సామాజిక భాద్యత
ప్రతి మనీషి తన దైనందిక జీవనాన్ని రూపుదిద్దుకోవటం అది అతని వ్యక్తిగత భాద్యత అనవచ్చు అదే విధంగా తన కుటుంబ సంక్షేమాన్ని చూడటానికి కుటుంబ బాధ్యత అని పేర్కొన వచ్చు మరి సామాజిక భాద్యత అంటే ఏమిట అంటే ప్రతివారు కూడా సమాజంలో మసలుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ వారి వారి ప్రవర్తన వలన సాటివారికి అంటే సమాజానికి ఎటువంటి ఆటంకము, యిబ్బంది కలుగకుండా ఉండటానికి మనం సామాజిక బాధ్యత అని అనవచ్చు.
ప్రతి మానవుడికి తన కుటుంబం సుభిక్షంగా ఉండాలనుకునే బాధ్యత ఎలాంటిదో అదే విధంగా సమాజం శాంతియుతంగా ఉంచే బాధ్యత కూడా వున్నది అదే సామాజిక బాధ్యత. తానూ తన ఇంట్లో ప్రవర్తించినట్లు సమాజంలో ప్రవర్తించకూడదు. సమాజపు కట్టుబాట్లను తెలుసుకొని సమాజంలో ప్రవర్తించటమే సామాజిక బాధ్యత. తనకు వాక్ స్వాతంత్రం వున్నదని నడి రోడ్డు మీద మైకు పెట్టుకొని పెద్దగా మాట్లాడకూడదు. అది సమాజ శాంతికి భంగాన్ని కలుగ చేస్తుంది. అదే ఏదైనా సామాజిక ప్రయోజనకర సమావేశం పెట్టితే అప్పుడు మైకులో తన అభిప్రాయాలను సమాజ శ్రేయస్సుకోసం పెద్దగా తెలియచేయవచ్చు. కానీ మైకు నడి రోడ్డులో పెట్టటానికి అనుమతి తీసుకోవటం కూడా సామాజిక బాధ్యతే అవుతుంది. తన ఇంట్లోని వ్యర్ధ జలాన్ని అదేవిధంగా వ్యర్ధ పదార్థాలను రహదారుల మీదకు పంపకూడదు. కానీ ప్రభుత్వము నిర్దేశించిన ప్రదేశాలలో వ్యర్ధాలను వేయటం మరియు మురుకు కాలువలలో వ్యర్థజలాన్ని పంపవచ్చు. అంటే తనకు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను తెలుసుకొని వాటిని తగు విధంగా ఉపయోగించుకోవాలి అన్నమాట.
ఈ రోజుల్లో సామాజిక బాధ్యతా రాహిత్యం ఇటు చిన్నవారిలోను అటు పెద్దవారిలోను మనం చూస్తున్నాము. దానికి కారణాలు నాకేమి కాదు, నాన్నెవరూ ఏమి అన్నారు. ఇలా కారణం ఏదైనా కానీ ఇటువంటి బాధ్యతా రాహిత్యం సమాజానికి ఒక ఆటంకంగా మారుతున్నది అనేది మాత్రం నిజం.ఇటువంటి ప్రవర్తనలు కొన్ని పరిశీలిద్దాము. మనం తరచూ చాలా చోట్ల చూస్తూ ఉంటాము. రాంగ్ రూటు ప్రయాణం. ట్రాఫిక్ వెళ్ళవలసిన మార్గానికి వ్యతిరేకంగా తమ మోటారు సైకిలు లేక కారు, బస్సు నడుపుకుంటూ చాలామంది వెళుతున్నారు. ఇంకా కొన్ని సందర్భాలలో నేను చూసాను మోటారు సైకిలు మీద ముగ్గురు, నలుగురు కూర్చొని డ్రైవు చేస్తూన్న అతను సెల్ఫోను మాట్లాడుతూ రాంగ్ రూటులో ప్రయాణించటం. అది యెంత ప్రమాదమో మనం వేరే చెప్పనవసరం లేదు. సెల్ఫను మాట్లాడుతూ ఉన్నందున తన మనస్సు ఫోను మీద ఉంటుంది. ఎదురుగా ఎవరు వస్తున్నారో తెలియదు. ఇంకా వాహన సామర్ధ్యానికి మించి మనుషులు కుర్చున్నందువల్ల బ్రేకులు సమయానికి పడవచ్చు లేక పడక పోవచ్చు. బ్యాలన్సు నిలపలేక పోవచ్చు. ఇట్లా ఇన్ని ప్రమాదకర పరిస్థితులు తనకు తానె కల్పించుకొని వెళ్లేవారిని యేమని అనాలి.
రోడ్ల మీద ఏర్పడే గోతులను తత్ సంబందించిన ప్రభుత్వ శాఖల వారు తక్షణం తెలుసుకొని వాటిని నిర్ములించాలిసిన అవసరం ఎంతైనా వుంది. కానీ ఆ శాఖలలో పనిచేసే ఉద్యోగులు ఎంతమటుకు బాధ్యతాయుతంగా ఉన్నారన్నది కూడా ప్రస్నార్ధకమే.
ప్రతి వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా చట్టాలను చేస్తూ ఉంటుంది. వాటిని లా అఫ్ ద ల్యాండు అంటే దేశీయ చట్టాలు లేక దేశీయ చట్టం అని అన వచ్చు. అంటే ఒక దేశంలోని చట్టం ఇంకొక దేశంలో సాధారణంగా వర్తించదు. రెండు దేశాలలో ఒకే విధమైన చట్టాలు ఉంటే మాత్రమే వర్తిస్తాయి. . మన దేశ చట్టం ప్రతి పౌరుడు రోడ్డుకు ఎడమ వైపున నడవాలి అని చెపుతుంది. అందుకే మనం నడిచి వెళ్లిన లేక వాహనం మీద వెళ్లిన ఎడమ వైపున మాత్రం వుండే విధంగా ఉండాలి. మనం కుడి వైపుకు తిరిగేటప్పుడు సిగినల్ చూసుకొని మాత్రమే వెళ్ళాలి. ఇది ఇక్కడి చట్టం ఈ విధంగా ప్రయాణించటం మన దేశపు సామాజిక బాధ్యతగా మనం అనుకోవచ్చు. అదే కుడివైపుకు వెళ్లాలంటే, గ్రీన్ సీజనల్ వచ్చేదాకా ఎదురుచూడాలి. సిగినలు ఎర్రలైటు వున్నా కుడి వైపుకు తిరగటం చట్టోల్లంగనగా చెప్పవచ్చు. అంటే అది సామాజిక బాధ్యత రాహిత్యం గా పేర్కొనవచ్చు. దేశంలో ఏదైనా చట్టం చేసినప్పుడే ఆ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి పౌరులందఱకు అది తెలుసుకోవలసిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడి మీద వున్నది. నాకు చట్టం తెలియదు అని తప్పించుకోవటానికి వీలు లేదు. ఆ చట్టోల్లంగనకు విధించే శిక్షను అనుభవించాలసిందే. అదే వాహనదారులు అమెరికా వంటి దేశాలలో అయితే కుడివైపుకు వేళ్ళ వలసి ఉంటుంది. అక్కడ ఎడమవైపుకు మళ్లాలంటే సిగినలు చూసుకొని వెళ్ళాలి అదే మన దేశంలో లాగా ఎడమవైపుకు యథేచ్ఛగా వెళ్ళటానికి లేదు.
ఈ విధంగా ప్రతి దేశం కొన్ని చట్టాలను ఆ దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేస్తుంది. వాటిని తెలుసుకొని ఆచరించటం ఆ దేశ ప్రజల సామాజిక భాద్యత.
ప్రతి వ్యక్తికి హక్కులు భాద్యతలు రెండు వున్నాయి. కానీ తన హక్కు ఏమిటి అది తాను ఎంతవరకు . వినియోగించుకోవచ్చు అనే హద్దులు తెలిసి సమాజంలో ప్రవర్తించాలి. ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత కలిగి సంఘంలో ప్రవర్తిస్తే సమాజంలో ప్రమాదాలను నివారించ వచ్చు శాంతి భద్రతలకు అవరోధాలు లేకుండా అందరు శాంతియుతంగా జీవించవచ్చు. ఈ సత్యాన్ని ప్రతి వారు గుర్తెరిగి ప్రవర్తించాలి.
ప్రతి వ్యక్తి సమాజపు పట్ల భాద్యతా యుతంగా ప్రవర్తిస్తూ తన సంతానాన్ని కూడా చిన్నప్పటినుంచి చక్కటి క్రమశిక్షణతో పెంచి సమాజం పట్ల సామాజిక బాధ్యతల పట్ల చక్కని అవగాహనను కలుగ చేసినట్లైతే సమాజంలో ఎటువంటి అశాంతి లేకుండా దేశం మొత్తం శాంతి యుతంగా ఉంటుంది. ఉన్నత పాఠశాల విద్యార్థుల సెలబసులో మన దేశ చట్టాలగురించిన అవగాహనను పెంపొందించే పాట్యంసాలను పొందుపరచి విద్యార్థులకు చట్టలమీద అవగాహనను కలుగచేస్తే మంచిది.
వ్యాపార సంస్థలు కూడా కొన్ని సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాయి. వీటికి సి అస్ ఆర్ అని పేరు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పీన్సిబిలిటీ అని అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ వంతు బాధ్యతగా కొంత ద్రవ్యాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఎండాకాలంలో చలివేంద్రాలను నెలకొలపాతం, కొన్ని చోట్ల బస్సు షలీటర్లు నిర్మించటం. మొక్కలు నాటించటం ఇలా అనేక విధాలా సామాజిక సేవలు చేస్తారు.
వ్యక్తిగతంగా చేసే సామాజిక సేవలను ఐ ఎస్ ఆర్ అని అంటారు అంటే ఇండివిడ్యువల్ సోషల్ రూ ఎస్పాన్సిబిలిటీ. వీటికి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి