనను సరైన మార్గంలో పెట్టి తన జన్మకు సార్ధకతను కలుగ చేస్తాడు. ఏరకంగా అయితే వివేకానందస్వామికి రామకృష్ణ పరమహంస దొరికారో అలాగ.  

ఇక్కడ ప్రతి సాధకుడు తెలుసుకోవలసింది ఏమిటంటే ముందుగా సాధకుని ద్రుష్టి సంపూర్ణంగా భగవంతుని మీద మాత్రమే కేంద్రీకరించబడి ఉండాలి తరువాత తాను సరిగా చూడ లేకపోతే కళ్ళ డాక్టారు ద్రుష్టి దోషాన్ని సవరించి కళ్ళజోడు ఇచ్చి దృష్టిని మెరుగు పరుస్తాడో అదే విధంగా సద్గురువు సాధకుని దృష్టిని పూర్తిగా భగవంతుని వైపే మళ్ళేటట్లు తన బోధనల వలన చేస్తాడు.  భగవంతుని దర్శించుకునే పని మాత్రం సాధకునిదే.  సాధకుడు నిరంతర సాధన చేస్తే మాత్రమే భగవత్సాక్షాత్కారం కాదు. అది మరవ వలదు.  కాబట్టి సాధక మిత్రమా నిన్ను ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కాలయాపన చేయక ఈ క్షణమే మోక్షార్థివి కమ్ము సాధన మొదలుపెట్టు.  ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి కృషి చేయి. నిరంతర సాధన తప్పకుండ మోక్షాన్ని సిద్ధిస్తుంది. అందులో అనుమానమే లేదు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

    .