⚜️ సకల ఆచార వ్యవహారాల, జీవన విలువల సమ్మేళనమే సంస్కృతి. జాతి చారిత్రక పునాదులను, పాఠాలను నిత్యం మననం చేసుకొంటూ, వర్తమాన విజయాలను కైవసం చేసుకొంటూ, ఉన్నతమైన ఆశయాలతో, విలువలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొనడానికి సంస్కృతి సహకరిస్తుంది.
⚜️ జాతి మాట్లాడే భాషలోనూ, సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకము, చిత్రలేఖనము మొదలగు కళారూపాలలోను, కట్టూ, బొట్టూ, పలకరింపు, ఆదరణ వంటి సాంప్రదాయిక ఆచార వ్యవహారాల లోను సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
⚜️ తరతరాలుగా జాతి ప్రతిబింబిస్తున్న మానవతా విలువలను, జాతి యొక్క ప్రత్యేకమైన సంస్కృతి సున్నితమైన సీతాకోక చిలుక వంటిది, భవిష్యత్తులో స్వేఛ్చగా ఎగరాలంటే, శ్రమ, సహనం, పట్టుదలతో కూడిన పరివర్తన, కార్యాచరణ అవసరం.
⚜️ అరచేతులు మూసి గట్టిగా పట్టుకొంటే చితికిపోతుంది, తెర తీసి ఎగరనిస్తే భావి తరాల కోసం మరిన్ని అందాలను తనలో ఇముడ్చుకొంటుంది.
⚜️ వారసత్వం వంటి ఆలోచనలను, ఆశయాలను, ఆదర్శాలను, సంస్కృతి తనలో ప్రతిఫలిస్తుంది. సంస్కృతి సాగి పోయే నది వంటిది.
⚜️ ఇది స్వవాసంలోనైనా, ప్రవాసంలోనైనా పాత విషయాలను లోపల దాచుకొని, క్రొత్త విషయాలను తనలో కలుపుకొంటూ నిరంతరం సాగిపోయే ప్రవాహం, మారుతున్న కాలంతో మారే భిన్నరుచుల, అభిరుచుల, అభిప్రాయాల సమాహారం.
⚜️ కాలం కాగితంపై ఒక జాతి కలిసికట్టుగా చేసే సంతకం, ఒక తరం మరొక తరానికి అందించే జీవన సందేశం. ఉన్నతమైన విలువలలో పుట్టి, ఉదాత్తమైన సాగర సంగమానికి నిత్యం పరితపిస్తుంటుంది.
⚜️ సంస్కృతికి భాషే పునాది. చరిత్రను విస్మరించిన వానికి భవిష్యత్తు లేనట్లే, భాషను కాదంటే సంస్కృతిని కాదన్నట్టే.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి