28, నవంబర్ 2020, శనివారం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము



సుత మాటలు వినినంతనె 

వ్రత విషయము గుర్తు కొచ్చె వర్తకు సతికిన్ 

పతి జేసిన తప్పిదముకు 

మతి యందున నొచ్చు కొనియు మఱి యిటు దలచెన్ 

                                                          101



"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

సల్పె దనునేను వెనువెంట సత్య ముగను "

యనుచు సంకల్ప మొందియు యను క్షణంబు 

వలయు సామాగ్రి సమకూర్చె వణిజు పత్ని    102



"గతమందున నా నాథుడు 

వ్రతమును తా జేతునంచు వరుసగ బలికీ 

మతిచెడి వ్రతమును మానెను 

గతినీవె సత్యదేవ ! కరుణించు మమున్     103


నా నాథుడు నా యల్లుడు 

నానా విధ బాధలందు నలుగుచు నుండన్ 

నే నీ పేదరికంబున 

నీ నామము దలచు చుంటి నిక్కము స్వామీ ! 104



ఎన్నో పర్యాయంబులు 

నిన్నును నీ వ్రతము మఱచి నిలచితి మకటా !

యెన్నక మాయీ తప్పులు 

సన్నుత రక్షించు మమ్ము సత్యస్వరూపా " 105


అనియు పరిపరి విధముల యార్తి తోడ 

"సత్యనారాయణస్వామి సద్వ్రతంబు" 

భక్తి యపరాధ భావంబు పరిఢ విల్ల 

సల్పె కూతురు తోడను సాధుపత్ని.        106



వ్రతమును సల్పియు దుహితతొ 

పతి తప్పులు కావుమనుచు ప్రార్ధించి మదిన్ 

సతతము తమ్మిక బ్రోవగ 

శతవందన మాచరించె సత్యప్రభుకున్       107



బంధు మిత్రుల తోడను  భక్తి తోడ 

సల్పగా నట్లు  వ్రతమును సాధుపత్ని 

సత్యనారాయణస్వామి స్వాన్త మందు  

యంత సంతుష్టు డయ్యెను సాంతముగను  108



వసుధ భక్తుల పాలిటి వరదుడైన 

సత్యనారాయణస్వామి సత్వరంబె 

చంద్రకేతుమహారాజు స్వప్న మందు 

భవ్య దర్శన మిచ్చియు పల్కె నిట్లు        109


"ఓయి రాజేంద్ర! నీ చఱ నుండినట్టి 

సాధు వాతని యల్లుడు సత్త్వగుణులు 

నిరపరాధులు వారలు నిక్కముగను 

వదలి పెట్టుము వారల వలదు శిక్ష        110


విడువుము వారల వెంటనె 

యిడుముల నున్నట్టి వారి కివ్వుము ధనముల్ 

యుడుపులు బెట్టియు వారికి 

కడు మన్నన జేసి పంపు కామిత పురికిన్    111


అట్లు సేయక నీవున్న యవనినాథ!

నీదు రాజ్యంబు పుత్రుల నిఖిల సిరుల 

లిప్త కాలంబు నందునే లీల గాను 

సర్వమును నాశ మొనరింతు సత్య మిదియె " 112


                                              సశేషము


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏


భృంగీశ్వ రిచ్చకు నంగీకరించియు

             తాండవా సక్తాన తనరునట్టి

గజముఖ దనుజుని గర్వంబు నణచియు

            దివ్యత్వమున్ ప్రసాదించి నట్టి

మోహినీ రూపంబు ముదమార పొందిన

           మాధవు నందున మగ్ను డైన

ఓంకార నాదాన నొనరంగ గూడియు

            శ్వేత దేహమునందు చెలువు యున్న

యసమశరుని దివ్య యారాధనంబున

             విభవంబు తోడను వెల్గునట్టి

యమరుల రక్షించ నాసక్తి గల్గియు

             భువనంబులను సదా బ్రోచు నట్టి

అరయ శ్రీశైలమందున స్థిరము యున్న

రాజితుండగు శ్రీ భ్రమరాధిపుండు

విమలమైనట్టి నా మనోకమలమందు

కరుణతోడను విహరించు గాక నెపుడు.      51***




కరుణామృతంబును గురిపించు చుండియు

           ఘన విపత్తుల నుండి గడుపు వాని

సద్విద్యలనియెడి సస్యంబులకు తగు

          నిర్వృత్తి ఫలముల నిచ్చు వాని

విద్వాంసు లమరులు విమలదీక్షను బూని

            సేవించు చుందురు శిష్టమతిని

భక్తాళి భవుచెంత పలు భంగిమల యందు 

            తన్మయ నాట్యమున్ సల్పుచుండు

చంద్ర శిఖరాన కదలెడి జటల తోడ

నీలి మేఘంబు చాట్పున నెగడు నిన్ను

చపల మగు నాదు మదియను చాతకమ్ము

చూడ నిరతంబు వాంఛించు చుండు స్వామి !  52 #         



     ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శ్రీ పాండురంగాష్టకం

 *శ్రీ పాండురంగాష్టకం*


మహాయోగపీఠే తటే భీమరథ్యా 

వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః

సమాగత్య తిష్ఠంత మానందకందం 

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


తటిద్వాససం నీలమేఘావభాసం 

రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌,

వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం 

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం 

నితంబః కరాభ్యాంధృతో యేన తస్మాత్‌

విధాతుర్వసత్యై ధృతో నాభికోశః, 

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే

శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్‌

శివం శాంతమీడ్యం వరం లోకపాలం

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


శరచ్చంద్రబింబాననం చారుహాసం 

లసత్కుండలాక్రాంత గండస్ధలాంగమ్‌

జపారాగబింబాధరం కంజనేత్రం 

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంత భాగం

సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః

త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం 

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


విభుం వేణునాదం చరంతం దురంతం, 

స్వయం లీలయాగోపవేషం దధానమ్‌

గవాం బృందకానందదం చారుహాసం 

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


అజం రుక్మిణీప్రాణసంజీవనం తం

పరం ధామ కైవల్యమేకం తురీయమ్‌

ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం 

పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌


                     -  ఆది శంకరాచార్యులు

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 28  / Sri Devi Mahatyam - Durga Saptasati - 28 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 2 🌻*


16. ఎద్దు పై ఉత్తమమైన త్రిశూలం ధరించి, పెద్ద సర్పాలను గాజులుగా కలిగి, చంద్రరేఖ విభూషణంగా దాల్చి మాహేశ్వరి వచ్చింది.


17. చేత బల్లెం దాల్చి, చక్కని నెమలిని ఎక్కి, కుమారస్వామి రూపంతో, అంబికా కౌమారి దైత్యులతో యుద్ధానికి వచ్చింది.


18. అలాగే విష్ణుశక్తి గరుడునిపై ఎక్కి, శంఖం, చక్రం, గద, శాస్రం (ధనుస్సు), ఖడ్గం, చేతులలో ధరించి వచ్చింది.


19. అసమానమైన యజ్ఞవరాహరూపాన్ని దాల్చిన హరి యొక్క శక్తి, వారాహి కూడా అచటికి వచ్చింది.


20. నారసింహి నర-సింహ రూపంతో, నక్షత్రమండలాలు డుల్లిపోవునట్లు జూలు విదుర్చుతూ అచటికి వచ్చింది.


21. అలాగే వేయి కన్నులు గల ఐంద్రి ఇంద్రుని వలే వజ్రాయుధాన్ని చేతబూని శ్రేష్ఠమైన ఏనుగుపై ఎక్కి వచ్చింది.


22. అంతట శివుడు, ఈ దేవశక్తులు తనను పరివేష్టించి ఉండగా (అచటికి వచ్చి) “నా ప్రీతి కొరకు అసురులు శీఘ్రంగా నీ చేత చంపబడుదురు గాక” అని చండికతో చెప్పాడు.


23. అంతట అత్యంత భయంకరి, మిక్కిలి ఉగ్రరూప అయిన చండికా శక్తి నూరు నక్కల వలే అరుస్తూ దేవి శరీరం నుండి వెలువడింది.


24. ఓటమి ఎరుగని (పార్వతీ) దేవి ధూమ (పొగ) వర్ణపు జడలు గల శివునితో ఇలా పలికింది : "ప్రభూ! శుంభ నిశుంభుల వద్దకు నీవు దూతగా వెళ్లు. 


25. "మిక్కిలి పొగరుబోతులైన ఆ శుంభ, నిశుంభాసురులతో, యుద్ధం చేయడానికి అక్కడ చేరిన ఇతర దానవులతో, ఇలాచెప్పు :


26. 'మూల్లోకాలును ఇంద్రునికిని, హవిర్భాగాలు దేవతలకు, లభించు గాక, బ్రతికివుండ గోరితే పాతాళానికి వెళ్ళిపోండి.


27. లేక బలగర్వంతో యుద్ధం చేయ గోరితే, రండి! నా నక్కలు మీ మాంసం తిని తృప్తినొందుగాక.” 


28. దౌత్యానికి శివుడే స్వయంగా నియోగించడం వల్ల ఆ దేవి అప్పటి నుండి “శివదూతి” అని లోకంలో ఖ్యాతి కెక్కింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహాపురాణం - 14 వ అధ్యాయం*

 _*శ్రీ శివ మహాపురాణం - 14 వ అధ్యాయం*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*మూడు యజ్ఞములు - ఏడు వారములు*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




*ఋషులు ఇట్లు పలికిరి -*


ఓ మహానుభావా! అగ్ని యజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మ యజ్ఞములను, గురుపూజను, బ్రహ్మ తృప్తిని గురించి మాకు క్రమముగా వివరింపుము.


*సూతుడిట్లు పలికెను*


అగ్ని యందు హోమద్రవ్యమును సమర్పించే కర్మకు అగ్ని యజ్ఞమని పేరు. ఓ ద్విజులారా! బ్రహ్మ చర్యము అనే మొదటి ఆశ్రమము నందు ఉండువారు అగ్ని యందు సమిధలను హోమము చేయవలెను . వ్రతములను పాలించవలెను. గృహస్థాశ్రమమును స్వీకరించి, ఔపాసన కర్మను చేయునంతవరకు విశేష యజ్ఞములను చేయవలెను . ఓ ద్విజులారా! ఆత్మ యందు ఆవాహన చేయబడిన అగ్నులు గల వాసప్రస్థులకు, యతులకు హితకరము, పవిత్రమునగు ఆహారమును మితముగా సకాలములో భుజించుటయే అగ్ని యజ్ఞము అగును . ఔపాసనాగ్నిని స్థాపించిన నాటి నుండి ఒక భాండములో గాని, గర్తములో గాని ఆరిపోకుండా సురక్షితముగా నుంచినచో, దానికి అజస్రము అని పేరు .


రాజ భయము వలన గాని, దైవము ప్రతికూలమగుట వలన గాని, అగ్నిని సంరక్షించలేని పరిస్థితిలోఆత్మ యందు, లేక అరణి యందు న్యాసము చేయబడిన అగ్నికి సమారోపితమని పేరు . ఓ ద్విజులారా! సాయంకాలమందు అగ్ని యందీయబడిన ఆహుతి సంపత్తును కలిగించును. ఉదయము ఈయబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని కలిగించును . పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడును. కావున, ఈ ఆహుతులకు అగ్ని యజ్ఞము అని పేరు వచ్చినది. స్థాలీపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతల నుద్దేశించి అగ్ని యందు హోమము చేయుదురు . అది దేవయజ్ఞ మనబడును. చూడా కరణాది సంస్కారములలో లౌకికాగ్ని యందు చేయబడే హోమము కూడ దేవయజ్ఞమనబడును.


బ్రాహ్మణుడు దేవతల తృప్తి కొరకు నిత్యము బ్రహ్మయజ్ఞమును చేయవలెను. వేదాధ్యయనమునకు బ్రహ్మయజ్ఞమని పేరు . ఉదయము నిత్యకర్మను ఆచరించి, తరువాత సాయంకాలము వరకు వేదమును పఠించవలెను. రాత్రి యందు వేదపఠనమునకు విధి లేదు. అగ్ని లేకుండగనే చేయు దేవయజ్ఞమును సాదరముగా వినిపించెదను శ్రద్ధగా వినుడు.


సర్వజ్ఞుడు, కరుణా సముద్రుడు, సర్వ సమర్థుడు నగు మహాదేవుడు సృష్ట్యాది యందు సర్వప్రాణుల క్షేమము కొరకై వారములను కల్పించెను . సంసారమనే రోగమునకు వైద్యుడు, సర్వజ్ఞుడు, సర్వ సమర్థుడు నగు శివుడు ఔషధములలో కెల్ల ఔషధమై ఆరోగ్యము నిచ్చు తన వారమును ముందుగా చేసెను . తరువాత సంపత్తుల నిచ్చే, తన మాయ యొక్క వారమును, ఆ తరువాత జన్మ సమయములో శిశువు యొక్క కష్టములను దాటుట కొరకై కుమారవారమును చేసెను . లోక కల్యాణమును చేయగోరి సర్వ సమర్థుడగు శివుడు, సోమరితనమును పోగొట్టే, రక్షకుడగు విష్ణువు యొక్క వారమును మానవుల పుష్టి కొరకు, రక్షణ కొరకు కల్పించెను . జగన్నాథుడగు శివుడు తరువాత, ముల్లోకములను సృష్టించి ప్రాణుల ఆయుష్షులను నిర్ణయించే  పరమేష్ఠియగు బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమగు వారమును మానవులకు ఆయుష్షు లభించుట కొరకై కల్పించెను .


సృష్ట్యాది యందు ముల్లోకముల అభివృద్ధి కొరకు పుణ్యపాపములు కల్పింపబడెను. తరువాత, వాటి పాలకులగు ఇంద్ర, యములకు వారములు కల్పింపబడెను . ఈ రెండు వారములు మానవులకు భోగముల నిచ్చి, మృత్యువును హరించును. మానవులకు సుఖదుఃఖములను సూచించునట్టియు, శివస్వరూపులైనట్టియు, వారములకు ప్రభువులైన ఆదిత్యాది దేవతలను శివుడు సృష్ట్యాది యందు గ్రహమండలము నందు ప్రతిష్ఠించెను. ఆయా దేవతల వారములలో వారిని పూజించుట వలన ఆయా ఫలములు కలుగును . ఆరోగ్యము, సంపదలు, వ్యాధి నాశము, పుష్ఠి, ఆయుర్దాయము, భోగము, అమృతత్వము అను ఫలములు క్రమముగా కలుగును.


ఆయా దేవతలు సంతసించినచో, క్రమముగా ఆయా వారఫలములు కలుగును. ఇతర దేవతలను పూజించిననూ, ఫలము నిచ్చువాడు శివుడు మాత్రమే . దేవతల ప్రీతి కొరకు ఐదు విధముల పూజ కల్పించబడినది. ఆయా మంత్రముల జపము, హోమము, దానము తపస్సు , మరియు సమారాధనము అనునవి ఐదు విధములు. సమారాధన మనగా వేదిని, ప్రతిమను, అగ్నిని, లేక బ్రాహ్మణుని షోడశోపచారములతో పూజించవలెను . ఈ నాలుగింటిలో ముందు దాని కంటె తరువాతది గొప్పది గనుక, పూర్వము లేకున్ననూ ఉత్తరమును పూజించవలెను.


నేత్రరోగము, శిరోరోగము, మరియు కుష్ఠురోగము తగ్గుట కొరకై  ఆదిత్యుని పూజించి, బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఈ విధముగా ఒక దినము, మాసము, సంవత్సరము, లేక మూడు సంవత్సరములు చేయవలెను . అపుడు రోగము నిచ్చిన ప్రారబ్ధము బలీయమైననూ, రోగము, వృద్ధాప్యము మొదలగునవి తొలగిపోవును. ఆయా వారములలో ఇష్టదేవత నుద్దేశించి జపాదులను చేసినచో, ఆయా ఫలములు లభించును . ఆదివారమునాడు ఆదిత్యుని, ఇతర దేవతలను, బ్రాహ్మణులను పూజించినచో, పాపములు తొలగి గొప్ప ఫలము లభించును .


వివేకి సోమవారము నాడు సంపద కొరకై లక్ష్మి మొదలగు దేవతలను ఆరాధించి, బ్రాహ్మణ దంపతులకు నేయి అన్నమును భోజనము పెట్టవలెను . మంగల వారము నాడు రోగములు తగ్గుట కొరకై కాళి మొదలగు దేవతలను పూజించి, మినుము, కంది, పెసర పప్పులతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను . బుధవారమునాడు పండితుడు పెరుగు అన్నమును నైవేద్యమిడి విష్ణువును ఆరాధించవలెను. అట్లు చేసినచో, కుమారులు, మిత్రులు, భార్య మొదలగు వారికి అన్ని కాలముల యందు ఆరోగ్యము కలుగును . ఆయుష్షును, ఆరోగ్యమును కోరే వివేకి గురువారమునాడు దేవతలను ఉపవీతముతో, వస్త్రములతో, పాలతో, నేయితో అర్చించవలెను . శుక్రవారమునాడు శ్రద్ధ గలవాడై దేవతలను పూజించినచో, భోగములు కలుగును. బ్రాహ్మణుల తృప్తి కొరకు షడ్రుచులతో కూడిన అన్నమును ఇచ్చుటయే గాక , స్త్రీల తృప్తి కొరకు శుభమగు వస్త్రములు మొదలగు వాటిని ఈయవలెను.


శనివారము నాడు రుద్రాది దేవతల నారాధించు వివేకి అపమృత్యువు నుండి తప్పించుకొనును . ఆనాడు తిలలతో హోమము చేసి, తిలలను దానమిచ్చి, తిలాన్నముతో పండితులకు భోజనము నిడినచో, ఆరోగ్యము మొదలగు ఫలములు లభించును . దేవతలను నిత్యము ఆరాధించవలెను. తీర్థములో స్నానమాడి, జప హోమ దానములను చేయవలెను. బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను . ఆది మొదలగు వారములలో తిథి నక్షత్రములు కలిసి వచ్చినప్పుడు ఆయా దేవతలను పూజించవలెను. సర్వజ్ఞుడు, జగత్ర్పభువు నగు శివుడు ఆయా దేవతల రూపములో భక్తులందరికీ ఆరోగ్యము మొదలగు ఫలముల నిచ్చును.


దేశము, కాలము, పాత్రల కనుగుణముగా , ద్రవ్యము, శ్రద్ధ, మరియు లోకములకు, తారతమ్యములకు అనురూపముగా మహాదేవుడు ఆరోగ్యము మొదలగు ఫలముల నిచ్చును . గృహస్థుడు తన గృహములో శుభకర్మలకు ఆదియందు, అశుభకర్మలకు అంతము నందు, జన్మ నక్షత్రము నాడు ఆరోగ్యాది సమృద్ధులు సిద్ధిం చుట కొరకు ఆదిత్యాది గ్రహములను పూజించవలెను . దేవతారాధనము కోరిన ఫలముల నన్నిటినీ ఇచ్చును. బ్రాహ్మణులు మంత్రయుక్తముగను, ఇతరులు తంత్రయుక్తముగను దేవయజ్ఞమును చేయవలెను . శుభ ఫలమును గోరు మానవులు ఏడు వారములలో తమ శక్తికి అనురూపముగా దేవపూజను చేయవలెను.


దరిద్రుడు తపస్సుతో దేవతల నారాధించవలెను. ధనికుడు ధనమును వినియోగించి, శ్రద్ధతో దేవపూజనము మొదలగు ధర్మముల ననుష్ఠించినచో పరలోకములో వివిధ భోగముల ననుభవించి, మరల భూలోకములో జన్మించును. నీడనిచ్చే చెట్లను పాతుట, చెరువులను తవ్వించుట, వేద పాఠశాలలను స్థాపించుట ఇత్యాది అనేక ధర్మ కార్యములను  ధనవంతుడు చేసినచో, అనేక భోగములను పొందును. అట్టి దాత కాలక్రమములో పుణ్య ప్రభావముచే జ్ఞానసిద్ధిని కూడ పొందును . ఓ ద్విజులారా! ఏ మానవుడైతే ఈ అధ్యాయమును వినునో, పఠించునో, వినుటకు సహకరించునో, అతడు దేవయజ్ఞ ఫలమును పొందును .



*శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యాందు పదునాలుగవ అధ్యాయము ముగిసినది.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

కార్తీక పురాణం -14 వ అధ్యాయము*_

 _*కార్తీక పురాణం -14 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*ఆబోతును అచ్చుబోసి వదలుట(వృషోత్సర్గము)*

*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*




☘☘☘☘☘☘☘☘☘



మరల వశిష్ఠులవారు , జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.


ఓ రాజా ! కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృషోత్సర్జనము చేయుట , శివలింగ సాలగ్రామములను దానముచేయుట , ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.


వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక , దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు , సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.



*కార్తీకమాసములో విసర్జింపవలసినవి*



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు , తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన , సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి , అమావాస్య , సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు , విధవ వండినది తినరాదు. ఏకాదశీ , ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున , వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ , గోదావరి , సరస్వతి , యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.


ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని , చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.


*గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |*

*నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||*

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం , హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.


*కార్తీకమాస శివపూజాకల్పము*


ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి

ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి

ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి

ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి

ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి

ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి

ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి

ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి

ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి

ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి

ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి

ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి

ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి

ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి

ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము , వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన , తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల , వారికీ , వారివంశీయులకు , పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క , కుక్క , పంది , పిల్లి , ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను , పురాణము చదివినను , విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.



*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.*





_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_





9849100044

సౌందర్య లహరి

 **సౌందర్య లహరి**


 శ్లోకము - 21


(శ్రీ శంకర భగవత్పాద విరచితము)


శ్రీలలితాంబికాయైనమః


తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వానరమయీం

నిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్,

మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా

మహాన్తః పశ్యన్తోదధతి పరమానన్ద లహరీమ్ !!

.

తల్లీ ! భగవతీ! మెరుపు తీగవలె సూక్ష్మమై సుదీర్ఘ మై సూర్య చంద్రాగ్ని రూపమై, క్షణప్రభమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో

కూర్చున్న నీ సౌదాఖ్య అనే బైందవీ కళను మహాత్ములు, పరిపక్వ చిత్తులు పరమానంద

లహరిగా ధరిస్తున్నారు. అంటే నిరతిశయానందాన్ని సదా పొందుతున్నారని భావం.


ఓం సత్యైనమః

ఓం సర్వమయ్యైనమః

ఓం సౌభాగ్యదాయైనమః

🙏🙏🙏


*ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/BX9q7cjvzxzLGb99dapVRi


*ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Hdv5PrMFoxX3I2TsoVErae

🙏🙏🙏

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


**శ్రీమన్నారాయణీయం**

 ప్రధమస్కంధం - 2-4-శ్లో.


తత్ తాదృజ్మధురాత్మకం, తవ వపుః సంప్రాప్య సంపన్మయీ

సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి।

తేనాస్యా బత కష్టమచ్యుత! విభో! త్వద్రూపమానోజ్ఞక-

ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్||


భావము: అచ్యుతా! విభూ! సిరి సంపదలకు నెలవైన లక్ష్మీదేవి నిన్ను చేరి, నీ వక్షస్థలమున స్థిరనివాసము ఏర్పరుచుకొనినది. మధురమైన నీ రూపమును విడిచి ఉండలేక భక్తులవద్ద చిరకాలము నిలవలేక పోవుచున్నది. నీ సౌందర్యానికి వశమై నిన్ను వదలలేని ఉత్సుకతతో నీ భక్తులవద్ద అస్థిరురాలు అగుట వలన లక్ష్మీదేవి చంచల అను అపవాదును సైతము పొందినది.

(telugubhagavatam.org)


వ్యాఖ్య : పోతనగారు, భట్టతిరిగారూ చెప్పినదాన్ని బట్టి నారాయణునిపై అనురాగం పెల్లుబిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువ సేపు నిలబడదు. స్వామిపై  ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చి పెట్టింది. అందువల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం సదా నారాయణుని మనసులో నిలుపుకోవాలి. 


ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉండడో, అప్పుడు లక్ష్మీదేవి కూడా మనలను విడిచి పెట్టి వెళుతుంది. కాబట్టి, సదా మనస్సులో నారాయణున్ని నిలుపుకోవాలి.


మరోవిషయం.  నిత్యం మనం ఇట్లో వెలిగించే దీపమే లక్ష్మీ రూపం. చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం, అదే సంపద, జ్ఞానము, సంపద బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. 


అలాగే లక్ష్మీదేవి అష్ట రూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. వీటిలో విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద. 


ఒకసారి లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా శ్రీ మహావిష్ణువు చెప్పింది ఏంటంటే  "అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను. మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే అచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ ఈ.విషయాలు చెప్తారు.


1. మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అలుగుతుందట. అంతే కాదు అప్పు తొందరగా తీరదట. 


2. బుదవారం రోజు అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదట. ఒకవేళ అదే పని పదేపదే చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుందట.


3. వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధన లక్ష్మీ నిలవదనే అలా చెబుతారు. కడితే లక్ష్మీ అలిగి వెలిపోతుందంట.


4. ఎంగిలి చేసినవి ఉంచ కూడదు. తామర పువ్వులు, జిల్వపత్రాలను ఎప్పుడు నలపరాదు.


5. నదులు, సరస్సులువంటి పవిత్ర జలాశయాల్లో సరస్సులలో, నదులలో మల మూత్ర విసర్జన చేయకూడదు. ఎక్కడపడితే అక్కడ అశుభ్రం చేస్తే లక్ష్మీదేవికి నచ్చదట.


6. ఇంటి గోడలు, తలుపులు, గడపలు లక్ష్మీస్వరూపాలు.  వీటిపై అవసరం లేనివి రాయకూడదు. అంటే బూతులు, చెడు వాఖ్యలు రాయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుందట.


7. పాదాన్ని పాదంతో రుద్ది కడగ కూడదు. చేతితోనే రుద్దుకొని కడగాలి.


8. అతిథిదేవో భవ అంటారు. అతిధి మర్యాదలలో లోపం చేయరాదు. పశువులను అనవసరం కొట్టకూడదు. దూషించకూడదు.


9. సాయం సంధ్యలో నిద్రించే వారింట లక్ష్మీ ఉండదు. సోమరితనంగా ఉండే ఇంట లక్ష్మీ కటాక్షించదు.


10. ఎవరింట్లో అయితే తరచూ గొడవులు జరుగుతూ మహిళలు ఏడుస్తుంటారో, ఆ ఇంటి లక్ష్మీ ఉండదు. (అలాగే వ్రృద్దులనుకూడా పట్టించుకోని ఇంట లక్ష్మీ దేవి ఉండక అలిగి వెలిపోతుందని గ్రహించాలి).


11. ఇంట్లో ఉదయం, సాయం సంధ్యవేళల్లో కనీసం అగరబత్తి , దూపంతోనైనా దేవతారాధన చేయాలి. అలా చేయకుండా ఉండే వారింట్లో మరియు తులసి చెట్టు పెట్టి, పట్టించుకోని ఇంట లక్ష్మీ అలిగి వెలిపోతుందట.


12. వ్యసనాలకు బానిసలు కారాదు. అలా చేస్తే లక్ష్మీ ఇంటి నుండి దూరం అవుతుంది.


13. రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరించేవారిదగ్గర లక్ష్మి నిలవదు.


14. ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లోనూ,జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీలు, నేలదిరిపోయేట్లు నడిచే స్త్రీలు ఉన్నప్రదేశాల్లో. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు. సోమరితనం, ప్రయత్నం లేకపోవటం ఇత్యాదులు లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి. స్వస్తి. 

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

https://chat.whatsapp.com/D9gWd7SgdmG2Rbh7b3VXl9


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/KCfWMHlFNsM1PTptFf2RwR

🙏🙏🙏

దోసె

 దోసె

పూరీ

వడ

సాంబారు😊


పదాలతో....


శివపార్వతుల కల్యాణం గురించిన పద్యం :🙏🏻


జడలో *దోసె*డు 

మల్లె పూలు తురిమెన్

సౌందర్యమొప్పారగన్


నడయాడెన్ ఘలుఘల్లనన్

హొయలు చిందం

జాజి *పూరీ*తి


పా*వడ* యట్టిట్టుల

చిందులాడి పడగా 

భవ్యాత్మ యైనట్టి 

యాపడతిన్ బార్వతి

బెండ్లియాడితివి 

*సాంబా రు*ద్ర సర్వేశ్వరా


జై తెలుగు🙏

Bharath mistake jai



 

శివునికి అభిషేకం

 *శివునికి అభిషేకం చేయిస్తే చాలు... అన్నీ శుభఫలితాలే*


🌺🐚🌺 *శివునికి అభిషేకం* 🌺🐚🌺


శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను సంతరించుకుంటుంది. ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి. 

 

మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే..  ఆరోగ్యం చేకూరుతుంది. పంచదారతో చేయిస్తే దుఃఖం తొలగిపోతుంది. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 


🌺🌸🌺 *శివాభిషేక  ఫలములు* 🌺🌸🌺


1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.


2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 


3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 


4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును.


5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. 


6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.


7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 


8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

 

9.  తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును.


10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 


11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

 

12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.


13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 


14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును.


15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 


16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.


17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా  బాగుంటుంది అన్న లింగార్చన).


18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.


19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.


20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.


21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 


22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని  కలిగించును.


23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.


24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

మనుషులున్నారు జాగ్రత్త...!

 ************""**************

భలే గమ్మత్తుగా వుంటారు ఈ జనం

పరిగెడుతుంటే పడదోస్తారు ,

చచ్చి పడుంటే భుజాలకెత్తుకుంటారు  .

ఏడిస్తే ఓదారుస్తారు ,

ఊరుకుంటే గిల్లిపోతారు.

నిలబడిపోతే నీరుగారిపోయానంటారు ,

నడవడం మొదలెడితే కాళ్ళడ్డుపెడతారు.

బాగుంటేనే అడుగుతారు "బాగున్నవా....!"  అని

అడగకపోతే బాగోదని ,

కాదు మరి ..నువ్వు బాగోవాలని, బాగుపడాలని ,

ఎక్కడ బాగుపడిపోయావో తెలుసుకోవాలని .

అదే బాగోకపోతే తొంగి కూడా చూడరెవ్వరు నీ వైపు  .

పొరలు పొరలుగా ప్లాస్టిక్ ముఖాలు తగిలించుకుని

రక రకాల నవ్వుల్ని నటిస్తుంటారు.

అలాంటి మనుషులు

మందలు మందలుగా మూల్గుతున్న

మహారణ్యంలో మసలుతున్నాం మనం.

ఇక్కడి చిత్రాలన్ని మహా విచిత్రాలు...

తెలివి మీరిపోయిన గొర్రెలు

బుర్ర తక్కువ సింహాలు

బల పరీక్షకు రంకెలేస్తున్న జింకలు

బింకమేదని బొంకుతున్న గజరాజులు

రకానికో తీరు...తీరుకో తర్కం.

వెలుగుల్ని వెలివేసిన చీకటి రాత్రులు

నీడల్ని నిలబడనీయని పరిగెత్తే పగళ్ళు

నిశ్చల చలనాన్ని

జఢ చైతన్యాన్ని

పోతపోసినట్టు తిరుగుతున్న

నిలువెత్తు శవాలు

నిజమండి ఇక్కడ ఏవరూ బ్రతికిలేరు

బ్రతికుండడాన్ని నటిస్తుంటారు

బ్రతికుల్ని భరిస్తుంటారు

ఇక్కడ ప్రతి మనిషిలో ఒక మయుడున్నాడు

తనని తాను అంతుపట్టని సౌధంగా నిర్మించుకుంటున్నాడు

ఎవరి అంచనాలకి అందని చిక్కు ముళ్ళని అల్లుకుంటున్నాడు

అయినా తాడి తన్నె వాడు ఒకడుంటే వాడి తల దన్నేవాడు ఒకడుంటాడు ....

ఎవడి లెక్కలు వాడివి.

ఇప్పుడంతా...

మనిషికి మనిషి అవసరం మాత్రమే

మరి "ప్రేమ" అంటారా?

ఆ పదార్దం తన అస్తిత్వాన్ని కొల్పోయి చాల కాలమయ్యింది.

దేహం లేని అనాధ ప్రేతంలా మన మధ్యే తిరుగుతూ

ఆదరించే మనసు కోసం ఆశగా ఎదురు చూస్తుంది

అయిన తన పేరు మాత్ర0 వాడుకలోనే వుందండోయి

ఎందుకంటే,

నిన్ను నేను వాడుకుంటున్నాను అనడం కన్నా

నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోడానికి బావుంటుంది కదా!

అన్నీ మారుతున్నై

రూపాలు మార్చుకుని, రూపాంతరాలు చెందుతున్నయి

మారలేక మార్పు ఒంటపట్టక

సత్తె కాలం మనిషిలా నేను మాత్రం ఇలా వుండిపోతున్నాను.

ఏదేమైనా ...

పది మంది.. పది రకాలు

నువ్వు 11వ రకం,

నేను 12వ రకం

ఎవడి బలం వాడిది.

అయితే

ఈ పరిణామ క్రమంలో మనిషి తరువాతి జాతి ఎలా వుంటుందో...?

అన్న ఊహకే వణుకొస్తుంది