🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🙏🌹ఈరోజు విషయం తల నీలాలు స్త్రీలు ఇవ్వవచ్చా ....!!🙏🌹
🌿. *స్త్రీలు తల నీలాలు సమర్పించవచ్చాలేదా*
🌸నేను కొందరు పెద్దల ద్వారా తెలుసుకున్న విషయం స్త్రీలు తల నీలాలు ఇవ్వవచ్చా- ఇవ్వకూడదా అన్నవిషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్న..🙏
🌿అసలు తల నీలాలు పూర్వం స్త్రీలు మరియు పురుషులు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు అంటే ఎవరు తల నీలాలు ఎక్కడ ఇవ్వలేదు
🌸పూర్వం పురుషులు కూడా వెంట్రుకలు పెంచుకొని తల పాగాలో చుట్టి ఉంచుకునే వాళ్ళ తల నీలాలు ఎక్కడ ఎవరు ఇవ్వలేదు
🌿తల నీలాలు ఇవ్వడం ఎక్కడ ప్రారంభం అయ్యింది అన్న విషయం చూస్తే..
🌸తండ్రి చనిపోతే పురుషులు తన తండ్రి కర్మ కార్యాల కోసం పురుషులు తల నీలాలు ఇవ్వడం మొదలు ఆయ్యింది...
🌿ఇంకా స్త్రీలు తల నీలాలు తీసారా అన్న విషయం చూస్తే..
🌸 *ఎక్కడ కూడా స్త్రీలు తల నీలాలు తీయకూడదు అని ఒక సాంప్రదాయం ఉంది..*
🌿అదికాక స్త్రీలు ఎప్పుడు కూడా తలలో కత్తెర అనేదే పెట్టకూడదు అది శాస్త్రం చెప్పిన మాట
🌸కానీ ఈ రోజుల్లో కొనలు.. కడా..జుట్టు సమానంగా అని జుట్టు కత్తిరిస్తున్నారు మనం చూస్తున్నాం..
🌿మరికొందరు బేబి కటింగ్ కోసం స్వామి మొక్కు అని చెప్పి భుజాలు వరకు కత్తిరించు కుంటున్నారు స్వామి మొక్కు 3 గుప్పెడులు యిస్తా అని మొక్కుకున్న అని చెప్పడం ఆది చాలా తప్పు..
🌸పూర్వం బాల్య వివాహాలు చేసే టైం లో భర్త చనిపోతే ఆ స్త్రీని శిరోజాలు తీయించి గుండు కొట్టి ఇంట్లో ఉంచేవాళ్ళు అది అప్పటి సాంప్రదాయం ఆ పద్దతులు కాలాను గుణంగా మాసిపోయాయి.. అది మంచికే అనుకోవాలి ఆ విషయం లో..
🌿ఇంకా అసలు విషయం లోకి వస్తే.. స్త్రీలు తల నీలాలు ఇవ్వవచ్చా... లేదా..
🌸మనకు నడుస్తున్న కాలం కలికాలం..
ఈ కలికాలంలో మనుషులను పాపాల నుండి కలి పురుషుడు బారినుండి రక్షించేందుకు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతారం దాల్చారు..
🌿దశావతారంలో లేని అవతారం శ్రీ వేంకటేశ్వర స్వామి అవతారం..
🌸మీకు స్వామి వైకుంఠం నుండి వచ్చిన విషయం మరియు స్వామి పుట్టలో ఉంటే ఆవు పుట్టలో పాలు వదులుతున్న అప్పుడు
జరిగిన విషయాలు తెలుసు..
🌿స్వామి తల దెబ్బ తగిలి వకుళ మాత దగ్గరకు వెళ్లిన విషయాలు మరియు స్వామి నీలాద్రి కొండకు వచ్చిన విషయాలు తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఈ విషయాలు చెప్పడం లేదు లేకుంటే అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా పెద్ద వ్యాసం అవుతుంది అందుకే జెస్ట్ హింట్స్ ఇచ్చాను..
🌸ఇంకా స్వామి నీలాద్రి కొండకు రాగానే అక్కడి వాతావరణం ,,చల్లటి గాలులకి ప్రశాంత వాతావరణానికి స్వామికి నిద్ర వచ్చి ఆలా పవలిస్తారు..
🌿అక్కడ వుండే నీలాద్రి యక్షుని స్వామిని గమనించి స్వామి తలకు తగిలిన గాయం కనిపిస్తుంది అక్కడ స్వామికి వెంట్రుకలు ఊడి ఉండడం గమనించిన నీలాద్రి
🌸తన వెంట్రుకలు కొన్ని పికిలించి స్వామికి ఆ గాయం వద్ద సమర్పిస్తుంది నీలాద్రి ఆ క్షణం లో రెండు రక్తపు చుక్కలు స్వామి మీద పడగానే స్వామి లేచి ఎవరమ్మ మీరు
🌿మీకు ఏమిటి తలకు అ గాయం ఏమైనది అని అడుగగా అప్పుడు నీలాద్రి స్వామి మీ తలకు గాయం ఉండి వెంట్రుకలు పోయి ఉన్నాయి నా స్వామికి లేని వెంట్రుకలు నాకు అవసరమా అని నా తల నీలాలు మీకు సమర్పించను స్వామి అని పలుకుతుంది...
🌸స్వామి అలా మీరు చేసిన పని మా అమ్మ అంగీకరించరు నాకు మీ శిరోజాలు వద్దు మీరే స్వీకరించండి అని స్వామి అంటారు..
🌿అప్పుడు నీలాద్రి అంటున్నది స్వామి నేను శిరోజాలు తీసుకుంటాను అవి ఇలాగా కాదు తమ భక్తులు మిమల్ని దర్శించి మీకు తల నీలాలు సమర్పిస్తారు అప్పుడు అవి మీ ద్వారా నాకు సంక్రమిస్తాయి అలా ప్రసాదించండి అని వేడుకుంటుంది నీలాద్రి..
🌸స్వామి సంతోషించి అటులనే ఈ కలియుగం పూర్తి అయ్యేవరకు నా భక్తులు నాకు సమర్పించే మొక్కులు వారి వెంట్రుకలు నీకు చెందుతాయి కలియుగం వరకు నా నుండి నీకు సంక్రమిస్తాయి అని స్వామి వరం ప్రసాదిస్తాడు నీలాద్రి కి...
అలా మొదలు అయ్యింది తల నీలాలు కార్యక్రమము మన అందరికి..
🌿అప్పటి నుండి పురుషులు ,పెద్దలు చిన్నలు అందరూ తల నీలాలు యిస్తున్నారు సంప్రదాయం మారింది అది అన్ని క్షేత్రాలకు పాకింది తల నీలాలు ఇవ్వడం..
🌸ఇంకా స్త్రీల విషయం చూసుకుంటే స్త్రీలు తల నీలాలు ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతోంది.. మరి తిరుపతిలో స్త్రీలు కత్తెర్లు యిస్తున్నారు గుండు కొట్టించుకుంటున్నారు గా అంటారు..
🌿శ్రీవారు చెప్పిన మాట.. నీలాద్రి కి ఇచ్చిన వరం కలియుగం పూర్తి అయ్యేవరకు నా భక్తులు నాకు సమర్పించే వెంట్రుకలు నా నుండి నీకు సంక్రమిస్తాయి అన్న మాట..
🌸నా భక్తులకు ఈ కలికాలంలో వాళ్ళ బాధలు ,పాపాలు. ,కర్మలు అన్ని వాళ్ళ వెంట్రుకలు పట్టుకొని ఉంటాయి అవి వాళ్ళు మొక్కులు ద్వారా నాకు సమర్పిస్తారు అలా కలికాలం వరకు ఈ మొక్కులు కొనసాగుతూనే ఉంటుంది సాంప్రదాయంగా అంటారు
🌿కాబట్టి స్త్రీలు తమ తల నీలాలు 3 కత్తెర్లు గా స్వామి వారికి నీలాద్రి కాంప్లెక్స్ వద్ద ఇవ్వండి పూర్తిగా శిరోజాలు కాదు..
🌸మహిళ భక్తులు వాళ్ళ బాధలు ,,పిల్లలు ,,అనా రోగ్యాలు, ఇంకా మీ కష్టాలు.. మరియు మీరు కోరిన కోర్కెలు తీరింది అని అలా మొక్కు కుంటే మొక్కులు
🌿స్వామి మా బాధలు తీరాలి అని మేము మొక్కు కున్న మొక్కు తల నీలాలు ఇస్తాము అని కోరిన కోర్కెలు తీరాయి అని కొందరు
🌸అలా స్త్రీలు స్వామికి మేము ఏది చేసినా పాప భారం మీరే మోయలి స్వామి అని తలుచుకొని స్వామికి తల నీలాలు సమర్పించ వచ్చు అందుకు ఏ భయము వద్దు
🌿ఏ శాస్త్రం తప్పు పెట్టడానికి లేదు అది ఒక తిరుమల లోనే ఈ పక్రియ స్వామి ఇచ్చిన వరం మనకు
🌸ఇంకా ఎక్కడైన స్త్రీలు తల నీలాలు ఏ క్షేత్రంలో కూడా సమర్పించ రాదు
🌿ఒక కలియుగ వేంకటేశ్వర స్వామికే అది కూడా తిరుపతి లోనే వెంకట చలం లో నీలాద్రి వద్ద
🌸స్త్రీలు మొక్కులు మొక్కు కుంటేనే మాత్రమే.. ఇవ్వాలి తల నీలాలు లేదా 3 కత్తెర్లు మాత్రమే ఇవ్వాలి
🌿ఇంకా ఎక్కడా ఏ క్షేత్రంలోను స్త్రీలు తల నీలాలు ఎక్కడ ఇవ్వకూడదు
🌸మళ్ళీ కత్తెర్లు ఇవోచ్చు అది ఏ క్షేత్రాలలో నైనా ఎక్కడైన స్త్రీలు ఇవ్వవచ్చు
తల నీలాలు తప్ప
🌸నేను తెలుసుకున్న విషయాలు పెద్దలు ద్వారా తెలుసుకొని సేకరించి చెప్పిన మాటలు నా సొంత మాటలు కావు దయచేసి గమనించ గలరు..🚩🌞🙏🌹🎻
🌿Note : మళ్ళీ ఈ విషయాన్ని రచ్చ చేయొద్దు మీకు నచ్చక పోతే మీకు తెలిసిన సాంప్రదాయం మీరు పాటించవచ్చు..🙏
🌹🙏ఓం నమో వెంకటేశాయ..🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿