*జైశ్రీమన్నారాయణ* 🌴🦜 *తెలంగాణ ఘన కీర్తి*
నరనారాయణులు ఉన్నది రెండే క్షేత్రాలలో....
1). బద్రినాథ్ మరియు *లింబాద్రి గుట్ట*, భీంగల్, నిజామాబాద్ జిల్లా. ఇది బ్రహ్మ దేవుడే తపస్సు చేసి నృసింహ స్వామిని మెప్పించిన క్షేత్రం.
2) సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..
శ్రీనగర్.... *బాసరా (తెలంగాణ)..*
3) బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో...
పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..*
4) త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..
అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాళేేశ్వరం (తెలంగాణ)*
5) ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు..
నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)
*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*
*లింబాద్రిగుట్ట*
తెలంగాణ లోని నిజామాబాదు జిల్లాలో లింబాద్రిగుట్ట కు ప్రత్యేక స్థానం వుంది. ఉత్తరఖండ్, బద్రీనాథ్ తర్వాత ఆంతటి విశిష్ఠత కలిగిన క్షేత్రం లింబాద్రిగుట్ట.
యావత్ భారత దేశంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మరియు *నర నారాయణులు* ఓకే గర్బలయంలో స్వయంభువు గా కొలువుదీరిన మహపుణ్యక్షేత్రం.
*ధర్మపురి:-*
యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే..
(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా) బ్రహ్మదేవుడు (సృష్టి) నరసింహుడు, (స్థితి) శివుడు, (లయం) యముడు, (కాలం)
అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది
*కాళేశ్వరం:-*
ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే..
*వేములవాడ:-*
అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)
*మెదక్:-*
సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది..
*యాదగిరి:-*
అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం..
*కొండగట్టు:-*
శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం..
*బాసర (వ్యాసపురి):-*
వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం..
*భద్రాచలం:-*
శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం.
*చెన్నూర్:-*
గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం.
*మంథని:-*
మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే.
*బోదన్:-*
బోధనపురి అసలు పేరు. మంథనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.
*మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం* *శుభాభినందనలతో* *ప్రేమతో* *మీ* *కర్పూరం* *గోపిధర్* 🦜🌴🦜🌴🦜
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి