5, ఏప్రిల్ 2026, ఆదివారం

సోమవారం*🕉️ *🌹06ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

 *🌹06ఏప్రిల్ 2026🌹*

  *దృగ్గణిత పంచాంగం*                  

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : చవితి* మ 02.10 వరకు ఉపరి *పంచమి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : అనూరాధ* రా 02.57 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : సిద్ధి* మ 03.25 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : బాలువ* మ 02.10 *కౌలువ* రా 03.21 ఉపరి *తైతుల* 

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ11.00-12.00సా04.00-04.30*               

అమృత కాలం  :*మ 03.19 - 05.07*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.35*

*వర్జ్యం    :శేషం ఉ 06.23 వరకు*

*దుర్ముహూర్తం  : మ 12.35 - 01.24 & 03.03 - 03.53*

*రాహు కాలం  :ఉ07.32 - 09.04*

గుళికకాళం      : *మ 01.43 - 03.16*

యమగండం    : *ఉ 10.37 - 12.10*

సూర్యరాశి : *మీనం*                  

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.07*  

సూర్యాస్తమయం :*సా 06.30*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.59 - 08.27*

సంగవ కాలం     :*08.27 - 10.56*

మధ్యాహ్న కాలం    :*10.56 - 01.24*

అపరాహ్న కాలం  :*మ 01.24- 03.53*

*ఆబ్ధికం తిధి        : శూన్య తిథి*

సాయంకాలం    :*సా 03.53 - 06.21*

ప్రదోష కాలం      :*సా 06.21 - 08.40*

రాత్రి కాలం         :*రా 08.40 - 11.46*

నిశీధి కాలం        :*రా 11.46 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26 - 05.12*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        🌷*ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*తస్మాన్మాం శరణాగతం* *కరుణయా త్వం రక్ష రక్షాధునా*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 5 ఏప్రిల్ 2026*


          *శ్రీ మహావిష్ణు పురాణం*

``               *48వ భాగం*``


*గజేంద్ర మోక్షము1*```


సూత మహర్షి శౌనకాది మునులకు శ్రీమహావిష్ణువు లీలలలో ఒకటైన గజేంద్ర మోక్షము కథ వినిపించ సాగాడు..


“శౌనకాది మునులారా! శ్రీహరి లీలలు అనంతం. అనేకం. తన భక్తులను రక్షించడానికి ఎప్పుడైనా ఎక్కడికైనా ఎలాగైనా వస్తాడు అని నిరూపించే కధ ఈ గజేంద్ర మోక్షము. తనను ఆరాధించేవారు దేవతలు,మానవులు, దానవులు,జంతువులు, పశుపక్షులు అనే బేధం చూపకుండా వేగమే వచ్చి రక్షిస్తాడు శ్రీమన్నారాయణుడు. ఇక గజేంద్ర మోక్షము కథ చదవండి.


పూర్వము ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ధర్మ పరిపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఇంద్రద్యుమ్నుడు శ్రీహరి భక్తుడు. నిత్యం అష్టాక్షరి మంత్రమైన ‘ఓం నమో నారాయణాయ’అని స్మరిస్తూ ఉండేవాడు. ప్రజలందరు సుఖశాంతులతో జీవించేవారు.


కుమారుడు పెరిగి పెద్దవ్వగానే వివాహం చేసి, పట్టాభిషేకం చేసి రాజ్యపాలన అప్పగించి ఇంద్రద్యుమ్నుడు భార్యతో కలసి అడవులకు వానప్రస్థానికి వెళ్లిపోయాడు. ఆశ్రమం నిర్మించుకుని మౌనదీక్ష స్వీకరించి శ్రీహరి నామం జపిస్తూ తపస్సు చేయసాగాడు.


ఒకరోజు అగస్త్య మహర్షి భార్యతో, శిష్యులతో పుణ్యతీర్థాలు దర్శిస్తూ ఇంద్రద్యుమ్నుడి ఆశ్రమం వైపు వచ్చాడు. తపోనిష్ఠలో మునిగిన ఇంద్రద్యుమ్నుడు అగస్త్య మహర్షి రాకను గమనించ లేదు. అగస్త్య మహర్షి పలకరించినా కళ్ళు తెరచి చూడలేదు, మాట్లాడలేదు.


అగస్త్య మహర్షి ఆగ్రహించి "ఇంద్రద్యుమ్నా! వానప్రస్థం స్వీకరించి వానప్రస్థాశ్రమ ధర్మం మరిచావు. అతిథి అభ్యాగతుల సేవ వానప్రస్థ ముఖ్య ధర్మం. ఇది మరిచి మదమెక్కిన గజము లాగా ప్రవర్తించిన నీవు ఏనుగువై జన్మిస్తావు!! ఏ శ్రీహరి నామం జపిస్తూ ధర్మం మరిచావో ఆ శ్రీహరి అనుగ్రహం కోసం తపించి పోతావు" అని  శపించాడు.


అగస్త్య శాపం తపస్సులో ఉన్న ఇంద్రద్యుమ్నుడి హృదయానికి బాణంలా గుచ్ఛుకుంది. చటుక్కున కళ్ళు తెరచి చూస్తే అగస్త్య మహర్షి దంపతులు కనిపించారు. మహర్షి పాదాల పై పడి కన్నీటితో కడుగుతూ తెలియక జరిగిన అపరాధాన్ని మన్నించమని ప్రాధేయపడ్డాడు. అగస్త్య మహర్షికి ఆగకుండా హరి నామ జపం చేస్తున్న ఇంద్రద్యుమ్నుడి హృదయ స్పందన తెలిసింది.


కరుణాసముద్రుడై ఇంద్రద్యుమ్నుడి హరిభక్తికి సంతసించి అతనిని లేపి "ఇంద్రద్యుమ్నా! శాపం ఇచ్చింది నేనైనా,నా చేత అలా ఇప్పించినవాడు ఆ నారాయణుడే! ఈ జన్మలో నీకు మోక్షం లభించే అవకాశం లేదు. నీవు ధర్మంగా రాజ్యం చేసినా, నీ ప్రజలలో కొందరు అధర్మ కార్యాలు చేశారు.

రాజువైనందున, ప్రజల పాపాల ఫలంలో కొంత భాగం నీవు అనుభవించాలి. వచ్చే జన్మలో గజరాజువై జన్మించి శ్రీహరి దర్శనం, అనుగ్రహం పొంది,మోక్షమొందుతావు అని ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించి వెళ్లి పోయాడు. 


ఇంద్రద్యుమ్నుడు శ్రీహరి నామ జపం చేస్తునే కొంతకాలానికి మరణించాడు.

   *** *** ***

అమృతసాగరంలో పదివేల యోజనాలు విస్తీర్ణం, ఎత్తుగల త్రికూట పర్వతము ఉంది. ఆ పర్వతానికి స్వర్ణ శిఖరం, రజత శిఖరం, లోహ శిఖరం అనే మూడు శిఖరాలు ఉన్నాయి. ఆ శిఖరాల నుండి అనేక జల ప్రవాహాలు కిందికి ప్రవహించి సరస్సులుగా మారాయి. ఆ సరస్సుల చుట్టూ దట్టమైన అరణ్యాలు ఏర్పడ్డాయి అరణ్యాలలో మృగాలు, జంతువులు అనేకం మందల మందలుగా జీవిస్తున్నాయి.


ఇంద్రద్యుమ్నుడు త్రికూట అరణ్యంలో ఏనుగుగా జన్మించాడు. పూర్వజన్మ పుణ్యఫలం వలన హరిభక్తి కలిగి హరినామ స్మరణ మనస్సులో చేసేవాడు. హరిభక్తుడైన ఆ గజరాజుని అనేక ఆడ ఏనుగులు వరించి భర్తను చేసుకున్నాయి. రోజూ తన ఆడ ఏనుగుల మందతో కలసి త్రికూట అర్యణాలలో విహరిస్తూ సరస్సులలో నీరు త్రాగుతూ జలక్రీడలు ఆడేవాడు.


అదే సమయంలో గంధర్వలోకం నుంచి గంధర్వ జంట (దంపతులు)  త్రికూట పర్వత వనాలకు విహారానికి వచ్చి ఒక నీటి సరస్సులో జల క్రీడలు ఆడసాగారు. నీటి సుగంధ పరిమళాలకి మైమరచి ఒకరి పై ఒకరు నీళ్ళు ఆకాశంలోకి ఎత్తి ఎత్తి మీద చల్లుకుంటూ ఆడుకోసాగారు. ఆ నీటి జల్లులు గాలికి వెళ్లి సరస్సు సమీపాన తపస్సు చేసుకుంటున్న ముని మీద పడి తపోభంగం చేసాయి. ముని కోపంతో కళ్ళు తెరచి జలక్రీడలు ఆడుతున్న గంధర్వ జంటను చూసి 

“గంధర్వా! పవిత్ర సరోవర జలాన్ని అహంకారంతో నీ భార్యతో కలసి జలక్రీడలు ఆడి చిందర వందర చేసి తపోభంగం చేసావు. నీవు, నీ భార్య ఇదే సరస్సులో మొసళ్ళుగా జన్మించండి. నీ అహం తొలగినప్పుడే మీకు శాప విముక్తి లభిస్తుంది" అని శపించి ఆ ప్రదేశము వదలి వెళ్లి పోయాడు. 


గంధర్వ దంపతులు మొసళ్ళుగా మారి ఆ సరస్సులో దొరికే జలచరాలు తింటూ జీవిస్తున్నారు.


అడవులలో స్వేచ్ఛగా తన ప్రియ సతులైన ఆడ ఏనుగులతో, ఏనుగు పిల్లలతో తిరుగుతున్న గజేంద్రుడు ఒకరోజు దారి తప్పి శాపగ్రస్తుడై మొసలిగా జీవిస్తున్న గంధర్వుడు ఉండే సరస్సు సమీపానికి వచ్చాడు. దారి కోసం తిరిగి తిరిగి అలసిన ఆ ఏనుగుల గుంపు సరస్సు కనపడగానే అక్కడ వృక్షాలకు గల పళ్ళు తిని దాహం తీర్చుకోవడానికి సరస్సులో దిగాయి. మధురమైన నీరు త్రాగగానే అలసట పోయి అమిత ఉత్సాహం ఇచ్చాయి.


జలక్రీడల పై మోజు కలిగి సరస్సు మధ్యన గజరాజు చుట్టూ ఆడఏనుగులు చేరి తొండాలతో నీళ్లు చిమ్ముతూ ఆడ సాగాయి. తరువాత ఒకరి మీద ఒకరు చల్లుకోసాగాయి. సరస్సు జలాలు ఏనుగు ఆటలతో అల్లకల్లోలమై సుడులు తిరుగుతూ కిందకు చేరి సరస్సు అడుగున విశ్రాంతి తీసుకుంటున్న మొసలిని చికాకు పరిచాయి.


ఆ మొసలి కోపంతో మహావేగంగా పైకి వచ్చి గజరాజు తొండాన్ని కరచి పట్టుకుంది. గజేంద్రుడు గట్టిగా ఘీంకరిస్తూ తొండాన్ని గట్టిగా విదిలించి మొసలిని దూరంగా నీటిలోకి విసిరివేసింది. మొసలిని చూసిన ఆడ ఏనుగులు భయపడి తమ పిల్లలతో పరిగెత్తి ఒడ్డుకి చేరాయి. దూరాన నీటిలో పడ్డ మొసలి ప్రతీకారంతో నీటిలో దూసుకువచ్చి గజేంద్రుని కాలు పట్టుకుని మరింత లోతుకి లాగసాగింది.


గజేంద్రుడు ఎంత బలంగా విదిలించుకున్నా మొసలి పట్టు విడువలేదు. తన దంతాలతో మరింత గట్టిగా పట్టుకుంది. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు ఆరంభమైంది.  భూమి పైన ఏనుగుని మించిన బలమైన జంతువు లేదు. నీటిలో  మొసలిని మించిన బలమైన జంతువు లేదు. ఈవిధంగా భూ, జలచరాలలో బలవంతులైన కరి మకరాల మధ్య ద్వంద్వ యుద్ధం ఆరంభమైంది.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏m

పంచాంగం



శివ,కేశవుల గురించి ఓ కవిత:

 శివ,కేశవుల గురించి ఓ కవిత:


కూర, దోసె,పచ్చడి, పెరుగు ఈ పదార్థాలు తో కవిత.


ఇది ఛందోబద్ధమైన ది కాదు.

********************"*

సిరులు చేకూర ఆ శివుని తలవరా!


మోక్ష‌సిరికై దోసెలొగ్గి మాధవుని పిలవరా!


పచ్చడౌను పాపాలు శివ శివ అన్నం తనే!


పుణ్యభాగ్యమెంతో పెరుగు

వాసుదేవ అని పిలువ!

                 ****

జయంతి లక్ష్మీ నరసింహం

జీవితంలో గొప్పగా

 శుభోదయం.💥Good Morning 

*జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమి సాధించావు అని అడిగితే గర్వంగా చెప్పగలగాలి. నేను నమ్మిన వాళ్లు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్లని నేను ఎప్పుడూ మోసం చేయలేదు అని.*

సమాజం దృష్టిలో గొప్పగా ఉన్నా, లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతక గలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు. ప్రేమ, ద్వేషం, సంపద, పేదరికం ఇవన్నీ దాచడం చాలా తేలిక కానీ వ్యక్తిత్వాన్ని దాచడం చాలా కష్టం.

*జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోకూడదు, అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోకూడదు.*

శుభ రవి వారం 🌞Happy Sunday

ఈ ప్రశ్నకు బదులేది 9

  ఈ ప్రశ్నకు బదులేది 9


ఈరోజు మన ప్రశ్న నానుడికి సంబంధించింది.


  వాడు తానా అంటే వీడు తందానా అంటాడు


అనే నానుడి ఏ సందర్భంలో వాడతాము


 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక:: మీ జవాబును కామెంట్ రూపంలో తెలియపరచగలరు

ఈ ప్రశ్నకు బదులేది 9

 ఈ ప్రశ్నకు బదులేది 9


ఈరోజు మన ప్రశ్న నానుడికి సంబంధించింది.


  వాడు తానా అంటే వీడు తందానా అంటాడు


అనే నానుడి ఏ సందర్భంలో వాడతాము


 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

గమనిక:: మీ జవాబును కామెంట్ రూపంలో తెలియపరచగలరు

ఈ ప్రశ్నకు బదులేది 2

 ఈ ప్రశ్నకు బదులేది 2


 మను చరిత్ర మూడవ అస్వాసము నుండి కింద ఒక పద్యం ఇవ్వబడింది దాన్ని పూర్తిగా చదవండి.


పద్యం కింద ప్రశ్న  ఇవ్వబడింది.


ఈరోజు మన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది.


చ. అపరిమితానురాగ సుమనోఽలస యై చిగురాకుఁ జేతులం

దపసిని గౌఁగిలించె వనితా? యిదె రంభ; దలంప రంభ దా

నపరిమితానురాగసుమనోఽలస యై చిగురాకుఁ జేతులం

దపసిని గౌఁగిలించు టుచితంబె కదా! యన నవ్వె రంభయు\న్‌.



ఈ  పద్యములో

 "చిగురాకు చేతులు"

 అని రెండు చోట్ల సంబోధించారు.

ఆ రెండిటి అర్థం ఒకటేనా? వేరువేరా? 


 వేర్వేరైతే వాటి అర్థమేమిటి.


 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక:: మీ జవాబును కామెంట్ రూపంలో తెలియపరచగలరు 

ఈ ప్రశ్నకు బదులేది 1

 ఈ ప్రశ్నకు బదులేది  1


అనే ఒక శీర్షికను ప్రారంభించదల్చాను. ఇందులో చిలిపి ప్రశ్నలు, 

చమత్కార ప్రశ్నలు, 

జ్ఞానవంతమైన ప్రశ్నలు, 

ఆలోచన ఆత్మకమైన ప్రశ్నలు, 

ఆలోచన రహితమైన ప్రశ్నలు, అడగదల్చాను.


వీటివల్ల సభ్యులకి కాలక్షేపము, మన సోలాసము 

ఇంకా జ్ఞాన సౌపార్జన కలగవచ్చని ఆశిస్తున్నాను.


దీనికి గ్రూపు సభ్యులు అనుకూలిస్తారని అభిలాషీస్తున్నాను 


ఈనాటి ప్రశ్న 


జాతక జ్యోతిష్య సంబంధమైనది.


అష్టగ్రహ కూటమి అంటే ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో చేరటం జరగవచ్చు.


కానీ ఎట్టి పరిస్థితులలోనూ నవగ్రహ కూటమి ఏర్పడదు.


అంటే 9 గ్రహాలు ఒకే రాసి లోకి రావడానికి వీలు లేదు ఎందుకో తెలుపగలరు.


మీ జవాబును కామెంట్ రూపంలో పేర్కొనగలరు

ఈ ప్రశ్నకు బదులేది 11

 ఈ ప్రశ్నకు బదులేది 11


ఈరోజు మన ప్రశ్న వైద్య శాస్త్రానికి సంబంధించింది.


  కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? 


 వాటిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? 



 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక ::మీ జవాబును కింద కామెంట్ రూపంలో తెలియపరచగలరు

 ఈ రోజు పంచాంగం 05.04.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస కృష్ణ పక్ష తృతీయ తిథి భాను వాసర విశాఖ నక్షత్రం వజ్ర యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: చతుర్థి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 73*


*మూర్తిమతి ముక్తిబీజే మూర్ధ్ని స్తబకితచకోరసామ్రాజ్యే।*

*మోదితకంపాకూలే ముహుర్ముహుర్మనసి ముముదిషాస్మాకమ్।*


*భావము :*


*ముక్తి నొసగే తల్లివి నీవు. శశాంకుడు నీ సిగలో పుష్పముగా ఉన్నాడు. కంపా నదీ తీరములో చరించుటయందు ఇష్టము గల మాతా! నన్ను నీలో చరించే భాగ్యమును ప్రసాదించుము.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



 ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ।

యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 38 ।।



ప్రతిపదార్థ:


ధూమేన — పొగ చేత; ఆవ్రియతే — కప్పబడునో; వహ్నిః — అగ్ని; యథా — ఏ విధంగా; ఆదర్శః — అద్దము; మలేన — దుమ్ము చేత; చ — మరియు; యథా — ఎలాగైతే; ఉల్బేన — గర్భాశయముచే; ఆవృతః — ఆవరింపబడునో; గర్భః — పిండము (భ్రూణము); తథా — అదే విధముగా; తేన — దానిచే (కోరిక); ఇదం — ఇది; ఆవృతమ్ — కప్పివేయబడును.

 


తాత్పర్యము : 


నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాయశముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కప్పివేయబడుతుంది.




  వివరణ:


ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్ధిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే అది బుద్ధి యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు - వెలుగు నిచ్చే అగ్ని, పొగచే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్త్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం – సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ముచే మాసి పోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది బుద్ధిపై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది. మరియు, భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచిఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికలు విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం విన్న, చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది.


ఈ విషయాన్ని వివరించటానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది:


ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాల నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం, అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక రెండు మైళ్ళు నడిచిన తరువాత, సూర్యాస్తమవటం ప్రారంభమై వెలుగు తగ్గటం మొదలయింది, అంచేత, అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువుల గుంపు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి, వాటి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు.


అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవటానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి, మంత్రగత్తెకీ కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికే చీకటైపోయింది. సరిగ్గా కనపడక, చెట్టు తీగలచే కప్పబడిఉన్న ఒక గొయ్యి మీదికి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు, కానీ అతని కాళ్ళు ఆ తీగలలో చిక్కుకున్నాయి. దీనితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉండిపోయాడు.


కొద్ది నిమిషాల తరువాత తేరుకుని చూస్తే ఆ గొయ్యి అడుగుభాగంలో ఒక పాము, వీడు పడిపోతే కాటేద్దామని వేచిఉంది. ఈ మధ్యలో రెండు ఎలుకలు కనిపించాయి - ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది - ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకటం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు, కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కుట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితిలో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో కూడా ఎలా నవ్వగలుగుతున్నాడు? అని విచారించటానికి తత్త్వవేత్తలు కూడారు. వారు పైకి చూస్తే ఒక తేనెతుట్టె కనిపించింది దాని నుండి తేనే బొట్లుబొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ, ఎంత బాగుందో అనుకుంటున్నాడు; అతను ఆ మృగాలని, మంత్రగత్తెని, పాముని, ఎలుకలని, కందిరీగలని మర్చిపోయాడు.


ఈ కథలోని వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు. కానీ, కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి వాహ్యాళికి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తుని సూచిస్తుంది; ఇక్కడ అడుగడుగుకీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని తరిమిన జంతువులు - మరణించే వరకూ బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె - కాల గమనంలో మనలను ఆలింగనం చేసుకోవటానికి వేచిఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము - అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల, నల్ల ఎలుకలు - పగలు, రాత్రిని సూచిస్తాయి, అవి నిరంతరం మన ఆయుష్షుని గ్రసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు - మనస్సులో జనించి, దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు; ఇవి బాధను, దుఃఖాన్ని కలుగచేస్తాయి. తేనె - ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖాస్వాదనను సూచిస్తుంది; మన బుద్ధి యొక్క విచక్షణని కమ్మివేస్తుంది. కాబట్టి మన ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోతూ, క్షణభంగురమైన ఇంద్రియ సుఖాలని ఆస్వాదించటం లోనే మునిగిపోతాము. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణా శక్తిని కప్పివేస్తాయి, అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు.

ఆదివారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

05-04-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


వృషభం


ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి.

---------------------------------------


మిధునం


చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి.

---------------------------------------


కర్కాటకం 


ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. 

---------------------------------------


సింహం


సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బందిపడతారు. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


కన్య


భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

---------------------------------------


తుల


దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు.  

---------------------------------------


వృశ్చికం


సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------


ధనస్సు


చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------


మకరం


వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

---------------------------------------


కుంభం


చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి.

---------------------------------------


మీనం


వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

---------------------------------------

రామాయణం - 26 )

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 26 )

                (పరశురాముడు- 3)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

                              ----


(4-4-'26 పోష్టు తరువాయి భాగము)

పరశురాముని చరిత్ర చెప్పుకుంటున్నాము.


కార్తవీర్యార్జునుడు, తనకు ససైన్య పరివార సహితంగా జమదగ్ని మహర్షి ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యానికి సంతోషించే బదులు ఈర్ష్యాగ్రస్తుడైనాడు.

జమదగ్ని ఐశ్వర్యానికి కారణమని తాను భావించిన కామధేనువును,దూడను బలాత్కారముగా తన పట్టణమైన మాహిష్మతీ పురానికి తరలించాడు.


ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు అగ్రహోదగ్రుడై మాహిష్మతికి వెళ్ళాడు.


జటాజూటముతో,

లేడి చర్మమును వస్త్రముగా దాల్చి,

భుజముపై గండ్రగొడ్డలి, చేతిలో ధనుర్బాణాలూ ధరించి,

పాదచారియై ఒంటరిగా తనపై యుద్ధానికి వస్తూన్న పరశురాముని చూచి, కార్తవీర్యుడు అవహేళనగా నవ్వాడు.

 అతనిని బంధించడానికి భటులను పంపాడు.

వచ్చినవారిని వచ్చినట్లు పరశురాముడు సంహరించాడు.

ఆశ్చర్యానికి లోనైన కార్తవీర్యుడు క్రమ క్రమంగా అధికాధిక సైన్యాన్ని పంపాడు.

అమిత తేజశ్శాలి అయిన భార్గవుడు ఆ సైన్యాన్నంతా ఒంటరిగానే మట్టుబెట్టాడు.


శ్లో// అచోదయద్ధస్తి రథాశ్వ పత్తిభిర్గదాసి బాణర్ ష్టి శతఘ్ని శక్తిభిః/

అక్షౌహిణీస్సప్త దశాతి భీషణా స్తా రామ ఏకో భగవానసూదయత్//

(అప్పుడు కార్తవీర్యార్జునుడు హస్తి,రథ,హయ,పదాతులతో కూడినవి,

గదలు, బాణములు, ఈటెలు, కత్తులు మొదలైన ఆయుధములతో కూడినవి,

భయంకరమైనవి అయిన

పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని క్రమంగా రాముని మీదకు పంపాడు.

 పరశురామ భగవానుడు,ఒంటరిగానే ఆ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు).


అప్పుడు కార్తవీర్యుడు స్వయముగా తన వేయి చేతులతో ఒకేసారి ఐదువందల ధనస్సులు ధరించి యుద్ధం చేశాడు.


పట్టరాని క్రోధంతో పరశురాముడు, ఆ వెయ్యి చేతులను తన గండ్రగొడ్డలితో ఖండించాడు.


తరువాత పర్వత శిఖరంలాగా ఉన్న కార్తవీర్యుని శిరస్సును ఖండించాడు.


ఆ విధంగా కార్తవీర్యార్జునుని ససైన్యంగా సంహరించి భార్గవరాముడు అప్పుడు శాంతుడయ్యాడు.

కార్తవీర్యుని పుత్రులు పదివేలమంది,తమ తండ్రి మరణం చూచి పారిపోయారు.

 కామధేనువును, దూడను తీసుకుని, పరశురాముడు ఆశ్రమానికి వెళ్ళాడు.

అయితే ఈ కార్యానికి పరమశాంతుడైన జమదగ్ని మహర్షి సంతోషపడలేదు.

రాజును సంహరించడము " పాపము " అన్నాడు. 


శ్లో// రామ రామ మహాబాహో భవాన్ పాప మకారషీత్/

అవధీన్నర దేవం యత్సర్వ దేవమయం వృథా//


(ఓ రామా! రామా! నీవు గొప్ప భుజశక్తి కలవాడవు.

కానీ ధర్మం తెలుసుకోలేక పోయావు.

ప్రజాపాలన కోసం సకల దేవతలు తమ తమ అంశలను"రాజు" లో ఉంచుతారు.

అయ్యో! అటువంటి నరపతిని సంహరించి నీవు పాపము చేశావు ).


"బ్రాహ్మణులకు సహనమే ఉత్తమ గుణము.

నీవు వెంటనే పాప పరిహారార్ధం తీర్థ యాత్రలు చేసిరావలసినది"

అని పరశురామునితో అన్నాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించి, భక్తి శ్రద్ధలతో ఒక సంవత్సరము దీక్ష చేపట్టి, పరశురాముడు తీర్థ యాత్రలు ముగించి, తిరిగి తండ్రి ఆశ్రమానికి వచ్చాడు.


(సశేషం)


                     శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                       ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

5-4-'26

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - ‌తృతీయ -‌ విశాఖ -‌‌ భాను వాసరే* (05.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సూర్య స్తుతి

 🌸సూర్య స్తుతి🙏


సీ. కర్మసాక్షి కపిల కమలాప్త ఆదిత్య 

కాశ్యపేయ ఖలుడా! కావు మమ్ము 

గగనమణి ఖమణి గ్రహ పతి ఖచరుడా

దినమణి !దినపతి దీనబంధు 

దినకరా తిమిరారి దిననాధ భానుడా!

ధరణుడా కావుము ధాత్రినంత

నీరజ బంధుడ నెలజోడ మిత్రుడా!

భాస్కర రావయ్యబాధ

 తీర్ప

తేగీ ..వసుధలోజనులుచలికివణుకుచు నిక

 దిక్కుతోచక యుండిరి దీనబంధు

నీదు దర్శన భాగ్యము నేడు లేదు 

కశ్యపాత్మజ కదలిరా! కమల బంధు!


సాహితీ శ్రీ జయలక్ష్మి


🌸సూర్య స్తుతి 🙏

కంద పద్యం


వెలుగులు నింపును సూర్యుడు 

బలమును చేకూర్చు పద్మ బంధువు మనకున్

పలుపంటలుపండించెడి 

ఖలునకు భక్తితో మనమున కైమోడ్చవలెన్


ఖలుడు__సూర్యుడు

సాహితీ శ్రీ జయలక్ష్మి🌸సూర్య స్తుతి🙏


సీ. కర్మసాక్షి కపిల కమలాప్త ఆదిత్య 

కాశ్యపేయ ఖలుడా! కావు మమ్ము 

గగనమణి ఖమణి గ్రహ పతి ఖచరుడా

దినమణి !దినపతి దీనబంధు 

దినకరా తిమిరారి దిననాధ భానుడా!

ధరణుడా కావుము ధాత్రినంత

నీరజ బంధుడ నెలజోడ మిత్రుడా!

భాస్కర రావయ్యబాధ

 తీర్ప

తేగీ ..వసుధలోజనులుచలికివణుకుచు నిక

 దిక్కుతోచక యుండిరి దీనబంధు

నీదు దర్శన భాగ్యము నేడు లేదు 

కశ్యపాత్మజ కదలిరా! కమల బంధు!


సాహితీ శ్రీ జయలక్ష్మి