ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
16, జనవరి 2024, మంగళవారం
ప్రభల తీర్థాన్ని తిలకించడానికి ,
*_11 మంది రుద్రుల కలయిక.. సంక్రాంతికే వన్నెతెచ్చే ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’ నేడే_*
కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి , ఇందులో పాలుపంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.
ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమకు సంక్రాంతి తెచ్చే సందడే వేరు. సంక్రాంతికి కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచులా కురుస్తుంది. అక్షరానికందని అదోక వర్ణనాతీత అనుభూతి.
తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఏ రోజుకు ఆ రోజే ప్రాధాన్యం కలిగిన పర్వదినాలివి. అందుకే దీన్ని *‘పెద్ద పండుగ’* అని పిలుస్తారు. భోగి అనగానే - వాడవాడలా వేసే మంటలు , చిన్నపిల్లలకు పోసే భోగిపళ్లు , లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీర్చిదిద్దే బొమ్మల కొలువులు గుర్తుకొస్తాయి.
వ్యవసాయదారుల పండుగ కనుమ. సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉత్సవాలు జరుగుతాయి. అలాగే సంక్రాంతి వేడుకల్లో కోనసీమకూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో ప్రభల తీర్థం ఒకటి. కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల , కనుమ నాడు మరికొన్ని చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు.
వీటన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి - ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు.
పురాణాల్లోని *‘ఏకాదశ రుద్రుల’* కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11మంది ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని పెద్దలు చెబుతుంటారు.
*వారెవరంటే*
వ్యాఘ్రేశ్వరం (విశ్వేశ్వర రుద్ర రూపం) వ్యాఘ్రేశ్వరుడు ,
కృష్ణరాయుడి (కె) పెదపూడి (మహాదేవ రుద్రరూపం) మేనకేశ్వరుడు , ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు , వక్కలంక (త్రిపురాంతక రుద్రుడు) విశ్వేశ్వరుడు ,
నేదునూరు (కాలరుద్రుడు) చెన్నమల్లేశ్వరస్వామి.
ముక్కామల (కాలాగ్ని రుద్రుడు) రాఘవేశ్వరుడు ,
మొసలపల్లి (నీలకంఠ రుద్రుడు) భోగేశ్వరుడు ,
పాలగుమ్మి (మృత్యుంజయ రుద్రుడు) చెన్న మల్లేశ్వరుడు ,
గంగలకుర్రు (సర్వేశ్వర అగ్రహారం) వీరేశ్వరుడు ,
గంగలకుర్రు (సదాశివ రుద్ర రూపం) చెన్నమల్లేశ్వరుడు ,
పుల్లేటికుర్రు (శ్రీ మన్మహాదేవ రుద్రరూపం) అభినవ వ్యాఘ్రేశ్వరుడు.
వీరిలో మొదటివాడైన వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు.
*ప్రభలను ఇలా సిద్ధం చేస్తారు*
తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి , వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు , వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు.
పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి కంకులు , నెమలి పింఛాలు , పూల దండలు , ఇతర సామగ్రితో అలంకరిస్తారు.
వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.
అనంతరం మేళతాళాలు , మంగళ వాద్యాలు , వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని , వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ , పంట చేలు , కాలువల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.
ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి *‘వీరభద్ర ప్రభలు’* గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు , కళా ప్రదర్శనలు , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి , ఇందులో పాలుపంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి భావాన్ని చాటుకుంటూ , ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. కనుమ రోజున ప్రభల తీర్థంతో ఆధ్మాత్మిక క్షేత్రంగా భాసిల్లే జగ్గన్నతోట ప్రాంతం మిగిలిన రోజుల్లో నిర్మానుష్యంగా ఉంటుంది.
ధాత్రుత్వం అంటె
పసుపు చీరలో ఉన్న తల్లి పేరు యశోద. మధురలోని శ్రీ బాంకే బిహారీ ఆలయం వెలుపల గత 30 సంవత్సరాలుగా ఆలయానికి వచ్చే భక్తుల చెప్పుల కాపలా కాస్తున్నారు. ఆమెకు 20 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు. తనకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ తల్లి... తాను చెప్పులు కాపలా కాయడం ద్వారా సంపాదించిన 51 లక్షల 10 వేల 25 రూపాయల ను అయోధ్యలో దేవాలయ ధర్మశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఏముంది ఈ మట్టిలో... ఇలాంటి పుణ్యమూర్తులకు జన్మనిచ్చింది పావన జననివమ్మా భారతమాతా....🙏
రాశి ఫలితాలు
*శుభోదయం*
16.2291923113
*****
16-01-2024
భౌమ వాసరః(మంగళవారం)
రాశి ఫలితాలు
XXXXX
మేషం
మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు.
--------------------------------------
వృషభం
వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
---------------------------------------
మిధునం
ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బందు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
---------------------------------------
కర్కాటకం
నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార,ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది.
---------------------------------------
సింహం
కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
------------------------------------
కన్య
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు.
-------------------------------------
తుల
వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
---------------------------------------
వృశ్చికం
సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
---------------------------------------
ధనస్సు
విందువినోదాలు కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
------------------------------------
మకరం
కుటుంబమునకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.
------------------------------------
కుంభం
వృత్తి ఉద్యోగాలలో నీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
--------------------------------------
మీనం
వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.
---------------------------------------
పంచాంగం 16.01.2024
ఈ రోజు పంచాంగం 16.01.2024
Tuesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస శుక్ల పక్ష: షష్థి తిధి భౌమ వాసర: ఉత్తరాభాద్ర నక్షత్రం పరిఘ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.
షష్థి రాత్రి 12:00 వరకు.
ఉత్తరాభాద్ర రా.తె 04:38 వరకు.
సూర్యోదయం : 06:53
సూర్యాస్తమయం : 05:58
వర్జ్యం : మధ్యాహ్నం 03:09 నుండి 04:39 వరకు.
దుర్ముహూర్తం : పగలు 09:06 నుండి 09:50 వరకు తిరిగి రాత్రి 11:08 నుండి 12:00 వరకు.
అమృత ఘడియలు : రాత్రి 12:08 నుండి 01:38 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
సంకల్పము
*శుభోదయం*
**********
*సంధ్యా వందన మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.16.01.2024 మంగళ వారం (భౌమ వాసరే) *
16.229192313
****
సంధ్యా వందన మరియు ఇతర
పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.16.01.2024
మంగళ వారం (భౌమ వాసరే)
***********
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే
హేమంతృతౌ
పౌష్య మాసే శుక్ల పక్షే పంచమీ సంయుక్త షష్ఠ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భౌమ వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
*ఇతర పూజలకు*
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే
హేమంతృతౌ పౌష్య మాసే శుక్ల పక్షే పంచమీ సంయుక్త షష్ఠ్యాం
భౌమ వాసరే అని చెప్పుకోవాలి.
*ఇతర ఉపయుక్త విషయాలు*
సూ.ఉ.6.38
సూ.అ.5.41
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు
పుష్య మాసం
శుక్ల పక్షం పంచమి ఉ.7.34 వరకు. షష్ఠి (ఏష్యం)రా.తె.5.10 వరకు.
మంగళ వారం.
నక్షత్రం పూర్వాభాద్ర
ప. 11.30 వరకు.
అమృతం తె.5.51 ల మరునాడు ఉ.7.21 వరకు.
దుర్ముహూర్తం ఉ.8.50 ల 9.34 వరకు.
దుర్ముహూర్తం రా.10.52 ల 11.44 వరకు.
వర్జ్యం రా.8.28 ల 9.58 వరకు.
యోగం పరిఘ రా.1.19 వరకు.
కరణం బాలవ ఉ. 7.34 వరకు.
కరణం కౌలవ సా. 6.22 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం సా.3.00 ల 4.30 వరకు.
గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు.
యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు.
**********
పుణ్యతిధి పుష్య శుధ్ధ షష్ఠి.
****
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
.
వేమన పద్యములు
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
. *🌹వేమన పద్యములు🌹*
. *అర్థము - తాత్పర్యము*
. *Part - 1*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
. *💥 వేమన ప్రజాకవి*
ప్రజలకు ఉపయోగించెడి నిత్యాసత్యముల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా రచన కొనసాగించి, వేదసారాంశమును, వేదాంత సారమును తెలుగు పద్యాలలో ఆంధ్రులకందించిన మహానుభావుడు. జ్ఞానము, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము నంతటిని తన పద్యములలో చొప్పించిన మహానుభావుడు.*
*💥 వేమన ఎంత రక్తి కలవాడో చివరికి అంత విరక్తితో నిత్యాసత్యములను సమాజమున కందించి , అందరినీ చైతన్యపరచిన సామాజిక న్యాయ నిర్ణేత వేమన .*
*వేమన గ్రహించిన సామాజికమును , సంఘసంస్కారము వేరెవ్వరు ఊహించలేరేమోననే తలంపు కలుగును. ఏదైనా ఒక విషయమును విమర్శించాలంటే అలాగే నిర్మొహమాటముగా చెప్పాలంటే ఆయనకే చెల్లుతుంది.*
*చక్కని జ్ఞానాత్మక బోధనలు , హాస్య రసము , సాంఘిక దురాచారాలు ఎంతో లోతుగా ఆలోచించి పద్య రచన సాగించాడు.*
*💥 వేమన పద్యాలు చెప్పుకునే ముందు కొన్ని ప్రార్థన పద్యములను చెప్పుకుని తరువాత ప్రతీ దినము రోజుకి ఒక్కొక్కటి చొప్పున పద్యము - తాత్పర్యముతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.*
*💥 ప్రార్థన పద్యము --- 1*
శ్రీకర బ్రహ్మాకారుని
ప్రాకటముగ మదిని జేర్చి ప్రణవాకృతితో
సోకి నటించెడి జ్ఞప్తిని
పాకముగని దాటువాడె భక్తుడు వేమా .
*🌹తాత్పర్యము ---*
శుభములు కలిగించెడి ఆ బ్రహ్మ స్వరూపుడైన ఆ దేవదేవుని మనసున నిలిపి , ఓంకార నామముతో జపించెడి నరుడే నిజమైన భక్తుడగును.
*💥 ప్రార్థన పద్యము ---2*
శ్రీ మూల శక్తి యనదగు
నా మూర్తుల గన్న తల్లి నౌగా దనకన్
ధీమూర్తి నెంచి చూడుము
నీ మూర్తికి సాటి లేదు నిజముగ వేమా.
*🌹తాత్పర్యము ---*
ముగురమ్మల మూలపుటమ్మ , శక్తి స్వరూపిణి , అమ్మను నమ్మినవాడే ఆమెనెల్లప్పుడు తలచినవాడే గొప్పవాడు , బుద్ధిశాలి అగును.
*💥 ప్రార్థన పద్యము ---3*
శ్రీ యన మంగళ దేవత
శ్రీ యనగా విష్ణుపత్ని సిరి సంపదయున్
శ్రీ యనెడు మూలశక్తిని
శ్రీ యని వర్ణింపు మెపుడు స్థిరమతి వేమా.
*🌹తాత్పర్యము ---*
శ్రీ అన్నచో మంగళ దేవతగ , విష్ణుపత్ని లక్ష్మిగ , సిరి సంపదలకు ఆటపట్టుగ , మూలాధార శక్తిగా మానవుడు స్థిరమైన బుద్ధితో తలచవలెను.
అన్నింటికీ " శ్రీ " మూల శక్తి అని గ్రహించవలెను.
*💥 ప్రార్థన పద్యము --- 4*
శ్రీరామ రామ నామము
మారాడక విను నరులకు మహితాత్ముండై
యూరూర దిరిగి చెప్పుమి
యారూఢ తపః ఫలంబులగు వేమపతీ.
*🌹తాత్పర్యము ---*
రామనామము ఊరూర తిరిగి జపించినచో గొప్పదైన తపః ఫలము సిద్ధించును.
రామనామము నందు అంత గొప్ప శక్తి కలదని భావము.
*💥 ప్రార్థన పద్యము --- 5*
శ్రీరామ యనెడు మంత్రము
తారక మని యెరిగి మదిని ధ్యాన పరుండై
సారము గ్రోలిన నరునకు
జేరువగను బరమపదవి చేకూరు వేమా.
*🌹తాత్పర్యము ---*
వైకుంఠ నివాసము కలగాలంటే " శ్రీరామ శ్రీరామ " అనెడి
తారకమంత్రమును మానవుడు ధ్యాననిష్ఠతో జపించవలెను.
రుచికరమైన తారక మంత్రమును కోరి భజించవలెను.
*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి*
*సర్వేజనా సుఖినోభవంతు*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
భాగవతము
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ద్వితీయ స్కంధము*
*కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె*
*వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో*
*దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్*
*జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.*
శ్రీ మహావిష్ణువును పుండరీకాక్షుడు అంటారు. బాగా వికసించిన పద్మపు విశాల మైన రేకులవంటి కన్నులున్నవాడు. సృష్టిలో ఏర్పడే ప్రతిదానిని కార్యం అంటారు. దానికి కారణం ఒకటి వేరుగా ఉంటుంది. విత్తనం కారణం. చెట్టు కార్యం. కాని పరమాత్మా, జగత్తూ రెండూ విష్ణువే. మరొకరులేరు. నాయనా! అటువంటి భగవంతునీ, అంతము లేనివానినీ, లోకాల సముదాయాన్నంతటినీ భావిస్తూ ఉండేవానినీ ధ్యానిస్తూ ఉండాలి. నిజానికి ఆయనకు ఏ గుణాలూ లేవుగానీ మనలను ఉద్ధరించటానికి ఆయన కొన్నిగుణాలు ఏర్పరచుకొని మనయందు కృపతో తెలియవస్తూ ఉంటాడు. అటువంటి గుణాలను గొప్పగా సంస్కరించుకొన్న బుద్ధితో మనం కొనియాడుతూ ఉండాలి. అలా చేయకపోతే గుణాలు లేని పరమాత్మను మన మనస్సులు చేరవు. అది చాలాపెద్ద ప్రమాదం.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
మారిన మనసు..*
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
*మారిన మనసు..*
"దత్తాత్రేయ స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నామండీ..కానీ ఎప్పుడూ కుదరటం లేదు..ఈసారి శనివారం నాడు వద్దామని నిర్ణయించుకున్నాము..టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాము..శనివారం ఉదయం కందుకూరుకు వచ్చి, అక్కడనుండి నేరుగా మాలకొండకు వెళ్లి, ఆ మాల్యాద్రి లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దర్శనం చేసుకొని..ఆ కొండమీద శ్రీ దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసుకున్న పార్వతీదేవి మఠం, శివాలయం కూడా చూసి..సాయంత్రానికి మొగలిచెర్ల చేరుతాము..సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొంటాము..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయాన్నే..స్వామివారి సమాధిని దర్శించుకొని..తిరుగు ప్రయాణం అవుతాము..ఇదీ స్థూలంగా మా ప్రయాణం గురించిన వివరణ.. మాకు అక్కడ శనివారం సాయంత్రం నుంచీ వుండటానికి ఒక గది కేటాయించగలరా?.." అని బెంగుళూరుకు చెందిన సత్యవతి గారు ఐదారు వారాల క్రిందట ఫోన్ లో అడిగారు..ఆరోజు సోమవారం కనుక, శనివారం నాటికి గది కేటాయిస్తానని చెప్పాను..సంతోషం తో ధన్యవాదములు తెలిపారు..
అనుకున్న విధంగానే సత్యవతి గారి కుటుంబం శనివారం సాయంత్రానికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరారు..సత్యవతి గారు, ఆవిడ భర్త రామమూర్తి గారు..వాళ్ళ ఇద్దరు పిల్లలు..ఒక కుమార్తె, ఒక కుమారుడు..మొత్తం నలుగురూ వచ్చారు..పిల్లలిద్దరూ ఇంజినీరింగ్ పూర్తి చేశారు..కూతురు బెంగుళూరు లోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తోంది..కుమారుడు ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాడు..
పల్లకీసేవ సమయానికి ఓ గంట ముందు సత్యవతి గారు, ఆవిడ భర్త గారు నా వద్దకు వచ్చి.."మా బెంగ అంతా మా అమ్మాయి గురించే నండీ..మంచి ఉద్యోగం చేస్తోంది..ఇప్పుడు పాతికేళ్ల వయసు వచ్చింది..వివాహం చేద్దామని ప్రయత్నాలు చేస్తుంటే..వద్దని చెపుతున్నది..తనకా ధ్యాసే లేదంటోంది..పెళ్లి చేసుకోనని భీష్మించుకుని వున్నది.. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండీ..మొగలిచెర్ల స్వామి వారి గురించి ఈమధ్య చదువుతూ వున్నాము..అందుకని ఈ స్వామివారి వద్ద మ్రొక్కుకుంటే..ఫలితం వుంటుందేమోనని ఆశతో ఇంతదూరం వచ్చాము..అమ్మాయి తో కేవలం ఒక దేవాలయ దర్శనానికి మాత్రం వెళుతున్నామని చెప్పాము..ఇలా తన వివాహం గురించి కోరికతో వెళుతున్నామని తెలిస్తే..నానా యాగీ చేసి..తాను రాదు సరికదా..మమ్మల్ని కూడా పోనివ్వదు.. " అని బాధతో చెప్పుకున్నారు ఆ దంపతులు..
"మీరు ముందు పల్లకీ సేవలో పాల్గొనండి..రేపు శ్రీ స్వామివారి సమాధి వద్ద..మీ మనసులోని కోరికను కోరుకోండి..ఆపైన శ్రీ స్వామివారి దయ..మీ ప్రాప్తం.." అని చెప్పాను..సరే అన్నారు..
సాయంత్రం పల్లకీ సేవ వద్ద నలుగురూ కూర్చున్నారు..పల్లకీ ని రామమూర్తి గారు, వాళ్ళ అబ్బాయి ఇద్దరూ మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేదాకా మోసారు..ఆ రాత్రికి మందిరం లోనే నిద్ర చేస్తామని చెప్పారు..ఆరోజు భక్తులు కూడా విపరీతంగా వచ్చారు..అంతమంది భక్తుల మధ్యలోనే..ఆ దంపతులు మందిరం లో పడుకున్నారు..తెల్లవారుఝామున లేచి..గబ గబా స్నానాదికాలు ముగించుకొని..శ్రీ స్వామివారి ప్రభాత పూజకు వచ్చారు..నలుగురూ మంటపం లో కూర్చున్నారు..
శ్రీ స్వామివారి సమాధికి అభిషేకం హారతులు పూర్తయిన తరువాత..సత్యవతి గారి కుటుంబం శ్రీ స్వామువారి విగ్రహం వద్ద పూజ చేయించుకొని..లోపల సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఆ దంపతులిద్దరూ శ్రీ స్వామివారి సమాధికి తల ఆనించి..మనస్ఫూర్తిగా మ్రొక్కుకున్నారు..అప్పటిదాకా మౌనంగా అన్నీ చూస్తున్న ఆ అమ్మాయి కూడా శ్రీ స్వామివారి సమాధికి తల ఆనించి కళ్ళుమూసుకుని ప్రార్ధన చేసుకున్నది..అందరూ ఇవతలికి వచ్చేసారు..కొద్దిసేపు మంటపం లో కూర్చుని..తిరిగి నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ దర్శనం బాగా అయిందండీ..చాలా ప్రశాంతంగా ఉంది..అన్నీ కుదిరితే..మళ్లీ వస్తాము.." అన్నారు..
"ఏం బాబూ..నువ్వేం కోరుకున్నావు?.." అబ్బాయిని అడిగాను.."ఉద్యోగం కోసం కోరుకున్నాను అంకుల్!.." అన్నాడు.."ఏమ్మా..మరి నువ్వో.." అని ఆ అమ్మాయిని అడిగాను..
ఎందుకో తటపటాయించింది..చెప్పడానికి ఇష్టం లేదేమో అని అనుకున్నాను.."ప్రసాద్ గారూ..ఇక మేము బైలుదేరుతామండీ..నెల్లూరు వెళ్లి, అక్కడనుండి రాత్రికి బెంగుళూరుకు వెళతాము.." అని చెప్పి వెళ్లిపోయారు..సరే అని నేనూ నా పనిలో ఉండిపోయాను..
అరగంట గడిచింది..ఊరికి వెళతామని చెప్పిన సత్యవతి గారు, రామమూర్తి గారు మందిరం లోకి వచ్చారు.."ఇంకొక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లివస్తామండీ.." అన్నారు..సరే అన్నాను..నలుగురు లోపలికి వెళ్లి వచ్చారు..ఈసారి ఆ దంపతుల ముఖం లో సంతోషం కనబడుతున్నది.."ప్రసాద్ గారూ..అమ్మాయి వివాహానికి ఒప్పుకున్నది..సంబంధాలు చూడమని చెప్పింది..తానే స్వయంగా మాతో ఇప్పుడే గది లో చెప్పింది..స్వామివారి దయ ఇంత త్వరగా మామీద ప్రసరిస్తుందని అనుకోలేదండీ..ఎంతో ఆనందంగా వుందండీ.." అన్నారు..అమ్మాయి వైపు చూసాను..అవునన్నట్లు తలవూపింది.."ఇప్పుడు నెల్లూరు ప్రయాణం మానుకున్నామండీ..మధ్యాహ్నం దాకా ఇక్కడే స్వామివారి సన్నిధిలో గడిపి..నేరుగా ఇక్కడినుంచే బెంగుళూరుకు వెళతాము.." అన్నారు..
కొంతమంది కోరుకున్న కోరికలు ఆ నిమిషం లోనే నెరవేరుతాయి..ఆ కోవకు చెందిన వారే సత్యవతి రామమూర్తి దంపతులు..డిసెంబర్ ఆఖరి వారం లో వాళ్ళ అమ్మాయి వివాహం అనీ..తప్పకుండా వివాహానికి వచ్చి, ఆశీర్వదించి వెళ్ళమని నన్ను కోరారు..సరే అన్నాను..వివాహం కాగానే తరువాతి ఆదివారం నాడు వధూవరులను మొగలిచెర్ల కు తీసుకువచ్చి..శ్రీ స్వామివారి దర్శనం చేయిస్తామని..ఆరోజు అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు తామే భరిస్తామని కూడా చెప్పారా దంపతులు..అనుకున్న విధంగానే వివాహం అయిన ప్రక్క ఆదివారం నాడు నూతన దంపతులను తీసుకొని , శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఆ ఆదివారం అన్నదానం ఆ దంపతుల చేతుల మీదుగా జరిపించారు..రామమూర్తి, సత్యవతి గార్ల సంతోషానికి అవధులు లేవు..శ్రీ స్వామివారే వాళ్ళ కూతురు వివాహం జరిపించాడని పదే పదే చెప్పుకున్నారు..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా.)
పండుగల శుభాకాంక్షలు*
సంకురాత్రిమీకుసకలసౌఖ్యంబులు
సంతసములనిచ్చిచింతదీర్చి
మీకుటుంబమునకుమేలుజేయుచుసదా
సంబరములనిచ్చిసాకుగాక
తపస్వీవిజయవాడ
*పండుగల శుభాకాంక్షలు*
సర్వశుభంబులిచ్చిపలుసంపదలిచ్చిసుఖంబులిచ్చియీ
పర్వముమీకుటుంబమునుబంధుగణంబునకీర్తిపెంచుచున్
పూర్వపుబాధతీర్చునుసమూలముగన్ యశస్సుమీ
కుర్విపయిన్ నిరంతరమునున్నతరీతులకల్గజేయుచున్
భోగిసంక్రాంతికనుమలుముక్కనుమను
గూడిసంతోషములనిచ్చికోర్కెదీర్చి
మీకళత్రపుత్రాదులమేలుగూర్చి
కార్యములలోవిజయములుకలుగుగాక
భార్యాపిల్లలుమీకుస
పర్యలగౌరవమునిచ్చిపరపతిపెంచున్
ధైర్యమువారైసద్గుణ
చర్యలతోమీకుసంతసంబునిడుసదా
తపస్వీవిజయవాడ (పంతుల వెంకటేశ్వరరావు)
కందము
అద్దమున విభుని గాంచుచు
ముద్దియ పులకింత, సిగ్గు, మురిపెము తోడన్
సుద్దులు చెప్పుచు మూసెను
దిద్దిన కాటుక కనులను తీవ్ర తమకమున్. 🙏
కందము
సతతము వెన్నుని ధ్యానము
నతివ తన మనసున చేయ నాశ్చర్యముగా
ప్రతిబింబమ్ముగ సమ్ముఖి
నతడే యగుపడ సొలపున నందము నందెన్. 🙏
కందము
మాధవు పతిగా పొందగ
గోదా చేసెను వ్రతమును గోవిందు రహిన్,
కాదనడు స్వామి జీవుని
వేదన, శరణమును గోరి వేడుకొనంగా. 🙏
కందము
వ్రతమును చేసెను గోదా
పతి గావలె పరమధామపతి తనకని, శ్రీ
పతి గైకొనె భూరి నెనరు
నతి లోక విభవమున మగనాలుగ ముదమున్ 🙏
ఉత్పలమాల
తాను ధరించు మాలలను తామర నేత్రుడు, రంగనాథుడే
ప్రాణ ప్రదమ్ముగా గొని వివాహమొనర్చగ నానతీయగా,
మానిని యాచరించినది మార్గళి పూజను తాను గోపికై,
గానము చేసె మాధవుని గాథల పాటల పాశురమ్ములన్,
మానవ కోటి పాపములు మాపును పావన గాథ తల్చినన్. 🙏
ఓం శ్రీ గోదా మహా లక్ష్మై, శ్రీ రంగ నాయకై నమః 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏
కనుమ పండుగ
*కనుమ పండుగ*
కనుమని కనమన కనుమని
కను మనకని కనగననుౘు కనులను కనగ
న్నిను నను మనమని మనమున
మనమను మననమునొనరగ మన కనుమొసగున్
సన్🌞క్రాంతి
*సన్🌞క్రాంతి🔥*
మామిడి తోరణాలతో
రంగురంగుల ముగ్గులతో
కళకళలాడే వాకిళ్ళతో
గాలిపటాల అందాల పండుగ సంక్రాంతి.
మీ ఇల్లు ఆనంద నిలయమై మీరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
🎋🌾
మీకు మీ కుటుంబ సభ్యులకు
*🌞సంక్రాంతి🔥 శుభాకాంక్షలు*🎋🌾
*శిరిపురపు శ్రీధర్ శర్మ* గుంటూరుm
జానపద కళారూపాలు
. *జానపద కళారూపాలు*
--------------------
ఒకానొకప్పుడు పల్లెలు కళారూపాల ప్రదర్శనకు ఆలవాలాలుగా వుండేవి. సంవత్సరంలో అనేకరోజులలో అనేకరకాలవారలైన కళాకారుల ప్రదర్శనలవారితో సందడి సందడిగా వుండేవి.
వారంతా ఆ ఆ గ్రామాలవారే కానక్కరలేదు, వివిధ ప్రాంతాలనుండి వచ్చి , ప్రజాకర్షణీయమైన వివిధరకాలైన కళలను ప్రదర్శించేవారు. అలా ప్రదర్శించినవారిలో, కొందరు ధనరూపేణా, మరికొందరు ధాన్యరూపేణా గ్రామాలలోని వివిధవర్గాల ప్రజలనుండి బహుమతులుగా అందుకొని, అలావచ్చిన వాటితో ఏడందంతా జీవనోపాధిగా మలుచుకొని, పిల్లాపాపలతో ఉఖంగా కాలంగడిపేవారు..అలాటి కళారూపాలను ప్రదర్శించేవారిలో కొందరు కళాకారులనుగూర్చి తెలుసుకొందాం.
మాచిన్నప్పుడు మా రౌతులపూడికి రకరకాల కళాకారులు బ్రతుకు తెరువుకోసం వచ్చేవారు. పంటలు ఇంటికొచ్చే సమయంలో అయితే మరీ ఎక్కువమంది వచ్చేవారు. వాళ్ళలో పగటి వేషగాళ్ళు, పిట్టలదొరలు, దొమ్మరాటలవాళ్ళు, విప్రవినోదులు, జంగందేవరలు, కొండచెంచులు, తోలుబొమ్మలాటలవాళ్ళు ,బుడలుడక్కలవాళ్ళు, గంగిరెద్దులవాళ్ళు, ఇలా రకరకాలవావాళ్ళు వచ్చేవారు. వీరిలోకొంతమది డబ్బులు ఇచ్చినా తీసుకొనేవారుకాదు. రైతుల కళ్ళాలలోకెళ్ళి ధాన్యంమాత్రమే వారిచ్చినంతమేరకు సంతోషంగా పట్టికెళ్ళేవారు. కొంతమందిమటుకు కొత్తబట్టలు పెట్టమని అడిగేవారు కానీ, కొత్తబట్టలతోపాటుగా పాతబట్టలు శుభ్రమైనవి ఇచ్చినా పట్టికెళ్ళేవారు.
అలామాఊరు వచ్చిన కళాకారుల్లో పగటి వేషగాళ్ళు, పిట్టల దొరలు, దొమ్మరాట వాళ్ళూ, కొమ్మదాసరులు, పిల్లలను బాగా ఆకర్షించేవారు. వారు ఎక్కడ ప్రదర్శనలిస్తే అక్కడికి పొలోమని పిల్లలంతా వారిని కూడావెంటబడి పోయేవారు. తాటకి వేషం వేసిన వేషగాళ్ళని చూస్తే, పిల్లలకి ఒకరకంగా ఆసక్తిగా, మరోరకంగా భయంగా వుండేది. పెద్ద ఎత్తైన శరీరం, నల్లటి నలుపు, పెట్టుకొన్న రాక్షస కోరలు. జడలుకట్టిన జులపాలవంటి జుట్టూ, మొలకి వేపాకులు చుట్టుకొని, ఎత్తెత్తు వెనుకభాగంతో, బారకో అడుగు, మూరకో
అడుగు వేస్తూ డప్పుల లయకు శరీరాన్ని ఊపుతూ, నల్లటి కొండలా కదిలి వెళుతున్నట్లు తాటకి వేషదారి వెళుతుంటే, పిల్లలు భయపడుతూనే, వెంటబడి వెళ్ళేవారు. ఆ తాటకి పిల్లలను తమాషాగా భయపెట్టడానికి, వున్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగి నాలుగడుగులు వేసేసరికి,
పిల్లలు భయంతో పెద్దగా అరుస్తూ వెనక్కి పరుగుదీసేవారు. అలా అని ఆగిపోతారా, అంటే అలాగాగిపోరు మళ్ళీ తాటకి వెంటపడతారు. అదో తమాషావారికి.
పగటి వేషగాళ్ళు రాముడూ సీతా, లక్ష్మీ విష్ణుమూర్తి, ఆంజనెేయుడూ, గరుక్మంతుడూ, రాధా కృష్ణులు మొదలైన పురాణాలలో వేషాలు వేసేవారు. అవే కాకుండా, నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్ మేదలైన దేశభక్తుల వేషాలూ వేసేవారు. అయితే, మొఖంలో సగభాగం శివుడిగా, సగభాగం పార్వతిగా, సగభాగం పులితోలూ, సగభాగం చీరకట్టుతోనిపించే అర్థనారీశ్వర వేషం చాలాబాగుండేది. అలా క్షణంలో ఎలా శివుడిగా, పార్వతిగా ఎలామారిపోతారో అని అప్పట్లో చాలా ఆశ్చర్యంగా వుండేది. తలమీదనుండి కప్పుకున్న గుడ్డను ముక్కుమీద సగభాగానికి వచ్చేలా కప్పుకొని, మొఖానికి ఒకపక్క శివునిగా, మరోపక్కన పార్వతిగా రంగులువేస్తారన్న విషయం,ఆగుడ్డను ఒకసారి శీవునివైపు, మరొకసారి పార్వతివైపుకు మారుస్తూ, శివపార్వతుల డైలాగులను చెపుతారన్నవిషయం అప్పట్లోమాకు అస్సలు తెలియదు.
కొమ్మదాసరి ముచ్చట్లు చెప్పనేలేము. దగ్గరలోవున్న చెట్టును చటుక్కున ఎక్కేసి,"ఓ సూరమ్మప్పయ్యో,! ఓ రామమ్మప్పయ్యో! ఓ పేరమ్మప్పయ్యో!
ఓ పచ్చచీర ట్టుకొన్నప్పయ్యో! ఓ ఎర్రచీర కట్టుకొన్నప్పయ్యో! ఉరికేస్తున్నా! ఉరికేస్తున్నానప్పయ్యో!పప్పుదాకలోకురికేస్తున్నానప్పయో!ఉప్పుదాకలోకురికేస్తున్నానప్పయ్యో!" అంటూ చేతిలో ఆచెట్టుకొమ్మ నొకటి విరిచి పట్టుకొని లయబద్దంగా పాడుతూ అతడు చేసే హడావిడి పిల్లలనూ, పెద్దలనూకూడా నవ్వుల్లో ముంచెత్తేది.
అలాగే పిట్టలదొర. "దొరలమొచ్చేము.పిట్టలదొరలమొచ్చేము" అంటూ కర్రతుపాకీ పట్టుకువచ్చి చేసేహడావిడి అంతా ఇంతా కాదు. "హడావిడిగావుంది-హడావిడిగావుంది. మీ ఎత్తైన అరుగులు పల్లంచేయమంటారా? ఇంటింకీ కుళాయిలు,ఇంట్లో ఒక కుళాయి, పొయ్యమీదొక కూళాయి, పొయ్యిక్రిందోకుళాయి" అంటూ చెప్పేకబుర్లకు పొట్టలుపట్టుకు నవ్వవలసిందే జనాలందరూ.
ఇక దొమ్మరాట చిన్న చిన్న పిల్లలను ఎత్తైన గడపైకి
ఎక్కించి, బొడ్డును బేస్ గా చేసుకొని, డప్పుల ధ్వనికణుగుణంగా గిర్రుమని గుండ్రం తిప్పటం, రెండు గడలను దూరం దూరంగాపాతి, వాటికి సన్నని తాడుకట్టి, చేతితో ఒక పొడవైన గడకర్ర గుడ్రంగా తిప్పుతూ, ఆతాడుపైన యువతులు బేలన్స్ గా నడుస్తుంటే, కళ్ళు ఆర్పకుండా, నోళ్ళు తెరచి చూసేవారు.
మరో కళాకారుడు నెత్తిమీద నూనె మూకుడు పెట్టి, మూకుడులో పకోడీలువండి పంచి పెట్టే ఛూ..మంతరకాళీ వాళ్ళను చూస్తుంటే భయంతో కూడిన ఆకర్షణగావుండేది.అయితే,చాలామంది పిల్లలు ఝడుసుకొని జ్వరంకూడా తెచ్చుకొనేవారు.
అలాగే తూర్పు తెల్లవారకుండా వచ్చే జంగందేవర "భంభం "అంటూ గుక్కతిప్పుకోకుండా ఊదే శంఖం ధ్వని ఊరంతా మారుమ్రోగేది. అతడికి ముందుగనో వెనుకగానో "అంబపలుకు జగదాంబ పలుకు" అంటూ ఆకర్షణీయమైన రంగు రంగుల బట్టలు ధరించి, తలపైన పేకాటలో కింగ్ నెత్తిపైన వుండే కిరీటంలాంటి టోపీ పెట్టుకొని, డమరుకం మ్రోగిస్తూ వచ్చే బుడబుడక్కలవాడూ, అతడి మాటలూ అదోరకమైన ఆకర్షణ.
తోటపెద్దుఅనే ఆబోతును ఇంటింటికీ తీసుకొచ్చి గుమ్మాలముందు నిలబెట్టి, పెద్దపెద్ద భజన తప్పెట్లు పట్టుకొని,గుడ్రంగా పద్మంలా కొంతమంది నుంచుంటే, మధ్యలో ఒకడు "హరిహరీ నారాయణా-ఆదినారాయణా- -కరుణించి కాపాడు కమలలోచనుడా.. "అంటూ నెమలికన్నులకట్ట ఒకచేతితో పట్టుకొని, మరోచేతితో ఎడమచెవి మూసుకొని శ్రుతిబధ్ధంగా పాడుతూ తిరుగుతుంటే, తప్పెటగాళ్ళ, తిరిగి ఆపదం ఒకటికి రెండుసార్లు అంటూ భళ్ళు భళ్ళు మని ఆ పెద్ద పెద్ద భజన తప్పెట్లు లయబధ్ధంగా వాయిస్తూ గుడ్రంగా తిరుగుతూ, ఒకకాలు ముందుకూ, మరోకాలు వెనక్కీ వెస్తూ చేసే ఆ కళాజాతర, చూడవలసినంత అందంగా వినవలసినంత శ్రవణానందకరంగావుండేది.ఆ భజనతప్పెట్ల శబ్దాలు మనగుండెల్లో మ్రోగినట్లుండేవి..
అలాగే తూర్పు తెల్లవారకుండా వచ్చే జంగందేవర "భంభం "అంటూ గుక్కతిప్పుకోకుండా ఊదే శంఖం ధ్వని ఊరంతా మారుమ్రోగేది. అతడికి ముందుగనో వెనుకగానో "అంబపలుకు జగదాంబ పలుకు" అంటూ ఆకర్షణీయమైన రంగు రంగుల బట్టలు ధరించి డమరుకంమ్రోగిస్తూ వచ్చే బుడబుడక్కలవాడూ, అతడి మాటలూ అదోరకమైన ఆకర్షణ.
తోటపెద్దుఅనే ఆబోతును ఇంటింటికీ తీసుకొచ్చి గుమ్మాలముందు నిలబెట్టి, పెద్దపెద్ద భజన తప్పెట్లు పట్టుకొని, గుడ్రంగా పద్మంలా కొంతమంది నుంచుంటే, మధ్యలో ఒకడు హరిహరీ నారాయణాదినారాయణ- -కరుణించి కాపాడు కమలలోచనుడా.. అంటూ నెమలికన్నులకట్ట ఒకచేతితో పట్టుకొని, మరోచేతితో ఎడమచెవి మూసుకొని శ్రుతిబధ్ధంగా పాడుతూ తిరుగుతుంటే, తప్పెటగాళ్ళ, తిరిగి ఆపదం ఒకటికి రెండుసార్లు అంటూ, బళ్ళు బళ్ళు మని ఆ పెద్ద పెద్ద భజన తప్పెట్లు లయబధ్ధంగా వాయిస్తూ గుడ్రంగా తిరుగుతూ ఒకకాలు ముందుకూ, మరోకాలు వెనక్కీ వెస్తూ చేసే ఆ కళారూపం చూడవలసినంత అందంగా వినవలసినంత శ్రవణానందకరంగావుండేది.
ఇక తోలుబొమ్మలాట వాళ్ళఆట వినోదం చూసితీరవలసిందే!కెెేతిగాడు, గుర్రాలక్కల హాస్యం వినితీరవలసినదే.ఈ తోలుబొబ్బలాట ఇప్పటికీ, అక్కడక్కడా కనిపిస్తోంది. వాళ్ళు తమకళను అదునాతనంగా మలచుకొని, నిలదొక్కుకోవడానికీ విశ్వప్రయత్నం చేస్తున్నారు.
బ్రహ్మాల ఇళ్ళవాళ్ళు గౌరమ్మను తీసేమని, పెద్ద గౌరీదేవి ఆకారంలోని కర్రబొమ్మని నెత్తికెక్కించుకొని చేసే సంబరం కూడా చూడవలసినదే. హరికథలు భక్తిని ప్రభోదిస్తే, బుర్రకథలు వీర రసం, శోకరసం వొలికిస్తూ, శ్రుతిలయ భధ్ధంగా అడుగులేస్తూ, పాటపాడుతూ ముగ్గురు మనుషులు కథ చెపుతుంటే, వీరరసం తో గుండెలు ఉప్పొంగిస్తూ, శోకరసంతో గుండెలు పిండేస్తూంటే వంతగాడు హాస్యం చెపుతుంటే మనలో ఆఆ రసాలు ఉత్తేజితులను చేస్తాయి.
అలాగే హరికథలు. భక్తిరసంతోకూడిన హరికథలను, చూడవచ్చిన జనంలో భక్తినిండి, పరవళ్ళుత్రొక్కేలా గానం చేసేవారు. మధ్యమధ్యలో హరిదాసు చమత్కారంతో, హాస్యంతో నిండిన పిట్టకథలను చెపుతుంటే , వినేవారి ఆనందమేవేరు. ఎక్కడ హరికథలను చెపున్నారని తెలిసినా జనం ఆలకించడానికి పరుగులు తీసేవారు.
ఇక నాటకాల సంగతి చెప్పేదేముంది. వాటిగురించి చెప్పలేనిదేముంది?ఎన్నెన్ని నాటకాలు? పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు,పద్యనాటకాలు, గద్యనాటకాలు. మొదటి రెండవతరం సీనీమావాళ్ళంతా నాటకాలలో నటన నేర్చుకొని, అధ్భుతంగా ప్రదర్శనలిచ్చి, ఆ తరువాత తరువాత సినీమాలలో అధ్భుతంగా రాణించారు. ఎనలేని కీర్తిని మూట కట్టుకొన్న వారెందరెందరో.
మరొక కళారూపం విప్రవినోదం. విప్రవినోదులు బహుశా బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారై వుండివుంటారు.అందువలనే ఆ కళకు విప్రవినోదం అనే పేరు వచ్చివుండవచ్చు.
వీరి వస్త్రధారణ,భాష కూడా తమాషాగా వుంటుంది. పంచకట్టు, చొక్కాపైన కోటు, తలకు కాబూలీవాలాలాంటి రంగురంగులగుడ్డతో తలపాగా, భుజానికి ఒక పెద్దసంచీ, చేతిలో వెండిపిడి కలిగిన లాఠీతో హుందాగా నడచుకొంటూ వస్తారు.
వీరి విప్రవినోదకళ పిల్లల్ని పెద్దల్నికుడా బాగా ఆకర్షిస్తుంది. అందుకనే వీరి ప్రదర్శనదగ్గర జనం గుంపుగూడతారు.
ఈ విప్రవినోదం అనేకళ, ఒకరకంగా ఇంద్రజాలం అనిచేప్పవచ్చు. అందుకనే ఇతగాడు మాటకీ మాటకీ మధ్యన, "ఇంద్రజాల-మహేంద్రజాల, జలయక్షిణీ మహేద్రజాల యక్షిణీ, రా.."అంటూ, తన భుజంనుంచి క్రిందకు దింపిన సంచీ పైభాగానికి, తన వెండిపొన్నులాఠీని తాకిస్తూ, తన నుదుటికి తాకించు కొంటుంటాడు.
"జలయక్షిణీ-మహేంద్రజాలయక్షిణీ " అంటూ మంత్రంలా చదువుతూ, సంచిలోంచి గెచ్చకాయయతీసి, గుప్పిటిలో మూసి, ఆగుప్పిటపై లాఠీని తాకించి, ఆ గెచ్చకాయను శరీరం లేకుండా, తలమాత్రమే కల చిలుక పిట్టను చేస్తాడు. ఆ చిలుకపిట్టతో అతడు చేసే సంభాషణ భలే తమషాగావుంటుంది.
"అయితే చిలకమ్మా! అమ్మగారు నీకు పప్పన్నం పేడతారు తింటావటే?" అంటాడు. అది "తింటా-తింటా-తింటా"అంటుంది.
"అయితే నెయ్య వేసుకుంటావా, వద్దా" అంటాడు.
అది వేసుకొంటా, నెయ్యి వేసుకొంటా!" అంటుంది.
"అయితే చిలకమ్మా!ఆవునెయ్యి వేసుకొంటివా?గేదనెయ్యా?" అంటాడు.
అది, ఆవునెయ్యే!ఆవునెయ్యే, ఆవునెయ్యే !" అంటుంది.
"మరిగేద నెయ్యి ఎందుకువెసుకోవే ?" అంటాడు.
"హమ్మో!జలుబుచేస్తుంది-జలుబు చేస్తుంది-జలుబు చేస్తుంది." అనగానే, అక్కడ గుమిగూడిన జనమంతా ఘొల్లున నవ్వుతారు.
అలాగే విప్రవినోది సంచీలోంచి ఇసుకను తీసి, పసుపుకుంకుమలుగా చేసి అందరికీ కుంకుమ బొట్లుపెడతాడు. గెచ్చకాయను సంచీలోంచి తీసి, దానికి "జలయక్షిణీ అంటూ మంత్రంచదివి, గెచ్చకాయను రూపాయకాసును చేసి, దగ్గరగా వున్న వాళ్ళ చెవిలోకి పంపించి, మంత్రంచదువుత, లాఠీని ముక్కుకు తాకించి, ముక్కులోంచి రూపాయి కాసును రప్పిస్తాడు.
అలాగే, గెచ్చకాయను సంచీలోంచి తీసి, జలయక్షిణీ అంటూ మంత్రం చదివి, లాఠీ తిటించి, పొడపాము పిల్లను చేయడం చూస్తుంటే, మనశరీరం భయంతో గగుర్పొడుస్తుంది.
ఇలాంటివే మరెన్నెన్నో ప్రదర్శిస్తాడు విప్రవినోది. మనని మంచిమాటలతో కనికట్టుచేసి, బియ్యం, డబ్బులూ, బట్టలూ మొదలైనవి దండిగా తీసుకెళతాడు.పొలాలోకి వెళ్ళి, రైతులదగ్గర మంచిమాటలు చెప్పి ధాన్యం
తీసికెళతాడు.
కవితకు కాదేది అనర్హంది అన్నట్లు గానే, ఈ జానపదకళలలో ఏదిమంచీ, ఏది చెడ్డా? ఏదిబావుంటుంది ?ఏదిబాగుండదు ? అంటే అన్నీ బాగుండేవే జానపదకళలూ-కళారూపాలు.
నేడు జానపదకళలకు ఆదరణ కొరవడి, చాలామటుకు మరుగున పడిపోయాయి. ఇంకా ఒకటో అరావున్నా, అవికూడా మరుగునపడిపోయే చరమాంక దశలలో వున్నాయి. ఇప్పటి తరంవారికే చాలామటుకు ఈ కళల గురించి తెలియదు. రాబోయేతరాలకు తెలుసుకోవడానికి కూడా ఇవేవీ మిగిలివుండవు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
భాగవతము
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ద్వితీయ స్కంధము*
*హరి పరమాత్ము నచ్యుతు ననంతుని చిత్తములం దలంచి సు*
*స్థిరత విశోకసౌఖ్యముల చెందిన ధీనిధు లన్యకృత్యముల్*
*మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిదయౌ సురేంద్రుడుం*
*బరువడి నుయ్యి ద్రవ్వునె పిపాసితుడై సలిలాభిలాషితన్*
ఆయన హరి. సర్వాన్నీ తనలోనికి తీసుకొనే స్వభావం కలవాడు. పరమాత్మ. అంతయూ తానే అయి అంతటా వ్యాపించి ఉండేవాడు. ఆయన అనంతుడు. ఎక్కడనో అయిపోవటం అనే లక్షణం లేనివాడు. అట్టి మహాప్రభువును మనస్సులలో భావించి ఎప్పటికీ నశించినవీ, దుఃఖం అణువంతకూడా లేనివీ అయిన సుఖాలను పొందే బుద్ధిమంతులు ఇతరములైన పనులను, మరచికూడా, చేయటానికి ఇష్టపడరు. ఆలోచిస్తే అది అటువంటిదే. దేవేంద్రుడంతటివాడైనా దప్పిక కలిగినప్పుడు పారా, పలుగూ పట్టుకొని గబగబా నుయ్యి త్రవ్వుతాడా!
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 34-35*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*ఆచార్యాః పితరః*
*పుత్రాస్తథైవ చ పితామహాః ।*
*మాతులాః శ్వశురాః పౌత్రాః*
*శ్యాలాః సంబంధినస్తథా ।।*
*ఏతాన్న హంతుమిఛ్చామి*
*ఘ్నఽతోపి మధుసూదన ।*
*అపి త్రైలోక్య రాజ్యస్య*
*హేతోః కిం ను మహీకృతే ।।*
ఆచార్యాః — గురువులు;
పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు);
పుత్రా: — కుమారులు;
తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ
పితామహాః — తాతలు;
మాతులాః — మేనమామలు;
శ్వశురాః — పిల్లనిచ్చిన మామలు;
పౌత్రాః — మనుమలు;
శ్యాలాః — బావ-బావమరుదులు;
సంబంధినాః — బంధువులు;
తథా — కూడా; ఏతాన్ — వీరు;
న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు;
ఘ్నతః — చంపబడి;అపి — అయినప్పటికీ;
మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా;
ఆపి — అయినప్పటికీ;
త్రై-లోక్య-రాజ్యస్య — ముల్లోకముల పై అధిపత్యం ;
హేతోః — కొరకు;
కిం ను — ఎం చెప్పాలి?
మహీ-కృతే — భూమండలము కొరకు.;
*భావము:*
గురువులు, తండ్రులు, కొడుకులు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు ఇంకా ఇతర బంధువులు, ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద దాడి చేసిననూ నేను వీరిని చంపను. ధృతరాష్ట్రుని పుత్రులని సంహరించి, ముల్లోకముల పై ఆధిపత్యం సాధించినా, ఏం తృప్తి ఉంటుంది మనకు, ఇక ఈ భూ-మండలము కోసమైతే ఏమి చెప్పను?
*వివరణ:*
ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు ఇంకా శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. అర్జునుడు ఈ వివిధములైన బంధువులని పేర్కొంటున్నాడు. 'అపి' (అంటే 'అయినప్పటికీ' అని అర్థం) అన్న పదాన్ని రెండు సార్లు వాడాడు. మొదట, “నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్ను ఎందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ, నేను వారిని చంపాలనుకోవటం ఎందుకు?
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
భాగవతము
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ద్వితీయ స్కంధము*
*కారణకార్య హేతువగు కంజదళాక్షుని కంటె నన్యు లె*
*వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో*
*దారుని సద్గుణావళు లుదాత్తమతిన్ గొనియాడకుండినన్*
*జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.*
శ్రీ మహావిష్ణువును పుండరీకాక్షుడు అంటారు. బాగా వికసించిన పద్మపు విశాల మైన రేకులవంటి కన్నులున్నవాడు. సృష్టిలో ఏర్పడే ప్రతిదానిని కార్యం అంటారు. దానికి కారణం ఒకటి వేరుగా ఉంటుంది. విత్తనం కారణం. చెట్టు కార్యం. కాని పరమాత్మా, జగత్తూ రెండూ విష్ణువే. మరొకరులేరు. నాయనా! అటువంటి భగవంతునీ, అంతము లేనివానినీ, లోకాల సముదాయాన్నంతటినీ భావిస్తూ ఉండేవానినీ ధ్యానిస్తూ ఉండాలి. నిజానికి ఆయనకు ఏ గుణాలూ లేవుగానీ మనలను ఉద్ధరించటానికి ఆయన కొన్నిగుణాలు ఏర్పరచుకొని మనయందు కృపతో తెలియవస్తూ ఉంటాడు. అటువంటి గుణాలను గొప్పగా సంస్కరించుకొన్న బుద్ధితో మనం కొనియాడుతూ ఉండాలి. అలా చేయకపోతే గుణాలు లేని పరమాత్మను మన మనస్సులు చేరవు. అది చాలాపెద్ద ప్రమాదం.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - షష్ఠి - ఉత్తరాభాద్ర - భౌమ వాసరే* *(16-12-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/GdeL76Qi8OE?si=5Tv3TM2zk0Colu2K
🙏🙏
ముక్తి కోరే మానవుడు
ప్రజలకు ఆకలిదప్పులు తీర్చడం, జీవితం సుఖ సంతోషాలతో గడపడానికి తగిన సాయం రాజు చేతుల్లో ఉంది. అంటే ఇప్పుడు పరిపాలకుల చేతిలో ఉంది. ఇందుకు వ్యతిరేకంగా జరిగినచో రాజు పై లోకాల్లో శిక్ష అనుభవిస్తాడు.
ఇంకా మానవ ప్రజలొ భాగంగా మనుష్యుడు
సర్వ భూతముల యందు ఏకీభవ స్థితుడై, వారి/వాటి యడల దయ కలిగి, తన యందు శౌచము పాటించి తద్వారా సమాజ శౌచమునకు పాటుపడుతూ, సత్యమేవ్రతముగా కలవాడై ఉన్నవాడు జన్మ ధన్యమ ఉంతుంది.
ఇక ముక్తి కోరే మానవుడు భక్తి , జ్ఞాన, వైరాగ్యములో ఏదో ఒక దాన్ని ఎంచుకుని ఏకాగ్రత్తతొ ఆచరించాలి.