14, ఆగస్టు 2020, శుక్రవారం

రామాయణమ్. 30

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జనకుడు .ఈయన అసలు పేరు సీరధ్వజుడు. మిధిలా నగరాధీశులందరినీ "జనకుడు" అనే పిలుస్తారు .
మూలపురుషుడు "నిమి" నుండి ఈయన ఇరవై మూడవ మహరాజు! .
.
అప్పటికి దాదాపు 6 సంవత్సరాలనుండి శివధనుస్సు గురించి ప్రచారం జరుగుతూనే ఉన్నది .ఒక్కొక్క రాజు రావడం ధనుస్సు ఎత్తలేకపోవడం జనకుడిమీదికి దండెత్తిరావడం .ఒకసారి అందరూ మూకుమ్మడిగా దండెత్తి వచ్చి కోటను సంవత్సరంపాటు ముట్టడించారు . కోటలో సైన్యసంపద తరిగిపోసాగింది ,ఆహారధాన్యాలు నిండుకున్నాయి ,అప్పుడు జనకుడు దేవతల సహాయంతో వారిని ఎలాగోలా ఓడించి సాగనంపాడు !
.
 ఇప్పుడిక ఆ బెడద తీరిపోయింది ! అందుకు ఆ నిట్టూర్పు! హమ్మయ్య! అని!
.
విశ్వామిత్రుడికి కన్నుల వెంట ఆనందబాష్పములు రాలినవి !
(ఎందుకని? జగత్కల్యాణకారకుడి కళ్యాణానికి తాను కారకుడనయ్యానని)
.
పురజనులంతా సంబరపడిపోయారు,స్త్రీ జనమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు !
.
మరి తరుణి సీత!
తనువంతా పూచిన మందారమయ్యింది!
తానొక సిగ్గుల మొగ్గ అయ్యింది !
 .

కామెంట్‌లు లేవు: