భౌతికము అభౌతికము
మనం చూసే ప్రతి దానిని భౌతికము అని అంటాం. అంటే మనం మన పంచేంద్రియాలతో దేనినైతే తెలుసుకోగలమో అది భౌతికం అని కూడా అనవచ్చు. ఈ ప్రపంచంలో అన్ని మనం మన ఇంద్రియాలతో గుర్తించలేము అని తెలుసుకోవాలి. మరి మన ఇంద్రియాలతో గుర్తించనిది ఉన్నట్లా లేనట్లా అనే ప్రెశ్న ఉదయిస్తుంది. మనం మన జ్ఞానంతో కొన్ని సాధనాలతో కొన్నిటి ఉనికిని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనం వాటి ఉనికి తెలుసుకుంటామో అవి వున్నట్లుగా మనం గుర్తిస్తాం అదే దాని ప్రమాణం.

చీమ మన కంటికి కనబడుతుంది కానీ దాని కాలు మన కంటికి కనపడదు ఐతే మరి దానికి కాళ్లు ఉన్నట్లా లేనట్లా అంటే అది చరిస్తూ మనకు కనపడుతున్నది కాబట్టి అది నడవటానికి ఏదో ఒక అవయవము కావాలి అనేది మనకు తెలుసు ఎందుకంటె ఎప్పుడైతే కార్యం మనకు గోచరిస్తున్నదో అప్పుడు దాని కారణం కూడా ఉండాలనే సిద్ధాంతం ప్రకారం దానికి కాళ్ళు ఉండాలి. కానీ అవి మనకు దృగ్గోచరం కావటంలేదు. అప్పుడు ఒక దుర్భిణి(బూతద్దం) తో దానిని చూసినట్లైయితే మనకు చీమ కాలు స్పష్టంగా కనపడుతుంది. దీని వల్ల తెలిసేది ఏమంటే మనం మన కంటితో చూడలేనిది ఒక సాధనంతో చూడగలుగుతాము. అలాగే మన కంటికి కనపడని బ్యాక్టీరియాలు సూక్ష్మ దర్శిని ద్వారా చుస్తే అవి మన కంటికి కనపడతాయి. ఇంకా సూక్ష్మంగా వున్న వైరస్ మనము ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపితో చూడ వచ్చు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమంటే మనం మన ఇంద్రియ శక్తులను కొన్ని సాధనాల వల్ల పెంచుకుంటే మనం ఇంద్రియగోచరం కానీ వాటిని కూడా ఇంద్రియ గోచరమైయేటట్లు చేయ గాలం.
మనం ఈ రోజుల్లో అనేక విధాలైన పరికరాలను వాడుతున్నాము ఉదాహరణకు ఎలాంటి కనెక్షన్ లేకుండా కేవలం ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన టీవీని నియంత్రిస్తున్నాము. అంతే కాక్ మైక్రో వేవులతో మన మొబైల్ ఫోనులు నడుస్తున్నాయి. మరి ఇవ్వన్ని ఇటీవల కాలంలో కనుగొన్నవే. అయితే ఇవి కనుక్కోవటానికి ముందు మరి ఇవి లేవు అంటే అటువంటివి వుండవు అని అప్పటి వారు అనుకుంటే అది నిజం ఎలా అవుతుంది. ఇప్పిడు మానవుడు తన మేధస్సుతో ఇంద్రియ గోచరం కానీ వాటి సమాచారాన్ని కూడా తెలుసుకొనే విధంగా పరికరాలను నిర్మిస్తున్నారు. మన ముందు ఒక గర్భిణీ స్త్రీ ఉంది ఆమె కడుపులో వున్న శిశువు మన కంటికి గోచరించడు కానీ అల్ట్రా సోనిక్ స్కానింగ్ చేసి గర్భంలోని శిశువు ఎలా వున్నాడు ఆరోగ్యంగా ఉన్నదా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకో గలుగుతున్నాము.
ఇన్ని విషయాలను సమర్ధించే హేతువాదులు కొన్ని మాత్రం ఒప్పుకోరు దానికి కారణం సైన్సు దానిని ఒప్పుకోదు అని అంటారు. నిజానికి సైన్స్ అనేది కేవలం మానవుని మేధస్సుతో తెలుసుకున్న శాస్త్రం మాత్రమే. ఈ నాడు ఏదైతే సైన్సు అని అంటున్నారో అది ఒకప్పుడు లేదు అని హేతువాదులు కూడా అంటూన్నారు. మరైతే ఇంతకుముందు లేనిది ఎప్పటికి ఉండకుండా ఉండాలి కదా మరి ఇప్పుడు ఎలా వచ్చింది అన్నది ప్రశ్న. కానీ నిజానికి ఇప్పుడు వున్న సైన్సు ఇంతకుముందు కూడా వున్నది కానీ అది ఆవిష్కరించబడలేదు. కానీ ఏది ఈ పృథివిమీద లేక పోలేదు. రేపు ఇంకా ఎన్నో కొత్త కొత్త పరికరాలు రావచ్చు కానీ ఒక్కటి మాత్రం యదార్ధం అన్ని కూడా ఈ భూమి మీద వున్నవే భూమిలోంచి వచ్చినవే.
ఫై వివరణల బట్టి ఒక విషయం గోచరిస్తుంది. మనిషి తన ఇంద్రియజ్ఞానంను పెంచుకుంటూ పొతే ఇప్పుడు ఇంద్రియాలకు అందుబాటులో లేనివికూడా గోచరిస్తాయి. ఐతే ఆ ఇంద్రియజ్ఞానం ఎలా పెంచుకోవాలి పరికరాలతోనా లేక ఇంకా వేరే యితర మార్గంవున్నదా.
మనం రోజు ఈ జగత్తును చూస్తున్నాము ఇది మనకు కొంతవరకే కనపడుతున్నది. అంటే మన కదలిక యెంత దూరం ఉంటే అంత వరకే మనం చూడ గలం. మన పరిసరాలకు దూరంగా వున్నది మనం చూడలేము. కానీ దూరంలో కూడా ఏదో ఒకటి వున్నది అన్నది యదార్ధం. ఉదాహరణకు మనం కాశీలో వున్న గంగా నదిని పరమశివుని గుడిని ఇక్కడ నుంచి చూడలేము కానీ అవి అక్కడ వున్నాయి అన్నది మనకు తెలుసు దానినే పరోక్ష ప్రమాణం అంటారు. అంటే ప్రత్యక్షంగా మనం చూడంది వేరే ఇతరుల ద్వారా తెలుసుకోవటం అన్న మాట. మన హిందూ ధర్మ ఏది చెప్పినా పూర్తిగా సహేతుకంగానే చెప్పింది. కానీ అది అర్ధం కానీ కొందరు మూఢ నమ్మకాలని, చాదస్తం అని చెపుతున్నారు. నిజానికి హేతు బద్ధంగా భగవంతుణ్ణి చూపింది కేవలం మన హిందూ ధర్మం మాత్రమే.
అనాదిగా మానవుడు ఈ జగత్తును చూస్తున్నాడు. ఈ జగత్తులో వున్నా రహస్యాలని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది మన దేశంలో కావచ్చు లేక భూమి మీద ఎక్కడైనా కావచ్చు. మనిషికి ఒక సమస్య ఎదురైనప్పుడు దాని పరిస్కారం కోసం ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు నీకు కొంత డబ్బులు కావలి కానీ నీదగ్గర లేవు అప్పుడు ఏమి చేస్తావు ఎక్కడో ఒకచోట అప్పుచేసి నీ అవసరాన్ని తీర్చుకుంటావు. అలానే మనకు ఏర్పడ్డ సమస్యను కూడా దానికి చెందిన పరిస్కారం కోసం ప్రయత్నం చేయాలి. గతంలో ఇన్ఫ్లుఎంజా అనే రోగం వచ్చింది దాని వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దానికి మందు కనుకొన్నారు అది వాడి తరువాత ఆ రోగమునుండి మనుషులు కాపాదపడ్డారు. ఇప్పుడు కరోనా రోగం ప్రబలిపోతున్నది ఇది కూడా కొన్నాళ్ళు మానవాళిని బాధిస్తుంది తరువాత మానవ ప్రయత్నంతో తప్పకుండ మందు ఆవిష్కరించి బడుతుంది ఈ రోగం గూర్చి భవిష్యత్తులో ఎవ్వరు భయపడరు.
మనకు వున్నా సైన్సు కేవలం భౌతికమైన విషయాలగూర్చి మాత్రమే చెపుతుంది కానీ భౌతికం కానిది అంటే అభౌతికం ఐన దాని ప్రస్తావన సైన్సు చేయదు. " Science is a systematic study of things with proofs" అని చెప్పుతున్నారు. అంటే ఆధారం లేనిది సైన్సు నమ్మాడు అని అర్ధం.
మనం ఈ జగత్తులో రెండు విషయాలు చూస్తున్నాము (తెలుస్తున్నాయి) ఒకటి మన కంటికి ఎదురుగా వున్నది ఏదయినా కావచ్చు ఉదాహరణకు ఒక కారు అనుకుందాం. ఈ కారు కనబడుతున్నది అంటే ఇది కార్యం మరి ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది అది ఎవరో తయారుచేస్తే వచ్చింది. ఆ కారుని తయారుచేసింది ఎవరు. కారుని ఉపయోగించేవారు ఆ విషయం తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటె అతనికి కారు ఇచ్చే సుఖం మాత్రమే చాలు. కానీ కారు గూర్చి లోతుగా వివరాలు తెలుసుకోవాలనే వానికి ఆ కారు ఎవరు తయారుచేసారు, ఎలా తయారుచేసారు అనేది తెలుసుకోదలుచుకుంటాడు. అప్పుడు మొదలైతుంది అసలైన వెతుకులాట. కారుని తయారు చేసింది కూడా ఒక మనిషే కాబట్టి అతనిని తెలుసుకోవటం అతనిని చేరటం పెద్ద కష్టమైన పని కాదు.
మనం పుట్టినప్పటినుండి ఇప్పటి వరకు మనం చూస్తూ వున్నాము అదే ఈ చేరా చెర జగత్తు. ఎప్పుడైతే ఈ జగత్తు నాకు కనపడుతున్నాడో అప్పుడు ఆ జగత్తుని నిర్మించిన నిర్మాత కూడా స్ఫురిస్తున్నాడు. కానీ అతని గూర్చి నాకు ఏవిధమైన సమాచారం లభించటం లేదు. ఇప్పుడు నేను నిర్ణయించుకోవాలి ఒక కారు ఉపయోగించుకునే సాధారణ వ్యక్తి లాగ నేను ఈ జగత్తుని నా ఉపయోగాలు, సౌఖ్యాలకు వాడుకోవటమా లేక ఒక మేధావిలా కారు నిర్మాత వద్దకి వెళ్లి దాని నిర్మాణం గూర్చి తెలుసుకున్న వాడిలా ఈ జగత్తు కారణమైన వానిని శోధించటమా.
సాధారణ మానవులు ఈ జగత్తుతో సబంధంపెట్టుకొని జగత్తుని అనుభవించి మరణిస్తారు. వారు మరణానంతరం గూర్చిన చింతన చేయరు. కేవలం భౌతిక ఐహిక ఆనందాలకోసమే తాపత్రయ పడతారు. కేవలం జ్ఞానులు మాత్రమే ఈ సృష్టి రహస్యాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు. సృష్టి కారణమైన వాడు మన కంటికి కనిపించటం లేదు కాబట్టి వాడు అభౌతికం అంటే భౌతిక స్వరూపం కాదు.