ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, మార్చి 2026, శనివారం
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - చతుర్థి - చిత్ర - స్థిర వాసరే* (07.03.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
శ్రీనివాస స్తుతి🙏
🌸శ్రీనివాస స్తుతి🙏
సీ.వేంకటా చలపతి! వేగమే రావయ్య
సప్తగిరులు దిగి సాధుశీల!
అలమేలుమంగతోనాలసిం పకనిక
శ్రీనివాసా! రావశీఘ్రముగను !
భక్తులబ్రోచెడి వరదుడా !బాధలు
దీర్చుమా !జనులకు దీనబంధు !
కొండల పైనున్న కోనేటి రాయుడా!
కోర్కెలు దీర్చుమా కూర్మితోడ !
తే,.. మునులుసైతము దర్శింత్రు ముక్తి కోరి!
మానవులపైనదయచూపు !మమత తోడ
తిరుమలగిరిపైవెలసిన దివ్యమూర్తి!
నిత్యకళ్యాణములు!నీకు నిర్మలాత్మ!
. సాహితీ శ్రీ జయలక్ష్మి

