30, జూన్ 2022, గురువారం

 శ్లో𝕝𝕝 క్షుత్తృడాశాః కుటుమ్బిన్యః 

మయి జీవతి నాన్యగాఃl

తాసామాశా మహాసాధ్వీ

కదాచిన్మాం ముఞ్చతి||


తా𝕝𝕝 నాకు ఆకలి, దాహం, ఆశ అనే ముగ్గురు భార్యలున్నారు. ఆ ముగ్గురు నేను *బ్రతికి ఉన్నంతకాలం* వేరొకరివద్దకు వెళ్ళరు. ఆ ముగ్గురు భార్యలలో *ఆశ* మహా గొప్ప పతివ్రత.*నన్ను ఎప్పుడూ వదిలి ఉండదు*


ఆకలి దాహాన్నైనా వదిలి ఉండచ్చేమోగాని ఆశ మరియు దాని మిగిలిన వికృత రూపాలైన అత్యాశ దురాశలు చావవు మరియు మనిషిని నిశ్చింతగా ఉండనివ్వవు. వాటిని గెలవడంలోనే ఉంది మన ప్రయత్నమంతా.