31, ఆగస్టు 2026, సోమవారం

పవిత్రమైన_బృందావనం_మంత్రాలయం

  🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️


పవిత్రమైన_బృందావనం_మంత్రాలయం...

(రాఘవేంద్ర స్వామి ఆరాధన దినోత్సవ సందర్భంగా)

అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్రస్వామి ప్రత్యక్షంగా అవతరించి, వేంచేసిన దివ్య స్థలం మంత్రాలయం. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి, ప్రతీతి. అవేమిటంటే..


#పాదోదకం... #పావనం

రోజూ రాఘవేంద్ర స్వామి మూల బృందావ నానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరి మందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ ఏడు వందల సాల గ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులూ ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఒకసారి రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు, సాల గ్రామాలకు అభి షేకాలు చేసినట్టు అవుతుంది. అలాంటి జలం అత్యంత పవిత్రమైనది. చాలా వ్యాధులను ఈ మంత్ర జలం నివారిస్తుందని చెబుతారు. ఈ పాదోదకాన్ని తాగడానికి మాత్రమే కాకుండా భక్తులపై ప్రోక్షణం కూడా చేస్తారు. దీనివల్ల పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.


#మంత్రాక్షితల

రాఘవేంద్రస్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షితల కోసం బారులు తీరుతారు. ఈ అక్షింతల్లో పసుపు, సున్నం కలుపు తారు. అందుకే ఇవి ఎర్రగా ఉంటాయి. రాఘ వేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షింతలను ఇచ్చే సంప్రదాయం రాఘ వేంద్ర స్వామి కాలం నుంచి కొనసాగుతోంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రల్లోనే నేటికీ వాటిని తయారు చేసి భక్తులకు ఇస్తుండటం విశేషం. మఠంలో అంత పవిత్రతను కాపాడు కుంటూ వస్తున్నారు.


#మృత్తిక_మహిమ

రాఘవేంద్రస్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్టమైనదని నమ్మకం. దీని విష యంలో ఒక కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు, ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నా కుమారుడి ఉపనయనానికి ధనం కావాలి’ అని అడిగాడు. ఆ సమయంలో స్వామి తుంగభద్ర నడి ఒడ్డున స్నానం కోసం ఉన్నారు. రోజూ మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని ఆ భక్తుడు తీసుకుని వెళ్తూ దారి తప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడు గురు రాఘ వేంద్రుడు ఇచ్చిన మృత్తిక సాయంతో ఓ ధన వంతుడి సంతానాన్ని హరిస్తున్న పిశాచిని ఆ భక్తుడు హరిస్తాడు. అప్పుడా ధనవంతుడు సంతో షంతో ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను నేటికీ మంత్రా లయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం ఏర్పాటు చేశారు. ఏటా ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరే గింపుతో తెచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్ర స్వామి ఆలయాల స్థాపనకు ఈ మృత్తికను వినియోగి స్తారు. అలాగే ఈ మృత్తికను భక్తులు తీసుకెళ్లి ఇళ్లలో ఉంచుకుంటారు. 


#మంచాలమ్మ_దర్శనం

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో బృందావనం ప్రవేశం చేయక ముందు అమ్మవారిని దర్శించి ‘నేను ఇక్కడే కొలువై ఉంటాను. ముందుగా నీకు నైవేద్యం, దర్శనం అయిన తరువాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారు’ అని చెప్పినట్టు మఠం పండితులు చెబుతారు


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️

మంగళవారం*🍁 *🌹01సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

🍁 *మంగళవారం*🍁

*🌹01సెప్టెంబర్26🌹*  

 *దృగ్గణిత పంచాంగం*       

           

        *స్వస్తి శ్రీ పరాభవ* 

       *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : చవితి* ఉ 07.41 వరకు ఉపరి *పంచమి*

*వారం   : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : అశ్విని* రా 02.42 వరకు ఉపరి *భరణి* 

*యోగం  : వృద్ధి* రా 11.39 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం   : బాలువ* ఉ 07.41 *కౌలువ* సా 06.59 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*మ12.00-01.00 సా05.00-06.00*

అమృత కాలం  : *రా 07.42 - 09.15*

అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.32*

*వర్జ్యం          : రా 10.49 - 12.22*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.13 రా 10.58 - 11.44*

*రాహు కాలం :మ03.14 - 04.47*

గుళికకాళం      : *మ 12.07 - 01.41*

యమగండం    : *ఉ 09.01 - 10.34*

సూర్యరాశి : *సింహం*                

చంద్రరాశి : *మేషం*   

సూర్యోదయం :*ఉ 06.02*  

సూర్యాస్తమయం :*సా 06.39*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.54-08.23*

సంగవ కాలం        : *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53 - 01.22*

అపరాహ్న కాలం  : *మ 01.22-03.51*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ పంచమి*

సాయంకాలం    : *సా 03.51 - 06.21*

ప్రదోష కాలం     : *సా 06.21 - 08.39*

రాత్రి కాలం       : *రా 08.39 - 11.44*

నిశీధి కాలం       : *రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

31ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

 *🌹31ఆగష్టు2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

                       

         *ఈనాటి పర్వం*    

              *ప్రధాన* 

     *సంకష్టహర చతుర్థి*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : తదియ* ఉ 08.50 వరకు ఉపరి *చవితి*

*వారం   :సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : రేవతి* రా 03.23 వరకు ఉపరి *అశ్విని*

*యోగం  : గండ* రా 01.51 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం   : భద్ర* ఉ 08.50 *బవ* రా 08.19 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ06.00-07.00&11.00- 12.00*

అమృత కాలం  : *రా 01.01 - 02.36*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం       : మ 03.34 - 05.08*

*దుర్ముహూర్తం  : మ 12.33 - 01.22 & 03.02 - 03.52*

*రాహు కాలం: ఉ 07.27 - 09.01*

గుళికకాళం      : *మ 01.41 - 03.14*

యమగండం    : *ఉ 10.34 - 12.08*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *మీనం* 

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.31*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 05.5 -08.23*

సంగవ కాలం        : *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53 - 01.22*

అపరాహ్న కాలం : *మ 01.22- 03.52*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ చవితి*

సాయంకాలం   : *సా 03.52 - 06.21*

ప్రదోష కాలం     : *సా 06.21 - 08.40*

రాత్రి కాలం       : *రా 08.40 - 11.45*

నిశీధి కాలం      :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

భగవద్గీత

 

--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।

అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।



ప్రతిపదార్థ:


 

ప్రయత్నాత్ — కఠిన కృషితో; యతమానః — పరిశ్రమిస్తూ; తు — మరియు; యోగీ — ఒక యోగి; సంశుద్ధ — పరిశుద్ధుడై; కిల్బిషః — ప్రాపంచిక కోరికల నుండి; అనేక జన్మ — చాలా చాలా జన్మల అనంతరం; సంసిద్ధః —పరిపూర్ణ సిద్ధిని సాధించును; తతః — అప్పుడు; యాతి — పొందును; పరాం — అత్యున్నత; గతిమ్ — గతి.



తాత్పర్యము: 



అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (స్వేచ్ఛ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.



వివరణ:


ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని, తెరచాపని ఎగిరేస్తారు. శ్రీ కృష్ణుడు ‘ప్రయత్నాద్ యతమానస్తు’ అన్న పదాలు వాడుతున్నాడు, అంటే, ‘ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం.’ 'తు' అన్న పదం - వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం, వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది - అని సూచిస్తుంది.


ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండీ వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడుతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది, కానీ శ్రీ కృష్ణుడు అంటున్నాడు: 'అనేకజన్మసంసిద్ధః', ‘యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము.’ అని.

పంచాంగం 31.08.2026 Monday,

 ఈ రోజు పంచాంగం 31.08.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష తృతీయ తిథి ఇందు వాసర రేవతి నక్షత్రం గండ యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: చతుర్థి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత-

 

--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ।। 46 ।।



ప్రతిపదార్థ:



తపస్విభ్యః — తపస్విల కన్నా; అధికః — ఉన్నతమైన వాడు; యోగీ — ఒక యోగి; జ్ఞానిభ్యః — జ్ఞానవంతుల కన్నా; అపి — కూడా; మతః — పరిగణించబడును; అధికః — ఉన్నతమైనది; కర్మిభ్యః — కర్మ కాండలు చేసే వారి కన్నా; చ — మరియు; అధికః — ఉన్నతమైనది; యోగీ — ఒక యోగి; తస్మాత్ — కాబట్టి; యోగీ — ఒక యోగి; భవ — అయిపో; అర్జున — అర్జునా.



తాత్పర్యము: 


ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.



వివరణ:


 తపస్వి అంటే, మోక్ష ప్రాప్తి సాధనకి సహాయంగా, తనకు తానే శారీరిక నిష్ఠలు విధించుకొని, తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంబిస్తూ, ఇంద్రియ సుఖాలకు దూరంగా, భౌతిక సంపత్తి ఏమీ కూడబెట్టక ఉండే వాడు. జ్ఞాని, అంటే చురుకుగా ప్రయత్నపూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మీ అంటే, భౌతిక సంపత్తి కోసం, స్వర్గాది లోక ప్రాప్తి కోసం వైదిక కర్మకాండలు ఆచరించే వాడు. వీరందరి కన్నా యోగియే శ్రేష్ఠుడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనికి కారణం చాలా సరళమైనది. కర్మీ, జ్ఞాని, మరియు తపస్విల యొక్క లక్ష్యం భౌతిక వస్తువిషయ ప్రాప్తి; వారు ఇప్పటికీ శారీరిక దృక్పథంలోనే ఉన్నట్టు. యోగి, భౌతిక పురోగతి కోసం పాటు పడట్లేదు, భగవత్ ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే యోగి సాధించేది ఆధ్యాత్మికమైనది మరియు యోగి వీరందరి కన్నా ఉన్నతమైనవాడు.

30, ఆగస్టు 2026, ఆదివారం

మహాభారతంలోనిశల్య వృత్తాంతం

 *🌸మహాభారతంలోనిశల్య వృత్తాంతం

శల్యుడు


 మద్రదేశానికి రాజు.ఇతడు నకులుడు మరియు సహదేవునికి మేనమామ.పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి తన సైన్యంతో బయలుదేరినప్పుడు,దుర్యోధనుడు మార్గమధ్యంలో అతిథి సత్కారాలు చేయించి,అవి తానే చేయించినవని తెలియకుండా శల్యుని మెప్పించాడు.సంతోషించిన శల్యుడు కోరిన వరం ఇస్తానని మాట ఇచ్చాడు.అప్పుడు దుర్యోధనుడు తన పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాలని కోరాడు.ఇచ్చిన మాటకు కట్టుబడి శల్యుడు కౌరవుల పక్షాన చేరాడు.

కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడు ఎంతో పరాక్రమంతో పోరాడాడు.ముఖ్యంగా కర్ణునికి సారథిగా వ్యవహరించాడు.అయితే శల్యుడు పాండవుల పట్ల అంతరంగంలో సానుభూతి కలిగి ఉండేవాడు.అందువల్ల కర్ణుని ఉత్సాహాన్ని తగ్గించే విధంగా మాటలు చెప్పేవాడు.కర్ణుడు,అర్జునుడు తలపడిన సమయంలో కూడా శల్యుడు కర్ణునికి పూర్తిగా సహకరించలేదు.చివరకు కర్ణుడు మరణించిన తరువాత,దుర్యోధనుడు శల్యునిని కౌరవ సేనకు సేనాధిపతిగా నియమించాడు.

యుద్ధం చివరి దశలో ధర్మరాజు శల్యునితో భీకరంగా యుద్ధం చేశాడు.ఇద్దరి మధ్య ఘోరమైన పోరు జరిగింది.చివరకు ధర్మరాజు తన శక్తివంతమైన ఆయుధంతో శల్యుని సంహరించాడు.ఈ విధంగా మహాభారత యుద్ధంలో శల్యుడు ఒకవైపు గొప్ప వీరుడిగా,మరోవైపు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు.కర్ణునికి సారథిగా అతని పాత్ర,ధర్మరాజుగారి చేతిలో అతని మరణం శల్య వృత్తాంతంలో ముఖ్యమైన ఘట్టాలు.

 *మహాభారత పాత్ర (శల్యుడు):* మద్ర దేశాధిపతి,మాద్రికి సోదరుడు (నకుల సహదేవుల మేనమామ).కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున కర్ణుడికి రథసారథిగా వ్యవహరించి,తన మాటలతో కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు.దీని నుంచే *"శల్య సారథ్యం"* అనే జాతీయం వాడుకలోకి వచ్చింది


సేకరణ

శ్రీమద్భాగవతం - 35/42*

 


*శ్రీమద్భాగవతం - 35/42* 


*మధురా ప్రవేశం మరియు కంస సంహారం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో భాగంగా నిన్న శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరానికి బయలు దేరాడు ఈరోజు మధురా ప్రవేశం కంస సంహారం జరుగుతుంది.


1. మధురా నగర ప్రవేశం & భక్తుల అనుగ్రహం


రామకృష్ణులు నందాది గోపబాలురు మధురా నగరం దగ్గర గల ఉపవనం లో బస చేసారు, ఇష్టం లేకపోయినా అక్రూరుడు కృషుణ్ణీ వీడి ముందుగా నగరంలోకి వెళ్ళి కంసునికి విషయం తెలియచేసి తన నివాసానికి వెళ్ళాడు.


ఆ తర్వాత రోజు నగర సౌందర్యం చూడటానికి గోపాలురు, బల రామకృష్ణులు నగరంలోకి ప్రవేశించారు.ఇన్ని రోజులు 

ఆ నగర వనితలు కృష్ణభగవానుని లీలామహత్త్వములను గూర్చి పదేపదే వినుచు ఆయన దర్శనమునకై తమ మనస్సులలో ఎంతో తహతహపడుచుండిరి. ఇప్పుడు ఆ స్వామిని ప్రత్యక్షముగా దర్శించుటతోవారిలో సంతోషము పొంగులువారింది.ఆనందంతో నగర స్త్రీలంతా మేడలపైకి ఎక్కి వారిపై పూలవాన కురిపించారు.


గోపికలు నిజముగా ఎంత ధన్యాత్మలోగదా! మానవాళికి పరమానందదాయకులైన ఈ మహానుభావులను నిత్యము దర్శించెడి భాగ్యమునకు నోచుకొనిన ఆ గోపవనితలు ఎంతటి తపస్సులను ఆచరించిరోయేమో అని తమలో తాము అనుకున్నారు.


ఇంతలో వస్త్రములను శుభ్రముగా ఉతికేవాడు, వాటికి రంగులు అద్దె వాడైన ఒక చాకలి శ్రీకృష్ణునకు కనబడెను. అప్పుడు ఆ స్వామి, 'మేలైన ఉతికిన వస్త్రములను ఇమ్ము' అని అడుగుచు అతనితో ఇట్లనెను- “మిత్రమా! అర్హులమైన మా ఉభయులకును కొన్ని మంచి వస్త్రములను ఇమ్ము. గుడ్డలను ఇచ్చినందున నీకు చక్కని శ్రేయస్సు కలుగును. ఇది ముమ్మాటికిని నిజము”.అన్నాడు


కానీ కంసుని రాజవస్త్రాలు ఉతికే ఆ చాకలివాడు (రజకుడు) అహంకారంతో అడవులలో, గుట్టల్లో తిరిగే గోపాలులారా మీకు మేలైన వస్త్రాలు కావాలా, కళ్ళు నెత్తికి ఎక్కాయా ఇవి రాజులు ధరించే వస్త్రాలు అంటూ యుక్తాయుక్తములు మరచి ఇష్టారీతిన పలుకుతూ 

అవమానించగా కృష్ణుడు అరచేతి దెబ్బతో వాడి శిరస్సును ఖండించాడు. 


ఇతర సేవకులు ఉత్తమ వస్త్రాలను అందించగా, దర్జీవాడు (వాయకుడు) వాటిని రామకృష్ణులకు తగినట్లు కుట్టి అలంకరించి భగవదనుగ్రహం పొందాడు.


*సుదాముడనే మాలాకారుడు*

అనంతరం బలరామ కృష్ణులు పూల వ్యాపారియైన సుదాముడు ఇంటికి వెళ్ళారు.అతను రామకృష్ణులను భక్తితో తన ఇంటికి ఆహ్వానించి, దివ్యమైన పూలమాలలతో పూజించి సాష్టాంగ నమస్కారం చేసి సేవించాడు. స్వామి ఆయనకు అచంచల భక్తిని, వంశాభివృద్ధిని వరంగా ఇచ్చాడు.


*కుబ్జ (త్రివక్ర)కు సౌందర్య ప్రదానం*

శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిదప రాజమార్గం గుండా సాగిపోవుతూ ఒక యువతిని చూసాడు.


ఆమె మూడు వంకర్లు తిరిగిన శరీరంతో (కుబ్జ), కంసునికి సుగంధ లేపనాలు తీసుకువెళ్తున్న 'సైరంధ్రి' అనే యువతి. కృష్ణుడు ఆమెను ఆపి చందనం అడిగాడు. ఆమె పరవశించి తన వద్దనున్న దివ్య చందనాన్ని రామకృష్ణులకు పూసింది. కృష్ణుడు ఆమె కాలి బొటనవేలుపై తన పాదం ఉంచి, గడ్డం కింద రెండు వేళ్లు పెట్టి పైకి ఎత్తగానే... ఆమె వంకరలు అన్నీ పోయి అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది. శ్రీకృష్ణునీ ఆమె గృహానికి రమ్మనగా ఆమెను సమాధాన పరచి ముందుకు సాగుతూ ధనుర్యాగ స్థానం తెలుసుకుని అందులో ప్రవేశించాడు.


2. శివ ధనుర్భంగం


కంసుడు ఏర్పాటు చేసిన 'ధనుర్యాగ' శాలకు రామకృష్ణులు వెళ్లారు. అక్కడ పూజలందుకుంటున్న మహా భయంకరమైన, ఇంద్రధనుస్సు వంటి శివధనుస్సును చూశారు.


అనేకమంది కావలిభటులు వారిస్తున్నా వినకుండా, శ్రీకృష్ణుడు ఆ భారీ ధనుస్సును సమీపించి ఒక చిన్న చెరకుగడను విరిచినట్లు అలవోకగా ఎత్తి నారి సంధించి మధ్యకు విరిచివేశాడు!


* **కంసుని భయం:** 

ధనుస్సు విరిగినప్పుడు వచ్చిన భయంకర శబ్దానికి మధురా నగరమే కంపించింది.కంసుని గుండెలు పగిలినంత పనైంది. ధనుస్సును కాపలా కాస్తున్న సైనికులు రామకృష్ణులపై దాడి చేయగా, విరిగిన ధనుస్సు ముక్కలతోనే వారిని సంహరించి రామకృష్ణులు సాయంత్రానికి నగరం వెలుపల ఉన్న తమ శిబిరానికి చేరుకున్నారు.


3. కువలయాపీడ గజ సంహారం & రంగాగ్ర ప్రవేశం

బలరామ కృష్ణులు అవలీలగా ధనుస్సు విరిచి, బటులను సంహరించిన సంగతి విన్నది మొదలు కంసుడి భయం రెట్టింపు అయినది,ఆ రాత్రి నిద్రకూడా పట్టలేదు, కనులు మూసిన తెరచిన మృత్యువును సూచించే అపశకునాలే కనపడ్డాయి. ఎలాగో ఆ రాత్రి గడిచింది.


మరుసటి రోజు ఉదయం కంసుడు మల్లయుద్ధ రంగాన్ని సిద్ధం చేసి, సింహాసనంపై కూర్చున్నాడు. రంగద్వారం వద్ద రామకృష్ణులను తొక్కించి చంపడానికి **'కువలయాపీడము'** అనే మదపుటేనుగును మావటివానితో నిలబెట్టాడు.


శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతః కాలస్నానాది విధులను నిర్వర్తించుకొని.మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.రంగస్థల ద్వారం దగ్గరకు రాగానే అక్కడ కువలయా పీడం అనే ఏనుగును చూసాడు కృష్ణుడు 


గజ సంహారం:ఆ ఏనుగు కృష్ణునిపైకి మావటి ప్రేరణతో దూసుకురాగా, స్వామి దాని తోకను పట్టుకుని తిప్పి, దాని దంతాలను పెకిలించి ఆ దంతంతోనే ఏనుగును, మావటివాడిని సంహరించాడు.


రక్తసిక్తమైన ఏనుగు దంతాన్ని భుజాన ధరించి రామకృష్ణులు మల్లరంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నవారికి రకరకాల భావాలతో దర్శనమిచ్చాడు:


మల్లురకు **వజ్రాయుధంలా**, పురుషులకు **నరశ్రేష్ఠుడిగా**, స్త్రీలకు **మన్మథునిగా**, గోపాలురకు **మిత్రుడిగా**, కంసునికి **సాక్షాత్తు మృత్యువులా**, యోగులకు **పరతత్త్వంగా** కనిపించాడు.


4. చాణూర-ముష్టిక వధ & కంస సంహారం

కంసుడు ఎంతో దైర్యం కలవాడే కానీ, అత్యంత శక్తివంతమైన కువలయా పీడం కూడా కృష్ణునీ చేతిలో మడిసిపోవడంతో అతనిలో భయం రెట్టింపు అయినది.


అప్పుడు ప్రసిద్ధ మల్ల యోధులు అయిన చానూర, ముష్టికులను బలరామకృష్ణులతో మల్ల యుద్ధానికి ఉసి గోల్పెల చేయమని ఆదేశించాడు.


ప్రసిద్ధ మల్లురైన చాణూరుడు కృష్ణునితో, ముష్టికుడు బలరామునితో మల్లయుద్ధానికి దిగారు.


* **మల్లయుద్ధం:** చిన్న బాలురతో భారీకాయులైన రాక్షసులు పోరాడటం చూసి సభలోని స్త్రీలు "ఇది అధర్మం" అని బాధపడ్డారు. కానీ శ్రీకృష్ణుడు చాణూరుని చేతులను పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరించాడు. బలరాముడు ముష్టికుడిని పిడిగుద్దులతో చంపేశాడు. కూటుడు, తోశలకుడు మొదలైన ఇతర రాక్షస మల్లురంతా సంహరించబడ్డారు.ప్రాణములమీది తీపిచే, బ్రతుకుజీవుడా యనుచు శరవేగముతో మిగతా మల్లురు పిక్కబలము చూపిరి.  


ప్రత్యర్థులైన మల్లురను మట్టిగఱపించిన బలరామకృష్ణులు తమ మిత్రులగు గోపాలురను చేరబిలిచిరి. ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలురతోగూడి నృత్యము లొనర్చిరి. అప్పుడు వారి కాలి అందెల రవళులు మధురముగా నినదించెను. 


* **కంస వధ:** 

ఇది చూసి భయపడిన కంసుడు పిచ్చివాడిలా లేచి: "ఈ బాలురను నగరం నుండి వెళ్ళగొట్టండి! నందుని సంపదను లాక్కోండి! అతడినిబంధించండి;వసుదేవుని, ఉగ్రసేనుడిని చంపండి!"వాధ్యములు ఆపండి అని అరిచాడు.


కంసుడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండగానే కోపంతో

కంసుని మాటలు పూర్తికాకముందే శ్రీకృష్ణుడు ఒక్క ఉదుటున ఎగిరి కంసుని ఎత్తైన సింహాసనంపైకి లంఘించాడు.కంసుడు కత్తి దూసి ఎదిరించే ప్రయత్నం చేశాడు కానీ ఒడుపుతో కంసుని కిరీటాన్ని తన్ని, ఆయన జుట్టును గట్టిగా పట్టుకుని రంగస్థలంపైకి విసిరికొట్టాడు.


* **ప్రాణాపహరణం:** అక్కడి నుండి కంసుని గుండెలపై దూకి ఒక్క గుద్దు గుద్దగానే కంసుడు రక్తాలు కక్కి ప్రాణాలు విడిచాడు. నిరంతరం భయంతోనైనా కృష్ణుడినే ధ్యానించినందువల్ల కంసునికి సారూప్య ముక్తి లభించింది.


అప్పుడు కంసుని సోదరులైన కంకుడు, న్యగ్రోధుడు మొదలగువారు ఎనిమిదిమంది మిక్కిలి క్రుద్ధులై తమ అన్న ఋణము తీర్చుకొనగోరి (అన్నను హతమార్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకై) ఆ బలరామకృష్ణుల మీదికి దాడిచేసిరి. 


అలా దూసికొనివచ్చుచున్న కంకాదులను జూచి, బలరాముడు ఇనుపకట్ల గుదియను చేబూని, సింహము పశువులను వలె వారిని అందఱిని సంహరించెను. 


అప్పుడు శ్రీహరియొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పూవులను చల్లుచు ప్రశంసలను కురిపించిరి. ఆకాశమున దుందుభులు మ్రోగెను. అప్సరసలు నృత్యములొనర్చిరి.


రాజ పత్నులు అక్కడికి చేరి గుండెలు బాదుకుని ఏడ్చారు.శ్రీకృష్ణుడు దుఃఖితలైయున్న ఆ రాజపత్నులను అనునయ వచనములతో ఓదార్చెను. మృత్యువుపాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తరక్రియలను జరిపించెను


5. తల్లిదండ్రుల విముక్తి & ఉగ్రసేన పట్టాభిషేకం

కంస వధ అనంతరం రామకృష్ణులు కారాగారానికి వెళ్లి, తమ తల్లిదండ్రులైన దేవకీ-వసుదేవుల కాళ్లకు ఉన్న సంకెళ్లను తొలగించి వారి పాదాలకు ప్రణమిల్లారు. దేవకీ వసుదేవులు ఆనందబాష్పాలతో బిడ్డలను గుండెలకు హత్తుకున్నారు.(దేవకి వసుదేవులు ఇంతకాలం కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని ఉపాసించారు, ఇప్పడు ఆ భావం ఉంటే పుత్ర వాత్సల్యం చూపలేరు అని మాయ చేత వారి నుండి ఆ భావం తొలగించి పుత్ర ప్రేమ పెట్టాడు)


* **ఉగ్రసేనునికి రాజ్యం:** కృష్ణుడు స్వయంగా రాజ్యాధికారాన్ని చేపట్టకుండా, కారాగారంలో ఉన్న కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజును విడుదల చేసి, యదువంశానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు.


శ్రీకృష్ణుడు (శ్రీహరి) విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పాఱిపోయిన యదు, వృష్టి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులను అందఱిని ఆ ప్రభువు మధురకు పిలిపించెను. ఇంతవఱకును కాందిశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారినందఱిని సగౌరవముగా ఆహ్వానించి, ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపఱచి, వారివారి గృహములలో నివసింపచేసెను. 


శ్రీకృష్ణబలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీఱిపోయెను, మనోరథములన్నియును ఈడేరెను. ఆ నందకుమారుల బాహు బలచ్చాయలో వారు సురక్షితులై యుండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందఱును తమ తమ గృహములలో హాయిగా నుండిరి. 


*నందునికి వీడ్కోలు*

పిమ్మట కృష్ణభగవానుడు, బలరాముడు నందగోపునిజేరి, ఆయనను కౌగిలించుకొని,తండ్రీ! నీవును, తల్లి యశోదయు, మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి, పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణములకంటెను మిన్నగా చూచుకొందురు. అందు ఏమాత్రమూ సందేహము లేదు.  


కన్న తల్లిదండ్రులును, తదితర బంధువులును తమ శిశువులను పోషించుటకును, రక్షించుటకును (లాలన, పాలనలకు) వీలుకాని పరిస్థితులలో వదలివేసినప్పుడు, వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించిన వారే. నిజమైన తల్లిదండ్రులు. 


నాయనా! ఇక మీరు వ్రజభూమికి వెళ్లిరండు. మేము మీ యెదుట లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో | సుఖసంతోషములను గూర్చిన పిదప, మారాకకై అనుక్షణము నిరీక్షించుచు తపనపడుచుండెడి మీ అందఱిని చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము”. అని చెప్పి..


కృష్ణభగవానుడు నందునకును, తదితర వ్రజవాసులకును ఈవిధముగా ఊఱటగూర్చి, వస్త్రాభరణములను, కంచుపాత్రలను సమర్పించి, వారిని సాదరముగా పూజించెను. ఎంతో బాధతో నందుడు వారిని వీడ్కోనీ వ్రజ భూమికి చేరాడు.


* **గురుకుల ప్రవేశం:** 

ఇదివఱలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగుకొనియుండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలియైన (ధర్మబుద్ధిగల) వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి యుండెను. 


ఆ సంకల్పమును అనుసరించి, కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేశాడు . 


యదువంశమునకు ఆచార్యుడైన (పురోహితుడైన) గర్గమహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహామునినుండి గాయత్రీ మంత్రోపదేశమును పొందిన పిమ్మట సోదరులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింపదొడగిరి.


అనంతరం బలరామకృష్ణులు అవంతి నగరంలోని **సాందీపని మహర్షి** వద్దకు వెళ్లి కేవలం అరవై నాలుగు (64) రోజులలో సమస్త వేదాలు, వేదాంగాలు, 64 కళలను అభ్యసించారు. 


గురుదక్షిణ సమర్పిస్తాను అని వారు అడగగా వీరి అపార మహిమలు ఎరిగిన సాందీపని ముని ప్రభాస తీరంలో సముద్రంలో మునిగిపోయిన పుత్రుడినీ బ్రతికించి ఇవ్వండి అన్నాడు.


బలరామ కృష్ణులు ఇద్దరూ సరే అని ప్రభాస తీర్థం కి వెళ్ళి సాగరా నీ ఉత్తుంగ తరంగాల లో మా గురు పుత్రుని దాచావు మాకు ఇవ్వు అని ఆదేశిస్తే, కృష్ణ పంచజనుడు అనే రాక్షసుడు మీ గురు పుత్రుని అపహరించాడు అని చెపితే, సముద్రంలోకి ప్రవేశించి వాడిని సంహరించాడు కానీ వాడి ఉదరంలో గురు పుత్రుడు లేడు కానీ పాంచజన్యం అనే శంఖం వాడి శరీరం నుండి పుట్టింది దాన్ని తీసుకుని, యమ లోకానికి వెళ్ళి శంఖం పూరించాడు. యముడు శ్రీకృష్ణునీ గుర్తించి సేవించి గురు పుత్రుని ఇచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఆ బాలుని తీసుకుని గురువుకు అప్పగించి గురువర్య ఇంకా ఏమి కావాలో తెలుపండి అని వినయంగా అడిగాడు.


గురువు వారిని ఆశీర్వదించి, నాయనా మీ కీర్తి అజరామరం, సమస్త లోకాల్లో మీకు తిరుగుండదు అని ఆశీర్వదించి పంపాడు.వారు రథాలపై ఎక్కి తిరిగి మధురకు చేరుకున్నారు.


📝 నేటి ముఖ్య విషయాలు:


1. **భావగ్రాహీ జనార్దనః:** పత్రం, పుష్పం, ఫలం, తోయం... లేదా కుబ్జ సమర్పించిన చందనం, సుదాముడు ఇచ్చిన పూలమాల అయినా సరే నిష్కల్మష భక్తితో సమర్పిస్తే భగవంతుడు సర్వస్వాన్నీ అనుగ్రహిస్తాడు.


2. **అధర్మ నాశనం:** బలవంతుడైన కంసుడు ఎంతటి భద్రతలను ఏర్పాటు చేసుకున్నా, అధర్మ మార్గంలో నడిచినందువల్ల భగవత్ సంకల్పం ముందు క్షణంలో నేలకూలాడు.


3. **నిస్వార్థ ధర్మం:** కంసుడిని చంపినప్పటికీ శ్రీకృష్ణుడు సింహాసనాన్ని ఆశించక, ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేయడం ద్వారా నిస్వార్థ ప్రజాపాలనా ధర్మాన్ని చాటాడు.


రేపు ఉద్ధవ గీత వస్తుంది వేచి ఉండండి శ్రీకృష్ణ శరణం మమ 


.....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

29, ఆగస్టు 2026, శనివారం

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు -

 ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు  - 


 

 *  బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 


 *  గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు  వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును. 


 *  బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను. 


 *  బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును. 


 *  స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను. 


 *  బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను. 


 *  కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర 

ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి . 


 *  ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు . 


 *  మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు . 


  బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు  -


 

 *  ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు. 


 *  చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.


 *  పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు. 


 *  చల్లటి పదార్దాలు ముట్టరాదు. 


    పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి 

30ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞       

 *🌹30ఆగష్టు2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం -  బహుళ పక్షం* 


*తిథి      : విదియ* ఉ 09.36 వరకు ఉపరి *తదియ*

*వారం   :ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : ఉత్తరాభాద్ర* రా 03.44 వరకు ఉపరి *రేవతి*

*యోగం  : శూల* రా 03.46 వరకు ఉపరి *గండ*

*కరణం   : గరజి* ఉ 09.36 *వణజి* రా 09.17 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 09.00 మ 03.30 - 04.30*

అమృత కాలం  : *రా 10.56 - 12.32*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం         : మ 01.19 - 02.55*

*దుర్ముహూర్తం : సా 04.42-05.32*

*రాహు కాలం  : సా 04.49-06.22*

గుళికకాళం    : *మ 03.15- 04.49*

యమగండం    : *మ 12.08 - 01.41*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.02*  

సూర్యాస్తమయం :*సా 06.31*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం      :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53 - 01.23*

అపరాహ్న కాలం  : *మ 01.23- 03.52*

*ఆబ్ధికం తిధి      : శ్రావణ బహుళ తదియ*

సాయంకాలం   : *సా 03.52 - 06.22*

ప్రదోష కాలం      : *సా 06.22- 08.40*

రాత్రి కాలం         : *రా 08.40- 11.45*

నిశీధి కాలం       : *రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     🌞 *సూర్య నమస్కారం*🌞    


             *చేసేటప్పుడు* 

   🙏 *పఠించవలసిన శ్లోకం*🙏 


బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే మహేశ్వరమ్ సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ 

ప్రాతర్భజామి సవితార మనంత శక్తిమ్ 

పాపౌఘశత్రు భయరోగ హరం పరంచ 

తం సర్వలోక కలనాత్మక కాలమూర్తిమ్ 

సంసార బంధన విమోచన మాది దేవమ్


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

29ఆగష్టు2026

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     🍁 *శనివారం*🍁

 *🌹29ఆగష్టు2026🌹*    

  *దృగ్గణిత పంచాంగం*               


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి : పాడ్యమి* ఉ 09.56 వరకు ఉపరి *విదియ*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 03.42 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : సుకర్మ* ఉ 06.36 ఉపరి *ధృతి* పూర్తిగా *రోజంతా*

*కరణం  : కౌలువ* ఉ 09.56 *తైతుల* రా 09.50 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 07.32 - 09.10*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    :ఉ 09.45 - 11.22*

*దుర్ముహూర్తం  :ఉ05.54-07.34*

*రాహు కాలం   :ఉ09.01 - 10.35*

గుళికకాళం      : *ఉ 05.54 - 07.27*

యమగండం    : *మ 01.42 - 03.16*

సూర్యరాశి : *సింహం*            

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.02*  

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.54 -08.23*

సంగవ కాలం        : *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53- 01.23*

అపరాహ్న కాలం : *మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి      : శ్రావణ బహుళ విదియ*

సాయంకాలం    : *సా 03.53- 06.23*

ప్రదోష కాలం    : *సా 06.23 - 08.42*

రాత్రి కాలం        : *రా 08.41 - 11.45*

నిశీధి కాలం       : *రా 11.45- 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


*🙏ఓం నమో వేంకటేశాయ నమః🙏*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీమద్భాగవతం - 34/42*

 *శనివారం 29 ఆగస్టు 2026*


*శ్రీమద్భాగవతం - 34/42* 


*అరిష్ట, కేశి వధ & అక్రూరుని గోకుల ప్రయాణం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో భాగంగా ఈరోజు 

 శంఖచూడ వధ, అరిష్టాసుర (వృషభం) వధ, కేశి-వ్యోమాసుర సంహారం లాంటి అనేక లీలలు రాబోతున్నాయి బాల్య లీలలు ఈరోజుతో ముగించి ఇక మధుర కు వెళతాం రేపటినుండి..... 


1. సుదర్శన గంధర్వుని ఉద్ధరణ & శంఖచూడ వధ


ఒకనాటి శివరాత్రి పర్వదినాన నందగోపాది గోపాలురంతా అంబికావనానికి వెళ్లి సరస్వతీ నదీ తీరాన గౌరీశంకరులను పూజించి అక్కడే శివానుగ్రహం కోసం భూసురులకు అనేక పదార్దాలు సమర్పించి,బ్రహ్మచర్య దీక్ష వహించి ఉపవాసం ఉన్నారు. రాత్రివేళ కూడా సరస్వతి నదీ తీరంలోనే గడిపారు.


ఆ రాత్రి వేళ ఒక పెద్ద అజగరం (కొండచిలువ) వచ్చి నందమహారాజు కాలును మింగడం ప్రారంభించింది. నందుడు "కృష్ణా! కృష్ణా కాపాడు" అని అరవగా, గోపాలురు అంతా భయంతో కొరివి కట్టెలతో ఆ పామును బాదారు, ఎంత కొట్టిన అది నందుని వదలలేదు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తన పాదంతో ఆ సర్పమును తాకాడు.


 కృష్ణుని పరమ పావన పాదస్పర్శ తాకగానే దాని పాపములు అన్ని పటా పంచలు అయిపోయి దాని సర్పరూపం నశించి, 'సుదర్శనుడు' అనే విద్యాధరుడు (గంధర్వుడు) దివ్యరూపంతో వెలిగాడు. నీవు ఎవరు అని కృష్ణుడు అడగగా...


అంగీరస మునుల రూపాన్ని చూసి సౌందర్య,ధన మదంతో అవహేళన చేసినందుకు సర్పంగా మారిన విద్యాధరుడు అనే గంధర్వుణ్ణి అని, కృష్ణ మీ పాదస్పర్శతో నాకు విముక్తి కలిగింది, నిజానికి వారు శాపం ఇచ్చి ఉండకపోతే నాకు మీ పాదాలు తాకే భాగ్యం దక్కేది కాదు అని తెలిపి ప్రణమిల్లాడు. అనుగ్రహం పొంది తన లోకానికి వెళ్ళిపోయాడు.


గోపాలురు అంతా శ్రీకృష్ణునీ అనితర సాధ్యం అయిన లీలలు చూసి ఆశ్చర్య పోయి ఆ అంబికా వనంలో వ్రత దీక్ష పూర్తి చేసి వ్రజ భూమికి వచ్చారు.


 * శంఖచూడ సంహారం: ఒకానొక సమయంలో రాత్రివేళ బల రామకృష్ణులు గోపికలతో పరివృతులు అయి ఒక వనంలో విహరిస్తుండగా కుబేరుని అనుచరుడైన శంఖచూడుడు అనే యక్షుడు గోపికలను అపహరించడానికి ప్రయత్నించాడు. 


ఆ గోపికలు 'కృష్ణా! బలరామా! రక్షించు రక్షించు' అని ఎంతగానో మొఱపెట్టుకొనుచుండిరి. సోదరులు తమ ఆత్మీయులను ఎత్తుకొనిపోవుచున్న శంఖచూడుని జూచి, అతని వెంటబడి తరిమారు, శ్రీ కృష్ణుడు పిడిగుద్దుతో అతడిని సంహరించి, ఆయన శిరస్సున ఉన్న దివ్య రత్నాన్ని బలరామునికి బహూకరించాడు.


ఇక్కడ ఒక అధ్యాయంలో గోపికల యుగళ గీతం ఉంటుంది రాత్రి వేళల్లో తమతో ఉండే శ్రీకృష్ణుడు, పగటిపూట గోవులను కాసేందుకు అడవికి వెళ్ళిపోవడంతో గోపికలు తీవ్ర విరహాన్ని అనుభవిస్తూ, ఆయన వేణుగాన మాధుర్యాన్ని, ప్రకృతి లీనమైన తీరును జంటలుగా కీర్తిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు.


2. అరిష్టాసుర వధ – వృషభ రాక్షస సంహారం

కంసుని ఆజ్ఞతో అరిష్టాసురుడు అనే రాక్షసుడు ఒక మహా భయంకరమైన ఎద్దు (వృషభం) రూపాన్ని ధరించి గోకులంపైకి దాడి చేశాడు. ఆయన డెక్కల తాకిడికి భూమి కంపించింది,తోకను ఆకాశానికి విసురుతూ, కళ్లతో నిప్పులు కక్కుతూ గర్భవతులైన స్త్రీలకు గర్భస్రావం కలిగించేలా భీకరంగా రంకెలేశాడు.


మొనదేలి మిగుల పదునుగానున్న దాని కొమ్ములను, దాని చేష్టలను గాంచి, గోపికలు, గోపాలురును ఎంతయు భయగ్రస్తులైరి. 


పశువులు బయపడుతూ, గోకులమును విడిచి పఱుగులు తీయసాగెను. సమస్త గోవులు, గోపికలు, గోపాలురు 'కృష్ణా! కృష్ణా!' యని మొఱపెట్టుకొనుచు గోవిందుని శరణుజొచ్చిరి. 


అప్పుడు కృష్ణభగవానుడు భయవిహ్వలస్థితులకు లోనైన  గోకులవాసుల దైన్యమును గమనించి, 'భయపడకుడు,

భయపడకుడు' అని అభయవచనములతో వారిని ఊఱడించి

తాను ఏమాత్రం చలించక ఆ ఎద్దు ముందు నిలబడి చప్పట్లు చేస్తూ ఆ రాక్షసునీ మరింత రెచ్చగొట్టాడు. రెచ్చిపోయి ఆగ్రహంతో దూసుకువచ్చిన అరిష్టాసురుని రెండు కొమ్ములను తన చేతులతో పట్టుకుని వెనక్కి నెట్టాడు. అనంతరం ఒక కొమ్మును పెకిలించి, ఆ కొమ్ముతోనే రాక్షసుడిని కొట్టి నేలకూల్చాడు.


శ్రీకృష్ణుడు దురాత్ముడైన అరిష్టాసురుని వధించి, వ్రజవాసులను ఆనందింపజేసెను. అంతట భవిష్యత్తును దర్శింపగల దివ్యర్షియగు నారదుడు కంసుని దగ్గరకు వెళ్ళి అతనితో  "కంసమహారాజా! నీ చేతులనుండి తప్పించుకొని, ఆకాశమునకు ఎగిరిన కన్యక నిజముగ యశోదకుమార్తె వ్రజభూమియందు వర్ధిల్లుచున్న శ్రీకృష్ణుడు

దేవకీపుత్రుడు. అచటనే పెఱుగుచున్న బలరాముడు రోహిణీదేవి కుమారుడు. 


వసుదేవుడు నీకు భయపడి శ్రీకృష్ణుని, బలరాముని తన మిత్రుడైన నందునికడ న్యాసముగా ఉంచెను. నీ ప్రేరణతో వెళ్లిన రాక్షసులను అందరిని నిహతులను గావించినది ఆ సోదరులు ఇద్దరే”.అన్నాడు.


నారదుని వలన బలరామకృష్ణుల ఈ సమాచారములను విన్నంతనే కంసుడు మిగుల క్రోధముతో ఊగిపోయెను.అతని ఇంద్రియము లన్నియు పట్టుదప్పెను, వసుదేవుని సంహరిస్తాను అని కత్తి దూసాడు కానీ వారి ఇద్దరిని బందించి చెరసాల లో వేసి కేశి అనే రాక్షసుణ్ణి బలరామ కృష్ణులను చంపడానికి వ్రజ భూమికి పంపాడు.


3. కేశి & వ్యోమాసుర సంహారం

 * కేశి వధ (గుర్రపు రాక్షసుడు): కంసుడు పంపిన కేశి అనే రాక్షసుడు మహా వేగవంతమైన గుర్రం రూపాన్ని ధరించి, నోటి నుండి నురుగులు కక్కుతూ కృష్ణునిపైకి లంఘించాడు. శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లోకి చొప్పించి, తన బాహువును అగ్నిగుండంలా పెంచాడు. కేశి పళ్లు ఊడిపోయి, ఊపిరాడక కడుపు బద్దలై రక్తాలు కక్కుకుని ప్రాణాలు విడిచాడు. (కేశిని సంహరించినందువల్ల భగవంతునికి 'కేశవుడు' అనే ప్రసిద్ధ నామం స్థిరపడింది).


 *అప్పుడు భాగవతోత్తముడు అయిన నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై: "కృష్ణా! నీవు త్వరలోనే కంసుడిని చంపి, భూభారాన్ని తొలగించి, కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టబోతున్నావు" అని కీర్తించాడు.(ఇక్కడ నారదుడు జరగబోవు సంఘటనలు అన్ని చెబుతాడు)


 * వ్యోమాసుర వధ:పిమ్మట ఒకనాడు గోపాలురు శ్రీకృష్ణునితోగూడి అడవికి వెళ్లిరి. అక్కడ వారు గోవులను మేపుచు ఒక పర్వతసమీపమున నిలాయనక్రీడలను (మేకల ఆటలను లేదా  దాగుడుమూతలాటలను) ఆడిరి. ఆ ఆటలలో కొందరు గొర్రెల కాపరులుగను, మఱికొందఱు ఆఱితేణిన దొంగలుగాను నటించుచు ఆ గోపాలురు తమలో తాము నిర్భయముగా క్రీడలు సలుపుచుండిరి


అప్పుడు మయాసురుని కుమారుడైన వ్యోమాసురుడు వారిలో గోపాలుడిగా కలసి దొంగల వేషంలో బాలురను గుహలలో దాచిపెట్టాడు. అలా చివరకు నలుగురు అయిదుగురు మాత్రమే మిగిలారు.శ్రీకృష్ణుడు అతని దొంగతనం గుర్తించి , కొండగుహలో వేసి అదిమి సంహరించి గుహలలో దాచిన స్నేహితులను కాపాడి గోకులానికి చేరాడు.


4. కంసుని ధనుర్యాగం & అక్రూరుని భక్తి ప్రయాణం

రాక్షసులంతా మరణించారని తెలుసుకున్న కంసుడు వణికిపోయాడు. రామకృష్ణులను మధురకు రప్పించి చంపడానికి 'ధనుర్యాగం' అనే కుతంత్ర యజ్ఞాన్ని ప్రకటించాడు.దానికోసం యదువంశ శ్రేష్ఠుడు, నిష్కల్మష భక్తుడైన అక్రూరుడిని పిలిచి: "అక్రూరా! నువ్వు రథంపై వెళ్లి నందగోకులంలో ఉన్న రామకృష్ణులను ఈ ధనుర్యాగానికి తీసుకురా" అని ఆజ్ఞాపించాడు. అది తనకు కలిగిన భాగ్యం అని భావించాడు అక్రూరుడు.


 శ్రీకృష్ణుని దర్శనం చేసుకోబోతున్నానని అక్రూరుడు మార్గమధ్యమంతా పరమానందంతో గడిపాడు:

   "నేను ఎంతటి పుణ్యం చేసుకున్నాను! మునుల ధ్యానానికి చిక్కని పరబ్రహ్మ పాదపద్మాలను ఈరోజు నేను తాకబోతున్నాను! అంటూ పొంగిపోయాడు.

   

 * గోకులంలో అడుగుజాడలు: గోకులం చేరగానే నేలపై కృష్ణుని ధ్వజ, వజ్ర, పద్మ, అంకుశ లాంఛనాలతో కూడిన పాదముద్రలను చూసి అక్రూరుడు రథం దిగి, ఆ ధూళిలో పొర్లాడుతూ కన్నీళ్లతో ప్రణమిల్లాడు.


 అలా నందభవనంలో ప్రవేశించి పీతాంబరధారులైన రామకృష్ణులను చూసి వారి పాదాలపై సాష్టాంగపడ్డాడు. రామకృష్ణులు అక్రూరుని లేవనెత్తి ఆలింగనం చేసుకుని అతిథి సత్కారాలు చేశారు.


5. మధురకు పయనం & యమునలో విరాడ్రూప దర్శనం

కంసుని దురుద్దేశాన్ని, దేవకీ-వసుదేవుల బంధనాన్ని అక్రూరుడు వివరించాడు. నందమహారాజు సమస్త గోపాలురతో పాటు మధురకు కానుకలతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.


 * గోపికల విరహ వేదన: కృష్ణుడు మధురకు వెళ్తున్నాడని తెలిసి గోపికలు రథం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు: "కృష్ణా! నిన్ను విడిచి మేము క్షణమైనా బ్రతుకలేము" అంటూ రథ చక్రాలకు అడ్డంగా పడుకున్నారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ, "నేను త్వరలోనే తిరిగి వస్తాను" అని మనస్సులలో నిలిచి ఉండే అభయాన్ని ఇచ్చాడు.


 *యమునా నదిలో దివ్య దర్శనం* 

మార్గమధ్యంలో యమునా నదిలో అక్రూరుడు మధ్యాహ్న స్నానం చేస్తుండగా... నీటి లోపల శ్రీ బలరామకృష్ణులు దర్శనమిచ్చారు. రథంపై చూస్తే అక్కడా ఉన్నారు. మళ్లీ నీటిలో మునగగా... వేయి పడగల ఆదిశేషునిపై శంఖ-చక్ర-గదా-పద్మధారియై, లక్ష్మీ సమేతుడై వెలిగిపోతున్న శ్రీమన్నారాయణుని పరమ దివ్య వైకుంఠ రూపాన్ని దర్శించి అక్రూరుడు పరవశించి స్తుతించాడు.(అక్రూరుని గురించి దాదాపు నాలుగు అధ్యాయాలలో ఉంటుంది, అక్రూర స్తుతి కూడా ఎంతో విశేషమైంది ఇక్కడ కొద్దిగా ఇచ్చాను అంతే)


📝 నేటి ముఖ్య విషయాలు:

 * అక్రూరుని దాస్య-వందన భక్తి: భాగవతంలో నవవిధ భక్తులలో 'వందనం' (నమస్కారం/శరణాగతి) అనే భక్తికి అక్రూరుడే పరమ ఆదర్శం.


 * పాదధూళి మహత్యం: భగవంతుని పాదముద్రల స్పర్శ రాయిని సైతం పావనం చేస్తుంది; అక్రూరుని వంటి జ్ఞాని ఆ ధూళిని శిరస్సున ధరించాడు.


 * బాల్య లీలల పరిసమాప్తి: శ్రీకృష్ణుడు గోకుల బాల్య లీలలను ముగించి, దుష్టశిక్షణ-శిష్టరక్షణ అనే మహా కార్యం కోసం మధురా నగర ప్రవేశానికి సిద్ధమయ్యాడు.


.....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

28, ఆగస్టు 2026, శుక్రవారం

శ్రీమద్భాగవతం - 33/42*

 *శుక్రవారం 28 ఆగస్టు 2926*


*శ్రీమద్భాగవతం - 33/42* 


*గోపాలురకు వైకుంఠ దర్శనం, పంచాధ్యాయి – దివ్య రాసలీల & గోపికాగీత*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో ఈరోజు రమణీయ రాసలీల ఘట్టం స్మరించి తరించే ప్రయత్నం చేద్దాం రండి.


వరుణ పాశాలు - వైకుంఠ దర్శనం 

ఒక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నందమహారాజు ఎంతో భక్తితో ఏకాదశి ఉపవాసం పూర్తి చేశాడు. మరుసటి రోజు ద్వాదశి ఘడియలు దాటిపోకముందే స్నానం చేసి పూజ ముగించాలనే తొందరలో, తెల్లవారకముందే అర్ధరాత్రి వేళలోనే నదిలోకి దిగాడు. అది రాక్షసులు తిరిగే అశుభ సమయం కావడంతో, జలాలకు అధిపతి అయిన వరుణ దేవుని సేవకుడు అయిన అసురుడు ఒకడు నందుడిని బంధించి వరుణ లోకాలకు తీసుకుపోయాడు.


ఉదయం చూసేసరికి నందుడు కనిపించక గోకులమంతా కన్నీరుమున్నీరైంది. నందుడిని ఎవరో జలరాక్షసులు పట్టుకుపోయారని తెలిసి ప్రజలంతా శ్రీకృష్ణుడి దగ్గరకు పరుగుతీశారు. వెంటనే శ్రీకృష్ణుడు దివ్య దృష్టి తో అంతా తెలుసుకుని,సరాసరి వరుణుడి లోకానికి చేరుకున్నాడు.


జగన్నాథుడైన శ్రీకృష్ణుడే స్వయంగా తన లోకానికి వచ్చేసరికి వరుణ దేవుడు ఆనందంతో, భయభక్తులతో స్వాగతం పలికాడు. శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి, అర్ఘ్య పాధ్యాదులు ఇచ్చి"స్వామీ! నా సేవకుడు అజ్ఞానంతో చేసిన తప్పును క్షమించి, నీ తండ్రిని స్వీకరించు" అంటూ నందుడిని ఎంతో మర్యాదతో అప్పగించాడు.


తిరిగి ఇంటికి వచ్చిన నందుడు, దేవతలే శ్రీకృష్ణుడి పాదాలపై పడి మొక్కుతున్న ఆ అద్భుతాన్ని గోపాలురందరికీ చెప్పాడు. అది విని గోపాలురు ఆశ్చర్యపోయి... "మనతో ఆడుతూ పాడుతూ తిరిగే ఈ చిన్నారి కృష్ణుడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు పరమాత్ముడు! మరి ఆయన నివసించే ఆ పరమ లోకం ఎలా ఉంటుంది? మనలాంటి సామాన్యులకు అది చూసే భాగ్యం దక్కుతుందా?" అని తమలో తాము పరితపించసాగారు.


వారి మనసులోని అమాయకమైన, నిష్కల్మషమైన భక్తిని శ్రీకృష్ణుడు గుర్తించాడు. వారందరినీ యమునా నదిలోని పవిత్రమైన బ్రహ్మహ్రధం అనే  మడుగు వద్దకు తీసుకెళ్లి, నీటిలో మునిగి లేవమని చెప్పాడు.

గోపాలురు ఆ నీటిలో మునిగి పైకి లేవగానే... వారి కళ్ళముందు భౌతిక ప్రపంచానికి అతీతమైన దివ్య లోకం సాక్షాత్కరించింది. కోట్ల సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న ఆ లోకంలో, చతుర్భుజాలతో, శంఖుచక్రాలతో వెలిగిపోతున్న పరమాత్ముడిని దేవతలు, మునులు స్తుతిస్తుండటం చూసి గోపాలురు పరవశించిపోయారు. ఆ దేవదేవుడే తమ కళ్లముందు చిరునవ్వుతో ఉన్న కృష్ణుడని గ్రహించి, ఆనందభాష్పాలతో శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించారు. (పూర్వం అక్రూరుడు ఇదే హ్రధం లో మునిగి స్వామి దర్శనం పొందాడు.)


శరత్కాల వేణుగానం & గోపికల ఆగమనం 

ఇది వరకు గోపికలు కాత్యాయనీ వ్రతం చేసిన సందర్భంగా వారితో మీ వ్రతం ఫలించింది రాబోవు శరత్కాలంలో మీతో రాసక్రీడ జరిపి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు కదా ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం సంసిద్ధుడు అయ్యాడు స్వామి..


నిర్మలమైన ఆకాశం, పూర్ణచంద్రుని వెన్నెల కురుస్తున్న శరత్ పూర్ణిమ రాత్రి వేళ, శ్రీకృష్ణుడు తన యోగమాయను ఆశ్రయించి యమునా నదీ తీరాన వేణునాదం ప్రారంభించాడు. ఆ దివ్య నాదం భౌతికమైనది కాదు అది పరమాత్మ జీవులను తన వైపు పిలిచే ప్రణవ నాదం!


ఆ వేణుగానం విన్న మరుక్షణమే గోపికలు తాము చేస్తున్న పనులను మధ్యలోనే వదిలేశారు — పాలు కాచేవారు పాలను అలాగే వదిలారు, పిల్లలకు పాలిచ్చేవారు పక్కన పెట్టారు, భోజనం వడ్డించేవారు చేతి పాత్రలను విడిచిపెట్టారు.


* లోకనిందలను, బంధువుల అడ్డుకట్టలను, చివరకు దేహస్మృతిని సైతం విస్మరించి బృందావనం వైపు పరుగెత్తుకు వచ్చారు. కొందరు గృహాలలో బంధించబడిన గోపికలు తీవ్రమైన కృష్ణ ధ్యానంలో తమ ప్రాకృత దేహాలను త్యజించి సూక్ష్మరూపంలో పరమాత్మను చేరుకున్నారు.


సహింపశక్యము గాని తీవ్రమైన కృష్ణవిరహతాపముచే వారిలోని అశుభసంస్కారములు సమసిపోయెను. ధ్యానముచే పొందబడిన, అచ్యుతుని ఆలింగనమువలన మహదానందమును అనుభవించుటచే వారి పుణ్యకర్మలును క్షయమయ్యెను. అంతేగాక, ఆ పరమాత్మను జారబుద్ధితో కలిసికొన్నవారలు త్రిగుణముల కార్యమగు దేహములను విడిచి పెట్టి, వెంటనే సమస్తకర్మబంధములనుండి విముక్తిని పొంది, భగవంతునిలో ఐక్యము నొందిరి.


2. శ్రీకృష్ణుని పరీక్ష & గోపికల నిశ్చల ప్రేమ 


గోపికలు ఎదుటకు రాగానే శ్రీకృష్ణుడు లోక ధర్మాన్ని పరీక్షించడానికి ఇలా అన్నాడు:


 "గోపికలారా! మీకు స్వాగతం. కానీ అర్ధరాత్రి వేళ అడవికి రావడం స్త్రీలకు ధర్మం కాదు. మీ భర్తలు, పిల్లలు వెతుకుతుంటారు. వెంటనే మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి!"పైగా ఇక్కడ సింహాలు, పులులు తిరుగుతూ ఉంటాయి. గృహాలలో మీకోసం పసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఆవు దూడలు అంబా అంటూ అరుస్తూ ఉంటాయి.మీరు నాపై నిష్కపట ప్రేమతో వచ్చారు బహు సంతోషం కానీ కుటుంబ పాలన మీ ధర్మం కదా.నా పక్కన ఉంటేనే నాపై భక్తి వస్తుంది అనుకోవద్దు, ఎల్లపుడు నా లీలలు స్మరిస్తూ,నా రూపం ధ్యానిస్తూ,నా నామం పలుకుతూ ఉండటం వల్ల అనన్య భక్తి కుదురుతుంది మీరు తిరిగి వెళ్ళండి అన్నాడు.


ఆ మాటలు విన్న గోపికల ముఖాలు వెల వెల పోయాయి, నోట మాట రాలేదు, గోపికలు శ్రీకృష్ణునీ పొందటం కోసం తమ ఐహిక సుఖ భోగాలు, సకల కోరికలు త్యజించి ఉన్నారు, అందువల్ల తమకు అత్యంత ప్రీతి పాత్రుడు అయిన శ్రీకృష్ణుడు అలా పలికే సరికి

గోపికలు కన్నీళ్లతో గద్గద స్వరంతో ఇలా సమాధానమిచ్చారు:


 "స్వామీ! పూజ్యులైన కృష్ణ ప్రభూ మీరు ఇలా పరుషంగా మాట్లాడటం ఏ మాత్రం తగదు మేము మా సర్వస్వం వదిలేసి నిన్నే నమ్ముకుని,నీ పాదములను ఆశ్రయించడానికి వచ్చిన భక్తురాండ్రము, దయతో మమ్మల్ని విడిచి పెట్టకు 


లౌకిక భర్తలు, బంధువులు దేహానికి సంబంధించిన వారు మాత్రమే. కానీ సమస్త ప్రాణులకు ఏకైక నిజమైన పతి, ఆత్మ నీవే! సమస్తాన్ని త్యజించి నీ పాదపద్మాలను ఆశ్రయించిన మమ్మల్ని తృణీకరించకు."


ప్రభూ! సురలోకమును (సమస్త దేవతలను) రక్షించుటకై శ్రీమన్నారాయణుడు ఉపేంద్రుడై (వామనుడై) అవతరించినట్లు మా వ్రజవాసుల ఆర్తిని హరించుటకై నీవు ఈ గోకులమున జన్మించితివి ఇది ముమ్మాటికి నిజము. 


దుఃఖనివారకా! మేము తనివిదీర నిన్ను భజించుటకై ఎంతో ఉవ్విళ్లూరుచున్నాము. అందుకై మా ఇండ్లు వాకిండ్లను విడిచిపెట్టి నీ పాదములను ఆశ్రయించితిమి. అట్టి మా యెడ ప్రసన్నుడవు కమ్ము. పరమపురుషా! మనోహరమైన నీ ఈ చిఱునవ్వులను దర్శించుటకై నిరీక్షించుచు మన్మథతాపములకు లోనైతిమి. అందువలన మమ్ము

నీ దాసీలనుగా స్వీకరించి మా తాపములను చల్లార్చుము.అని అనేక రకాలుగా వేడుకున్నారు


శ్రీకృష్ణుడు సనకాదిమహాయోగులకును ఈశ్వరుడు. ఆ స్వామి ఆ గోపభామినులు ప్రేమపారవశ్యముతో మొరపెట్టుకొనుచు పలికిన విలాపవచనములను శ్రద్దగా ఆలకించెను. ఆత్మయందే రమించునట్టి ఆ ప్రభువు ఆ గోపికలపై జాలిగొని, చిఱునవ్వును చిందించుచు అందఱిలోను శ్రీకృష్ణరూపుడై వారితో క్రీడించెను.


.🌟సౌభాగ్య మదం & శ్రీకృష్ణుని అంతర్ధానం 


గోపికలు మహాత్ముడైన కృష్ణభగవానుని చేరి తనివిదీర సుఖానందములను పొందారు. వారి మనోరథములన్నియును ఈడేరెను. అంతట వారు ఈ లోకములోని స్త్రీలలో తమ యంతటి భాగ్యశాలినులు లేరనియు తామే గొప్పవారమనియు తలంచుచు పొంగిపోసాగిరి. 


అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలయొక్క సౌభాగ్య మదమును, దురభిమానమును గమనించెను. వారి గర్వమును అణచివేయుట ద్వారా వారిని అనుగ్రహించుటకై వారి మధ్య నుండి **అంతర్ధానమయ్యాడు (మాయమయ్యాడు)!**


4. గోపికల విరహం & గోపికాగీత 


కృష్ణుని వియోగంతో గోపికలు పిచ్చివారయ్యారు. బృందావనంలోని చెట్లను, లతలను, జింకలను, పూలను "మా శ్యామసుందరుడు ఏడి?" అని వేడుకుంటూ వెతికారు. కృష్ణుని లీలలనే తాము స్వయంగా అభినయించారు (తాండవం, పూతనా వధ, గోవర్ధనోద్ధరణం మొదలైనవి).


చివరకు అలసిపోయి యమునా సైకత తీరాన కూర్చుని, కన్నీటి ధారలతో కృష్ణుని కోసం పరమ పవిత్రమైన **'గోపికాగీత'** ను గానం చేశారు:


 **"జయతి తేఽధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్ర హి |**

**దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే ||"**


**"తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్ |**

**శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదా జనాః ||"**


**తాత్పర్యం:** "ఓ ప్రాణనాథా! నీ పాదస్పర్శతో వ్రజభూమి వైకుంఠమైంది. నీ కథామృతం సంసార తాపాలలో కాలిపోయే మానవులకు పరమ సంజీవని. నీ వియోగంలో ఒక్క క్షణం కూడా మాకు యుగంలా గడుస్తోంది. దర్శనమిచ్చి మా ప్రాణాలను కాపాడు!"చాలా అద్భుతమైన స్తుతి చేశారు (దాదాపు 19 శ్లోకములు ఉంటుంది)


5. శ్రీకృష్ణ పునరాగమనం & మహారాస మహోత్సవం


గోపికల అహంకారం పూర్తిగా నశించి నిష్కల్మష శరణాగతి మిగిలిన క్షణంలో... పీతాంబరధారియై, మురళీధరుడై, చిరునవ్వు చిందిస్తూ శ్రీకృష్ణుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు!


అప్పుడు ముముక్షువులు బ్రహ్మజ్ఞాని లేదా పరమాత్మ సాక్షాత్కారమును పొంది, తాపత్రయమునుండి బయట పడినట్లుగా, గోపికలు అందఱును శ్రీకృష్ణ దర్శనోత్సవముతో పరవశించిపోవుచు, తమ విరహతాపములనుండి విముక్తలై ఎంతయు మనశ్శాంతినీ 

పొందిరి.


పిమ్మట శ్రీకృష్ణ పరమాత్మ వారిని యమునా నదితీరాన గల ఇసుక తిన్నెల వద్దకు తీసుకు పోయి ఆనందించాడు.


ప్రియమైన గోపికలారా! మీ ప్రేమ నిష్కపటమైనది. నాపై మీరు చూపిన ప్రేమకు మీ అమాయికమైన కృత్యములకు ప్రత్యుపకారము చేయుటకు నేను సమర్థుడనుకాను. దేవతల ఆయుర్దాయమును పొందినప్పటికినీ మీ ఋణము తీరేదికాదు. మీరు నన్ను చేరుటకై విడదీయరాని, దృఢమైన ఇండ్లు - వాకిండ్లు అనే సంకెళ్ళను పూర్తిగా తెగగొట్టితిరి. 


నిర్మలమైన మీ ప్రేమభావమును నాయందే సమర్పించితిరి. కావున, మీరు మీ సాధుస్వభావముతో, నిష్కపటమైన ప్రేమతో నన్నుఋణవిముక్తుని చేయవచ్చును. కాని, నేను మాత్రము మీ ఋణమును తీర్చుకొనలేను. కాదు, కాదు ఎప్పటికీ నేను మీకు ఋణగ్రస్తుడనయ్యే ఉండెదను.(సర్వస్య శరణాగతి యే రాసలీల)


* **రాస మండలం:** యమునా నదీ తీరాన వేలాది గోపికలు గుండ్రంగా వలయంగా (రాస మండలంగా) ఏర్పడ్డారు.


* **శ్రీకృష్ణుని విస్తరణ:** ప్రతి ఇద్దరు గోపికల మధ్య ఒక శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు! వందలాది మంది గోపికలు ఉండగా, ప్రతి గోపికా **"శ్రీకృష్ణుడు నా పక్కనే ఉండి నాతోనే నాట్యం చేస్తున్నాడు"** అని భావించేలా స్వామి అనేక రూపాలను ధరించాడు.


* **దివ్య నాట్యం:** దేవతలు విమానాలలో నిలిచి పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు గానం చేయగా, పరమశివుడు ఈ రాసలీలను తిలకించడానికి గోపికా రూపం (గోపేశ్వర మహాదేవుడు) ధరించి వచ్చాడు. ఆ రాత్రి బ్రహ్మదేవుని ఒక కల్ప కాలమంత సుదీర్ఘంగా విస్తరించింది.(లీల చాలా పెద్దగా ఇక్కడ అంతా ఇవ్వలేను ఈ వేదిక పై అవసరం కూడా లేదు ఇది ఎవరికి వారు చదువుకుని అనుభవించాల్సిన లీల)


పరీక్షిత్తు మహారాజు కు మనకు వచ్చే శంకే రాగా శుకమహర్షి స్పష్టం చేశారు: *"రాజా! శ్రీకృష్ణుడు ఆప్తుడు, నిష్కాముడు, ఆత్మారాముడు. ఆయన చేసినది ప్రాకృత కామక్రీడ కాదు. ఆయన పరమాత్మ, గోపికలు జీవాత్మలు. జీవాత్మ పరమాత్మతో లీనమయ్యే పరమ ఆధ్యాత్మిక బ్రహ్మానంద తాదాత్మ్యమే రాసలీల!"*


అగ్ని హేయములు, అహేయములు అగు పదార్దములను అన్నింటిని భక్షించుచున్నను ఆయనకు ఎట్టి మాలిన్యమూ అంటుటలేదు గదా! తేజోమూర్తుల శక్తిసామర్థ్యములు కూడా అట్టివే. సామాన్యుడు (సమర్థుడు కానివాడు) ఇట్టి కార్యమును గూర్చి మనస్సులోగూడ సంకల్పింపరాదు మూర్ఖత్వముతో అట్లు చేసినచో, అతడు నశించుట తథ్యము. సర్వేశ్వరుడైన శంకరుడు సముద్రమునుండి పుట్టిన హాలాహల విషమును పానము చేసినట్లు అసమర్థుడు చేసినచో తత్క్షణమే అతడు భస్మమగును. 


ఒక పసివాడు తన ప్రతిబింబములతో ఆడుకొనునప్పుడు అతనిలో ఆనందహేల తప్ప ఎట్టి వికారములును ఉండవు. అట్లే శ్రీకృష్ణుడు తన ప్రతిబింబములైన గోపికలతో క్రీడించుచున్నప్పుడు ఆ స్వామిలో' ఎట్టి వికారములకు తానే లేకుండెను. ఏలయన, గోపికల హృదయములలో శ్రీకృష్ణభగవానుడే ప్రతిబింబించుచుండెను. అనగా భగవంతునకును, భక్తులకును మధ్యగల అవినాభావ సంబంధములు అట్టివి.


పరమేశ్వరుడు సకలప్రాణులను అనుగ్రహించుటకొరకే మానవదేహమును ధరించెను. కావున, ఆ దేహమునకు తగినట్టి లీలలనే ప్రకటించును. అట్టి లీలావైభవములను విన్నవారు భగవత్పరాయణులు అగుదురు. 


గోకులవాసులగు జనులకు శ్రీకృష్ణునియెడల దోషబుద్ధి కలుగనేలేదు. ఏలనన, ఆయన యోగమాయచే మోహితులైనవారికి తమ తమ భార్యలు తమ ప్రక్కనే ఉన్నట్లుగా తోచెను. 


ఇంతలో బ్రాహ్మముహూర్తము ఆయెను. వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడు తనకు ప్రీతిపాత్రులగు గోపికలు వెళ్ళుటకు అనుమతి నిచ్చెను. ఆ ప్రభువు ఆజ్ఞమేరకు తమ తమ ఇండ్లకు వెళ్ళిరి.


 పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు వ్రజభామినులతో నెఱపిన ఈ రాసలీలలను గూర్చి పదేపదే శ్రద్ధగా వినినవారు, వాటిని ప్రస్తుతించినవారు ఆ పరమాత్ముని పాదపద్మములపై ప్రగాఢమైన భక్తికి నోచుకొందురు. తత్ప్రభావముచే వారు తమ జీవితకాలమున జితేంద్రియులు అగుదురు. అతి శీఘ్రముగా కామవికారాది హృద్రోగములనుండి విముక్తులగుదురు.


📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:


1. **మధుర భక్తి పరాకాష్ఠ:** గోపికల ప్రేమ దేహ సంబంధమైనది కాదు; అది ఆత్మ సమర్పణ రూపమైన అత్యున్నత భక్తి.


2. **అహంకారం ఉంటే హరి దక్కడు:** భగవంతుని సన్నిధిలో ఉన్నా సరే, అహంకారం తలెత్తితే పరమాత్మ వెంటనే దూరమవుతాడు; సంపూర్ణ శరణాగతితో మాత్రమే ఆయనను తిరిగి పొందగలం.


3. **రాసలీలా శ్రవణ ఫలం:** ఎవరైతే ఈ రాసలీలను శుద్ధ మనస్సుతో వింటారో, వారి హృదయంలోని కామ వికారాలన్నీ నశించి పరమ భక్తి లభిస్తుందని భాగవత ఫలశ్రుతి.


....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

వాహ్ రే డబ్బు!

  వాహ్ రే డబ్బు!


నీకు ఎన్ని పేర్లు?


గుడిలో ఇస్తే, 

( ముడుపు )

                       స్కూల్లో

                    ( ఫీజు )


పెళ్లిలో ఇస్తే,

( కట్నం )

                  విడాకులు ఇస్తే

              ( భరణం )


నువ్వు ఎవరికైనా ఇస్తే,

          ( అప్పు )

                     కోర్టులో

                   ( జరిమానా )


ప్రభుత్వం తీసుకుంటే,

      ( పన్ను )


                రిటైర్ అయ్యాక వస్తే

                   ( పింఛను )


కిడ్నాపర్లకు ఇస్తే

   ( విమోచన ధనం )

               

          హోటల్లో సేవకు ఇస్తే

                 ( టిప్పు )


బ్యాంకు నుండి తీసుకుంటే,

     ( రుణం )


              కష్టపడే వారికి

                 ( జీతం )


కింది ఉద్యోగులకు

    ( కూలీ )


       అక్రమంగా తీసుకుంటే

             ( లంచం )


మరి నాకు ఇస్తే,

   ( గిఫ్ట్ )


            నేను డబ్బుని.

నన్ను నువ్వు చనిపోయాక పైకి తీసుకెళ్లలేవు,

కానీ బతికి ఉండగా నేను నిన్ను చాలా పైకి తీసుకెళ్లగలను.


             నేను డబ్బుని.

నన్ను ఇష్టపడండి, కానీ ఆ ఇష్టం వల్ల జనాలు మిమ్మల్ని అసహ్యించుకునేంత వరకు కాదు.


             నేను డబ్బుని.

నేను దేవుడిని కాదు, కానీ జనాలు నన్ను దేవుడి కంటే తక్కువగా చూడరు.


        నేను డబ్బుని.

నేను ఉప్పు లాంటి వాడిని. అవసరం తప్పనిసరి, కానీ అవసరానికి మించితే జీవితపు రుచే చెడిపోతుంది.


         నేను డబ్బుని.

చరిత్రలో నా దగ్గర లెక్కలేనంత సంపద ఉన్నా, చనిపోయాక వారి కోసం ఏడ్చేవారు ఎవరూ లేని వారి ఉదాహరణలు చాలా ఉన్నాయి.


         నేను డబ్బుని.

నేనేమీ కాను, కానీ జనాలు నీకు ఎంత గౌరవం ఇస్తారో నేనే నిర్ణయిస్తాను.


         నేను డబ్బుని.

నేను నీ దగ్గర ఉంటే నీవాడిని.

నీ దగ్గర లేకపోతే, నీవాడిని కాను, కానీ నేను నీ దగ్గర ఉంటే అందరూ నీవారే.


            నేను డబ్బుని.

నేను కొత్త కొత్త బంధుత్వాలను సృష్టిస్తాను, కానీ అసలైన, పాత బంధాలను చెడగొడతాను.


            నేను డబ్బుని.


నేనే అన్ని గొడవలకు మూలం

అయినా ఎందుకో తెలియదు అందరూ నా వెంటే ఎందుకు పిచ్చిగా పరుగెడతారు?


                🔴


ఒక నిజం ఇది కూడా.........


మారుతున్న కాలం సార్ ...


ముందు "వయసు"లో పెద్దవారికి

    గౌరవం ఉండేది...।


ఇప్పుడు "ఆదాయం"లో పెద్దవారికి

  _గౌరవం ఉంటుంది._🚩

పంచాంగం 28.08.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 28.08.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి భృగు వాసర శతభిషం నక్షత్రం అతిగండ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: పాడ్యమి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।

యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ।। 43 ।।



ప్రతిపదార్థ:


తత్ర — అక్కడ; తం — అది; బుద్ధి-సంయోగం — జ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి; లభతే — పొందును; పౌర్వ-దేహికమ్ — పూర్వ జన్మల నుండి; యతతే — పరిశ్రమించును; చ — మరియు; తతః — ఆ తరువాత; భూయః — మరల; సంసిద్ధౌ — పరిపూర్ణత కొరకు; కురు-నందన — అర్జునా, కురు వంశస్తుడా.



తాత్పర్యము: 


ఇటువంటి జన్మ పొందిన తరువాత, ఓ కురు వంశస్తుడా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు.



వివరణ:


ప్రతి ఒక్క ప్రాణి హృదయంలో స్థితుడై ఉన్న భగవంతుడు, వారికి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు. మనం పూర్వ జన్మలలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలు ఏవైనా ఉన్నా – వైరాగ్యము, జ్ఞానము, భక్తి, విశ్వాసము, సహనము, ధృఢ సంకల్పము, మరియు ఇతర దైవీ గుణములు అన్నీ – ఆయనకు తెలుసు. కాబట్టి సరైన సమయంలో మన పూర్వ జన్మల పరిశ్రమ ఫలితాన్ని, ఆయా సంపాదన అనుగుణంగా, తిరిగి ఇస్తాడు మరియు మన ఆధ్యాత్మికతను లోనుండి తిరిగి పెంపొందిస్తాడు. భౌతిక ప్రాపంచిక ధృక్పథంలోనే ఉన్న కొందరు అకస్మాత్తుగా పూర్తి ఆధ్యాత్మికతలో ఎందుకు అయిపోతారో, ఇది మనకు తెలియచేస్తున్నది. వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కారములు మేల్కొన్నప్పుడు, వారికి పూర్వ జన్మల సాధన ఫలితం లభిస్తుంది.


ఒక యాత్రికుడు విరామం కోసం దారిలో ఉన్న ఒక హోటల్లో రాత్రిపూట బస చేయవచ్చు. కానీ, తను లేచినప్పుడు, తను ఇప్పటికే వచ్చిన దూరాన్ని తిరిగి ప్రయాణం చేయనవసరం లేదు. కేవలం మిగిలిన దూరాన్ని మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. అదే విధంగా, భగవంతుని కృప వలన, పూర్వ జన్మలలో తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాడో, అక్కడి నుండి పురోగమించటానికి, తాను ఇంతకు క్రితమే సాధించుకున్న ఆధ్యాత్మిక సంపత్తిని, వ్యక్తి నిద్ర లేచినట్టుగా, యోగి తిరిగి పొందుతాడు. అందుకే ఇటువంటి యోగి ఎన్నటికీ దారితప్పడు.

సంపాదన

  సంపాదన , దాచుకోవటం , కూడబెట్టడం అంటే .. 


ఆస్తులు , డబ్బు , పదవి కానే కాదు.. 

నీ ధర్మాన్ని దాచుకోవడం , నీ ధర్మాన్ని కూడబెట్టడం , నీ సంతానాన్ని పెంచుకోవడం 


సనాతన ధర్మ పరిరక్షణ అనే సంకల్పాన్ని చేపట్టడం.. 


అప్పుడే .. నీ పరుగుకి , పరువుకి , సమాజానికి మేలు జరుగుతుంది.. 


జై శ్రీరామ్..


మీ 

హిందూ జన సంఘ్ 

తెలుగు రాష్ట్రాలు

*రాఖీ పౌర్ణమి

  288ఫ4:

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



`28తేదీ,శుక్రవారం..`

               *రాఖీ పౌర్ణమి*

                ➖➖➖✍️


'రాఖీ’, ‘రక్షా బంధన్’ లేదా ‘రాఖీ పౌర్ణమి` అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో *శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ* అని కూడా పిలుస్తారు. 


అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. 


కొంతకాలం క్రితం వరకూ ఉత్తర , పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతటా జరుపుతున్నారు. 


అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. 


రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు , అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. 


చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. 

అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు.



*రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే..*


పూర్వం దేవతలకు , రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై , తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. 


భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. 


సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. 


అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. 


సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. 


శచీదేవి ప్రారంభించిన 

ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.



*రాఖీపౌర్ణమి చరిత్ర:*


*ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం:*

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది , శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. 


శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. 

అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. 


దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. 


అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి చీరలిచ్చి ఆమెను కాపాడుతాడు.



*శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి:*

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. 


శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. 


అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ *”యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల"* 


*భావం:-*

“ఓ రక్షాబంధమా ! మహాబలవంతుడూ , రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను.)”



*అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ:*

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. 


జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. 


ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. 


ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను , ముఖ్యంగా జీలం , చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. 


అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి , అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. 


పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. 


దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.



*హయగ్రీవావతారం:*

శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు..


పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. 

ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. 


అయితే ఆమె అదిసాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. 


ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. 


ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. 


విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. 


చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా 

ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే 

ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. 


అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. 

అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. 


దేవతలు అంతటా వెదికారు కానీ 

ఆ తల కనిపించలేదు. 


బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. 


అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. 


దేవతలు అలాగే చేశారు. 


ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. 


ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. 

ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. 

దేవీ శక్తి మహిమను , శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. 


అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     🌷🙏🌷

 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`

                     ➖▪️➖

కుంభకోణం - తంజావూరు

  🕉 మన గుడి : నెం 1585


⚜  తమిళనాడు : కుంభకోణం - తంజావూరు


288ఫ4:

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



`28తేదీ,శుక్రవారం..`

               *రాఖీ పౌర్ణమి*

                ➖➖➖✍️


'రాఖీ’, ‘రక్షా బంధన్’ లేదా ‘రాఖీ పౌర్ణమి` అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో *శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ* అని కూడా పిలుస్తారు. 


అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. 


కొంతకాలం క్రితం వరకూ ఉత్తర , పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతటా జరుపుతున్నారు. 


అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. 


రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు , అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. 


చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. 

అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు.



*రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే..*


పూర్వం దేవతలకు , రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై , తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. 


భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. 


సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. 


అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. 


సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. 


శచీదేవి ప్రారంభించిన 

ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.



*రాఖీపౌర్ణమి చరిత్ర:*


*ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం:*

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది , శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. 


శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. 

అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. 


దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. 


అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి చీరలిచ్చి ఆమెను కాపాడుతాడు.



*శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి:*

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. 


శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. 


అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ *”యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల"* 


*భావం:-*

“ఓ రక్షాబంధమా ! మహాబలవంతుడూ , రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను.)”



*అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథ:*

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. 


జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. 


ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. 


ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను , ముఖ్యంగా జీలం , చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. 


అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి , అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. 


పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. 


దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.



*హయగ్రీవావతారం:*

శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు..


పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. 

ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. 


అయితే ఆమె అదిసాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. 


ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. 


ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. 


విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. 


చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా 

ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే 

ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. 


అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. 

అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. 


దేవతలు అంతటా వెదికారు కానీ 

ఆ తల కనిపించలేదు. 


బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. 


అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. 


దేవతలు అలాగే చేశారు. 


ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. 


ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. 

ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. 

దేవీ శక్తి మహిమను , శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. 


అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     🌷🙏🌷

 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`

                     ➖▪️➖



💠 తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న బాణపురీశ్వరర్ ఆలయం, శివుడికి అంకితం చేయబడిన ఒక చారిత్రాత్మక  ఆలయం. 

ఇక్కడి ప్రధాన దైవం, బాణపురీశ్వరర్ , సౌందరనాయకి అమ్మవారితో పాటు పూజించబడతారు. 


💠 కుంభకోణ ఆలయ చరిత్ర ప్రకారం శివుడిచే బాణం వేయబడిన అమృత కలశం గాథతో కూడా ఈ ఆలయానికి సంబంధం ఉంది.

 ఇక్కడ కలశం లేదా బాణీ తేలుతూ ఉంటుంది కాబట్టి శివుడిని బాణపురీశ్వరర్ అని పిలుస్తారు.


🔔 స్థల పురాణం 


💠 కుంభకోణం మరియు మహామాహం ఉత్సవం యొక్క ఆవిర్భావంతో నేరుగా సంబంధం ఉన్న 12 ఆలయాలలో ఇది ఒకటి. ఆ పురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు సమస్త జీవుల బీజాలను, అలాగే వేదాలను మరియు పురాణాలను ఒక కుండలో ఉంచాడు, దానికి అమృత కలశం అని పేరు వచ్చింది.


💠 ఈ రకమైన కుండను సంస్కృతంలో కుంభం అని, తమిళంలో కుడం అని అంటారు. దీనిని పువ్వులు, బిల్వం, శుభ వస్త్రం, చందనం, మరియు యజ్ఞోపవీతం వంటి వివిధ వస్తువులతో అలంకరించేవారు, దాని పైన ఒక కొబ్బరికాయను ఉంచేవారు. ఈ రోజు మనం గృహ కార్యక్రమాలలో మరియు ఆలయాలలో చూసే కలశాల మాదిరిగానే, వీటన్నింటినీ కలిపి కట్టేవారు. 


💠 ఆ కుండను మేరు పర్వతం పైన ఉంచారు. జలప్రళయం భూమిపై ఉన్న సమస్త జీవులను నాశనం చేసింది.  బ్రహ్మ తయారుచేసిన కుంభం కూడా స్థానభ్రంశం చెంది, సంవత్సరాల తరబడి వరద నీటిపై తేలియాడుతూ ఉంది. 

చివరకు, అది ఒక ప్రదేశంలో స్థిరపడింది (దీనినే ఆధునిక కుంభకోణంగా పరిగణిస్తారు). 


💠 శివుడు, ఒక వేటగాడి వేషంలో, తన విల్లు మరియు బాణంతో (బాణం) ఆ కుంభాన్ని పగలగొట్టాడు. ఆ కుంభాన్ని పగలగొట్టిన బాణాన్ని సంధించడానికి ఆయన నిలబడిన ప్రదేశమే బనతురై (ఇది తరువాతి కాలంలో వచ్చిన పేరు). 

ఆ తర్వాత, శివుడు ఇక్కడ స్వయంభూ మూర్తి లింగంగా వెలశాడు.


💠 ఒకప్పుడు వ్యాస మహర్షి నంది చేత శపించబడ్డాడు, కాబట్టి అతను పరిహారం కోసం విష్ణువు వద్దకు వెళ్ళాడు. ఆ మహర్షిని శపించింది నందియే కాబట్టి, కుంభకోణం సృష్టి సమయంలో శివుడు బాణం సంధించడానికి నిలబడిన బనతురైలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని విష్ణువు అతనికి సలహా ఇచ్చాడు. 


💠 ఆ మహర్షి అలా చేసి, తన శాపం నుండి విముక్తి పొందాడు. బయటి ప్రాకారం యొక్క పశ్చిమ భాగంలో, వ్యాసుడు ప్రతిష్ఠించిన వ్యాస లింగాన్ని చూడవచ్చు.


💠 ఆధునిక బెంగాల్‌లోని వంగదేశానికి చెందిన రాజు సూరసేనన్, తన రాణి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండటంతో ఇక్కడ పూజలు చేశాడు.

రాజు తన పరివారంతో ఇక్కడికి వచ్చి శివుడిని పూజించగా, రాణి నయమైంది. 

అతను సందర్శించినప్పుడు ఆలయం శిథిలావస్థలో ఉండటంతో, తన కృతజ్ఞతకు గుర్తుగా ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టాడు.


💠 ఇక్కడి అమ్మవారికి సోమ కళాంబాల్ అనే ప్రత్యేకమైన పేరు ఉంది. ఆమె నాలుగు చేతులతో, ఒక చేతిలో రుద్రాక్ష మాల మరియు తామర పువ్వును ధరించి, మిగిలిన రెండు చేతులను అభయ, వరద హస్తాలలో ఉంచి చిత్రీకరించబడింది. ఇక్కడ సోమ కళాంబికైని పూజిస్తే బద్ధకం నయమవుతుందని నమ్ముతారు.


💠 ఈ ఆలయం కుంభకోణం యొక్క మూలంతో ముడిపడి ఉన్నందున, అంటే దివ్య అమృత కలశం నుండి ఉద్భవించినందున, ఇక్కడ పూజించేవారు ఆ అమృతాన్ని పానం చేసిన పుణ్యాన్ని పొందుతారని నమ్ముతారు!


💠 ఈ ఆలయంలో గర్భగుడి, అంతరాల, అర్ధ మండపం మరియు ముఖ మండపం ఉన్నాయి. 

ఈ ఆలయం 3 అంచెల రాజగోపురంతో తూర్పు ముఖంగా ఉంది. 

బలిపీఠం, ద్వజస్థంభం మరియు ఋషభం రాజగోపురం తర్వాత ఉన్నాయి. 

వినాయకుడు, మురుగన్ మరియు ద్వారపాలకులు గర్భగుడి ప్రవేశానికి ఇరువైపులా ఉన్నాయి.



💠 నిత్య పూజలతో పాటు ప్రదోషం, సంకదహర చతుర్థి, వినాయగర్ చతుర్థి, మహా శివరాత్రి మొదలైన రోజుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


💠 భక్తులు సమర్పించే నైవేద్యాలలో పాలు, తేనె, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీరు మరియు విభూతి వంటివి ఉన్నాయి.

ముఖ్యంగా శివునికి అత్యంత విలువైన బిల్వ పత్రాలను సమర్పిస్తారు. 

దైవ అనుగ్రహం కోసం నెయ్యి లేదా నూనె దీపాలను వెలిగిస్తారు.



💠 కుంభకోణం (2 కి.మీ)  మయిలాడుతురై (38 కి.మీ.) తంజావూరు (42 కి.మీ.)


రచన


©️ Santosh Kumar

సమస్యా పూరణం.

  సమస్యా పూరణం.


సమస్య. "నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా యేమిచెప్పంగనే."


(ఆశా అనేపేరుగల ఆమెతో

మనువు)


"ఆశా" కన్యక కేమిలోటు కనగా నందమ్ము సద్బుద్ధులున్

రాశీభూత గుణాఢ్యగా వెలుగు సద్రాగంబు దీపింపగా

పాశమ్మిట్టుల పెండ్లిరూపమగుచున్ బంధించె దైవమ్ము, తా

"నాశా"ర్థమ్మున నాకు దక్కె మనువన్నా !యేమిచెప్పంగనే.


సురభిశంకరశర్మ.

సమస్యాపూరణం

  సమస్యాపూరణం.2

సమస్య. "నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా  యేమిచెప్పంగనే."


(దుర్వ్యసన పరుడయిన భర్తతో తనబ్రతుకు ఛిద్రమయిందని అన్నతో ఘోషిస్తున్న సోదరి)


ఆశల్గంటిని వానితో బ్రతుకు నాహ్లాదంపు భాగ్యమ్ముగా,

క్లేశమ్మాయెను జీవితమ్ము గనగా- ఖేదాలు భేదాలతో,

పాశమ్మింతియె చాలుచాలు  భవితన్ భావింప సంక్లిష్టమౌ,

"నాశార్థమ్మున నాకు దక్కె మనువన్నా !యేమిచెప్పంగనే,"


సురభి శంకరశర్మ.

27, ఆగస్టు 2026, గురువారం

28ఆగష్టు2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌹శుక్రవారం🌹*

 *🪷28ఆగష్టు2026🪷* 

  *దృగ్గణిత పంచాంగం*


        *ఈనాటి పర్వం*     

      *శ్రావణ/జంధ్యాల*

         *రాఖీ పూర్ణిమ* 


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి       : పౌర్ణమి* ఉ 09.48 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    :శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : శతభిషం* రా 03.13 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం  : అతిగండ* ఉ 07.28 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం   : బవ* ఉ 09.48 *బాలువ* రా 09.56 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ06.00-08.00 సా04.00-05.00*

అమృత కాలం  : *రా 07.44 - 09.23*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*

*వర్జ్యం         :ఉ 09.45 - 11.24*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 మ 12.34 - 01.24*

*రాహు కాలం  : ఉ10.35 - 12.09*

గుళికకాళం      : *ఉ 07.27 - 09.01*

యమగండం    : *మ 03.16 - 04.50*

సూర్యరాశి : *సింహం*                   

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.02*

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.54-08.24*

సంగవ కాలం       :*08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    : *10.54 - 01.24*

అపరాహ్న కాలం  : *మ 01.24-03.54*

*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ పాడ్యమి*

సాయంకాలం   : *సా 03.54 - 06.24*

ప్రదోష కాలం    : *సా 06.24 - 08.42*

రాత్రి కాలం     : *రా 08.42 - 11.46*

నిశీధి కాలం    :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

            *🌷ఓం శ్రీ🌷* 

*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

పాఠకులకు విజ్ఞప్తి

 

మన బ్లాగుని రోజు వేలమంది పాఠకులు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా వున్నది.  ఈ బ్లాగుని వీక్షించే వీక్షకులకు స్వాగతము.  ప్రపంచంలోని వివిధ దేశాలలోని వారికి ఈ బ్లాగు నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా వున్నది.  కానీ చూసే వారు మీకు ఏ పోస్టు నచ్చునది, ఏ పోస్టు నచ్చలేదు అనే విషయాన్నీ వివరణాత్మకంగా మీరు మీ కామెంట్లతో తెలియచేస్తే ఈ బ్లాగుని ఇంకా మంచిగా రూపుదిద్దటానికి వీలు కలుగుతుంది.  

అంతే కాకుండా మీరు కూడా మీకు నచ్చినవి, మీరు మెచ్చినవి.  ఇక్కడ పొందుపరచ్ఛగలరు.  మీ కవితలు, మీ ఇతర రచనలను కూడా ఇక్కడ పోస్టు చేయగలరు.  

ఈ బ్లాగు మనందరిది.  దీనిని నవరసభరితంగా  తీర్చిదిద్దటానికి మనందరమూ కృషిచేద్దాము. 




పంచాంగం 27.08.2026 Thursday

  ఈ రోజు పంచాంగం 27.08.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష చతుర్దశి తిథి బృహస్పతి వాసర ధనిష్ఠ నక్షత్రం శోభన యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: పౌర్ణమి.




 

నమస్కారః , శుభోదయం

27-08-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీమాత్రేనమః 🙏

శ్రీగురుభ్యోనమః 🙏


27-08-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.      

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారములు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సన్నిహితులతో అకారణ విభేదాలు తప్పవు. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

---------------------------------------


మిధునం


వ్యాపారపరంగా ఉన్న ఇబ్బందులు క్రమక్రమంగా తొలగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన, గృహ యోగములు ఉన్నవి. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. 

---------------------------------------


కర్కాటకం


నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. దగ్గరి వారి నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారమున లాభాలు కలుగుతాయి.

---------------------------------------


సింహం


దైవ సంబంధిత విషయములలో ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులందు ఆటంకాలు తప్పవు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

---------------------------------------


కన్య


సంతాన విద్యా విషయాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో ఆందోళనలు పెరుగుతాయి. ఆత్మీయులతో అకారణ కలహ సూచనలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

---------------------------------------


తుల


వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

---------------------------------------


ధనస్సు


దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతతకు దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి , ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.

---------------------------------------


మకరం


వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

---------------------------------------


కుంభం


భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. 

---------------------------------------


మీనం


చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయమై ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. 

---------------------------------------

అక్కడ దాచాను

  అక్కడ దాచాను


రామారావు ఒక ధనవంతుడు అతడు ఒక రోజు బ్యాంకుకు వెళ్లి 5 లక్షల రూపాయలు డ్రా చేసి దాన్ని బ్యాగులో పెట్టుకొని వెళ్లబోతుండగా అతని మిత్రుడు కనబడి మాట్లాడించాడు రామారావు ఏంటి హడావుడి, అంటే రేపు నేను ఢిల్లీ వెళుతున్నాను మా అమ్మాయి పెళ్లి విషయంలో ఐదు లక్షలు మా వాళ్లకు ఇచ్చేది ఉంది అందుకనే నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు ఈ సంభాషణ మొత్తం పక్కనే ఉన్నటువంటి కొండ కోచి అనేటువంటి ఒక దొంగ విన్నాడు వాడు అనుకున్నాడు ఓహో ఈయన రేపు ఢిల్లీకి వెళ్తున్నాడు ఐదు లక్షలు తీసుకొని పోతున్నాడు ఇతనితో పాటు ప్రయాణం చేసి ఆ ఐదు లక్షలు మనం కాజేయొచ్చు అని అనుకున్నాడు మరుసటి రోజు పొద్దున్నే రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు రైల్వేస్టేషన్లో కూడా రామారావు క్యూలో నించుంటే రామారావు వెనకాలే ఈ దొంగ గారు కూడా నిల్చున్నాడు రామారావు టికెట్ తీసుకున్నాడు.అదే రైలుకి తను కూడా ఒక టికెట్ తీసుకున్నాడు రామారావు తో పాటు రామారావు ఎక్కిన బోగీలోనికి రామారావు పక్క సీటు సంపాదించాడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. రామారావు మధ్య రాత్రి వాష్ రూమ్ కి వెళ్ళవలసి వచ్చింది. అదే మంచి అదునుగా భావించి మన దొంగ గారు వెంటనే రామారావు సంచి రామారావు బ్యాగు రామారావు బిస్తరు మొత్తం తనిఖీ చేసి ఎక్కడ డబ్బులు దాచాడో చూసి అది కాజేసి వెంటనే పక్క స్టేషన్లో దిగిపోదామని ఎత్తుగడ వేశాడు కానీ అతను ఎంత వెతికినా కూడా ఒక్కచోట కూడా ఒక ₹100 నోటు కూడా కనబడలేదు ఆశ్చర్యం ఇదేంటి అని అని అనుకున్నాడు నిన్ననే విన్నది అబద్ధమా నా కళ్ళ ముందే 5 లక్షలు డ్రా చేసాడే మరి ఎక్కడ పెట్టినట్టు అని పరి పరివిధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు కొండ గోచి పడుకున్నాడే గానీ నిరంతరం అతని మనసులో ఒకటే శోధిస్తున్నది ఏమిటి ఈ పక్కవాడు ఎంతకు నిద్ర పోవట్లేదు అనుకున్నాడు చిన్నగా రామారావు నిధుల్లోకి జారుకున్నాడు రామారావు నిద్రలోకి వెళ్లగానే మళ్లీ దొంగ గారు చిన్నగా అతని చెయ్యి ఇటు అటు కదిలిచ్చి జేబులో ఆజేబు ఈ జేబు చూసి ప్యాంటు జేబులో చేయి పెట్టి అన్ని జేబులు వెతికాడు తరువాత అతన్ని నకసిక పర్యంతం పరిశీలించాడు కానీ ఒక్కచోట కూడా అతనికి ధనం లభించలేదు ఇక నిరాశ చెందాడు తెల్లవారేసరికి ఢిల్లీ రానే వచ్చింది. అప్పుడు తెగించి అసలు విషయం రామారావు నే అడుగుదాం అని అనుకున్నాడు ఈ రామారావు డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడు రామారావు తీసుకొని వస్తున్నాడు అన్నది మాత్రం సత్యం అందులో ఏమాత్రం అనుమానం లేదు అనుకోని ఎట్లాగో తెల్లవారింది ఆ డబ్బు తనకు లభించలేదు కనీసం అది ఎట్లా భద్రపరిచాడు అన్న విషయం అన్న తెలుసుకుందామని రామారావు ముందర ఓపెన్ అయ్యాడు అయ్యా నన్ను క్షమించాలి నేను మంచివాన్ని కాదు ఒక దొంగని మీ దగ్గర ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు గమనించి నిన్నటి నుంచి మిమ్మల్ని అనుసరిస్తూ వస్తున్నాను. ఇప్పటిదాకా నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోదామనే ప్రయత్నంలోనే ఉన్నా కానీ నా దురదృష్టం మీ డబ్బులు ఎక్కడ పెట్టారో నాకు కనబడలేదు నిజంగా మీరు డబ్బులు తెచ్చారా తేలేదా చెప్పండి అన్నాడు అదేమిటి నాయనా నేను డబ్బులు తేకుండా ఎట్లా ఉంటాను డబ్బులు తీసుకొని వెళ్తాననీ నిన్న మా మిత్రుడితో చెప్పాను కదా నువ్వు పక్కనే ఉండి అన్నీ విన్నావు కదా అన్నాడు అప్పుడు తెల్ల మొహం వేయడం కొండ గోచి పని అయింది వెంటనే అయితే డబ్బులు ఎక్కడ పెట్టారు సార్ అన్నాడు ఇగో ఇక్కడ పెట్టాను అని దొంగ తల దిండు కింది నుంచి డబ్బులు తీసి లెక్కపెట్టుకొని బ్యాగులో పెట్టుకున్నాడు ఇది సంగతి అప్పుడు అర్థమైంది నేను బయట అంత వెతికా గాని నా దగ్గర నేను వెతుక్కోలేదని తెల్ల మొహం వేశాడు దొంగ గారు. అసలు విషయాన్నీ అర్థం చేసుకోకుండా కొంతమంది ఈ కథ సాధ్యమా కాదా ఇందులో లోపాలు ఏంటి అని వెతకడం మొదలు పెడతారు వాళ్ళు అంతా ఐహికులు. కేవలం సాధకులు మాత్రమే కిందిది చదివి అర్థం చేసుకొని అన్వయించుకుంటారు


సాధకులారా భగవంతుడు కూడా ఇదే రకంగా మనల్ని పరీక్షిస్తున్నాడు మనము నిత్యం గుళ్ళు గోపురాలు తీర్థాలు అంటూ ప్రయాణాలు చేసి అలసట చెంది ఉపవాసాలు చేసి ఆహారానికి అనేక చిక్కులు చికాకులు అనుభవిస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాము గుళ్ళకి వెళ్తున్నాము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాం కానీ ఇదంతా బాహ్య ప్రపంచంలో మనం ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు మనకు ఎక్కడ లభ్యం కావట్లేదు నిజానికి ఆ భగవంతుడు బయట ప్రపంచంలో లేడు కేవలం కేవలం అంటే కేవలం మన హృదయ ప్రపంచం లోనే ఉన్నాడు హృదయ ప్రాకారంలోనే భగవంతుడు నెలకొని ఉన్నాడు ఆ భగవంతుడిని తెలుసుకొని భగవంతునిలో లీనం అవటమే మానవ లక్ష్యం ఇదే మనకు మంత్రపుష్పం తెలియజేస్తుంది


 ఓం శాంతి శాంతి శాంతిః


 ఇట్లు మీ చేరువేల భార్గవ శర్మ

26, ఆగస్టు 2026, బుధవారం

27ఆగష్టు2026🌷* *దృగ్గణిత పంచాంగం*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹గురువారం 🌹*

 *🌷27ఆగష్టు2026🌷*  

  *దృగ్గణిత పంచాంగం*

            

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : చతుర్దశి* ఉ 09.08 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం  : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ధనిష్ఠ* రా 02.15 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : శోభన* ఉ 07.56 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : వణజి* ఉ 09.08 *భద్ర* రా 09.32 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ11.00-12.00 సా04.00-06.00*

అమృత కాలం : *మ 03.13 - 04.55*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*

*వర్జ్యం    :శేషం ఉ06.44వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 10.04 - 10.54 మ 03.04 - 03.54*

*రాహు కాలం   :మ 01.43-03.17*

గుళికకాళం      : *ఉ 09.01 - 10.35*

యమగండం    : *ఉ 05.53 - 07.27*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *మకరం/కుంభం* 

సూర్యోదయం :*ఉ 06.01*  

సూర్యాస్తమయం *సా 06.34*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.53- 08.24*

సంగవ కాలం     : *08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    : *10.54 - 01.24*

అపరాహ్నకాలం  : *మ 01.24-03.54*

*ఆబ్ధికం తిధి     : శ్రావణ పూర్ణిమ*

సాయంకాలం   : *సా 03.54 - 06.24*

ప్రదోష కాలం     : *సా 06.24 -08.42*

రాత్రి కాలం        : *రా 08.42-11.46*

నిశీధి కాలం     :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

   *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹