13, జులై 2022, బుధవారం

శ్లోకం వెనుక ఉన్న కథ...

 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః


ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది. మొదట ఎవరు పలికారు. ఎందుకు పలికారు.. దాని వెనుక ఉన్న కథ.


పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.


గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.


వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.


కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.


కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.


అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.


గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః


తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.


ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ...


కొన్ని ముఖ్య శ్లోకల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి


🙏🙏🙏

*గురు అక్షరమాల స్తుతి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*గురు అక్షరమాల స్తుతి*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*అ - అద్వైతమూర్తి - గురువు*

*ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*

*ఇ - ఇలదైవం - గురువు*

*ఈ - ఈశ్వరరూపము - గురువు*

*ఉ - ఉద్ధరించువాడు - గురువు*

*ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*

*ఋ - ఋజువర్తనుడు - గురువు*

*ౠ - ఋణము లేనివాడు - గురువు*

*ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*

*ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*

*ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*

*ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*

*ఓ - ఓంకార రూపము - గురువు*

*ఔ - ఔదార్య మేరువు - గురువు*

*అం - అందరూ సేవించేది - గురువు*

*అః - అహంకార రహితుడు - గురువు*

*క - కళంకము లేనివాడు - గురువు*

*ఖ - ఖండరహితుడు - గురువు*

*గ - గుణాతీతుడు - గురువు*

*ఘ - ఘనస్వరూపము - గురువు*

*ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*

*చ - చక్రవర్తి - గురువు*

*ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*

*జ - జనన మరణములు లేని వాడు - గురువు*

*ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*

*ఞ - జ్ఞానస్వరూపము - గురువు*

*ట - నిష్కపటుడు - గురువు*

*ఠ - నిష్ఠకలవాడు - గురువు*

*డ - డంబము లేనివాడు - గురువు*

*ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*

*ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*

*త - తత్త్వోపదేశికుడు - గురువు*

*థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*

*ద - దయాస్వరూపము - గురువు*

*ధ - దండించి బోధించువాడు - గురువు*

*న - నవికారుడు - గురువు*

*ప - పంచేంద్రియాతీతుడు - గురువు*

*ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*

*బ - బంధము లేనివాడు - గురువు*

*భ - భయరహితుడు - గురువు*

*మ - మహావాక్యబోధకుడు - గురువు*

*య - యమము కలవాడు - గురువు*

*ర - రాగద్వేష రహితుడు - గురువు*

*ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*

*వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*

*శ - శమము కలవాడు - గురువు*

*ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*

*స - సహనశీలి - గురువు*

*హ - హరిహర రూపుడు - గురువు*

*ళ - నిష్కళంకుడు - గురువు*

*క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*

*ఱ-ఎఱుకతో ఉన్నవాడు - గురువు*

*గురువులందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు*🙏

వ్యాసుడు - వ్యాస పౌర్ణమి

 వ్యాసుడు - వ్యాస పౌర్ణమి


ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు. వారు వేదములను ఋగ్, యజ్, సామ, అథర్వణ మని నాలుగుగా విభాగం చేశారు. ఆ నాలుగింటిని సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు. మంత్రములు శబ్ధతంరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి. వాటికి ఆది అంతములనేవి లేవు. ఎలాగైతే రేడియో సెట్టు లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తిచేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ధ తరంగాలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు.


మంత్రాన్ని దర్శించివాడు అని ఋషి అను పదానికి అర్థం కూడా (రిషయోః మంత్రద్రష్టారః). ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో, అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్ర స్వరూపాలను దర్శించారు. ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌఖిక రూపంలో మనకు అందివచ్చాయి. అటువంటి వేదములను సమర్థుడైన గురువు వద్ద స్వరంతో నేర్చుకోవాలి. వేదానికి స్వరం ముఖ్యం.


వ్యాసులు పదునెనిమిది పురాణాలను కూడా రచించి, జ్ఞానము భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చెయ్యమని చెప్పారు. తరువాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా వ్రాశారు. ఆ బ్రహ్మ సూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాసారు. అందులో శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి.


తరువాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికి వీటీకి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు. మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆదిభౌతిక ఆలోచనా విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తోంది. మనకు వేదములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందిచిన ఋషులను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతా భావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం.


మనకు వేదములతో పాటు ధర్మసూత్రములు కూడా ఉన్నాయి. అవి మనము వేదములు చదివే అర్హతను పొందడానికి చెయ్యవలసిన చెయ్యకూడని విధులగురించి, మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి. వాటినే స్మృతులు అని కూడా అంటారు. అవి ఒక్కొక్క ఋషిపేరు మీద పరాశర స్మృతి, యాజ్ఞ్యవల్క్య స్మృతి, మనుస్మృతి మొదలుగునవిగా చెప్పబడ్డాయి.


ఈ స్మృతులను సంగ్రహంగా ధర్మ-శాస్త్ర-నిబంధనం అని తరువాతి రచయితలు వ్రాశారు. ఉత్తరాదిన కాశినాథ ఉపాధ్యాయ రచించినది, దక్షిణాన వైద్యనాథ దీక్షితర్ వ్రాసిన నిబంధనములు అత్యంత ప్రాచుర్యములు. వైద్యనాథ దీక్షితీయం వైష్ణవులకు శైవులకు ఇరువురికీ ఒక్కటే. అటువంటి వేదములు, ధర్మశాస్త్రాలు మన మతానికి పునాదులు.


మనధర్మానికి మూలపురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి. ఆయన గురువుగా వేదాలను ధర్మసూత్రాలను శిష్యులద్వారా వ్యాప్తి చేశారు కాబట్టి దీనికి గురుపౌర్ణమి అని కూడా పేరు. ఈ రోజున మన గురువులలో వేదవ్యాసులవారిని చూసుకొని వ్యాసులకు అంజలి ఘటించాలి.


వ్యాసం వశిష్టనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్

పరాశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధిమ్ ||


--- “అచార్యాస్ కాల్” ప్రమాచార్య స్వామి వారి ప్రసంగాల సంకలనం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।



#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కేశతైలం

 


     

      చాలామంది మిత్రులు గత కొంతకాలం నుంచి హెయిర్ ఫాల్ గురించి బాధపడుతూ నన్ను అడుగుతూ ఉన్నారు . వారికి అప్పటికప్పుడు కొన్ని తాత్కాలిక పరిష్కారాలు చెప్తూ ఉన్నాను. కాని అవి శాశ్వతంగా పరిష్కారం చూపలేకపోయేవి . మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆయిల్స్ వాడి విసిగిపోయిన వారికోసం ఒక కేశతైలం తయారుచేసాను. దానితో పాటు పూర్తి ఒక షాంపూ కూడా తయారుచేశాను. 


        ఈ రెండు పూర్తి ప్రకృతిసిధ్ధ వనమూలికలతో 

తయారుచేయబడినవి. ఇది అత్యంత ప్రాచీన గ్రంధాలననుసరించి 12 రకాల మూలికలు కలిపి  ప్రాచీనపద్ధతులను అనుసరించి తయారుచేశాను. 


  కేశవృద్ధితైలం ఉపయోగాలు - 


 *  వెంట్రుకలు రాలిపోవడం ఆపుతుంది.


 *  బరకగా ఉన్న వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. 


 *  వెంట్రుకల మందాన్ని పెంచుతుంది. 


 *  వెంట్రుకల కుదుళ్లకు బలాన్ని చేకూర్చడమే కాకుండగా వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.


 *  తలలోని వేడిని తీసివేస్తుంది. తలలోని వేడివల్ల వచ్చే తలనొప్పిని నివారిస్తుంది.


 *  తలకు చల్లదనాన్ని ఇస్తుంది.


  హెర్బల్ షాంపు ఉపయోగాలు  - 


  *  చుండ్రుని శాశ్వతంగా పోగొడుతుంది.


  *  వెంట్రుకలకు అమితమైన బలాన్ని ఇస్తుంది. 


  *  వెంట్రుకలు చిట్లడం  ఆపుతుంది. 


     ఈ రెండిటి కాంబినేషన్ గతకొంతకాలంగా కొంతమంది మీద ప్రయోగించి చూసాను. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మీ అందరికి అందుబాటులో తీసుకుని వస్తున్నాను. 


       నా అనుభవంతో చెప్తున్నాను ఇది తప్పకుండా వెంట్రుకల సమస్యలపైనా బ్రహ్మస్త్రంలా పనిచేస్తుంది. అతి తక్కువకాలంలోనే మీ వెంట్రుకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుంది.

 

  

  ఈ తైలం ఒక ప్రాచీన ఫార్ములాతో తయారుచేయబడినది. దీనిని వాడటం వలన సైడ్ అఫక్ట్స్ వంటివి ఉండవు. నిర్భయంగా వాడవచ్చు . ఇది పూర్తిగా 100% శుద్ధ ఆయుర్వేద మూలికలతో తయారుచేయబడినది. షాంపు కూడా పూర్తి ఆయుర్వేద మూలికలతో రూపొందించబడినది. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ షాంపు వాడటం వలన చుండ్రుసమస్య నుంచి బయటపడగలరు.


   ఈ షాంపు మరియు తైలం కావలిసిన వారు 9885030034  నెంబర్ నందు సంప్రదించగలరు .



సొంత ఇల్లు

 సొంత ఇల్లు 

ఏమిటీ రామా రావు గారు మీరు ఇక్కడ వున్నారు అని అన్నాడు.  నేను ఈ ఇల్లుకొనుకున్నాను నీకు తెలియదా సుబ్బారావు అని అన్నాడు.  రా లోపలికి అని సాదరంగా పిలిచి ఇల్లంతా చూపించి దానిని కొనటానికి ఎంత ఖర్చు అయ్యింది ఎన్ని ఇబ్బందులు పడి తాను కొన్నది అంతా వివరంగా చెప్పాడు రామారావు., చెపుతున్నంత సేపు తానేదో బృహత్ కార్యం చేసినట్లు తాను కాక ఇంకెవరు అటువంటి గొప్ప పని చేయలేదనట్లు చెప్పిందే చెప్పి సుబ్బారావు సహనానికి పరీక్ష పెట్టాడు.  వాడు తాగించిన కప్పెడు టీ ఎప్పుడో జీర్ణం అయిపొయింది.  తొందరగా తెంపుకొని వెళదాం అని సుబ్బారావు అనుకుంటున్నాడు కానీ రామారావు వాక్ ప్రవాహానికి గండి పడటం లేదు. సుబ్బారావు మొఖంలో అసహనం చోటుచేసుకుంది.  సర్లే రామారావు ఈ రోజు నిన్ను ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా వుంది నీవు ఎట్లాగైతేనేమి సొంత ఇంటివాడివి అయ్యావు అని అభినందించి అక్కడినుండి బలవంతంగా నిష్క్రమించాడు సుబ్బారావు. 

నాకు ఒక సొంత ఇల్లు వున్నది అనే భావనే ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ మిత్రమా నిజంగా నీవు కొనుక్కున్న సొంత ఇల్లు నాదేనా అని అడిగితె అదేమిటి అట్లా అంటున్నావు కావాలంటే రిజిస్ట్రేషన్ కాగితాలు చూపిస్తా అని అంటావు.  నిజానికి మిత్రమా నీవు ఏదయితే నీ సొంత ఇల్లు అని భ్రమ పడుతున్నావో అది నీ సొంత ఇల్లు కాదు. అదేమిటి అట్లా అంటావు అని నీవు అనవచ్చు.  నీవు నిజంగానే కొనుకున్నావు కాదని నేననను.  కానీ ఎవరి దగ్గర నీవు కొనుక్కున్నావు ఇంకొక వ్యక్తి దగ్గర అతను ఆ ఇంటికి యజమాని అని నీవు అతనికి ధనాన్ని ఇచ్చి కొన్నావు కదా అవును. మనం సామాన్య మైన దృష్టిలో యేమని అనుకుంటాలంటే ఈ ప్రపంచంలో వున్న సంపద అంతా మనుషులదే కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషికి తన సంపదను అమ్మ వచ్చని కదా.  కానీ మిత్రమా నీవే కాదు నీ ఇంట్లో ఇంకా చాలా జీవులు వున్నాయి.  అవి కూడా ఈ ఇల్లు నాదే అని అనుకుంటున్నాయి.  గోడమీద బల్లి, కంతలోని చీమలు, ఎలుకలు, ఇంకా సాలెపురుగులు, దోమలు, ఈగలు, నీ చెట్టుకు గూడు కట్టిన పిట్టలు. ఇట్లా అన్నీ నీ ఇల్లు వాటి వాటి ఇల్లే అనుకుంటున్నాయి. నీవు ఆ జంతువుల దగ్గర ఇల్లు కొనలేదే మరి ఈ ఇల్లు నీ ఇల్లు ఎలా అయ్యింది అంటే నీవు తెల్లమొహం వేస్తావు. నిజానికి నీవు సొంత ఇల్లు అనేది నీ సొంత ఇల్లుకాదు ప్రస్తుతం అంటే నీ శరీరంలో నీవు (ఆత్మ) వున్నన్ని రోజులు వుండే ఒక వసతి గృహం మాత్రమే.  ఈ విషయాన్ని ఈశావాసోపనిషత్ మొదటి శ్లోకంలోనే ఇలా వివరించింది

ఈశా వాస్యమిదxసర్వం యత్కించ జగత్యాం జగత్, 

తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.

.తాత్పర్యము: అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు ఈశ్వరుని చేత వ్యాపించియున్నది. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినదికాదు.  

ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. విషయములందు మనస్సును చిక్కుకొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని పెంచుకుంటాడు (ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుల్యమేవ సమర్పయే) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము. (1) 846 

కాబట్టి మిత్రమా ఇది నా ఇల్లు ఇది నాది, వీరు నావారు అనే మొహాన్ని వీడు నీ శరీరం నీకు ఆ ఈశ్వరుడు ఇచ్చిన అపూర్వ కానుకగా భావించి ఈ జన్మలోనే జన్మ రాహిత్యానికి (మోక్షానికి) ప్రయత్నం చేయి.  కొంతమంది ఎన్నుకుంటారంటే మనకు అనేక జీవన  వ్యాపకాలు ఉంటాయి కదా మనం భగవంతుని కొరకు సమయం వెచ్చించలేము కాబట్టి నేను ప్రయత్నించలేను అని దైవ చింతనను విరమించుకోవచ్చు.  వారికి భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే మనం అనేక కార్యకలాపాలతో వున్నప్పడికి నిత్యా కర్మలు అంటే స్నానం చేయటం, భోజనం చేయటం మల మూత్ర విసర్జన చేయటం వంటివి ఏవి కూడా ఆపుకోవటం లేదు కదా మరి దైవచింతనను కూడా వాటిలాగా తప్పనిసరిగా ఆచరించవలసిన కర్మగా ఎందుకు తలవకూడదు.  మనం మన మనస్సుకు సర్దిచెప్పుకుంటే దైవ చింతన కూడా మన నిత్యా కర్మలలో చేరుతుంది.  తప్పకుండా మోక్షం కారతలామలకాలం అవుతుంది.  అధవా ఈ జన్మలో మోక్షం రాకపోయినా బాధపడవలసిన పనిలేదు.  ఇప్పుడు ప్రారంభించిన సాధన మన మరుసటి జన్మలో కొనసాగుతుందని భగవానులు గీతలో చెప్పారు. కాబట్టి మిత్రమా నీ సాధన ఇప్పుడే మొదలు పెట్టు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

 



గురుపూర్ణిమ

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - IV 


        గురుపూర్ణిమ శుభాకాంక్షలు


       గురు(వ్యాస) పూర్ణిమ - ప్రత్యేకత  


    ఆషాఢ పూర్ణిమని మనం గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఇదేరోజును  వ్యాస మహర్షి జయంతిగా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం. వాస్తవానికి రెంటినీ కలిపి ఆలోచించాలి. 

    గురుః అంటే అంధకారాన్ని పోగొట్టువాడు. గురువు  అజ్ఞానాంధకారాన్ని తొలగిపోయేలాగు జ్ఞానాన్ని ప్రవేశపెడతాడు కదా! 


1. గురువు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అనే పదాలని ఒకే విధంగా వాడుతున్నా, ఆ మూడు వేర్వేరు. 


గురువు-ఉపాధ్యాయుడు-ఆచార్యుడు 

      

                నిర్వచనాలు. 

                      

(i) గురువు


గురుర్బన్ధురబన్ధూనాం 

గురుశ్చక్షు రచక్షుషామ్ I 

గురుః పితాచ మాతాచ 

సర్వేషాం న్యాయవర్తినామ్ II 


----బంధువులెవరూ లేనివారికి గురువే బంధువు.కళ్ళు లేని వారికి గురువే కంటి చూపు.గురువే తల్లి, గురువే తండ్రి. యదార్థజ్ఞాన ప్రదర్శకుడు.న్యాయమార్గంలో ప్రవర్తింపచేయువాడు "గురువు" 


(ii) ఉపాధ్యాయుడు


ఏకదేశం తు వేదస్య 

వేదాఙ్గాన్యపి వా పునః I     

యో2ధ్యాపయతి వృత్యర్థమ్ 

ఉపాధ్యాయస్య ఉచ్యతే  II


----వృత్యర్థం వేదాన్నీ వేదాంగాలనీ ఎవరైతే అధ్యాపనం  (బోధన) చేస్తారో వారు "ఉపాధ్యాయులు"


(iii) ఆచార్యుడు


ఆచినోతి హి శాస్త్రార్థాన్ 

ఆచారే స్థాపయత్యపి I

స్వయమాచరతే యస్మాత్ 

తస్మాదాచార్య ఉచ్యతే II


----కేవలం శాస్తార్థాలను బోధించడమే కాక, తాను వాటిని ఆచరిస్తూ, సమాజ హితం కోసం ఆదర్శంగా ఆచరింప చేసేవాడు "ఆచార్యుడు" 


2. వేదాలు జ్ఞానరాశి. అవి సార్వకాలీనం. 


వేదవ్యాసుడు 


    ఇది ఒకరి పేరుగాదు. వేదములను ప్రసరింపజేసిన మునిని వేదవ్యాసుడు అంటారు. 

    నారాయణుని నాభి కమలమున పుట్టిన బ్రహ్మ ముఖములనుండి ఉద్భవించిన వేదములను ప్రసరింపజేయుటకు, నారాయణుడు "అపాంతరతముడ"ను మానస పుత్త్రుని పుట్టించాడు. 

    నారాయణుడు వానిని బిలిచి "నీవు వేదములను దృఢావధానుడవై విని వాని నంచితన్యాస మొందింపుమ"ని చెప్పాడు. అపాంతరతముడు వేదభేదన మొనరించాడు. 

    ప్రతి ద్వాపర యుగాంతమున ఆర్షవిద్యలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిచే విస్తరింపబడుతూ ఉంటాయి. 

    ప్రథమ ద్వాపరమున స్వయంభువు వేదములను విభాగించాడు. 

    ద్వితీయ ద్వాపరమున ప్రజాపతి వేదవిభజన చేసి వ్యాసుడయ్యాడు, 

    తృతీయ ద్వాపరమున శుక్రుడు వ్యాసుడయ్యాడు. 

    అనంతర కాలాలలో బృహస్పతి, వసిష్ఠుడు, త్రివర్షుడు, సనద్వాజుడు మొదలగువారు వ్యాసులయ్యారు. 

    ఇప్పటి 28వ ద్వాపర యుగాంతంలో పరాశరాత్మజుడైన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన జయంతినే మనం వ్యాసపూర్ణిమ పేరుతో గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాం. 


3. సందేశం    


    ఈ విషయాలని విశ్లేషించుకుని, 

    మన సనాతన శాస్త్ర సంప్రదాయాలనే వేదాలని, 

    పాశ్చాత్య వ్యామోహం అనే సోమకాసురుడు, 

    పూర్తిగా దాచివేస్తున్న సముద్రం నుంచీ వెలికి తీసి కాపాడుకుందాం. 

    ఇదే గురు (వ్యాస) పూర్ణిమ మనకి అందిచ్చే సందేశం. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

గురుపౌర్ణమి

వ్యాసుడవతరించ నాషాఢపున్నమి
సర్వ జనులకిలను పర్వమాయె
వేదరచన జేసి వెలిగించె జ్యోతులు
కనులనిండ కాంతి గాంచరారె

వ్యాసుడొకడె జగతి నసలైన గురువౌను
వేద జ్ఞాన మంత వీరి కృపయె
ఆదిశంకరుండు నాతని వలెగాద
వందనములనిడుదు వారికెపుడు

జ్జానమిచ్చు గురువు జయమును కలిగించు
తనను మించినపుడు తాను మురియు
కన్నతండ్రి వలెను కాపాడు శిష్యుల
నాదరించు నెపుడు నమ్మవోలె
పాఠంబుజెప్పంగ కాఠిన్యమును జూపు
విద్యజూచి కరుగు వెన్నవోలె
గురువు కెవరు సాటి గోళమందెచ్చట
దైవసములు వారు దరకి జేర్చ

గురువు బ్రహ్మ యౌను గురువె విష్ణు డిలను
వేరు మాట లేల గురుడె శివుడు
పరమ పథము జూపు పరబ్రహ్మ యు గురుడె
అందు కొనుము దేవ నంజలింతు

జ్ఞాన మంతరించి జగతి జీకటి నుండ
జ్ఞాన జ్యోతుల నిడి జగతి బ్రోచు
తిమిరములను ద్రోలి స్థిరమగు దారిని
జనుల కిడెడు వారు గురువు లొకరె

అమ్మ నాన్న మించి యధికమౌ గురువులు
జన్మ నిచ్చు నమ్మ జగతి నందు
జ్ఞాన మిడును గురువు జగతిని జీవింప
మరువ రాదు మనము గురువు కృపను

గురువు కరుణ లేక గురివింజ యెత్తైన
జ్ఞన మబ్బ దసలు జదువు రాదు
ఎరుక గలుగు మనకు గురువు కృపను జూడ
గుప్త నిధులు గారె గురువు లిలను


గురువు లేక విద్య కొండంత జదివినా
జ్ఞప్తి కవియు రావు సమయమందు
కర్ణుడెంత జదువ కడకేమి జరిగెను
కొలువరారె జనులు గురువునిపుడు


చీకటెటుల బోవు చిరుదివ్వె వెలిగించ
యటుల గురువు మనల నాదు కొనును
జ్ఞాన మొసగి తాను జగతిని నడిపించు
గురువు లెపుడు కల్ప తరువు లౌను


గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా
గురువులందరకును వందనములతో