27, ఫిబ్రవరి 2023, సోమవారం

స్వాతంత్ర్యం వచ్చేదే

 అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే పార్ట్ 1


అమెరికాలోని 'మేడిసన్' నగరంలోవున్న విస్కాన్సిస్ విశ్వవిద్యాలయ సామాజికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జె.డబ్ల్యు. ఎల్టర్ కూ, స్వామివారికీ మధ్య 1963వ సంవత్సరం జులై 23వ రోజు నారాయణపురంలో జరిగిన సంభాషణ ఇది.

స్వామివారు చాలావరకు తెలుగులోనే మాట్లాడారు. మధ్య మధ్య కొన్ని పదాలు మాత్రమే ఇంగ్లీషు. డాక్టర్ ఎల్టర్ ఇంగ్లీషులోనే మాట్లాడారు. శ్రీ జి. వేంకటేశ్వరన్ ఉభయుల మధ్య "ద్విభాషి”గా పనిచేశారు. 


డాక్టర్ ఎల్టర్ : గత 15, 20 ఏళ్లలో భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. దేశం స్వతంత్రమై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చైనా దండయాత్ర చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు హిందూ మతంలోని ఏయే అంశాలను నొక్కి చెప్పవలసిన అవసరం వుందనుకుంటున్నారు? 


స్వామివారు : స్వాతంత్ర్యం రావటానికి ముందు నిజాయతీ లేనివారు భారతదేశంలో నూటికి పదిమంది కూడా వుండేవారు కారు. గ్రామీణుల్లో - అంటే కష్టంచేసి జీవించేవారిలో - ఎక్కువమంది అసలు మాట తప్పేవారు కాదు. వారి కోరికలు చాలా సామాన్యంగా వుండేవి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో స్వాతంత్ర్యం రాకమునుపు నిజాయతీపరుల శాతం ఎక్కువ. స్వాతంత్ర్యం వచ్చాక ఒక వయస్సు వచ్చిన వారందరికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు వచ్చిన జనంలో చాలామంది చదువురానివారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు వారికి లంచాలిచ్చేవారు. లంచాలు పుచ్చుకుని ఓటర్లు మరెవరికో కూడా ఓటు వేసేవారు. 


"దేశంలో విద్యుదీకరణ జరిగాక ప్రతి రైతుకూ తన మెట్టభూమిని మాగాణి భూమిగా మార్చుకోవాలనే కోరిక పుట్టింది. వారు ఎలక్ట్రిక్ మోటార్లు కొనుకున్నారు. పంపుసెట్లు కొనుకున్నారు. క్రమంగా మెట్టభూములు మాగాణి భూములయాయి. మాగాణి భూములకు అవసరమైనంతగా మెట్టభూములకు నీరు అవసరంలేదు. అంతకు మునుపు ప్రజలు మెట్టభూముల్లో పండే జొన్నలు, రాగులూ తింటూవుండేవారు. కాయధాన్యాలు, పప్పు దినుసులూ పండించేవారు. ఐతే సేద్యం మొదలెట్టారు. కాయధాన్యాల ధరలు కొంత పెరిగిన మాట వాస్తవమేకాని వరిలో వచ్చినంత లాభం వాటిలో రాదు.


“మాగాణి సేద్యం వృద్ధి చెందిన కొద్దీ ఉన్న నీటివనరుల మీద ఒత్తిడి ఎక్కువైంది. దీనికితోడు ప్రతివాడూ వున్నవారిలాగా జీవించటానికి తాపత్రయ పడ్డాడు. అందువల్ల సామాన్యజనంలో చాలామంది అప్పులపాలయ్యారు. నిరుపేదలకు కూడా బ్రౌజరు కావలసి వచ్చింది. ఏది ఆడంబరమో, ఏది అవసరమో తెలుసుకునే విచక్షణ పోయింది.


“ఇవి ఆడంబరాలనీ, ఇవి అవసరాలనీ ధర్మశాస్త్రాలు స్పష్టంగా నిర్దేశించాయి. కాఫీగానీ, టీగానీ త్రాగకపోయినా మనిషి బ్రతకగలడు. అతడికి వుండటానికి ఇల్లూ, కట్టటానికి బట్టా, తినటానికి తిండీ వుంటే చాలు.


“స్వాతంత్ర్యం రాకముందు సామాన్యుని జీవనస్థాయి ఎలా వుందో స్వాతంత్ర్యం వచ్చాక అలాగే నిలిచివుంటే చాలు. ఏది ఆడంబరమో, ఏది అవసరమో సామాన్యులు గ్రహించేవరకూ జీవనస్థాయిలో మార్పు అవసరం లేదు. స్వయంసమృద్ధి సాధించాక ఆడంబరాలు వదులుకుని అవసరాలు మాత్రమే సమకూర్చుకునే విజ్ఞత సామాన్య జనానికి కలిగి ఉంటే, అమెరికా, రష్యాల్లాగా మిగులు సంపదను పేదదేశాలకు సరఫరా చేసివుండే వారమే.


“వర్తకులు విదేశాలకు సరకులు పంపించేటప్పుడు దగా చేస్తూవుంటారు. ముందు మేలిసరకు చూపి తరువాత నాసిసరకు పంపిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు సరకులు కల్తీచేసి పంపించటం కూడా కద్దు. అందువల్ల సత్యసంధత, నిజాయతీ, అవసరాల నుండి ఆడంబరాలను వేరు చేయగల విచక్షణ, ఇతరులను దగాచేయరాదనే న్యాయబుద్దీ అనేవి ప్రస్తుతం ప్రజలకు పదే పదే నొక్కి చెప్పవలసిన ధర్మాలు.” 


డాక్టర్ ఎల్టర్ : ఇటీవల మధురై మీనాక్షీ దేవాలయానికి కుంభాభిషేకం జరిగింది. దాని కెందరో, ఎన్నాళ్లో శ్రమపడ్డారు. ఇరవై లక్షలకు పైగా వ్యయమయింది. ఈ కుంభాభిషేకాలను గురించి, వాటికయ్యే ఖర్చుల గురించీ మీ అభిప్రాయం ఏమిటి? 


స్వామివారు : ప్రతి మతానికి దాని ప్రత్యేక నిర్మాణాలున్నాయి. మహమ్మదీయులకు మసీదులున్నాయి. క్రైస్తవులకు చర్చిలున్నాయి. హిందువులకు దేవాలయాలున్నాయి. దేవాలయాలకు ఎత్తైన గోపురాలున్నాయి. ఆ గోపుర శిఖరాలు చూచినప్పుడు తాత్కాలికంగానైనా భగవంతుడూ, భగవంతుని సమున్నతత్వమూ గుర్తొస్తుంది. శాస్త్రాలకన్నా లేదా తాళపత్ర గ్రంథాలకన్నా గాలిగోపురాలకే భగవంతుణ్ణి గుర్తుచేసే శక్తి యెక్కువ. ఈ గోపురాలను స్థూలలింగాలని శాస్త్రాలు పేర్కొన్నాయి. చివరి క్షణాల వరకూ మనిషికి వెంటవచ్చే పుణ్యమేదైనా వుంటే అది భగవంతుని స్మరించినక్షణంలో సంపాదించుకున్న పుణ్యమే. ఈ గోపురాలు శిథిలావస్థలో వున్నప్పుడు వాటిని బాగుచేసి పదిలపరుచుకోవాలి. పునర్నిర్మింపబడిన గోపురాలకు అభిషేకాలు జరగాలనీ, ఆ అభిషేకాలకు కొన్ని నియమాలున్నాయని శాస్త్రాలూ, మతధర్మాలూ నిర్దేశిస్తున్నాయి. ఇలా అభిషేకంచేసే ఉత్సవాన్ని 'కుంభాభిషేకం' అంటారు. బంధువులందరూ కలసి ఒక వివాహం జరిపినట్లు ప్రజలందరూ కలసి కుంభాభిషేకం జరుపుతారు. 


ఈ సంభాషణ జరుగుతూవుండగా వాన మొదలైంది. అందరూ వీథి చివర స్వామివారి విడిదిలోకి చరచరా నడిచివెళ్లారు. 


డాక్టర్ ఎల్టర్ : దక్షిణాదిని అనేక పట్టణాల్లో కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుంభాభిషేకాలు జరిగాయి, పునరుజ్జీవనానికి చిహ్నాలుగా మీరు భావిస్తున్నారా? 


స్వామివారు : కొన్ని దశాబ్దాల కొకసారి ప్రతిదేవాలయానికి కుంభాభిషేకం జరుగుతూనే వుంటుంది. ఆవిధంగా కొన్ని దశాబ్దాలుగా ఎన్నో దేవాలయాలకు ఎన్నో కుంభాభిషేకాలు జరిగాయి. దక్షిణాదిని ముఖ్యమైన దేవాలయాలకు కుంభాభిషేకాలు జరగటం మూలాన జీర్ణాలయ పునరుద్ధరణ కార్యక్రమం ఇటీవల ముమ్మరంగా జరుగుతున్న ట్లనిపిస్తుంది. కాని ఇది శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారకాండే అయితే 1947కు పూర్వం దేశ ప్రజలందరూ బ్రిటిష్ పాలనను తుదముట్టించే యత్నంలో నిమగ్నులై వుండే వారు. ఆపని పూర్తి అయ్యాక వారి దృష్టి శిథిలదేవాలయాల మీదికి మళ్లింది. 


స్వాతంత్ర్యం  వచ్చాక నాస్తికవాదం ప్రబలింది. ద్రవిడ కజగం, ద్రవిడమున్నేట్రకజగం, కమ్యూనిజం మొదలైన భగవద్ వ్యతిరేక ధోరణులూ, ఉద్యమాలూ సామానం కటుకున్నాయి. బహుశా ఆ ఉద్యమాలు కొంతకాలంగా విఫలమైనందువల్ల ప్రజలు భగవంతుని వైపు ఆకర్షింపబడుతున్నారు.

దవ్యోల్బణం పెరిగి ఇదివరలో రూపాయికి అమ్మేవస్తువు పదిరూపాయలకు అమ్ముడుపోతోంది. అందువల్ల ఆలయ పునరుద్ధరణకు ఇదివరక్కన్నా పదింతలు ఖర్చౌతోంది. ఐనా ప్రజలు ధారాళంగా విరాళాలిస్తూనే వున్నారు.


డాక్టర్ ఎల్టర్ : హిందూమత సిద్దాంతాల్లో అహింస ఒకటి, ఇటీవల జరిగిన చైనా దండయాత్ర దృష్ట్యా ప్రస్తుతం దాన్ని ఎలా ఏమేరకు ఆచరించవలసి వుంది? 


స్వామి : మీరంటున్నది గాంధీగారి అహింసను గురించి అనుకుంటాను. గాంధీగారి అహింసకు మూలం బుద్ధుని అహింసా సిద్ధాంతం. 


నా దృష్టిలో బుద్ధుడూ గాంధీ యిద్దరూ అహింస విషయంలో విఫలులయ్యారు. నెహ్రూ 1947లో కాశ్మీరుకు భారత సైన్యాలను గాంధీతో సంప్రదించాకే, వారు ఆదేశించాకే, పంపారు. ఆ విషయం వారే చెప్పారు. అహింసాసూత్రాన్ని ఆచరణలో పెట్టటంలో గాంధీ కృతకృత్యులు కాలేకపోయారు. బుద్ధుడు సూకరమాంసం తిని దానిమూలంగా చనిపోయారని కొందరంటారు. మలయా, చైనా, సిలోన్, బర్మాల్లో వున్న బౌద్ధపరివ్రాజకుల్లో దాదాపు అందరూ మాంసాహారులే. అందువల్ల బుద్దుని అహింసా ధర్మం కూడా విఫలమైనట్లే! నా ఉద్దేశంలో అహింసావ్రతాన్ని పాటించగలవా డొక్కడే. సర్వసంగ పరిత్యాగి అయిన బ్రాహ్మణ సన్న్యాసి. సర్వసంగాలూ పరిత్యజించిన వాడు చెట్టునున్న ఆకును కూడా త్రుంచడు. తన్నెవరైనా కొడితే సంతోషంగా దెబ్బలు తింటాడే తప్ప సౌమ్యంగా నైనా ప్రతిఘటించడు. ఒకరు మరొకరిని కొట్టినప్పుడు కూడ కొట్టిన వాడిని చూచి జాలిపడతాడు. వాణ్ణి క్షమించమని దేవుణ్ణి వేడుకుంటాడు. అంతేకాని వాడి మీద చెయ్యిచేసుకోడు.


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే పార్ట్ 2


అహింసాసిద్ధాంతాన్ని జాతులకుగానీ, జాతినేతలకుగానీ, అన్వయించటం తప్పు. భారతదేశానికి స్వాతంత్ర్యం అహింసవల్లనే వచ్చిందని కొందరనుకుంటారు. కాదు. భారతదేశాన్ని వదలిపోవాలని అంగ్లేయులు నిశ్చయించుకున్నారు, వదలిపోయారు. అలా వదలిపోవటానికి వారి కారణాలు వారికున్నాయి. వారు వదలి పోవటం మూలాన్నే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే. పరిపాలనకు గానీ, పరిపాలకులకుగానీ అహింసాసూత్రం అన్వయించదని శాస్త్రాలు చెబుతున్నాయి. తన రాజ్యాన్ని రక్షించని రాజు ధర్మభ్రష్టుడని శాస్త్రం.


తన్ను తాను రక్షించుకోవాలనే నియమం ఒక్క చైనాకు మాత్రమే అన్వయించదు. అన్ని జాతులకూ అన్వయిస్తుంది. ఒకదేశం మీద మరొకదేశం దండెత్తటం తప్పు. అలాగే ఒకరు దండెత్తివస్తే దేశాన్ని రక్షించుకోక పోవటం కూడా తప్పు.


ఒకడు మరొకడి మీద దాడి చేస్తే, దెబ్బతిన్న వాణ్ణి ఆదుకోవటం ప్రభుత్వధర్మమనీ, తన ధర్మాన్ని నిర్వర్తించటంలో దాడి చేసిన వాడికి ఉరిశిక్ష విధించవలసివచ్చిన ప్రభువు వెనుకాడరాదనీ శాస్త్రం నిర్దేశిస్తున్నది. అంతే కాదు. ఏ మేరకు అహింసా ధర్మాన్ని పాటించదగునో కూడా రాజనీతి శాస్త్రం స్పష్టంగా విధించింది. 


అగర్వాల్ : ఇందాక మీరు అహింసావ్రతాన్ని పాటించగలవాడు బ్రాహ్మణ సన్న్యాసి ఒక్కడే అన్నారు. అంటే సన్న్యాసి అయ్యే యోగ్యత పుట్టుకవల్లనే సంక్రమిస్తుందని మీ భావమా, లేక ఏకులంలో పుట్టినా యోగ్యతవల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని మీ అభిప్రాయమా? 


స్వామివారు : శాస్త్రాలు హిందువులను అనేక కులాలుగా విభజించి ప్రతి కులానికీ కొన్ని కొన్ని విధులు నిర్దేశించాయి. బ్రాహ్మణునకు నిర్దేశించిన విధి అవిరళంగా జ్ఞానాన్ని సముపార్జించటం. అన్ని కులాలవారికి ఉపయోగపడే జ్ఞానాన్ని సముపార్జిస్తూ వుంటాడు బ్రాహ్మణుడు. అతణ్ణి పోషిస్తూ కని పెట్టి వుండటమే యితర కులాల వారి విధి. అందువల్లే గోదాన భూదానాది దానాలన్నీ బ్రాహ్మణుడే స్వీకరిస్తాడు. నిరంతరం జ్ఞాన సముపార్జన చేసే బ్రాహ్మణుణ్ణి కాపాడుకోవటం ఇతరకులాల కర్తవ్యం. తాను ఆర్జించిన జ్ఞానం పరిపూర్ణ మయాక బ్రాహ్మణుడు సన్న్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అప్పుడతడికి ఏ సంబంధాలూ ఉండవు. ఎవరినీ సంరక్షించనక్కర లేదు. ఆధ్యాత్మికంగా సమున్నతుడౌతాడు. కేవలం ఉదరపోషణ కోసమే భిక్షాటనం చేస్తాడు. 


ఒకవేళ బ్రాహ్మణుడు తన ధర్మాన్ని నెరవేర్చడనుకోండి. అతనికి 'వెలి' తప్పదు. ఏ కులం వారూ అతణ్ణి తమలో చేర్చుకోరు. ఏ కులంవాడైనా జీవితాన్ని తన ధర్మానికే అంకితం చేస్తే, అతడూ పరమగమ్యం చేరుకుని జ్ఞాని అవుతాడు. బ్రాహ్మణులు సహా అన్ని కులాలవారూ అతడి జ్ఞానం వల్ల లాభపడతారు. బ్రాహ్మణులతణ్ణి ఆరాధిస్తారు. ఈ విధంగా బ్రాహ్మణసన్న్యాసి లాగానే ఇతరకులాల్లోని జ్ఞాని కూడా ఉత్తమజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు.


రాముడూ, కృష్ణుడూ క్షత్రియులుగా పుట్టారు. వారిని బ్రాహ్మణులతో సహా అందరూ ఆరాధిస్తారు. తమ కులధర్మాన్ని ఆచరించి వారు మహాపురుషులయ్యారు. సన్న్యాసి లాగానే జ్ఞాని అయిన ప్రతివాడూ ప్రతి ప్రాణిలోనూ అభివ్యక్తమయ్యే ఆత్మను దర్శించి అత్యున్నతాలైన అహింసాధర్మాలు పాటిస్తాడు. 


డాక్టర్ ఎల్టర్ : నాయకులైనవారు శాస్త్రనియమాలు పాటించాలని తమరు సెలవిచ్చారు. రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతున్నది. ఇప్పటి నాయకులు కూడా నియమం పాటించవచ్చునా? లేక ఏ శాస్త్రంలో ఏ విధిని ఏ మేరకు పాటించవచ్చునో తెలిపే మార్గదర్శక సూత్రాలేవైనా వున్నాయా? 


స్వామివారు : మెకెవిల్లి ఒకటి చెబితే క్రీస్తు మరొకటి చెప్పినట్లు శాస్త్ర నియమాల్లో కూడా పరస్పర వైరుధ్యాలున్నాయి. అర్థశాస్త్రం విధించిన ధర్మంతో నేనేకీభవించాను. ఆధర్మం ధర్మశాస్త్రాల్లోని ధర్మాలకు విరుద్ధంగా వుంది. 


కాని ఏదేశంలోనైనా ప్రజలు నిరంకుశత్వానికీ, దుర్భర దారిద్ర్యానికీ దారుణ నైచ్యానికి గురై బాధామయమైన జీవితాలు గడుపుతున్నప్పుడు, ఆ రాజును దించి, ప్రజలకు శాంతినీ, సుఖాన్నీ, అభ్యుదయాన్ని ప్రసాదించటం పొరుగు దేశాన్నేలే రాజు నిర్వహించవలసిన బాధ్యత, ఆచరించాల్సిన కర్తవ్యం!


అలాటి పరిస్థితులలో మాత్రమే రాజ్యం విశాలం కావచ్చు. అలాంటి పరిస్థితులలో మాత్రమే రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవచ్చు అలా విస్తరించుకోవటం పొరుగు దేశంలోని ప్రజలను ఆదుకోవటం కోసమే.


ప్రజల అవసరాలను ప్రభువు గుర్తించాలి. శాస్త్రవిహితంగా వారిని పరిపాలించాలి. 


డాక్టర్ ఎల్టర్ : అంటే, భారతదేశంలోని ప్రస్తుత నాయకులందరూ ధర్మశాస్త్రాల ననుసరించి పరిపాలన సాగించాలనా మీరనేది? 


స్వామివారు: భారతదేశం మతాతీతమైన రాజ్యం. ధర్మశాస్త్రాల నుసరించిని పరిపాలన సాగించటం ఈనాడు సాధ్యం కాదు. అందుకు సంస్థలు పూనుకుని ధర్మశాస్త్రాల్లోని విషయాలు ప్రజల దృష్టికి తెచ్చి, ప్రజలకు మనోవికాసం కలిగిస్తే, వారు ఎన్నుకునే నా నడిపే ప్రభుత్వాలు కూడా ధర్మం తప్పక శాస్త్రానుగుణంగానే నడుస్తాయి. నాయకులు ధార్మిక విషయాలు పట్టించుకోరు కాబట్టి నైతికంగా సమాజాన్ని సముద్ధరించే బాధ్యత మత సంస్థల మీద మతాభిమానుల మీద వుంది. 


డాక్టర్ ఎల్టర్ : అయితే, భారతదేశంలోని నాయకులందరూ శాస్త్రాల ననుసరించాలి. శాస్త్రాల్లో వైరుధ్యాలు కనబడితే ధర్మశాస్త్రాల ననుసరించాలి. ధర్మశాస్త్రాలకూ, రాజ్యాంగానికీ వైరుధ్యం కలిగినప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. అప్పుడు రాజ్యాంగమే నాయకులకు తుది శాస్త్రమవుతుందన్న మాట! 


స్వామివారు : (నవ్వుతూ) నిజమే, నాయకులననుసరించవలసిన వర్తమానశాస్త్రం భారతరాజ్యాంగమే అనిపిస్తున్నది. 


డాక్టర్ ఎల్టర్ : నా కోసం చాలా కాలం వెచ్చించారు. మిమ్ములనిలా కలుసుకునే అవకాశం కలిగించినందు కెంతో కృతజ్ఞుణ్ణి. నే నడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పి అనుగ్రహించారు. మీకు ధన్యవాదాలు. 


స్వామివారు : అమెరికన్లు, ఇంగ్లండునుండి అమెరికాకు వలసపోయిన మాట వాస్తవం. అమెరికాలో స్థిరపడ్డాక వారెన్నో కష్టాలు పడ్డారు. బాధలనుభవించారు. బ్రిటిషువారితో యుద్ధం చేశారు. చివరికి శాంతి, అభ్యుదయం సాధించారు. సహజంగా కష్టజీవనం అంటే యేమిటో తెలిసిన ఒక అమెరికన్ ఈ దేశానికి వచ్చి యీ దేశప్రజల కష్టాలూ బాధలూ అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నందుకు ఎంత సంతోషంగా వుంది.


మీ అందరికి భగవానుని అనుగ్రహం కలగాలని నా ఆశంస.


--- డాక్టర్ జె.డబ్ల్యు. ఎల్టర్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


కపిల మహర్షి జ్ఞానబోధ

 🌸☘️🌸☘️🌸☘️🌸


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. 

 

తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు. 


నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. 

 

కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్ళు చల్లావు. 

 

నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో. 


కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి ”నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది. ”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుబోతూ ”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. ‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. 

 

కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ ”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి. ”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. 

 

కపిలుడు మందహాసం చేసి ”అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యానిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం. కాయలు నరుకుతున్నాం. అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… 


మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా. నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. 

 

కపిలుడు మందహాసం చేసి ”అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా! నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు. 

 

”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉంచి ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు. 


అరటి పిలక మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం. ”మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు. 


ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. 

 

ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషిడిగా’ తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది. ”ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి. 


”ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?” 

 

కపిలుడు అలా వివరంగా ఉపదేశించి ”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు. 

దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాస్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రిడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. 

 

”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు నా గర్భమున సుతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో. కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు. 


ఓం నమో నారాయణాయ

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

భూమి కొలతలు.

 భూమి కొలతలు..

1) ఒక ఎకరాకు =  40 గుంటలు 

2) ఒక ఎకరాకు =  4840 Syd

3) ఒక ఎకరాకు =  43,560 Sft

4) ఒక గుంటకు =  121  Syd

5) ఒక గుంటకు =  1089 Sft

6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09

    చదరపు ఫీట్లు 

7) 121 x 09  =  1089  Sft

8) 4840 Syd x 09 = 43,560 Sft

9) ఒక  సెంట్ కు   =  48.4  Syd 

10) ఒక సెంట్ కు  =  435.6  Sft


Land servay కోసం అత్యవసరమైన information...

 Common Terminology  in Revenue Department


గ్రామ కంఠం :

గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.


అసైన్డ్‌భూమి :

 భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.


ఆయకట్టు :

 ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.


బంజరు భూమి (బంచరామి) :

 గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.


అగ్రహారం :

 పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.


దేవళ్‌ ఇనాం :

 దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.


అడంగల్‌ (పహాణీ) :

 గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.


తరి : సాగు భూమి


ఖుష్కీ : మెట్ట ప్రాంతం


గెట్టు : పొలం హద్దు


కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు


కమతం : భూమి విస్తీర్ణం


ఇలాకా : ప్రాంతం


ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి


బాలోతా ఇనాం :

 భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి


సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి


సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి


సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది


నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం


కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి


ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) :

 భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.


ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ :

 దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.


బందోబస్తు :

 వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.


బీ మెమో :

 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.


పోరంబోకు :

 భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.


ఫైసల్‌ పట్టీ :

 బదిలీ రిజిస్టర్‌


చౌఫస్లా :

 ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.


డైగ్లాట్‌ :

 తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.


విరాసత్‌/ఫౌతి :

 భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.


కాస్తు :

 సాగు చేయడం


మింజుములే :

 మొత్తం భూమి.


మార్ట్‌గేజ్‌ :

 రుణం కోసం భూమిని కుదవపెట్టడం.


మోకా :

 క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).


పట్టాదారు పాస్‌ పుస్తకం :

 రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.


టైటిల్‌ డీడ్‌ :

 భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.


ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :

 భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.


ఆర్‌ఎస్సార్‌ :

 రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.


పర్మినెంట్‌ రిజిస్టర్‌ :

 సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.


సేత్వార్‌ :

 రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.


సాదాబైనామా :

 భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.


దస్తావేజు :

 భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.


ఎకరం :

 భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.


అబి :

 వానకాలం పంట


ఆబాది :

 గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు


అసైన్‌మెంట్‌ :

 ప్రత్యేకంగాకేటాయంచిన భూమి


శిఖం :

 చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం


బేవార్స్‌ :

 హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.


దో ఫసల్‌ :

 రెండు పంటలు పండే భూమి


ఫసలీ :

 జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.


నాలా :

 వ్యవసాయేతర భూమి


ఇస్తిఫా భూమి :

 పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి


ఇనాం దస్తర్‌దాన్‌ :

 పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి


ఖాస్రాపహానీ :

 ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.


గైరాన్‌ :

 సామాజిక పోరంబోకు


యేక్‌రార్‌నామా :

 ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..

జ్వరం హరించు ఆయుర్వేద యోగం

 


 జ్వరం హరించు సులభ ఆయుర్వేద యోగం - 


   6 నిమ్మకాయల రసం , 300 గ్రాముల గోరువెచ్చని నీటిలో కలిపి 3 స్పూనుల పటిక బెల్లం చూర్ణం లేదా పంచదార కలిపి ఆ రసాన్ని రోజు మొత్తం మీద కొంచం కొంచం మోతాదులో జ్వరంతో బాధపడుతున్న వారికి ఇచ్చుచున్న జ్వరం , వాంతులు , అతిసారం , విరేచనాలు నివారణ అగును . 


  తగ్గేవరకు నిత్యం చేయవలెను .  


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : అష్టసిద్ధులు  - కుండలినీ శక్తి జాగరణ .


        హిమాలయ పర్వతాలలో రహస్య గుహలు చాలా ఉన్నాయి. వాటి గురించి సామాన్య మానవులైన మనం ఎంతమాత్రమూ తెలుసుకోలేము. ఆ గుహలలో అత్యంత కఠిన సాధన చేస్తూ ధ్యానంలో ఉండు మహాయోగులు ఎంతో మంది ఉన్నారు . వీరు సామాన్యంగా జనబాహుళ్యంలోకి రారు. రావలసి వస్తే అదృశ్యరూపములో వచ్చి తమ కార్యం నిర్వర్తించుకొని పోగల గొప్ప శక్తి కలిగి ఉంటారు . వీరిలో వందల సంవత్సరాల వయస్సు కలిగినవారు కూడా ఉన్నారు . మరి వీరు ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికి ఉన్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం . ఈ విషయం పైన అనేకమంది పాశ్చత్య పరిశోధకులు పరిశోధనలు కూడా చేశారు . దీని గురించి నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించినపుడు కొంత వివరణ నాకు దొరికింది. దానిలో ఈ విధముగా ఉన్నది. ప్రతి మనిషి యొక్క ఆయష్షు అనేది బ్రహ్మ సంవత్సరాల పరంగా రాయడు. పుట్టిన ప్రతి జీవి ఇన్ని లక్షల ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు తీసుకుంటాడు అని మాత్రమే రాస్తాడు. మనిషి తన ఆయష్షు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది తన శ్వాస మీద అధారపడి ఉంటుంది . ఆ ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు సమాప్తి అయ్యాక జీవి తన శరీరాన్ని వదిలి పరమాత్మని చేరుతుంది.


               ఈ సిద్ధాంతం ఖచ్చితంగా యోగుల విషయంలో పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను.  ఎలా అంటే ఒక యోగి ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క శ్వాస అనేది క్రమక్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా ఆగిపోతుంది. అతని శరీరంలోని అవయవాల పనితీరు ఏ మాత్రం చెడిపోదు. శ్వాస ఆగుతుంది చుట్టూ ఉన్న కాలం ఆగదు.అతని ఉస్చ్వాస , నిశ్చ్వాసాలు యొక్క సంఖ్య తరగదు. ఈ విధముగా ఎంతకాలం గడిచినను అతను జీవించే ఉంటాడు. యోగం చేయువారు ప్రధానముగా తన శ్వాసని అదుపులో పెట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి .


                        పైన చెప్పిన విధానంలో యోగుల ఆయష్షు పెరుగును . వీరిలో చాలా మంది కుండలీ శక్తిని మేల్కొలిపినవారై ఉంటారు . ఈ దశలో వీరికి అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి . ముందు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. ఆ తరువాత కుండలిని శక్తి గురించి చెప్తాను .


        సిద్ధులను పొందినవాడు సిద్దుడు అవుతాడు. కొంతమంది కొన్నిరకాల సిద్ధులతో సంతృప్తి పడి ఆగిపోతారు. కాని కొందరు మాత్రమే అన్నిరకాల సిద్ధులను సాధించే వరకు విశ్రమించరు . ఈ సిద్ధులలో బేధాలు కలవు. ఇవి మొత్తం 8 రకాలు .అందుకే వీటిని "అష్టసిద్దులు " అని పిలుస్తారు .  ఇవి వరుసగా  


 *  అణిమ .


 *  మహిమా .


 *  చైవ .


 *  గరిమ .


 *  లఘిమ .


 *  తథా .


 *  ప్రాప్తిహి . 


 *  ప్రాకామ్య  .


 *  మీశిత్వం .


 *  వశిత్వం .


 *  చాష్ట భూతయః .


 అష్టసిద్దులు యొక్క వివరణ  -


   శరీరమును చాలా చిన్నదిగా చేసుకొను ప్రక్రియయే "అణిమ " .


 తన స్వరూపమును చాలా పెద్దగా చేసుకొను ప్రక్రియను " మహిమ" అని పిలుస్తారు .


  తన శరీరంను చాలా బరువుగా చేసుకొను ప్రక్రియను " గరిమ" అని పిలుస్తారు .


  తన యొక్క శరీరంను అత్యంత తేలికగా చేసుకొను ప్రకియనే " లఘిమ" అని పిలుస్తారు .


  తన యొక్క జ్ఞానేంద్రియాలు , కర్మేంద్రియాలు సహయముతో ఎంత దూరం ఉన్న విషయములనైను గ్రహించుటయే "ప్రాప్తి" .


  తను కోరిన కోరికలు అన్నింటిని పొందుటనే  "ప్రాకామ్యము" .


  తనశక్తిని ఇంకొకరి యందు ప్రసరింపచేయు సిద్ధిని "ఈశిత్వము " అందురు.


  సర్వ భూతములు అన్నియు తనకు వశం అగుటను "వశిత్వము" అందురు.


          ఈ 8 రకాల సిద్ధులను "అష్టసిద్దులు" అందురు. ఈ అష్టసిద్ధులు ను సాధించినవాడు మహాయోగి అగును.  ఇవియే గాక సూక్ష్మ శరీరముతో లోకలోకాంతరములు అన్నింటిని దర్శించుట, దూరశ్రవణము , దూరదర్శనము , ఆకలిదప్పికలు లేకపోవుట , ధ్యానావస్థలో కొత్తకొత్త విఙ్ఞాన విషయాలు తెలుసుకొనుట, మరొక లోకములలో నివశించుతున్న మహాపురుషులను సందర్శించి వారితో సంభాషించటం , తన సంశయములకు సమాధానములు వారి నుంచి పొందుట , ఎక్కువ సమయములో అనుభవించదగిన ప్రారబ్ద కర్మను తక్కువ సమయములోనే అనుభవించి ముగింపచేయుట , అనేక మంది దుఃఖితుల యొక్క దుఃఖాన్ని దూరం చేయుట , పూర్వజన్మ , రాబోవు జన్మ గురించి తెలుసుకొనుట , త్రికాల జ్ఞానము మొదలగునవి ఉపసిద్దుల కిందికి వచ్చును. అష్టసిద్దులు సాధించు సమయంలో తన యొక్క ప్రయత్న స్థితిని బట్టి ఈ ఉపసిద్దులు కూడా యోగికి వచ్చును.


  


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : కుండలినీ శక్తి జాగరణ  - సంపూర్ణ వివరణ .


        కుండలిని అంటే యోగవిద్య నేర్చుకునే వారికి అత్యంత పరిచయం అయిన పేరు . కుండలిని అనే శక్తి వెంట్రుక కంటే సన్నని రూపంలో చుట్టలు చుట్టుకుని వెన్నుపాము కిందిభాగంలో ఉంటుంది అని కొంతమంది చెబుతారు.  ఇది నిద్రావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే నిద్రావస్థలో ఉన్న కుండలి సరైన గురుప్రసాదం వలన మేలుకొని సకల పద్మాలు అనగా చక్రాలను చీల్చుకొని పోవుతుందో అప్పుడు కుండలిని నిద్రావస్థ నుంచి జాగరణావస్థ లోనికి వచ్చింది అని తెలుసుకొనవలెను.


             ఈ కుండలినికి అనేక నామములు కలవు. కుటిలాంగి , భుజంగి, శక్తి, ఈశ్వరి, కుండలిని , అరుంధతి , కుండలి అను పేర్లతో వివిధ యోగ గ్రంథాలలో పిలుస్తారు . కుండలిని శక్తి మేల్కొనని యెడల సర్వయోగ సాధనలు వ్యర్ధములు అగును. ఈ కుండలిని అనేది వెన్నుపాము కిందభాగములో సర్పాకృతిని పొంది నిద్రావస్థలో ఉన్న ఒక సూక్ష్మ నాడి . ఇది సమస్త శక్తి మహిమలకు , సమస్త జ్ఞాన , విజ్ఞానములకు ఆధారభూతం అయిన కేంద్రస్థానం . ఈ కుండలినీశక్తి మేల్కొననంత వరకు మానవుడు అజ్ఞానిగానే ఉంటాడు. కుండలిని జాగరణ అయిన కొద్దికాలంలోనే పూర్ణమైన ఙ్ఞానమును , సమస్త మహిమలు కలుగును.


                  కుండలిని శక్తిని ప్రాణాపానైక్యము అను సాధన ద్వారా మేల్కొనపవచ్చు . ఈ సాధన సద్గురువు యొక్క శక్తిపాతము వలన కలిగే ధ్యానావస్థ యందు సహజముగా కలిగే భస్త్రికా ప్రాణాయామం వలన కలుగును. ఈ సాధన యోగమార్గ రహస్యాలు తెలిసిన సద్గురువు వలన నేర్చుకుని చేయవలెనే కాని సొంతప్రయత్నముతో చేయరాదు . అలా చేసినచో చాలా అపాయకరమైన పరిస్థితులను కలిగించును. నాజీవితములో అలా ప్రయత్నించి కుండలిని శక్తి మేల్కొనిన తరువాత దానిని అదుపు చేయలేక పిచ్చివారు అయిన వారిని మరియు తీవ్రంగా మలబద్దకం సమస్య పొందిన వారిని చూశాను .


               కుండలిని జాగరణ సరైన పద్దతిలో జరిగినవాడు గొప్ప లాభమును , శక్తిని ఎలా పొందునో అలానే కుండలిని జాగరణ సవ్యముగా జరగక ఏమైనా విషమ సమస్య కలిగినచో మనోమయ , విజ్ఞానమయ కోశములు ఈ జన్మలోనే కాకుండా ఇంకా కొన్ని జన్మల వరకు సాధన చేయుటకు నిరుపయోగము అగుటయే కాకుండా సాంసారిక కార్యక్రమాలకు కూడా పనికిరాకుండా అనేక విధములు అయిన మానసిక  , భౌతిక దోషముల చేత ఉన్మాదాది రోగములచేత పీడితుడు అగును. కావున పూర్ణపురుషుడు అయి సరైన సద్గురువు దొరికినప్పుడే కుండలిని జాగరణ సాధనలు చేయవలెను . మంత్రజపముల వలన కూడా కొన్ని ఙ్ఞాన నాడుల మీద ప్రత్యేకమైన ప్రభావము కలిగి తద్వారా కుండలిని జాగరణ కలిగినప్పుడే మంత్రసిద్ది , ఇష్ట దేవతా సాక్షాత్కారము కలుగును. ఇటువంటి సాధనలు చేయుటకు ఆరోగ్యముగా ఉండటం కూడా అత్యంత ప్రధానం


           కుండలిని శక్తి గురించి చెప్పేటప్పుడు శక్తిచాలనము గురించి కూడా తెలుసుకోవాలి . పరిపూర్ణుడు అయినటువంటి మనుష్యుడు యోగసాధన ద్వారా ఈ కుండలిని శక్తిని మేల్కొలపాలి. ఈ విధానం గురించి యోగులు ఈ విధంగా చెబుతారు . నిద్రచేయునట్టి సర్పమైన కుండలిని యొక్క తోకను పట్టి దానిని మేలుకొలపవలెను . కుండలిని శక్తి నిద్రను విడిచి హఠము చేత మీదికి లేచుచున్నది. ఈ కుండలిని శక్తి పాము వలే వంకరగా చుట్టుకుని ఉండుననియు కందము మీద బ్రహ్మ ద్వారము నందు ముఖమును ఉంచి ద్వారమును మూసుకొని నిద్రించుచుండునని యోగులు చెప్పుదురు.


                   లింగమునకు మీదుగాను , నాభికి క్రిందగాను , గుదస్థానమునకు పన్నెండు అంగుళముల పైన , నాలుగు అంగుళముల వెడల్పును , అదే పొడుగును కలదై గుడ్డు వంటి కందము ఉండును. ఈ కంద స్థానం నుండియే 72000 వేల నాడులు బయలుదేరుతున్నవి . వజ్రాసనమున ఉండి రెండు చేతులతో కాలి మడమలకు సమీపమున రెండు పాదములను దృఢముగా పెట్టి ఈ రెండు పాదముల చేత కంద స్థానమునందు ఉండు కందమును చక్కగా పీడించవలెను . ఇట్లు పీడించుటచే కుండలిని చాలనం అగును. ఇక్కడ చాలనం అనగా నిద్రపోవుచుండెడి కుండలిని శక్తిని మూలాధారం నుండి ఊర్ధ్వముఖమునకు చలింపచేయుట లేక తీసుకొనిపోవుట . ఈ రహస్యము గురుముఖంగా తెలుసుకొనదగినది. ఈ కుండలిని శక్తిని చాలనము చేయుటకు అనేక మార్గములు కలవు. ఇట్టి విధానములు అన్నియు రహస్యముగా గురుసన్నిధిలోనే నేర్చుకొనవలెను.


                   ఏకాగ్రత చిత్తముతో గురుపదేశమగు రీతిని ప్రాణాయామము చేయుటచే గూడ  కుండలిని శక్తిని చాలనము చేయవచ్చు . ఈ శక్తిని చాలనము చేసి ప్రాణశక్తిని తన స్వాధీనము నందు ఉంచుకొనిన యోగి అణిమాది సిద్ధులను సాధించుచున్నాడు. ఇట్టి కుండలిని శక్తిని సాధించిన కాస , శ్వాస , జ్వరాదిరోగములు ఎప్పటికి బాధించవు . ఇట్టి మహాముద్రాది కరణముల చేత , నానావిధములగు ఆసనముల చేత , కుంభకముల చేత కుండలి మేల్కొన్నప్పుడు ప్రాణవాయువు శూన్యం అనెడి బ్రహ్మరంధ్రమునందు లయమగుచుండెను .


          కుండలిని శక్తి గురించి సంపూర్ణంగా మీకు వివరించాను . తరవాతి పోస్టులో మీకు శరీరము నందు గల చక్రాల గురించి వివరిస్తాను.


            మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

ధనాశతో ఉన్న వైద్యులు

 శ్లోకం:☝️

*ఘోరనామాని రోగాణాం*

 *మహార్ఘం చౌషధం వదేత్ ।*

*చికిత్సాగారవాసం చ*

 *ధనార్థీ నిర్దిశేత్ భిషక్ ॥*


భావం: ధనాశతో ఉన్న వైద్యులు అప్పటికీ ఇప్పటికీ ఒకలాగే ఉన్నారు. వారు పెద్ద పెద్ద రోగాల పేర్లు చెప్పి రోగులకు ఖరీదైన మందులు అంటగడతారు. కరాగారవాసం లాగా రోగులతో చికిత్సాగారవాసం చేయించి వారిని నిరుపేదలుగా చేస్తారు!

- అది ధ్యానం.

 *నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే- అది ధ్యానం. నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు. స్నానానికి సాధనతో పనిలేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు. ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే  చాలామంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు.* 


 *తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు. శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు. కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు. బుద్ధుడు శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ ‘మంచిది భిక్షూ! ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు’ అని అడిగాడు. తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు.*


 *‘ఎవరికైనా  ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో సాధకులమనుకునే వారిలో చాలామందిది ఇదే పరిస్థితి.* 

 *నిజానికి ధ్యానమంటే గాఢమైన* *అనుభూతే తప్ప, ఆలోచన కానేకాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా* *అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది.* *ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి  వచ్చి చేరుతుంది.*


 *ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే  ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి  అనుమతించాలి.*


 *చిరునవ్వుతో పలకరించాలి.* *ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు.*


 *వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి.* 

 *ఆ సంధి  సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం. ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదన లోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.*    

 *సాధన  క్రమంలో ఒళ్ళు* *జలదరించడం, ఆవలింతలు* *రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని  జరిగితే- అవన్నీ* *ధ్యానంలో పురోగతికి సూచనలని  మనం గ్రహించాలి. పరమహంస* *యోగానందజీ  చెప్పినట్లు వాటి  ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి.*


 *ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు,  వాటికోసం ప్రయత్నించకూడదు. వైకుంఠపాళిలో  నిచ్చెనల్లాంటివవి. ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం!* 

*శుభోదయం*🙏

భారత్ ను రక్షించే ఉద్యమం*

 *భారత్ ను రక్షించే ఉద్యమం* 

   ఆ శ్రీకృష్ణ పరమాత్మ రాయభారంలో కేవలం అయిదు ఊళ్లు అడిగాడు. కానీ ఇప్పుడు భారత దేశ రక్షణ కొరకు కేవలం అయిదు చట్టాలను చేయాలని  కోరుతున్నాము.

     *ఉమ్మడి విద్యా విధానం* (యూనిఫాం ఎడ్యుకేషన్)

    *ఉమ్మడి పౌర స్మృతి* (కామన్ సివిల్ కోడ్)

   *మభ్యపెట్టే బలవంతపు మత మార్పిడి నియంత్రణ* ( కన్వర్షణ్ కంట్రోల్)

   *అక్రమ చొరబాట్ల నియంత్రణ* ( ఇన్ ఫిల్టరేషన్ కంట్రోల్)

    *జనాభా నియంత్రణ* ( పాపులేషన్ కంట్రోల్) 


     ఈ అయిదు చట్టాలు రాకపోతే భారత దేశంలో సనాతన ధర్మం పూర్తిగా  అంతరించిపోతుంది. ఇప్పటికే భారత్ లోని తొమ్మిది రాష్ట్రాలలో మన ధర్మం కొడగట్టింది. 

  ఇది భారత్ ను, ప్రకృతి వనరులను రక్షించే ఉద్యమం.,

 మన ఆడపిల్లలను కాపాడే ఉద్యమం 


మీరూ ఒక భారతీయుడిగా ఈ సందేశాన్ని కనీసం ఒకరికైనా పంపవలసిందిగా మా ప్రార్దన. ఈ దేశం కోసం ఆమాత్రం కూడా చేయడానికి మీరు ఇష్టపడకపోతే ఈ సందేశాన్ని తిరిగి నాకు పంపించేయండి 


 *భారత్ మాతా కీ జై ✊💪🇮🇳*

ధర్మమూర్తి

 .

                   _*సుభాషితమ్*_



 శ్లో. 

*పితాధర్మః పితాస్వర్గః*

*పితాహి పరమం తపః!* 

*పితరి ప్రీతిమాపన్నే*

*ప్రీయన్తో సర్వదేవతాః*!


భావం:

తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే తపస్సు తనకు అనుకూలంగా నడుచు కుంటున్న కొడుకు పట్ల తండ్రి గనుక సంతుష్టుడైతే సకల దేవతలూ సంతృప్తులు అవుతారట.....ధర్మమూర్తి అయిన తండ్రికి సేవ చేస్తే ఇహలోకంలో కీర్తి, ఆనక మోక్షం సిద్ధిస్తాయని ఈ పురాణమే మరో చోట చెప్పింది..... *బిడ్డకు ఏది, ఎంత, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, వేటిని ఇవ్వకూడదో క్షుణ్ణంగా తెలిసిన వాడు తండ్రి*...అతడి హృదయం లోతైనది....మాట కటువు, మనసు వెన్న సున్నితం....