20, ఏప్రిల్ 2023, గురువారం

పంజరంలో పక్షిలా

 శ్లోకం:☝️

*అకల్పః స్వంగచేష్టాయాం*

 *శకుంత ఇవ పంజరే ।*

*అనుచ్ఛ్వసన్ స్మరన్ పూర్వం*

 *గర్భే కిం నామ విందతే ॥*


భావం: భాగవతంలో కపిల మహర్షి జీవుని యెక్క ఏ దశలలో ఏ కష్టాలు పడతాడో వర్ణిస్తూ -  "మాతృగర్భంలో ఉన్నప్పుడు, జీవుడు ఊపిరి పీల్చుకోలేక, పూర్వానుభవాలను గుర్తుచేసుకుంటూ, పంజరంలో పక్షిలా కదలలేనప్పుడు ఏమి పొందుతాడు?" అని ప్రశ్నిస్తున్నాడు.🙏

మృత్యుసముద్రమును తరించి

 .          *శ్రీ శంకర ఉవాచ*

         *గురువు ~ శిష్యుడు*

    (నిన్నటి దానికి కొనసాగింపు)



5. సుజనులు, శాంతులు, ఉదారులు, వసంతమువలె లోకహితకారులు, భీకరమైన ఈ జన్మ మృత్యుసముద్రమును తరించి ఇతరులను కూడ తరించుటకు నిర్హేతుకముగ సాయము చేయువారు లోకమున గలరు.

వస్త్రం ఎలా ఉండాలి?*

 *మన వస్త్రం ఎలా ఉండాలి?*


మనం యజ్ఞ యాగాదుల్లో ధరించే వస్త్రాలు ఎలా ఉండాలి? వస్త్రానికి అంత ప్రాముఖ్యత ఉందా? అంటే ఉంది అనే చెప్పాయి శాస్త్రాలు..


*అగ్నేస్తూషాధానం వాయోర్వాతపానం పితృణాం నేవిరోషధీనామ్ ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీనతానో విశ్వేషాం దేవానామోతుర్న క్షత్రాణాం అతికాశాస్త్రద్వా ఏతత్సర్వ దేవత్యమ్ యద్వాసః॥*


యజమానికి 'వాససా దీక్షయతి' అను విధి ప్రకారం దీక్షా నియమాల్లో వస్త్రధారణ కూడా ఒక దీక్షా విశేషం.


ఆ వస్త్రం నేత కాలంలో ఒక్కో క్రియ ఒక్కో అభిమాన దేవతతో కూడి ఉంటుంది. వస్త్రం నేయడానికి ముందు నూలు చుట్టడానికి వాడే దారుమయ చిడప పేరు తూషం. అందులో నూలును చుట్టడం తూషావిధానం. దానిని వాయువుచే ఎండబెట్టడం వాతపానం. ఆ నూలును నిలబెట్టిన కర్రలకు ముడివెయ్యడం నీవి. ముడి వేసి ఉంచిన దారాలను శలాకంతో (చిక్కులు లేకుండా చేసే సాధనం) మర్దించడం ప్రహరణం. పొడుగ్గా ప్రసారం చేసిన దారం ఓతం. పడుగు పేకలో మధ్యనున్న చిల్లులే అతీకాశాలు. వస్త్రానికి అగ్ని, వాయువు, పితృదేవతలు, ఓషధిదేవతలు, విశ్వదేవతలు, ఆదిత్యదేవతలు, అభిమాన దేవతలని, ఓత ప్రోతాలకు మధ్యనున్న రంధ్రాలు నక్షత్ర దేవతాకమైనవి.




ఈ ప్రకారంగా సర్వదేవతాకమైన 'సదశమఖండం' ఇత్యాది శాస్త్రానుసారం అంచుతో కూడి, అఖండంగా ఉన్నా వస్త్రాన్ని తడిపి ఆరవేసిన దాన్ని, వేరొకరు తాకని దాన్ని ధరించి కర్మ ఆరంభానికి సంకల్పం చేయాలని శాస్త్రం.


కొందరు ఎరుపు, నీలి రంగు వస్త్రాలను ధరిస్తారు. మరి అలా ధరించవచ్చా అంటే ధరించకూడదు. 


*సదశమ ఖండం శ్వేతం ధౌతం చ వస్త్రం ధారయేద్రక్తం నీలం మలినం చ వర్జయేత్॥*


అంచుతో కూడిన, మధ్యగా చీల్చబడిన, తెల్లగా ఉన్నటువంటి, శుభ్రంగా ఉతకబడిన వస్త్రాన్ని ధరించాలి. రక్త, నీలాది వర్ణాలున్న వాటిని ధరించకూడదు. ఇక్కడ గ్రహించదగినది ఏమిటంటే మాలిన వస్త్రాన్ని, రక్తనీలాది వర్ణాలున్న వాటిని ధరించకూడదని శాస్త్రకారులు చెప్పడమే కాదు, రజకులు వాడే నీలి రంగుతో పరిశుద్ధం చేయకూడదని. ఎందుకంటే, "నాస్యపల్పూలనేన వాసః పల్పూలయేయుః" అని నీలిరంగుతో వస్త్రాన్ని శుద్ధం చేయకూడదు. శుద్ధం చేయడంలో కూడా రాతిమీద ఉప్పళించడం శిష్టాచారం కానీ, 'సర్వదేవత్యం వై వాసః" అను శ్రుతి వస్త్రాన్ని సర్వదేవతాకమైనదిగా చెప్పడంచే పాదాలతో మాత్రం ఉతక కూడదు.

మహాభారత

 *మహాభారత, ఉద్యోగ పర్వము*


అక్రోధేన జయేత్ క్రోధం

అసాధుం సాధునా జయేత్|

జయేత్ కదర్యం దానేన

జయేత్ సత్యేన చానృతమ్||


*కోపమును శాంతముతోనూ, దౌష్ఠ్యమును సద్వర్తన తోనూ, లోభమును దానము చేతను, అసత్యమును సత్యముతోను జయించవలెను*.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

గడ్డిని ఆరగించవు

 .

              _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*వనేsపి సింహాః మృగమాంస భక్షిణో*

*బుభుక్షితాః నైవ తృణం చరన్తి|*

*ఏవం కులీనాః వ్యసనాభిభూతాః*

*న నీచ కర్మాణి సమాచరన్తి* ||



తా𝕝𝕝 

"ఆకలిగొన్న సింహాలు మృగమాంసాన్నే భక్షిస్తాయి తప్ప గడ్డిని ఆరగించవు..... అలాగే సజ్జనులకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారు నీచకర్మలు ఆచరించరు."

ఆపిల్ జ్యూస్ -

 పండ్ల రసాలు వాటి ఉపయోగాలు - 1 .


 *  ఆపిల్ జ్యూస్  - 


       పిల్లల్లో వచ్చే అతిసార వ్యాధి విషయంలో ఈ పండు చాల ఉపయోగపడుతుంది. ఇందులోని పెక్ టిన్ విరోచనాలను అరికడుతుంది. ఇది ఉదరం , ప్రేగులకు డిస్ ఇన్ఫెక్ టెంట్ గా పనిచేస్తుంది . కామెర్లు , మూత్రపిండాలు , కాలేయ సంబంధ సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపయోగపడును. ఇది గౌట్ మరియు కీళ్లవాపులతో బాధపడేవారికి మంచి ఔషధముగా పనిచేయును .


                తాజా ఆపిల్ రసముతో పాటు తేనె కూడా కలిపి తీసుకోవడం ఆరోగ్యదాయకం . నరాల బలహీనత, మూత్రపిండాలలో రాళ్లు , ఆమ్లత్వము , అజీర్ణం, తలనొప్పి, పైత్యం , ఆస్తమా, రక్తవిరేచనాలు మొదలగువాటి నుండి విశ్రాంతి కలిగిస్తుంది. ఆపిల్ రసములో ఉండే కొంచం ఆమ్లం కూడా నోరు , పళ్ల మీద యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది . ఇది అన్నిరకాల దంతసమస్యలకు మంచిది .


 *  బీట్రూట్ జ్యూస్  -


          బీట్రూట్ జ్యూస్ క్యాన్సర్ మీద బాగుగా పనిచేయును . ఈ రసాన్ని తాగడం వలన శరీరానికి మంచి బలం వచ్చును. శరీరపు బరువు తక్కువుగా ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకోవడం వలన శరీరం బరువు పెంచుకోవచ్చు. ఈ బీట్రూట్ రసాన్ని క్యారెట్ , క్యాబేజి , మామిడి, బొప్పాయి , రసముతో కలిపి వాడవచ్చు .


 *  మారేడు పండు జ్యూస్  -


         మారేడు పండు జ్యూస్ జీర్ణసంబంధ సమస్యలు , దీర్ఘకాల విరేచనాలు వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధముగా పనిచేయును .


         ప్రేగుల్లో సమస్యలు ఉన్నవారికి , కలరా సమస్య ఉన్నవారికి ఈ పండు రసం చాలా గొప్పగా పనిచేయును . ఈ పండు రసం మంచి పోషకాలను కలిగి ఉండి రక్తాన్ని శుద్దిచేయును . 50 మిల్లీగ్రాముల మారేడు పండు రసాన్ని వేడినీరు , పంచదారతో కలిపి రోజుకు రెండు నుంచి మూడుసార్లు తీసుకొనుచున్న రక్తంలో మలినాలు నిర్మూలించబడతాయి. 


 ఈ పళ్ళ రసాలు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగడం మంచిది . 


          మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు .