30, మే 2023, మంగళవారం

పద్యపరిమళము

 🪷🌸🌸🪷🕉️🪷🌸🌸🪷

            *పద్యపరిమళము*


కం.

పద్యపరిమళము లెగయగ 

హృద్యంబుగ వ్రాయవలయు నింపును గొలుపన్ 

పద్యంబుల; గద్యములకు 

పద్యంబుల సొబగు రాదు పాటును బడినన్ 


కం.

పద్యమ్మున గమకమ్ములు 

వేద్యమ్మగు ప్రాస వళులు విందులు గూర్పన్ 

సద్యస్స్ఫూర్తిన్ మెఱసెడి 

హృద్యాలంకారరాజి యింపును నింపున్ 


కం.

అందుకె కావలె పద్యము 

బందీలను జేసి జనులు బానిసలగుచున్ 

విందుల రసముల జుఱ్ఱుచు 

పొందిక నానంద మొంద మ్రోలక దెచ్చున్ 

*~శ్రీశర్మద* 

+91 8333844664

చమత్కారముగా



❤ వ్యాకరణంలో సంబాషణ!

.

*ఈ కథ చాలా పాతకాలందిలెండి.!

ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన బండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి బండి లో కూర్చో బెట్టి బయల్దేరాడు . 

త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో . 

పోరుగూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ 

వెధవ బండి' అన్నాడు. 

దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ 

మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?

అన్నాడు నవ్వుతూ 

షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండిఅనే అర్థము వస్తుంది 

కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.

(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?) 

ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి. 

(అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు.

యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.

....

ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.

ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.శిష్యుడు అతడి భార్య 

ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.అప్పుడు గురువు 

ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు శిష్యుడు నవ్వుతూ గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి 

వెళ్ళుట మీకు న్యాయమేనా?అన్నాడు. గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే 

నీకు యేమీ అపకారము చెయ్యదు.పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.పంచమీ తత్పురుషము

లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.

పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము' షష్టీ తత్పురుషము నకు 

ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు. 

ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు. 

అందుకు గురువు గారు నవ్వుతూ 

నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ 

'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.ద్వంద్వా తీతుడంటే 

మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.


*సేకరణ* 👆

దశపాపహరదశమి

 నేడు జ్యేష్టశుద్ధ దశమి

                        దశపాపహరదశమి


  దశమి తిధితో సంబంధపడి మనకు రెండు పెద్ద పండగలు కనిపిస్తున్నాయి.

  ఒకటి జ్యేష్తశుద్ధ దశమి, రెండు ఆశ్వీయుజ శుద్ధ దశమి, మొదటిది దశపాపహరదశమి.  రెండవది విజయదశమి.  రెండూ కూడ పది రోజులు పర్యాస్తమయ్యే పాడ్యమి తిదులతో ప్రారంబమై దశమితిధితో ముగిసే పర్వాలు.

    దశపాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్ధము.  పది పాపాలను పోగొట్టడానికి సమర్ధమైన ఈ వ్రతము జ్యేష్ట శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు చేస్తారు.

    ఈ పాడ్యమి నాటి వివరాలలో మన పంచాంగములో 'దశహరాదశాశ్వమేధేస్నానం, ఇత ఆతభ్య్హదశమీపర్యంతమి ' అని ఉంటుంది.

    ఈనాడు ఏనదిలో చేసినా స్నానం విశేషఫలప్రదమైనది.  అందులో గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందులో కాశీలోని దశాశ్వమేధఘట్టంలో గంగా స్నానం మరీ విశేషం.

దేవతలు - వారి వాహనములు*

 *కొందరు దేవతలు - వారి వాహనములు*


1) విష్ణువు –గరుడుడు

2) లక్ష్మీదేవి –గుడ్ల గూబ

3) రతి మన్మదులు=కీరం(చిలుక)

4) హనుమంతుడు=ఒంటే

5) శివుడు =వృషభం

6) పార్వతి దేవి=సింహం

7) వినాయకుడు=మూషికం

8) కుమారస్వామి=నెమలి

9) బైరవుడు=శునకం

10) బ్రహ్మ=హంస

11) సరస్వతి=హంస

12) అశ్వినినులు=కంచర గాడిదలు

13) రావణుడు=గాడిదలు.

14) లలితాదేవి=వరాహం (కిరిచక్ర రధారూఢ)

15) శీతలా దేవి=గాడిద

16) గంగాదేవి=మకరం

17) యమునాదేవి=కూర్మం

18) అయ్యపస్వామి=పులి

19) కాలునుకి=మహిషం

20) నముచి=ఉచ్చైశ్రవము

21) అలమేలుమంగ అమ్మవారు=చాతకం

22) వాస్తుపురుషుడు=గండభేరుండం

23) కల్కి=గుఱ్ఱం

24) చండి=వరాహం

25) చాముండి=గుడ్లగూబ

26) విశ్వకర్మ=నక్క 

27) మానసా దేవి=సర్పం

28) ఇంద్రుడు=ఐరావతం

29) అగ్ని=మేషం/గొర్రె 

30) యముడికి=మహిషం

31) నైరుతి=శవ వాహనం

32) వరుణుడు=మకరం

33) వాయువు=కృష్ణ మృగం

34) కుబేరుడు=నర వాహనం

35) ఈశానుడు=వృషభం

36) సూర్యుడు=సప్త అనే పేరు గల అశ్వం

37) చంద్రుడు=జింక/10 శ్వేత అశ్వములు 

38) కుజుడు=మేషం

39) బుధుడు=గుఱ్ఱం

40) గురుడు=ఏనుగు

41) శుక్రుడు=గుఱ్ఱం / మకరం

42) శని=కాకి

43) రాహువు=పులి

44) కేతువు=చేప

పలుసార్లు కాదు.


          _*సుభాషితమ్*_


శ్లో𝕝𝕝 

*సకృజ్జల్పన్తి రాజానః*

*సకృజ్జల్పన్తి పండితాః॥*

*సకృత్కన్యాః ప్రదీయన్తే*

*త్రీణ్యేతాని సకృత్సకృత్‌॥*


తా𝕝𝕝 

రాజు లొక్కసారే ఆజ్ఞాపింతురు..... 

పండితు లొక్కసారే చెప్పుదురు.... 

కన్యాదాన మొక్కసారే చేయబడును.....

ఈ మూడు నొక్కక్కసారే చేయబడును. పలుసార్లు కాదు.


: 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*న వైరముద్దీపయతి ప్రశాంతం*

*న దర్పమారోహతి నాస్తమేతి॥*

*న దుర్గతోsస్మీతి కరోత్యకార్యం*

*తమార్యశీలం పరమాహురార్యాః॥*

                    ~భార. ఉద్యో.33-117.


తా𝕝𝕝 

వైరమను అగ్నిని ప్రకోపింపజేయక శాంతముగా నుండువాడును, గర్వము (దురభిమానము) లేనివాడును, హీనత్వమును కనబరచనివాడు, నేను ఆపదలో చిక్కుకొంటినని నీచకార్యములు చేయనివాడును, ఇట్టి శ్రేష్ఠగుణములు గలవానిని ఆర్యుడందురు.

తొలితరం కవులు

 శుభోదయం🙏

            చొప్పకట్ల.


అ ధి క్షే పం !

   తొలితరం కవులు విమర్శకులు అధిక్షేపణల్లో కూడా హుందాతనం పాటించేవారు.

      జలసూత్రం రుక్మణీనాధశాస్త్రిగారు.(జరుక్ శాస్త్రి.) విశ్వనాధకవిత్వాన్నెత్తిపొడుస్తూ,పైపద్యాన్ని ప్రవచించారట!

        చివరి సంబోధన "పాషాణపాకప్రభూ!"-చదువుకున్నవిశ్వనాధ ఫక్కున నవ్వుకున్నారట!

         చిత్తగించండాపద్యం.విశ్వనాధకవితకు తగినజోడీ!


కించిత్తిక్త కషాయ షాడబరసక్షేపాతిరేకాతి వా

క్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ

గండాశ్మముల్

చంచల్లీల నుదాత్తవాగ్గరిమతో సాధించి వేధించుమా!

పంచారించి ప్రవహ్లికాకృతి కృతిన్ పాషాణపాకప్రభూ!!

                      -జరుక్ శాస్త్రి.


        కవితాశైలులను ఆలంకారికులు,

1ద్రాక్షాపాకం.

 2కదళీపాకం.

  3నారికేళపాకం.

అనిమూడురీతులుపేర్కొన్నారు.

          శిలాపాకం!వాటన్నిటినీ మించిందింది.యెమతప్రయత్నించినా అర్ధమవ్వదనిసారాశం!

        చూశారా?కవులు ఒకరినొకరెంతచక్కగా తిట్టుకుంటారో??


👆మరో సమూహములో అవధాని మిత్రులు శ్రీ రాయపెద్ది వారు పంచుకొన్నది..🙏🙏🙏

వారిసౌజన్యంతో-

అమ్మ అనెడి పిలుపు

 175వ రోజు: (జయ వారము) 30-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


అమ్మ అనెడి పిలుపు అమృతము వలెనుండు 

నాన్న యనెడి పిలుపు వెన్న సమము 

అమ్మ నాన్న పిలుపు లాప్యాయతల్ పెంచు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల


అమ్మ అనే పిలుపు అమృత సమానము. భగవంతుడు దేవతలకు అమృతమును ఇచ్చి మానవులకు అమ్మ పిలుపును ప్రసాదముగా ఇచ్చెను. నాన్న అనే పిలుపు వెన్నతో సమానము. అమ్మ నాన్న పిలుపులు ప్రేమ ఆప్యాతలను వృద్ది (పెంపొందించును) చేయును. 

 

ఈ రోజు పదము. 

ఏనుగు తొండము (Trunk): కరము, కేలు, నాగవాస, శుండము, హస్తము. 

ఏనుగు కుంభస్థలము: కింకిరము, కుండలు.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 75*

 .    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 75*


ఆనాడు రాక్షసమాత్యునికి అన్నీ దుశ్శకునములే ఎదురయ్యాయి. నందులతో సత్సంబంధాలు తగ్గిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు నందులకు బౌద్ధక్షిపణకుడు జీవసిద్ధి అత్యంత సన్నిహితుడైనాడు. అతని మాట నందులకు వేదవాక్కు. 


నందులు ఇప్పుడు రాక్షసుని మాటలకు విలువ ఇవ్వడం మానేశారు. "యధారాజా తథా ప్రజా" అన్నట్లు భలభద్ర, బాగురాయణాది ప్రముఖ రాజోద్యోగులు కూడా ఇప్పుడు రాక్షసునికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. ఇంకొకవైపు పాటలీపుత్రంలో నంద వ్యతిరేకత తీవ్రాతి తీవ్రమైంది. రాజగురువు సుబంధుడు వూరూవాడా తిరుగుతూ నందుల దురాగతాలను యండగడుతూ త్వరలో చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించి ప్రజల కష్టాలను తీర్చగలడంటూ ప్రచారాన్ని చేయసాగాడు. బ్రాహ్మణాది వర్ణాలన్నీ సుబంధుడికి బాసటగా నిలవడం చేత అతనికే హాని తలపెట్టినా ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుందన్న భయంతో సుబంధుడిని శిక్షించడానికి వెనకాడాడు రాక్షసుడు. 


ఇక చారుల వలన తెలుస్తున్న వార్తలు రాక్షసునికి మనశ్శాంతిని దూరం చేశాయి. చంద్రగుప్తునితో పాంచాల, సింహపుర దేశాధీశులు బాంధవ్యం కలుపుకుని తమ రాజ్యాలను అతనికి కట్టబెట్టారనీ, పర్వతక, కళింగ, ఆంధ్రరాజుల సహాయ సహకారాలతో చంద్రుడు మగధపై యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నాడనీ, వారందరు కలిసికట్టుగా ఏ రోజైనా మగధపై దండెత్తి రావచ్చుననీ... వార్తలు మీద వార్తలు వస్తున్నాయి. 


ఆ వార్త విశేషాలన్నింటినీ, తన భయాలు సలహాలతో జోడించి రాక్షసుడు ఒకనాడు నందులకు తెలియపరచాడు. నందుల చెంతనే ఉన్న జీవసిద్ధి నవ్వి "మహాబలోపేతమైన మగధ పైకి దండయాత్రా ... ? ఆ వృషలుడికి అంత ధైర్యమా ? మా సుకల్పనందుడు ఒక్కసారి కన్నెత్తి చూస్తే ఆ కంటి మంటల జ్వాలకి శత్రుసైన్యాలన్నీ మాడి మసైపోవూ...?" అన్నాడు. 


రాక్షసుడికి ఒళ్ళు మండి "మంత్రాలకు చింతకాయలు రాలవు మహానుభావా... మనం కూడా యుద్ధ ప్రయత్నాలు చేసుకోవాలి. వాళ్ళు ఏ నిమిషాన్నాయినా యుద్ధానికి రావచ్చు" అన్నాడు వుక్రోషంగా. 


"రానివ్వండి చూద్దాం... ఇప్పటినుంచే యుద్ధ ప్రయత్నాలు ఏమిటి ? డబ్బు దండగ" అన్నాడు జీవసిద్ధి నిర్లక్ష్యంగా. నందులు అతన్ని సమర్ధించడంతో విధిలేక వెనక్కి తగ్గాడు రాక్షసుడు. 


ఈనాడు .... రాక్షసుని భయాలన్నీ నిజమయ్యాయి. ప్రాతఃకాలన్నే మేల్కొన్న అమాత్యునికి వరసగా అన్నీ దుశ్శకునాలే తారసిల్లాయి. 'వాటి పర్యావసానం ఏమవుతుందా ?' అని ఆలోచిస్తుండగానే ప్రతీహారి ఒకడు రాక్షసుని దర్శనం చేసుకొని "జయము, జయము అమాత్యులవారికి... నందప్రభువులు మంత్రాంగ మందిరంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమరిని తక్షణం రావాల్సిందిగా కోరుతున్నారు" అని మనవి చేశాడు. 


రాక్షసుడు సాలోచనగా తల పంకించి "సమావేశ విశేషాలు ఏమిటో తెలిపారా ?" అని అడిగాడు. 


ప్రతీహారి తలతిప్పి "లేదు..." అని చెప్పి ఓసారి అటూ ఇటూ చూసి "చంద్రగుప్త మౌర్యులవారి వద్ద నుండి యుద్ధసందేశం వచ్చినట్లు మంత్రులు గుస గుస లాడుకుంటున్నారు" అని చెప్పాడు తగ్గు స్వరంతో. 


రాక్షసుడు అదిరిపడ్డాడు. 


'అనుకున్నంతా అయ్యింది' అనుకుంటూ అతడు తక్షణమే రాజభావనానికి బయలుదేరాడు. మంత్రాంగం మందిరంలో వడివడిగా ప్రవేశించి అక్కడి సన్నివేశాన్ని చూసి నిర్విణుడయ్యాడు.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వాల్మీకి రామాయణం

 *వాల్మీకి రామాయణంలో లేని కల్లబొల్లి అసత్యపు అంశాలను మన వాళ్లు అనేకం పుట్టించారు. అందులో‌కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.*


🌹రావణుడు మరణించే లోగా అతని వద్ద రాజనీతి పాఠాలను నేర్చుకుని రమ్మని లక్ష్మణుని రాముడు పంపాడు అన్నది కూడా ఒక అబద్ధపు సృష్టి.


🌹గుహుడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అని పాటలు పాడి మరీ రాముడి కాళ్లు కడిగినట్లు రామాయణంలో కనిపించదు.


🌹సీతా స్వయంవరానికి రావణాసురుడు రావడం శివ ధనుస్సు పైన వేసుకుని అవమానం పాలు కావడం రామాయణంలో లేదు.


🌹లక్ష్మణ రేఖ రామాయణంలో కనిపించదు.


🌹అహల్యను గౌతముడు శిలగా మారమని శపించినట్లు రామాయణంలో లేదు. నిరాహారి భస్మ శాయి అదృశ్య రూపిగా పడి ఉండమని, ఆశ్రమానికి రాముడి రాక  ఆమెను పాప విముక్తురాలిని చేస్తుందని చెప్పినట్టు మాత్రమే  ఉన్నది. అది ఆమెకు ప్రాయశ్చిత్తమే గాని శాపం కాదు.


🌹సీత నిలబడి ఉన్న భూమిని పెళ్లగించి ఆ భూమి గడ్డతో సహా సీతను తీసుకుపోయినట్టు రామాయణంలో లేదు


🌹శబరి రాముడికి ఎంగిలి పండ్లు తినిపించినట్టు రామాయణంలో లేదు.


🌹రావణాసురుడి గర్భంలో అమృత కలశం ఉన్నట్లు, దానిని కాల్చి వేయడానికి రావణుడి నాభి భాగంలో బాణం వేయమని విభీషణుడు సూచించగా రాముడు అది ధనుర్విద్యా ధర్మానికి, నీతికి వ్యతిరేకమని చెప్పినట్లు, హనుమంతుడు తన తండ్రి వాయుదేవుడిని ప్రార్థించి రామబాణాన్ని కొద్దిగా కిందికి వంచి నాభిలో గుచ్చుకునేటట్లు చేశాడు అన్నది కూడా ఒక అబద్ధపు సృష్టి.


ఇలా తమ కల్పనా చాతుర్యం కొద్ది అనేకమంది రచయితలు అనేక కల్పితాలను పుట్టించి ఇవి వాస్తవాలే అని మనతో భ్రమింప చేశారు.

సత్యం తెలుసుకోవాలంటే దయచేసి తెలుగు అనువాదంతో సహా వాల్మీకి రామాయణం గోరఖ్పూర్ ప్రింటింగ్ ప్రెస్ వారి గీతా ప్రెస్ లో లభిస్తున్నది, చదవండి చదివి ఆ తరువాత అనుమానాలను అడగండి. అంతేగాని మూలంలో ఏముందో తెలియకుండా ఎవరు ఏది చెబితే అది దాన్ని గుడ్డిగా నమ్మేయడం ధర్మం కాదు.

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం : 7/31

                   SLOKAM : 7/31

                    

बालस्तावत् क्रीडासक्तः,

तरुणस्तावत् तरुणीसक्तः।

वृद्धस्तावच्चिन्तासक्तः,

परमे ब्रह्मणि कोऽपि न सक्तः॥७॥ 

                    ॥भज गोविन्दं॥ 


బాలాస్తావతీ క్రీడాసక్తః 

తరుణస్తావత్తరుణీసక్తః |

వృద్ధస్తావాచ్చింతాసక్తః

పరమే బ్రహ్మణి కోఽపి న సక్తః ||7|| 

                    ॥భజ గోవిందం॥ 


మానవుడు

  - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, 

  - యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, 

  - వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. 

    కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!! 


అనువాదం 


ఆట పాటలందు బాల్య  

                 మలవోక గడచు 

భామ తళుకులం దొరుగును 

          యవ్వనము తృటిన 

తీరని కోర్కెల చింత చివరి 

                   ఘడియ జేర్చు 

మిగులదో క్షణమును నిను 

             నీవు దెలిసి కొనగ. 


    बचपन में खेल में रूचि होती है I 

    युवावस्था में युवा स्त्री के प्रति आकर्षण होता है I 

    वृद्धावस्था में चिंताओं से घिरे रहते हैं I 

    पर प्रभु से कोई प्रेम नहीं करता है॥७॥


    In childhood we are attached to sports, 

    in youth, we are attached to woman. 

    Old age goes in worrying over every thing. 

    But there is no one who wants to be engrossed in Govind, the parabrahman at any stage. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

గృహస్థుడు

 గృహస్థుడు పవిత్రమైన అగ్నిలో అనేక కర్మలను ఆచరించే బాధ్యతను కలిగి ఉంటాడు. 

వాటిలో ఔపాసన మొదటిది. 

వైదిక మతంలో అగ్నికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. 

ఈ దేవతను "అగ్ని-నారాయణ" అంటారు. 

రుద్రుని స్తోత్రాలు కూడా అతనికి అగ్నిదేవునితో సంబంధం ఉన్నట్లు చూపిస్తుంది. 

తిరువణ్ణామలైలో (తమిళనాడులో) ఈశ్వరుడు తనను తాను అగ్ని పర్వతంగా వెల్లడించాడు. 

కేరళలో అంబను [మాత దేవత] కాంతి రూపంలో (దీప జ్వాలలో) పూజించే ఆచారం ఉంది; 

విగ్రహం లేదా యంత్రం ముఖ్యం కాదు. 

దీపంలోనే అమ్మవారిని ఆవాహన చేస్తారు. 

శివుని మూడవ కన్ను నుండి ఉద్భవించిన సుబ్రహ్మణ్యుని గురించి మనం అగ్ని అవతారంగా చెప్పుకుంటాము. 

ఆ విధంగా అగ్నికి మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. 

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఆర్యన్ అనే పదానికి అగ్ని ఆరాధకుడు అని అర్థం. 

అగ్ని ఆరాధన అనేది వైదిజం యొక్క శాఖ అయిన జొరాస్ట్రియనిజం మతం యొక్క ప్రధాన లక్షణం.



పవిత్రమైన అగ్ని ఇంటి తర్వాత ఇంట్లో మండుతూ మరియు ప్రకాశిస్తూ ఉండాలి. 

ఇందులో సమర్పించే నెయ్యి, పాలు మరియు ఇతర నైవేద్యాలు అందరికీ ఆరోగ్యాన్ని మరియు మానసిక ఉల్లాసాన్ని కలిగించే సువాసనను ఉత్పత్తి చేస్తాయి.



యాగంలో దేవత ఏదేని ప్రార్థించినా ఆ నైవేద్యాన్ని పవిత్రమైన అగ్నిలో వేయాలని నేను ఇంతకుముందే చెప్పాను.


The householder has the duty of performing a number of rites in the sacred fire. Aupasana is the first of them. Agni is of the utmost importance to the Vedic religion. This deity is called "Agni-Narayana". The hymns to Rudra also show that he has a connection with the god of fire. In Tiruvannamalai (in Tamil Nadu) Isvara revealed himself as a mountain of fire. In Kerala there is the custom of worshipping Amba [the Mother Goddess] in the form of light (in the flame of the lamp); the idol or yantra is not important. The goddess is invoked in the lamp itself. We speak of Subrahmanya who originated from Siva's third eye as fire  ncarnate. Thus Agni is of great importance to us. According to researchers, the term Aryan means fire-worshipper. Fire worship is the dominant feature of the religion of Zoroastrianism which is a branch of Vedism.


The sacred fire should keep burning and glowing in home after home. Ghee, milk and other oblations offered in it will produce the aroma that will bring health and mental uplift to all.


I have already stated that whatever the deity invoked in a sacrifice, the oblation must be placed in the sacred fire

శ్రీకామాక్షీ పంచరత్నమాలికా స్తోత్రం

 శ్రీకామాక్షీ పంచరత్నమాలికా స్తోత్రం  


1) కరుణారసార్ద్రతప్తకమలేక్షణవీక్షణాం 

   కాదిహాదివిద్యాంకురశ్రీవిద్యాత్మికాం

   కార్యాకార్యవిచక్షణాశీలవివేకాత్మికాం

   కామాక్షీం కాంచీపురాధీశ్వరీం ||


2) ఏణాంకానలశశాంకకోటికోటిసదృశాం 

   ఏకామ్రేశ్వరహృదయాంబుజమధ్యగాం 

   ఏకీకృతశక్తిస్వరూపఇక్షుచాపధారిణీం 

   కామాక్షీం కాంచీపురాధీశ్వరీం ||


3) మూకశంకరకవిత్వధారాప్రదాయినీం 

   మాయాతీతమాయాధ్వాంతరూపిణీం 

   మకరందబ్రహ్మానందప్రదకారుణ్యాం 

   కామాక్షీం కాంచీపురాధీశ్వరీం ||


4) అరిషడ్వర్గభంజనభవ్యకుఠారికాం 

    అణిమాద్యష్టసిద్ధివరప్రదాయినీం 

    అసహాయశూరరణరంగభీషణీం 

    కామాక్షీం కాంచీపురాధీశ్వరీం || 


5) కరధృతశుకపికకమండలాక్షమాలాం 

    కర్ణోద్భాసితతాటంకద్వయధారిణీం  

    కాంచనమణిమాణిక్యరత్నభూషితాం 

    కామాక్షీం కాంచీపురాధీశ్వరీం ||


     సర్వం శ్రీకామాక్షీ దివ్యచరణారవిందార్పణమస్తు

పచ్చని పాల సముద్రం

 పచ్చని పాల సముద్రం


పరమాచార్య స్వామివారిని ప్రముఖ గీత రచయిత కన్నదాసన్ కలిశాడు. ఎప్పటిలాగే వారు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకున్నారు. ఇతఃపూర్వం కన్నదాసన్ నాస్తికుడుగా ఉండి మన మతం గురించి హేళనగా రాసేవాడు. మహాస్వామివారి ప్రభావం వల్ల మెల్లిగా మారిపోయాడు. స్వామివారే అతణ్ణి పనికిమాలిన హేతువాదం నుండి బయటకు తెచ్చారు. కాని విమర్శించడం అనే సామాన్య గుణం మాత్రం అతణ్ణి వదలలేదు.


“పాలు తెల్లగా ఉంటాయి కదా? మరి పాలకడలి ఎందుకు మేఘవర్ణంగా చూపబడుతుంది? మహావిష్ణువు రంగు పాలసముద్రంలో కలిసిపోయిందా?” అని అడిగాడు స్వామివారిని.


స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి, “ఆనందంగా ఉండు. మధ్యాహ్నానికి నీకు సమాధానం దొరుకుతుంది” అని చెప్పారు.


కన్నదాసన్ కలవరపడ్డాడు. ఇక ఏమీ మాట్లాడడానికి సాహసం చెయ్యలేదు. ఆ మాధ్యాహ్నం శ్రీమఠానికి వుమ్మిడి బంగారు చెట్టి వచ్చాడు. కన్నదాసన్, వుమ్మిడి ఇద్దరూ చెట్టియార్ కులానికి చెందినవారు. వాళ్ళ పద్దతిలో వారు నమస్కరించుకున్నారు. తరువాత వుమ్మిడి బంగారు చెట్టి పెద్ద పచ్చని మరకతాన్ని స్వామివారు స్వీకరించాలని పాదాల వద్ద సమర్పించాడు. మహాస్వామి వారికి రత్నాలకు రాళ్ళకు భేదం లేదు.


వెంటనే స్వామివారు మఠం పరిచారకులని పిలిచి ఒక పాత్రలో పాలను తెమ్మని చెప్పారు. పాలు తెచ్చిన తరువాత ఆ మరకతాన్ని పాలపాత్రలో ఉంచమని వుమ్మిడికి చెప్పారు. ఇది వుమ్మిడికి పిడుగులాంటి మాట. సాధారంగా మరకతాన్ని పరీక్షించడానికి ఇలా చెయ్యడం తనకు వ్యాపారంలో అనుభవం.


కంచి శ్రీచరణులు నా ఆలోచనల్ని, ఈ రత్నాన్ని శంకిస్తున్నారా? అని అనుకుని మౌనంగా ఆ పనిచేశాడు. వెంటనే ఆచరులు కన్నదాసన్ ను పిలిచారు చూడమని. అది చూసి కన్నదాసన్ ఆశ్చర్యపోయాడు. పలు మొత్తం లేత పచ్చ రంగులోనికి మారిపోయి, పాలలో మునిగిన మరకతం నుండి ఒక చిన్న కాంతిరేఖ కనపడుతోంది.


కన్నదాసన్ కు నోట మాట రావడంలేదు. ఇది ఎలా జరిగింది? ఆచార్యులవారు అలా జరగడానికి గల కారణాన్ని శాస్త్రీయంగా వివరించి, ఇలాగే పాలసముద్రం విషయంలో కూడా, “పరమాత్మ పాల సముద్రంలో పడుకున్నప్పుడు, ఆయన నుండి కూడా ఇటువంటి తేజస్సు వస్తుంది. అందుకే అది మేఘవర్ణంగా ఉంటుంది” అని తెలిపారు.


వెంటనే కన్నదాసన్ కళ్ళు వర్షించగా, అప్పటికప్పుడే “తిరుప్పార్కడలిల్ పళ్ళికొండాయే శ్రీమన్నారాయణా . . .” (ఈ పాటను 1975లో వచ్చిన స్వామి అయ్యప్పన్ అన్న తమిళ సినిమాలో కే. జే. ఏసుదాస్ గారు అద్భుతంగా పాడారు) అన్న అద్భుత గీతాన్ని వ్రాశారు.


వుమ్మిడియార్ కి, ఆచార్య స్వామివారు ఆశీస్సులు అందించి, ఆ మరకతాన్ని వరదరాజస్వామి దేవాలయానికి తీసుకునివెళ్ళి, దానితో స్వామివారికి మకుటాన్ని చేయించమని ఆదేశించారు.


కన్నదాసన్ తో పాటు అతను కూడా కళ్ళనీరు పెట్టుకున్నారు. స్వామివారు మరకతాన్ని పాలలో ముంచమని చెప్పినప్పుడు అవమానపడ్డాను అనుకున్నాడు. కాని అది రత్నాన్ని పరీక్షించడానికి చెయ్యమన్నది కాదని తెలిసి పశ్చాతాప్పడ్డాడు.


ఇలాంటి ఎన్నో సంఘటనలతో జనుల అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టే జ్ఞాన గురువులు మన స్వామివారు.


జయ జయ శంకర, హర హర శంకర


కే. జే. ఏసుదాస్ గారి అద్భుత గళంలో ఆ పాటను ఇక్కడ వినవచ్చు.

www.youtube.com/watch?v=npqGilN-7Os


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

బంధాలు బాంధవ్యాలను

 👌మాతృ సేవ! మహోన్నతం!


ఒక కుమారుడు తన తల్లిని తీసుకుని ఓ రెస్టారెంటుకు వెళ్ళాడు......

తల్లి చాలా

వృద్ధురాలు. 

బోజనాన్ని ఆర్డరుచేశాడు.....

భోజనం వచ్చింది...


ఆ తల్లి చాలా బలహీనంగా ఉండటంవల్ల ఆహారాని మీదపోసుకుని.....కిందపోసి కాస్త ఇబ్బందికరంగా తినసాగింది...

 చుట్టు పక్కలవారు ఆమె తింటున్న తీరును చూసి గుసగుసలాడుకోసాగారు.


కానీ, ఆ కొడుకు మాత్రం ఏ మాత్రం విసుక్కోకుండా ఆమె తినేదాక కూర్చోని ఆమె తిన్న తరువాత తనను జాగ్రత్తగా తీసుకునివెళ్ళి .....

చేతులు,,,,మొహం శుభ్రంచేసి ఆమె బట్టలపై పడ్డ పదార్థాలను తుడిచి ....

తలను ప్రేమగా దువ్వి......

బిల్లు కట్టి తల్లిని జాగ్రత్తగా తీసుకునివెళుతుండగా..,


ఓ వ్యక్తి ఇలా అడిగాడు............


" బాబూ! నువ్వు ఇక్కడ ఏదో వొదిలేసి వెళుతున్నావు చూడు " అన్నారు. 


ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసుకుని

 " నేను ఏమీ వదిలి వెళ్ళడంలేదే "

 అన్నాడు.


ఆ వ్యక్తి 

" నీవు ఎంతో విలువైన విషయాన్ని ఇక్కడ మాకోసం వదిలివెళుతున్నావు

నాయనా! ప్రతి ఒక్కరూ నీలానే తన తల్లిదండ్రులను చూసుకోవాలి.

అసహ్యించుకోకుండా ఓ బిడ్డలా చూసుకోవాలన్న ఓ మంచి సందేశాన్ని మాకు వొదిలివెళుతున్నావు "


ఆ కొడుకు నవ్వుతూ అమ్మ నుదుటిని ముద్దాడుతూ భుజాలమీద చేయివేసి తల్లిని తీసుకెళ్ళసాగాడు......


తల్లిదండ్రులను పసిపిల్లల్లా కాపాడుకోవాలి......

ముసలితనంలో వారిని అతి జాగ్రత్తగా చుసుకోగలిగిన వారే నిజమైన బిడ్డలు కదా! .....:


ఎన్ని జన్మలెత్తి తే ఆమె ఋణం తీర్చుకోగలను ...


నాస్తి మాతృ సమం దైవం. 

నాస్తి మాతృ సమః పూజ్యో 

నాస్తి మాతృ సమో బంధు

నాస్తి మాతృ సమో గురుః 


అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు. 


తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు. 


ఆకలేసినా.. ఆనందం వేసినా, దిగులేసినా , దుఃఖం ముంచుకొచ్చినా ,  పిల్లలకైనా, పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా గుర్తొచే పదం అమ్మ. 


తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ కనుపాప లా కాపాడండి. ఒక్కసారి ఆలోచించండి......


నలుగురికీ ఇలాంటి సందేశాలు

పంపండి......

బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం..

💐💐

ఎరుక

 *శుభోదయం* 

💐🙏💐🙏💐


*నేను ఉన్నాను* అనే ఉనికిని తెలియడమే *ఎరుక..*


నేను     - అహం ఆత్మ

ఉన్నాను - చైతన్య

            స్థితిలో సాక్షిగా

            ఉండటం..


*ఎరుకతో నేను ఆత్మ స్వరూపాన్ని* అని సాక్షిగా ఉండడాన్ని అనుభూతి చెందడమే *నేను ఎవరు?* అనే ప్రశ్నకు సమాధానం... 


*అదే ఆత్మానుభవం..*

*అదే ఆత్మ దర్శనం..* 

*అదే నిర్వికల్ప సమాధి స్థితి..*


*ఓం అరుణాచల శివ* 

🙏🙏🙏🙏🙏🙏