20, ఏప్రిల్ 2023, గురువారం

ఆపిల్ జ్యూస్ -

 పండ్ల రసాలు వాటి ఉపయోగాలు - 1 .


 *  ఆపిల్ జ్యూస్  - 


       పిల్లల్లో వచ్చే అతిసార వ్యాధి విషయంలో ఈ పండు చాల ఉపయోగపడుతుంది. ఇందులోని పెక్ టిన్ విరోచనాలను అరికడుతుంది. ఇది ఉదరం , ప్రేగులకు డిస్ ఇన్ఫెక్ టెంట్ గా పనిచేస్తుంది . కామెర్లు , మూత్రపిండాలు , కాలేయ సంబంధ సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపయోగపడును. ఇది గౌట్ మరియు కీళ్లవాపులతో బాధపడేవారికి మంచి ఔషధముగా పనిచేయును .


                తాజా ఆపిల్ రసముతో పాటు తేనె కూడా కలిపి తీసుకోవడం ఆరోగ్యదాయకం . నరాల బలహీనత, మూత్రపిండాలలో రాళ్లు , ఆమ్లత్వము , అజీర్ణం, తలనొప్పి, పైత్యం , ఆస్తమా, రక్తవిరేచనాలు మొదలగువాటి నుండి విశ్రాంతి కలిగిస్తుంది. ఆపిల్ రసములో ఉండే కొంచం ఆమ్లం కూడా నోరు , పళ్ల మీద యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది . ఇది అన్నిరకాల దంతసమస్యలకు మంచిది .


 *  బీట్రూట్ జ్యూస్  -


          బీట్రూట్ జ్యూస్ క్యాన్సర్ మీద బాగుగా పనిచేయును . ఈ రసాన్ని తాగడం వలన శరీరానికి మంచి బలం వచ్చును. శరీరపు బరువు తక్కువుగా ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకోవడం వలన శరీరం బరువు పెంచుకోవచ్చు. ఈ బీట్రూట్ రసాన్ని క్యారెట్ , క్యాబేజి , మామిడి, బొప్పాయి , రసముతో కలిపి వాడవచ్చు .


 *  మారేడు పండు జ్యూస్  -


         మారేడు పండు జ్యూస్ జీర్ణసంబంధ సమస్యలు , దీర్ఘకాల విరేచనాలు వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధముగా పనిచేయును .


         ప్రేగుల్లో సమస్యలు ఉన్నవారికి , కలరా సమస్య ఉన్నవారికి ఈ పండు రసం చాలా గొప్పగా పనిచేయును . ఈ పండు రసం మంచి పోషకాలను కలిగి ఉండి రక్తాన్ని శుద్దిచేయును . 50 మిల్లీగ్రాముల మారేడు పండు రసాన్ని వేడినీరు , పంచదారతో కలిపి రోజుకు రెండు నుంచి మూడుసార్లు తీసుకొనుచున్న రక్తంలో మలినాలు నిర్మూలించబడతాయి. 


 ఈ పళ్ళ రసాలు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగడం మంచిది . 


          మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   

కామెంట్‌లు లేవు: