2, అక్టోబర్ 2026, శుక్రవారం

హనుమాన్ బాహుక్*

  *🌹భృగువారం 2 అక్టోబరు 2026🌹*


**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

           *🌷ఇరవైఒకటవ రోజు🌷*


బాలక బిలోకి, బలి, బారేతేఁ ఆపనో కియో, 

దీనబంధు దయా కీన్హీఁ నిరుపాధి న్యారియే ॥ 

రావరో భరోసో తులసీకే, రావరో ఈ బల, 

ఆస రావరీయై, దాస రావరో విచారియే ॥ 

బడో బికరాల కలి, కాకో న బిహాల కియో, 

మాథే పగు బలీకో, నిహారి సో నివారియే; 

కేసరీకిసోర, రనరోర, బరజోర బీర, 

బాఁహుపీర రాహుమాతు జ్యౌం పఛారి మారియే ॥


**వివరణ**:

ఓ దీనబంధూ! నేను బలియైపోవుచున్నాను. బాహువుల బాధ ప్రాణాంతకముగా నున్న దనుట. బాలుని చూచి నీవు బాల్యమునుండియు దగ్గరకు తీసితివి, మాయారహితమగు అద్భుతమైన దయ చూపితివి. సత్యముగా నాలోచింపుము. ఈ తులసీదాసు నీ దాసుడు. వీనికి నిన్ను చూచుకొన్నదే ధైర్యము. నీవే బలము, నీయందే ఆశ. అత్యంత భయానకమైన కలికాలం ఎవరిని వ్యాకులపరచదు? ఆ బలవంతుని కాలు నా నెత్తిపై నుండుటను గమనించి దానిని తొలగించుము. ఓ కేసరీ కిశోరమా! ఓ శ్రేష్ఠవీరుడా! నీవు రణరంగమున కోలాహలము సృష్టించువాడవు. రాహువుయొక్క మాత సింహికనువలె పోరున పడగొట్టి కలిని సంహరింపుము. బాహు బాధను తొలగింపుము.


 **ప్రతి పాదానికి అర్థం**


**1. బాలక బిలోకి, బలి, బారేతేఁ ఆపనో కియో, దీనబంధు దయా కీన్హీఁ నిరుపాధి న్యారియే ॥**


* **అర్థం:** ఓ దీనబంధువా! (అనాథలను ఆదుకునేవాడా), నీకు బలిహారినైపోతాను (నన్ను నేను అర్పించుకుంటాను). నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే (బాల్యము నుండే) నన్ను నీవాడిగా స్వీకరించి, నాపై ఎలాంటి నిబంధనలు లేని, నిష్కపటమైన, అసమానమైన దయను కురిపించావు.


**2. రావరో భరోసో తులసీకే, రావరో ఈ బల, ఆస రావరీయై, దాస రావరో విచారియే ॥**


* **అర్థం:** ఈ తులసీదాసుకి నీపైనే పూర్తి భరోసా (నమ్మకం) ఉంది, నీవే నా బలం, నా ఆశలన్నీ నీపైనే ఉన్నాయి. నేను కేవలం నీ దాసుడిని మాత్రమే అని నీ మనసులో ఒక్కసారి ఆలోచించి, నన్ను అనుగ్రహించు.


**3. బడో బికరాల కలి, కాకో న బిహాల కియో, మాథే పగు బలీకో, నిహారి సో నివారియే ॥**


* **అర్థం:** ఈ కలికాలం చాలా భయంకరమైనది (వికృతమైనది). ఇది ఎవరిని అల్లాడించలేదు? (అందరినీ పీడిస్తోంది). కాబట్టి, బలం ఉన్న ఓ హనుమంతా! ఈ కలికాలం నా నెత్తిన పెట్టిన ఈ కష్టాల (వ్యాధి) పాదాన్ని ఒక్కసారి చూసి, దాన్ని తొలగించు (నివారించు).


**4. కేసరీకిసోర, రనరోర, బరజోర బీర, బాఁహుపీఠ రాహుమాతు జ్యౌం పఛారి మారియే ॥**


* **అర్థం:** కేసరి నందనా! యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే బలశాలీ, పరాక్రమవంతుడైన ఓ వీరుడా! రాహువు తల్లి అయిన 'సింహిక'ను నువ్వు సముద్రం దాటేటప్పుడు ఎలాగైతే కిందపడేసి నలిపి చంపేశావో... అలాగే నా బాహువులను (చేతులను) పీడిస్తున్న ఈ భయంకరమైన నొప్పిని కూడా నేలకేసి కొట్టి సంహరించు.


**వ్యాఖ్యానం (తాత్పర్యం)**


ఈ 21వ శ్లోకంలో తులసీదాస్ గారు హనుమంతునితో తనకున్న ఆత్మీయ బంధాన్ని గుర్తుచేస్తూ, కలికాలం వల్ల తనకు కలిగిన శారీరక బాధను నివారించమని అత్యంత ఆర్తితో ప్రార్థిస్తున్నారు


మొదట తులసీదాస్ గారు హనుమంతుడికి, తనకు ఉన్న పాత సంబంధాన్ని గుర్తు చేస్తున్నారు. "నేను అనాథగా, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే నువ్వు నన్ను నీ వాడిగా చేరదీశావు.అని తులసి దాసు గారి కి మార్గదర్శనం,చేసింది, రామ దర్శనం ఇప్పించింది హనుమే..


అలాంటిది ఇప్పుడు ఈ కష్టకాలంలో నన్ను వదిలేయడం తగదు" అని ఒక హక్కుతో అడుగుతున్నారు. తనకు వేరే ఏ దేవుడిపైనా ఆశ లేదని, హనుమంతుడే తన బలమని ప్రకటిస్తున్నారు. తండ్రిని కుమారుడు అడిగినట్టు అడుగుతూ ఉన్నారు ఇక్కడ.


* **కలికాలపు ప్రభావం:** కలియుగం ఎంత క్రూరమైనదో ఇక్కడ వర్ణించారు. కలి పురుషుడు సృష్టించిన రోగాలు, కష్టాలు తనను పీడిస్తున్నాయని, ఆ కలి పురుషుడి తల వంచి, వాడి కాలును తనపై నుండి తొలగించగలిగే శక్తి ఒక్క హనుమంతుడికే ఉందని నమ్ముతున్నారు.


ఆ సమర్థత నీకు మాత్రమే ఉంది స్వామి అని చివరి పాదంలో రామాయణంలోని ఒక ఘట్టాన్ని గుర్తుచేశారు. హనుమంతుడు లంకకు సముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు, నీడను పట్టి లాగే 'సింహిక' అనే రాక్షసి ఎదురవుతుంది. హనుమంతుడు ఆమె నోట్లోకి దూరి, ఆమె గుండెలను చీల్చి, కిందపడేసి చంపేస్తాడు. 


దాన్ని గుర్తు చేస్తూ తులసీదాస్ గారు ఏమంటున్నారంటే—"స్వామీ! నా చేతి నొప్పి కూడా ఆ సింహిక లాగే నన్ను పట్టి లాగుతోంది, ముందుకు సాగనివ్వడం లేదు. ఆనాడు ఆ రాక్షసిని ఎలాగైతే అణచివేశావో, ఈనాడు నా చేతి నొప్పిని కూడా అలాగే పడదోసి, అంతం చేయి" అని వేడుకుంటున్నారు.


ఇది భక్తుడి ఆవేదన, నమ్మకం మరియు హనుమంతుని పరాక్రమం కలగలిసిన అద్భుతమైన స్తుతి.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🌹సేకరణ🌹*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

శనివారం🍁* *🌹03అక్టోబరు26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁శనివారం🍁*               

 *🌹03అక్టోబరు26🌹* 

   *దృగ్గణిత పంచాంగం*       

    

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - బహుళ పక్షం*  


*తిథి      : సప్తమి* ఉ 07.59 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం   : ఆరుద్ర* రా 01.29 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం  : వరీయాన్* మ 03.21 వరకు ఉపరి *పరిఘ*

*కరణం   : బవ* ఉ 07.59 *బాలువ* సా 06.54 ఉపరి *కౌలువ* రా.తె 05.51 వరకు ఆపైన *తైతుల*

*సాధారణ శుభ సమయాలు* :

         *ఈరోజు లేవు*

 అమృత కాలం  : *సా 04.05 - 05.35*

 అభిజిత్ కాలం  : *ప 11.32 - 12.20*

*వర్జ్యం          : ఉ 10.49 - 12.19*

*దుర్ముహూర్తం  : ఉ 05.58 - 07.33*

*రాహు కాలం   : ఉ 08.57 - 10.27*

గుళికకాళం      : *ఉ 05.58 - 07.27*

యమగండం    : *మ 01.26 - 02.56*

సూర్యరాశి : *కన్య*

చంద్రరాశి : *మిధునం* 

సూర్యోదయం: *ఉ 06.07* 

సూర్యాస్తమయం :*సా 06.04*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

వైదిక విషయాలు

ప్రాతః కాలం         :*ఉ  05.58 - 08.21*

సంగవ కాలం        :      *08.21 - 10.45*

మధ్యాహ్న కాలం    :    *10.45 - 01.08*

అపరాహ్న కాలం    : *మ 01.08 - 03.32*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద బహుళ అష్టమి*

సాయంకాలం        :  *సా 03.32 - 05.55*

ప్రదోష కాలం         :  *సా 05.55 - 08.20*

రాత్రి కాలం           :*రా 08.20 - 11.32*

నిశీధి కాలం          :*రా 11.32 - 12.20*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.21 - 05.10*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


  *🌹ఓం నమో వేంకటేశాయ*🙏

*🪷ఓం శ్రీ పద్మావతీయై నమః 🙏*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

నీవు లేక నేను లేను…

 🌹 నీవు లేక నేను లేను…


కానీ… నీవు లేకున్నా నేను నిలబడాలి!


ఈ ఆదివారం ప్రతి భార్యాభర్త తప్పక చదవాల్సిన మనందరి కథ 🙏


“ఏవండీ… ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్పాలి…”


“మళ్లీ ఏదో భేతాళ ప్రశ్న వేయబోతున్నావా? సరే… అడుగు!”


“మన పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. మనిద్దరం ఇక్కడే ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, సొంతింటికి లోటు లేదు. ఇద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా కాలం గడుపుతున్నాం.


కానీ… రానురాను మన వయసు పెరుగుతోంది. ఓపికలు తగ్గుతున్నాయి. పూర్వం లాగా పిల్లల దగ్గర శాశ్వతంగా ఉండలేం. వాళ్లూ ఉద్యోగాలు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలతో మన దగ్గరకు ఎప్పుడూ రాలేరు.


అందుకే… ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు ఒంటరిగా ఎలా ఉంటారో అని భయంగా ఉంది. ఈ ఆలోచనలతో రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు…”


భర్త కాసేపు మౌనంగా ఉండి…


“నాకూ అదే భయం ఉంది. కానీ ఒక చిన్న తేడా ఉంది.


నువ్వు నేను లేకపోతే ఎలా బతకాలి అని ఆలోచిస్తున్నావు…

నేను మాత్రం నువ్వు లేకపోతే ఎలా బతకాలో ఆలోచిస్తున్నాను!


నీకంటే నేను ఐదేళ్లు పెద్దవాడిని. మనలో ఎవరు ముందు వెళ్తారో ఎవరికీ తెలియదు.


అందుకే ఈరోజు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి.


❤️ ప్రేమ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడటం మాత్రమే కాదు…


ఒకరు లేని సమయంలో మరొకరు నిలబడేలా చేయడం కూడా!


నువ్వు నాకు ఎన్నిసార్లు చెబుతావు…


‘మీరు లేకపోతే నేను ఏం చేయాలి?’ అని.


కానీ నేను అడుగుతున్నది…


‘నేను లేకపోతే నువ్వు ఏం చేయగలవు?’


మన సందు చివర్లో ఉన్న ATMకి వెళ్లి డబ్బు తీసుకురాగలవా?


UPI ద్వారా డబ్బు పంపగలవా?


ఫోన్‌లో వచ్చిన OTP అంటే ఏమిటో తెలుసా?


Google Pay / PhonePe / Net Banking ఎలా ఉపయోగించాలో తెలుసా?


అత్యవసర సమయంలో Cab బుక్ చేయగలవా?


108 Ambulanceకి ఫోన్ చేయగలవా?


నా ఫోన్‌లో Emergency Contacts ఎక్కడున్నాయో తెలుసా?


మన పిల్లలకు Video Call ఎలా చేయాలో తెలుసా?


WhatsAppలో Location Share చేయగలవా?


మన ఇంటి Google Maps Locationని ఎవరికైనా పంపగలవా?


నా హాస్పిటల్, డాక్టర్, ఇన్సూరెన్స్ వివరాలు ఎక్కడున్నాయో తెలుసా?


మన ఆరోగ్య బీమా కార్డు ఎక్కడుంది?

దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?


ఇంట్లో Gas అయిపోతే ఎలా Book చేయాలో తెలుసా?


కరెంట్ బిల్లు ఎలా చెల్లించాలో తెలుసా?


నీ మొబైల్ Recharge ఎలా చేసుకోవాలో తెలుసా?


మన Bank Accounts ఎక్కడున్నాయి?

ఎన్ని Deposits ఉన్నాయి?

ఏవి Maturityకి వస్తున్నాయి?


మన ముఖ్యమైన Documents — Aadhaar, PAN, Insurance, Property Papers, Bank Details — ఎక్కడ భద్రంగా ఉన్నాయో తెలుసా?


మన పిల్లలు విదేశాల్లో ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం…

కానీ వాళ్లకు మన అవసరం వచ్చినప్పుడు మనం Video Call చేయగలమా? వాళ్లకు మన పరిస్థితిని సరిగ్గా చెప్పగలమా?


ఇవి చిన్న విషయాలే అనిపించవచ్చు.


కానీ…


అత్యవసర సమయంలో ఇవే జీవితంలో పెద్ద విషయాలవుతాయి!


⸻


భార్య నెమ్మదిగా…


“మీరు ఎన్నిసార్లు చెప్పారు… కానీ నాకు ఇవన్నీ అవసరం ఉండదనిపించింది.


మీరు ఉన్నారుగా…

అన్నీ మీరే చూసుకుంటారు అనుకున్నాను…”


భర్త చిరునవ్వుతో…


“అదే మన పెద్ద పొరపాటు.


‘ఆయన ఉన్నారుగా… ఆమె ఉన్నారుగా…’ అని జీవితమంతా ఒకరిపై ఒకరు ఆధారపడుతూ వచ్చాం.


కానీ జీవితానికి గ్యారంటీ లేదు.


అందుకే ఇకనుంచి…


నువ్వు నాకు నేర్పాలి.

నేను నీకు నేర్పాలి.


నువ్వు UPI నేర్చుకో.

నేను వంట నేర్చుకుంటాను.


నువ్వు Bank పనులు నేర్చుకో.

నేను ఇంటి పనుల్లో కొన్ని నేర్చుకుంటాను.


నువ్వు Emergency Contacts తెలుసుకో.

నేను Insurance వివరాలు తెలుసుకుంటాను.


నువ్వు Online Payments నేర్చుకో.

నేను Medicines, Medical Records ఎక్కడున్నాయో నీకు చూపిస్తాను.


మనిద్దరం కలిసి బతకాలి…

అదే సమయంలో ఒకరు లేకపోయినా మరొకరు ధైర్యంగా నిలబడగలగాలి.”


భార్య కళ్లలో నీళ్లు…


“ఇలా చెప్పేసరికి భయంగా ఉంది…”


భర్త ఆమె చేతిని పట్టుకుని…


“భయపడాల్సిన అవసరం లేదు.


మన చేతిలో లేనిదాని గురించి భయపడటం కంటే…


మన చేతిలో ఉన్నదాన్ని నేర్చుకోవడం మంచిది.


దేవుడు మనకు ఎన్ని రోజులు జీవితం ఇస్తాడో మనకు తెలియదు.


కానీ ఆయన ఇచ్చిన ప్రతి రోజును ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో, ఒకరికొకరం అండగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.


🙏 భగవద్గీత చదవడం మాత్రమే కాదు…


అందులోని ధైర్యాన్ని జీవితంలో ఆచరించాలి.


పిల్లలకు చిన్నప్పటి నుంచే…


చదువు, ఉద్యోగం, కారు డ్రైవింగ్, వంట, ఈత, టెక్నాలజీ, డబ్బు నిర్వహణ… అన్నీ నేర్పిస్తాం.


కానీ మనం వయసు పెరిగిన తర్వాత…


‘ఇవి నాకు ఎందుకు?’ అని అనకుండా

‘రేపు అవసరం అయితే నేనే చేసుకోగలనా?’ అని ఆలోచించాలి.


⸻


🌷 ఈ కథ మనందరికీ ఒక చిన్న గుర్తు


భర్త భార్యకు ప్రత్యామ్నాయం కాదు.

భార్య భర్తకు ప్రత్యామ్నాయం కాదు.


కానీ…


ఒకరి జీవితంలో మరొకరు అద్భుతమైన తోడు. ❤️


ఆ తోడు ఉన్నంతకాలం ప్రేమగా జీవిద్దాం.


అదే సమయంలో…


ఒకరు లేని రోజు వచ్చినా, మరొకరు కూలిపోకుండా నిలబడేలా ఒకరినొకరు సిద్ధం చేద్దాం.


📱 Technology నేర్చుకుందాం.

💳 Digital Payments నేర్చుకుందాం.

🏦 Banking తెలుసుకుందాం.

🚑 Emergency Services తెలుసుకుందాం.

📄 Documents సక్రమంగా ఉంచుకుందాం.

🔐 ముఖ్యమైన సమాచారాన్ని సురక్షితంగా నిర్వహిద్దాం.

❤️ పిల్లలతో Regular Contactలో ఉందాం.

🙏 ముఖ్యంగా… ఒకరినొకరు ప్రేమగా, గౌరవంగా చూసుకుందాం.


🌺 చివరగా ఒక్క మాట…


“నీవు లేక నేను లేను” అనేది ప్రేమ.

“నీవు లేకున్నా నేను నిలబడగలను” అనేది జీవితంపై అవగాహన.

“నీవు ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటాను” అనేది నిజమైన దాంపత్యం. ❤️


కర్తవ్యం మన వంతు…

కాపాడటం ఆయన వంతు. 🙏


ఈ చిన్న కథను మనలాంటి ప్రతి భార్యాభర్త ఒక్కసారి చదివి…

ఒక్కసారి మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకుందాం.🙏

భృగువారం🌹* *🪷02అక్టోబరు26🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹భృగువారం🌹*                  

  *🪷02అక్టోబరు26🪷*   

   *దృగ్గణిత పంచాంగం*    

     

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - బహుళ పక్షం* 


*తిథి : షష్ఠి* ఉ 10.15 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం  : మృగశిర* రా 02.55 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : వ్యతీపాత* సా 06.18 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : వణజి* ఉ 10.15 *భద్ర* రా 09.06 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు* :

 *ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*

 అమృత కాలం  : *సా 06.40 - 08.10*

 అభిజిత్ కాలం  : *ప 11.33 - 12.21*

*వర్జ్యం    : ఉ 09.41 - 11.11*

*దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.09 మ 12.21 - 01.08*

*రాహు కాలం   : ఉ 10.27 - 11.57*

గుళికకాళం      : *ఉ 07.27 - 08.57*

యమగండం    : *మ 02.56 - 04.26*

సూర్యరాశి : *కన్య*

చంద్రరాశి : *వృషభం/మిధునం*  

సూర్యోదయం : *ఉ 06.06* 

సూర్యాస్తమయం :*సా 06.04*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

వైదిక విషయాలు

ప్రాతః కాలం         :*ఉ 05.58 - 08.21*

సంగవ కాలం        :     *08.21 - 10.45*

మధ్యాహ్న కాలం    :    *10.45 - 01.08*

అపరాహ్న కాలం    : *మ 01.08 - 03.32*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద బహుళ సప్తమి*

సాయంకాలం        :  *సా 03.32 - 05.56*

ప్రదోష కాలం         :  *సా 05.56 - 08.20*

రాత్రి కాలం           :*రా 08.20 - 11.33*

నిశీధి కాలం          :*రా 11.33 - 12.21*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.10*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

            *🌷ఓం శ్రీ🌷*  

*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

అబ్బాయి ఏం చేస్తాడు?

  మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే ముందుగా వచ్చే ప్రశ్న: "అబ్బాయి ఏం చేస్తాడు?"


అప్పారావు కుటుంబం కూడా అబ్బాయికి సంబంధం చూడటానికి అమ్మాయి ఇంటికి వెళ్ళారు. 


టీ బిస్కెట్స్ మరియు కుశలప్రశ్నలు అన్నీ అయిపోయాక, అమ్మాయి తండ్రి నెమ్మదిగా అసలు విషయం మొదలుపెట్టారు:


ఇంతకీ మీ అబ్బాయి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?"


అప్పారావు కళ్ళద్దాలు సరిచేసుకుని, గొంతు సవరించుకుని, ఇలా చెప్పడం మొదలు పెట్టేడు.


మా వాడు ప్రస్తుతం ఒక అగ్రో-బేస్డ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ (Agro-based D2C) స్టార్టప్ కి ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. 


మేము ప్రధానంగా ఆర్గానిక్ హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో డీల్ చేస్తున్నాము అన్నాడు.


ఇది వినగానే అమ్మాయి తండ్రి సగం ఇంప్రెస్ అయిపోయాడు. 


 "వావ్! ఇంతకీ మీ ప్రొడక్ట్ ఏంటి?" అన్నాడు.


అప్పుడు అప్పారావు 


"మావాడి పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా హై-ప్రోటీన్ రోస్టెడ్ లెగ్యూమ్స్ (Roasted Legumes) మరియు సాంప్రదాయకమైన కారమెలైజ్డ్ స్వీట్స్ ఉంటాయి.


మేము ముడి పదార్థాలను నేరుగా హోల్ సేల్ సప్లై చైన్ నుండి సేకరించి, మా స్వంత థర్మల్ ప్రాసెసింగ్ యూనిట్ లో డ్రై-రోస్ట్ చేస్తాము.


అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. మా ప్యాకేజింగ్ 100% 

పర్యావరణహితమైనది మరియు బయోడిగ్రేడబుల్!" అన్నాడు.


అమ్మాయి కుటుంబ సభ్యులు ఇదంతా విని ఆశ్చర్యపోయారు. వీరిది ఏదో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలా అనిపించింది వాళ్లకి!



అమ్మాయి బాబాయ్ తట్టుకోలేక  "ఇంతకీ మీ కంపెనీ మెయిన్ ఆఫీస్ ఎక్కడ? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు?"



అప్పారావు తడుముకోకుండా


ఇప్పుడు అంతా. ఆధునిక లీన్ స్టార్టప్ (Lean Startup) యుగం. 


అందుకే షాపు అద్దెలు, కరెంటు బిల్లుల వంటి అనవసర ఖర్చులు మేము చేయము. 


మాకు ఒక మొబైల్ రిటైల్ అవుట్‌లెట్ ఉంది, ట్రాఫిక్ మరియు జనం రద్దీని బట్టి అది రోజుకో చోట ఉంటుంది. ఇక ఆపరేషన్స్ అంతా మా అబ్బాయే చూసుకుంటాడు — హి ఈజ్ ఏ సోలోప్రెన్యూర్ (Solopreneur)!" అన్నాడు.



అమ్మాయి తండ్రికి పూర్తిగా మతిపోయింది. ఈ ఇంగ్లీష్ తన బుర్రకి అస్సలు ఎక్కడం లేదు.


అయ్యా "నాకీ మార్కెటింగ్ భాష సరిగ్గా అర్థం కావడం లేదు. అసలు అబ్బాయి ఏం చేస్తాడో మామూలు మాటల్లో చెబుతారా?"అన్నాడు.


అప్పుడు అబ్బాయి పక్కనే ఉన్న  ప్రాణస్నేహితుడు మెల్లగా నోరు విప్పాడు:


"అంకుల్.. ఆయన చెప్పేది ఏంటంటే.. మా వాడు హైవే పక్కన, 

బండి మీద వేయించిన వేరు శనగ కాయలు, అమ్ముతాడు.


పెనం మీద ఇసుకలో శనగలు వేయిస్తాడు (థర్మల్ ప్రాసెసింగ్).. వాటిని పాత న్యూస్ పేపర్ కాగితాల్లో చుట్టి ఇస్తాడు (బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్)


అమ్మాయి తండ్రి  చేతిలో టీ కప్పు దబాలున నేల మీద పడి ముక్కలైంది.


Of course పెళ్లి చూపులు ఏమై ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా


నీతి: మార్కెటింగ్ పదాల మాయాజాలం చాలా శక్తివంతమైనది. మీ ప్రెజెంటేషన్ గనుక బలంగా ఉంటే, ఒక వేరుశనగ బండి వ్యాపారం  కూడా కార్పొరేట్ స్టార్టప్‌లా చూపించవచ్చు.


వైరల్ అవుతున్న ఒక ఆంగ్ల కథకు తెలుగు స్వేచ్ఛానువాదం.-Marketing at its  best...