5, మార్చి 2026, గురువారం

మన జీవితగమ్యం

 శ్రీరామ (2)


                  ( మన జీవితగమ్యం )


శ్లో // ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ 

ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను. మరల మరల నమస్కరిస్తున్నాను).


                                 --------


ఇహలోకంలోను, పరలోకంలోను, సుఖములు అనుభవించాలంటే ధర్మమార్గాన్ని ఆశ్రయించాలి.


జనన మరణములతో కూడిన సంసారంనుండి బయటపడి శాశ్వతసుఖమైన మోక్షం కావాలనుకుంటే భగవంతుని ఆశ్రయించాలి.


పాపాత్ములు వారు చేసినట్టి పాపకర్మలచేత భక్షింపబడుతు, చచ్చుచు, బుట్టుచు,మరల జచ్చుచు, జన్మ పరంపరలను బొందుచున్నారు.

పేలు, నల్లులు, మొదలగు క్రిములను మన మేతీరున హింసించుచున్నామో, ఆ ప్రకారమే పాపాత్ములను దేవతలు హింసించుచుందురు.

(మృత్వా పునర్మృత్యు మాపద్యంతే /అద్యమానా స్స్వకర్మభిః/ఆశాతికాః క్రిమయ ఇవ/ తతః పూయన్తే వాసవైః - అరుణం)


"తగు పురుషప్రయత్నం చేసి ఇటువంటి స్థితినుండి బయటపడకుండా, మనం అతి దుర్లభమైన మానవజన్మను వ్యర్థం చేసుకుంటున్నాము" అంటున్నారు భర్తృహరి మహాయోగి.


శ్లో//న ధ్యాతం పద మీశ్వరస్య విధివత్ సంసార విచ్ఛిత్తయే/

స్వర్గద్వార కవాట పాటన పటు:ధర్మోపి నోపార్జితః/

నారీ పీన పయోధరోరు యుగళం స్వప్నేపి నాలింగితం/

మాతు: కేవలమేవ యౌవ్వన వనచ్ఛేదే కుఠారావయం// 

 ( భర్తృహరి )


(సృష్టి, స్థితి, లయములు చేయడం అనే తటస్థ లక్షణము కలవాడు ఈశ్వరుడు. 

సత్యము, జ్ఞానము, అనంతత్వము, భగవంతుని స్వరూప లక్షణము.

అటువంటి భగవంతుని తత్వాన్ని శుశ్రూష, సేవల ద్వారా గురువును సంతోషపెట్టి, వారినుండి తెలుసుకోవాలి.  

వినయంతో ప్రశ్నించి సందేహాలన్నీ తీర్చుకోవాలి. 

వారు చెప్పిన విధంగా సాధన చేసి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందాలి. 

సద్గురువు నుండి జ్ఞానం పొందే ఈవిధానం శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశించాడు.

(తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన, సేవయా)

ఈ విధంగా గురువు ఉపదేశించిన పద్ధతిలో ఈశ్వరుని ఆరాధిస్తే, గర్భ నరక బాధలు పడుతూ జన్మించడం, జన్మించిన తరువాత జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ, ఆధులు,వ్యాధుల బారిన పడుతూ ఉండటం,

 సమస్త అవయవములను,శరీరమును క్షీణింపజేసే వార్ధక్యం బారి పడటము, 

తాను సంపాదించిన ధనము, గృహము, తన భార్యాపిల్లలు, బంధు మిత్రులు మొదలైన వారి వియోగానికి రోదిస్తూ మరణించడం, 

తిరిగి జన్మించడం,

తిరిగి మరణించడం,

అనే అంతులేని సంసార చక్రం నుండి విముక్తి లభిస్తుంది.

అటువంటి ఈశ్వర ఆరాధన మేము చెయ్యలేదు.


సంసారసుఖాలను, ఉత్తమోత్తమ జన్మలను, స్వర్గాది లోకాలను, ఇహ పర సుఖాలనన్నింటిని సంపాదించి పెట్టే శాస్త్రోక్త ధర్మాచరణ కూడా మేము చెయ్యలేదు.


స్థిమితమైన మనస్సుతో, స్వప్నంలో నైనా స్త్రీ సంభోగాది కామ సౌఖ్యములను తృప్తిగా ఎన్నడూ అనుభవించలేదు.

జీవితంలో మేము ఏదీ సాధించలేదు. 

మా జన్మ కేవలము మా తల్లి యొక్క యౌవ్వనమనే చెట్టును నరకడానికి ఉపయోగించే గొడ్డలి లాంటి దయిపోయింది.

అంటే వ్యర్థులమైన మమ్మల్ని కని మా తల్లి యౌవనాన్ని కోల్పోయింది. మమ్మల్ని పెంచి మా తండ్రి ధనాన్ని కోల్పోయాడు).


అతి విలువైన మానవ జన్మను వ్యర్థం చేసుకోకుండా పరమార్ధాన్ని సాధించేందుకు తగు పురుషప్రయత్నం చేయాలని చెప్పడమే పై శ్లోకం యొక్క తాత్పర్యం.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

5-3-'26.

సామాజిక భాద్యత CB

 సామాజిక భాద్యత 

ప్రతి మనీషి తన దైనందిక జీవనాన్ని రూపుదిద్దుకోవటం అది అతని వ్యక్తిగత భాద్యత అనవచ్చు అదే విధంగా తన కుటుంబ సంక్షేమాన్ని చూడటానికి కుటుంబ బాధ్యత అని పేర్కొన వచ్చు మరి సామాజిక భాద్యత అంటే ఏమిట అంటే ప్రతివారు కూడా సమాజంలో మసలుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ వారి వారి ప్రవర్తన వలన సాటివారికి అంటే సమాజానికి ఎటువంటి ఆటంకము, యిబ్బంది కలుగకుండా ఉండటానికి మనం సామాజిక బాధ్యత అని అనవచ్చు. 

ప్రతి మానవుడికి తన కుటుంబం సుభిక్షంగా ఉండాలనుకునే బాధ్యత ఎలాంటిదో అదే విధంగా సమాజం శాంతియుతంగా ఉంచే బాధ్యత కూడా వున్నది అదే సామాజిక బాధ్యత.  తానూ తన ఇంట్లో ప్రవర్తించినట్లు సమాజంలో ప్రవర్తించకూడదు.  సమాజపు కట్టుబాట్లను తెలుసుకొని సమాజంలో ప్రవర్తించటమే సామాజిక బాధ్యత.  తనకు వాక్ స్వాతంత్రం వున్నదని  నడి రోడ్డు మీద మైకు పెట్టుకొని పెద్దగా మాట్లాడకూడదు.  అది సమాజ శాంతికి భంగాన్ని కలుగ చేస్తుంది.  అదే ఏదైనా సామాజిక ప్రయోజనకర సమావేశం పెట్టితే అప్పుడు మైకులో తన అభిప్రాయాలను సమాజ శ్రేయస్సుకోసం పెద్దగా  తెలియచేయవచ్చు.  కానీ మైకు నడి రోడ్డులో పెట్టటానికి అనుమతి తీసుకోవటం కూడా సామాజిక బాధ్యతే అవుతుంది.  తన ఇంట్లోని వ్యర్ధ జలాన్ని అదేవిధంగా వ్యర్ధ పదార్థాలను రహదారుల మీదకు పంపకూడదు.  కానీ ప్రభుత్వము నిర్దేశించిన ప్రదేశాలలో వ్యర్ధాలను వేయటం మరియు మురుకు కాలువలలో వ్యర్థజలాన్ని పంపవచ్చు.  అంటే తనకు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను తెలుసుకొని వాటిని తగు విధంగా ఉపయోగించుకోవాలి అన్నమాట. 

ఈ రోజుల్లో సామాజిక బాధ్యతా రాహిత్యం ఇటు చిన్నవారిలోను అటు  పెద్దవారిలోను మనం చూస్తున్నాము.  దానికి కారణాలు నాకేమి కాదు, నాన్నెవరూ ఏమి అన్నారు. ఇలా కారణం ఏదైనా కానీ ఇటువంటి బాధ్యతా రాహిత్యం సమాజానికి ఒక ఆటంకంగా మారుతున్నది అనేది మాత్రం నిజం.ఇటువంటి ప్రవర్తనలు కొన్ని పరిశీలిద్దాము. మనం తరచూ చాలా చోట్ల చూస్తూ ఉంటాము.  రాంగ్ రూటు ప్రయాణం. ట్రాఫిక్ వెళ్ళవలసిన మార్గానికి వ్యతిరేకంగా తమ మోటారు సైకిలు లేక కారు, బస్సు నడుపుకుంటూ చాలామంది వెళుతున్నారు.  ఇంకా కొన్ని సందర్భాలలో నేను చూసాను మోటారు సైకిలు మీద ముగ్గురు, నలుగురు కూర్చొని డ్రైవు చేస్తూన్న అతను సెల్ఫోను మాట్లాడుతూ రాంగ్ రూటులో ప్రయాణించటం. అది యెంత ప్రమాదమో మనం వేరే చెప్పనవసరం లేదు.  సెల్ఫను మాట్లాడుతూ ఉన్నందున తన మనస్సు ఫోను మీద ఉంటుంది.  ఎదురుగా ఎవరు వస్తున్నారో తెలియదు. ఇంకా వాహన సామర్ధ్యానికి మించి మనుషులు కుర్చున్నందువల్ల బ్రేకులు సమయానికి పడవచ్చు లేక పడక పోవచ్చు.  బ్యాలన్సు నిలపలేక పోవచ్చు.  ఇట్లా ఇన్ని ప్రమాదకర పరిస్థితులు తనకు తానె కల్పించుకొని వెళ్లేవారిని యేమని అనాలి.  

రోడ్ల మీద ఏర్పడే గోతులను తత్ సంబందించిన ప్రభుత్వ శాఖల వారు తక్షణం తెలుసుకొని వాటిని నిర్ములించాలిసిన అవసరం ఎంతైనా వుంది.  కానీ ఆ శాఖలలో పనిచేసే ఉద్యోగులు ఎంతమటుకు బాధ్యతాయుతంగా ఉన్నారన్నది కూడా ప్రస్నార్ధకమే. 

ప్రతి వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా చట్టాలను చేస్తూ ఉంటుంది.  వాటిని లా  అఫ్ ద ల్యాండు అంటే దేశీయ చట్టాలు లేక దేశీయ చట్టం అని అన వచ్చు.  అంటే ఒక దేశంలోని చట్టం ఇంకొక దేశంలో సాధారణంగా వర్తించదు.  రెండు దేశాలలో ఒకే విధమైన చట్టాలు ఉంటే మాత్రమే వర్తిస్తాయి.  . మన దేశ చట్టం ప్రతి పౌరుడు రోడ్డుకు ఎడమ వైపున నడవాలి అని చెపుతుంది. అందుకే మనం నడిచి వెళ్లిన లేక వాహనం మీద వెళ్లిన ఎడమ వైపున మాత్రం వుండే విధంగా ఉండాలి. మనం కుడి వైపుకు తిరిగేటప్పుడు సిగినల్ చూసుకొని మాత్రమే వెళ్ళాలి.  ఇది ఇక్కడి చట్టం ఈ విధంగా ప్రయాణించటం మన దేశపు సామాజిక బాధ్యతగా మనం అనుకోవచ్చు. అదే కుడివైపుకు వెళ్లాలంటే, గ్రీన్ సీజనల్ వచ్చేదాకా ఎదురుచూడాలి.  సిగినలు ఎర్రలైటు వున్నా కుడి వైపుకు తిరగటం చట్టోల్లంగనగా చెప్పవచ్చు. అంటే   అది సామాజిక బాధ్యత రాహిత్యం గా పేర్కొనవచ్చు. దేశంలో ఏదైనా చట్టం చేసినప్పుడే ఆ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి పౌరులందఱకు అది తెలుసుకోవలసిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడి మీద వున్నది.  నాకు చట్టం తెలియదు అని తప్పించుకోవటానికి వీలు లేదు.  ఆ చట్టోల్లంగనకు విధించే శిక్షను అనుభవించాలసిందే.  అదే వాహనదారులు అమెరికా వంటి దేశాలలో అయితే కుడివైపుకు వేళ్ళ వలసి ఉంటుంది.  అక్కడ ఎడమవైపుకు మళ్లాలంటే సిగినలు చూసుకొని వెళ్ళాలి అదే మన దేశంలో లాగా ఎడమవైపుకు యథేచ్ఛగా వెళ్ళటానికి లేదు. 

ఈ విధంగా ప్రతి దేశం కొన్ని చట్టాలను ఆ దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేస్తుంది. వాటిని తెలుసుకొని ఆచరించటం ఆ దేశ ప్రజల సామాజిక భాద్యత.  

ప్రతి వ్యక్తికి హక్కులు భాద్యతలు రెండు వున్నాయి.  కానీ తన హక్కు ఏమిటి అది తాను ఎంతవరకు . వినియోగించుకోవచ్చు అనే హద్దులు తెలిసి సమాజంలో ప్రవర్తించాలి. ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత కలిగి సంఘంలో ప్రవర్తిస్తే సమాజంలో ప్రమాదాలను నివారించ వచ్చు శాంతి భద్రతలకు అవరోధాలు లేకుండా అందరు శాంతియుతంగా జీవించవచ్చు.  ఈ సత్యాన్ని ప్రతి వారు గుర్తెరిగి ప్రవర్తించాలి.  

ప్రతి వ్యక్తి  సమాజపు పట్ల  భాద్యతా యుతంగా ప్రవర్తిస్తూ తన సంతానాన్ని కూడా చిన్నప్పటినుంచి చక్కటి క్రమశిక్షణతో పెంచి సమాజం పట్ల సామాజిక బాధ్యతల పట్ల చక్కని అవగాహనను కలుగ చేసినట్లైతే సమాజంలో ఎటువంటి అశాంతి లేకుండా దేశం మొత్తం శాంతి యుతంగా ఉంటుంది.  ఉన్నత పాఠశాల విద్యార్థుల సెలబసులో మన దేశ చట్టాలగురించిన అవగాహనను పెంపొందించే పాట్యంసాలను పొందుపరచి విద్యార్థులకు చట్టలమీద అవగాహనను కలుగచేస్తే మంచిది. 

వ్యాపార సంస్థలు కూడా కొన్ని సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాయి.  వీటికి సి అస్ ఆర్ అని పేరు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పీన్సిబిలిటీ అని అంటారు.  పెద్ద పెద్ద కంపెనీలు తమ వంతు బాధ్యతగా కొంత ద్రవ్యాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఎండాకాలంలో చలివేంద్రాలను నెలకొలపాతం, కొన్ని చోట్ల బస్సు షలీటర్లు నిర్మించటం. మొక్కలు నాటించటం ఇలా అనేక విధాలా సామాజిక  సేవలు చేస్తారు.  

వ్యక్తిగతంగా చేసే సామాజిక సేవలను ఐ ఎస్ ఆర్ అని అంటారు అంటే ఇండివిడ్యువల్ సోషల్ రూ ఎస్పాన్సిబిలిటీ. వీటికి 

ప్రసంగాన్ని

 శుక్రవారం Dt. 6/3/2026 ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ మీడియం వేవ్ కేంద్రంలో భావన కార్యక్రమంలో నేను చెప్పే ప్రసంగాన్ని వినగలరు

 క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ సెల్ ఫోన్ లో ఆకాశవాణి కేంద్రాన్ని వినవచ్చు


All India Radio AIR Hyderabad A 738 FM live stream — listen online https://share.google/Ul4wdV1KPd0qm8Az6

పంచాంగం 05.03.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 05.03.2026 Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస కృష్ణ పక్ష ద్వితీయ తిథి బృహస్పతి వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం శూల యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: ద్వితీయ 


 

నమస్కారః , శుభోదయం

భగవంతుని విభూతులుగా చూడాలి

  నారీణాం.. కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ...........!!

స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.


దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. 

లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. 

ఇవి స్త్రీలకు సహజగుణాలు కూడా. 


ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, 

స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను 

అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది. ఏమిటా ఏడు విభూతులు...


1) కీర్తి...

సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మోదలైన కర్మల ద్వారా, 

త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించటం, 

భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం 

ఇవి స్త్రీ సహజగుణాలు. 


2) శ్రీ...

శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతో బాటు 

శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజగుణమే. 

శ్రీ అంటే లక్ష్మి. 


3) వాక్కు...

వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే. 


4) స్మృతి...

జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం.

సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే. 


5) మేధా...

ధారణా శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞానవిషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. 

ఇది కూడా భగవంతుని విభూతియే.


6) ధృతి...

ధర్మ కార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, 

పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. 

ఇది కూడా స్త్రీలలో అధికమే.


7) క్షమా...

 అత్తమామలను ఆదరించటంలోను, 

భర్తకు అనుకూలంగా నడుచుకోవటంలోను, 

పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించటంలోను 

ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే. 

ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.


విశేషార్థం...

'నార' అంటే భగవత్ సంబంధమైన.. అని. 

భగవత్ కార్యాలలో, లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే.

05మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

 *🌹05మార్చి2026🌹*   

  *దృగ్గణిత పంచాంగం*  

    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -:శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : విదియ* ‌సా 05.03 వరకు ఉపరి *తదియ*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం  : ఉత్తర* ఉ 08.17 వరకు ఉపరి *హస్త*

*యోగం : శూల* ఉ 07.46 వరకు ఉపరి *గండ*

*కరణం  : గరజి* సా 05.03 *వణజి* రా.తె 05.24 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు* 

   *ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-05.00*

అమృత కాలం  : *రా 03.11 - 04.52 తె*

అభిజిత్ కాలం  : *ప 11.55* 

*వర్జ్యం    : సా 05.07 - 06.47*

*దుర్ముహూర్తం  : ఉ 10.20 - 11.08 మ 03.05 - 03.53*

*రాహు కాలం   : మ 01.48 - 03.17*

గుళికకాళం      : *ఉ 09.21 - 10.50*

యమగండం    : *ఉ 06.23 - 07.52*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.32* 

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.23 - 08.45*

సంగవ కాలం         :     *08.45 - 11.08*

మధ్యాహ్న కాలం    :    *11.08 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 03.53*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ విదియ*

సాయంకాలం        :  *సా 03.53 - 06.15*

ప్రదోష కాలం         :  *సా 06.15 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.45 - 05.34*

<><><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*


*శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర*

*యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 4 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

                *15వ భాగo*


*పరాశక్తి పరమేశ్వరులు, మూల చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భావం*```


అర్థనారీశ్వరుడు అంతర్ధాన మయ్యాక బ్రహ్మదేవుడు కన్నులు మూసుకుని తన త్రికాలజ్ఞానము ఉపయోగించి దివ్య దృష్టితో సావిత్రీదేవి గురించి తెలుసు కోవాలని పరబ్రహ్మ సృష్టి ఆరంభం నుంచి జరిగిన సంఘటనలు వీక్షిస్తున్నాడు.


పరబ్రహ్మ కృష్ణుడిగాఅవతరించిన తరువాత ఆయన వామభాగం నుండి స్త్రీ రూపంగా కృష్ణాదేవి అవతరించింది. కృష్ణుడు కృష్ణాదేవి కలయిక వలన ఒక మగ శిశువు జన్మించాడు. ఆ బాలుడే 

వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువు. కల్పాలు గర్భభారం భరించి జన్మించిన శిశువుని కృష్ణాదేవి వటపత్రం పై ఉంచి మహాజలథిలో వదిలివేసింది. ఇది నచ్చని కృష్ణుడు కృష్ణాదేవిని, ఆమె అంశతో జన్మించబోయే అప్సర సలని "వారికి సంతానం కలుగ దని" శపించాడు.


కృష్ణాదేవి తప్పు తెలుసుకుని కృష్ణుని క్షమించమని కోరింది. మన్నించిన కృష్ణుడు శాప ఫలంగా కృష్ణాదేవి సృష్టికి తోడ్పడదని తెలిసి ఆమె నుంచి ఇతర స్త్రీలను అవతరింప చేయాలని భావించాడు. ఫలితంగా కృష్ణాదేవి జిహ్వభాగం నుంచి సరస్వతీదేవి ఆవిర్భ వించింది. మహాసరస్వతి వామభాగం నుండి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుండి రాధాదేవి అవతరించారు.


లక్ష్మీదేవిని విష్ణువుకి సహధర్మ చారిణి చేసి కృష్ణుడు సరస్వతి, లక్ష్మీదేవితో గోలోకం చేరు కున్నాడు. గోలోకం చేరుకున్న కృష్ణుడు సృష్టి స్థితి లయ కార్యాన్ని ముందుకు సాగించడానికి వీలుగా తనను ద్విరూపునిగా చేసుకున్నాడు. దక్షిణభాగం కృష్ణుడు అయితే వామభాగం నుండి మరొక దివ్య పురుషుడు అవతరించాడు.


అతడు వ్యాఘ్ర చర్మం ధరించి శరీరమంతా భస్మం ధరించి ఉన్నాడు. జటాజూటంతో మూడు నేత్రాలు, పంచ

ముఖాలు కలిగి శుద్ధజ్ఞాన స్ఫటికంలా మెరసిపోతున్నాడు. హస్తంలో త్రిశూలం కలిగి పట్టీశం ధరించిన ఆ దివ్య పురుషుడు సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు. సర్వేశ్వరునికి జోడిగా ఉండటానికి కృష్ణుడి వామభాగం నుంచి కృష్ణప్రియ, విష్ణుమాయ, సర్వశక్తి స్వరూపిణి, దేవీ స్వరూపాలన్నింటికి బీజరూపిణి, మూల ప్రకృతి అయిన దుర్గాదేవి అవతరించింది.


కృష్ణుడు వారిద్దరిని ప్రసన్నంగా చూసి "మీరు పరబ్రహ్మ అయిన నా నుంచి అవతరించిన ప్రకృతి పురుషులైన పరాశక్తి - పరమేశ్వరులు. నా దేహం లోని వామభాగం నుండే మీరిద్దరు అవత రించారు. కనుక మీరు ఆర్థశరీరులై కలసిఉండి ఏక దేహులైన అర్థనారీ-ఈశ్వరులుగా విరాజిల్లుతారు.


దుర్గమమైన ఈ దుర్గా- శక్తి తోనే సమస్త జీవ చైతన్యం జరుగుతుంది. పరాశక్తి అనుగ్రహం ముగిసిన జీవులను లయం చేసే లయకారుడిగా పరమేశ్వరుడు ఉంటాడు.


పరాశక్తీ పరమేశ్వరులారా! జలథిలో వటపత్రము బాలునిగా శయనించి పూర్ణ రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు వామభాగం విష్ణుమాయగా దుర్గాదేవి, మహాదేవునిగా నీవు అవతరించి విష్ణువుకి సరిసమానులై సృష్టి కార్యంలో ఆయనకు సహకరించండి" అని దిశానిర్దేశనం చేశాడు. సరేనని పరాశక్తి పరమేశ్వరుడు అదృశ్య మయ్యారు.


అనంతరం కృష్ణుడి నాభి చతుర్ముఖుడు, చతుర్భుజుడు అయిన దివ్య పురుషుడు దండకమండలాలు ధరించి అవతరించి కృష్ణుని స్తుతించాడు. కృష్ణుడు సంతసించి "చతుర్ముఖా! మహాజలధిలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు నాభి కమలం నుంచి నువ్వు ఆవిర్భవించాలి.


శ్రీమహావిష్ణువు అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టించి, ప్రతి బ్రహ్మాండంలో విష్ణువుగా అవతరిస్తాడు. నీవు ఒక్కొక్క బ్రహ్మాండంలో గల విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మగా అవతరించి సృష్టికర్తగా బాధ్యత నిర్వర్తించుము. మూల బ్రహ్మవైన నీ ప్రతి (పార్షద) రూపాలే ఈ బ్రహ్మాండాల బ్రహ్మలందరు అవుతారు. అయినా వారికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు.


అలాగే ఇతర బ్రహ్మాండాలలో ఉన్న బ్రహ్మలలో కూడా ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అందరు తమకు జన్మనిచ్చిన మహావిష్ణువునే తమ తండ్రిగా, తమ జగత్ కర్తగా భావిస్తారు. నీవు వెంటనే వెళ్లి మహాజలథిలో శ్రీమహావిష్ణువు నాభి నుంచి ఉదయించే పద్మము నుండి అవతరించుము" అని ఆదేశించాడు. 


మరుక్షణం చతుర్ముఖుడు అదృశ్యుడై మహావిష్ణువు నాభి కమలం నుంచి అవతరించాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ఆర్యా శతకం - 1*

  భగవద్గీత*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 46*


*కుండలి కుమారి కుటీలే చండి చరాచరసవిత్రి చాముండే।*

*గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ॥*


*భావము :*


*మూలాధార చక్రములో కుండలినీ స్వరూపముగా, వక్ర గమనముతో, చరాచర జగత్తును ప్రసవిస్తూ, త్రిగుణ స్వరూపిణివై, హ్రీంకార రూపిణివై, వేదములచే గుప్త విద్యగా పేర్కొనబడిన గురుస్వరూపిణియైన మాతృదేవతకు నమస్కరిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ।

తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ।। 12 ।।


ప్రతిపదార్థ:


    

ఇష్టాన్ — కోరిన; భోగాన్ — జీవిత అవసరములు; హి — తప్పకుండా; వః — మీకు; దేవాః — దేవతలు; దాస్యంతే — అనుగ్రహించెదరు; యజ్ఞ-భావితాః — యజ్ఞముచే తృప్తి చెంది; తైః — వారిచే; దత్తాన్ — ఇవ్వబడిన వాటిని; అప్రదాయ — నివేదించకుండా; ఏభ్యః — వారికి; యః — ఎవరైతే; భుంక్తే — అనుభవిస్తారో; స్తేనః — దొంగలు; ఏవ — వాస్తవముగా; సః — వారు.



 తాత్పర్యము :   


యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు, జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటిని ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని, తిరిగి నివేదించకుండా, తామే అనుభవించే వారు, నిజానికి దొంగలే.



 వివరణ:


ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే, మనకు వర్షం, గాలి, పంటలు, చెట్లూచేమలు, ఖనిజములు, సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నిటిని పొందిన మనం మానవులం వారికి ఋణపడి ఉన్నాము. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు; మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు. దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది, ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు. ఈ విధంగా, మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈవిశ్వం మనకు సహకరించటం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది.


కానీ, ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా, మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే, శ్రీ కృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అంటున్నాడు. తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతుంటారు, ‘నేను నీతిగా బ్రతుకుతున్నాను; ఎవరినీ కష్టపెట్టను; నేనేమీ దొంగిలించను; కానీ నేను భగవంతుడున్నాడని నమ్మను, దైవారాధనను నమ్మను. నేనేమైనా తప్పు చేస్తున్నానా?’ అని. ఈ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చెయ్యట్లేదు కానీ భగవంతుని దృష్టిలో దొంగలే. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి యజమానిని గుర్తించకుండా, అక్కడి సోఫాలో కూర్చొని, ఫ్రిడ్జిలో నుండి ఆహారం తిని, బాత్రూం వాడుకొని, ఇలా ఉంటున్నామనుకోండి. మనం ఏమీ తప్పు చేయలేదనుకోవచ్చు, కానీ చట్టం దృష్టిలో మనం దొంగగా పరిగణించబడుతాము; ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు. ఇదే విధంగా మనం ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి, ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు. ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే, ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే.


భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు, తన గురువైన చాణక్య పండితుడిని ఇలా అడిగాడు, ‘వైదిక వాజ్మయం పరంగా, పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి?’ అని.


చాణక్య పండితుడు ఇలా సమాధానం చెప్పాడు ‘రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే, అంతకన్నా ఇంకేమీ కాదు. తన రాజ్య పౌరులకి భగవత్ ప్రాప్తి పథంలో సహాయం చేయటమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం.’


ఒక రాజు, వ్యాపారి, రైతు, శ్రామికుడు, ప్రతి వ్యక్తీ, ఎవరైనా సరే, భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా, తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి.

కాలం - అనుకూలం*

 *కాలం - అనుకూలం*

ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.

తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)

卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐

🌟 మార్చి 05 2026 🌟

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం


తిథి: *విదియ సా.4.51 కు* తదుపరి *తదియ 6 సా.5.33 కు*

వారం: *బృహస్పతివారము (గురువారం)*

నక్షత్రం: *ఉత్తర ఉ.8.16 కు* తదుపరి *హస్త 6 ఉ.9.23 కు*

యోగం: *గండ ఉ.7:05 కు* తదుపరి *వృద్ధి 6 ఉ.6:52 కు*

కరణం: *గరజి సా.5:04 కు* తదుపరి *విష్టి సా.5:53 కు*

రాహుకాలం: *మ. 01.30 - 03.00 కు*

దుర్ముహూర్తం: *ఉ. 10.30 - 11.17 కు, మ. 3.12 - 3.59 కు*

వర్జ్యం: *సా.5.04 - 6.44 కు*

అమృతకాలం: *తె. 02.22 - 04.03 కు*

సూర్యోదయం: *ఉ. 6.35 కు*

సూర్యాస్తమయం: *సా. 6.19 కు*


*గురుబోధ:*

🕉️అష్టాదశ పురాణములు, రామాయణం , శ్రీ మద్భాగవతం, మహాభారతం వంటి పురాణములు వింటే వచ్చే పుణ్యం మనలని మన ముందు తరాలని, మన తరువాతి తరాలని కూడా రక్షిస్తుంది.

🕉️కేవలం దేవాలయం దర్శనానికి వెళ్ళడమే కాకుండా ఆలయ నిర్వహణకు కావల్సిన కనీస సదుపాయాలు అందించడం, ఆలయం శుభ్రపరచడం మొ|| చేయడం ఎన్నో శుభఫలితాలను ప్రసాదిస్తుంది, భగవంతుని సంతోషపరుస్తుంది, వచ్చే జన్మలు ఉత్తమజన్మలు వచ్చేలా చేస్తుంది. ధర్మరాజాదులు సైతం ఆలయసేవ చేసారని మనకు పురాణాలు చెపుతున్నాయి.


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

పురాణాల్లో!

 పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు.


1. అనసూయ - అసూయ లేనిది

2. అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు

3. అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.

4. ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.

5. ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)

6. ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.

7. కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.

8. కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు.

9. కుచేలుడు - చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము).

10. కుబేరుడు - నికృష్టమైన శరీరము కలవాడు (బేరమనగా శరీరము).

11. గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుముని చే వదిలిపెట్టబడినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు.

12. గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు

13. ఘటోత్కచుడు - కుండవలె గుబురైన జుట్టు కలవాడు (ఘటమనగా కుండ)

14. జరాసంధుడు - 'జర' అను రాక్షసి చేత శరీర భాగాలు సంధింపబడిన (అతికింపబడిన) వాడు.

15. తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు

16. దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు.

17. ధృతరాష్ట్రుడు - రాష్ట్రమునంతటినీ అదుపులో ఉంచుకొనువాడు.

18. త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు

19. శంకువులు(పాపాలు) చేసినవాడు.

20. దమయంతి - 1. 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది.(

21. దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము)

22. దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు.

23. దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు.

24. ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు.

25. ధర్మరాజు - సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి.

26. నారదుడు - 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు.

27. ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము)

28. ప్రభావతి - ప్రభ (వెలుగు)కలది.

29. ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు

30. బలరాముడు - బలముచే జనులను రమింపచేయువాడు.

31. బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్పతి)

32. భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.

33. భీముడు - భయమును కలిగించువాడు

34. భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు.

35. మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని)

36. మన్మధుడు - మనస్సు కలత పెట్టువాడు.

37. మహిషాసురుడు గేదెకు పుట్టినవాడు

38. 2. 'మహిష్మ

39. యముడు - యమము (లయ)నుపొందించువాడు.

40. యశోద యశస్సును (కీర్తి) కలిగించునది.

41. రాముడు - రమంతే యోగినః అస్మెన్ = రామ( -)

42. యోగులందరూ ఈ పరమాత్మునియందు విహరించెదరు/ఆనందించెదరు.

43. రావణాసురుడు - కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు

44. రుక్మిణి - రుక్మము(బంగారము) కలది

45. వాల్మీకి -ఆయన నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు.

46. వ్యాసుడు -వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు.

47. విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు

48. విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు

49. శంతనుడు - శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు, ములుకులతో(బాణములతో) బాధించువాడు (శల్యమంగా బాణము)

50. శకుంతల - శకుంతలములచే (పక్షులచే) రక్షింపబడినది.

51. శూర్పణఖ - చేటల వంటి గోరులుకలది (శూర్పమనగా చేట, నఖ మనగా గోరు)

సగరుడు - విషముతో పుట్టినవాడు (గర/గరళ శబ్దాలకు విషమని అర్ధము) (గర్భములో ఉండగా విష ప్రయోగానికిగురై ఆ విషంతోనే పుట్టినవాడు)

సత్యభామ - నిజమైన కోపము కలది ( భామ - క్రోధే)

సీత - నాగటి చాలు (జనక చక్రవర్తి భూమి దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన శివు కనుక సీత అయినది

శాశ్వత సుఖం పొందవచ్చు

 శ్రీరామ (102)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


దాహం వేసినప్పుడు మంచినీరు గాజు గ్లాస్ లో త్రాగవచ్చు, లోహపాత్రలోగాని, వెండిపాత్రలోగాని, బంగారు పాత్రలోగాని, నవరత్నఖచిత పాత్రలోగాని త్రాగవచ్చు.

" దాహము మొదలైన వ్యాధులకు చికిత్స చేసుకుంటూ,అది చికిత్స అని తెలుసుకోకుండా,

అజ్ఞానంవల్ల భోగాలు అనుభవిస్తున్నాను అనుకుంటాడు మానవుడు "

అంటున్నారు భర్తృహరి మహాయోగి.


శ్లో// తృషా శుష్యత్యాస్యే పిబతి సలిలం శీతమధురం/

క్షుథార్త శ్శాల్యన్నం కబళయతి మాంసాది కలితమ్/

ప్రదీప్తే కామాగ్నౌ సుదృఢతర మాలింగతి వధూమ్/

ప్రతీకారం వ్యాధే స్సుఖ మితి విపర్యస్యతి జనాః//


(దప్పికతో నోరు ఎండిపోతున్నప్పుడు చల్లని మంచినీరు త్రాగుతాము. 

ఆకలి బాధ తీర్చుకొనుటకు వ్యంజనములతో అన్నం తింటాము.

దేహంలో కామాగ్ని ప్రజ్వలించి నప్పుడు స్త్రీని గాఢంగా కౌగిలించుకుంటాము.

ఈవిధంగా క్షుత్పిపాసాది రూపంలో ఉన్న రోగములకు,పానీయ,ఆహార,స్త్రీసంభోగాదులతో చికిత్స చేసుకుంటూ,అజ్ఞానం వల్ల భోగములు అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నారు జనులు)

భోగాలలో మునిగిపోకుండా, ఏకాగ్ర చిత్తంతో ఈ వ్యాధులకు కారణం తెలుసుకుంటే, ఆత్మజ్ఞానం లభించి మానవుడు శాశ్వత సుఖం పొందవచ్చు అని తెలియజేయటమే మహాయోగి ఆశయం.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

5-3-'26.

శ్రీరామ స్తుతి🙏

 🌸శ్రీరామ స్తుతి🙏


సీ. జానకీ వల్లభా ! జగదభి రామయ్య !

               సజ్జన సేవితా !  సాధు పోష !

     సేతుబంధన రామ ! సేవిత కపిబృంద !

              పతితపావననామ ! పరమపురుష !

     నీలమేఘశ్యామ ! నిరుపమ గుణధామ !

               నిను నమ్మి యుంటిని  నిచ్చ లందు  

     నీ శరధాటికి నిక్కమ్ము  జలనిధి 

               భయమంది లంకకు బాట చూపె

తే.జప తపమ్ముల నొనరించ శక్తి లేదు 

    వేరు దైవంబె  నెఱుగ నే విమల చరిత !

    నీవే దిక్కని నమ్మితి నీరజాక్ష !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !



       జయలక్ష్మి  పిరాట్ల

సుభాషితమ్

 🕉️ *నేటి శుభోదయం సుభాషితమ్*🕉️


శ్లో𝕝𝕝

*సత్యం తపో జ్ఞానమహింసతా చ*

*విద్వత్ప్రమాణం చ సుశీలతా చl*

*ఏతాని యో ధారయతే స విద్వాన్*

*న కేవలం యః పఠతే స విద్వాన్ll*


తా𝕝𝕝 సత్యము, తపస్సు, జ్ఞానం, అహింసా, విద్వత్ప్రమాణము, సత్ప్రవర్తన - ఇవి స్వయముగా ఎవడైతే కలిగి ఉండి, ఆచరించునో అతడే విద్వాంసుడు, పూజ్యుడు. అంతేకానీ, చదువుకున్నంత మాత్రమున విద్వాంసుడు, పూజ్యుడు కాడు. కాలేడు.

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


`నా అనువాదపద్యం`


తే.గీ.

సత్యము తపము జ్ఞానము సత్ప్రవర్త 

నమ్ము విద్వత్తు సచ్ఛీలనంపునడత 

కల్గువాడె విద్వాంసుడౌగాని గ్రంథ 

పఠనమునకాడు కాబోడు పండితుండు 

*~శ్రీశర్మద*

నేటి వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - ద్వితీయ - ఉత్తరాఫల్గుణి -‌‌ గురు వాసరే* (05.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*