14, ఆగస్టు 2020, శుక్రవారం

ద్రౌపది - సత్యభామకు హితవు

ద్రౌపది తన భర్తల ప్రసన్నతకోసం ఎలా ప్రవర్తించేదో సత్యభామ కు వివరిస్తూ ఇలా అంది. సోదరీ! నేను అహంకారాన్ని కామక్రోధాదులు అయిన అవలక్షణాలను విసర్జించి బహు జాగ్రత్త తో పాండవులందరినీ        సేవిస్తూ ఉంటాను.
నేను మానసికంగా ఈర్ష్యకు, అసూయకు దూరంగా ఉంటాను. 
నా మనస్సు ను ని గ్రహించుకొని కేవలము సేవాభావం తో నా పతుల మనస్సు ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటాను. 🍁నేను ఎన్నడూ ఎవరితోనూ కటువుగా మాటలాడను. 🍁అసభ్యంగా నిలువను. 🍁పాపపు మాటలు పలుకను. 🍁కూడని తావులలో కూర్చోను. 🍁దురాచారకలుషిత వాతావరణం లో అడుగు కూడా పెట్టను. 🍁పతుల యొక్క సాభిప్రాయములైన సంకేతాలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉంటాను. 🍁దేవతలు కాని, మానవులు కాని, గంధర్వులు కాని, యువకులు కాని, ధనికులు కాని, ఎంతటి సౌందర్యనిధులైన కాని నా మనస్సు ఎన్నడూ పాండవులనుండి వీడి అన్యులు ఎవ్వరిమీదకును పోదు. 🍁నా పతులు భుజింపక ముందు నేను ఎన్నడూ భుజించను. వారు స్నానం చేయకముందు స్నానం చేయను. వారు కూర్చుండక ముందు కూర్చుండను. వారు బయటకు పోయి మరలి వచ్చిన వేళ నేను నిలిచియుండి వారికి ఆసనమును, శుద్ధ జలమును అందింతును. 🍁నేను నిలిచి యుండి వారికి ఆసనమును, శుద్ద జలమును అందింతును. నేను ఇంటిలోని పాత్రలను స్వయంగా తోమి పరిశుభ్రంగా ఉంచుకొంటాను. 🍁మధురంగా ఉండే విధంగా వంట చేస్తాను. 🍁నిర్ణీతసమయానికి వారికి భోజనం పెడతాను. 🍁ఎళ్ళవేలలా ఎల్లవిషయాలలో జాగ్రత్తగా ఉంటాను. 🍁ఇంటిని చక్కగా తుడిచి పరిశుభ్రంగా ఉంచుతాను. 🍁మాటల సందర్భంలో నేను ఎవ్వరినీ తిరస్కరించను. కులటలైన స్త్రీలు చెంతకు చేరను. 🍁ఎన్నడూ ఆలసత్వం వహించను. 🍁అను క్చణమూ పతులకు అనుకూల వర్తినై చరిస్తాను. 🍁మాటిమాటికి నేను ద్వారం చెంతకు పోయి నిలువను. 🍁ఎళ్ళవేళలా సత్యమే పలుకుతాను. పతి సేవా పరాయణురాలనై ఉంటాను. 🍁నా భర్తలు బయటకు వెళ్లి న వేళ నేను చందనపుష్పాదికములైన అలంకారములను అన్నిటినీ వీడి నియమాలను వ్రతాలను పాటిస్తూ కాలం గడుపుతుంటాను. 🍁నా పతులు తిననట్టి, త్రాగనట్టి, సేవించనట్టి పదార్థాలను నేను కూడా ముట్టను. స్త్రీలు విషయం లో శాస్త్రము చెప్పిన విషయాలను అన్నిటినీ పాటిస్తాను. 🍁సర్వకాలముల యందు అప్రమత్తంగా ఉండి పతిదేవులకు ప్రియం చేకూర్చడానికి ప్రతీక్షిస్తూ ఉంటాను.
      కుటుంబ సంబంధంగా మా అత్త నాకు తెలియజెప్పిన విధులనూ, ధర్మాలను అన్నిటినీ నిర్వర్తిస్తూ ఉంటాను. బిక్చను అర్పించడమూ, పూజావిధిని ఆచరించడమూ, శ్రాద్ధాదిపుణ్య తిథులందు పక్వాన్నములు తయారుచేయడం, పూజ్యనీయుల ను ఆచరించడమూ, ఇంకనూ నాకు విహితములైన ధర్మములు ఏవి కలవో వానిని అన్నిటినీ రేబవళ్ళు ఆచరిస్తూ ఉంటాను... ఇవి ద్రౌపది ఆచరించే ధర్మములు
. సేకరణ
*******************

కామెంట్‌లు లేవు: