13, డిసెంబర్ 2024, శుక్రవారం

తామర హరించు సులభ యోగాలు -

 తామర హరించు సులభ యోగాలు  -


*  మెట్టతామర ఆకు పసరు , ఉప్పు కలిపి నూరి రాసిన తామర వ్యాధి తొలగును .


*  మెట్టతామర ఆకు పసరు , నిమ్మకాయ రసం కలిపి రాసిన తామర నశించును.


*  బొప్పాయి కాయ పాలు గాని , చెట్టు పాలు గాని పూసిన తామర వ్యాధి తొలగును.


*  నిమ్మరసం నందు మోదుగ విత్తనం అరగదీసి గంథం తీసి ఆ గంధాన్ని లేపనం చేసిన తామర హరించును .


*  చింతగింజని నిమ్మరసం వేసి సాన మీద అరగదీసి ఆ గంధాన్ని తామర మీద లేపనం చేస్తున్న 7 రోజుల్లొ తామర తగ్గును.


*  పొగాకు కాడలను కాల్చి ఆ భస్మమును కొబ్బరినూనెతో కలిపి రాయుచున్న తామర హరించును .


*  చిక్కుడు ఆకులను నలగొట్టి రసం తీసి ఆ చిక్కటి రసమును తామర పైన రాయుచున్న తామర శీఘ్రముగా తగ్గును.


      తామర సమస్యతో బాధపడువారు చింతపండు పులుపు , చేపలు , కోడిమాంసం , కోడిగుడ్డు, మసాలా పదార్దాలు , అతిగా కారం పూర్తిగా తగ్గేంతవరకు తినకూడదు. 


40 రోజుల్లో  గర్భాశయం పుండు హరించుటకు రహస్య యోగం  - 


     కలబంద రసం , పాలు మరియు నీరు సమానంగా తీసుకుని కలిపి ఉదయం పరగడుపున సాయంత్రం ఆహారానికి 2 గంటల ముందు సేవిస్తున్నచో 40 రోజుల్లొ  గర్భాశయం పుండు హరించును . కడుపులో పుండు అనగా అల్సర్ ని కూడా నివారించును.


          కాఫీ , టీ లు , మసాలా , కారం , పులుపు , పాత పచ్చళ్లు నిషిద్దం . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*ఫకీరు మాన్యానికి పయనం..నివాసం.*


*(ముప్పై ఏడవ రోజు)*


శ్రీస్వామివారు తనకు ఈశ్వరాజ్ఞ అందిందనీ..ఇక ఒక్కక్షణం కూడా శ్రీధరరావు గారింట్లో ఉండడం కుదరదనీ..ఆ తెల్లవారుఝామున తేల్చి చెప్పేసారు..ప్రభావతి గారు మనసు నొచ్చుకున్నా..శ్రీ స్వామివారు తాను ఇక జాగు చేయకుండా వెళ్లిపోవాలని నచ్చ చెప్పారు..


"అమ్మా!..నువ్వు బాధపడకు..నీకు బిడ్డ లాటి వాడిని..మీ దంపతులిద్దరూ ఎప్పుడైనా నా వద్దకు రావొచ్చు..తల్లివి నువ్వు..నిన్ను చూడాలనిపిస్తే..నేనూ వస్తాను..ఇప్పుడు మాత్రం వెళ్లి తీరాలి..తప్పదు.." అన్నారు దృఢ స్వరంతో..


శ్రీధరరావు గారు ప్రభావతి గారిని లోపలికి తీసుకెళ్లి.."ప్రభావతీ..ఆయన వెళ్లదలచారు..మనసులో ఏముందో మనకు తెలీదు..వారు కోరిన విధంగానే మనం కూడా సగౌరవంగా పంపుదాము.." అన్నారు..


"అదికాదండీ.. ఆయనేమన్నా చపలచిత్తులా ఏమిటి?..ఈ ఝాములో.."అన్న ప్రభావతి గారి మాట పూర్తికాకముందే..


"బాలోన్మత్తపిశాచ వేషాయ..అని చదువుకున్నాము కదా అవధూతల గురించి..ఇది ఏ దశ తాలూకు ప్రభావమో మనకు తెలీదు..నువ్వు ఆరాటపడి..కన్నీళ్లు పెట్టుకోకు..ఆయన గారు బాధపడతారు.." అన్నారు శ్రీధరరావు గారు..


ఇద్దరూ బైటకు వచ్చారు..శ్రీధరరావు గారు పనివాడిని నిద్రలేపి..గూడు బండి సిద్ధం చేయమన్నారు..పిలిస్తే పలికే మరో ఇద్దరిని కూడా పిలిపించి..బండి సిద్ధం చేయించారు..ఈలోపల ప్రభావతి గారు గబ గబా గేదె పాలు పితికి, కుంపట్లో వాటిని కాచి, స్వామివారికి తెచ్చి ఇచ్చారు..ఆసరికే శ్రీ స్వామివారు..తన సరంజామా (ధావళి, దండ కమండలాలు, జింకచర్మం వగైరాలు) అన్నీ సిద్ధం చేసుకొని వున్నారు..ప్రభావతి గారిచ్చిన పాలు త్రాగి.."నువ్వు ఖేద పడకమ్మా..అంతా శుభమే జరుగుతుంది!.." అన్నారు.."లేదు నాయనా!.." అన్నారు ప్రభావతి గారు..


ఈ తతంగమంతా చూస్తున్న సత్యనారాయణమ్మ గారు లేచి బండి దగ్గరకు వచ్చారు..ఆమెకు కూడా శ్రీ స్వామివారు వెళ్ళొస్తామని చెప్పి.."అమ్మా!..రామనామం మరువకుండా జపించు!.." అని చెప్పి బండి ఎక్కేశారు..బండి కదిలి ఆవరణ దాటే దాకా బరువెక్కిన హృదయాలతో ఆ ముగ్గురూ చూస్తూ ఉండిపోయారు..


ఏదో పెద్ద మేరు పర్వతం కదిలి వెళుతున్నట్లు..ఒక తేజోరూపం దూరంగా పోతున్నట్లు..తాముంటున్న ఇల్లు, తాము కూడా దూదిపింజల్లా తేలికై పోతున్నట్లు అనుభూతి లో మునిగిపోయారా దంపతులు..అప్పటికి సమయం తెల్లవారుఝామున నాలుగు..లోపలికి వెళ్లి పడుకున్నారే గానీ.."ఏమిటిది?..ఎందుకిలా జరిగిందో?.." అనే ఆలోచనే వారిని కలచి వేస్తోంది..


ఉదయం ఎనిమిది గంటలకల్లా మనుషులను పిలిపించి..కొంచెం లావుగా వుండే చిల్ల చెట్టు కొయ్యలు కొట్టించి..సజ్జ చొప్ప ను తెప్పించి.. తాటాకు కూడా తెప్పించి..ఇంకొక బండిలో సర్దించి..ఐదారుగురు మనుషులను ఆ బండి వెంట పంపుతూ..వీలైనంత త్వరగా ఫకీరు మాన్యం లో శ్రీ స్వామివారు కోరుకున్న చోట పాక వేసి, ఆయన్ను అందులో ఉంచే ఏర్పాటు చేయమని చెప్పారు శ్రీధరరావు గారు..సాయంత్రానికి వాళ్ళు పాక్షికంగానే పాక తయారయ్యింది..పనివాళ్ళు తిరిగివచ్చి..రేపటికి పూర్తిస్థాయిలో పాక సిద్ధం అవుతుందనీ..శ్రీ స్వామివారు కూడా ఆ గూడు బండిలో వుంటానన్నారని చెప్పారు..


శ్రీధరరావు దంపతులకు ఆ రాత్రి కూడా నిద్రబట్టలేదు..తెల్లవారి ఆరుగంటలకల్లా ఇద్దరూ నడచి ఫకీరు మాన్యం కు చేరుకున్నారు..అక్కడ..గూడు బండి కఱ్ఱల సహాయంతో నిలబెట్టి వున్నారు..అందులో ఉత్తరాభిముఖంగా (శ్రీ స్వామివారు తపస్సు చేసుకున్న మాలకొండ ఉత్తరం వైపు ఉంది) కూర్చుని ధ్యానముద్ర లో వున్నారు..దాదాపు అరగంట తరువాత ధ్యానం నుంచి లేచి, వీళ్లిదరినీ చూసి..ఆశ్చర్యపోతూ.."మీరెందుకొచ్చారు?.." అన్నారు..


"ఈ ఎముకలు కొరికే చలిలో..మీరెలా ఉన్నారో అని ఆందోళనతో వచ్చాము.." అన్నారు..


"శీతోష్ణ స్థితులను తట్టుకోవడమూ..ఇంద్రియనిగ్రహమూ యోగుల మొదటి సాధన!..ఈ చలి నన్నేమీ చేయదు..మీరు ఆందోళన చెందకండి.." అన్నారు శ్రీ స్వామివారు నవ్వుతూ..


"మధ్యాహ్నం నాటికి పూరిపాక తయారవుతుందనీ..మాలకొండ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారిచ్చిన మంచం కూడా తెప్పిస్తామని"  చెప్పి, శ్రీధరరావు దంపతులు ఇంటికి వచ్చేసారు..


ఇంటికి రాగానే..మార్నేని లక్ష్మీ నరసింహం అనే అబ్బాయిని పిలచి..(ఈ లక్ష్మీ నరసింహం శ్రీధరరావు కుమారుల ఈడు వాడు..బాగా చనువు ఉన్న అబ్బాయి..) శ్రీ స్వామివారు తినే ఆహారం (పెసరపప్పు కలిపిన బియ్యం తో వండినది) ఇచ్చి పంపారు..శ్రీ స్వామివారు ఆ ఆహారం తీసుకొని..వీలైతే శ్రీధరరావు గారిని రేపు వచ్చి కలువమని చెప్పి పంపారు..


శ్రీ స్వామివారు యధావిధిగా తన ధ్యానం చేసుకుంటూ..ఆ గూడు బండి లోనే సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు..పాక వేస్తున్న పనివాళ్ళు సైతం విస్తుబోతున్నారు..


సాధకులు.. యోగులు.. అవధూతలు..వీళ్ల తపస్సుకు ప్రకృతి కూడా సహాయం చేస్తోందేమో..లేకుంటే దిగంబరంగా..ఒక నిర్జన ప్రదేశంలో..అత్యంత శీతాకాలంలో కూడా ఏమీ చలనం లేకుండా సమాధి స్థితి లోకి వెళ్లిపోవడం సామాన్యులకు సాధ్యమా..


దత్త పాదములు..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ఆపస్థంబుడు అంటే ఎవరు

 *ఆపస్థంబుడు అంటే ఎవరు – (శ్రాద్ధ భోక్తలు)*


యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడువంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే.  *ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి* గురించి తెలుసుకుందాము.


ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు  శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలాసేపు వేచి ఉన్నాడు.  భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు.  బాగా ఆకలితో వచ్చాడు.  


కర్త, భోక్తగారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు. వచ్చిన మిగతా సాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా  భోజనం  చేశాడు. 


బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు.  వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు. 


కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్కచెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.  


అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు.  తనని  అలా "ఇంకా పెట్టు ఇంకా పెట్టు" అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త.  వండిన పదార్థాలన్నీ అయిపోయినా *ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే* కర్తకి కోపం వచ్చేసింది.


దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసాడు. "ఇంక తృప్తి అయిందా?" అని అన్నాడు. (*భోక్త భోజనం  అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సంప్రదాయం కదా*) అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు


కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. 'ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను  పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు' అని కోపం తెచ్చుకున్నాడు. 


కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్తగా వచ్చిన బ్రాహ్మణుడిని శపించడానికి చేతిలో జలం తీసుకొని అభిమంత్రించి బ్రాహ్మణుడి తలమీద చల్లాడు.


అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద  చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో  అని ఆజ్ఞాపించినట్లుగా *ఆగు* అని ఆపేసాడు.  


కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "*పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు*" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "*నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణులమీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు. నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో*" అన్నారు. 


దానికి కర్త 'స్వామీ నా తప్పుని తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ  పూర్తికాలేదే,   దానికి ఏమి చేసేది? అని అడిగేడు. 


*దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది* అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.


*జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది. శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది* 


*ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు*🙏🏻🕉️👏🇮🇳👏🙏🏻

రాత్రిపూట ఎందుకు

 *రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?*


*రాయపూడి కార్డియాలజిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్ర౦...*


*రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు?*  


*కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లు తాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్ర విసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా!*


*అసలు రాత్రి పూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సివస్తు౦ది?*


*👉ఒక కార్డియాలజిస్ట్ (గుండె వైద్యుడు) ఏమి చెప్పాడంటే -* 


*మీరు నిటారుగా నిలబడినప్పుడు సాధారణంగా కాళ్ళలో వాపు ఉంటుంది. (ముఖ్య౦గా మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ). ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల మీ క్రి౦ది భాగాలులో ముఖ్య౦గా కాళ్ళలో ఎక్కువ నీళ్ళు నిలువు౦టాయి.* 


*అదే మీరు పడుకుంటే మీ దిగువ శరీరం (ట్రంక్, కాళ్ళు మొదలైనవి) మీ మూత్ర పిండాలతో సమంగా ఒకే ఎత్తులో ఉంటు౦ది కనుక మూత్రపిండాలు ఎక్కువ నీటిని తొలగి౦చేదానికి సులభంగా ఉ౦టు౦ది.*


*మూత్రం ద్వారానే మన రక్తంలోని మలినాలు, విషపదార్ధాలు విసర్జింపబడతాయి.అటువ౦టప్పుడు నీళ్ళు త్రాగడానికి సరైన సమయం ఏమిటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.*


*👉హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలు*


1. *ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు(2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦: అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది.*


2. *భోజనానికి 30 నిమిషాల ముందు ఒక(1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦: జీర్ణక్రియకు సహాయపడుతుంది*


3. *స్నానం చేయడానికి ముందు ఒక(1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦:

రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది.*(తెలుసుకోవడం చాలా చాలా మంచిది)*


4. *రాత్రి పడుకునే ముందు ఒక(1) గ్లాసు నీళ్ళు త్రాగడ౦:

స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించవచ్

చక్కని శ్లోకం

 స్కంద పురాణంలో  ఒక చక్కని శ్లోకం ఉంది.


అశ్వత్థమేకం పిచుమందమేకం

న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|

కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ

పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||


అశ్వత్థ =  రావి

(100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)


పిచుమందా = నిమ్మ

(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)


న్యగ్రోధ = మర్రి చెట్టు

(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)


తింత్రిణి = చింత

(80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)


కపిత్థ = వెలగ

(80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)


బిల్వ = మారేడు

(85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది)


అమలకా = ఉసిరి

(74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)


ఆమ్రాహ్ = మామిడి

(70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)

 

వాపి  - నుయ్యి


ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)


ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం.


రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.  

ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి. 

అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.


ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని 

మూఢ నమ్మకాలుగా భావించి, ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం. 

యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, 

కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. 

ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. 

గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.


గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.

పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||

మూలంలో బ్రహ్మ, 

కాండములో విష్ణువు, 

శాఖలలో  శంకరుడు, 

ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు అని చెప్పబడినది.


తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.


భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.


రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి  మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.

శాంతి మంత్రార్ధము

 🙏శాంతి మంత్రార్ధము 🙏

ఓం సహనావవతు

సహనౌభునక్తు

సహవీర్యం కరవావహై

తేజస్వి నావధీతమస్తు

మా విద్విషావహై

ఓం శాంతిః శాంతిః శాంతిః

సాధారణంగా అన్ని భాషలలోనూ ఏక. వచనము బహువచనం మాత్రమే ఉంటాయి.

సంస్కృతంలో  ఏక వచనము, ద్వివచనము, బహువచనం అని మూడు వచనములు ఉంటాయి.అదే సంస్కృత భాష ప్రత్యేకత.

ఏక                  ద్వి                       బహు

రామః              రామౌ                   రామాః

ఒక రాముడు    ఇద్దరు రాములు    ఎక్కువ మంది                                                          రాములు  ఈ "ఓం సహనావవతు" అనే మంత్రము ద్వివచనములో చెప్పబడింది. ద్వివచనము అంటే ఇద్దరికి సంబంధించినది. ఇక్కడ గురు శిష్యుల గురించి చెప్పబడింది.బోధకులు గురువు, గ్రహీత శిష్యుడు. ఇద్దరికి అభివృద్ధి కలుగజేయమని చేసే ప్రార్ధన ఈ మంత్రం. ఈ మంత్రంతోనే ప్రతిరోజు విద్యాభ్యాసము ప్రారంభం అవుతుంది. అంటే గురు శిష్యులు ఇరువురు పఠిస్తారు.. అంత గొప్ప మంత్రం ఇది. మంత్రము యొక్క అద్భుతమైన భావం గ్రహిద్దాము.

భావం ..

ఓం సహనావవతు

సహ + నౌ +అవతు 

మన ఉభయులను (గురు శిష్యులను )పరమాత్మ రక్షించు గాక.

సహనౌభునక్తు

సహ +నౌ +భునక్తు

జ్ఞాన సమూపార్జన చేయుచున్న మనల నిద్ధరిని  ఆ పరమాత్మ పోషించు గాక.

సహవీర్యం కరవావహై

సహ +వీర్యం + కరవావహై

జ్ఞాన సమూపార్జనమన విషయములో మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక.

తేజస్వి నావధీతమస్తు

తేజస్వి+ నౌ +అధీతం + అస్తు

మన అధ్యయనము తేజోవంతము అగు గాక.

 మనచే అధ్యయనం చేయబడిన  జ్ఞానము  ప్రకాశవంతముగా నిలిచి ఉండాలి

మావిద్విషావహై

మా + విద్విషావహై

 అవగాహన లేకపోవడం వల్ల కలిగేది ద్వేషం. అటువంటి ద్వేషరహితులమై మనము ఉందుము గాక.మన విద్య ఫలప్రదము అగు గాక.

ఓం శాంతిః శాంతిః శాంతిః 

  ఓం శాంతి , శాంతి , శాంతి

ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక,   శాంతులను మనము పొందుదుము గాక.

శాంతి సర్వత్ర ఉండుగాక. ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాతృత్వము, పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను గొప్ప ఆశయములను ప్రకటించును

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

దిలీపుని వృత్తాంతం

 దిలీపుని వృత్తాంతం 


మహాకవి కాళిదాసు రఘువంశంలో వ్రాసిన ప్రార్ధనా శ్లోకం 

వాగర్థావివ సమ్పృక్తౌ వాగర్థప్రతిపత్తయే

జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ ॥


ఇందులో ధాతువు అనగా క్రియ: వందే (ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనము) – నమస్కరిస్తున్నాను.

ప్రశ్న: ఎవరిని (ద్వితీయ విభక్తి)? పార్వతీ పరమేశ్వరౌ – పార్వతిని మరియు పరమేశ్వరుని (ద్వివచనము)

ప్రశ్న: వారు ఎవరు? జగతః పితరౌ – జగత్తునకు తల్లిదండ్రులు ( ద్వివచనము)

ప్రశ్న: వారు ఎటువంటి వారు? వాగర్ధావివ సంపృక్తౌ- మాట మరియు దాని అర్థమువలె ఎప్పుడు కలిసియుండెడి వారు

ప్రశ్న: ఎందు కొరకు(చతుర్ధీ విభక్తి)? వాగర్ధ ప్రతిపత్తయే – మాట మరియు అర్థముల జ్ఞానము కొరకు

భావం 

"పదాలు మరియు వాటి అర్థాల గురించి సరైన జ్ఞానాన్ని పొందడం కోసం ఒక పదం మరియు దాని అర్థం వంటి విడదీయరాని విశ్వం యొక్క తల్లిదండ్రులైన పార్వతి మరియు పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను."


ఇక్కడ నుండి చదవండి కథ 

శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ


రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్థాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపరచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ఠుల వారు ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్య పూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!


అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలన4 వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.


ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.


“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. “భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.


ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదు” అని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు “క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు” అని అన్నాడు.


ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.


అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు “తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదుఱు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆఱోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు

దిలీపుడు తిరుగులేని మహారాజుగా తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేసి, నూరో యాగం తలపెట్టేసరికి ఇంద్రుడు భయపడ్డాడు. అశ్వాన్ని మాయం చేసాడు. తెలిసి కొడుకు రఘుని పంపుతాడు. నందిని తోడు వెళుతుంది. ఇంద్రుడు యుద్ధంలో వజ్రాయుధాన్ని విసురుతాడు. అది ఏ ప్రభావమూ చూపలేకపోతుంది. అప్పుడు ఇంద్రుడు అశ్వమేధ యాగానికి అడ్డుచెప్పడు. అశ్వాన్నీ ఇవ్వడు. రఘు తిరిగి రాజ్యానికి వస్తాడు. దిలీపుడు రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు!.


సమర్పణ  

.మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

జిజ్ఞాసువుల ప్రశ్నలకు

 *జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :*



 *ప్ర :* *తులసి, మారేడు దళాలు ఒక్కసారి వాడినవి మళ్ళీ వాడవచ్చు అంటారు కదా!* *అలా ఎన్నాళ్ళు వాడవచ్చు?*



 *జ :* పద్మాన్ని అయిదురోజులు, మారేడును పది రోజులు, తులసిదళాన్ని పదకొండురోజులు నీళ్ళు చల్లి మళ్ళీ పూజకు ఉపయోగించవచ్చు.

 *పంకజం పంచరాత్రంతు దసరాత్రంతు బిల్వకంl*

 *తులస్యేకాదశం స్యాచ్చ పునస్సంప్రోక్ష్య పూజయేత్ll* అని శాస్త్ర ప్రమాణం.


 *('ఋషిపీఠం' సంచిక నుండి సేకరణ)*

జీవితం

 జీవితం‼️🏵️



*1.* త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం.

*2.* ఓం జపించడం ఔషధం.

*3.* యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం.

*4.* ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం.

*5.* ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం.

*6.* సూర్యకాంతి కూడా ఒక ఔషధం.

*7.* కుండ నీరు తాగడం కూడా ఔషధమే.

*8.* చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే.

*9.* ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే.

*10.* ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం.

*11.* ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం.

*12.* సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం.

*13.* కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం.

*14.* నవ్వు మరియు జోకులు ఔషధం.

*15.* సంతృప్తి కూడా ఔషధం.

*16.* మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం.

*17.* నిజాయితీ మరియు సానుకూలత ఔషధం.

*18.* నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం.

*19.* అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే.

*20.* ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం.

*21.* అందరితో కలిసి జీవించడం ఔషధం.

*22.* తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే.

*23.* మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్.

*24.* సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం.

*25.* ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే.

*26.* *చివరగా...* ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం.

🪷 ప్రకృతి యొక్క *"గొప్పతనం"*ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం.


*ఈ మందులన్నీ మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.*

ముఖ్యమైన ద్వారం మనసు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *ఆలోచనాలోచనం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శరీరం ఇల్లనుకుంటే దానికి ముఖ్యమైన ద్వారం మనసు. దాని ద్వారానే తలపులు లోనికి ప్రవేశిస్తాయి.*


*లోచనం అంటే నేత్రం. ఆలోచన అనే కంటితో ఆ తలపులను జాగ్రత్తగా పరిశీలించాలి. అవగాహన లేని ఆలోచనలకు మనసు తలుపులు తెరవకూడదు.*


*మనిషి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ ఆలోచనలే మాటలుగా బహిర్గతమవుతాయి. మాటలు ఇతరులకు ప్రమాదమూ కలిగించవచ్చు. ప్రమోదమూ ఇవ్వవచ్చు. అవే ఆచరణగా, అలవాట్లుగా పరిణామం చెందుతాయి. మనిషి వ్యక్తిత్వానికి ఇవే గీటురాళ్లు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. దుర్మార్గపు ఆలోచనలు మనిషిని అధఃపాతాళానికి అణగతొక్కేస్తాయి. మనసులోకి తరచుగా అర్థంపర్థం లేని ఆలోచనలు ప్రవేశిస్తూంటాయి. ఓ గంట ఆలోచించాక- ఇలాంటి ఆలోచనలతో సమయాన్ని వృథా చేసుకున్నానేంటి? అని పశ్చాత్తాపపడతాడు.*


*అర్థహీనమైన ఆలోచనలతో మానసిక, శారీరక ఆరోగ్యాలు చెడిపోతాయి. సదవకాశాలు చేజారిపోతాయి.*


*మనసు చెప్పినట్లు మనం కాదు, మనం చెప్పినట్లు మనసు వినాలి- అంటాడు గౌతమ బుద్ధుడు.*


*మనసు, ఆలోచన రెండూ అన్యోన్య ఆశ్రితాలు. ఒకదానినొకటి పరీక్షించుకుంటాయి కూడా. గమ్యం చేరడానికి మార్గమేకాదు, మనసూ అవసరమే. ఎక్కడ సంకల్ప శుద్ధి ఉంటుందో, అక్కడ సత్ఫల సిద్ధి కూడా కచ్చితంగా ఉంటుంది.*


*ప్రపంచంలో కష్టమైనవి రెండు- ఒకటి మంచిపేరు తెచ్చుకోవడం, రెండు- ఆ పేరును నిలుపుకోవడం. ఈ రెండూ మన ఆలోచనల మీద, ఆలోచనలు పుట్టే మనసు మీద ఆధారపడ్డాయి. 'అంతరాయాలు సమాజం. అవి కలుగుతున్న కొద్దీ మనం సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ ముందుకెళ్లాలి' అంటారు మదర్ థెరిసా.*


*'మనసులోని ప్రతికూల ఆలోచనలే మన విజయాన్ని అడ్డుకుంటాయి' అన్న అబ్దుల్ కలాం మాటా అక్షరసత్యమే.*


*ఆరడుగుల మనిషి విలువ, గౌరవం నాలుగంగుళ నాలుక మీద ఆధారపడి ఉంటాయి. రావణుడు, దుర్యోధనుడు, దుర్వాసుడు, శిశుపాలుడు, హిరణ్యకశిపుడు, కీచకుడు తమ దురాలోచనలతో పలికిన పలుకులే వారికి ఘోరశాపాలయ్యాయి.*


*హనుమ, విభీషణుడు, ధర్మజుడు, ద్రౌపది, ప్రహ్లాదుడు మొదలైనవారి ఆలోచన, ఆచరణ యుగయుగాలకు ఆదర్శప్రాయం.*


*ఏకాగ్రత, సదాలోచన వల్లనే నైపుణ్యం, సాఫల్యం లభిస్తాయి. పదిసార్లు ఆలోచించి పలికే మాట మల్లెల మూటవుతుంది. తీపితేనెల ఊటవుతుంది.*


*ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతలో సగమైనా మనల్ని మెరుగుపరిచే ఆలోచనలపై పెట్టి చూడాలి. 'యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడికన్నా, తన మనసును తాను జయించగలిగినవాడే నిజమైన వీరుడు' అంటాడు. అరిస్టాటిల్.*


*ఆలోచన అదుపులో ఉంటే అవనిని బృందావనిగా మార్చవచ్చు. ఆలోచన ధర్మబద్ధమైనదైతే అంతటా ఆనందనందనాలను సృష్టించవచ్చు. ఆలోచన ఆధ్యాత్మికలోచనమైతే అంతటా సుఖశాంతులను చూడవచ్చు.*


*శ్రీ గురుభ్యోనమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

టపటప శబ్ద నాదములు

 చ.టపటప శబ్ద నాదములు డాబును చూపెడు గాని యెంచన

భ్యుపగతమై చెలంగునె? అయుక్తములౌ విష వాయువుల్ వికా

రపు పలు రోగపీడల విరాగములన్ సమకూర్చు గాక! నే

హ్యపు గతి నాశకారుల వియత్తలమున్ సహియింప నోపునే౹౹ 71


మ.అపచారమ్ములు చేయు వారలకు నభ్యాసమ్ములౌ సర్వదా

అపకారమ్ములు చేసి యుక్తిమతి సమ్యగ్రీతి నేమార్చుటల్

విపరీతమ్మగు ద్వేష భావములతో వేధించుటల్ నీచమౌ

కపటత్వమ్మును, మోసగించు గతులున్ కాఠిన్య చిత్తమ్ములున్౹౹ 72

శుక్రవారం*🌹 🪷 *13, డిసెంబర్, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🌹 *శుక్రవారం*🌹

🪷 *13, డిసెంబర్, 2024*🪷

      *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*


*తిథి     : త్రయోదశి* రా 07.40 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం   : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : భరణి* ఉ 07.50 *కృత్తిక* (14) తె 05.48 వరకు.


*యోగం  : శివ* ప 11.54 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : కౌలువ* ఉ 09.03 *తైతుల* రా 07.40 ఉపరి 

*గరజి* (14) ఉ 06.18 వరకు ఆపైన *వణజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.00 - 08.00  సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 03.36 - 05.04 తె*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.24*


*వర్జ్యం         : సా 06.49 - 08.17*

*దుర్ముహూర్తం  : ఉ 08.41 - 09.26 మ 12.24 - 01.09*

*రాహు కాలం  : ఉ 10.38 - 12.02*

గుళికకాళం     : *ఉ 07.51 - 09.14*

యమగండం    : *మ 02.49 - 04.13*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 06.27* 

సూర్యాస్తమయం :*సా 05.37*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 06.27 - 08.41*

సంగవ కాలం    :     *08.41 - 10.55*

మధ్యాహ్న కాలం  :*10.55 - 01.09*

అపరాహ్న కాలం   : *మ 01.09 - 03.23*

*ఆబ్ధికం తిధి  : మార్గశిర శుద్ధ త్రయోదశి*

సాయంకాలం  :  *సా 03.23 - 05.37*

ప్రదోష కాలం    :  *సా 05.37 - 08.11*

రాత్రి కాలం      :  *రా 08.11 - 11.36*

నిశీధి కాలం       :*రా 11.36 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.45 - 05.36*

________________________________

         🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


          🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷


*మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః /*

*పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ //*


🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*   

<><><><><><><><><><><><><>>>>>        

           

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🍃🌿🪷🪷🌿🍃🌹

పొడుపు కథ.

 *అచ్చమైన పొడుపు కథ.!*


ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.

.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)

2.రంగనగరం! ( శ్రీరంగం )

3.లకోల కోల! ( కోల= బాణం)

4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)

5.మందార దామం! ( దామం అంటే దండ)

6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)

7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)

8.నంద సదనం! ( నందుని ఇల్లు)

-

పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

విభూతియోగము

 10-42-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అథవా బహునైతేన 

కిం జ్ఞాతేన* తవార్జున | 

విష్టభ్యాహమిదం కృత్స్నం

ఏకాంశేన స్థితో జగత్ || 


తా:- అర్జునా! లేక, విస్తారమైన ఈ (విభూతి) జ్ఞానముచే నీ కేమి ప్రయోజనము?! నేనీ జగత్తునంతను ఒక్క అంశముచేత వ్యాపించియున్నాను(అని తెలిసికొనుము). 


వ్యాఖ్య:- ఈ ప్రకారముగ భగవద్విభూతిని ఎంత తెలిసికొనినను, ఇంకను తెలిసికొనవలసినది మిగిలియేయుండును గావున, అంతములేని ఈ వర్ణనలవలన నీకేమి ప్రయోజనమని భగవాను డర్జునునకు హితబోధచేయుచున్నారు. అవియన్నియు ఏ ఒక్కపరమాత్మ చైతన్యముచే వ్యాపింపబడియున్నవో, ధరింపబడియున్నవో ఆ ఒక్కదానిని తెలిసికొనినచాలునని వచించుటయగును. ఈ జగత్తంతయు పరమాత్మయొక్క ఒకానొక అంశముచేతనే వ్యాపింపబడియున్నదని చెప్పబడుటచే భగవానుని అనంతశక్తి, విశ్వవ్యాపకత్వము వెల్లడియగుచున్నది. ఈ అనంతకోటి బ్రహ్మాండములన్నియు ఎంతయో విశాలములయినవి. అయినను భగవానుని ఏ ఒక్క అంశముచేతనో అవియన్నియు వ్యాపింపబడియున్నవి. ఇంకను ఎన్ని అంశములో మిగిలియున్నవి. 

   ‘పాదోఽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి’ అను పురుషసూక్త వచన మీయర్థమునే ప్రస్ఫుటీకరించుచున్నది. దీనినిబట్టి భగవానునిముందు ఈ విశ్వమంతయు ఎంత అల్పమైనదో ద్యోతకమగుచున్నది. మఱియు ఏ మహనీయుని ఒకానొక అంశముచే ఈ జగత్తంతయు పరివ్యాప్తమైయున్నదో అట్టి పరమాత్మయొక్క అఖండ శక్తికి మనుజుడు జోహారులు అర్పింపవలసియున్నాడు. అట్టి సర్వేశ్వరుని వినమ్రచిత్తుడై అనన్యభక్తితో సేవించవలసియున్నాడు. వారి అనంత శక్తిని, విశ్వవ్యాపకత్వమును, విరాడ్రూపమును తలంచుకొని అల్పుడగు జీవుడు తన గర్వమును, అహంకారమును పారద్రోలవలెను. ఆతని ధనముగాని, అధికారముగాని, బలముగాని, శక్తిగాని సర్వేశ్వరుని అనంతతేజముయొద్ద ఏ పాటిది? ఇంతియేకాదు. ఇంకను పైకిపోయి విచారించినచో, ఈ దృశ్యజాతమంతయు మిథ్యయై, కల్పితమై యున్నట్లు తెలియగలదు. సత్యవస్తు వొక్క పరమాత్మయే అయియున్నాడు. అసత్యవస్తు వెంత పెద్దదైనను, గొప్పదైనను దానికి విలువ ఒకింతైననులేదు. స్వప్నప్రపంచ మెంత గొప్పదైనను జాగ్రతునిముందు తీసికట్టేకదా! కాబట్టి ఈ రహస్యములన్నిటిని తెలిసికొని జీవుడు తన అహంభావమును, దర్పమును పారవైచి పరమాత్మను శరణుబొంది కృతార్థుడు కావలెను. ఈ విభూతియోగమువలన నేర్చుకొనుపాఠ మిదియే. 

        

ప్ర:- ఈ జగత్తంతయు దేనిచే వ్యాప్తమైయున్నది?

ఉ:- పరమాత్మ యొక్క ఒకానొక అంశముచే వ్యాప్తమైయున్నది. (భగవత్స్వరూపమునందు ఈ విశ్వమంతయు పరిగణింపబడజాలనంత అల్పమై యున్నదని భావము).  

--------------------

*జ్ఞానేన --- పాఠాన్తరము

____


ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగోనామ 

దశమోఽధ్యాయః


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు 

శ్రీభగవద్గీతలందు విభూతియోగమను 

పదియవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*224 వ రోజు*

*కర్ణుడు భీష్ముడు*

తరువాత కర్ణుడు లేచి " మిత్రమా! నాకు గురువుగారి శాపం కారణంగా అస్త్రశస్త్రాలు గుర్తుకు రావు అని లోకులు అంటారు. కాని ఆ మహానుభావుడు నాకు వాటి స్పురణ ప్రసాదించాడు. కావున నాకు అస్త్ర సంపద ఉన్నది నిశ్చయము. దేవతలకు కూడా నన్ను గెలవడం కష్టం అర్జునుడు ఎంత నేను పాండవులను గెలుచుట తధ్యం " అన్నాడు. భీష్ముడు లేచి " కర్ణా! యముని ప్రేరణతో మాట్లాడుతున్న నిన్ను వారించడం మా తరమా? పాండవులు యుద్ధంలో రాలి పోతారా? అనవసరంగా నోరు నొప్పి పుట్టేలా వాగకు. దేవేంద్రుడు ఇచ్చిన శక్తితో అర్జునుని చంపగలనని అనుకుంటున్నావు. శ్రీకృష్ణుని చేతిలో అది ముక్కలు కాక తప్పదు. అర్జునుని కొరకు నీ వద్ద ఉన్న సమస్త అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు. ధృతరాష్టా! దాయాదులు కలిసి ఉంటే క్షేమంగా ఉంటారు లేకున్న సమస్తం కోల్పోతారు. కనుక సంధి చేసుకో " అన్నాడు. భీష్ముడు " సుయోధనా సంధి చేసుకుని ధర్మరాజుతో చేరు భీష్ముడు మన హితం కోరుతాడు. అతడి మాటను మన్నించు " అన్నాడు. సుయోధనుడు ఆ మాటలను లక్ష్యపెట్ట లేదు. ఆ మాటలకు కోపించి " సుయోధనా! మాట్లాడ వెందుకు అర్జునుడు గోగ్రహణంలో ఒకసారి ఒంటరిగానే విజృంభించి నపుడు నీ సైన్యం పారిపోలేదా? కర్ణుడు నీ చెంత ఉండి ఏమి చేసాడు. కాని ఇప్పుడు అలా కాదు. శ్రీకృష్ణుని సారథ్యంలో అర్జునుడు విజృంభిస్తే ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. కర్ణా యుద్ధంలో మరణించి వీరుడవు అనిపించు కుంటావు. సుయోధనుని మరణానికి కారకుడవు అవుతావు " అన్నాడు. కర్ణుడు విరక్తిగా "సుయోధనా! భీష్ముని మాటలు నా మనసుని కలచి వేస్తున్నాయి. ఈ భీష్ముడు చచ్చే వరకు నేను యుద్ధభూమిలో అడుగు పెట్టను. ఆతరువాత నేను నా ప్రతాపం చూపిస్తాను" అని అస్త్ర సన్యాసం చేసిన కర్ణుడు ఇక అక్కడ ఉండలేక సభ వదిలి వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ " అయ్యో సుయోధనా! ఇంతటి మహా వీరుడు అలిగితే ఎలాగా! కుమారా నీవు ఈ కర్ణును అండ చూసుకుని యుద్ధానికి దిగుతావు. అప్పుడు మా ప్రతాపములో వ్యత్యాసం చూడు. సుయోధనా! నేను, బాహ్లికుడు, ద్రోణుడు కలసి శత్రు నాశనం చేస్తాము " అన్నాడు. సుయోధనుడు కర్ణుడు పోయాడన్న బాధ భరించ లేక " తెలిసో తెలియకో అందరూ పాండవులు గెలుస్తారని అంటున్నారు. మొదట నిన్ను, ద్రోణుని, బాహ్లికుని నమ్మాను. కాని ఇప్పుడు చెప్తున్నాను. కర్ణుడు, దుశ్శాసనుడు నా వెంట ఉంటే విజయం నాదే నాకు వేరొకరితో పనిలేదు " అన్నాడు. సుయోధనుని మాటలకు కలత చెందిన ధృతరాష్ట్రుడు " విదురా! నా కుమారుడు కర్ణునితో కలసి మృత్యుపాశంలో ఇరుక్కున్నాడు. ఈ సమయంలో ఏమి చేయాలి చెప్పు " అన్నాడు. విదురుడు " మహారాజా! మన వాళ్ళు దుర్బలులై ఒకరిలో ఒకరు కలహించుకోవడం మనకు మరింత ప్రతికూలం అర్జునునకు అనుకూలం. మాటలు కట్టిపెట్టి పాండవులను పిలిచి సంధి చేయించు " అన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! మరలి వచ్చు నపుడు అర్జునుడు నీతో ఏమన్నాడో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " దేవా! అర్జునుడు నాతో " ధర్మరాజు న్యాయంగా మాకు రావలసిన రాజ్య భాగం అడుగుతున్నాడు. దర్పంతో ఇవ్వకుంటే మాచేత వారు యుద్ధభూమిలో చావక మానరు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 958


⚜ కేరళ : కందియూర్  : అలెప్పి


⚜ శ్రీ మహాదేవ ఆలయం



💠 కందియూర్ శ్రీ మహాదేవ దేవాలయం అచ్చంకోవిల్ నది ఒడ్డున మావెలిక్కర సమీపంలోని కందియూర్‌లో ఉన్న పురాతన శివాలయం . 

కందియూర్ ఒకప్పుడు ఒడనాడు రాజ్యానికి రాజధాని . దేవాలయం మరియు ప్రాంతం కేరళలోని ప్రాచీన బౌద్ధమత చరిత్రకు సంబంధించినవి .  


💠 ప్రపంచంలోని 108 ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి, కందియూర్ మహాదేవ ఆలయం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది, ఇది పురావస్తు లక్షణాలలో ప్రత్యేకమైనది మరియు కేరళలోని అతిపెద్ద మరియు పురాతన దేవాలయాలలో ఒకటి.


💠 ఈ ఆలయంలో హిందూ పురాణాలలోని 108 దేవతలు ఉన్నారని నమ్ముతారు.


💠 ఆలయానికి సంబంధించి అనేక పురాణగాథలు ఉన్నాయి. పరశురాముడు స్వయంగా ప్రతిష్టించిన పురాతన కేరళలోని 108 గొప్ప శివాలయాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. 

మరొక పురాణం ప్రకారం రిషి మృకండుడు, రిషి మార్కండేయ తండ్రి గంగా స్నానం చేస్తున్నప్పుడు కిరాతమూర్తి రూపంలో ఉన్న శివుని విగ్రహాన్ని పొందాడు. 

విగ్రహాన్ని పవిత్రమైన మరియు తగిన ప్రదేశంలో ఉంచమని అతను ఒక ప్రవచనం విన్నాడు. సరైన ప్రదేశం కోసం వెతుకుతున్న రిషి కేరళకు వచ్చి అచ్చన్‌కోవిల్ ఒడ్డున ముగించాడు మరియు కందియూర్‌లో ఆలయాన్ని స్థాపించాడు. 



💠 మరొక పురాణం ప్రకారం, శివుడు బ్రహ్మదేవుని తలను నరికిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. 

కందియూర్ అనే పేరు శివ శ్రీ కాంతన్ పేరు నుండి వచ్చింది. పరశురాముడు ఆలయాన్ని పునరుద్ధరించి, తారాననల్లూర్ కుటుంబానికి తాంత్రిక హక్కులను ఇచ్చాడని నమ్ముతారు. 


🔆 చరిత్ర


💠 కందియూర్ శ్రీ మహాదేవ దేవాలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ చారిత్రక కథనం ఒడనాడ్ రాజ్యం మరియు కాయంకుళం రాజవంశం మధ్య జరిగిన యుద్ధం. కాయంకులం రాజవంశం రాజు యుద్ధంలో ఓడిపోయాడని నమ్ముతారు. 

తరువాత, అతను తన కత్తిని దేవునికి అప్పగించడానికి ఆలయంలోకి ప్రవేశించాడు మరియు ఆలయం గుండా తప్పించుకున్నాడు. అప్పటి నుండి వెనుక తలుపు శాశ్వతంగా మూసివేయబడింది.


💠 ఆలయ ప్రధాన దైవం శివుడు కందియూరప్పన్ (కందియూర్ పాలించే దేవుడు) అని పిలుస్తారు. 

దేవత తూర్పు ముఖంగా ఉంటుంది. దీర్ఘచతురస్రాకార గర్భాలయం రెండు అంచెలు మరియు భక్తుల కోసం ముందు భాగంలో ఒక వేదిక ఉంది, ఇది హోయసల శైలిలో ఉంటుంది. దిగువ శ్రేణి అండాకారంలో ఉంటుంది, ఎగువ శ్రేణి దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. 


💠 10 అడుగుల గజపృష్ట శైలి గోడ శివుని భూతగణాలచే నిర్మించబడిందని నమ్ముతారు. ఆలయంలో పురాణ పురాణ రాతి గ్రంథాలు ఉన్నాయి.


💠 ప్రాథమిక దైవం, కందియూరప్పన్, కిరాతమూర్తి రూపంలో ఉంటాడని నమ్ముతారు. ఉదయం దక్షిణామూర్తిగా, మధ్యాహ్నం ఉమామహేశ్వరునిగా, సాయంత్రం కిరాతమూర్తిగా పూజిస్తారు. 

ఐదు శివాలయాలను వీక్షించడం ద్వారా ప్రదక్షిణ వాజి యొక్క వాయువ్య మూలలో నుండి పంచముఖంగా మరియు సూర్యాస్తమయం సమయంలో వైకతప్పన్ ( వైకోమ్ యొక్క పాలక దేవుడు ) గా పూజిస్తారు. 


💠 ఆలయంలోని ఉప దేవతలలో విష్ణువు , పార్వతీశన్, నాగరాజ మరియు నాగయక్షి, గోపాల కృష్ణన్, శాస్తా , శంకరన్, శ్రీకందన్, వడక్కుమ్నాథన్, అన్నపూర్ణేశ్వరి, గణపతి, సుబ్రహ్మణ్యన్, మూల గణపతి మరియు బ్రహ్మరాక్షసులు ఉన్నారు.


🔆 పండుగలు


💠 కేరళలోని మావేలికర (అలెప్పి జిల్లా) సమీపంలోని కందియూర్ మహాదేవ ఆలయంలో వార్షిక ఆలయ ఉత్సవం కేరళలో అనుసరించే సాంప్రదాయ మలయాళ క్యాలెండర్ ప్రకారం ధను మాసంలో జరుపుకుంటారు. 

ధనుమాసంలో తిరువాతిర నక్షత్రానికి పది రోజుల ముందు వార్షిక ఉత్సవం ప్రారంభమవుతుంది. 

తిరువాతిర నక్షత్రంతో పండుగ ముగుస్తుంది.


💠 వార్షిక పండుగ కొడియెట్టం లేదా జెండా ఎగురవేత కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. పూజా మందిరాన్ని సాంప్రదాయకంగా అరటి, కొబ్బరి ఆకులు, పువ్వులు, సాంప్రదాయ దీపాలు మరియు దీపాలతో అలంకరించారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించి అన్నదానం కూడా నిర్వహిస్తారు. 

పల్లివెట్ట ఈ ఉత్సవంలో ఒక ముఖ్యమైన సంఘటన మరియు ఇది వందలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. 


💠 ఏనుగులు, మేళం, బాణసంచా మరియు షీవేలీ పండుగలో భాగం. ఆరాట్టుతో పండుగ ముగుస్తుంది. దేవత యొక్క ఉత్సవ మూర్తిని చివరి రోజున ఆచార స్నానం కోసం మందిరం నుండి బయటకు తీసుకువెళతారు.


🔆 ప్రధాన సమర్పణలు : 


💠 జలధార, రుద్రాభిషేకం, క్షీరధార, గణపతి హోమం, భగవతీ సేవ, కారుకా హోమం, నిరాపర, స్వయంవరార్చన, శాంగాభిషేకం, రేఖ పుష్పాంజలి, మూజుకప్పు, మృత్యుంజయ హోమం, సహస్రనామార్చన, నీరాంజనం, అభంజనం, అభంజనం, 


💠 ఇది తిరువల్ల, చెంగన్నూరు, పందళం మరియు అదూర్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 ప్రపంచ ప్రసిద్ధి చెందిన చెట్టికులంగర దేవి ఆలయం ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar