14, ఆగస్టు 2020, శుక్రవారం

నీతి కథ



🌺తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు.

"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు  ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!

ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.

రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.

అక్కడ మహాభారతంలో,

భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?

అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!

జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు.

ఇంత తేడా ఎందుకు?

ఇంతటి తేడా ఏమిటంటే,

ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు  చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.

దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.

జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!

ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.

 "నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు."

" సత్యమేవ జయతే
***************

భారతం ఓ జ్ఞాన భాండాగారం!



ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సనౌలి గ్రామంలో మహాభారత కాలం నాటి కత్తులు, రథాలు, సమాధులు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల నాటి ఈ వస్తువులు, సమాధులు అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించే అవకాశాలున్నాయి. ఇక రామాయణ కాలం నాటి ఆనవాళ్లు సైతం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. 

అంతరిక్షం నుంచి ‘నాసా’ చిత్రించిన ఫొటోల్లో ‘రామసేతు’ కనిపించడంతో దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. వినూత్న సాంకేతిక నైపుణ్యంతో మానవులు (వానరులు) నిర్మించిన వారధిగా ‘రామసేతు’ను గుర్తించారు. ఈ వారధి కొంత భాగం కూల్చేందుకు చేసిన ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. దాంతో చాలామంది మనోభావాలు దెబ్బతినకుండా కాపాడగలిగారు.
లంకకు చెందిన రావణుడు ఓ బ్రాహ్మణుడు. అతను ఇప్పటి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు సమీపంలోని ఓ గ్రామంలో జన్మించాడని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికీ ఆ గ్రామం ఉండటం విశేషం. అతని భార్య మండోదరిది కూడా ఉత్తర భారతంలోని ఓ గ్రామమని తెలుస్తోంది. 

ఈ వివరాలతో ఆర్య-ద్రావిడ వాదనలకు దాదాపుగా తెరపడింది. బ్రిటీషు వారి కుట్ర.. కొంత మంది స్వార్థప్రయోజకులైన చరిత్రకారుల రాతల తప్పులతడకగా తేలుతోంది. కైబర్ కనుమ ద్వారా విదేశీయులైన ఆర్యులు వచ్చారని, స్థానికులను లొంగదీసుకున్నారని, దక్షిణాది వారిని తరమడం వల్ల వారు మరింత ‘కింద’కు వెళ్ళారని, ద్రావిడులు తమ స్వయం ప్రతిపత్తికోసం పోరాడారని, భారతదేశానికి మూలవాసులు ద్రావిడులేనని, రావణుడు కూడా ద్రావిడ మహారాజు అని... ఇలా రకరకాల కట్టుకథలు చాలాకాలం చెలామణిలో ఉన్నాయి.

 దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు చాలాకాలం ఈ ‘ఊహాగానం’పైనే ఆధారపడి నడిచాయి. విచిత్రమేమిటంటే జ్ఞాన సంపన్నులమనుకునే మార్క్సిస్టులు-మావోలు సైతం ఈ ఊహాగానాలకే ఊతమిచ్చారు, ఊపిరిపోశారు. ఇప్పుడు క్రమంగా ఆ ‘నమ్మకం’ కరిగిపోతోంది, వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ద్రవిడ-ఆర్యుల సిద్ధాంతం కొంతమంది తమ పబ్బం గడుపుకోవడానికి సృష్టించిన పుక్కిటి పురాణమని వెల్లడైంది.

రామాయణాన్ని రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు, అగ్రకుల ఆర్యుడు కాదు.. ఓ నిమ్నజాతికి చెందినవాడు. భారతాన్ని రాసిన వ్యాసుడు వర్తమాన పదంలో చెప్పాలంటే ఓ బడుగువర్గానికి చెందినవాడు. మహాకవి కాళిదాసు కట్టెలు కొట్టుకుని జీవించే ఓ పేద కుటుంబానికి చెందినవాడు. ఇలా అనేకమంది రుషులు, మహర్షులు, కవులు, జ్ఞాన సంపన్నులు సమాజంలోని కింది తరగతుల నుంచి వచ్చిన వారేనని తేటతెల్లమవుతోంది. వీరినే అప్పటి సమాజం, ఇప్పటి సమాజం గౌరవిస్తోంది. ఇందులో ఆర్యులు గాని, ఆనాటి అగ్రవర్ణాల వారు గాని ద్రవిడులను ‘తొక్కి’వేశారన్న భావన, అణచిపెట్టారన్న ఆలోచన కనిపించదు.

 కేవలం ‘జ్ఞానం’ ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడటమే కనిపిస్తుంది. ఆ జ్ఞానం అగ్రవర్ణాల వారి వద్ద ఉన్నదా? నిమ్నజాతుల వద్ద ఉన్నదా? అన్నది అప్రస్తుతం. ఇదే పరంపర ఇంకా కొనసాగుతోంది. ఇదే ఈ దేశపు గొప్పదనం. దీన్ని ఎవరు తొక్కిపెట్టి, ఏదేదో ప్రదర్శించాలని ప్రయత్నించినా బీజంలోని సత్తువలా భూమిలోంచి మళ్లీ మళ్లీ తన్నుకువస్తూనే ఉంది.
వాస్తవానికి రావణుడు బ్రాహ్మణుడైనా, అగ్రవర్ణానికి చెందిన విద్వాంసుడైనా, గొప్ప పండితుడైనా, పరాక్రమవంతుడైనా, కుబేరుడిని కొల్లగొట్టినా ‘కాలం’ అతణ్ణి గుర్తుపెట్టుకోలేదు. ‘దిగువ మెట్టు’పై ఉన్న క్షత్రియుడైన రాముడినే ‘కాలం’ గుర్తుపెట్టుకుంది. అగ్రవర్ణాల వారైన బ్రాహ్మణులు సైతం గుణ సంపన్నుడైన రాముడినే అనాదిగా ఆరాధిస్తున్నారు. ఈ ఒక్క ‘మెలకువ’ అవగతమైతే మానవజాతి చరిత్ర చాలావరకూ అర్థమవుతుంది. దళితుల నుంచి మొదలుకుని నిచ్చెన మెట్ల సమాజంలో ఎత్తున ఉన్న అగ్రవర్ణాల వారందరూ ఆ క్షత్రియ జ్ఞానవంతుడినే, పరాక్రమవంతుడినే కొలుస్తున్నారంటే ముఖ్యంగా భరతఖండంలోని ‘చైతన్యం’ ఎలాంటిదో ఇట్టే అవగతమవుతుంది! దీన్ని పట్టుకోవడం మాని, ఏవేవో సిద్ధాంతాలంటూ ఊరేగితే ఒరిగేది ఏమిటి? వాస్తవాల్ని దర్శించేవాడే పదిమందికి ఆదర్శంగా నిలిచే అవకాశాలుంటాయి. వారికి మార్గదర్శనం చేసే వీలుంటుంది.

ఈ ముఖ్య విషయాన్ని విస్మరించి, కర్తవ్యాలు, బాధ్యతలపై ఆధారపడిన ‘వర్ణ వ్యవస్థ’నే అంతిమంగా భావించి అందులో దొర్లిన దోషాలను, తప్పులను తుపాకులతో, బాంబులతో సరిదిద్దుతామని కొందరు బయలుదేరడం విషాదాంత నాటకాన్ని ముందే ప్రదర్శించినట్టవుతుంది. గణతంత్రంగా భారత్ వెలుగొందిన ఆ ఆనవాలు ఇంకా సజీవంగా కనిపిస్తున్న విషయాన్ని చూసేందుకు నిరాకరించడం వల్ల, ఆవేశంతో, ఉద్రేకంతో, విశృంఖలంగా వ్యవహరించినందువల్ల గొప్ప వ్యవస్థ పురుడుపోసుకోదని ఇంకెప్పటికి అర్థమవుతుంది? సంకుచితమైన, సంకరమైన ఆలోచనల ‘మైండ్‌సెట్’ను సరిదిద్దుకున్నప్పుడే గొప్ప ఫలితాలు వెలువడుతాయి.గమ్యాన్ని ముద్దాడే దారి కనిపిస్తుంది.

ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రం, దేశం అత్యంత గౌరవనీయమైనవి, ఆదరణీయమైనవి. వాటిని గాలికి వదిలేస్తే ప్రజల జీవితాలు సైతం గాలిలో కలుస్తాయి. రాష్టమ్రుంటేనే దేశం ఉంటుంది. దేశముంటేనే ప్రపంచముంటుంది. ఇవి పరస్పర ఆధారాలుగా కనిపిస్తాయి. రాష్ట్ర ప్రజల కష్టం వల్లనే ‘ఆర్థికం’ ఏర్పడుతుంది. పరస్పర ఆధార జీవనంతో ముందుకు నడిచే వీలుంటుంది. రాష్ట్రానికి గాక ప్రపంచానికి ప్రాధాన్యతనిస్తే ఎద్దు స్థానంలో బండి, బండి స్థానంలో ఎద్దు నిలిపినట్టుగా ఉంటుంది. అది సరైన వైఖరి అవదు.

ఈ దేశంలో కమ్యూనిస్టులు, మావోయిస్టులు విఫలమవడానికి ప్రధాన కారణం ఇదే. స్వాతంత్య్ర పోరాట కాలంలో భారతీయుల శత్రువైన బ్రిటీషు వారికి సహకరించడం, మద్దతు ప్రకటించడంతో వారు దేశానికన్నా ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అందుకోసం ప్రాణాలివ్వమని ప్రోత్సహించడం చూస్తే వారి మానసిక స్థితి తేటతెల్లమైంది. అది అలాగే కొనసాగుతూ ఉంది. దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నో భేషజాలు అడ్డొస్తున్నాయి.అంతర్జాతీయ తెరలు వారి కళ్ళముందు వాలుతున్నాయి. దాంతో వారి ‘ప్రాసంగికత’ క్రమంగా సన్నగిల్లుతోంది. ప్రజల్ని ఉజ్వల భవిష్యత్ దిశగా నడిపించాలనుకునేవారు ఇలా పిడివాదంతో, అవాస్తవాంశాలతో ఊరేగినంత కాలం ఎవరికి ప్రయోజనం? రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజల అభివృద్ధిని ప్రేమించనంతకాలం ఎంత అంతర్జాతీయ సిద్ధాంతమైనా వెలవెలబోవలసిందేగా!

వర్తమాన సమాజంలో వారి ప్రాపంచిక దృక్పథం ప్రాసంగికతను కోల్పోయిందని వారి అభిమానులే, ఆరాధకులే చెబుతున్నా పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించడం వల్ల ప్రజల జ్ఞానం వృద్ధిచెందుతుందా? ‘జ్ఞానం’ అనే ఇరుసుపైనే యుగయుగాల మానవ జీవితం ఆధారపడి తిరుగుతోందని రామాయణ, మహాభారత కాలాల నాటి అవశేషాలు తెలియజేస్తున్నా పట్టించుకోకుండా- ‘వర్గాలు, వర్గకసి, సాయుధ పోరాటం, ప్రజాసైన్యం..’ అంటూ పలవరిస్తే ప్రజలకది నష్టాన్ని మిగిలిస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఈ ఇంగిత జ్ఞానం లేకుండా, జ్ఞానంపై పెట్టాల్సినంత దృష్టిపెట్టకుండా అకస్మాత్‌గా వనరులన్నీ తమ ఆధీనంలోకి రావాలని రంగుల కలలుకంటే అది వాస్తవికత అనిపించుకుంటుందా?

 దేశాన్ని మరిన్ని ముక్కలు చేయాలనుకోవడం, ద్రావిడుల (అలాంటి వారెవరూలేరని డి.ఎన్.ఎ. చెబుతోంది.)కు అన్యాయం జరిగిందని, అది ఇంకా కొనసాగుతోందని, దాన్ని సరిదిద్దడానికి తిరుగుబాటు, సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని రాత్రి-పగలు ఏకంచేసి ప్రచారం చేస్తే- మరింత నష్టపోవడం తప్ప ఇసుమంత ప్రయోజనం చేకూరదు. ఆరోగ్యకరమైన ‘స్పర్థ’ ఆర్థికంగా ఎదిగేందుకు,సమకాలీన సమాజంలో తలెత్తుకుని తిరిగేందుకు ఉపకరిస్తుంది.

 దాన్ని విస్మరించినంత కాలం అభివృద్ధి వెక్కిరిస్తూనే ఉంటుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ‘నాసా’ సంస్థ కృత్రిమ మేధను మరింత అభివృద్ధి పరిచేందుకు కంప్యూటర్ లాంగ్వేజి కి కేవలం సంస్కృత భాష పనికొస్తుందని గుర్తించి దశాబ్దాలుగా ఈ విషయమై పరిశోధనలు చేస్తూ,దాన్ని బైనరీ భాషకు అన్వయిస్తున్న వేళ... ఆ భాష భారతదేశంలో చాలామందికి కరతలామలకమైనప్పుడు ఇక్కడ ఆ భాషను, ఆ పరిశోధనలను, తదనుగుణమైన అంశాలను అభివృద్ధిపరిచే దిశగాగాక ఆ భాష ‘నడ్డి’విరిచినప్పుడే ప్రజలకు ‘న్యాయం’ జరుగుతుందని బోధించే వారి మానసికస్థితి ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది.కాబట్టి మన అడుగులు ఎటువైపుపడాలో ఎవరికివారే  నిశ్చయించుకోవాలి! నిజం తెలుసుకోవాలి!
*******************

వినాయక చవితి సందర్భంగా - శమంతక మణి ఉపాఖ్యానం



శమంతక మణి ఉపాఖ్యానము
ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చుని ఉండగా సత్రాజిత్తు ద్వారక నగరమునకు విజయం చేశాడు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలురందరూ కూడా సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని భ్రమపడ్డారు. ఎందరో మహర్షులు, తపశ్శాలురు, తేజోమూర్తులు దేవతలు కృష్ణుడి దర్శనమునకు వస్తూ ఉండడం అక్కడ రివాజు.  సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని వాళ్ళు  అనుకుని పరుగు పరుగున వెళ్లి కృష్ణ భగవానుడికి చెప్పారు. కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు. సత్రాజిత్తు అనే రాజు. ఆరాజు సూర్య నారాయణ మూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడయిన పరమాత్మ ఆయనకు శమంతక మణి   బహూకరించారు. ఆ శమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్య నారాయణుడే అని భ్రమపడ్డారు’ అని చెప్పాడు.
సత్రాజిత్తు ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా మణులు అలంకార ప్రాయమై మెడలో వేసుకునేందుకు పనికి వస్తాయి. ఈ  మణి ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉన్నది. ఎక్కడ శమంతక మణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు.  రోగములు రావు.  ఉన్నటువంటి వారు ఏ విధమయిన మానసికమయిన పీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణములతో పాటుగా ఆ మణికి ఒక శక్తి ఉన్నది. అది ప్రతిరోజూ తెల్లవారే సరికి ఎనిమిది బారువుల బంగారమును పెడుతుంది. ఆ మణిని ధరించి మణులలో కెల్లా మణియిన కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఈ వార్త ముందే కృష్ణునకు చేరింది. వస్తున్నవాడు సత్రాజిత్తని తెలుసుకున్నాడు. సత్రాజిత్తు శమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు.
కృష్ణ పరమాత్మ నోరువిప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకి లేక, చేత కాక కాదు! కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో మథురలో ఉండే కొన్ని లక్షలమంది ప్రజలను సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరమునకు చేర్చిన మహా పురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయనకోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటి! సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ ఈ మణిని నీవు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనములు ఉంటాయి. రాజ్యమునందు ఏ విధమయిన అరిష్టము ప్రబలదు. నీ ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఆ మణిని ప్రభువుకి బహూకరించని కృష్ణ పరమాత్మ అన్నారు.
అనగానే వచ్చిన సత్రాజిత్తు మనస్సులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆమణిని యాదవ విభునకీయవలసినదని కృష్ణుడు చెప్తే సత్రాజిత్తు ధనేచ్ఛచేత ఆ మణిని ఇవ్వడానికి అంగీకరించలేదు. మణిని ఇవ్వకపోతే కృష్ణుడు తనను ఏమీ చేయలేడని భావించాడు. కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి తొలగినట్లయితే ఉపద్రవం సముద్రం ముంచెత్తినట్లు ముంచెత్తేస్తుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదము కూడా ఏమీ చేయదు ప్రమాదము తప్పుకుంటుంది. కృష్ణుడు ‘నేను చెప్పాను. వినలేదు. నీవే పర్యవసానమును తెలుసుకుంటావు’ అని మనసులో అనుకున్నాడు. సత్రాజిత్తు తన గృహమునకు వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్రాజిత్తుకు అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడన్నది మరిచిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రం ప్రచారం చేసుకుంటున్నాడు. ఒకరోజున సత్రాజిత్తు తమ్మునికి ఒక చిత్రమయిన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసేనుడు. తాను ఆ మణిని ధరించి వేటకు వెడతానని అన్నగారిని అడిగాడు. సత్రాజిత్తు అంగీకరించాడు. ప్రసేనుడు మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహము చూసి మాంస ఖండం అనుకుని అమాంతం వచ్చి ప్రసేనుడి మీదకి దూకి అతనిని సంహరించి  మణిని తీసుకుని నోట కరుచుకుని వెళ్ళిపోతుండగా  అటునుండి జాంబవంతుడు వస్తున్నాడు. జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు. ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతున్నది. సింహము మణిని పట్టుకు పోతుంటే జాంబవంతుడు చూసాడు. సింహంతో యుద్ధం చేసి సింహమును చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. అది తినే పదార్ధం కాదని కేవలం ఒక మణి అని జాంబవంతునికి తెలుసు. జాంబవంతునికి కొడుకు పుట్టి ఉన్నాడు. ఆకొడుకు ఆడుకోవడానికి ఉయ్యాల పైభాగంలో ఈ మణిని కట్టాడు. ఆ పిల్లవాడు దానితో ఆడుకోవడం ప్రారంభించాడు.
సత్రాజిత్తు మణి గురించి ఎంతోమంది సైన్యమును పంపి ఎన్నోచోట్ల వెతికించాడు. అసలు ప్రసేనుడు చచ్చిపోయిన చోటు,   గుఱ్ఱము  కనపడలేదు. కృష్ణుడే ప్రసేనుడిని సంహరించి ఆ మణిని అపహరించాడు’ అని ప్రచారం చేశాడు.  కృష్ణుడు తనమీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలని అనుకున్నాడు. ప్రసేనుడు వేసుకుని వెళ్ళాడని తెలుసుకుని బంధుమిత్రాదులను తీసుకుని మణిని వెదకడానికి అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ఒకచోట ప్రసేనుడి గుఱ్ఱము, అతని కళేబరము కనపడ్డాయి. ప్రసేనుడిని ఎవరో చంపి ఉండాలని గ్రహించి వెతకగా సింహం అడుగుజాడలు కనపడ్డాయి. వాటి దగ్గర భల్లూకపు అడుగుజాడలు కనపడ్డాయి.  సింహమును భల్లూకం చంపి ఉంటుందని భావించారు. ఈసారి భల్లూకం వెళ్ళిన వైపు వెళ్ళగా గుహలో ఉయ్యాలమీద మణి వ్రేలాడుతోంది. కృష్ణుడు ఆ మణిని తీసుకుని వెళుతుండగా జాంబవంతుడు వచ్చాడు. ఆకార స్వరూపముల చేత కృష్ణుడు తన స్వామియే అని గుర్తించలేకపోయాడు. వారిరువురి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణునితో యుద్ధం చేసి డస్సిపోయి ఒంటిలోంచి రక్తం కారుతుండగా క్రింద పడిపోయాడు. తనని ఓడించినది ఎవరా అని చూడగా ఈ కృష్ణుడు ఆ రాముడు ఒక్కడే అని తెలుసుకుని ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేసి మణిని, తన కుమార్తె జాంబవతిని  కృష్ణునికిచ్చి వివాహం చేసి పంపించాడు.
తరువాత బలరాముడు మొదలయిన వారందరితో సభచేసి సత్రాజిత్తును పిలిచి అందరూ చూస్తుండగా నేను అపహరించాను అన్నావు. దీనిని జాంబవంతుడు తీసుకు వెళ్ళాడు. నీ మణిని నీవు తీసుకో’ అని మణిని ఇచ్చివేశాడు. మణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు సత్రాజిత్తు. కొన్నాళ్ళకి సత్రాజిత్తులో కృష్ణుని అనవసరంగా నిందించాననే భావన ఏర్పడి జాంబవంతుడు ఏం చేశాడో తాను కూడా అదే చేయాలనుకున్నాడు. సత్యభామ రాజనీతిజ్ఞురాలు, యుద్ధ నీతిజ్ఞురాలు. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటికీ మించి సౌందర్యాతిశయములు కలిగినటువంటి స్త్రీ. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్లి సత్యభామను,  మణిని స్వీకరించమని అడిగాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని మణిని నిరాకరించాడు. కొన్నాళ్ళు అయ్యాక కృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి  మణిని ఎత్తుకురావడానికి శతధన్వుడు సత్రాజిత్తు అంతఃపురమునకు వెళ్ళాడు. సత్రాజిత్తు గాఢనిద్రలో ఉన్నాడు. శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసి మణిని తీసుకుని పారిపోయి కృతవర్మ, అకౄరుల వద్దకు వెళ్ళగా ఇద్దరూ కృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతధన్వుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దాని ప్రకాశం నుండి వచ్చే ప్రకాశం వల్ల ఎక్కడ ఉన్నా తన ఉనికిని పట్టేస్తారు. మణిని అక్రూరుని యింట్లో పడవేసి శతధన్వుడు పారిపోయాడు. సత్రాజిత్తు మరణ వార్తవిని కృష్ణుడు వెంటనే వచ్చి అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వలననే చచ్చిపోయాడు.
శతధన్వుడి వల్ల సత్రాజిత్తు మరణించాడని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ శతధన్వుడు ఎక్కడ ఉన్నా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు. శతధన్వుడు మిథిలానగరం వరకు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చక్రమును ప్రయోగించాడు. శతధన్వుడు మరణించి  గుఱ్ఱము మీద నుంచి క్రింద పడిపోయాడు. వాని దగ్గర వెతకగా మణి కనపడలేదు. బలరాముడు వీడు ఖచ్చితంగా తన స్నేహితులయిన వారి ఇంట్లో ఆ మణిని పెట్టి ఉండవచ్చు అన్నాడు. కృష్ణుడు వచ్చి అకౄరా నీవు మణిని తీశావా అని అడుగుతాడేమోనని భావించి మణిని తీసుకుని అకౄరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అకౄరుడు ఇలా చేస్తాడని మనం ఊహించం. ఎందుకు అలా చేశాడో మనం తెలుసుకోవాలి. సత్రాజిత్తు మా పరమాత్మ మీద ఇన్ని నిందలు వేస్తారా అని కడుపులో ఆగ్రహం పెంచేసుకుని ఎలాగైనా సత్రాజిత్తును చంపించాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్వుని రెచ్చగొట్టారు. వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కరలేదు. శతధన్వుడు చచ్చిపోయాడు. మణి అకౄరుని వద్ద ఉన్నది. మణి ఉన్నదని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతారేమో నని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరం అయిపోయారు. అతి భక్తితో చేసిన తప్పిదములు ఈశ్వరునికి దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఎంత దూరమయినా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉన్నది. అకౄరునిలో మూడు లక్షణములు కలిసి వచ్చాయి. ఒకటి అతడు జన్మతః సాధించుకున్న ఫలితం, రెండు మహాపురుషుని తేజస్సు, మూడు అలవిమీరిన కృష్ణ భక్తి. ఈశ్వరుడే అక్కడ ఉన్నా భక్తుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షములు కురవడం ఆగిపోయాయి. ఈవిషయం కృష్ణుడు తెలుసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీలులేదు. మీరు వెళ్లి కృష్ణ భగవానుడు పరమ సాదరంగా తీసుకు రమ్మంటున్నాడని అకౄరునికి చెప్పి తీసుకురండి’ అని తన సేవకులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి అకౄరుడికి స్వాగతం చెప్పారు. తాను తెలిసో తెలియకో ఆగ్రహంతో కృష్ణభక్తిలో పొరపాటు చేశానని అకౄరుడు పశ్చాత్తాపపడ్డాడు. భక్తి సంయమనం ఎంత అవసరమో శమంతకోపాఖ్యానం నిరూపణ చేస్తుంది. కృష్ణ పరమాత్మ అకౄరునికి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువుచేసి ఒక మాట అన్నారు. ‘మహానుభావా! నీవు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నీవు వెళ్ళిపోతే ఇక్కడ వర్షములు పడలేదు. మణి నీ దగ్గరే ఉన్నది. మణిని నేను అపహరించలేదనే విషయం మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. నిన్ను శిక్షించి తేవడం నా అభిమతం కాదు. ఎందుకనగా నీవు నా భక్తుడవు. నీ అంత నీవుగా ఇచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది. పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను దోషం లేని వాడనై నిలబడినట్లు ఉంటుంది’ అన్నాడు.
అంతకుమించి అకౄరుని నిగ్రహించలేదు. వెంటనే అకౄరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా నా వలన నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న మణిని తీసి ఇచ్చివేశాడు. కృష్ణుడు దానిని సభలోని వారందరకి  చూపించి అకౄరునికి ఇచ్చి వేశాడు. దానిని అక్రూరుడు తీసుకువెళ్ళి తన ఇంటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజూ ఎనిమిది బారువుల బంగారమును పెట్టేది. దానితో అకౄరుడు ప్రతిరోజూ చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవంతుడికి స్మరిస్తూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితమును కృష్ణ పరమాత్మ అకౄరునికి ఇచ్చాడు.  ఆ శమంతక మణి ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఈశ్వరార్చనకు దగ్గర పెట్టుకున్న వానికి మణి బరువు కాదు. అకౄరుడు చేసే యజ్ఞ యాగాదుల వల్ల చక్కగా వర్షములు పడేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉండగా ఈ మణి అకౄరుని వద్ద శాంతించినది. పరమోత్క్రుష్టమయిన ఈ ఆఖ్యానమును  వింటున్న వారందరికీ ఒక దివ్యమయిన ఫలితం వస్తుందని చెప్పబడింది. చాలాకాలము నుండి తను చెయ్యని నేరమునకు తనమీద అపనిందతో ఉన్నవాడు ఎవరయినా ఉన్నట్లయితే తన మీద ఉన్న అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ ఉపాఖ్యానమును చదివినా విన్నా, మనస్సులో ఒక్కసారి తలచుకున్నా వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయే అవకాశం కలుగుతుంది. మహా భక్తుడయిన అకౄరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అవుతుంది. ఇది జరగాలి అంటే భగవంతుని మీద అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రం మనం మరచిపోకూడదు.
********************

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ చేసిన అనేకమైన స్తోత్రములలో, కీర్తనలలో బాగా ప్రాశస్త్యం పొందిన స్తోత్రం స్కంద షష్ఠి కవచం. ఈ కవచం తమిళ నాట చాలా ప్రసిద్ధి పొందిన స్తోత్రము. ఈ కవచమును వ్రాసిన వారు శ్రీ దేవరాయ స్వామి వారు.

ఈ స్కంద షష్ఠి కవచమును ప్రతీ సంవత్సరము స్కంద షష్ఠి ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేకించి చదువుతారు.

ఈ కవచమును శ్రద్ధతో ప్రతీ రోజూ పఠించిన భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహము లభిస్తుంది, ఆ షణ్ముఖుని శక్తి ఆయుధము మనకు ఒక కవచమై ఎల్లప్పుడూ రక్షిస్తుంది, అంతేకాక సర్వ వ్యాధి నివారణ, ఐశ్వర్య ప్రాప్తి, చేసే పనులలో విజయం కలగడం, సర్వ గ్రహ, శత్రు, కలి బాధలు హరింపబడతాయి, ఎటువంటి భూత ప్రేతములు దరి చేరలేవు, ఇహములో ఎన్నో సౌఖ్యములను కలుగజేసి, చివరకు స్కంద సాయుజ్యమును కలుగ చేయగల స్తోత్రం ఈ స్కంద షష్ఠి కవచం. ఈ కవచం పఠించిన వాళ్లకి అన్నిటా విజయం లభిస్తుంది.

ప్రత్యేకించి తమిళనాట ఎంతో మంది మహా భక్తులు ఈ కవచం యొక్క అద్భుత ఫలితములను అనుభవించారు. జీవితములో తీరని సమస్యలు, కోరికలు (ధర్మబద్ధమైనవి) నెరవేరుతాయి, సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది, దీనిని నమ్మి పఠించిన వారి ఇల్లు సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. మనం ఈ జన్మలోనూ, పూర్వ జన్మలలోనూ తెలిసీ, తెలియక అనేక పాపములు చేసి ఉంటే, వాటి ఫలితములను ఘోర రూపములో అనుభవించవలసి ఉంటే, ఈ స్కంద షష్ఠి కవచం పఠించడం వల్ల, షణ్ముఖ కటాక్షం కలిగి, మనకు కవచమై, మనల్ని రక్షించగలదు.

మహోన్నతులు_కేరళ_ప్రజలు

 ఇదే భారతదేశాన్ని గొప్పగా చేస్తుంది.  విమాన ప్రమాదంపై కేరళలోని ఒక స్నేహితుడు నుండి పంపబడిన సందేశం..

"వారు ప్రయాణీకుల సామాను దోచుకోలేదు.  గాయపడిన ప్రయాణికుల జేబుల నుండి వారు దొంగిలించలేదు.  పుర్రె టోపీ ధరించిన ప్రయాణీకులకు లేదా నుదిటిపై తిలక్ ఉన్నవారికి మధ్య వారు ఎటువంటి తేడా చూపించలేదు.  అధిక పెట్రోల్ ధర గురించి లేదా కోవిడ్ కారణంగా వారి కరువు కష్టకాలం గురించి వారు ఆలోచించలేదు.  వారు సురక్షితమైన దూరం ఉంచడానికి లేదా ముసుగులు ధరించని వారిని తాకడానికి నిరాకరించలేదు.  ఈ నెలల్లో చాలా జాగ్రత్తగా ఉన్న తరువాత వారు కోవిడ్‌కు భయపడలేదు.

 గాయపడిన ప్రయాణీకులకు వారి రక్తం ఇవ్వడానికి వేచి ఉన్న మెన్ & ఉమెన్ వాలంటీర్లతో హాస్పిటల్ బ్లడ్ బ్యాంకుల ముందు ఉన్న పొడవైన క్యూ, అర్ధరాత్రి దాటిందని మరియు వారి పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారని కూడా గ్రహించలేదు.  గాయపడిన ప్రయాణికులను తమ కార్లలో తీసుకెళ్లినప్పుడు, వారి కార్ల తోలు సీటు కవర్లు రక్తం మరియు మట్టితో తడిసినా వారు బాధపడలేదు.

 తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ వాహనాల్లో అధిక వేగంతో ఆసుపత్రికి తరలించిన ఆ ప్రయాణికుల పేరు, మతం లేదా జాతీయత వారికి తెలియదు.  విమానం కూలినట్లు విన్న వారు రాత్రిపూట కురుస్తున్న కుండపోత వర్షం గురించి వారు బాధపడలేదు.

 పోలీసులు లేదా అంబులెన్సులు వచ్చేవరకు గాయపడిన వారిని తీయటానికి వారు వేచి ఉండరు.  గాయపడిన ప్రయాణికుల్లో ఎక్కువ మందిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు స్థానికులు.  ఏమి జరిగిందో అర్థం చేసుకోకుండా వేరుచేయబడిన చిన్న పిల్లలు, వారి ఛాతీకి దగ్గరగా ఉంచబడ్డారు మరియు వారు మాట్లాడగలిగే భాషలలో ఓదార్చారు.  పిల్లల చిత్రాలతో వాట్సాప్ ఎంఎస్‌జిలు మరియు తల్లిదండ్రులు వారిని సంప్రదించే వరకు, పిల్లవాడిని కలిగి ఉన్న వ్యక్తి యొక్క కాంటాక్ట్ నంబర్‌తో తెలిసిన అన్ని నంబర్లు & గ్రూపులకు కేర్‌టేకర్ లకు పంపబడింది.

 ఇవన్నీ కేరళలోని మలపురం యొక్క ఆర్డినరీ పీపుల్ చేత చేయబడ్డాయి - ఈ పరిస్థితికి ప్రతిస్పందించడానికి అలాంటి దయ మరియు మనస్సు ఉనికిని కలిగి ఉన్నారు.

 ఈ రోజున సహాయం చేసిన మలపురం ప్రజలకు ఒక స్టాండింగ్ సాల్యూట్.

 వారే లేకపోతే, ప్రమాద మరణాలు ఇంకా ఎక్కువగా ఉండేవి.  భారతీయులుగా ఉన్నందుకు గర్వంగా ఉంది, కేరళలోని మలప్పురం ప్రజలకు ధన్యవాదాలు.🙏🙏🙏
******************

బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమా ?

అవును. కానీ కాదు.
అవును : బుద్ధ అనే పేరుతో శ్రీహరి అవతారం ఉంది.
కాదు : ఆ బుధ్ధ అవతారం కలియుగంలో గౌతమ బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు మాత్రం కాదు. అసలు ఆ అవతారం పేరునే బౌద్ధమతం స్థాపించేముందు బుద్ధుడు పెట్టుకున్నాడు. తెలియనివాళ్ళు 10అవతారాల్లో ఒకడు గౌతమబుద్ధుడు అని కలిపేస్తుంటారు. వాళ్లకు ఇది వివరంగా చెప్పండి.

అసలు శ్రీమహావిష్ణువు కేవలం 10 అవతారాల్లోనే వచ్చాడా ? కాదు. వివరణకై ఇది చదవండి.

ఏక వింశతి అంటే 21 శ్రీమహావిష్ణువు అవతారాలు :

దశావతారాలు ముఖ్యమైనవి అని మనకు పెద్దలు చెప్పారు కానీ పది అవతారాలు మాత్రమే అని కాదు. ఎన్నోసార్లు ఎన్నో యుగాల్లో శ్రీమహావిష్ణువు తాత్కాలికంగా కూడా లోకకళ్యాణార్ధకార్యాలకై భువిపైకి వేంచేశాడు.
వివరాలు చూద్దాం :

"యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్..!!
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే"

ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును
(జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును.
సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.

భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రకారం భగవానుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అవతారాలు దాల్చాడు..
వాటిలో దశావతారాలు ప్రసిద్ధమైనవి ..
దశావతారాలతో ఏకవింశతి అవతారాలు కలవు వాటి గురించి తెలుసుకుందాం..!!

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:

మత్స్యావతారము
కూర్మావతారము
వరాహావతారము
నృసింహావతారము లేదా నరసింహావతారము
వామనావతారము
పరశురామావతారము
రామావతారము
కృష్ణావతారము
వెంకటేశ్వరావతారము
కల్క్యావతారము

బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి.
ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.
(బుద్ధుడు అంటే బౌద్ధ మత ప్రబోదకుడైన బుద్ధుడు కాదు)

మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి.
అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి.
ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.

శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు.
ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

౧) బ్రహ్మ అవతారము:
దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.

౨) వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.

౩) నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.

౪)నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.

౫) కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.

౬) దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.

౭) యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.

౮) ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.

౯) పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.

౧౦) మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.

౧౧) కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.

౧౨) ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.

౧౩) మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.

౧౪) వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము .రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

౧౫) నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.

౧౬) వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.

౧౭) పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.

౧౮) వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.

౧౯) రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.

౨౦) కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.

౨౧) కల్కి అవతారము : కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.

భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.

వరాహావతారం - భూసముద్ధరణం.

సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం

కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం

దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం

సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం

నరనారాయణావతారం - కామజయం

ధ్రువావతారం - ధ్రువపదారోహం

పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం

ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం

హయగ్రీవావతారం - వేదజననం

మత్స్యావతారం - వేద సంగ్రహం

కూర్మావతారం - మందర ధారణం

ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం

వామనావతారం - బలిరాజ యశోరక్షణం

హంసావతారం - భాగవత యోగోపదేశం

మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం

పరశురామావతారం - దుష్టరాజ భంజనం

రామావతారం - రాక్షస సంహారం

కృష్ణావతారం - లోకకళ్యాణం

వ్యాసావతారం - వేద విభజనం

బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం

కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం

నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు.
అచిత్తు ప్రకృతి.
ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది.
శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు.

అవి

అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
అంతర్యామి - సకల జీవనాయకుడు.

జై శ్రీమన్నారాయణ ! ఓం నమః శివాయ !!
********************

*కొత్త పాఠం*…


*ఓ దృఢమైన వంతెన....,*
*దారి మార్చుకున్న నది...*


… ఇందులో ఒక బ్రిడ్జి ఉంది… దాని పక్కన ప్రవాహం ఉంది… బ్రిడ్జికి ఇరువైపులా దాన్ని కనెక్ట్ చేసే రోడ్లు కూడా లేవు… అదేమిటి..? ఇండియన్ కంట్రాక్టర్ అయి ఉంటాడు, అందులోనూ పొలిటికల్ వాసనలున్నవాడు అయి ఉంటాడు, అందుకే సగం కట్టేసి, డబ్బులు డ్రా చేసి, చేతులు దులుపుకుని ఉంటాడు అనేదేనా మీ డౌట్… అఫ్ కోర్స్, మనవాళ్లు అలాంటోళ్లే కానీ ఇక్కడ అది కాదు కేసు… *కథ వేరే ఉంది, చదవండి*…

దీన్ని చొలుటెకా బ్రిడ్జి అంటారు… ఇది 484 మీటర్ల బ్రిడ్జి… అంటే అర కిలోమీటర్… దక్షిణ అమెరికాలో హండురాస్‌లో ఉన్నది ఇది… భారీ తుపాన్లకు, కుండపోతలకు పెట్టింది పేరు ఆ దేశం… అంటే ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరస్టులు అన్నమాట… 1996లో చొలుటేకా నది మీద, ఓ అవసరమైన ప్రాంతంలో వంతెన కట్టాలని నిర్ణయించారు… ఎలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తినా తట్టుకునేలా దృఢంగా, నాణ్యంగా కట్టాలని టెండర్లు వేసిన కంట్రాక్టర్లకు గట్టిగా చెప్పారు…

జపాన్‌కు చెందిన ఓ కంపెనీ అత్యుత్తమ నాణ్యతతో కడతానని ముందుకొచ్చింది… చెప్పినట్టుగానే ఓ సాలిడ్ బ్రిడ్జి కట్టి ఇచ్చింది… ఏమాత్రం వంక పెట్టలేని రీతిలో… 1998లో జాతికి అంకితం చేశారు… *కానీ కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది*…

అదే సంవత్సరం ఓ భారీ తుపాన్ ముంచుకొచ్చింది… నాలుగు రోజుల్లో 75 ఇంచుల వర్షం… అంటే కుండపోతకన్నా చాలా ఎక్కువ… మేఘాలు భళ్లున బద్దలై నీళ్లు గుమ్మరించినట్టు అంటే సరిపోతుందేమో… సాధారణంగా అక్కడ ఆరునెలల్లో నమోదయ్యే వర్షపాతం నాలుగు రోజుల్లో కుమ్మేసింది… ఎటు చూసినా వరదనీరే… 7 వేల మంది మరణించారు… లక్షల మంది నిరాశ్రయులు… ఎటుచూసినా నీళ్లు, కన్నీళ్లు… *అన్నీ దెబ్బతిన్నాయి… ఈ బ్రిడ్జి తప్ప…*

కానీ సమస్య ఏమిటంటే… బ్రిడ్జి బాగుంది, దృఢంగా నిలబడింది… కానీ అటూఇటూ కనెక్ట్ చేసే రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి… అసలు అంతకుముందు కూడా లేవేమో అన్నట్టుగా… ఆ *భారీ వరదనీటితో ఆ నది కూడా ఇష్టారీతిన పొంగి, ప్రవహించి, చివరకు తన దిశను కూడా మార్చుకుంది* … దాంతో బ్రిడ్జి కింద నుంచి గాకుండా, బ్రిడ్జి పక్క నుంచి పారుతోంది ఇప్పుడు… *మరి ఈ బ్రిడ్జిని ఏం చేసుకోవాలి..?*
బిజినెస్ వరల్డ్‌లో ప్రచురితమైన *ఈ కథ ఇప్పుడు* పలు సైట్లలో, వ్యక్తిత్వ వికాస పాఠాల్లో, క్లాసురూముల్లో, బిజినెస్ మీటింగుల్లో *చర్చనీయాంశం అవుతోంది* … ఏమనీ..? ఒకే ప్రొఫెషన్ మీద డిపెండ్ అవుతాం, అందులోనే మెరుగులు దిద్దుకుంటాం, అలాగే *ఒకే వ్యాపారం మీద సర్వశక్తులూ ఒడ్డుతాం, విస్తరిస్తాం… మరి ఈ బ్రిడ్జిలాగే మారిపోతే… పరిస్థితులు మారిపోతే…?*

ఇప్పుడు కరోనా లేవనెత్తే ప్రధాన ప్రశ్న కూడా అదే… కొలువులు పోతున్నయ్… వ్యాపారలు దెబ్బతింటున్నయ్… ఎప్పుడు కోలుకుంటామో ఎవరికీ తెలియదు… *మనం పూర్తిగా డిపెండైన రంగం మునిగిపోతే, రేప్పొద్దున మన పరిస్థితి ఏమిటి…?* ఇప్పుడు అందరూ ఏ రంగమూ బాగాలేదని, సేఫ్ సైడ్ అన్నట్టుగా బంగారం కొంటున్నారు… ఏడాదిలో దాని ధర 30 వేల నుంచి ఇప్పుడు 52 వేలకు వచ్చింది, 70 వేలు దాటుతుందీ అంటున్నారు… కానీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడినా ఆ ధరలు ధడేల్ అని పడిపోతాయి… సేమ్, ఇలాగే…

*పూర్తిగా ఒకే విషయం మీద ఆధారపడటం కరెక్టేనా..? అనుకోని అవాంతరాలు వచ్చి, అది పనికిరాకపోతే ఎలా..?* అవాంఛనీయ, నష్టదాయక మార్పుకు తగినట్టుగా వెంటనే మనం మారిపోవడం ఎలా..? సేఫ్ ప్రత్యామ్నాయం ఏమిటి..? ఇవీ ఆలోచించడం ఇప్పుడు అవసరం అంటున్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు…

*ఒక సమస్యకు పరిష్కారాలు బోలెడు… కానీ సమస్యే మారిపోతే ఎలా..?* అంటే… మనం బ్రిడ్జిని దృఢంగా, నాణ్యంగా, పకడ్బందీగా కట్టి, దాని గురించే ఆలోచించాం, కానీ అసలు నదీప్రవాహమే దారిమళ్లింది, బ్రిడ్జి ఎంత బాగుంటేనేం..? యూజ్‌లెస్ అయిపోయింది… మరేం చేయాలి..? అందుకే ఈ బ్రిడ్జి మీమీ వ్యాపార సంస్థల్లో వేలాడదీసుకుని, *ఎప్పుడూ ఓ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి పెట్టుకోవడం బెటర్ అంటున్నారు*…
అఫ్ కోర్స్, ఉన్నదాన్ని ఇగ్నోర్ చేసి కాదు…!!
*Built to Last మాత్రమే కాదు*…
*Build to Adapt కొత్త మంత్రం*…
 *కాలం మారేకొద్దీ పాఠాలూ మారిపోవాలి, పోతున్నయ్… కరోనా చాలా కొత్త పాఠాల్ని నేర్పిస్తుంది కదూ…*
*ధన్యవాదాలు*

శ్రీ గణేశభుజంగ పంచరత్నం


1) వ్యాళసూత్రధార్యమిందుకుందధవళతేజసం
  భక్తవందితాంఘ్రియుగళపార్వతీమనోజవం 
  దానవాసురాదిహంతచారుసింధురాననం
  యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం ||

2) చందనాదిచర్చితాంగమాణిక్యభూషణం
   సామగానలోలమత్తచిత్తశంకరాత్మజం 
   పాశమోదకాదిహస్తహాస్యచతురభాషణం
   యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘనాయకం ||

3) గర్వమోహసర్వఖర్వప్రథమపూజ్యపాత్రతం
   ముద్గలాదిమౌనివర్యసతతపూజ్యవిగ్రహం
   కార్యసిద్ధిమేధబుద్ధిసకలవిద్యదాయకం
   యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం ||

4) ఆనందహృదయవాసచారుశూర్పకర్ణకం
   ఇందిరాదివంద్యమానచారుఏకదంతకం
   భావరాగతాళయుక్తభవ్యనాట్యకోవిదం
   యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం   || 

5) భ్రాంతిభీతిభేదనాశభక్తహృదయమందిరం
     భావనాత్మసంతుష్టతుష్టిపుష్టిదాయకం
     కోటిసూర్యభాసమానషోడశాకళాత్మకం 
     యక్షకిన్నరాదిసేవ్యశ్రీవిఘ్ననాయకం    ||
 
      సర్వం శ్రీగణేశదివ్యచరణారవిందార్పణమస్తు
***********************

అసలు సంస్కృతి అంటే

⚜️  సకల ఆచార వ్యవహారాల, జీవన విలువల సమ్మేళనమే సంస్కృతి. జాతి చారిత్రక పునాదులను, పాఠాలను నిత్యం మననం చేసుకొంటూ, వర్తమాన విజయాలను కైవసం చేసుకొంటూ, ఉన్నతమైన ఆశయాలతో, విలువలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొనడానికి సంస్కృతి సహకరిస్తుంది.

⚜️   జాతి మాట్లాడే భాషలోనూ, సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకము, చిత్రలేఖనము మొదలగు కళారూపాలలోను, కట్టూ, బొట్టూ, పలకరింపు, ఆదరణ వంటి సాంప్రదాయిక ఆచార వ్యవహారాల లోను సంస్కృతి ప్రతిబింబిస్తుంది.

⚜️   తరతరాలుగా జాతి ప్రతిబింబిస్తున్న మానవతా విలువలను, జాతి యొక్క ప్రత్యేకమైన సంస్కృతి సున్నితమైన సీతాకోక చిలుక వంటిది, భవిష్యత్తులో స్వేఛ్చగా ఎగరాలంటే, శ్రమ, సహనం, పట్టుదలతో కూడిన పరివర్తన, కార్యాచరణ అవసరం.

⚜️  అరచేతులు మూసి గట్టిగా పట్టుకొంటే చితికిపోతుంది, తెర తీసి ఎగరనిస్తే భావి తరాల కోసం మరిన్ని అందాలను తనలో ఇముడ్చుకొంటుంది.

⚜️  వారసత్వం వంటి ఆలోచనలను, ఆశయాలను, ఆదర్శాలను, సంస్కృతి తనలో ప్రతిఫలిస్తుంది. సంస్కృతి సాగి పోయే నది వంటిది.

⚜️   ఇది స్వవాసంలోనైనా, ప్రవాసంలోనైనా పాత విషయాలను లోపల దాచుకొని, క్రొత్త విషయాలను తనలో కలుపుకొంటూ నిరంతరం సాగిపోయే ప్రవాహం, మారుతున్న కాలంతో మారే భిన్నరుచుల, అభిరుచుల, అభిప్రాయాల సమాహారం.

⚜️   కాలం కాగితంపై ఒక జాతి కలిసికట్టుగా చేసే సంతకం, ఒక తరం మరొక తరానికి అందించే జీవన సందేశం. ఉన్నతమైన విలువలలో పుట్టి, ఉదాత్తమైన సాగర సంగమానికి నిత్యం పరితపిస్తుంటుంది.

⚜️  సంస్కృతికి భాషే పునాది. చరిత్రను విస్మరించిన వానికి భవిష్యత్తు లేనట్లే, భాషను కాదంటే సంస్కృతిని కాదన్నట్టే.

సాష్టాంగ నమస్కారం

సాష్టాంగ నమస్కారం ధ్వజస్తంభం దగ్గరే ఎందుకు చేయాలి?

దేవాలయానికి వెళ్ళిన భక్తుల్లో కొందరు దైవానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు.

దైవానికి ఎదురుగా చేతులు చాచి దేహాన్ని పూర్తిగా నేలకి తాకిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు.

అయితే సాష్టాంగ నమస్కారం ధ్వజస్తంభం దగ్గరే చేయాలనే నియమం ఆధ్మాత్మిక గ్రంథాల్లో ఉంది.

సాష్టాంగ నమస్కారం ధ్వజస్థంభం దగ్గర చేయడం వల్ల ఆ నమస్కారం తప్పకుండా దైవానికి చేరుతుందట. అంతేకాకుండా సాష్టాంగ నమస్కారం కోసం బోర్లా పడుకున్నప్పుడు కాళ్ళ భాగం దిశలో ఎలాంటి దేవతామూర్తులు ఉండరట. ఆలయంలోని ముఖ మండపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్ళు ఆ దైవం వాహనం వైపుకు వస్తాయట.

కొన్ని ఆలయాల్లో ముఖ మండపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్ళు ఉపాలయాల వైపు ఉంటాయట. అందువల్ల ఎలాంటి దైవ సంబంధమైన వాహనాల వైపు ఉప ఆలయాల వైపు కాళ్ళు పెట్టకుండా ఉండటం కోసం ధ్వజస్థంభం దగ్గర నిర్ధేశించిన ప్రవేశంలోనే సాష్టాంగ నమస్కారం చేయాల్సి ఉంటుందంటున్నారు.
************************

నాలుగు వేదములు

నాలుగు వేదములు ఋక్కు , సామ, యజుః అధర్వణ, వక చిన్న వివరణ. ఋక్కు అనగా శక్తి యెక్క మూల తత్వం అనగా బంగారం మలినంతో  ఎలా నుండునో అలాగ.దాని 
శక్తిని సామ పరంగా అనగా మనో శక్తి ఆత్మలో యున్న శక్తితో సాధన వలన యజుః తత్వం తెలియబడినది . తెలియబడిన తత్వం సాధన వలన యజుః వలన అధర్వణ అనగా లక్షణమైన పదార్థంగా మారు చున్నది. దాని ఫలము అనుభవము పంచభతాత్మకమైన శరీర ధర్మం వలననే అనుభవైక వేద్యమగును.అనగా పదార్ధాలు లక్షణము తెలియును. కాని దాని గుణము ఎలా తెలియును అది తిరిగి వస్తువుగా మారి మనం ధరించినగాని అనగా పదార్థమును స్వీకరించి జీర్ణమైన గాని దాని లక్షణము దేహములో మార్పు చెందదు. వక ఉదాహరణ. దశరధుడు యాగం వలన హవిస్సు పాయసరూపం, పాయసరూపం దేహము వలన లక్షణము, అట్టి లక్షణము వలన రామ జననం. రామ జననం అయిన తరువాతనే రామ గుణం దేహం రూపంలో తెలిసినది. సమస్త దేవతలు అట్టి రూపం గుణములను ప్రత్యక్షంగా చూసి  యుండలేదు. చూసిన తరువాత తెలిసినది. మానవ పరిపూర్ణత్వం తెలియకయే. అది ఓహో యిది అని తెలిసినది రూపంగా. దానిని మన మహర్షులు సాధన లో గ్రహించారు.కాని ప్రత్యక్షంగా చూసిన గాని తత్వం గోచరించదు. మనం కూడా అలాగే సాధన చేసి శోధించి తెలియవచ్చు.యీ పరంపరలో వక అన్నమయ్య, త్యాగయ్య పురందర , క్షేత్రయ్య రామదాసు... మెుదలగు వారిని చూసి సాధనతో తెలియవచ్చు. ఏదైనను తగుమాత్రము జీవనమునకు మాత్రమే తీసుకొని సాధనతో శోధించిన విషయం తెలియనగును. మనం కూడా యిలా చేసి చేసి ఎప్పటికో వక మంచి సు క్షేత్రమును చేరి ముక్తి పొందవచ్చు. చేస్తూ వుండటమే. అనుమాన నివృత్తి ఎవరికి వారే తప్ప యితమిధ్ధంగా యిది అని దర్శింప చేయలేరు. మానవ నైజమే అంత. యఙ్ఞం అనగా సృష్టియే. అలా అని సృష్టించిన తరువాత దాని లక్షణమునకు భ్రాంతి నొందక దూరమునుండి గమనించుటయే. శబ్ద శక్తిని దర్శించిన యిక ఏ వస్తువైననూ దానిని సర్వం ఖల్విదం బ్రహ్మ. మాయ యని దేహం వలననే తెలియుచున్నది. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే వుందాం.
************************

రామాయణమ్. 30

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జనకుడు .ఈయన అసలు పేరు సీరధ్వజుడు. మిధిలా నగరాధీశులందరినీ "జనకుడు" అనే పిలుస్తారు .
మూలపురుషుడు "నిమి" నుండి ఈయన ఇరవై మూడవ మహరాజు! .
.
అప్పటికి దాదాపు 6 సంవత్సరాలనుండి శివధనుస్సు గురించి ప్రచారం జరుగుతూనే ఉన్నది .ఒక్కొక్క రాజు రావడం ధనుస్సు ఎత్తలేకపోవడం జనకుడిమీదికి దండెత్తిరావడం .ఒకసారి అందరూ మూకుమ్మడిగా దండెత్తి వచ్చి కోటను సంవత్సరంపాటు ముట్టడించారు . కోటలో సైన్యసంపద తరిగిపోసాగింది ,ఆహారధాన్యాలు నిండుకున్నాయి ,అప్పుడు జనకుడు దేవతల సహాయంతో వారిని ఎలాగోలా ఓడించి సాగనంపాడు !
.
 ఇప్పుడిక ఆ బెడద తీరిపోయింది ! అందుకు ఆ నిట్టూర్పు! హమ్మయ్య! అని!
.
విశ్వామిత్రుడికి కన్నుల వెంట ఆనందబాష్పములు రాలినవి !
(ఎందుకని? జగత్కల్యాణకారకుడి కళ్యాణానికి తాను కారకుడనయ్యానని)
.
పురజనులంతా సంబరపడిపోయారు,స్త్రీ జనమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు !
.
మరి తరుణి సీత!
తనువంతా పూచిన మందారమయ్యింది!
తానొక సిగ్గుల మొగ్గ అయ్యింది !
 .

పోత‌న త‌ల‌పులో....(19)

జ‌గ‌ద్ర‌క్ష‌కుడైన కృష్ణ‌ప‌ర‌మాత్మ ఘ‌న‌త‌ను కీర్తించి,
జ‌నుల జ‌డ‌త్వాన్ని వ‌దిలించే ప‌ద్యం ఇది.

                                 ****
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.
                                 ****
                       
న్యాయాన్ని మెచ్చువాడికి, చనిపోయిన‌ బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి.వంద‌నం.

 🏵️పోత‌న ప‌ద్యం🏵️
🏵️ భక్తి ముక్తిప్రదం🏵️

మనిషి జీవితం విచిత్రమైంది.....

యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..??
మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి.
.కానీ సమయం ఉండదు..??
వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి.
.కానీ శక్తి మాత్రం ఉండదు..
తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
జీవితం ముగిసిపోతుంది.
మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..
మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...
కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి.
ఆప్యాయత అనురాగలను పంచండి..
మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి
**********************

This is how Corona's journey will end.- as per jyotisya

*As per astrology, the journey of Corona came into limelight on 26-12-2019 - Amavasya – Moola -Thursday- in the Makara Lagna (from 07.58 am to 09.49 am).

Six planets, namely Sun, Moon, Mercury, Jupiter, Saturn and Ketu, were in Sagittarius sign.  Sagittarius is twelfth house (vyaya) from Capricorn.

Mars was in Scorpio. Venus was in Capricorn. Rahu was in Gemini. On the whole, except Venus, the remaining eight planets were directly involved in giving birth to this pandemic. 

*Such planetary combinations take place once in hundred years, even more.*.

Every journey has an inevitable end. This principle of life only stimulated me to find out the time that when this pandemic will reach its ending point.

*Eight planets will be in their respective good signs on 14-09-2020 and 15-09-2020. The eight planets that gave birth to this pandemic on 26-12-2019 will bring an end to the pandemic. That will be on 14-09-2020 Dwadasi; Monday Aslesha Mesha Lagna (from 19.45 to 21.29 pm). During this period between 19.45 pm to 21.29 pm, a scientist whose name starts with the first letter *"ఫ"/"pha" will succeed in bringing out the vaccine for this pandemic.*
             
Next, the scientists will announce this victory on 15-09-2020 - between 19.41pm to 21.25 pm - Mesha Lagna - Trayodasi -Magha - Tuesday (seven planets in good condition + eighth planet Moon was accepted by planet Jupiter (ninth aspect).

Dendukuri Nagabhushana Sastry
S/o Krishna Murthy
Mobile: 88979 95750.


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదకొండవ అధ్యాయము*

*దేవాసుర సంగ్రామము సమాప్తమగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*11.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*హరీన్ దశశతాన్యాజౌ హర్యశ్వస్య బలః శరైః|*

*తావద్భిరర్దయామాస యుగపల్లఘుహస్తవాన్॥6638॥*

బలుడు మిగుల హస్త కౌశలముతో ఒకేసారి వేయిబాణములు ప్రయోగించి ఇంద్రుని యొక్క వేయి గుర్రములను గాయపరచెను.

*11.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*శతాభ్యాం మాతలిం పాకో రథం సావయవం పృథక్|*

*సకృత్సంధానమోక్షేణ తదద్భుతమభూద్రణే॥6639॥*

పాకాసురుడు ఒక వంద బాణములతో మాతలిని కొట్టెను. మరియొక వందబాణములతో అతని రథమును ముక్కలు ముక్కలు గావించెను. ఈ విధముగ ఒకేసారి ఇన్ని బాణములను ప్రయోగించుట యుద్ధమునందు ఆశ్చర్యకరము గదా!

*11.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*నముచిః పంచదశభిః స్వర్ణపుంఖైర్మహేషుభిః|*

*ఆహత్య వ్యనదత్సంఖ్యే సతోయ ఇవ తోయదః॥6640॥*

నముచియను రాక్షసుడు బంగారు పుంఖముల పదునైదు బాణములను ఇంద్రునిపై ప్రయోగించి, జలముతో గూడిన మేఘమువలె గర్జించెను.

*11.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*సర్వతః శరకూటేన శక్రం సరథసారథిమ్|*

*ఛాదయామాసురసురాః ప్రావృట్సూర్యమివాంబుదాః॥6641॥*

వర్హాకాలములో మేఘములు సూర్యుని కప్పివేసినట్లు అసురులు శరములను పరంపరగా వర్షించి, ఇంద్రుని, అతని సారథిని, రథమును అన్ని వైపుల నుండియు కప్పివేసిరి.

*11.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*అలక్షయంతస్తమతీవ విహ్వలా  విచుక్రుశుర్దేవగణాః సహానుగాః|*

*అనాయకాః శత్రుబలేన నిర్జితా  వణిక్పథా భిన్ననవో యథార్ణవే॥6642॥*

ఇంద్రుడు కనబడకపోవుటవలన దేవతలు, వారి అనుచరులు, మిగుల విహ్వలులై ఆక్రోశించిరి. శత్రువులు ఇదివరకే వారిని ఓడించి యుండిరి. ఇప్పుడు వారి నాయకుడు గూడా కనబడపోవుటచే వారు సముద్రమధ్యములో నావ పగిలిపోవుటచే దుఃస్థితికి లోనైన వ్యాపారులవలె ఆందోళనపడిరి.

*11.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*తతస్తురాషాడిషుబద్ధపంజరాద్వినిర్గతః సాశ్వరథధ్వజాగ్రణీః|*

*బభౌ దిశః ఖం పృథివీం చ రోచయన్ స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే॥6647॥*

కొంత తడవునకు ఇంద్రుడు తన గుర్రములతో, రథములతో, ధ్వజముతో, సారథితో గూడి,  అసురులయొక్క శరపంజరము నుండి బయటపడెను. అప్పుడు ప్రాతఃకాలమున సూర్యుడు తన కిరణములచే దిక్కులను, ఆకాశమును, పృథ్విని ప్రకాశింపజేసినట్లు, ఇంద్రుడు తన తేజస్సుచే రణభూమిని తేజరిల్లజేసెను.

*11.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*నిరీక్ష్య పృతనాం దేవః పరైరభ్యర్దితాం రణే|*

*ఉదయచ్ఛద్రిపుం హంతుం వజ్రం వజ్రధరో రుషా॥6644॥*

వజ్రధారియైన ఇంద్రుడు రణభూమియందు శత్రువులు తన సైనికులను బాధించుటను చూచెను. అంతట అతడు క్రుద్ధుడై శత్రువులను పరిమార్చుటకు వజ్రాయుధమును చేబూనెను.

*11.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*స తేనైవాష్టధారేణ శిరసీ బలపాకయోః|*

*జ్ఞాతీనాం పశ్యతాం రాజన్ జహార జనయన్ భయమ్॥6645॥*

రాజా! వాడియైన అంచులు గల తన వజ్రాయుధముతో ఇంద్రుడు బలాసురుని, పాకాసురుని శిరస్సులను ఖండించెను. ఆ దృశ్యమును జూచిన వారి బంధువులు భయముతో వణకి పోయిరి.

*11.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*నముచిస్తద్వధం దృష్ట్వా శోకామర్షరుషాన్విత|*

*జిఘాంసురింద్రం నృపతే చకార పరమోద్యమమ్॥6646॥*

మహారాజా! తన సోదరులు (బలాసురుడు, పాకాసురుడు) వధింపబడుటను చూచిన నముచికి శోకము, అసహనము, కోపము కలిగెను. అంతట అతడు ఎంతయు క్రుద్ధుడై, ఇంద్రుని వధించుటకు ఉద్యుక్తుడయ్యెను.

*11.30 (ముప్పదియవ శ్లోకము)*

*అశ్మసారమయం శూలం ఘంటావద్ధేమభూషణమ్|*

*ప్రగృహ్యాభ్యద్రవత్క్రుద్ధో హతోఽసీతి వితర్జయన్|*

*ప్రాహిణోద్దేవరాజాయ నినదన్ మృగరాడివ॥6647॥*

'ఇంద్రా! ఇప్పుడు నీవు నీ ప్రాణమును రక్షించుకొన జాలవు!' అనుచు నముచి సింహమువలె గట్టిగా గర్జించుచు తన త్రిశూలమును ఇంద్రుని మీదికి విసరెను. అది ఇనుముతో నిర్మితమై , భూషణములతో అలంకరింఫబడి బంగారు గంటలను  కలిగియుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదకొండవ అధ్యాయము*

*దేవాసుర సంగ్రామము సమాప్తమగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*11.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*తదాపతద్గగనతలే మహాజవం   విచిచ్ఛిదే హరిరిషుభిః సహస్రధా|*

*తమాహనన్నృప కులిశేన కంధరే రుషాన్వితస్త్రిదశపతిః శిరో హరన్॥6648॥*

ఆ శూలము మిక్కిలి వేగముగా వచ్చుచుండుటను ఇంద్రుడు గమనించెను. అప్పుడు అతడు దానిని ఆకాశమునందు ఉండగనే వేయి ముక్కలు గావించెను. అనంతరము ఇంద్రుడు క్రుద్ధుడై, వజ్రాయుధముతో అసురుని శిరస్సును ఖండించుటకై అతని కంఠముపై కొట్టెను.

*11.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*న తస్య హి త్వచమపి వజ్ర ఊర్జితో బిభేద యః సురపతినౌజసేరితః|*

*తదద్భుతం పరమతివీర్యవృత్రభిత్తిరస్కృతో నముచిశిరోధరత్వచా॥6649॥*

ఇంద్రుడు బలముగా నముచిపై తన వజ్రాయుధమును ప్రయోగించెను. కాని శక్తిమంతమైన ఆ వజ్రాయుధము ఆ అసురుని చర్మమును గూడ భేదింపలేకపోయెను. మహాబలవంతుడైన వృత్రాసురుని శరీరమును ముక్కలుగ జేసిన వజ్రాయుధము నముచి యొక్క కంఠమునందలి చర్మమును భేదింపలేక పోవుట మిగుల ఆశ్చర్యకరము అయ్యెను.

*11.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*తస్మాదింద్రోఽబిభేచ్ఛత్రోర్వజ్రః ప్రతిహతో యతః|*

*కిమిదం దైవయోగేన భూతం లోకవిమోహనమ్॥6650॥*

వజ్రాయుధము నముచిని ఏమియు చేయలేక పోవుటచే ఇంద్రుడు కలవరపడి ఇట్లు అనుకొనసాగెను- "జగత్తును అంతయును మోహములో పడవేయునట్టి ఈ సంఘటన ఎట్లు జరిగినది. ఇది దైవయోగము తప్ప మరేమియును గాదు.

*11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*యేన మే పూర్వమద్రీణాం పక్షచ్ఛేదః ప్రజాత్యయే|*

*కృతో నివిశతాం భారైః పతత్త్రైః పతతాం భువి॥6651॥*

పూర్వము పర్వతములు రెక్కలు గలిగి యుండెను. అవి ఆకాశమున తిరుగుచు బరువు కారణముగా భూమిపై పడుచుండెను. పర్వతములు భూమిపై పడుచుండుటవలన ప్రజలు నశించుచుండిరి. దానిని జూచి, ప్రజారక్షణకై వజ్రాయుధముచే పర్వతముల రెక్కలను నేను ఖండించితిని.

*11.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తపఃసారమయం త్వాష్ట్రం వృత్రో యేన విపాటితః|*

*అన్యే చాపి బలోపేతాః సర్వాస్త్రైరక్షతత్వచః॥6652॥*

*11.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*సోఽయం ప్రతిహతో వజ్రో మయా ముక్తోఽసురేఽల్పకే|*

*నాహం తదాదదే దండం బ్రహ్మతేజోఽప్యకారణమ్॥6653॥*

త్వష్ట అనువాడు తన తపఃప్రభావమున వృత్రాసుర రూపములో ప్రకటితుడాయెను. అతనిని గూడ నేను ఈ వజ్రాయుధముతోనే ఖండించితిని. ఇంకను మహాబలశాలులు. ఏ అస్త్రశస్త్రములకు లొంగని జంభాసురుడు, బలాసురుడు మొదలగు రాక్షసులను ఈ వజ్రాయుధము తోనే హతమార్చితిని. అట్టి అప్రతిహతమైన ఈ వజ్రాయుధము నేను తుచ్ఛుడైన ఈ అల్పునిపై ప్రయోగించితిని. కాని, అది ఇతనిని ఏమియు చేయలేకపోయెను. బ్రహ్మతేజస్సుచే నిర్మితమైన ఈ వజ్రాయుధము శక్తిహీనము అగుటకు గల కారణము నాకు బోధపడుట లేదు.

*11.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ఇతి శక్రం విషీదంతమాహ వాగశరీరిణీ|*

*నాయం శుష్కైరథో నార్ద్రైర్వధమర్హతి దానవః॥6654॥*

*11.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*మయాస్మై యద్వరో దత్తో మృత్యుర్నైవార్ద్రశుష్కయోః|*

*అతోఽన్యశ్చింతనీయస్తే ఉపాయో మఘవన్ రిపోః॥6655॥*

ఇట్లు అనుకొనుచు ఇంద్రుడు మనస్తాపము చెందెను. అప్పుడు ఆకాశవాణి ఇట్లు పలికెను_ "ఇంద్రా! ఈ దానవుడు ఎండు వస్తువులతోగాని, తడివస్తువులతోగాని మరణింపడు. 'ఎండిన లేక తడిసిన వస్తువులతో నీకు మృత్యువు సంభవింపదు' అని నేను ఇతనికి వరమిచ్చితిని. కనుక, ఈ శత్రువును సంహరించుటకు నీవు మరియొక ఉపాయమును ఆలోచింపుము"

*11.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*తాం దైవీం గిరమాకర్ణ్య మఘవాన్ సుసమాహితః|*

*ధ్యాయన్ ఫేనమథాపశ్యదుపాయముభయాత్మకమ్॥6656॥*

ఆకాశవాణి పలుకులను విని దేవరాజైన ఇంద్రుడు ఏకాగ్రచిత్తముతో ఇట్లు ఆలోచింపదొడంగెను.. అప్పుడు సముద్రపునురుగు  ఎండినదికాదు, తడిసినదికాదు అని అతనికి తోచెను.

*11.40 (నలుబదియవ శ్లోకము)*

*న శుష్కేణ న చార్ద్రేణ జహార నముచేః శిరః|*

*తం తుష్టువుర్మునిగణా మాల్యైశ్చావాకిరన్ విభుమ్॥4657॥*

కనుక, అతడు తడిగాని, పొడిగాని కానట్టి సముద్రపు నురుగులతో నముచి యొక్క శిరస్సును ఖండించెను. అప్పుడు మహర్షులు, మునులు ఇంద్రునిపై పుష్పములను  వర్షించి, ఆయనను ప్రస్తుతించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
**********************

*పెద్దలు చెప్పిన మంచి మాటలు*

1) పూజ్యులు పెద్దలైన ఇద్దరి మధ్య నుంచి నడిచి వెళ్ళకూడదు .
2) ఒక నదిలో స్నానం చేస్తూ ఇంకో నదిని స్మరించకూడదు .
3) షష్టి , అష్టమి , చతుర్దశి తిధులయందు తైలాభ్యంగ స్నానం చేయరాదు .
4) బహిష్టు అయిన  5 వ రోజు నుంచి స్త్రీలు, దేవత శుభకార్యాలలో పాల్గొనవచ్చు .
5) దీర్ఘకాలిక వ్రతాలు చేసే స్త్రీలకు మధ్యలో వచ్చే అంటు ,ముట్టు  వలన వారు వ్రతభంగము అయింది  అని బాధపడుతుంటారు . అది వ్రతభంగము ఏమి కాదు . వారు 5 లేక 7 వ రోజు నుంచి యధావిధిగా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు .
6)ఇల్లు కట్టుకునే ముందు ఆ స్థలాన్ని నాగలితో దున్నించి ఒక ఆవు దూడను మూడు రోజులు కట్టివేయుట వలన స్ధలసంబంధిత దోషాలు ఏమైనా ఉంటె అవి తొలగిపోతాయి .
7) మొక్క / చెట్టు మీద నుంచి  రాలిన, నలిగిన  పూవులు  శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించరాదు . పూజకు పూవులు లేని సమయంలో
వాటి స్థానంలో అక్షింతలు వాడుకోవచ్చు .
8) దేవతలను తృప్తి పరుచుటకన్నా పితృదేవతలను( కాలం చేసిన పెద్దలును ) తృప్తి పరచుట ముఖ్యం . అందువలన వంశాభివృద్ధి జరుగును .
9)ప్రతి రోజు మొదటి అన్నం ముద్ద తినేముందు ఓం హ్రీం గౌరీయై నమః  అని కానీ ఓం అన్నపూర్ణా దేవియై నమః అని ఒక 5 సార్లు స్మరించుకొని భోజనం ప్రారంభిస్తే ఆ భోజనం ఔషధము లాగ పని చేస్తుంది, ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా దొరుకుతుంది , మరియు పండించిన రైతుకి కూడా ఎంతో  మేలు జరుగుతుంది 
10)  శత్రునాశనం కొరకు ఎన్నో క్షుద్రపూజలు చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు . అంటువంటి వారికి ఒక చిన్న చిట్కా . ఒక చిన్న శివలింగానికిప్రతి రోజు ఆవాలు నూనెతో అభిషేకం చేస్తే (  ఎంత చిన్న శివలింగమైతే అంత మంచిది .) శత్రుబాధలనుంచి విముక్తి పొందవచ్చు. 
11) తల్లిపాదాలకు ఒక్క సారి నమస్కారం , తండ్రి పాదాలకు 2 సార్లు , గురువు పాదాలకు 3 సార్లు , భగవంతునికి 4 సార్లు , అమ్మవారికి
( శక్తి దేవతలకు) 5 సార్లు నమస్కారం చేయాలి .
12)భగవంతునికి , మగవారు అయితే  సాష్టాంగ నమస్కారం , ఆడవారు అయితే పంచమ నమస్కారం చేయుట  శ్రేష్టం .
13) స్త్రీలు మంగళసూత్రానికి తోడుగా పిన్నీసులు వంటివి పెడుతుంటారు . అది శాస్త్ర, విరుద్ధం . ఆలా చేయటం వలన భార్య, భర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు .
14) భగవంతుని నైవేద్యానికి బెల్లము ముక్క ఇక పటిక బెల్లం ఉపయోగించాలి . పంచదార నివేదన చేయరాదు . ఒకవేళ పండ్లు నివేదన చేస్తే తొక్క తీసి పెట్టాలి .
15) సూర్యునికి, చంద్రునికి ఎదురుగా ఎప్పుడు కూడా మల మూత్ర విసర్జన చేయరాదు, అలాగే ఉదయాన్నే బయట సూర్యునికి ఎదురుగా
 నుంచుని  పండ్లు తోముకుంటూ ఉంటారు . ఆలా ఎప్పుడు చేయరాదు .
16) ఓం శ్రీ శా  నమో నమః -  ఈ మంత్రాన్ని  సర్వకార్యయసిద్ధి మంత్రం అంటారు . సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని శక్తీ కొలది స్మరించుకోండి . మీరు చేయబోయే కార్యము నిర్విఘ్నం గా జరుగుతుంది .
**********************

*మీ శరీర భాగాన్ని జాగ్రత్తగా చూసుకోండి ....*



1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు *పొట్ట* గాయపడుతుంది.

2. మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు  *కిడ్నీలు*  గాయపడతాయి.

3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా  *గాల్ బ్లాడర్* గాయపడుతుంది.

4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు *చిన్న ప్రేగు* గాయపడుతుంది.

5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు  *పెద్ద ప్రేగులు* గాయపడతాయి.

6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు
*లంగ్స్* గాయపడతాయి.

7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు *లివర్* గాయపడుతుంది.

8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో మీ భోజనం తిన్నప్పుడు *గుండె* గాయపడుతుంది.

9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు *ప్యాంక్రియాస్* గాయపడుతుంది ఎందుకంటే అవి రుచికరమైనవి మరియు ఉచితంగా లభిస్తాయి.

10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు *కళ్ళు* గాయపడతాయి.

11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు *మెదడు* గాయపడుతుంది.

*ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు. కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.*

ధన్యవాదములు

పుట్టినరోజు అంటే ఏమిటి?

పుట్టినరోజు అంటే ఏమిటి? తల్లిదండ్రులు కు లేకలేక పుడతారు పిల్లలు, కొంతమంది పిల్లలు కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు. మన పెద్దలు ఒక సామెత చెప్పారు. అది ఏమిటంటే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని, ఇక్కడ మనము దానం కొద్ది బిడ్డలు అన్నారు కదా! మరి పిల్లలు పుట్టిన తర్వాత వారి పుట్టిన రోజులు మనము ఎలా జరుపుతున్నాము. మన పుట్టిన రోజులు ఎలా జరుపుకుంటున్నాము. అనే విషయం ఆలోచించితే, మన భారత దేశాన్ని పరిపాలించిన ఇంగ్లీషు వారి సంస్కృతి ని వదల లేక పోతున్నాము. ఎందుకంటే వాళ్ళు క్రొవ్వొత్తి లు పెట్టి దీపాలు అర్పుతారు పుట్టిన రోజులు కు, వాళ్ల ది దీపాలు ఆర్పే సంస్కృతి. మనది దీపాలు వెలిగించే సంస్కృతి. కొడుకు గానీ కూతురు గానీ పుడితే ఆ తల్లిదండ్రుల ఆనందము వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ల ముఖములో ఎంతో ఆనందము కనబడుతుంది. మరి పిల్లాడు పుట్టిన తర్వాత మనము కేక్ కట్ చేస్తున్నామా! లేదే? 11వరోజున గానీ 21వరోజున గానీ మనము పిల్ల వానికి చక్కగా సున్నిపిండి తో నలిచి కుంకుడుకాయ గానీ షీకాయ గానీ వాటితో తల అంటుతున్నాము, బ్రాహ్మణులుని పిలిచి వానికి నామకరణం చేస్తున్నాము. ఆ విధంగా ప్రతీ పుట్టిన రోజు ఎందుకు అలా చెయ్యరూ!వాళ్ల కు మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించండి చిన్న తనము లోనే, ఒరేయ్ మనము హిందువులుము రా మనం ఆంగ్లేయులము కాదు. కేక్ ల సంస్కృతి వాళ్ల ది. చక్కగా మనము పుట్టిన రోజు నాడు తలంటు కొని క్రొత్త బట్టలు కట్టుకొని,, కన్న తల్లిదండ్రులు దగ్గర ఇంట్లో ఉన్న తాతనానమ్మ ల దగ్గర ఆశీర్వచనము తీసుకుని, ఏదైనా దేవాలయము నకు వెళ్లి ఆ దేవుని దగ్గర తన పేరు మీద గోత్ర నామములు తో పూజ చేయించుకొని ఆశీర్వచనము తీసుకుని, ఇంటికి వచ్చి పాయసము త్రాగాలి రా! అని మనము చిన్న తనము నుంచి మార్పుతీసుకొని వస్తే వాడు పదిమందిని మారుస్తాడు. కాబట్టి తల్లిదండ్రులారా! మీరు మారండి మీ పిల్లలు ను మార్చండి. అప్పుడే మన సంస్కృతి బాగుంటుంది.

*********************

పెళ్ళి సందడి.

పంకజం పదనిసలు 17


   అయ్యవార్లంగారు ఏం చేస్తున్నారూ ..అంటే ...చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు. అని సామెత. అలాగే ఉంది ప్రస్తుతం అందరి పరిస్థితి.

     కూరలు కడగటం, పళ్ళు కడగటం , పూలుకడగటం, పనిమనిషిరాక అంట్లు కడగటం, చేతులేమో పదే పదే కడగటం.

      ఈ కడగటాలతో  విసుగెత్తి ఇంట్లో పలకరించినవాళ్ళనికూడా విసుగుతో కడిగిపారెయ్యటం.

     ఈ విధం  గా కడుగుళ్ళతో కడగండ్లు పడుతూ జీవుతాన్ని కడవరకూ గడపాల్సొచ్చేలా ఉంది.

      మొదటగా  రెణ్ణెల్లు అన్నారు.  ఆనక ఆర్నెల్లన్నారు. ఇప్పడేమో సహజీవనమంటున్నారు.

     ఈ విధంగా చుట్టమైవచ్చి దయ్యమై పట్టుకున్న  కోవిడ్ ని కడతేర్చే ఉపాయాలు ఆలోచిస్తుంటే అదేమో,  మీవూరుకొచ్చా ...మీ వీధికొచ్చా ...మీ పక్కింటికొచ్చా ..అని భయపెడుతోంది.

    శానిటైజరంటే అపర సంజీవినిలా అనిపిస్తోంది. మాస్కుకీ ,మందిరానికీ గొడవలుపోయి మాస్కే మన జీవితమైపోయింది.

      ఈవిధంగా నానా రగడగానూ గడబిడగానూ తయారైపోయిన జీవితాన్ని నెట్టుకురాలేక కొట్టుకు ఛస్తుంటే ...

       తిప్పుకుంటూ వచ్చింది పంకజం , "ఏంటిసంగతులూ ..."అనుకుంటూ. "ఏముందీ ...నిన్నమిగిలిన దోసెపిండీ, మొన్నమిగిలిన ఇడ్లీపిండీ కలిపి ,రాత్రిమిగిలిన ఉప్మా ఉండలు ముంచి బోండాలేస్తున్నా "అన్నాను చిరాగ్గా.

     కాస్త అయోమయం గా మొహం పెట్టి " తింటానికేనా ???"అనడిగింది. "మరేం  చెయ్యమంటావు చెప్పూ ... ఇవ్వడానికి పనిమనిషిలేదు. కంటైన్మెంట్ జోనని మున్సిపాలిటీ చెత్తవాళ్ళు కూడా రోజుమార్చి రోజు వస్తున్నారు " అన్నాను.

     "అందుకని చెత్తలో వెయ్యాల్సినవన్నీ పొట్టలో వేస్తే ...ఇంకేమన్నాఉందా ..."అంది. "ఏంచెయ్యమంటావ్ చెప్పు ...కాలేకడుపుకు మండే గంజి అనీ ...బతకాలి గాబట్టి బతికేస్తున్నాం తినాలి గాబట్టి తినేస్తున్నాం ఏదోవొకటి"  అన్నాను విరక్తిగా ...

     "ఇంకలాభం లేదు ...పీకల్లోతు డిప్రెషన్లో పడిపోయావ్. దీన్లోనించి బైటికిరావాలంటే అర్జెంటుగా అద్భుతమేదో జరగాల్సిందే"  అంది పంకజం.

    "అద్భుతమా ...! అసలు అలాంటిది ఈ జీవితంలో జరుగుందంటావా ...కరోనా పోతుందన్నది ఎంతనిజమో అద్భుతాలేవో జరుగుతాయన్నది అంతనిజం ..."అన్నాను. దువ్వుకోటానికి కూడా తీరికా, ఆసక్తీ లేక మూడురోజులనుండీ ముడిపెట్టుకుని   తిరుగుతున్న జుట్టుని సవరించుకుంటూ.

    "కళ్యాణానికి రావే కాంతమ్మా అంటే ...కోవిడమ్మా కుదరదు"  అంటావేం. మంచిరోజులు రాకపోవా ...మనుషులంతా కలిసిపోరా ..."అని పంకజం ఏదో చెబుతుండగానే సెల్లు మోగింది.

    "చూసావా శుభం. గంటమోగింది ఏదో శుభవార్తేమో చూడు " అంది పంకజం.
   "అసలు సెల్లు తీయాలంటే గుండెలు ఝల్లు మంటున్నాయి ఏమి వార్త వినాల్సొస్తుందో అని ..."అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.

    మా చెల్లి ...అంటే నాకు పినపిన్నికూతురు.  ఊళ్ళో ఉంటున్నా నాలుగు నెల్లుగా రాకపోకలు లేవు. శ్రావణ మాసం నోములకూ కూడా ఒకరికొకరం ఈసారి పిల్చుకోలేదు. మొన్న దాని కూతురి ఏంగేజుమెంటుకు కూడా పదిమందికే పర్మిషన్ అని , ఫంక్షన్ అయిపోయాక ఫొటోలు షేర్ చేసింది. ఇంకో నాల్రోజుల్లో పిల్లపెళ్ళి. అసలే బిజీ డాక్టర్ మా మరిదిగారు. ఈ కరోనా టైం లో ఎలా పెళ్ళి చేస్తాడో అనుకుంటుంటే , ఇప్పుడీ  ఫోనూ ..

    సందేహంగా ఫోన్ తీసాను.  అటుపక్కనుంచి "హాల్లో అక్కయ్య " అంది అది హుషారుగా ..."ఏంటే సంగతులూ కొంపదీసి పెళ్ళికి పిలుస్తున్నావాయేం ..."అన్నాను. అది నిజంగానే  "అవును అక్కయ్యా ..పెళ్ళికే పిలుస్తున్నా అమ్మాయి పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అంది !!!!"

     నేను బోలెడు ఆశ్చర్యంతో నోరుతెరిచి "హౌ ! ఎలా ! నన్ను రమ్మంటున్నావా ..యే ..."అని  వసంతకోకిలలో కమలహాసన్లా ...తెరపట్టనంత ఎమోషన్ గుమ్మరించేసా.

  "ఏంలేదు అక్కయ్యా  మా పెద్దాడబడుచు  ముంబాయ్ నుండి రావలసింది. వాళ్ళ అత్తగారికి కరోనా ...వీళ్ళు క్వారంటైన్ అందుకే రావటం లేదు. ఆప్లేస్ లో నువ్వు రావొచ్చుకదా అందుకే ఫోన్ చేసా "అంది.

    " ఒకే ...ఒకే రాత్రికి పెళ్ళికదా ...బావగారూ నేనూ స్నాతకానికి మధ్యాహ్నం నుండే అక్కడుంటాం నువ్వేం కంగారుపడకు "అని మామూలుగా మాట్లాడుతున్నా ...అది వెంటనే "సారీ అక్కయ్యా మధ్యాన్నం కుదరదు ఈయన హాస్పటలో డాక్టర్లలో    ముఖ్యమైన   ఒక పదిమందికి భోజనాలు. రాత్రికి వచ్చెయ్యి నువ్వు మాత్రమే ...బావగారు కూడావస్తే సంఖ్య పెరుగుతుంది. పెళ్ళివారొక ముప్ఫై మంది. మనవైపు ఇరవై మంది మాత్రమే రావాలి. మొత్తం యాభై మందికే పర్మిషన్  నీకు కుదరకపోతే చెప్పు ఇంకొకరిని పిలుస్తా " అని నిర్మొహమాటం గా చెప్పి ఫోన్ పెట్టేసింది.

     ఒక్కసారి పాలపొంగుమీద నీళ్ళు చిలకరించినట్లైంది. తనురాకుండా నేనొక్కదాన్నేనా ...ఎలా అనుకున్నాను. ఈయన మాత్రం "దాందేవుందోయ్ ...హ్యప్పీగా వెళ్ళిరా ..మండపం దాకా దించొస్తా. రిటన్ అయ్యేటప్పుడు ఫోన్ చెయ్యి మళ్ళీ వచ్చేస్తా " అని క్రిష్ణపరమాత్మలా అభయమిచ్చేశారు.

     ఇంకేం దాదాపు నాలుగైదు నెలలతరువాత వెళ్ళబోయే ఫంక్షన్ !అదేవిటో కంగారుగానూ ...విపరీతమైన ఉత్సాహంతోనూ కాళ్ళూ చేతులూ  ఆడలేదు.

     ఇన్నాళ్ళూ అద్దంలోకూడా చూసుకోవటానికి ఉత్సాహపడని మొహాన్ని ఆనాల్రోజులూ పదే పదే తోమి మెరుగుపెట్టాను. మావార్ని బ్రతిమాలి లాకర్లో నగలు తెప్పంచుకున్నాను.

      ఆరోజు పంకజం సెలక్షన్ తో బంతిపువ్వురంగుకి రాణీ కలర్ పట్టుచీర కట్టుకుని , నగలు సింగారించి చివరిగా మొన్నచేయించుకున్న గోల్డ్ మాస్కు కూడా ధరించి కారెక్కి పెళ్ళికి బయలుదేరాను.

      మావారు నన్ను మండపం వాకిట్లో దించి వెళ్ళిపోయారు. అందంగా తెరలు వేసినగది ముందున్న అమ్మాయి "వెల్కం " అని సానిటైజరు జల్లిన గులాబీ చేతికిచ్చి లోపలికి ఆహ్వానం పలికింది. లోపలికి వెళ్ళగానే సెంటుకలిపిన సానిటైజర్ జల్లుకురిసింది. తడిసిన   చీరెతో  బిత్తరపోయి బైటపడి పెళ్ళి మండపం  లోకి  వెళ్ళాను.

    అది పెళ్ళి మండపం లాగా లేదు నాసా అంతరిక్ష కేంద్రం లా ఉంది. పూల మండపం కనపడింది కనుక పెళ్ళి మండపమేనన్న నమ్మకం కుదిరింది. అందరూ పీ. పీ యీ కిట్లతో హడావుడిగా తిరుగుతున్నారు. కొందరేమో బహుశా మగపెళ్ళివారనుకుంటా అదేకిట్లతో శిలా విగ్రహాల్లా దూరదూరంగా వేసిన కుర్చీల్లో కూర్చున్నారు.

    ఇంతలో ఒక ఆకారం హడావుడిగా వచ్చి "రా అక్కయ్యా ...ఇదేనా రావటం"  అంది. నేను నోరుతెరిచేలోపు ఒక కవర్ నా చేతికిచ్చి , "త్వరగా వేసుకుని రా "అని హడావిడి పెట్టింది. గదిలోకి వెళ్ళి చూస్తే ...నాకూ ఒక కిట్ ఇచ్చారు వేసుకోవడానికి ...ఆలోచిస్తూ నిలబడితే మళ్ళీవొచ్చి "కానీ కానీ "అని తొందరపెట్టింది.

   నా పచ్చ పట్టుచీరా నగలూ ఒక్కసారి నన్నుచూచి నవ్వినట్లు అనిపించి బాధేసింది సరే !ఏంచేస్తాం  అనుకుంటూ వాటిని కప్పెట్టి కిట్టేసుకుని బయట కొచ్చాను. అప్పట్నించీ మొదలయ్యింది  అసలు గొడవ.

     ఎవరు  ఎవరో అసలు ఆడోమొగో అర్ధమై చావటం లేదు. కాస్త పొట్టిగా లావుగా ఒక ఆకారం కనబడితే మా చెల్లేమో అనుకుని "ఏవిటే ఫొటోల్లో చూసా పిల్లాడు మరీ నలుపూ ...ఇంతలో పిల్లకేం  వయసైందని కాస్త ఈడూ జోడూ చూడొద్దూ " అన్నాను.

    ఆ మనిషి ముసుగు కాస్త తొలగించి "నేను పిల్లవాడి తల్లిని ఇంతకూ మీరెవరు "అని గట్టిగా గద్దించింది. దెబ్బకు ముసుగు మూసేసి పక్కకు పారిపోయాను. "ఇదుగో మిమ్మల్నే " అని వెనకనుండి పిలుస్తున్నా వినిపించుకోకుండా.

    కాసేపటికి నాభుజం మ్మీద చేయిపడింది "ఏమేవ్ మీ అన్నయ్య కొడుకు పెళ్ళిలో  గోల చెయ్యాలి,  గొడవ పెట్టాలి అన్నావు గా ...ఎక్కణ్ణించి మొదలెడదాం. భోజనాలు బాగులేవనా ...మర్యాదలు చాల్లేదనా"  అంది ఒక మగ కంఠం ఠక్కున ముసుగుతీసి సీరియస్ గా చూసేసరికి " సారీ మా ఆవిడనుకునీ ...."ఖంగారుగా అంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను .

    అప్పటికి అర్ధమైంది నాకు అందరూ ఎందుకని అలా శిలావిగ్రహాల్లా కూచున్నారో ..నేనూ ఒక కుర్చీ చూసుకుని మెదలకుండా కూర్చున్నాను. పంకజం నా పక్కనే సెటిలయ్యింది.

     ఒక ఆకారం నా పక్కనొచ్చి కూచొని "చూసావా వొదినా దీని గొప్ప ...పెళ్ళికొడుక్కీ ,తల్లికీ, చెల్లికీ విడిదింట్లో వెండి శానిటైజరు బాటిల్స్ పెట్టించిందట.డాక్టరు కదూ  కరోనా కాలంలో కావలసినంత సంపాయిచ్చాడ్లే ...వెండివేం ఖర్మ బంగారపవైనా పెడతాడు. ప్రైవేటు క్వారంటైను సెంటర్ పెట్టారట తెలుసానీకూ ..." ముసుగుతియ్యటానిక్కూడా భయపడి నోరు మూసుక్కూచున్నాను.

    పెళ్ళి పీటల మీద ఉన్నారు కనుక పెళ్ళి కూతురూ  పెళ్ళి కొడుకుని గుర్తుపట్టాను. వాళ్ళకి కొంచెం పక్కగా బ్రహ్మగారు కుర్చున్నారు. పండపమంతా సెంట్లూ శానిటైజర్లూ కలిసిన వింత వాసన.

     గణపతి పూజ కంటే  ముందు "అపవిత్ర పవిత్రోవా "అంటూ చేతిలో శానిటైజర్ వేసి పెళ్ళి తంతు  మొదలెట్టేడు బ్రహ్మగారు. డెట్టాల్ కలిపిన నీళ్ళతో కాళ్ళు కడిగాడు మా మరిదిగారు అసలే డాక్టరు కదా ఇంకొంచెం జాగ్రత్త తీసుకొంటున్నాడు.

     మద్య మధ్యలో చేతిలో సానిటైజరు చల్లి తాగటానికి వేన్నిళ్ళూ, కాసిని డ్రై ఫ్రూట్స్  ఉన్న పాకెట్లూ అందిచ్చారు. తాగాలనుకున్నవారికి కాఫీ టీలతో పాటు పసుపువెసిన పాలు కూడా అందించారు.

     ఆవిధంగా  సానిటైజ్ చేసిన తాళిబొట్లూ , తలంబ్రాలతో పెళ్ళి తంతు ముగిసింది. పట్టు చీరెల గలగలలూ, అయినవాళ్ళ హాస్యోక్తులూ, సరదాల బంతిభోజనాలూ లేకుండా ఏదో చూసాం , తిన్నాం అంతే ...ఆ భోజనం తినడానికి కూడా భయమే ...

    ఈయనకు ఫోన్ చేసి మండపం బయటికి వచ్చాను. వెళ్ళొస్తానని కూడా చెల్లికి  చెప్పలేదు.కట్టుకున్న పట్టుచీర , పెట్టుకున్న నగలూ చిరాగ్గ అనిపిస్తున్నాయి.  మావారు కారాపి ఎదురుచూస్తున్నారు. ఈ గ్రహాంతరవాసి అవతారంలో గుర్తుపట్టలేదనుకుంటా

     కారుదగ్గరికి వెళ్ళి "ఏమండీ" అన్నా ...అనుమానం గా చూస్తుంటే ముసుగు తీసా. నవ్వేసి తలుపు తీసారు. పంకజం వెనక సీటులో సెటిలైంది.

    "పెళ్ళి బాగా జరిగిందా ..."అన్నారు  అలవాటుగా. "అది మాత్రం  అడక్కండి కరోనాలో పెళ్ళి కెళ్ళటం కంటే క్వారంటైను సెంటరు కెళ్ళటం మేలు " అన్నాను  విసుగ్గా. వెనక సీట్లో పంకజం మాత్రం నా స్థితిచూసి చెంగు అడ్డం పెట్టుకుని కిసుక్కుమని నవ్వుతూనే ఉంది.
పద్మజ కుందుర్తి.
*********************

SAFE - DRIVING TIPS WHEN IT IS RAINING 🌧

How to achieve good vision while driving during a heavy downpour. We are not sure why it is so effective; Just try this method when it rains heavily. This method was told by a Police personnel who had experienced and confirmed it.

It is useful...even when driving at night.

Most of the motorists would turn the wind shield wipers on 'HIGH' or on the  'FASTEST SPEED' mode during heavy downpour, yet the visibility in front of the windshield is still bad..
In the event you face such a situation, just put on your 'SUNGLASSES'  and miracles!

All of a sudden, your visibility in front of your windshield is perfectly clear, as if there is no rain.

Make sure you always have a pair of SUNGLASSES in your car. You are not only helping yourself to drive safely with good vision, but also might save your friend's life by giving him this idea.Try it yourself and share it with your friends...!!!Amazingly, you'll still see the drops on the windshield, but not the sheet of rain falling.You'll also see where the rain bounces off the road. Wearing sunglasses works to eliminate the "blindness" from passing cars. Or the "kickup" if you are following a car in the rain. They ought to teach this little tip in driver's training. It really does work. This is a good warning.

I wonder how many people knew about this???

Another good tip:
A 36 year old female had an accident several weeks ago. It was raining,though not excessively when her car suddenly began to hydro-plane and literally flew through the air. She was not seriously injured but very stunned at the sudden occurrence!

When she explained to the PoliceOfficer what had happened, he told her something that every driver should know -
NEVER - EVER 'DRIVE' IN THE RAIN WITH YOUR CRUISE CONTROL ON.'
She however, thought she was being cautious by setting the cruise control and maintaining a safe consistent speed in the rain. But the Police Officer told her that if the cruise control is on, your car will in fact begin to hydro-plane. When the tires lose contact with the road,your car will automatically accelerate to a higher rate of speed, making you take off like an aeroplane.

She told the Officer that was exactly what had occurred.

The Officer said; 'This warning should be listed, on the driver's seat sun-visor -

'NEVER USE THE CRUISE CONTROL WHEN THE ROAD IS WET OR ICY'

Along with the airbag warning. 'We tell our teenagers to set the cruise control and drive a safe speed - but; 'We don't tell them to use the cruise control only when the road is dry.

The only person the accident victim found who knew this, (besides the Officer), was a man who'd had a similar accident, totalled his car and sustained severe injuries.

NOTE:

Some vehicles (like the Toyota Sienna Limited XLE) will not allow you to set the cruise control when your windshield wipers are on.

Even if you send this to 15 people and only one of them doesn't know about it, it's still worth it.'You may have saved a life.'
*******************

ద్రౌపది - సత్యభామకు హితవు

ద్రౌపది తన భర్తల ప్రసన్నతకోసం ఎలా ప్రవర్తించేదో సత్యభామ కు వివరిస్తూ ఇలా అంది. సోదరీ! నేను అహంకారాన్ని కామక్రోధాదులు అయిన అవలక్షణాలను విసర్జించి బహు జాగ్రత్త తో పాండవులందరినీ        సేవిస్తూ ఉంటాను.
నేను మానసికంగా ఈర్ష్యకు, అసూయకు దూరంగా ఉంటాను. 
నా మనస్సు ను ని గ్రహించుకొని కేవలము సేవాభావం తో నా పతుల మనస్సు ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటాను. 🍁నేను ఎన్నడూ ఎవరితోనూ కటువుగా మాటలాడను. 🍁అసభ్యంగా నిలువను. 🍁పాపపు మాటలు పలుకను. 🍁కూడని తావులలో కూర్చోను. 🍁దురాచారకలుషిత వాతావరణం లో అడుగు కూడా పెట్టను. 🍁పతుల యొక్క సాభిప్రాయములైన సంకేతాలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉంటాను. 🍁దేవతలు కాని, మానవులు కాని, గంధర్వులు కాని, యువకులు కాని, ధనికులు కాని, ఎంతటి సౌందర్యనిధులైన కాని నా మనస్సు ఎన్నడూ పాండవులనుండి వీడి అన్యులు ఎవ్వరిమీదకును పోదు. 🍁నా పతులు భుజింపక ముందు నేను ఎన్నడూ భుజించను. వారు స్నానం చేయకముందు స్నానం చేయను. వారు కూర్చుండక ముందు కూర్చుండను. వారు బయటకు పోయి మరలి వచ్చిన వేళ నేను నిలిచియుండి వారికి ఆసనమును, శుద్ధ జలమును అందింతును. 🍁నేను నిలిచి యుండి వారికి ఆసనమును, శుద్ద జలమును అందింతును. నేను ఇంటిలోని పాత్రలను స్వయంగా తోమి పరిశుభ్రంగా ఉంచుకొంటాను. 🍁మధురంగా ఉండే విధంగా వంట చేస్తాను. 🍁నిర్ణీతసమయానికి వారికి భోజనం పెడతాను. 🍁ఎళ్ళవేలలా ఎల్లవిషయాలలో జాగ్రత్తగా ఉంటాను. 🍁ఇంటిని చక్కగా తుడిచి పరిశుభ్రంగా ఉంచుతాను. 🍁మాటల సందర్భంలో నేను ఎవ్వరినీ తిరస్కరించను. కులటలైన స్త్రీలు చెంతకు చేరను. 🍁ఎన్నడూ ఆలసత్వం వహించను. 🍁అను క్చణమూ పతులకు అనుకూల వర్తినై చరిస్తాను. 🍁మాటిమాటికి నేను ద్వారం చెంతకు పోయి నిలువను. 🍁ఎళ్ళవేళలా సత్యమే పలుకుతాను. పతి సేవా పరాయణురాలనై ఉంటాను. 🍁నా భర్తలు బయటకు వెళ్లి న వేళ నేను చందనపుష్పాదికములైన అలంకారములను అన్నిటినీ వీడి నియమాలను వ్రతాలను పాటిస్తూ కాలం గడుపుతుంటాను. 🍁నా పతులు తిననట్టి, త్రాగనట్టి, సేవించనట్టి పదార్థాలను నేను కూడా ముట్టను. స్త్రీలు విషయం లో శాస్త్రము చెప్పిన విషయాలను అన్నిటినీ పాటిస్తాను. 🍁సర్వకాలముల యందు అప్రమత్తంగా ఉండి పతిదేవులకు ప్రియం చేకూర్చడానికి ప్రతీక్షిస్తూ ఉంటాను.
      కుటుంబ సంబంధంగా మా అత్త నాకు తెలియజెప్పిన విధులనూ, ధర్మాలను అన్నిటినీ నిర్వర్తిస్తూ ఉంటాను. బిక్చను అర్పించడమూ, పూజావిధిని ఆచరించడమూ, శ్రాద్ధాదిపుణ్య తిథులందు పక్వాన్నములు తయారుచేయడం, పూజ్యనీయుల ను ఆచరించడమూ, ఇంకనూ నాకు విహితములైన ధర్మములు ఏవి కలవో వానిని అన్నిటినీ రేబవళ్ళు ఆచరిస్తూ ఉంటాను... ఇవి ద్రౌపది ఆచరించే ధర్మములు
. సేకరణ
*******************

పరవస్తు చిన్నయసూరి

తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైన పేరు పరవస్తు చిన్నయసూరి.వీరు 19 వ శతాబ్దానికి చెందిన మహా పండితుడు.పరవస్తు చిన్నయసూరి ప్రసిద్ధ తెలుగు రచయిత,గొప్ప పండితుడు. ఇతడు తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబూరులో జన్మించాడు. మద్రాసు ప్రభుత్వ (ప్రెసిడెన్సీ) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డారు."పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ"అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి,చిన్నయను పరీ‍క్ష చేయించి,  సమర్థుడని గుర్తించి,"చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.

సూరి అనగా పండితుడు అని అర్థం.చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించారు.వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు.వీరు సాతాని కులానికి చెందినా, బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి,గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు.చిన్నయ1809 (ప్రభవ)లో జన్మించారు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.చిన్నయసూరి గారి తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి.

వెంకటరంగ రామానుజాచార్యులు గారు సంస్కృత,ప్రాకృత,తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు.పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించారు. ఈయన 1836 లో నూటపదేళ్ళ వయసులో మరణించారు. వెంకటరంగ రామానుజాచార్యులుకు ఇరువురు సంతానము---బాల వితంతువైన ఒక కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ. చిన్నయను గారాబంగా పెంచటం వలన 16 ఏళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.శ్రీ చిన్నయ సూరిగారు సరళమైన భాషలో,సులభ గ్రాహ్యంగా ఉండేవిధంగా 'బాలవ్యాకరణం'ను వ్రాసారు. దీనిని, చిన్నప్పుడు మనలో ఎందరో చదువుకున్నారు. తెలుగు భాషను పరిశోధించి, 'ఆంద్ర శబ్ద చింతామణి' ని పరిశీలించి,వినూత్న రీతిలో వ్రాసినదే 'బాల వ్యాకరణం'.ఈ గ్రంధం తెలుగు వారికి ఒక వరప్రసాదం అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.గత తరంలో,దీనిని చదువనివారు తెలుగుగడ్డపై లేరని చెప్పవచ్చును. శ్రీ చిన్నయసూరి గారు మరెన్నోవిశిష్ఠ గ్రంధాలను తెలుగు వారికి అందించారు.వాటిలో ప్రఖ్యాతి గాంచినవి--నీతిచంద్రిక,సూత్రాంధ్ర వ్యాకరణం, ఆంధ్ర ధాతుమూల,నీతి సంగ్రహము...మొదలైనవి.

చిన్నయసూరి గారు, సంస్కృతంలోనున్న పంచతంత్ర కథలలోని, మిత్రలాభం, మిత్రబేధంలను తెలుగులోకి 'నీతిచంద్రిక' పేర అనువదించారు. అనువదించటమే కాకుండా, ఆ గ్రంధానికి చక్కని తెలుగు పేరైన 'నీతిచంద్రిక' అని పేరు పెట్టారు. నీతికథలను తెలుసుకునాలనుకునే వారికి అది నిజంగా ఒక పున్నమి వెన్నెల. తరువాతి రోజుల్లో, శ్రీ వీరేశలింగం గారు, 'సంధి'మరియు 'విగ్రహం'ను సంస్కృతం నుండి అనువదించారు. అలా సంస్కృతం నుండి, కేవలం నాలుగు తంత్రములే తెలుగులోకి అనువదించబడ్డాయి. అయిదవదైన, 'కాకోలుకేయం' అనే దాన్ని  తెలుగులోకి ఎవ్వరూ అనువదించినట్లుగా తెలియదు.నాకు తెలిసినంతవరకూ, అది తెలుగులోకి అనువదించ బడలేదు. చిన్నయసూరి గారి రచనాశైలి అత్యద్భుతంగా ఉంటుంది.ఆయనశైలిని అనుకరించి, అనుసరించాలని చాలామంది ప్రయత్నించి ఘోరంగా వైఫల్యం చెందారు. చిన్నయగారి సుమధురమైన వచనరచనాశైలి లాంటి దానిని నేటివరకూ మనం గమనించలేము. శ్రీ వీరేశలింగం గారు, శ్రీ కొక్కొండ వెంకటరత్నంగారు అదే శైలిలో విగ్రహము, సంధిని వ్రాయాలనుకున్నారు కానీ, అలా వీలుపడకలేకేమో వారి బాణిలోనే నూతన వరవడిలో వ్రాసారు. కానీ, చిన్నయసూరి గారి మిత్రలాభం, మిత్రబేధంకు ఉన్నంత ఆదరణను సంధి,విగ్రహంలు నోచుకోలేదని చెప్పవచ్చును. గత తరం వారందరూ మాధ్యమిక విద్యాస్థాయిలో నీతిచంద్రికను చదివి ఉంటారు. సందేహంలేదు. తెలుగు భాషమీద పట్టు, సాహిత్యం పట్ల అభిమానం పెంచుకోవాలనుకునే వారు తప్పక చదవవలసిసిన గ్రంధం 'నీతిచంద్రిక'.

'నీతి చంద్రక'ను తెలుగులోకి అనువదించటానికి, చిన్నయసూరి గారి ముఖ్య ఉద్దేశ్యం --తేనెలూరే తెలుగు భాషలో నీతి కథలను చెప్పటమే కాదు, చల్లని వెన్నెల ప్రసరించే తెలుగు భాషాకిరణాలను తెలుగు వారిపైన ప్రసరింప చేయటం కూడా! తమిళ దేశానికే చెందిన శ్రీ T.బాలనాగయ్య సెట్టిగారు వీరి 'నీతి చంద్రిక' ను ప్రచురించిన ధన్యజీవి. వారు ప్రచురించటం వల్లనే, మనకు 'నీతిచంద్రిక'ను చదువుకునే అదృష్టం దక్కింది. శ్రీ చిన్నయసూరి గారి జీవిత చరిత్రను సమగ్రంగా శ్రీ నిడదవోలు వెంకటరావుగారు రచించారు. పరవస్తు చిన్నయసూరిగారి ఐదవతరం మనవడు పరవస్తు ఫణిశయన సూరిగారు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. మధ్యతరాల్లో ఎవరికీ పద్య వాసనలు అంటలేదు. కానీ ఫణిశయన సూరిగారు చక్కగా పద్యాలను ఆలపిస్తూ పిల్లలకు శతక, ప్రబంధ, పౌరాణిక పద్యాలను నేర్పుతున్నారు. బాగా పాడుతున్న పిల్లలకు పద్యానికి పదిరూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఇందుకోసం వారు ఇప్పటికే తన సొంత డబ్బును సుమారు 5 లక్షల దాకా ఖర్చు చేసారు. వారు ఈ మధ్యనే 'పరవస్తు పద్యపీఠం' అనే సంస్థను ఆరంభించారు. తెలుగు భాషపై మరెంతో కృషి చేసిన శ్రీ చిన్నయసూరి గారు 1861 లో స్వర్గస్తులైనారు.ఆ మహనీయునికి, మనమందరమూ ఋణపడి ఉన్నాం! ఆ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుదాం !!
- టీవీయస్.శాస్త్రి 
*******************

పాత పద్యం క్రొత్త అర్ధం పరమార్ధం

ఓయమ్మ, నీకు, మారుడు,
మాయిండ్లను పాలు; పెరుగు; మన, నీడమ్మా,
పోయెద మెచ్చటి కైనను?
మాయన్నల, సురభు, లాన! మఞ్జులవాణీ!

పద విభాగంతో అర్థం ఎంతగా మారిందో ఒక పండితుడు  చెప్పాడు...(ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఉన్నది..)

ఆ కృష్ణ భక్తులకు భగవంతుని స్తుతించుటే గాని ఆయనను వదిలి ఎక్కడికి పోగలము? అంటున్నారు.

మారుడు అంటే మన్మధుడు. ఆ మహనీయుడు నీకు మన్మధుడు. విష్ణుమూర్తి కుమారుడే కదా మన్మధుడు! ఆత్మావై పుత్ర నామాసి అని కదా, అంత అందమైన మహావిష్ణువు నీకు మన్మధాకారంగా కనిపిస్తాడు కనుక మన్మధుడే. మాకు ఆయన మా ఇండ్లలో భాగం(పాలు). ఇండ్లు అంటే దేహాలు. ఆ పరమాత్మ మా దేహాలలో అంతర్యామి గా మా లోని భాగమే. ఆవిధంగా మా లోనే ఆయన పెరుగుచుండును.  అంటే భక్తి, ఏకత్వం పెరుగుతున్నది.
ఆయన మన, నీడయే నమ్మా!(మన,నీడమ్మా-- మననీడమ్మా). మన తోడునీడ అనే భావం.

ఆయనను వెతుక్కుంటూ ఎక్కడికైనా పోగలమా? భగవంతుడు మా అంతరాత్మ అయి మాలో భాగంగా ఉంటూ, మా లోనే పెరుగుతూ ఉంటే బాహ్యంగా భగవంతుని వెతుక్కుంటూ ఎక్కడికైనా  వెళ్ళగలమా?
ఈ మాటలు నిజం.  మా అన్నల మీద ఒట్టు, మా గోమాతల మీద ఒట్టు. అంటున్నారు.
మామూలు అర్థానికన్నా నిగూఢార్థమే సబబుగా ఉన్నట్లున్నది.
చూచే వాడి చూపును బట్టే ఉంటుంది ప్రతి వస్తువు.. ప్రతి శబ్దానికి భావం కూడా.. అని అనిపిస్తుంది...

నందనవనం కోటేశ్వరరావు.