17, డిసెంబర్ 2022, శనివారం

 Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింపబడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

10వ దినము (17-12-2022):

అగ్ని:

తెలుగు: అగ్గి, అంగారకము, అంచతి, అగిని, అగ్నిహోత్రము, అనలము, అప్పితము, ఇంగలము, ఈషరము, ఉదర్చి, కవ్యవాలము, కిత్తి, కీనాశము, గర్భము, చిచ్చు, జ్యోతి, జ్వలనము, తేజము, ధూమకేతనము, నారాశంసము, నిప్పు, పర్పరీకము, పాకలము, పాచనము, పాథము, పావనము, పురజ్యోతి, బాణము, బాహులము, భాస్వరము, భుజము, మందసానము, సెగ, వహ్ని, సాచి, హవనము, హిమరాతి, హిరణ్యబిందువు.


ఆంగ్లము: Fire

తిరుప్పావై* *పాశురము : 2/30*

 *ॐ              తిరుప్పావై*  



                    *పాశురము : 2/30* 


*భావము*  


    *భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా!* 

    *మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినండి.* 

    *శ్రీమన్నారాయణుని పాదారవిందములను కీర్తిస్తాము.* 

    *అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము.*  

    *పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము, శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము.* 

    *ఒకరిపై చాడీలను చెప్పము.* 

    *సత్పాత్రదానము చేతము.*  

    *సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము.* 

    *ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము.* 

    *ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము.* 

    *ఇదియే మన వ్రతము.* 


*పాశురము* 


    *వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు* 

    *శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్* 

    *పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి* 

    *నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి* 

    *మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్* 

    *శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్* 

    *ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి* 

    *ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్* 


https://youtu.be/Cl8ygMquTCw

పండితులను గౌరవించే పరమాచార్యులు

 పండితులను గౌరవించే పరమాచార్యులు


నా మాతామహులు శ్రీమాన్ కృష్ణ శాస్త్రిగారు పెద్ద సంస్కృత పండితులు. 1940-50ల కాలంలో మయూరంలోని మునిసిపల్ హైస్కూలులో ఉపాధ్యాయులుగా పనిచేశారు. వారికి సంస్కృతంలో ఉన్న అపార పాండిత్యంతో భాష్యం, యోగా వాసిష్టం, జ్ఞాన వాసిష్టం బోధించేవారు.


మా తాతగారి పాండిత్యం, జ్ఞానం గురించి తెలుసుకున్న మహాస్వామి వారు వారిని కంచి మఠానికి ఆహ్వానించినట్టు నేను విన్నాను. కానీ మఠాధిపతులు అందరూ పూర్ణ సన్యాసులవలే కాకుండా రాజ సన్యాసులవలే కిరీటం, సింహాసనం, రాజులవలే బిరుదులతో ఉంటారని శాస్త్రిగారు వెళ్లడానికి సుముఖత చూపలేదు. కానీ మహాస్వామి వారికి శ్రీ కృష్ణ శాస్తి గారిని గౌరవించాలని కోరిక.


తమిళ ఖర నామ సంవత్సరంలో, పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నారు. అప్పుడు ఒకనాటి ఉదయం శాస్త్రిగారు పరిమళ రంగనాథ దేవాలయ తిరుమంజన వీధిలోని తమ గృహంలో పాఠం చేస్తున్నారు. ఎవరూ అనుకోని విధంగా మహాస్వామి వారు శాస్త్రిగారి ఇంటికి వచ్చి, బయట అరుగుపైన కూర్చుని పాఠం పూర్తయ్యేదాకా ఓపికగా వింటున్నారు.


స్వామివారి రాక గురించి తెలియగానే శాస్త్రి గారు పరుగుపరుగున బయటకు వచ్చి స్వామివారిని గౌరవించారు. తరువాత మహాస్వామి వారు ఒక వెండి పళ్ళెం, ఉన్ని శాలువా, చీర, పంచె, ధనం మరియు ప్రసాదంతో శాస్త్రిగారిని సత్కరించి, వారి సంస్కృత పాండిత్యానికి ఇది సన్మానంగా భావించమని కోరారు.


కృష్ణ శాస్త్రి గారి కుమార్తె అయిన మా తల్లిగారు మాతృశ్రీ పార్వతీ అమ్మాళ్, ఈ విషయాన్ని తన జీవితంలో చాలా అరుదైన, అమోఘమైన మరపురాని సంఘటనగా చెబుతారు.


మహాస్వామి వారు సిద్ధి పొందే కొన్ని రోజులకు ముందు, కాంచీపురంలో నేను వారిని దర్శించుకుని, ‘మయూరమ్ శ్రీ కృష్ణ శాస్త్రి గారి మనవడినని’ తెలిపినప్పుడు, స్వామివారు నా మాటలను అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించారు. అది నాకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలగజేసింది.


సంస్కృత పండితులను వెతికి పట్టుకుని, వారిని గౌరవించే పరమాచార్య స్వామివారి ఉదార స్వభావాన్ని మనం సునిశితంగా పరిశీలించాలి.


--- యమ్. ఆర్. బాలసుబ్రమణియన్, తిరుచ్చి. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*_రేపటి తిరుప్పావై ప్రవచనం‎ - 2 వ రోజు_*

 *_రేపటి తిరుప్పావై ప్రవచనం‎ - 2 వ రోజు_*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి)*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*వ్రతనియమాలు*

*పాశురము*


*వైయత్తు వాళ్ వీర్ గళ్ ! నాముమ్ నమ్బావైక్కు*

    *శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్*

    *పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి*

    *నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి*

    *మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్*

    *శెయ్యాదన శెయ్యోమ్* *తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్*

    *ఐయముమ్* *పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి*

    *ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.*


మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు , శాస్త్రాలలో ఆవి కర్మయోగమని , జ్ఞానయోగమని , భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ , కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో. ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో. 


భగవంతుణ్ణి భగవన్మయుడని , పరమాత్మ అని , గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. *"అణు:"* అతి చిన్నరూపం నుండి *"బృహత్:"* అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. *"శబ్ద సహ"* అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు , *"శబ్దాతిగ"* చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు , అందుకే ఆయనను గోవింద అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా ! మరి ఇక్కడ తగినవి - తగనివి అంటూ ఉంటాయా !! 


ప్రకృతి స్వభావాన్ని బట్టి , ఆయా గుణాలను బట్టి సత్వం , రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని , రజస్సు కోపాన్ని , తమస్సు అజ్ఞానాన్ని , బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా , కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు , బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు , రజస్సు , సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది , రజస్సు - తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి , కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక , మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా - అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.


*"వైయత్తు వాళ్ వీర్గాళ్!"* ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది , ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో , నివ్వు ఆజ్ఞ యివ్వు తల్లి నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు , దానికి సీత ఇది వారి తప్పు కాదయా , వారు రావణుని అండలో ఉన్నారు , ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా , చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో , కాని శ్రీరామ చంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా , నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక , తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.


*"నాముం నం పావైక్కు"* ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు , లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. *"శెయ్యుం కిరిశైగళ్ కేళీరో"* మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి , *" పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"* పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి *"పరమన్"* అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా ! ఆయన పాదాలలో శంఖ , రథాంగ , కల్పక , ద్వజా , అరవింద , వజ్రా , అంకుష ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో , భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక - యోగనిద్ర. మనకోసం ఇంకా ఎమి చేస్తే బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి. 


*వ్యుహం-పాల్కడలి*


నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం , ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.


ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు , అతి విలక్షణమైన జ్ఞానం కలవారు , కర్మభారాలు మోసేవారు , తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా ! కర్మ తోలగాలంటే దేహం కావాలి , దేహం ఉండే నేల కావాలి , దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి , వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.


అక్కడ ఆయన వాసుదేవ , అనిరుద్ద , ప్రత్ర్యుమ్న , సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి , స్థితి , లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు , ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.


ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు , ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు , దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు , మరొక రూపం తీస్తాడు , దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు , ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.  


ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది- ఇక *"నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్"* నెయ్యి వద్దు పాలు వద్దు. *"నాట్కాలే నీరాడి"* తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం. *"మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్"* కాటుక , పూలు ధరించం , ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. *"శెయ్యాదన శెయ్యోమ్"* మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం *" తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్"* పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. *"ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి"* చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. *"ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్"* ఇవన్ని ఆనందంతో చేస్తాం.


కాళేశ్వరం భక్తిసామాచారం



*

ఆహారం వృధా చేయవద్దు

 శుభవార్త: PM మోడీ ప్రకటించినట్లుగా - మీరు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్/పార్టీని కలిగి ఉంటే మరియు చాలా ఆహారం వృధా అవుతున్నట్లయితే, దయచేసి 1098 (భారతదేశంలో ఎక్కడైనా) కాల్ చేయండి - చైల్డ్ హెల్ప్‌లైన్ వ్యక్తులు మీ నుండి ఆహారాన్ని సేకరిస్తారు. .. దయచేసి ఈ సందేశాన్ని ప్రతిచోటా ప్రచారం చేయండి, తద్వారా చాలా మంది పిల్లలు తినడానికి సహాయపడగలరు. దయచేసి ఈ గొలుసును విచ్ఛిన్నం చేయవద్దు

   ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మేలు*

   దయచేసి ఈ వార్తను 4 గ్రూపులలో షేర్ చేయండి

   కాపీ చేసి పేస్ట్ చేసి పంపడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది... *ధన్యవాదాలు.

పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే

 ✍️📚🌹📿అర్చకుని(పురోహితుని)విలువ.

            *ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది*

     ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు

       ఒక పురోహితుడు  సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax కూడా చెల్లించడం లేదు

       కావున తమరు విచారణ జరిపి అక్రమ సంపాధరణ దారుడిగా గుర్తించి తగిన విధంగా శిక్షించగలరని పిర్యాదు.

 జడ్జి :- పురోహితుణ్ణి పిలిచి ఈ విధంగా ప్రశ్నించారు. మీరు మీ వద్ద ఉన్న ధనం అక్రమంగా సంపాధించారా లేక సక్రమంగా సంపాధించారా   అని

పురోహితుడు:-ఈ విధంగా సమాధానం ఇచ్చాడు

నేను సంపాదించినదంతయు సక్రమమే  ఇసుమంతయు అక్రమం కాదు అని

జడ్జి :-అంత సంపాదన సక్రమంగా ఎలా సంపాదించావో వివరించు

పురోహితుడు :-అయ్యా!

ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు నేను ఆ సమయంలో సంధ్యావంధనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను ఆత్మ హత్య మహా పాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరామయింప చేసి సాంతన కలిగించాను. నా మాటపై విశ్వసంతో వెనుదిరిగి వెళ్లారు కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్న వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారూ.

దానికి ప్రతిఫలంగా సంతానా సిద్ధిరస్తు అని ఆశీర్వాదం ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికీ కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధేయపడ్డాడు. దానికి నేను ఆపిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు నీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ సమయంలో ఆనందంతో మరికొంత ధనం ఇచ్చి వెళ్ళాడు.మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే అదనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు

నేను ఆదంపతులిద్దరిని ఆయురారోగ్య వృద్ధిరస్తు అని ఆశీర్వధించా.

అతను తన వద్ద ఉన్న ధనంలో కొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.

అయ్యా!ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాధించింది సక్రమమైనదో లేక అక్రమమైనదో  తమరే తీర్పు ఇవ్వండి అని సెలవిచ్చారు.

-పై విషయం అంత సావధానంగా విన్న జడ్జి తీర్పు ఇచ్చాడు. ఆరోజునా ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికీ తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తప్పు తెలుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞత పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనది ఆ ధనం సక్రమమైనదే

కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చాడు అధియును సక్రమైనదే గా

మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషం తో కొంత ధనం ఇచ్చాడు ఇది కూడా సక్రమమే

మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుకొని ఆనందంగా జీవిస్తున్నాడు

ఈ విషయంలో ఎక్కడ పురోహితుని సంపాధన అక్రమమని తెలుపలేము అని తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంలోనే జడ్జి గారు 

ఇలా అడిగాడు.

జడ్జి:-అయ్యా ఇంత ధనాన్ని మికిచ్చి పుణ్యాత్ములైన ధనవంతులు ఎవరో తెలుకోవాలనే ఉత్చాహం ఉన్నాను ఎవరో తెలుపగలరా అని.

పురోహితుడు :-ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియచేసాడు.

దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి షాష్టాంగ నమస్కారం చేసాడు జడ్జి.🏵️🙏🍁

లబ్ధిదారుడు కాడు !!

 శ్లోకం:☝️

*నిర్ధనోస్తి ధనాఢ్యేషు*

 *నిర్ధనైర్మన్యతే ధనీ |*

*నైవ మధ్యమవర్గీయః*

 *లాభాయ పరిగణ్యతే ||*


భావం: అతను ధనికులలో పేదవాడు, పేదవారిలో సంపన్నుడు. ఇలా ఏ వర్గానికీ చెందని  మైనారిటీ వర్గం తనది. దేశ ఆదాయంలో ఎక్కువ శాతం వారి వల్లే అయినా వారు అన్ని పథకాల నుండి తొలగించబడతాడు. *మధ్యతరగతి* వాడు కేవలం పన్ను చెల్లింపుదారుడే కానీ ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుడు కాడు !!😔