5, జూన్ 2021, శనివారం

Road


 

Text your self


 

Shankara


 

Chandanan cherchita


 

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పులిచర్మం.. స్వామివారి లీల..రెండవభాగం..*


*(నలభై తొమ్మిదవ రోజు)*


కందుకూరు నుంచి తన బాబాయి గారింటినుంచి..శ్రీధరరావు గారు వారిస్తున్నా వినకుండా  ప్రభావతి గారు పులిచర్మాన్ని తీసుకొని మొగలిచెర్ల చేరారు..అప్పటికీ ఆవిడ బాబాయి గారు పెద్దరికంగా.."అమ్మాయీ..స్వామివారి తపస్సుకోసం అంటున్నావు కనుక ఈ పులిచర్మాన్ని తీసుకుని వెళ్లి..స్వామివారు పదిరోజులో.. పక్షం రోజులో దీనిమీద కూర్చుని తపస్సు చేసుకోమని..ఆతరువాత మళ్లీ మాకు తీసుకొచ్చి ఇచ్చేయి..శ్రీ స్వామివారు తన తపోసాధనకు ఈ పులిచర్మాన్ని వాడుకున్నారనే తృప్తి మాకూ ఉంటుంది.." అన్నారుకూడా..ఇవేవీ ప్రభావతి గారి మనసుకు పట్టలేదు..


మొగలిచెర్ల చేరిన ప్రక్కరోజు ఉదయాన్నే..గూడు బండి లో పులిచర్మాన్ని పెట్టుకొని ప్రభావతి గారు, శ్రీధరరావు గార్లు శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు..వీళ్ళకోసమే ఎదురు చూస్తున్నట్లుగా శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో నిలుచుని వున్నారు..ప్రభావతి గారు పులిచర్మాన్ని చేతులతో పట్టుకుని గబ గబా శ్రీ స్వామివారి వద్దకు వచ్చి..

"నాయనా..ఇదిగో పులిచర్మం..మొత్తానికి పట్టుకొచ్చాను.. ఇక ఆ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నా కనవసరం..మీకు పులిచర్మం వచ్చేసింది.." అన్నారు..శ్రీధరరావు గారు మాత్రం..ప్రభావతి గారు తొందరపడ్డారనీ..పాపం వాళ్ళెంత నొచ్చుకున్నారో అని శ్రీ స్వామివారితో చెప్పేసారు..


ఇద్దరు చెప్పింది విన్న శ్రీ స్వామివారు..పెద్దగా నవ్వారు..కొద్దిసేపు నవ్వుతూనే వున్నారు..నవ్వడం ఆపి.."ఎంత వెఱ్ఱి తల్లివమ్మా నువ్వు!..పులిచర్మం మహాత్యం గురించి మాటవరసకు మీతో చెప్పాను..మీరు ఇంత ప్రయాస పడతారని అనుకోలేదు..నువ్వెంత బాధపడ్డావో.. పాపం మీ బాబాయి గారి ఇంట్లో వాళ్ళను యెంత బాధపెట్టావో..ఎప్పుడూ ఇటువంటి యాతన పడవద్దు..నాకంతగా కావాలని కోరుకుంటే..నా వద్దకు  రాదా తల్లీ?..ఈ పాటికి వచ్చేస్తూ వుండాలి..తీసుకెళ్లు తల్లీ..దీనిని జాగ్రత్తగా తీసుకెళ్లి..వాళ్ళది వాళ్లకు ఇచ్చేసెయ్యి..మనస్ఫూర్తిగా ఇచ్చిన వస్తువు తీసుకోండి కానీ..ఇలా బలవంతపెట్టి ఎప్పుడూ తీసుకొనిరాకు..నాకోసం శ్రమ పడవద్దు..ఇలా ఇతరుల నుంచి లాక్కోవద్దు..వెనక్కు ఇచ్చేయమ్మా.." అన్నారు..


ప్రభావతి గారు తీవ్రంగా నిరాశపడ్డారు.."అది కాదు నాయనా..ఇంతదూరం తీసుకొచ్చాను.. పోనీ ఓ వారమో.. పదిరోజులో మీరు దీనిమీద తపస్సు కొనసాగించండి..వాళ్లకు తిరిగి ఇచ్చేద్దాము..వాళ్లకూ పుణ్యం ఉంటుంది..ఇంత ఆర్భాటంగా తెచ్చిన నాకూ తృప్తి ఉంటుంది.." అన్నారు..


"వద్దమ్మా..ఒద్దు!..ఇది పట్టుకెళ్లి..వాళ్లకు ఇచ్చేసేయండి.." అన్నారు శ్రీ స్వామివారు దృఢంగా..


ప్రభావతి గారికి కన్నీళ్లు వచ్చాయి..తానింత శ్రమపడీ.. వాళ్ళను శ్రమపెట్టి..తీసుకొని వస్తే..ఇలా జరిగింది..ఇక చేసేదేమీలేదు..శ్రీ స్వామివారు ససేమిరా ఒప్పుకోలేదు..పైగా.."వీలయినంత త్వరగా వాళ్లకు చేర్చండి..వాళ్ళూ బాధపడుతుంటారు.." అన్నారు..అతి కష్టంమీద తన వేదనను లోపలే అణచుకున్నారు.."సరే నాయనా..మీ ఇష్టం.." అన్నారు దుఃఖం తో..


"అమ్మా!..నువ్వు బాధపడకు!..చెప్పాను కదా..నాకు కావాల్సింది నాకు చేరుతుంది..నువ్వేమీ దీనిగురించి ఎక్కువగా ఆలోచించకు..అన్నీ సర్దుకుంటాయి..పట్టుకు పోయి వాళ్ళది వాళ్లకు ఇచ్చేసెయ్యి.." అన్నారు..


శ్రీధరరావు గారు ఆ పులిచర్మాన్ని జాగ్రత్తగా చుట్ట చుట్టి తమ గూడు బండిలో పెట్టేసారు..దంపతులిద్దరూ శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..మొగలిచెర్ల కు బయలుదేరారు..

తమ ఇంటికి చేరుకునేసరికి..వాళ్లిద్దరూ ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది..ఇంటి వరండాలో శ్రీ చెక్కా కేశవులు గారబ్బాయి కృష్ణ ఒక పెద్ద చెక్క పెట్టెతో సహా వీళ్లద్దరి కోసం ఎదురుచూస్తూ కూర్చొని వున్నాడు..


శ్రీ స్వామివారి లీల ఏమిటో ఆ దంపతులకు కొద్దిసేపటి లోనే తెలిసి వచ్చింది..


పులిచర్మం..శ్రీ స్వామివారి లీల..మూడోభాగం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శుద్ద ఙ్ఞానం

 ఓం కారం ప్రణవార్ధాయ శుద్ద ఙ్ఞానైక మూర్తయే. అని దక్షిణామూర్తి స్తోత్రం. యిక్కడ దాక్షాయణి ప్రాయెూపవేశం చేసిన తరువాత యీశ్వరుని రూపం దక్షిణామూర్తి. శుద్ద ఙ్ఞానం భార్యలేని జీవితం శుద్ద ఙ్ఞానము. ఎందుకనగా పురుషుని సమస్త కళలకు గృహిణయే మూలం. మరొక పరిశీలన. ఓం అనే ప్రణవం పూర్ణము.౦ రెండు భాగములు అనగా శక్తిని విసర్గగా హవిస్సుగా రెండుగా అర్ధం సగభాగముగా మారుటను తెలియుటయే శుద్ద ఙ్ఞానము. అర్ధభాగం అనగా అర సున్నా కాదు విసర్గ యనే హ హవిస్సు. 

 జీవ గమనం హవిస్సు యని తెలియవలెను.యిట్లు రూపముగా తెలియుటయే ఙ్ఞానాన్ని లేనియెడల శుధ్దం, ఏమీ తెలియక పోవుట. వివాహము వలన సంతానం వలన శుద్ద ఙ్ఞానము కలుగవలెనని. అనగా వాటినుండి విడువడుట కాదు. గృహస్తు ధర్మంలోనే తరవాతి ఆశ్రమ ధర్మం శుద్ద ఙ్ఞానమును దర్శించుటకు. ఓం కార లక్షణము శ్వాశ. శ్వాశ అగ్ని లక్షణము. అగ్ని లక్షణము తత్వం జీవం. ఆక్సిజన్ కార్బన్డయాక్సైడ్గా రెండును అగ్ని తత్వములే.ఆక్సిజన్ వుంటేనే కార్బన్ డయాక్సైడ్ కూడా ప్రాణము ,అపాన మిశ్రమము జీవమనే ప్రణవం.అగ్నితోనే వాటి మనుగడ మూలం కూడా.అగ్నిమీఢే పురోహితం. అగ్నిని క్రమముగా చైతన్యపరచుట యజ్ఞము. మనం రోజూ అదే పని చేస్తున్నాము .లేనిచో ప్రాణం వుండదు. అది బయట కూడా వున్నది లోపల కూడా వున్నది ప్రకృతిలోను పురుషుడు అనే దేహముగల రెండింటికి మూలము. దీనిని తెలియుట ఙ్ఞానము. యిదియే దక్షిణామూర్తి రూపము. బిందు స్వరూప శక్తి లక్షణము ఓం కారమని. పూర్ణము ఓంకారములో ప్రధానమైన శక్తి అది జీవుడు తద్రూపమైన దేహి. దేహము వుంటేనే ఏదైనా. లేనిచో పూర్ణ విలువ యిది యని చెప్ప నీవు కాదు.అది ప్రకృతి విరుద్దమైన సరి చేయవలెను. అట్లు కానిచో లయం

 చేయవలెను. యిది యేదో మత పరమైనపరమైనవిషయం కాదు. మనిషి మనుగడకు వినికిడి సంబంధించినది

 తెసుసుకుంటూనే వుందాం.ఆచరిస్తునే వుందాం.

Mahalakshmi Ashtakam*

 *Mahalakshmi Ashtakam*


Namastestu Mahamaye

Shree Pithe Sura Poojite

Shanka Chakra Gadha Haste

Maha Lakshmi Namoostute


Namastestu Garudarudhe

Kolasura Bhayankari

Sarva Papa Hare Devi

Maha Lakshmi Namoostute


Sarvajne Sarva Varade

Sarva Dushta Bhayankari

Sarva Duhkha Hare Devi

Maha Lakshmi Namoostute


Siddhi Buddhi Prade Devi

Bhakti Mukti Pradayini

Mantra Moorte Sada Devi

Maha Lakshmi Namoostute


Adyanta Rahite Devi

Adi Shakti Maheshwari

Yogaje Yoga Sambhute

Maha Lakshmi Namoostute


Sthula Sukshme Maha Raudre

Maha Shakti Mahodari

Maha Papa Hare Devi

Maha Lakshmi Namoostute


Padmasana Sthithe Devi

Parabrahma Swaroopini

Parameshi Jagan Mata

Maha Lakshmi Namoostute


Shwetambara Dhare Devi

Nanalankara Shobhite

Jagasthithe Jaganmata

Maha Lakshmi Namoostute


Maha Lakshmyashtakam Stotram

Yah Patheth Bhakti Man Narah

Sarva Siddhi Mavapnoti

Rajyam Prapnoti Sarvada


Eka Kalam Pathennityam

Maha Papa Vinashanam

Dwikalam Yah Pathennityam

Dhana Dhanya Samanvitah


Trikalam Yah Pathennityam

Maha Shatru Vinashanam

Maha Lakshmi Bhavennityam

Prasanna Varada Shubhah

దేవతా సాక్షాత్కారం..

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹


*దేవతా సాక్షాత్కారం...*


సుందరాకాండలో హనుమ సీతాన్వేషణకు బయలు దేరేటప్పుడు అప్పటికి ప్రధానంగా ఉన్న దేవతల కందరికీ నమస్కరిస్తాడు. మొదటి సర్గ 8 వ శ్లోకం. 


లంకలో అంగుళం అంగుళం మొత్తం వేతుకుతాడు. సీత కనబడక చాలా నిరాశపడతాడు. రావణుడు సీతను ఎత్తుకు పోయేటప్పుడు ఋష్య మూకం మీదుగా నే దక్షిణం వైపు తీసుకెళ్లాడు. వాడి రాజ్యం లంక అని అందరికి తెలుసు. సీత జారవిడిచిన ఆభరణాలు రాముడికి లక్ష్మణుడికి చూపిస్తారు కూడా. సంపాతి చెప్పిన దానినిబట్టి కూడా ఆమె లంకలోనే ఉండాలి. కానీ హనుమకు ఎంత వెతికినా కనపడదు. హనుమ చాలా నిరాశ పడతాడు. 


ఆయనకు బుద్ధి మతాం వరః ఆనిపేరు. ఆ బుద్ధాంతా వినియోగిస్తే ఆయనకే విషయం బోధ పడుతుంది. అప్పుడు మళ్ళీ దైవ ప్రార్ధన చేస్తాడు. ఈసారి రాముడి నీ లక్ష్మణుడినీ, సీతనూ దైవ ప్రార్ధన లో కలుపుతాడు. 13 వ సర్గ 59 శ్లోకం (నమోస్తు రామాయ సలక్ష్మనాయ) నుంచి 67 వ శ్లోకం వరకు. నమోస్తు రామాయ శ్లోకం లో రెండో పాదం లో దేవ్యై .... జనకాత్మజాయై అని ఉంది. సంస్కృత వ్యాకరణ పరిచయ ముంటే ఆ పదాలు రెండూ చతుర్థి విభక్తి లో వున్నాయని తెలుస్తుంది. శ్రీరాముడి దేవి అనే అర్థం రానే రాదు. దేవి యైన జనకాత్మజకు అనే అర్థం మాత్రమే వస్తుంది. నవవ్యాకరణ వేత్త అయిన హనుమ సరిగ్గా వాడిన పదమది. ఇంకో అర్థమే లేదు. దేవి అనే మాట ద్వారా పుజ్యభావం ప్రకట మౌతుంది.  సీతను పరాశక్తి గా భావించి   13 వ సర్గ లో  "తదున్న సం పాండుర దంత మవ్రణం"  అని 68 వ శ్లోకం లో ధ్యానిస్తాడు. ఈ శ్లోకం లో ధ్యానించే రూపం రాముడు కాని లక్ష్మణుడు కానీ వర్ణించిన సీత రూపం కాదు. ఆర్యా అనే సంబోధన కూడా సీతది కాదు. అమ్మవారిది. ఆంజనేయుడి కి మనసులో సీత దేవత, పరాశక్తి అన్నభావము గాఢంగా పాదుకున్న తరవాత అప్పుడావిడ కనిపిస్తుంది. ఇది సాక్షాత్కారం.


సాక్షాత్కారం చేసుకునే దేవత మీద దేవతా భావము భక్తి ఉండాలి. ఆర్తి, ఏకాగ్రతల తో కూడిన ధ్యానం  వుంటే నే దేవత సాక్షాత్కారం జరుగుతుంది. 


*జపం ఇన్ని లక్షలు పూర్తి చేశామా? 40 రోజులు దీక్ష చేశామా? ఉపవాసం  ఉన్నామా? వంటి పిచ్చి లెక్కలు సాక్షాత్కారం దగ్గర పని చేయవు. దర్శనం కావలిసిన దేవతను ఆర్తితో ధ్యానించాలి. మిగతా అన్నీ వున్నా కూడా, దేవతా సాక్షాత్కారం దేవత కరుణిస్తే జరగాలి గాని భక్తుడి  మొండితనం మీద మాత్రమే ఆధారపడదు...* 


*ఏకాగ్రతతో కూడిన ధ్యానం అమ్మవారి కటాక్షము ఈ రెండూ లేకుండా సాక్షాత్కారం జరగదు.*  


*సీత వెతికితే కనబడలేదు. ప్రార్ధిస్తే కనపడింది.*.. రెండిటికీ తేడా ఉంది. అది తెలుకోవాలి. వాల్మీకి రామాయణం లో ఈవిషయం స్పష్టంగా వ్రాశాడు. ఆయన ఇంతవరకు మాత్రమే వ్రాసి వదిలి పెట్ట లేదు. 


*భక్తి లేకుండా కేవలం శక్తి మీద ఓపికమీద ఆధారపడి  వెతకడం  చేస్తే సీత కనపడదు మండోదరి కనిపిస్తుంది అని కూడా వాల్మీకి మహర్షి స్పష్టం చేసి పెట్టారు...*


ఇదంతా చెప్పిన తరవాత ఒక జాగ్రత్త పడాల్సిన విషయం చెప్పాలి.


*నిత్య పూజా, నియమ బద్ధమైన నడవడికా, ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా అవసరము. అది మొదటి మెట్టు. ఆ మెట్టు దాటకుండా ఎవరూ పైకి పోలేరు. పైకి పోవడ మనేది చాలా జన్మ ల లో జరగాల్సిన విషయం.  ప్రహ్లాదుడు ధ్రువుడు కర్మ మార్గం లో ప్రయాణించ లేదు కదా వాళ్ళ సంగతేమిటి అంటారేమో! వాళ్ళు ఆ జన్మలు దాటి వచ్చిన వాళ్ళు. వాళ్ల తో మనకు పోలిక వద్దు.*


ఏకాగ్రతతో కూడిన ధ్యానం అన్నారు కదా అని చేసే పూజలూ నియమాలు పక్కనబెట్టి ఆ కొస మెట్టు కు సూటిగా ఎగిరి పోదామంటే కుదరదు. నేను చాలా వేదాంత గ్రంధాలు చదివాను. జ్ఞానం ఉంది. నాకు నియమాలు పూజలూ అక్కరలేదు. కర్మలు చెయ్యను. అంటే వీలు పడదు. భక్తి మార్గం  జ్ఞాన మార్గం ఏదో ఒకటే పట్టుకు కూర్చుంటాను అంటే వీలుకాదు.   ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తుంది.   జీవితం లో నిత్య పూజా, నియమ బద్ధమైన నడవడికా తప్పకుండా ఉండాలి. వాటితో పాటు ఉపాస్య దేవత మీద భక్తి, శ్రద్ధ, దాస  భావం కూడా ఉండాలి. సత్కర్మలు చెయ్యాలి. భగవ దర్పితంగా కర్మలు చెయ్యాలి. ఇది బాగా అలవాటయితే నిష్కామకర్మ దగ్గర కు రావచ్చు. 


*కర్మలు చెయ్యకుండా జ్ఞానాన్ని భక్తిని అందులో ఏదో ఒక దానిని, పట్టుకుని పైకి వెళదామను కుంటే అది సాధ్యం కాదు...*


లంకకు వెళ్ళకుండా అసలు  ప్రయత్నమే చేయకుండా ఏమీ వెతక కుండా,  ఆంజనేయుడైనా సముద్రం ఇవతలి గట్టు  దగ్గర కూర్చుని  "తదున్న సం పాండుర దంత మవ్రణం" అంటే సీత కనబడదు కదా. దేవుడి విషయంలో shortcuts వెతికే వాళ్లు ఇది తెలకోవాలి. 

🌹🌷🌿🍁🍁🌿🌷🌹

సాధనమున పనులు

 ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే 👉 "నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు" అని ప్రకటించాడు.


రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా, అప్పుడు ఇంద్రుడు "సరే... పరమ శివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే, అప్పుడు వర్షం కురుస్తుంది" అని వరమిచ్చినట్టే ఇచ్చి, *వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరుకం వాయించ వద్దని రహస్యంగా శివునికి చెప్పాడు*. 


రైతులు పరమ శివుడి దగ్గరకు వెళ్లి ఎంత బతిమాలినా... పన్నెండు సంవత్సరాల తరువాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు.


రైతులు ఏమి చేయాలో తెలియక, పన్నెండు సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు. 


కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే వున్నాడు.


మూడు సంవత్సరాల తర్వాత, ఎప్పటి లాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారు అందరూ కలసి వెళ్లి "వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియూ శ్రమ వృధా చేస్తున్నావూ" అని అడగ్గా...


దానికి ఆ రైతు "వర్షం లేకుంటే పంట పండదు అని నాకూ తెలుసు, కానీ తీరా పన్నెండు సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మరిచి పోకుండా వుండేటందుకే ఈ పనులు చేస్తున్నాను" అని చెప్పాడు. 


ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి... తమరు డమరుకం వాయించడం మరచి పోలేదు కదా, అన్నది చమత్కారంగా. 

అంతట పరమ శివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు.


తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా... మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది.


కాబట్టి మిత్రులారా...... 


ఈ లాక్ డౌన్ ఎత్తి వేయడానికి వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, లేదా సంవత్సరం పట్టొచ్చు. కానీ మనం ఏ వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా దానికి సంబంధించిన విషయాలలో *(లాక్ డౌన్ తో సంబంధం లేకుండా)* నైపుణ్యాన్నీ మరియూ జ్ఞానాన్నీ పెంచుకునేందుకు  నిరంతర ప్రయత్నం చేయాలి. 


ముగింపు : ఎదురు చూస్తూ సమయం వృథా చేయకుండా... రేపటి రోజున (లాక్ డౌన్ ఎత్తి వేసిన రోజున) ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి.


                  *******


*"సాధనమున పనులు సమకూరు ధరలోన"*


😊 😊 😊 😊 😊 😊 😊 😊