19, ఫిబ్రవరి 2022, శనివారం

ఇంద్రుని శాపవిముక్తి

 _*మాఘమాసం*_

      🍁 _*శనివారం*_🍁

🎋_*ఫిబ్రవరి 19వ తేది 2022*_🎋


    _*🚩మాఘ పురాణం🚩*_

🌴 _*18 వ అధ్యాయము*_🌴


🕉🌹🍁🍁🍁🍁🌹🕉️


*ఇంద్రుని శాపవిముక్తి*


☘☘☘☘☘☘☘☘


శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా ! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు మాఘస్నానము , పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును. మాఘ వ్రతము నాచరించినవారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.


మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది.  పర్వతములలో మేరువు గొప్పది. అన్ని  దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి , గంగా , కావేరీ ఇలా సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము , మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ  మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును , అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను.


దేవతలు విష్ణువాక్యమును శిరసా వహించి ఇంద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి చిన్న పాదములు , పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.  ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.


పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కౌరించి యిట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి *"మనుష్య జన్మము కష్ట ప్రదము , స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను , ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటమేలని"* తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.


నేనును బంధువుల వద్దనుంటిని , వారి నిరాదరణ ఫలితముగ చూచువారెవరును లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి , వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని. ధనమును దాచి సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు , నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని , తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.


పులి , కోతి , ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనొందితిని , పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టితిని , ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాపవిముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికారరూపముతో తిరుగుచున్న ఇంద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను , లోనికిపారిపోయెను. దేవతలు ఇంద్రుని జూచి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను , ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.


ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా జహ్నుముని , స్వామీ ! యీ విష్ణు కథామృతము ఇంకను వినవలెననున్నది ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతడు చేయలేదు. పూజ , దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్త్యమును వివరించుచుండెను , అతదు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునకుపోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను , చేయకపోవుటవలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన , మాఘ స్నానము వలన వాని పిశాచరూపముపోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

స్త్రీ ప్రసవించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు

 స్త్రీ ప్రసవించుటకు ముందు కనిపించే చిహ్నములు  - ప్రసవ సమయము నందు తీసుకోవలసిన జాగ్రత్తలు .


 *  మూత్రకోశము నందు దురద లేక మంట కలుగును. పొత్తికడుపు నందు నొప్పి కలుగును.


 *  మాటిమాటికి మూత్రం మరియు మలం విసర్జించవలెను అని అనిపిస్తూ ఉంటుంది.


 *  శరీరము నందు వణుకు , ఎత్తివేస్తున్నట్లు అనిపిస్తుంది.


 *  యోని రంధ్రము నుండి రక్తం కారును .


 *  వాంతి కలుగును. ఇలా వాంతి అవ్వడం మంచిది .


 *  కడుపునొప్పి పై కడుపు నుండి ప్రారంభం అయ్యి పొత్తికడుపునకు దిగును . ప్రారంభము నందు నొప్పి కొద్దిగా ఉండి రానురాను ఎక్కువ అగును. నడుముకు , వీపుకు ఎక్కువుగా ఉండును.


         ప్రసవం ఏర్పడుటకు వారం ముందైనను లేక రెండు వారములకు ముందైనను ప్రసవవేదన వంటి వేదన కలుగును. దీనిని కృత్రిమనోప్పి అంటారు. నిజమైన ప్రసవవేదన కలిగినచో స్త్రీలు వంపుకలిగిన కుర్చీమీద కూర్చోవచ్చు. అటుల సాధ్యం కానిచో బాగుగా పడుకోవడం మంచిది . ప్రసవవేదన కలిగిన వెంటనే మాటిమాటికి మలమూత్రములు విసర్జించుచుండవలెను. ఇలా జరగటం చాలా మంచిది . ప్రసవించుటకు పూర్వం కడుపు నందు మలమూత్రములు లేకుండిన సుఖప్రసవం కలుగును. ప్రసవవేదన పడున్నప్పుడు ఆహారం ఇవ్వరాదు. అటువంటి సమయంలో ఆహారం ఇవ్వవల్సివచ్చినచో తేలికైన ఆహారం మాత్రమే ఇవ్వవలెను. త్వరగా జీర్ణం అయ్యేలా ఉండవలెను . దాహమునకు కావలిసినంత చన్నీటిని మాత్రమే ఇవ్వవలెను.


              ప్రసవవేదన కలిగినప్పుడు ప్రసవించబోవు స్త్రీ తనకు నడుచుటకు శక్తి సరిపోవునంత వరకు అటుఇటు సంచరించవలెను. అటుల సంచరించు సమయంలో శిశువు బయటపడుటకు ప్రయత్నించుచున్నది అని తోచినచో పడక మీద కూర్చోండవలెను. అప్పుడు వాంతి అయినచో శిశువు బయటకి రావడానికి ప్రయత్నించుచున్నది అని తెలుసుకొనవలెను. కొందరు ఈ సమయమున గట్టిగా ముక్కినచో శిశువు బయటకి వచ్చును అని భావిస్తారు. కాని ఇలా చేయుట వలన ఇటువంటి ప్రయోజనం ఉండదు. ఇలా చేయుటవలన ప్రసవ సమయము నందు ఒక్కోసారి మూర్చ రావడానికి అవకాశం కలదు. ఈ విషయములో తగుజాగ్రత్త తీసికొనవలెను.


     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

భూచక్రగడ్డ

 భూచక్రగడ్డ విశేషాలు -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు. నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

స్పాండిలైటిస్

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. మీరు సంప్రదించవలసిన ఫొన్ నంబర్ 9885030034 . ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

కాశీ యాత్ర

 కాశీ యాత్ర డిసెంబర్ 2021 అప్డేట్..


01.కాశీ లో బెనారస్ రైల్వే స్టేషన్ నుండి రామతారక ఆంధ్రాశ్రమం కు   ఒక ఆటో కి 200 రూపాయలు తీసుకుంటారు.. ఒక ఆటో లో 4 గురు నుండి 5 వరకు వెళ్ల వచ్చు..

నోట్: అయతే ఆటో వాలకి  ఆంద్ర ఆశ్రమం అంటే తెలీదు బెంగాలీ టోలి స్కూల్ అని  చెబితే అక్కడ దించుతారు .. అక్కడ నుండి  నడుచు కుంటూ రామతారక ఆంధ్రా అశ్రమం  మరియు సైకిల్ బాబా అశ్రమం కి వెళ్ల వచ్చు... 


★అశ్రమం లో ఎవరు రూమ్ తాళం వారే కోనుక్కోవాలి... మీరు ఇంటి దగ్గర నుండే తాళంఉంటే  తీసుకొని వెళ్ళటం మంచిది.. అలాగే రూమ్ స్ లోపల సెల్ ఫోన్ ఛార్జ్ లు పెట్టటానికి బోర్డ్ లు ఇబ్బంది గా ఉంటే ముందుగానే మీ వెంట ప్లస్ బాక్స్ ని మీ ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్ళటం మంచిది ఒకే సారి రెండు మూడు సెల్ ఫోన్ ఛార్జింగ్ లు పెట్టుకోవచ్చు.. అశ్రమం లో కి వేడి నీళ్లు కెటిల్ కూడా తీసుకొని వెళ్లొచ్చు.. 


★ఆంధ్ర అశ్రమం లో రూమ్  లు కాలి లేక పోతే దాని బ్రాంచు కైలాస్ భవనం ఉంటుంది.. అక్కడ రూమ్ లు ఇస్తారు..ఈ కైలాష్ భవనం కొంచెము పురాతనమ్ గా ఉంటుంది.. 

★ఆంధ్ర అశ్రమం లో ఒక వేళ రూమ్ దొరికే మద్యాహ్నం భోజనమ్ మరియు రాత్రి కి టిఫిన్ ఫ్రీ గా ఇస్తారు.... ఒక రూమ్ లో 4 వరకు వుండొచ్చు..  అయితే రోజుకు 300  రెంట్  పడుతుంది.. చిన్న పెద్ద రూం లు బట్టి రెంటు మారుతూ వుంటుంది... 

★ఈ ఆంధ్ర అశ్రమం మానస సరోవర్ ఘాట్ కి ఎదురుగా  ఉంటుంది... ఫోన్ నెంబర్: 05422450418..


★కాశీ  లోకల్లో  టెంఫుల్స్  తిరగటానికి ఆటో కానీ సుమో కానీ మనిషి కి 100 రూపాయలు లేదా 150 వరుకు  తీసుకుంటారు ...6 నుండి 7 వరకు వెళ్లొచ్చు   ఆ ఆటో వాళ్ళు వ్యాస కాశీ తో పాటు తులసి మందిర్ ,కినారం బాబా అశ్రమం , హనుమాన్ టెంపుల్, తిలబండేశ్వర్ మందిర్, కాలభైరవ మందిర్ , మహా మృత్యుంజయ మందిర్, బిందు మాధవి మందిర్, గవ్వలమ్మ గుడి .అయితే ఇవన్నీ ముందుగానే ఆటో వారితో మాట్లాడుకోవాలి...


★కాశీ లో  దేవతా దర్శనాలు 


01. ముందుగా కాలభైరవ సామీ ని దర్శనమ్ చేసుకున్నాక విశ్వనాథ మహా రాజు ని దర్శనమ్ చేసుకోవాలి... 

02. కాశీ విశ్వనాధ మహరాజ్ 

03.కాశీ విశాలాక్షి అమ్మవారు 

04.కాశీ అన్న పూర్ణ అమ్మవారు 

05.సాక్షి గణపతి 

06.దుండి గణపతి 

07.వారాహి అమ్మవారు 

08.సంకట విమోచన ఆంజనేయ స్వామి 

09.తిలబండేశ్వర్ స్వామి 

10.మహా మృత్యుంజయ టెంపుల్

11.సూర్య దేవుడు లోలార్క్ కుండం 

12.గవ్వలమ్మ గుడి 

13.బిందు మాధవ్ మందిర్ 

14.గంగా హారతి 

15.కెదారేశ్వర్ మందిర్ 

16.మణి కర్ణిక ఘాట్ (ఈ మణి కర్ణిక ఘాట్ లో మద్యాహ్నం 12 గంటలకు స్నానం చేస్తే దేవతలు వచ్చి వుంటారు అని నమ్మకం)


★కాశీ విశ్వనాధ్ మందిరం లోకి సెల్ ఫోన్ లు మరియు పెన్ లు కూడా తీసుకొని వెళ్ల నీయరు.. ముందుగానే లాకర్ లో పెట్టుకొని వెళ్ళాలి.. లాకర్ ఫ్రీ గా ఇస్తారు కానీ వాళ్ల దగ్గర బిల్వ పత్రం , పాలు కొనాలి.. 50 రూపాయలు వరుకు ఉంటుంది... 


★ కాశీ అన్న పూర్ణ అమ్మ  భోజన శాలలో  ఉదయం 9 గంట లనుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత అన్న ప్రసాదం (భోజనం )  పెడతారు... 


★ గంగా హారతి  సాయంత్రం 6.15 ని: లకు  దశాశ్వమేధ ఘాట్ లో  నిర్వహిస్తారు... 


★కాశి లో బోటు లో మణికర్ణిక ఘాట్ నుండి హరిచంద్ర  ఘాట్ లు వరకు మనిషి కి 150 నుండి అడుగుతారు (సాగర్ బోటు సర్వీస్. బోటు డ్రైవర్ మధన్  (ph: 9918167514, 9839092882 ) 


★కాశీ నుండి ప్రయాగ (త్రివేణి సంగమం )

అశ్రమం నుండి వెహికల్ బుక్ చేసుకొని వెళ్లొచ్చు..(తేదీ 06.12.2021 ) తేదీ నాటికి రేట్లు  ఆంధ్ర అశ్రమం నుండి  తుపాన్ వెహికల్ కి   4000 రూపాయలు తీసుకున్నారు .. అయితే దీనిలో 12నుండి 13  మంది వెళ్లొచ్చు.. అంటే ఒక మనిషి కి 350 రూపాయలు పడుతుంది.. అయితే 

ఈ ప్రయాగ ట్రిప్ లో   త్రివేణి సంగమం తో పాటు 

అష్టాదశ శక్తి పీఠాలు లో ఒకటి అయిన మాధవేశ్వరి అమ్మవారి ని , ఆనంద భవన్ (నెహ్రు ఇల్లు ), సీత మండి, వాల్మీకి అశ్రమం  చూపిస్తారు..ప్రయాగ లో బోటు కి ఒక మనిషి కి 200/రూ వరుకు డిమాండ్ చేస్తారు కానీ  150 రూపాయలు  కి మాట్లాడొచ్చు .... 

 మధ్యలో బోజనమ్ కి ప్రయాగ లో  దర్గంజ్ రైల్వే స్టేషన్ దగ్గర లో  తులసి మట్ అనే సత్రం (బాలాజీ మీల్స్ )(Ph.09793619980, 9839517333) ఉంటుంది.ఇక్కడ  ఆంధ్ర భోజనం దొరుకును..మనిషికి 100 రూపాయలు ..


★కాశీ నుండి గయ 

కాశి నుండి గయ తుపాన్ వెహికల్ కి 12 నుండి 13 మందికి 7500/రూపాయలు( తేదీ డిసెంబర్ 2021 నాటికి) తీసుకుంటారు...

గయ లో పంతులు గారు కి ప్యాకేజి ఉంటుంది. ఒక మనిషికి పిండానికి 1200 /రూపాయలు మరియు భోజనానికి 120 /రూ. తీసుకున్నారు.. ఇప్పుడు ఇంకా పెరగొచ్చు .మరియు పిండం పెట్టె టప్పుడు పంతుళ్ళు 200/రూ. నుండి 500/రూ. వరకు గుంజేస్తారు... 

గయలో పిండ ప్రధానం మరియు విష్




నేను కూడా హిందువును

 *బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేసే పార్టీలన్నీ, బీజేపీని హిందూ మతతత్వ పార్టీ అన్నాయి, అంటున్నాయి, కానీ నేను కూడా హిందువును అని చెప్పుకుబతికే సూడో సెక్యులర్ మేదవీ మాత్రం గుర్తించడం లేదు*


*మరి ఇప్పుడు ఆ పార్టీలన్ని ఏకమై బీజేపీ రహిత భారతాన్ని తయారు చేస్తాయంటా, అందుకు అబద్దాలు ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకునే మీడియా కూడా తనవంతు సహకారాన్ని అందిస్తునే ఉంది*


*ఇన్ని రోజులు వీరంతా బీజేపీ కి వ్యతిరేకం అనుకున్న, కానీ వీరంతా హిందువులకు వ్యతిరేకంగా పనిచేయడానికి కంకణం కట్టుకున్నారని తెలుసుకోలేక పోయాను*


*జిహాదీలు చెపుతునే ఉన్నారు మోడి, యోగి పోతే మిమ్మల్ని రక్షించేవారెవరు అని, అందుకు అనుగుణంగా బీజేపీ రహిత భారతాన్ని నిర్మిస్తామని శపథాలు చేస్తున్న ప్రతిపక్షాలను చూస్తుంటే,* 


*వారందరు కలసి హిందూ రహిత భారతానికి పునాదులు తవ్వుతున్నారని అర్థమవడంలేదా*


*ప్రతి పక్షాలే అరుస్తున్నాయి, బీజేపీ హిందూ పార్టీ అని, మరి ఆ పార్టీని అంతం చేయడమంటే అందరు కలసి హిందువుల అంతం కోరుకుంటున్నారు అని అర్థం చేసుకోలేని మేధావుల్లారా*


*నీవు, నీ కుటుంబముతో ఆనందముగా ఉన్న రోజే నాది ఈ కులము, నాది ఈ పార్టీ, నాకు ఇంత ఆస్తి ఉంది అని నీ వారితోనే పోట్లాడతావు*


*నీ హిందుత్వమే నాశనము చేసిన తరువాత నీకు కులం అనేది ఉంటుందా, నీ ఇంటి మహిళపై, కాశ్మీర్ లోని మహిళలపై జరిగిన అకృత్యాలు జరగకుండా కాపడుకోగలవా, నీ ఆస్తి, వృత్తి, వ్యాపారం, పార్టీ, వాటిని చూసుకుని పొందుతున్న గర్వం అన్నీ నిమిషాల్లో, నీ కళ్లముందు నాశనం అయిపోతాయి*


*సెక్యులర్ మత్తులో ఉన్న నీకు వాస్తవాలు అవగతం కావడం లేదు, అవగతమైన రోజు నిన్ను ఓదార్చడానికి నీ కుటుంబ సభ్యులు కూడా మిగలరు జాగ్రత్త*


*నేనూ హిందువునే, నా అంత భయంకరమైన హిందువులా మీరు అని చెప్పుకోవడంకాదు,* 


*కాశ్మీర్, బెంగాల్, కేరళ పరిస్థితి భారతదేశం అంతటా తీసుకురాకు అని చెపుతున్నా, నీ పదవీ కాంక్షకో, మరేదైనా ప్రలోభాలకో నీ కుటుంబాన్ని, పరువు మర్యాదలు, తాకట్టు పెట్టవద్దని హెచ్చరిస్తన్న*


*.... ఇది జరగబోయే వాస్తవం అని నమ్మితే, 🚩హిందువుగా🚩 బతకాలి అనుకుంటే మరో 🚩హిందువును🚩 హెచ్చరించు మిత్రమా*


*భారతీయ సంస్కృతిని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుదాం - మన కులాన్ని, మన కుటుంబాన్నీ రక్షించుకుందాం*


*🚩జాగో అవుర్ జగావో హిందూ🚩*

స్వభావసిద్ధము

 శ్లోకం:☝️

*సతాం ధనం సాధుభిరేవ భుజ్యతే*

*దురాత్మాభి ర్దుశ్చరితాత్యావాం ధనం l*

*పికాదయా శ్చూతఫలాని భజంతే*

*భవన్తి నింబాః ఖలు కాక భోజనాః ll*


భావం: పక్షులు గ్రహించే ఆహారంలో తేడాలకు వాటి స్వభావాలే కారణం కాబోలు లేకుంటే మరేమిటి చిలుకలు - కోయిలలు మామిడి పళ్లను ఆశిస్తే, కాకులు చేదుగా ఉండే వేప పళ్లను తినడమేమిటి అంటే మంచి వారికి మంచి అభిరుచులు, చెడ్డవారికి చెడ్డ అభిరుచులు స్వభావసిద్ధము అనడానికి ఇది తార్కాణంగా చెప్పవచ్చు.

causes of mental confusion

 Very Useful !!☺


By Arnaldo Liechtenstein, physician:

"Whenever, I teach clinical medicine to students in the fourth year of medicine, I ask the following question: 


"What are the causes of mental confusion in the elderly?"

Some answer: "Tumors in the head". 

 

I answer: No!

 

Others suggest: "Early symptoms of Alzheimer's". 

 

I answer again: No!

  

With each rejection of their answers, their responses dry up.

 

And they are even more open-mouthed, when I list the three most common causes:


- uncontrolled diabetes

- urinary infection

- dehydration

  

It may sound like a joke; but it isn't. 

 

People over 60 generally stop feeling thirsty and consequently, stop drinking fluids.

When no one is around to remind them to drink fluids, they quickly dehydrate. 

 

Dehydration is severe and affects the entire body. It may cause abrupt mental confusion, a drop in blood pressure, increased heart palpitations, angina (chest pain), coma and even death.

  

This habit of forgetting to drink fluids, begins at age 60, when we have just over 50% of the water we should have in our bodies.  

People over 60 have a lower water reserve. This is part of the natural aging process.

  

But there are more complications. Although they are dehydrated, they don't feel like drinking water, because their internal balance mechanisms don't work very well.

 

Conclusion:

  

People over 60 years old dehydrate easily, not only because they have a smaller water supply; but also because they do not feel the lack of water in the body.


Although people over 60 may look healthy, the performance of reactions and chemical functions can damage their entire body.

  

So here are two alerts:


1) Get into the habit of drinking liquids. Liquids include water, juices, teas, coconut water, milk, soups, and water-rich fruits, such as watermelon, melon, peaches and pineapple; Orange and tangerine also work.

  

The important thing is that, every two hours, you must drink some liquid. 


Remember this!

 

2) Alert for family members: constantly offer fluids to people over 60. At the same time, observe them.

  

If you realize that they are rejecting liquids and, from one day to the next, they are irritable, breathless or display a lack of attention, these are almost certainly recurrent symptoms of dehydration.

 

Inspired to drink more water now?? 

Send this information out to others! DO IT NOW! Your friends and family need to know for themselves and help you to be healthier and happier.

  

*It's good to share for people over 60*

పంచపాత్ర

 *పంచపాత్ర.*


పంచపాత్ర అనేది ఒక పాత్ర కాదు. ఆరాధన సమయంలో ఐదు పాత్రల్లో శుద్ధోదకం తెచ్చుకోవాలి. అయితే సాధారణంగా ఒకే పాత్రలో అన్నీ ఉంచి, ఏదో మమ అనిపించేస్తాం.


*01. అర్ఘ్య పాత్ర*

భగవంతుని హస్తాలు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాల పాత్ర.


*02. పాద్య పాత్ర.*

స్వామి వారి పాదాలను శుభ్ర పరిచే శుద్ధ జలాల పాత్ర.


*03. ఆచమనీయ పాత్ర.*

భగవంతుడు పుక్కిలించడానికి ఉపయోగించే జలాల పాత్ర.


*04. స్నాన పాత్ర.*

స్వామి వారి స్నానార్థం ఉపయోగించే  జాలాల పాత్ర.


*05. శుద్ధోదక పాత్ర.*

భగవదర్పితంగా సమర్పించే జలాల పాత్ర.


ఈ ఐదింటినీ పంచపాత్రలు అంటారు.


ఇవి గాక షోడశోపచారాలు చేశాక తీసిన నిర్మాల్య జలాలు నింపే పాత్రను ప్రతి గ్రాహక పాత్ర అంటారు. మరిన్ని నీళ్ళు అవసరమైతే సిద్ధంగా ఉంచుకొన్న జలాల పాత్రను శుచ్చ జలపాత్ర అంటారు. 


ఆచార్య పూజ చేయడానికి ఉపయోగించే జలపాత్రను ఆచార్య పూజా పాత్ర అంటారు.


*శుభంభూయాత్.🙏*

అవధూత

 *ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు* 


అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.


అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు, సన్యాసి అంటే ఎవరు, సన్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాము.


సన్యాసం నాలుగు రకాలు 


*వైరాగ్య సన్యాసం* 

వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది.

ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు.అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.


*జ్ఞాన సన్యాసం* 

సత్ సాంగత్యం ద్వారా, లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ,ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు.


*జ్ఞాన వైరాగ్య సన్యాసం* 

సాధన ద్వారా, ధ్యానం ద్వారాఅభ్యసించి తనకు తానూ అన్వయించుకునినిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు.


*కర్మ సన్యాసం* 

బ్రహ్మ చర్యము, గృహస్త, వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ, ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం.



ఈ సన్యాసులు ఆరు రకాలు 


*కుటిచకుడు* 

శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.


*బహుదకుడు* 

ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు.


*హంస*

ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.


*పరమహంస* 

వెదుర దండాన్ని కలిగి, ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధన లో ఉంటారు.


*తురియాతితుడు*

దేహాన్ని ఓ శవంలా చూస్తాడు.


*అవధూత* 

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్ మిధ్య నేను సత్యం అంటూ,నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము,అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికిఅగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూరాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.


కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు... ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )

BORO SAFE

 

పైన చూస్తున్న మందు పేరు BORO SAFE ఇది పతంజలి కంపెని ఉత్పాదన ఇది మీ ఇంట్లో ఉన్నదా? లేకపోతె తక్షణం ఈ రోజే ఒకటి తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచుకోండి. ఎందుకంటె ఇది ప్రతి ఇంట్లో వుండదగ్గ మెడికల్ క్రీము

దీని ధర కేవలము 45 రూపాయలు ఇది 50గ్రాముల ట్యూబుగా లభ్యం. 

మనకు సాధారణంగా చిన్న చిన్న గాయాలు లేక చేతిమీదో కాలిమీదో వేడి నూనో లేక మరొకటో అంటుకొని బొబ్బలు రావటం సర్వ సాధారణమైన విషయం. అప్పటికప్పుడు మెడికల్ షాపుకి వెళ్లే దానికన్నా ముందుగానే  కొనుక్కోవటం శ్రేయస్కరం కదా. 

మాయింట్లో Barnaul cream, Boroline cream వుంది అని మీరు అనవచ్చు ఈ క్రీము వాటికన్నా బేషుగ్గా పనిచేస్తుంది. అంతే కాదు ధరకూడా వాటితో పోలిస్తే తక్కువ మరియు మంచి సువాసన కలిగిన క్రీము. నేను చెప్పటం మరిచాను కాళ్ళ పగుళ్ళకు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది. మిత్రులందరూ ఈ క్రీము కొనుక్కొని అవసరానికి వాడుకోవాలని కోరుకుంటున్నాను 

ఇట్లు 

మీ భార్గవ శర్మ

డాక్టర్ బీ. సీ. రాయ్🙏🏻

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.


తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.


డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?"


డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.


మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"...


తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే.. నువ్వు శాంతంగా ఉండగలవా?"


డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "మన పవిత్ర వేద గ్రంధాలలో ఉన్నది ఒకటి చెప్పనా..  'మనం మట్టి నుండే వచ్చాం. మట్టిలోకే వెళ్ళిపోతాం.


అదంతా ఆ భగవంతుని మాయాలీలలు.  డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్లి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి.


నేను చెయ్యవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను.


తండ్రి కోపంతో రగిలిపోతూ "మనది కానప్పుడు సలహాలు ఇవ్వటం చాలా తేలిక" అంటూ గొణుకుంటున్నాడు.


డాక్టర్ కొన్ని గంటల తరువాత వచ్చి తండ్రితో "భగవంతునికి ధన్యవాదాలు... మీ కొడుకు ఇప్పుడు క్షేమం. మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఆ నర్స్ తో చెప్పండి."


అని.. ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్ళిపోయాడు.


తండ్రి నర్సుతో ఈ డాక్టర్ ఎందుకు* *ఇంత కఠినాత్ముడు. కొన్ని నిముషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు.


నర్స్ కొన్ని నిముషాల తరువాత ... కన్నీళ్ళతో "ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్ ఆక్సిడెంటులో చనిపోయాడు.


మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు.. స్మశానంలో ఉన్నారు. మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి, మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చెయ్యటానికి మళ్ళీ స్మశానానికే వెళ్లారు" అని చెప్పింది.


ఆయనే డాక్టర్ బీ. సీ. రాయ్🙏🏻


                        **     **   **  


స్మరించుకోదగ్గ...తెలుసుకోదగ్గ మహనీయులు..

చరిత్రలో‌ ఒకేసారి వైద్య వృత్తికి సంబందించిన FRCS, MRCP పట్టాలు పొందిన అతి కొద్ది మందిలో వీరొకరు.  ఈయన West Bengalకి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు.


       

                         **    **    **


కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల భాధ్యతని,  గౌరవాన్ని పెంచుతాయి.‌ ప్రపంచంలో మంచీ చెడు రెండూ ఉన్నాయి.  మన భాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే...

అలంటి డాక్టర్లను సమాజం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. వారు సదా స్మరణీయులు.

నిజానికి ఇటువంటి డాక్టర్లు ఇప్పుడు వున్నారా అంటే దాదాపు లేరనే చెప్పాలి, ఎక్కడో కానీ వృత్తి పట్ల గౌరవం, సమాజం పట్ల శ్రర్ధ వున్నవారు అరుదుగా తారస పడతారు. చాలామంది డాక్టర్లు రోగులకు అవసరం వున్నా లేకున్నా ఎన్నో టెస్టులు వ్రాసి వాటి రిపోర్టులు చూసి మీకు ఆ లోపం వుంది ఈ లోపం ఉందని చెప్పి అనేక రకాల మందులు వ్రాసి రోగుల జేబులు గుల్ల చేయటమే కాక వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. చిన్న చిన్న రుగ్మతలకు కూడా చాల ఖరీదైన ఆంటిబయోటిక్స్ వ్రాస్తూన్నారు దానివల్ల అప్పటికి ఆ రోగం వెంటనే తగ్గినా ఆ మందుల ప్రభావం రోగి శరీరంలో వుంది రేపు ఏదైనా పెద్ద రోగం వస్తే ఆ మందులు పనిచేయని పరిస్థితి కూడా ఉండవచ్చు. 

నేను విన్న ఒక వృత్తాంతం ఇక్కడ వ్రాయదలచుకున్నాను. 

నా మిత్రుడు చెప్పినది ఏమంటే విజయవాడ వైపు వెళ్లే ఒక బస్సులో ఒక ధనిక వ్యాపారవేత్త ప్రయాణిస్తున్నాడట.  ఆ బస్సు బయలుదేరి చిన్నగా ట్రాఫిక్లో వెళుతుంటే అతనికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ కనపడింది బస్సు కూడా ట్రాఫిక్ వల్ల నిదానంగా వెళుతున్నది. కండక్టర్ని అడిగి అతను అక్కడ దిగి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకుందామని ఆ హాస్పిటల్లోకి వెళ్ళాడు.  రెసిపీషనిస్టు కన్సల్టేషన్ ఫి తీసుకొని ఒక డాక్టరు వద్దకు పంపింది సదరు డాక్టరుగారు మన ఆసామి వాలకం చూసి పెద్ద చేప వలలో పడ్డదని మీకు హార్టులో ప్రాబ్లమ్ వుంది అని టెస్టులు వ్రాసారు. ఒక గంట తరువాత రిపోర్టులు వచ్చాయి. అవి చూసి డాక్టరు గారు మీరు చాలా అదృష్టవంతులు తొందరగా వచ్చారు లేకపోతె మీరు రెండు మూడు రోజుల్లో చనిపోగలరు అని భయపెట్టి మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని సూచించారు. దానితో మన వ్యాపారవేత్తకు కళ్ళు తిరిగాయి అయ్యా నేను పూర్తిగా ఆరోగ్యంగా వున్నాను బస్సులో హాస్పిటల్ బోర్డు చూసి సాధారణ చేకుప్ కోసం దిగాను నిజానికి నాకు ఎలాంటి యిబ్బంది లేదని అంటే అప్పుడు సదరు డాక్టరు గారు మీకు తెలియంది గుండె జబ్బులు మీకు ఎలాంటి సింటమ్స్ లేకుండానే వస్తాయి. ఇప్పుడు మీకు ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేయకపోతే వెంటనే చనిపోతారని భయపెట్టాడు.  చేసేది లేక తన దగ్గర వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న రెండు లక్షలు హాస్పిటల్లో కట్టి ఆపరేషన్కి తయారయ్యాడు. మిగితా డబ్బులు తీసుకొని రమ్మని మీ వాళ్ళకి ఫోన్ చేయండి అని రిసిప్షనిస్ట్ చెపితే ఫోన్ చేసి మరుసటి రోజు అంతా (పీ ఎంతోనాకు చెప్పలేదు) కట్టారు. ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు.  హమ్మయ్య ఇక నాకు ఏ ప్రమాదం లేదనుకొని సదరు వ్యాపారవేత్త తాన ఊరికి వెళ్ళిపోయాడు. పూర్తిగా కోలుకోవటానికి ఒక నెల పట్టింది. 

ఎందుకైనా మంచిదని తన కుటుంబ MBBS డాక్టర్కి జరిగినది అంతా వివరించి తన వద్ద వున్న రిపోర్టులు అన్ని చూపించి నేను హైదరాబాదులో ఉండబట్టి సరిపొయిన్ది ఇక్కడే ఉంటే నా పని ఏమయ్యేది అని అన్నాడు. సదరు డాక్టరు ఆ రిపోర్టులు అన్ని కీలంకుశంగా చూసి ప్రశ్నర్ధకంగా ముఖం పెట్టాడు.  ఏమిటని వ్యాపారవేత్త అడిగితె అయ్యా మీకు ఎలాంటి హార్ట్ సమస్య లేదు అన్ని రిపోర్టులు బాగున్నాయి. మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఎందుకు చేసారో నాకు అర్ధం కావటం లేదు అని అన్నాడు. అప్పటినుండి తానను  హైదరాబాదు డాక్టరు మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజడని తెలుసుకొని మనస్తాపానికి గురి అయ్యి రెండు నెలలకు మనోవ్యాధితో మరణించాడట. 

ప్రస్తుతం ధనవంతులు పెద్ద పెద్ద హాస్పిటళ్లు కట్టి అధునాతనమైన వైద్య పరికరాలను లక్షలు, కోట్లు పోసి కొని వున్నారు. వారికి సరైన రిటర్న్స్ రాకపోతే వారి పెట్టుబడి నష్టపోతారని డాక్టర్లను అవసరం వున్నా లేకున్నా అనేక టెస్టులు వ్రాయాలని అందులో వాళ్లకు కమిషన్ ఇస్తామని మభ్యపెట్టి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు మనం అనేక వార్తల్లో చూస్తున్నాము. 

వైద్యో నారాయన్హరిః అన్నారు అంటే వైద్యులు సాక్షాత్తు నారాయణ స్వరూపులని ఆర్యోక్తి.  కానీ ప్రస్తుతం వారు యమధర్మరాజు స్వరూపాలుగా మారుతున్నారు. 

సమాజానికి వైద్యులు మంచి సేవలు అందించాలని ఆశిద్దాం.





ప్రశ్న పత్రం సంఖ్య: 38

 ప్రశ్న పత్రం సంఖ్య: 38 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) మహిళలు పేరంటానికి వెళ్ళితే కాళ్లకు ఇది రాస్తారు

i ) కుంకుమ ii ) పసుపు iii )సున్నిపిండి iv ) ఆముదం. 

2) ఇంట్లో ట్యూబెలైటు చెడిపోతే ఇతనిని పిలుస్తాము 

i ) తాపీ మేస్త్రి ii ) ప్లంబర్  iii ) కార్పెంటర్ iv ) ఎలక్ట్రీషన్

3) నాలుగు వేదాలలో ఒక్క వేదానికి మాత్రం రెండు భాగాలు వున్నాయి అది  

i ) సామవేదం    ii ) ఋగ్వేదం  iii ) అధర్వణ వేదం iv ) యజుర్వేదం

4) రామాయణంలో క్రింది పాత్ర లేదు 

i ) ద్రౌపతి ii ) లక్ష్మణుడు iii ) హనుమంతుడు iv ) సుగ్రీవుడు

5) మృత సంజీవిని విద్య కచునికి ఉపదేశించినది ఎవరు 

i ) వసిష్ఠుడు    ii ) విశ్వామిత్రుడు  iii ) శుక్రాచార్యుడు   iv ) అత్రి మహర్షి 

 6)కన్యాశుల్కం నాటకాన్ని వ్రాసింది ఎవరు.

i ) పానుగంటి నరసింహారావు   ii ) గురుజాడ అప్పారావు iii ) శ్రీనాధుడు  iv ) పోతనామాత్యుడు 

7) పంచ లోహాలతో ఇది లేదు

 i ) అల్యూమినియం ii ) ఇనుము iii ) రాగి iv ) వెండి

8) ఋక్కు అనునది________ సంబందించినది

i ) వేదానికి ii ) ఉపనిషత్తుకు   iii ) రామాయణానికి iv ) పురాణానికి

9) ప్రబంధానికిఎన్ని ఆశ్వాసాలు ఉంటాయి 

i ) మూడు  ,   ii ) ఆరు  iii ) నాలుగు    iv ) ఐదు 

10) మనిషి చేతి గీతాలను చూసి జాతకాన్ని చెప్పే దానికి ______అని పేరు

i ) పామిస్ట్రీ ii ) హరోస్కోప్ iii ) ఎపిమర్సు  iv ) కుండలిని 

11) శ్వేతాంబరులు అనగా

i ) జైన మతపు ఒకశాఖ వారు ii ) బౌద్ధ మతస్తులు    iii ) శిక్కు మతస్తులు   iv ) హిందూ మతంలో ఒక శాఖ వారు 

 12) అరణి అనునది క్రింది దాని పని చేస్తుంది 

i ) అగ్గిపెట్ట ii ) నశ్యపు బుడ్డి iii ) రోలు పొత్రం iv ) పాన్ పెట్టె

13) సూర్యుని కాంతిలో ____ రంగులు ఉంటాయి

i ) ముప్ఫయి  ii ) ఆరు  iii )ఏడు  iv ) తొమ్మిది 

14) మన గృహవసారాలకు వాడుకునే విద్యుత్తు

i ) A.C  ii ) D.C iii ) static electricity iv ) stored Electricity

15) ఇనుము, అల్యూమినియం రెంటిలో తక్కువ వేడిలో కరిగేది ఏది.

i ) ఇనుము  ii )  అల్యూమినియం iii ) రెండు కూడా iv ) తక్కువ వేడిలో కరిగేది ఏది లేదు

16) ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు

i ) శ్రీ శ్రీ ii ) అల్లసాని పెద్దన   iii ) తెనాలి రామకృష్ణ   iv ) భట్టు మూర్తి

17) ప్రయాణికుల జెట్ విమానంకు ముందర ప్రొపెల్లర్

i ) ఉంటుంది  ii ) ఉండదు  iii ) ఉంటె ఉంటుంది లేకుంటే ఉండదు iv ) తప్పనిసరిగా ఉంటుంది. 

18) విద్యుత్ మోటార్ ఈ శక్తితో తిరుగుతుంది

i ) విద్యుత్ అయస్కాతం శక్తితో ii ) రాగి తీగతో చేసిన కాయిలుతో iii ) స్థిర అయస్కాంత శక్తితో 

19) అంబుజం  అని దేనిని అంటారు

i ) తామర పువ్వు ii ) చేమంతి పువ్వు iii ) గులాబీ పువ్వు iv )   బంతి పువ్వు 

20)  తబలా అనునది ఒక 

i ) చర్మ వాయిద్యం ii ) తంత్రీ వాయిద్యం iii ) వాయు వాయిద్యం iv ) విద్యుతు వాయిద్యం.