16, జనవరి 2024, మంగళవారం

వేమన పద్యములు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 1*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *💥 వేమన ప్రజాకవి*


ప్రజలకు ఉపయోగించెడి నిత్యాసత్యముల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా రచన కొనసాగించి, వేదసారాంశమును, వేదాంత సారమును తెలుగు పద్యాలలో ఆంధ్రులకందించిన మహానుభావుడు. జ్ఞానము, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము నంతటిని తన పద్యములలో చొప్పించిన మహానుభావుడు.*


*💥 వేమన ఎంత రక్తి కలవాడో చివరికి అంత విరక్తితో నిత్యాసత్యములను సమాజమున కందించి , అందరినీ చైతన్యపరచిన సామాజిక న్యాయ నిర్ణేత వేమన .*

*వేమన గ్రహించిన సామాజికమును , సంఘసంస్కారము వేరెవ్వరు ఊహించలేరేమోననే తలంపు కలుగును. ఏదైనా ఒక విషయమును విమర్శించాలంటే అలాగే నిర్మొహమాటముగా చెప్పాలంటే ఆయనకే చెల్లుతుంది.*

*చక్కని జ్ఞానాత్మక బోధనలు , హాస్య రసము , సాంఘిక దురాచారాలు ఎంతో లోతుగా ఆలోచించి పద్య రచన సాగించాడు.*


*💥 వేమన పద్యాలు చెప్పుకునే ముందు కొన్ని ప్రార్థన పద్యములను చెప్పుకుని తరువాత ప్రతీ దినము రోజుకి ఒక్కొక్కటి చొప్పున పద్యము - తాత్పర్యముతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.*


*💥 ప్రార్థన పద్యము --- 1*

శ్రీకర బ్రహ్మాకారుని

ప్రాకటముగ మదిని జేర్చి ప్రణవాకృతితో

సోకి నటించెడి జ్ఞప్తిని 

పాకముగని దాటువాడె భక్తుడు వేమా .


*🌹తాత్పర్యము ---*

శుభములు కలిగించెడి ఆ బ్రహ్మ స్వరూపుడైన ఆ దేవదేవుని మనసున నిలిపి , ఓంకార నామముతో జపించెడి నరుడే నిజమైన భక్తుడగును.


*💥 ప్రార్థన పద్యము ---2*

శ్రీ మూల శక్తి యనదగు

నా మూర్తుల గన్న తల్లి నౌగా దనకన్

ధీమూర్తి నెంచి చూడుము

నీ మూర్తికి సాటి లేదు నిజముగ వేమా.


*🌹తాత్పర్యము ---*

ముగురమ్మల మూలపుటమ్మ , శక్తి స్వరూపిణి , అమ్మను నమ్మినవాడే ఆమెనెల్లప్పుడు తలచినవాడే గొప్పవాడు , బుద్ధిశాలి అగును.


*💥 ప్రార్థన పద్యము ---3*

శ్రీ యన మంగళ దేవత

శ్రీ యనగా విష్ణుపత్ని సిరి సంపదయున్

శ్రీ యనెడు మూలశక్తిని

శ్రీ యని వర్ణింపు మెపుడు స్థిరమతి వేమా.


*🌹తాత్పర్యము ---*

శ్రీ అన్నచో మంగళ దేవతగ , విష్ణుపత్ని లక్ష్మిగ , సిరి సంపదలకు ఆటపట్టుగ , మూలాధార శక్తిగా మానవుడు స్థిరమైన బుద్ధితో తలచవలెను.

అన్నింటికీ " శ్రీ " మూల శక్తి అని గ్రహించవలెను.


*💥 ప్రార్థన పద్యము --- 4*

శ్రీరామ రామ నామము

మారాడక విను నరులకు మహితాత్ముండై

యూరూర దిరిగి చెప్పుమి

యారూఢ తపః ఫలంబులగు వేమపతీ.


*🌹తాత్పర్యము ---*

రామనామము ఊరూర తిరిగి జపించినచో గొప్పదైన తపః ఫలము సిద్ధించును.

రామనామము నందు అంత గొప్ప శక్తి కలదని భావము.


*💥 ప్రార్థన పద్యము --- 5*

శ్రీరామ యనెడు మంత్రము

తారక మని యెరిగి మదిని ధ్యాన పరుండై

సారము గ్రోలిన నరునకు

జేరువగను బరమపదవి చేకూరు వేమా.


*🌹తాత్పర్యము ---*

వైకుంఠ నివాసము కలగాలంటే " శ్రీరామ శ్రీరామ " అనెడి

తారకమంత్రమును మానవుడు ధ్యాననిష్ఠతో జపించవలెను.

రుచికరమైన తారక మంత్రమును కోరి భజించవలెను.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

కామెంట్‌లు లేవు: