3, ఫిబ్రవరి 2021, బుధవారం

అసాధ్యమైనదేమీ లేదు

 🌼 ..... ఒక కథ చెబుతా విను..... 🌼


💐 భగవంతుడికి అసాధ్యమైనదేమీ లేదు 💐


🍂 నానక్‌ సంప్రదాయానికి చెందిన సాధువులు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవుని గదిలో ప్రవేశించి, గౌరవసూచకంగా 'నమో నారాయణ” అని సంబోధించారు. గురుదేవులు వారిని కూర్చోమని చెప్పి, ఈ కథను చెప్పారు.


🍂 ఒక ప్రదేశంలో ఇద్దరు యోగులు తపస్సు చేసుకుంటున్నారు. ఒకరోజు నారదమహర్షి ఆ వైపుగా వెళ్ళడం సంభవించింది. ఆ యోగులు ఆయనను

గుర్తించారు. వారిలో ఒక యోగి ఆ మహర్షిని ఇలా ప్రశ్నించాడు: “స్వామీ! మీరు ఇప్పుడు భగవంతుని దగ్గర నుండే వస్తున్నారు కదా! ఆయన ఏం చేస్తున్నారండీ?”


🍂 నారదమహర్షి. “భగవంతుడు ఒక సూదిని పట్టుకుని, దాని బెజ్జం ద్వారా ఇటునుంచి అటు, అటునుంచి ఇటు ఏనుగులను, ఒంటెలను దూరుస్తున్నాడు!”


🍂 అది విన్న మొదటి యోగికి నారదుని మాటలు మీద నమ్మకం కలగలేదు. ఆయన నారద మహర్షితో: “ఏమిటి! భగవంతుడు సూది బెజ్జం లో నుంచి ఏనుగులను ఒంటెలను దూరుస్తున్నాడా.? ఇది సాధ్యమయ్యే పనేనా.? మీరు వైకుంఠానికి వెళ్ళను లేదు. భగవంతుడు చేస్తున్న పనిని చూడనూ లేదు." అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.


🍂 రెండవ యోగి: “అయ్యా, ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది?

భగవంతుడికి అన్నీ సాధ్యమే!”


   అవును.


 🍂 "భగవంతుడికి అసాధ్యమైనదేమీ లేదు. ఆయనకు సర్వం సాధ్యమే!" అని గురుదేవులు పై కథను చెప్పి ముగించారు.

మురుగ


*⚜️ప్ర: సుబ్రహ్మణ్యస్వామిని 'మురుగ' అంటారు కదా. తమిళులు పెట్టుకున్న ఈ పేరుకి అర్థమేమై ఉంటుంది?⚜️*



*జ:*

'మురుగన్' అనే పేరు తమిళ భాషలో 'అందగాడు' అనే అర్ధం. అయితే,సుబ్రహ్మణ్యుని నామాలు సంస్కృతంలో అనేకం ఉన్నాయి. అందులో 'మురుక' అనేది ఒకటి. దీనికి అర్థం 'స్కాంద పురాణం' ఇలా చెప్తోంది.


'ము' కారాస్తు 

ముకుందః స్యాత్

'రు' కారో రుద్రవాచకం౹

'క' కారో బ్రహ్మవాదీచ ' 

'మురుకో' గుహ వాచకః౹౹


'ము' అనేది విష్ణువునీ, 'రు'- రుద్రునీ, 'క'- బ్రహ్మనీ తెలియజేస్తుంది. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరబ్రహ్మగా సుబ్రహ్మణ్యుని (గుహుని) 

ఉపాసిస్తూ 'మురుక' అని స్వామిని పిలుస్తారు. అని ఒక నిర్వచనం. తమిళ భాషలో 'క' కారానికీ, 'గ' కారానికీ తేడా లేదు కనుక 'మురుగ' అని వారంటారు అంతే.⚜️

'ఆడ' కూతురు

 మన ఇంటి 'ఆడ' కూతురు...


ఓ చిన్న కధ .

చాలా బాగుంటుంది ...

తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన  అధ్బత కధనం తప్పకుండా చదవండి..


అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు ఆరోజున..!!


అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది.

తండ్రి శర్మగారు ఎంతగనో ఆనందించారు.

పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. 


పెళ్ళికిముందు ఒకరోజు  పెళ్ళికూతురు తండ్రి శర్మగారు,వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళలసివస్తుంది. 


అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు. వరుని తరపువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. 


కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది.

శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.


అయితే మగపెళ్ళి వారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై.


మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.


అందులో పంచదార లేదు సరికదా,

తనకిష్టమైన యాలకులపొడి వేశారు.


మాఇంటి పధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.


మధ్యాహ్నం భోజనం చేశారు,

అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.


వెంటనే ఏం బయలు దేరుతారు,

కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు.

అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది.

కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి.


బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు...

'నేను ఏం తింటాను,

ఎలా తాగుతాను,

నా ఆరోగ్యానికి ఏది మంచిది ...

ఇవన్నీ మీకెలాతెలుసు..?' అని.


అమ్మాయి అత్త గారు ఇలా అంది....

'నిన్నరాత్రి మీఅమ్మాయి ఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది.

మానాన్నగారు మొహమాట పడతారు.

వారి గురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలని కోరింది.'


శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది.


శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు...

'లలితా, మా అమ్మ చనిపోలేదు.'


'ఏమిటండీ మీరు మాటాడుతున్నది'


'అవును లలితా,

నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది..

నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు

నిండిన కళ్ళతో.


అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము,

మన ఇల్లు వదిలి పోతుందని.

తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది.

తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకొని.


*ఆడ పిల్లను బతకనిస్తే .....

అమ్మను గౌరవించినట్లే.....*


           🙏సర్వ సృష్టి సఖినో భవత్🙏

అమరఫలం

 *అమరఫలం -- చందమామ కథలు*


*పూర్వం ఒక ముని సర్వసంగపరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా, ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై, మునికి ఒక ఫలాన్ని ఇచ్చి, ‘‘నీ తపస్సుకు మెచ్చాను. ఈ అమరఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది,'' అని చెప్పి అంతర్థానమయింది.*

*మునికి కోరిక ఏదీ లేదు. అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు. దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు చేయ నిశ్చయించి, ఆయన ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు.*


*రాజు మునికి తగిన మర్యాదలు చేసి, ఆయన వచ్చిన పని అడిగాడు.*


*"రాజా, ఇదొక అమరఫలం. దీన్ని వెలఇచ్చి కొన్నవారికి ఒక్క కోరిక సిద్ధిస్తుంది. ఆ తరవాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి. కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారంరోజుల కన్న ఎక్కువకాలం దగ్గిర ఉంచుకోరాదు. ఉంచుకోవటం చాలా అపాయం. దీన్ని ముందుగా నీకిస్తున్నాను. దీనికెంత వెల ఇస్తావో చెప్పు,'' అని ముని అన్నాడు. రాజుకు అగత్యంగా తీరవలసిన కోరిక ఒకటి ఉన్నది.*


*ఆయనకూ, పొరుగురాజుకూ చాలాకాలంగా యుద్ధం సాగుతూ ఉన్నది. నిష్కర్షగా ఎవరికీ విజయం చేకూరటం లేదు. ఇరుపక్షాలకూ బోలెడంత నష్టం మాత్రం అవుతున్నది. అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజయం సాధించాలనుకుని, ఆ పండును లక్షవరహాలకు కొన నిశ్చయించాడు. ముని ఆ పండును రాజుకిస్తూ, ‘‘నీ కోరిక తీరిన వారం రోజుల లోపల, కొన్న ధర కంటె తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి.*


*నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి,'' అని లక్షవరహాలూ రాజు నుంచి పుచ్చుకుని, వాటిని తీసుకుపోయి పేదసాదలకు దానం చేసేసి, తన దారిన తాను అరణ్యానికి తిరిగి వెళ్ళి, ఎప్పటిలాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు.*


*అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునాయాసంగా కోరిక సిద్ధించింది. మళ్ళీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపోయాడు. ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయింది. విజయం లభించిననాడే రాజు నిండు కొలువులో పరమానందంతో అమరఫలాన్ని అందరికీ చూపి, దాని మహిమ గురించి వివరించి, కావలిసిన వారికి దాన్ని విక్రయిస్తానన్నాడు*


*దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతుడొకడు దాన్ని అమితాసక్తితో తొంభైవేల వరహాలిచ్చి కొని, తన దీర్ఘ వ్యాధి నివారణ చేసుకున్నాడు.*


*వెంటనే అమరఫలం చేతులు మారింది. దాని ప్రభావంతో అనేకమందికి అనేక రకాల కోరికలు తీరాయి. కొందరికి వాణిజ్యం కలిసివచ్చింది, కొందరు విద్యావంతులయ్యారు, అనేకమంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు. కోరికలు తీర్చుతున్నకొద్దీ అమరఫలం విలువ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది.*


*చాలాకాలం గడిచింది. పుష్యార్కుడనే వాడికి పక్షవాతం వచ్చింది. అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యు ముఖం నుంచి తప్పించాడు. ఆ అమర ఫలం ఇప్పు డెంత వెలలో ఉన్నదని విచారించగా రెండు కాసులని తెలిసింది. రెండుకాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి ఒకకాసుకే అమ్మాలి.*


*ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు. ఇలా అనుకుని పుష్యార్కుడు వ్యాధి నివారణకు అమరఫలాన్ని కొనక, వైద్యుణ్ణే నమ్ముకుందామనుకున్నాడు*


*కాని అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా రెండుకాసు లిచ్చి, తమ నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి,తన భర్త వ్యాధి నయం కావాలని కోరుకున్నది. పుష్యార్కుడి వ్యాధి తీసేసినట్టు నయమయింది. తాను తీసుకున్న మందులే పనిచేశాయినుకున్నా డతను.*


*ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరి కన్నా ఒక కాసుకు అమ్మాలి. కాని ఎవరికని అమ్మటం? అమ్మితే ఆతరవాత కొన్నవాళ్ళ గతేమిటి? బాగా ఆలోచించి అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గిరే ఉంచుకుని ఏ అపాయం వచ్చినా భరించటానికే ఆమె నిశ్చయించుకున్నది. తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో నన్న బెదురుతో మాలిని రోగిష్ఠిదానిలాగా అయిపోసాగింది.*


*నౌకరు ఒకనాడు, ‘‘ఏమండి, అమ్మగారూ? వంట్లో బాగా లేదా?'' అని అడిగాడు.*


*"ఇక నేను ఎంతోకాలం బతకనురా!'' అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది.*


*"ఎందుకండీ అమ్మగారూ, మీరు చావటం?'' అన్నాడు నౌకరు. ‘‘దాన్ని ఎవరికి అమ్మనురా? ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు. చూస్తూ చూస్తూ ఇంకొకర్ని చంపటం దేనికి? నేనే చస్తాను,'' అన్నది మాలిని.*


*నౌకరు నవ్వి, ‘‘ఎవరూ చావొద్దు! ఒక కాసుకు ఆ అమరఫలాన్ని నాకు అమ్మెయ్యండి,'' అన్నాడు. ‘‘ఇంకానయం! నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు?'' అన్నది మాలిని.*


*"నే నసలు కోరిక కోరితేగద! దాన్ని పెట్టెలో దాస్తాను,'' అంటూ నౌకరు ఒక కాసు తీసి మాలిని కిచ్చి, అమరఫలాన్ని తీసుకుపోయి, తన ఇంట్లో కొయ్యపెట్టె అడుగున భద్రంగా దాచాడు.*


*అటుతరవాత అది ఏమైనదీ తెలీదు. కొంతకాలమయ్యాక చూస్తే దాని జాడ కనిపించలేదు.*

మారిన మనసు*

 *✍🏼 నేటి కథ ✍🏼*



*మారిన మనసు*



అనగా అనగా ఒక ఊరు . ఆ ఊరి పేరు ఒంటికొండ. ఆ ఊళ్ళో ఒక బడి ఉంది. ఒక రోజున ఆ బడిలో పాటల కార్యక్రమం జరుగుతున్నది. ఆ పాటల్ని వినేందుకు చాలా మంది వచ్చి ఉన్నారు. పాటలు పాడటానికి పిల్లలంతా పోటీ పడుతున్నారు. అయితే, ఆ బడిలో చదివే భీమరాజు 'అమ్మ' గురించి పాడిన పాట విని, అందరూ పరవశించిపోయారు. ఎప్పటిలాగే ఈసారి కూడా భీమరాజుకే మొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతిని పట్టుకొని భీమరాజు సంతోషంగా ఇంటికి పరుగెత్తాడు.


భీమరాజు వాళ్ళది చాలా పేద కుటుంబం. అతను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటినుండీ వాళ్ళ అమ్మ కూలిపని చేసుకుంటూ అతన్నీ, వాళ్ల అన్ననీ పెంచి పెద్ద చేసింది. అన్నకు పెళ్ళైంది; చిన్న ఉద్యోగం దొరికింది- గానీ అతని సంపాదన అతని కుటుంబానికే సరిపోతుంది. భీమరాజు చదువు పూర్తయేంత వరకూ వాళ్ళమ్మకు చాకిరీ తప్పదు.


సంతోషంగా ఇల్లు చేరుకున్న భీమరాజు వాళ్ళమ్మకు తన బహుమతిని చూపించి- 'నువ్వు నేర్పిన పాటకేనమ్మా, ఈ బహుమతి వచ్చింది!' అని చెబితే, వాళ్ళమ్మ గర్వంతో పొంగిపోయింది. 'సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసి, రా! ఇవాళ్ల నీ పుట్టిన రోజు కదా, కొత్త అంగీ కుడుతున్నాను. నీ స్నానం అవ్వగానే ముందు కొంచెం పాయసం తిందువు ' అన్నది. అయితే, ఆమెకు చాలా కాలంగా కాన్సర్ వ్యాధి ఉన్నది. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయింది!


ఇప్పుడు ఇక భీమరాజును చూసుకునే బాధ్యత వాళ్ల అన్నమీద పడింది. అన్న మంచివాడే, కానీ ఒదిన గంగమ్మకు మాత్రం భీమరాజంటే ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎప్పుడూ అతన్ని సాధిస్తూ ఉండేది. భీమరాజు మాత్రం నోరు మెదపకుండా ఇంటి పనులన్నీ‌చకచకా చేసేసి బడికి వెళ్ళి శ్రద్ధగా చదువుకొనేవాడు. బడినుండి ఇంటికి వచ్చాక కూడా అతనికోసం ఇంటినిండా పనులు సిద్ధంగా ఉండేవి. అన్ని పనులూ చేసేసి, అందరూ భోజనాలు కానిచ్చి పడుకున్నాక, భీమరాజు తన హోం-వర్కు చేసుకునేవాడు. ఎంత చేసినా వదిన చేతిలో అతనికి తిట్లు తినక తప్పేది కాదు.


చూస్తూండగానే సంవత్సరం గడిచి-పోయింది. బడిలో పాటల పోటీలు జరుగుతున్నై, మళ్ళీ. ఆ పోటీని చూసేందుకు భీమరాజు అన్నావదినలు కూడా వచ్చారు. 'ఈసారి భీమరాజు ఏం పాట పాడతాడా ' అని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 'అన్నా వదినల ఆప్యాయత' అని తీయగా పాడాడు భీమరాజు. పాట ఎంత చక్కగా పాడాడంటే, న్యాయనిర్ణేతలుకూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

ఒకాయన వాడిని దగ్గరకు తీసుకొని, ప్రేమగా 'బాబూ, నీకు ఈ పాటను ఎవరు నేర్పారు? ఇంత చక్కగా పాడేందుకు నీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు?' అని అడిగాడు. 'మా ఒదినమ్మ' అని చెప్పాడు భీమరాజు. న్యాయనిర్ణేతలు భీమరాజు ఒదినమ్మను వేదిక మీదికి పిలిచి, అభినందించి, ప్రత్యేకంగా సత్కరించారు. 'ఇంత చక్కని గాయకుడిని తయారుచేసిన మీరు ధన్యులు' అని వచ్చినవాళ్ళంతా ప్రశంసిస్తుంటే ఒదినమ్మ సిగ్గుతో‌ముడుచుకు పోయింది.


అటు తర్వాత గంగమ్మ మారిపోయింది. భీమరాజును చక్కగా చూసుకున్నది!


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*మాయా సీత*



*రామాయణం యొక్క అసలు కథాంశం*


వాల్మీకి రామాయణంలో (క్రీ.పూ. 5 నుండి 4 వ శతాబ్దం) మాయ సీత గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మిథిలా యువరాణి సీత అయోధ్య యువరాజు రాముడిని వివాహం చేసుకుంది. రాముడు 14 సంవత్సరాల వనవాసానికి సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో వెళ్ళవలసి వస్తుంది. రాక్షస రాజైన రావణుడు సీతను అపహరించడానికి ఒక పథకం రచిస్తాడు. ఇందులో భాగంగా బంగారు లేడి (మాయామృగం) గా మారి సీతను ఆకర్షించిడానికి మారీచుడు అనే రాక్షసుని సహాయం తీసుకుంటాడు. దండక అరణ్యంలో ప్రవాసంలో ఉన్నప్పుడు, రాముడు మాయాజింకను వెంబడించి చంపేస్తాడు. మాయా జింక రాముడి గొంతులో సహాయం కోరుతుంది. సీత లక్ష్మణుడిని బలవంతంగా వెళ్లి రాముడికి సహాయం చేయమని రాముని వద్దకు పంపుతుంది. రావణుడు సన్యాసి వేషంలో వచ్చి ఆమెను అపహరించాడు. రావణుడిని యుద్ధంలో చంపి రాముడు ఆమెను రక్షించే వరకు రావణుడు ఆమెను లంకలోని అశోక వాటిక తోటలో బంధిస్తాడు. అసభ్యకరమైన మహిళల ప్రవర్తన ద్వారా ప్రజలకి మొత్తం స్త్రీ జాతిపై అపనమ్మకం కలుగుతుందని, ఇకపై తప్పుడు నిందలతో జీవించాలని ఆమె కోరుకోలేదని, ఆమె పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని (అగ్ని పరిక్ష) ద్వారా విచారణకు గురవుతుందని సీత భావించింది . సీత మండుతున్న అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఆమె రాముడికి విశ్వాసపాత్రంగా ఉంటే, అగ్ని తనకు హాని కలిగించనివ్వదని ఆమె భావిస్తుంది. ఆమె తన స్వచ్ఛతకు నిదర్శనంగా అగ్ని దేవుడితో పాటు ఎటువంటి గాయాలు లేకుండా మంటల నుండి బయటకి వస్తుంది . రాముడు సీతను తిరిగి అంగీకరించి, అయోధ్యకు తిరిగి వస్తాడు. అక్కడ వారు సీతారాములను రాజు మరియు రాణిగా పట్టాభిషేకం చేస్తారు. 


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

తెలంగాణ ఘన కీర్తి*

 *జైశ్రీమన్నారాయణ*  🌴🦜 *తెలంగాణ ఘన కీర్తి*  

నరనారాయణులు ఉన్నది రెండే క్షేత్రాలలో.... 

1). బద్రినాథ్ మరియు  *లింబాద్రి గుట్ట*, భీంగల్, నిజామాబాద్ జిల్లా. ఇది బ్రహ్మ దేవుడే తపస్సు చేసి నృసింహ స్వామిని మెప్పించిన క్షేత్రం.

2) సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

శ్రీనగర్.... *బాసరా (తెలంగాణ)..*

3) బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

4) త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాళేేశ్వరం (తెలంగాణ)*

5) ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*

*లింబాద్రిగుట్ట*

తెలంగాణ లోని నిజామాబాదు జిల్లాలో లింబాద్రిగుట్ట కు ప్రత్యేక స్థానం వుంది. ఉత్తరఖండ్, బద్రీనాథ్ తర్వాత ఆంతటి విశిష్ఠత కలిగిన క్షేత్రం లింబాద్రిగుట్ట.

యావత్ భారత దేశంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మరియు *నర నారాయణులు*  ఓకే గర్బలయంలో స్వయంభువు  గా కొలువుదీరిన మహపుణ్యక్షేత్రం.  

*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా) బ్రహ్మదేవుడు (సృష్టి) నరసింహుడు, (స్థితి) శివుడు, (లయం) యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది

*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 

*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)

*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 

*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 

*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 

*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 

*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 

*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 

*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 

*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంథనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 

 *మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం*  *శుభాభినందనలతో*  *ప్రేమతో* *మీ* *కర్పూరం* *గోపిధర్* 🦜🌴🦜🌴🦜

కఠిన సాధన

 ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.


రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది.


బజారులో పేయింటింగ్ ఎలా చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యునతి మొండిగా మారాం చేసే సరికి ఒక పేపర్ పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ ....నవ్వుతూ అన్నాడు దీని విలువ కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.


ఆ యువతి ఆశ్చర్యంగా పేయింటింగ్ వంక చూస్తూ ఉండి పోయింది.


మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని వాకబు చేసింది.


ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి నోటమాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది.

 

రవివర్మని కలిసి ఇలా అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.


నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.


రవివర్మ నవ్వుతూ అన్నాడు అమ్మాయీ...! నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.  


నవ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు.


ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.


  _*ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.*_


*తల్లి తండ్రులు నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.*


*అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది....*

     _*ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి*🌹


*ఈ విలువైన సందేశాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి...*🙏🙏


🌹*ఓం నమో వెంకటేశాయ*🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 🌹🌹💐💐