10, జనవరి 2026, శనివారం

*శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..*

 *శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..* 


​ఆంధ్ర భోజ! శ్రీకృష్ణదేవరాయా!

నీ పరిపాలన ఓ చరిత్ర, నీ వంశం రాజసానికి చిహ్నం,

విదేశీయులు సైతం కొనియాడిన అసమాన వంశం.

హంపి నగరపు సౌరభానికి నీవే నిత్య నిదర్శనం.


​కవిత్వ కథన రంగ విన్యాస చరితా!

అష్టదిగ్గజాల సరసన వెలిగే రాజమార్తాండా!

'ఆముక్తమాల్యద'తో విరిసిన సాహిత్య పారిజాతమా!

నీవు తెలుగు తల్లి ముద్దుల రాజకుమారుడవు.


​రణరంగ విన్యాస శత్రు భయంకరా!

గజపతులకు నీవు గజసింహ స్వప్నానివి.

చేతిలో కత్తి పడితే విజయం నీ చెంతనే..

రణరంగంలోనూ కవిత్వాన్ని పండించిన సాహితీ శిఖరమా!


​లాలిత్య సౌందర్య సంపద వృక్షమా!

సంస్కృతాంధ్ర భాషలలో ఆరితేరిన ప్రవీణా!

అష్టాదశ వర్ణనలలో మేటి అనుభవజ్ఞుడా!

కవన రంగంలో నీవు సాహితీ సార్వభౌముడివి.


​'మూరురాయరగండ' బిరుదాంకితుడా!

సకల ఆంధ్ర రాజ్య పరిపాలన విజేతవు నీవు.

నీ చరితం సువర్ణ హిమ శిఖరం..

దేశ చరిత్రలో నీది సుమధుర, సుస్థిర స్థానం.


​మత సామరస్య పర్యవేక్షక సార్వభౌమా!

హిందూ-ముస్లిం ఐక్యతను చాటిన బోధకుడా!

హైందవ ధర్మ రాజ్య పరిరక్షకా..

ఆంధ్ర వైభవ పరంపరలో నీ నామం చిరస్థాయి.


​శిల్ప సౌందర్య కళాపోషకా!

సకల కళా సమ్మేళనానికి నీవే రూపానివి.

విజయ నగర వైభవ సంస్కృతికి నీవే నిదర్శనం.

భావి తరాలకు నీ పరిపాలనే ఆదర్శం.


​గొప్ప ఆలయాలను నిర్మించిన నిర్మాతవు,

శైవ, వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించిన పుణ్యమూర్తివి.

కలియుగ దైవానికి మణి మాణిక్యాలర్పించిన భక్తుడివి,

సిరులను కురిపించే సువర్ణ హస్తం నీది.


​అద్భుత చెరువులెన్నో తవ్వించావు,

రైతుల ఇంట సిరులను సాక్షాత్కరించావు.

భూమిపుత్రుడిని ఆదరించి..

ధాన్యలక్ష్మిని సగర్వంగా నిలిపిన అన్నదాతవు.


​నలుదిక్కులా వ్యాపార వృద్ధిని పెంచావు,

రత్నరాసులు వీధుల్లో రాశులుగా పోయించావు.

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించి,

నేటి ఆర్థిక వ్యవస్థకు నీ పరిపాలనే అసలైన దర్పణం!


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

*నక్షత్ర స్తోత్ర మాలిక - 10 వ రోజు (విశేష స్తోత్రం)*

 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 10 వ రోజు (విశేష స్తోత్రం)* 


*నక్షత్రం*_ *మఖ* (Magha)


*అధిదేవతలు*_ *పితృదేవతలు*


👉 *మఖ నక్షత్ర జాతకులు మరియు పితృ దోష నివారణ కోరుకునే వారు పఠించాల్సిన విశేష స్తోత్రం.* 


*శ్రీ పితృ స్తోత్రం.* 


*అర్చితామమ్యుతానాం చ పితృణాం దీప్తతేజసామ్ ।* 

*నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషామ్ ॥ 1 ॥* 


*ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచయోస్తథా ।* 

*సప్తర్షీణాం తథాన్యేషాం తాన్ నమస్యామి పితృన్ ॥ 2 ॥* 


*మనువంశప్రధానానాం మునీనాం చ తథైవ చ ।* 

*నమస్యామి పితృన్ సర్వాన్ లోకేష్వపి చ పూజితాన్ ॥ 3 ॥* 


*నక్షత్రాణాం గ్రహాణాం చ తథా చంద్రార్కయోరపి ।* 

*నమస్యామి సదా తేషాం సర్వజ్ఞానాం మహౌజసామ్ ॥ 4 ॥* 


*అగ్నేర్వాయోస్తథాన్యేషాం లోకానాం చైవ పూజితాన్ ।* 

*నమస్యామి పితృన్ సర్వాన్ కృతప్రణత మానసః ॥ 5 ॥* 


*నమస్యామి పితృన్ భక్త్యా యే లోకేష్వపి పూజితాః ।* 

*యే మే దదతు కామేశాన్ సర్వకామఫలప్రదాన్ ॥ 6 ॥* 


*నమస్యామి పితృన్ భక్త్యా యే భుక్తిముక్తి దాయినః ।* 

*యే మే దదతు కామేశాన్ సర్వకామఫలప్రదాన్ ॥ 7 ॥* 


*యేషాం స్మరణమాత్రేణ సకలార్థ ఫలప్రదమ్ ।* 

*తాన్ నమస్యామి పితృన్ సర్వాన్ ప్రసన్నా భవంతు మే ॥ 8 ॥* 


*విశేషం*


● *ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు దక్షిణాభిముఖంగా (South direction) కూర్చుని పఠించడం మరింత శుభకరం.* 


● *మఖ నక్షత్రం ఉన్న రోజున లేదా ప్రతి అమావాస్య రోజున దీనిని పఠిస్తే పితృదేవతల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.*


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

సంకష్టహర చతుర్థి*

  

          *సంకష్టహర చతుర్థి*

                 ➖➖➖✍️


*గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి* 

```

మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి.


పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. 


ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.```


 *సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:-* ```

సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.


సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. 


ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.```


*సంకట హర చతుర్ధి వ్రత కథ:*``` 

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. 

ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.


అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. 

ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ‘ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది’ అని చెప్పాడు.

అపుడు ఆ రాజు ‘అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది’అని అడిగాడు వినయంగా! 

అపుడు ఇంద్రుడు ‘ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది’ అని చెప్పాడు.


సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! 

కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. 

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. 

సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. 

చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. 

రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.


అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. 

గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. 

ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.


ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *సంసారయతి కృత్యాని* 

          *సర్వత్ర విచికిత్సతే* 

          *చిరం కరోతి క్షిప్రార్థే*  

          *స మూఢో భరతర్షభ*  


తా𝕝𝕝 *తన పనులను ఇతరులపై నెట్టువాడు.... అన్నిటికీ సందేహించు వాడు.... శీఘ్రముగా చేయవలసిన చోట ఆలసించువాడు.... అట్టివాడు అవివేకి....!!!!!*


✍️🌹💐🌸🙏

తన పనులను ఇతరులపై నెట్టువాడు

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *సంసారయతి కృత్యాని* 

          *సర్వత్ర విచికిత్సతే* 

          *చిరం కరోతి క్షిప్రార్థే*  

          *స మూఢో భరతర్షభ*  


తా𝕝𝕝 *తన పనులను ఇతరులపై నెట్టువాడు.... అన్నిటికీ సందేహించు వాడు.... శీఘ్రముగా చేయవలసిన చోట ఆలసించువాడు.... అట్టివాడు అవివేకి....!!!!!*


✍️🌹💐🌸🙏

నిద్ర పట్టకపోతే

  



*నిద్ర పట్టకపోతే 10 మంది వైద్యుల పరిష్కారాలు/చిట్కాలు:*

               ➖➖➖✍️```



మనిషి జీవితంలో నిద్ర అనేది ఆహారం, నీరు లాగానే ఎంతో కీలకం. కానీ వయస్సు పెరగడం, పనిభారాలు, ఆందోళనలు, వ్యాధులు లేదా తప్పుడు అలవాట్ల వల్ల నిద్ర పట్టకపోవడం ఒక సాధారణ సమస్య. చాలా మంది దీన్ని సీరియస్ వ్యాధిగా భావించి భయపడతారు కానీ నిజానికి చాలా సందర్భాల్లో నిద్రలేమి జీవితశైలిలో మార్పులతోనే సరి అవుతుంది. ఇక్కడ 10 మంది వైద్యులు చెప్పిన పరిష్కారాలు తెలుగులో సులభంగా అందిస్తున్నాం...


*1. Sleep Hygiene – నిద్ర శుభ్రత అలవాట్లు:

*రాత్రి నిద్రకి ముందు ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వాడకూడదు. గది చల్లగా, చీకటిగా ఉండాలి. ఒకే టైమ్‌లో పడుకోవడం, ఒకే టైమ్‌లో లేవడం నిద్ర నాణ్యతను పెంచుతుంది. కాఫీ, టీ రాత్రి తాగడం మానేయాలి. ఇవన్నీ పాటిస్తే మందులు లేకుండానే నిద్ర మెరుగవుతుంది.


*2. Cognitive Behavioural Therapy – ఆలోచనల్లో మార్పు చికిత్స:

*వైద్యులు చెబుతున్నదేమిటంటే, ‘నాకు నిద్ర రాదు’ అని ఎప్పుడూ ఆలోచిస్తే, మనసు మరింత కంగారు పడుతుంది. దీని బదులు మనసు ప్రశాంతంగా ఉంచడం, ఆలోచనలను పాజిటివ్ దిశగా మళ్లించడం అవసరం. ఆలోచనల మార్పు నిద్రను సులభతరం చేస్తుంది.


*3. Relaxation Techniques – శరీర సడలింపు పద్ధతులు:  

*గాఢంగా శ్వాసించడం, యోగా, ధ్యానం, శరీరాన్ని క్రమంగా సడలించడం వంటి relaxation పద్ధతులను వైద్యులు సూచిస్తారు. వీటివల్ల మెదడు శాంతిస్తుంది, గుండె కొట్టుకోవడం సాధారణమవుతుంది, నిద్ర సహజంగా వస్తుంది.



*4. Light Exposure – కాంతి ప్రాముఖ్యం:

*వైద్యుల ప్రకారం, ఉదయం సూర్యరశ్మిలో 30 నిమిషాలు నడక చాలా ఉపయోగకరం. ఇది శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేస్తుంది. మెలటోనిన్ రాత్రి సహజంగా నిద్రకు సహాయపడుతుంది. ఇంట్లో కూడా రాత్రి కాంతి తగ్గించి ప్రశాంత వాతావరణం కల్పించాలి. 



*5. Physical Activity – శారీరక కదలికలు:

*రోజూ 30–40 నిమిషాలు నడక, సైక్లింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వైద్యులు సిఫారసు చేస్తారు. వ్యాయామం వల్ల శరీర శక్తి సరైన విధంగా ఖర్చవుతుంది, రాత్రికి శరీరం సడలిపోతుంది, నిద్ర సులభంగా వస్తుంది.



*6. Avoid Alcohol and Nicotine – మద్యం, పొగాకు మానాలి.  

*చాలామంది మద్యం తాగితే నిద్ర వస్తుంది అనుకుంటారు కానీ అది నిజం కాదు. మద్యం వల్ల నిద్ర విరామాలు పెరుగుతాయి, నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. అలాగే సిగరెట్‌లోని నికోటిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. కాబట్టి వీటిని పూర్తిగా మానేయాలి.



*7. Medical Conditions Check – ఇతర వ్యాధుల పరిశీలన:  

*డయాబెటిస్, థైరాయిడ్, హార్ట్ సమస్యలు, డిప్రెషన్ వంటి వ్యాధులు కూడా నిద్రపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వైద్యుల సలహా ప్రకారం వీటి చికిత్స తీసుకోవాలి. మూల సమస్య సరిచేస్తే నిద్ర సమస్య కూడా సులభంగా తగ్గుతుంది.



*8. Food and Diet – ఆహారపు అలవాట్లు:  

*రాత్రి చాలా బరువైన భోజనం చేస్తే నిద్ర కష్టమవుతుంది. తేలికపాటి ఆహారం, వేడి పాలు, కొద్దిగా పండ్లు, డ్రైఫ్రూట్స్ తినడం నిద్రకి సహాయపడుతుంది. మసాలా, ఎర్ర మాంసం, ఫ్రై చేసిన పదార్థాలు రాత్రి 

తీసుకోకూడదు.



*9. Behavioural Adjustment – ప్రవర్తనలో మార్పులు:

*వైద్యులు చెప్పినది ఏమిటంటే, రాత్రి మంచం మీద నిద్ర రాకపోతే బలవంతంగా పడుకోవద్దు. లేచి పుస్తకం చదవడం, మృదువైన సంగీతం వినడం మంచిది. కొద్దిసేపటికి నిద్ర సహజంగా వస్తుంది. మంచాన్ని కేవలం నిద్ర, విశ్రాంతి కోసం మాత్రమే వాడాలి.



*10. Professional Help – నిపుణుల సహాయం:

*అన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర సమస్య కొనసాగితే నిద్ర నిపుణుడిని సంప్రదించాలి. నిద్ర పరీక్షలు, EEG, ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇది నిజంగా వ్యాధి అయితే సరైన మందులు, థెరపీ ద్వారా సులభంగా నియంత్రించవచ్చు.*  


*ముగింపు*  

*నిద్రలేమి ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఎదురవుతుంది. కానీ అది శాశ్వత వ్యాధి అని భయపడాల్సిన అవసరం లేదు. వైద్యుల సూచనలు, సులభమైన జీవనశైలిలో మార్పులు పాటిస్తే నిద్ర సమస్యలు తగ్గుతాయి. శాంతి, సడలింపు, సరైన ఆహారం, వ్యాయామం — ఇవే సహజ నిద్ర మందులు అని గుర్తుంచుకోండి.✍️```

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

నక్షత్ర స్తోత్ర మాలిక - 7 వ రోజు.*

  🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 7 వ రోజు.*


*నక్షత్రం - పునర్వసు* (Punarvasu)


*అధిపతి - గురువు* (Jupiter)


*ఆరాధించాల్సిన దైవం_*


*శ్రీరామచంద్రుడు*


*పునర్వసు నక్షత్ర జాతకులు మరియు సకల కార్య జయము, మనశ్శాంతి కోరుకునేవారు పఠించాల్సిన మంగళకరమైన స్తోత్రం.*


"*శ్రీ రామచంద్రాష్టకం*".


*సుగ్రీవమిత్రం పరమం పవిత్రం*

*సీతాకళత్రం నవమేఘగాత్రమ్* ।

*కారుణ్యపాత్రం శతపత్రనేత్రం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 1 ॥


*సంసారసారం నిగమప్రచారం*

*ధర్మావతారం హృతభూమిభారమ్* ।

*సదావికారం సుఖసింధుసారం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 2 ॥


*లక్ష్మీవిలాసం జగతాం నివాసం*

*లంకావినాశం భువనప్రకాశమ్* ।

*భూదేవవాసం శరదిందుహాసం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 3 ॥


*మందారమాలం వచనే రసాలం*

*గుణైర్విశాలం హతసప్తతాలమ్* ।

*క్రవ్యాదకాలం సురలోకపాలం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 4 ॥


*వేదాంతగానం సకలైస్సమానం*

*హృతారిమానం త్రిదశప్రధానమ్* ।

*గజేంద్రయానం విగతావసానం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 5 ॥


*శ్యామాభిరామం నయనాభిరామం*

*గుణాభిరామం వచనాభిరామమ్* ।

*విశ్వప్రణామం కృతభక్తకామం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 6 ॥


*లీలాశరీరం రణరంగధీరం*

*విశ్వైకవీరం రఘువంశహారమ్* ।

*గంభీరనాదం జితసర్వవాదం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 7 ॥


*ఖలే కృతాంతం స్వజనే వినీతం*

*సామప్రగీతం మనసా పునీతమ్* ।

*ధ్యానేన గీతం కవిభిర్గృహీతం*

*శ్రీరామచంద్రం సతతం నమామి* ॥ 8 ॥


*శ్రీరామచంద్రాష్టకమేతదాదరాత్*

*పఠంతి యే వై సతతం నరాః సదా* ।

*విముక్త పాపాః పధమాప్నువంతి తే*

*యత్ర ప్రసన్నో రఘువంశభూషణః* ॥


॥ *ఇతి శ్రీ రామచంద్రాష్టకం సంపూర్ణమ్* ॥


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

గురువు

  గురువు, తనను మించిన స్థాయిలో తన శిష్యులు ఉండాలని కోరుకుంటాడు అయితే శిష్యులు తమ అర్హతను గురువు ఆశించిన విధంగా పెంపొందించుకునే ప్రయత్నం చేయడం మాత్రమే కాదు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్ల వేళలా కృషి చేయాల్సి ఉంటుంది.

సూక్తి

  *నేటి సూక్తి*


*జీవితంలో సమయం ప్రతిక్షణం ఎంతో విలువైనది దానిని మీరు ఎంత బాగా వినియోగించుకుంటే జీవితం అంత బావుంటుంది.*


*క్రాంతి కిరణాలు*


*కం.తెలియుము ఘనమగు సమయము*

*విలువను గుర్తించి నపుడు వేగిర పడుచున్*

 *ఫలితము సాధించుటకై*. 

 *అలుపెరుగక కష్టపడును ఆనందముతో*


*పద్య కవితా శిల్పకళానిధి. ‌‌ మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

ధనికుడు సంద్రంపుకరణి

  *2321*

*కం*

ధనికుడు సంద్రంపుకరణి

జనులెవ్వరి దాహమణచ జాలడునెపుడున్,

ఘనగుణనిధి కూపమువలె

జనులందరి దప్పిదీర్చు సతతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనవంతుడు సముద్రం వలె ఎవ్వరి దాహమునూ తీర్చలేడు, గొప్ప గుణవంతుడు భావి వలె ఎల్లప్పుడూ జనులందరి దాహమునూ తీర్చగలడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*615 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


జనపూజితుడు

ధర్మరాజు " పితామహా ! సర్వజనములతో పూజింపబడు వాడు ఎవరో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి శ్రీకృష్ణుడి అతిథిసత్కారాలు అందుకున్నాడు. శ్రీకృష్ణుడు " నారదా ! నీవు అత్యంత మక్కువతో ఎవరిని మొక్కుతావు ? " అని అడిగాడు. " కృష్ణా ! వరుణుడికి, వాయుదేవుడికి, భూమికి, ఆకాశానికి, అగ్నికి, ఈశానుడికి, షణ్ముఖుడికి, మహాలక్ష్మికి, విష్ణువుకు, బ్రహ్మదేవుడికి, బృహస్పతికి, చంద్రుడికి, నీటికి, భూమికి ఎవరు భక్తితో పూజిస్తారో నేను వారిని భక్తితో నమస్కరిస్తాను. ఇంకా వేదాధ్యయనం చేసే వారు, తపోధనులు, దేవతలను పూజించువారు, భూదానము, గోదానము, ధనదానము, ధాన్యదానములను చేయు వారు, అతిథిపూజ చేయువారు, పితృతర్పణం చేయువారు, భిక్షాటనతో శాంత చిత్తముతో జీవించువారు, ఎల్లప్పుడు సత్యమునే పలుకువారు వీరికి నేను భక్తితో నమస్కరిస్తాను. ధర్మము, అర్ధము, కామము సమానంగా భావించు వారు. అహంకారము, అధిక మమకారము లేనివారు, మంచి నడవడి కలవారు, లోలత్వము లేని వారు వీరందరికి నేను నమస్కరిస్తాను. కృష్ణా నీవు కూడా వీరిని పూజించి శుభలు పొందు " అని చెప్పాడు. కనుక ధర్మనందనా ! నీవు కూడా అలా ప్రవర్తించి శుభములు పొందు " అని భీష్ముడు చెప్పాడు.

రాజు కర్తవ్యము

ధర్మరాజు " పితామహా ! రాజ్యము చేసే రాజులకు ప్రధాన కర్తవ్యము ఏమిటో వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పట్టాభిషిక్తుడైన రాజుకు ప్రథమకర్తవ్యము బ్రాహ్మణపూజ. బ్రాహ్మణులు సుఖశాంతులతో జీవించు రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. బ్రాహ్మణులను అవమానించిన రాజ్యములో అనేక కష్టములు కలుగుతాయి. విప్రులు ఘటనాఘటన సమర్ధులు. విప్రులకు అనుకూలంగా ఉన్న వారు రాజ్యాధిపతులు కాగలరు. విప్రులను అవమానించిన వారు రాజ్యభ్రష్టులు కాగలరు. బ్రాహ్మణుడు కోపిస్తే దేవేంద్రుడు కూడా తట్టుకో లేడు. విప్రులు శాపానుగ్రహ సమర్ధులు. పూర్వము ద్రవిఢ దేశాధిపతులు బ్రాహ్మణులను అవమానించి శూద్రులైనారు. కనుక ధర్మనందనా నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజింపుము. సదాచారము కలిగిన బ్రాహ్మణుడికి భోజనము పెట్టిన అతడి పితృదేవతలు తరిస్తారు. భూదేవికి విష్ణుమూర్తికి బ్రాహ్మణుల విషయమై ఒకసారి సంవాదము జరిగింది. విష్ణుమూర్తి భూదేవితో " దేవీ ! నీవు లోకమాతవు కదా ! నిన్ను ఒక విషయము అడుగుతాను. పాపములు పోగొట్టుకోవడానికి చేయవలసిన పనులు ఏవి ? " అని అడిగాడు. భూదేవి " నాధా ! బ్రాహ్మణులను సేవించినా ! పూజించినా ! విప్రులకు హితము చేసినా పాపములు నశిస్తాయి. అహల్యను కోరుకున్నందుకు ఇంద్రుడికి శరీరము నిండా కన్నులు కలుగుతాయని శపించింది బ్రాహ్మణుడైన గౌతముడే కదా ! " అని జవాబు చెప్పింది. కనుక ధర్మనందనా ! నీవు ఏమరపాటు లేక బ్రాహ్మణులకు పూజ చెయ్యి. పుట్టుకతోనే బ్రాహ్మణులు పూజనీయులు. ముందుగా బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సృష్టించి వారితో " మీకు ధర్మనిరతి తప్ప వేరు పని లేదు. మీరు ధర్మమును సదా రక్షించడమే మీ కర్తవ్యము. అందు వలన మీకు శుభములు కలుగుతాయి. బ్రాహ్మణుడు మిగిలిన వర్ణముల వారికి మార్గదర్శకుడిగా ఉండాలి. నిత్యము వేదాధ్యయనము, అగ్నిహోత్రము ఆచరించాలి. క్షత్రియులు మీ మాటను అనుసరించి నడచుకుంటారు. ఎవరైనా అగ్నిని తాకవచ్చు, హిమాలయమును కదిలించ వచ్చు, గంగానదిని మూట కట్టవచ్చు కాని విప్రులను మాత్రము అవమానించ రాదు. విప్రులను కొలవడం కల్పవృక్షము వంటిది " అని బ్రహ్మ చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పక్షవాతం రాకుండా ఏమి చెయ్యాలి"?

  


*🩸"పక్షవాతం రాకుండా ఏమి చెయ్యాలి"?🩸*

                 ➖➖➖✍️



*చెట్టంత మనిషిని పక్షవాతం నిట్టనిలువునా కూల్చేస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం చేయొచ్చు. అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడేకన్నా అది రాకుండా చూసుకోవటమే మేలు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీటిల్లో చాలావరకు మనకు సాధ్యమైనవే కావటం మన అదృష్టం.*



*🩸 "రక్తపోటు అదుపు"*```


అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువుంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలి.```




*🩸"గుండెలయను కనిపెట్టండి"*```

గుండెలయ అస్తవ్యస్తమయ్యే సమస్య(ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌)తో పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువ. ఒకవేళ గుండె వేగంగా, అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంటే డాక్టర్‌ను సంప్రదించి కారణమేంటో తెలుసుకోవటం మంచిది. ఒకవేళ ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ సమస్య ఉన్నట్టయితే గుండె వేగాన్ని, రక్తం గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించే మందులు సూచిస్తారు.```



*🩸”ఒత్తిడికి కళ్లెం”*```

ఒత్తిడి మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తుతుంది. ఇది పక్షవాతం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తీరికలేని పనులతో ఆఫీసులో ఒత్తిడికి గురవుతుంటే మధ్యమధ్యలో కుర్చీలోంచి లేచి కాసేపు పచార్లు చేయండి. గాఢంగా శ్వాస తీసుకోండి. ఒకేసారి బోలెడన్ని పనులు ముందేసుకోకుండా ఒక పని పూర్తయ్యాక మరో పని ఆరంభించండి. పని చేసే వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవటం ఉత్తమం. వీలైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. ఆఫీసు పనులను ఇంటిదాకా తెచ్చుకోకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడపటం అలవాటు చేసుకోండి.```



*🩸"మధుమేహం నియంత్రణ"*```

మధుమేహంతో బాధపడేవారికి పక్షవాతం ముప్పు 1.5 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్లూకోజు స్థాయులు అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు, నాడులు దెబ్బతినటం. అంతేకాదు, మధుమేహంతో బాధపడేవారికి గుండెజబ్బు, పక్షవాతం ముప్పులు పెరగటానికి దోహదం చేసే అధిక రక్తపోటు, ఊబకాయం కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. కాబట్టి గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం అత్యవసరం.```



*🩸"మందులు తప్పొద్దు"*```

అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవైనా ఉంటే క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం తప్పనిసరి. మధ్యలో మానెయ్యటం తగదు. తమకు తోచినట్టుగా మందుల మోతాదులు తగ్గించుకోవటమూ సరికాదు.```



*🩸"అధిక బరువు తగ్గాలి"*```

అధిక బరువు, ఊబకాయంతో మధుమేహం, రక్తపోటు ముప్పులు పెరుగుతాయి. ఫలితంగా పక్షవాతం ముప్పూ ఎక్కువవుతుంది. 5 కిలోల బరువు తగ్గినా మంచి ఫలితం కనిపిస్తుంది. క్రమం తప్పకుండా రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం అన్ని విధాలా మంచిది.```



*🩸"పీచు పెంచండి"*```

రోజూ పొట్టు తీయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు విధిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలోని పీచు ఎంతో మేలు చేస్తుంది. రోజుకు మనకు 25 గ్రాముల పీచు అవసరం. ప్రతి 7% అధిక పీచుతో పక్షవాతం ముప్పు 7% తగ్గుతుంది.```



*🩸"పొగ మానెయ్యాలి'*```

సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చేవారికి రక్తం గడ్డలు, రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదముంది. ఇవన్నీ పక్షవాతం ముప్పు పెరిగేలా చేసేవే.```



*🩸''చెడ్డ కొలెస్ట్రాల్‌తో జాగ్రత్త"*```

చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ ఎక్కువగా.. మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీయొచ్చు. సంతృప్త కొవ్వు పదార్థాలు తగ్గించుకోవటం ద్వారా చెడ్డ కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవచ్చు. వ్యాయామం చేయటం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ మోతాదులు పెంచుకోవచ్చు. వీటితో ప్రయోజం కనిపించకపోతే మందులు తీసుకోవచ్చు.✍️ -సేకరణ.

ఈ గ్రూప్ లో వచ్చే మెసేజ్ లు

సేకరించినవి. కేవలం సభ్యుల 

అవగాహన కోసం మాత్రమే!

మీ డాక్టర్ కు ప్రత్యామ్నాయం కాదు!

మీ అన్ని ఆరోగ్యసమస్యలకు మీ

డాక్టర్ సలహాలను పాటించండి.🙏

```

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

⚜ శ్రీ హృదయలీశ్వర ఆలయం

  🕉 మన గుడి : నెం 1352


⚜  తమిళనాడు : తిరునింద్రవూరు


⚜  శ్రీ హృదయలీశ్వర ఆలయం


💠 హృదయదీశ్వర ఆలయం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని చెన్నై నగరానికి సమీపంలోని తిరునిన్రవూర్‌లో ఉన్న శివుడికి అంకితం చేయబడిన ఆలయం. 


💠 ఈ ఆలయం సుమారు 1300 సంవత్సరాల పురాతనమైనది మరియు తిరునిన్రావూర్‌కు చెందిన పూసలార్ నాయనార్ నుండి ఉద్భవించింది. 

అతను ఎల్లప్పుడూ తన శరీరం చుట్టూ బూడిదను పూసుకున్నందున అతన్ని పూసలార్ అని పిలుస్తారు.


💠 ప్రధాన దైవాన్ని హృదయలీశ్వరర్ / మానవళేశ్వరర్ అని మరియు తల్లిని మరగతంబిగై అని పిలుస్తారు. 

ఈ ఆలయం తిరునిన్రవూర్‌లోని భక్తవత్సల పెరుమాళ్ ఆలయానికి (దివ్య దేశం) చాలా దగ్గరగా ఉంది. 

ఈ ఆలయం 7వ శతాబ్దంలో రాజా సింహ పల్లవుడు నిర్మించాడు.


💠 పూసలర్ ఒక పేద శివ భక్తుడు, అతను తిరునిన్రావూర్‌లోని "ఇలుప్పై" చెట్టు కింద కూర్చుని ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండేవాడు. 


💠 అతను శివునికి గొప్ప భక్తుడు మరియు అతని కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. కానీ అతను ఆలయాన్ని నిర్మించడానికి తగినంత నిధులను సేకరించలేకపోయాడు. 


💠 అతను తన ప్రభువుకు ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్న అదే నమూనాలో తన హృదయంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు.


💠 ఆయన ఆలయ కుంభాభిషేకం (ప్రతిష్ట) కోసం ఒక శుభ తేదీని కూడా నిర్ణయించాడు. 

ఆయన శివుడిని ఆ ప్రతిష్టకు హాజరు కావాలని మరియు తన ఆశీస్సులు అందించాలని ప్రార్థించాడు. 


💠 అదే కాలంలో, రాజసింహ అనే పల్లవ రాజు ఈ ప్రాంతాన్ని కాంచీ (నేటి కాంచీపురం) రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. 

ఆయన కూడా శివునికి నిజాయితీగల భక్తుడు మరియు కాంచీలో భగవంతునికి ఒక పెద్ద అందమైన ఆలయాన్ని నిర్మిస్తున్నాడు.


💠 ఆయన దేవునికి కైలాసనాథర్ అని, ఆలయానికి రాజసిమ్మేశ్వరం అని పేరు పెట్టారు. 

తాను నిర్మించిన ఆలయ వైభవాన్ని చూసి రాజు చాలా గర్వపడ్డాడు. ఆలయంలో తుది మెరుగులు దిద్దుతున్న సమయంలో, రాజు కూడా ప్రతిష్టకు తేదీని నిర్ణయించాడు. 


💠 శివుడు తన కలలో కనిపించి, ఆ తేదీన రాజు గారి ఆలయ ప్రతిష్టకు తాను రాలేనని, ఆ తేదీ  రోజు తాను తిరునిన్రావూర్‌కు చెందిన పూసలార్ నిర్మించిన మరో ఆలయ ప్రతిష్టకు హాజరుకావాల్సి ఉన్నందున, ఆలయ ప్రతిష్ట రోజును మార్చమని కోరాడు.


💠 రాజు రాజసింహ అతని భక్తి గురించి విని తిరునిన్రావూర్‌కు వచ్చాడు.  దేవుని పట్ల ఆయనకున్న భక్తిని చూసిన రాజు ఇక్కడ ఒక గొప్ప శివ ఆలయాన్ని నిర్మించాడు


💠 పూసలర్ మొదట తన హృదయంలో భగవంతునికి ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి, ఇక్కడి స్వామిని హృదయలీశ్వరర్ అని పిలుస్తారు.


💠 మూలవర్ పక్కన గర్భగుడిపై పూసలార్ నాయనార్ విగ్రహాన్ని కూడా ఉంచాడు.

ప్రాకారంలో గణేష్, దక్షిణామూర్తి, సుబ్రమణ్యర్, విష్ణు, బ్రహ్మ, దుర్గ మరియు సందికేశ్వరులకు మందిరాలు ఉన్నాయి. 


💠 ఇక్కడ శివుడిని పూజించడం ద్వారా ప్రజల గుండె జబ్బులు నయమవుతాయని చెబుతారు. 

గుండె సమస్యలతో బాధపడుతున్న చాలా మంది నివారణ కోసం హృదయలీశ్వరుడిని ప్రార్థిస్తారు.  


💠 హృదయలీశ్వరర్ శక్తి ఎంత ప్రసిద్ధి చెందిందంటే, చెన్నై, కాంచీపురం మరియు తిరువళ్లూరులోని కార్డియాలజిస్టులు తిరునింద్రవూరును సందర్శించి, పెద్ద శస్త్రచికిత్స చేయించుకునే ముందు ఈ శివాలయంలో ప్రార్థనలు చేస్తారు. గుండె జబ్బులతో బాధపడేవారు సోమవారాల్లో ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. 

భక్తులు అభిషేకాలు, అర్చనలు చేసి స్వామికి, అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు.


💠 ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది, ఆలయ లోపలి పైకప్పు నాలుగు భాగాలుగా విభజించబడిన హృదయంలాగా రూపొందించబడింది, బహుశా పూసలార్ భావనను ప్రదర్శిస్తుంది. 

గంభీరమైన ద్వజస్తంభం మరియు నంది గర్భగుడి వైపు ఉన్నాయి.


💠 ప్రధాన దేవతను హృదయలీశ్వరర్ / మానవలీశ్వరర్ అని పిలుస్తారు మరియు తూర్పు ముఖంగా ఉంది. 

మూలవర్ చతురస్రాకార  లింగం.


💠 విమానం గజబృష్ట శైలికి చెందినది.  

శివుడు మరియు పార్వతి దంపతుల ఇద్దరు కుమారులు గణపతి మరియు సుబ్రహ్మణ్యుడు గర్భగుడి ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల లాగా నిలబడి ఉండటం చూడవచ్చు. తల్లిని మరగతంబిగై అని పిలుస్తారు మరియు దక్షిణం వైపు ముఖంగా ఉంటుంది. 

ఆమె నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. నవగ్రహ మందిరం ముందు రాజాసింహ విగ్రహం ఉంది


💠 మహా శివరాత్రి, మకర సంక్రాంతి, పంగుని ఉథిరం;వినాయక చతుర్థి; నవరాత్రి; మార్గళి ఆరుద్ర దర్శనం; కార్తీకి అనేవి ఆలయంలో ప్రధాన పండుగలు.


💠 ప్రదోషం, సోమవారాలు మరియు శుక్రవారాలు, తమిళ నూతన సంవత్సర దినం, అమావాస్య రోజులు, పౌర్ణమి రోజులు వంటి ఇతర శివ సంబంధిత రోజులను ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలతో జరుపుకుంటారు.


💠 ఈ ఆలయం తిరునిన్రవూర్ రైల్వే స్టేషన్ నుండి 1.5 కి.మీ., తిరువల్లూరు నుండి 18 కి.మీ., చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 35 కి.మీ.



రచన

©️ Santosh Kumar

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ:


య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి 

భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః (68)


న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః 

భవితా న చ మే తస్మాత్, అన్యః ప్రియతరో భువి (69)


పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నామీద పరమభక్తితో నన్ను చేరుతాడనడంలో సందేహం లేదు. అలాంటివాడికంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుషులలో మరొకడు లేడు. అతనికంటే నాకు ఎక్కువ మక్కువ కలిగినవాడు ఈ లోకంలో ఇక ఉండబోడు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ಸುಭಾಷಿತ

  ಸುಭಾಷಿತ . ೩೦೫ .


ಯೇ ಚ ಮೂಢತಮಾ ಲೋಕೇ ಯೇ ಚ ಬುದ್ಧೇಃ ಪರಂ ಗತಾಃ | ತ ಏವ ಸುಖಮೇಧಂತೇ ಮಧ್ಯಮಃ ಕ್ಲಿಶ್ಯತೇ ಜನಃ || 


ಯಾರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಅತ್ಯಂತ ಮೂಢರೋ , ಯಾರು ಅತ್ಯಂತ ಬುದ್ಧಿಶಾಲಿಗಳೋ ಅವರು ಸುಖವಾಗಿರುತ್ತಾರೆ : ಮಧ್ಯಮದರ್ಜೆಯವರು ಕಷ್ಟಪಡುತ್ತಾರೆ . 


ಮಹಾಭಾರತ , ಶಾಂತಿಪರ್ವ , ೨೫ - ೨೮ .

మానవ సేవే మాధవ సేవ

  అర్థం ఉన్న కధ

(మానవ సేవే మాధవ సేవ)


 నాన్న అప్పటికి హాస్పిటల్‌లో జాయినై వారంరోజులైంది. లివర్‌ పూర్తిగా పాడైపోయింది. మరో రెండు మూడు రోజులు మించి బతకరని డార్టర్లు తేల్చేశారు.


మొదటి రెండురోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కానీ, నాన్నకు నేను ప్రామిస్‌ చేశాక, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయమేస్తోంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను.


ఆ స్థితిలోనూ నాన్న నావంక బేలగా చూశారు. ఆయన కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న- ‘నువ్వు చేయగలవా?’


పెదవులు బిగబట్టాను. ‘మాట ఇచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది... ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది...చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోతోంది.’


‘ మరో రోజో... రెండురోజులో..! నేనెంతో ఇష్టపడే నాన్న- నన్ను... వూహు... ఈ లోకమే వదిలి వెళ్ళిపోతారు.’


డాక్టర్లు ఆ విషయం తేల్చి చెప్పేశారు.


నాన్న నాకు జీవితంలో అన్నీ సమకూర్చి ఇచ్చారు. కానీ, ఏనాడూ ఏదీ అడగలేదు. చనిపోతానని తెలిశాక ఒక్క కోరిక... ఒకే ఒక్క కోరిక కోరారు.


‘‘ ఏరా నవీన్‌, నేను చనిపోతే నా శవాన్ని, మీ అమ్మ సమాధి పక్కనే ఖననం చేయగలవా?’’


అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది. అందుకే దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా ‘‘అలా అనకు నాన్నా... మీకేం కాదు’’ అంటూ తనకు బతుకు మీద భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను.


‘‘ నాకు ఇప్పుడేమవుతుందో, రేపేమవుతుందోనన్న భయం లేదురా... ఎప్పుడు, ఎలా జరిగినా చివరికి అక్కడికి చేరుకోవాలనే కోరిక మాత్రమే మిగిలింది. నేను వెళ్ళిపోయాక నాకేం కావాలో నిన్నడుగుతున్నాను... నాకు కావలసింది చేయగలవా?’’


‘‘తప్పకుండా చేస్తాను నాన్నా.’’


మూడురోజుల క్రితం నాన్నకు మాటిచ్చాను.


మర్నాటి నుంచీ ఆయన నన్ను మరింత పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు. రెండోరోజు నా ముఖంలో నిరాశ కదలాడటం ఆయన గమనించినట్టున్నారు. అందుకే అడిగేశారు ‘‘నేను అడిగింది చేయగలవా?’’


‘‘ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాన్నా.’’


ఆయనకు విషయం కొంతవరకూ అర్థమైనట్టుంది. మౌనంగా ఉండిపోయారు. కానీ, నాకేసి ఆర్తిగా చూడటం మానలేదు.


ఒకవైపు ప్రాణాలు పోబోతున్నాయని తెలుస్తూనే ఉంది. మనిషి అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ, కాసింత తెలివి వచ్చినా, నాకేసి అలా ప్రశ్నకు జవాబు కోసమే ఎదురుచూస్తున్నారు.


ఐసీయూలో నుంచి నెమ్మదిగా బయటకు నడిచాను. కారిడార్‌లో నా కోసమే ఎదురుచూస్తున్న మా ఆవిడ నా ముఖం చూసి అడిగింది ‘‘ఏంటీ, ఆయన అడిగినదాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా?’’


అవూనూ కాదూల మధ్య తలాడించాను.


ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు ఆమె అంది... ‘‘చేస్తానన్నారు కదా... చేస్తాననే చెప్పండి. అదే భ్రమలో ఆయనను పోనివ్వండి. పోయాక ఏం జరింగిందన్నది ఆయనకు తెలియదు కదా! మనం ఆ దహన సంస్కారాలేవో ఇక్కడే చేద్దాం.’’


నేను మా ఆవిడకేసి నిరాభావంగా చూశాను. మనుషుల్ని మోసం చేయడం అలవాటైపోయింది. చివరికి శవాలను కూడా మోసం చేయడం!?


నేనేం మాట్లాడకపోయేసరికి తను కాస్త ఈసడింపుగా తల పక్కకు తిప్పుకుని తన పిల్లల దగ్గరకెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది.


నిన్నటి నుంచీ చేసిన నా ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ అలా నిలబడిపోయాను.


విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపించింది... శవాన్ని ఓ పల్లెకు చేర్చి ఆయన కోరుకున్న చోట పూడ్చిపెట్టడం!


అది నాన్న మాస్టారుగా ఉద్యోగం చేసిన వూరు. నేను పుట్టి పెరిగిందీ ఆ పల్లెలోనే! ఆరేళ్ళక్రితం వరకూ నాన్న, అమ్మతో కలసి ఆ వూళ్ళొనే ఉండేవారు. అమ్మ చనిపోయాక తనను ఒంటరిగా ఉంచడం ఇష్టంలేక హైదరాబాద్‌ తీసుకొచ్చేశాను.


ఆ వూరు సిటీకి ఆరువందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్‌లో ఆ వూరికి శవాన్ని తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ, శవాన్ని తిన్నగా స్మశానానికి తీసుకెళ్ళలేం. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఏదో ఇంట్లో దించి అక్కడినుండి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి.


ఒకప్పుడు ఆ వూళ్ళొ మాకు బంధుమిత్రులు ఎక్కువగానే ఉండేవారు. కానీ నేను హైదరాబాద్‌ వచ్చేశాక వాళ్ళతో రిలేషన్స్‌ మెయిన్‌టైన్‌ చేయలేకపోయాను. అందులోనూ దూరపు వరసైనా... పెదనాన్న, పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఆ తరంవాళ్ళు వెళ్లిపోయారు. ఇప్పుడు పొరుగింటితో కూడా సంబంధం అవసరంలేదనుకుని టీవీ, మొబైల్‌ ఫోన్‌లతో గడిపే మనుషులు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితిలో శవాన్ని తమ ఇంటినుండి సాగనంపేవాళ్ళెవరు!?


ఆ వూళ్ళొ నాకున్న బంధుమిత్రులను గుర్తుచేసుకున్నాను. వాళ్ళలో నాకు మొదటగా గుర్తొచ్చింది... మా బాబాయి కొడుకు వీరమోహన్‌.


ఈమధ్య కాలంలో వాడికి కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. రెండేళ్ళక్రితం వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. బాగా బిజీగా ఉండటంతో పెళ్ళికి వెళ్ళలేకపోయాను. బిజీ... మనుషులతో అనుబంధాలను కాపాడుకోవడంకన్నా ఇతరత్రా బిజీలు మనిషికి ఎక్కువైపోయాయి. నేనూ అందుకు అతీతుణ్ణి కాను.


అందుకే వాడికి ఫోన్‌ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పదు కాబట్టి చేశాను. ‘‘నాన్న ఒకే ఒక ఆఖరి కోరిక చెప్పి తన మరణానంతరం అక్కడికి తీసుకొస్తానన్నాను. మీ ఇంటి నుంచి నాన్నను సాగనంపుదాం’’ అని అడిగాను.


‘‘ఒక అరగంట ఆగి ఫోన్‌ చెయ్యి’’ అన్నాడు వాడు.


అరగంటాగి ఫోన్‌ చేశాక, అప్పటికే కుటుంబసభ్యులతో మాట్లాడాడేమో, విషయం వివరించాడు. ‘‘సారీ అన్నయ్యా, ఈ వారంలోనే మా పెద్దమ్మాయీ, అల్లుడూ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. అందులోనూ అమ్మాయికి సంవత్సరం బాబు... ఏమనుకోకు’’ అన్నాడు.


జీవితంలో ఏ విషయంలోనూ తిరస్కారం భరించలేనిస్థితి నాదని నా ఉద్దేశం. నన్ను నేను కంట్రోల్‌ చేసుకుంటూ దీర్ఘంగా విశ్వసించాను.


తిరస్కారం తాలూకు అవమానాన్ని మించిన భయం మొదటిసారి కలిగింది. నేను సులభంగా చేయగలననుకున్నది చేయడం చాలా కష్టమా? ఆ వూళ్ళొ వాడొక్కడే కాదు...నేను పుట్టి పెరిగిన వూళ్ళొ నాన్నను తమ ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి నాకంటూ ఎవరూ లేరా? ఆలోచించసాగాను... ఇలా ఆలోచించవలసిన అవసరం చాలామందికి రాదేమో! ఒక్కసారి ఆలోచిస్తే, అంచనా వేస్తే మనకంటూ ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో అర్థమవుతుంది.


అలా ఆలోచిస్తుంటే నాకు నా ఫ్రెండ్‌ రఘు గుర్తుకొచ్చాడు.


మా నాన్నను వాడి ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి వాడు ఒప్పుకుంటాడనే అనుకున్నాను.


వాడికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను.


వాడు ‘సారీ’ అంటూ, అలా అనడానికి గల కారణాలు వివరించాడు- ‘‘ఒక ఇంటినుంచి శవాన్ని తరలిస్తే ఆ ఇంటికి అంటిన మైల శుద్ధి చేయాలి. పంతులుగారి చేత శాంతిపూజలు చేయించాలి. అంతేకాదు, శవాన్ని తరలించేటప్పుడు వెలిగించిన దీపం పెద్దకర్మ వరకూ వెలుగుతుండాలి. పెద్దకర్మ కూడా ఆ ఇంటిలోనే చేయాలి. ఇదంతా చాలా కష్టం నవీన్‌.’’


సాటిజీవిని ఇష్టంగానైనా, కష్టంగానైనా భరించగలిగే మనిషి, పార్థివదేహాన్ని ఏవిధంగానూ భరించలేడన్న నిజం నాకర్థమయింది.


చాలా బాధగా అనిపించింది. బాధకన్నా కర్తవ్యం నన్ను భయపెట్టసాగింది.


ఎలా..? ఎలా..?


ఆయన బేలచూపులే నాకు గుర్తుకొస్తున్నాయి.


ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాననుకున్న నేను, నాన్న కోరిన ఆఖరి చిన్న కోరికను తీర్చలేకపోవడమా?... బాధగా ఉంది...భయమేస్తోంది... నామీద నాకే జాలి కలుగుతోంది.


అలా ఆలోచిస్తుంటే రామ్మోహన్‌ గుర్తుకొచ్చాడు. తను నాకు క్లాస్‌మేటేగానీ ఎప్పుడూ అంత క్లోజ్‌గా ఉండలేదు. కాకపోతే తను సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటాడని తెలుసు.


రామ్మోహన్‌కి ఫోన్‌ చేశాను. ఒక విధంగా అతడిని బ్రతిమలాడుకుంటున్నట్టుగా మాట్లాడాను. ‘‘ఇది నాన్నగారి ఒకే ఒక కోరిక రామ్మోహన్‌! చాలా చిన్న కోరికే అనుకున్నాను. కానీ, అది చాలా పెద్ద కోరిక అనీ, నా శక్తికి మించినదనీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మర్చిపోయిన పుట్టిన వూరి మట్టిలో కలవడం ఎంత కష్టమో అర్థమవుతోంది. ఇందులో నాన్న తప్పేంలేదు. నేనే బలవంతంగా ఆ వూరితో ఆయనకు సంబంధాలు తెంచేశాను. ఇల్లు అమ్మొద్దన్నా, ‘మనం ఆ వూరు వెళ్తామా ఏంటి?’ అంటూ అవసరంలేకున్నా ఇంటిని అమ్మేశాను. కొత్త రిలేషన్స్‌ మధ్య పాత బంధుమిత్రులను పట్టించుకోవటం మానేశాను. ఇప్పుడు ఆ పల్లె జ్ఞాపకాలే తప్ప ఏవిధమైన బంధం లేకపోయింది. చివరికి నాన్నను సంప్రదాయబద్ధంగా సాగనంపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.’’


నా మాటకు వాడు కదిలిపోయినట్టున్నాడు. ‘‘సరే, ఓ పని చేస్తాను. వూరి ప్రెసిడెంట్‌ని అడిగి కాసేపు శవాన్ని పంచాయితీ ఆఫీసులో ఉంచుదాం. అక్కడినుంచి లాంఛనాలతో... అదే పాడె కట్టి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్దాం.’’


అంతకుమించి మరోమార్గం లేదు. ప్రముఖ నాయకులను పార్టీ కార్యాలయంలో కాసేపు ఉంచినట్టు... అలా ఆయనను సాగనంపాలి.


తను కోరుకున్న చోటుకు చేరబోతున్నానని ఎలా తెలిసిందో... అరగంట తర్వాత డాక్టర్‌ మా దగ్గరకు వచ్చి డెత్‌ కన్‌ఫర్మ్‌ చేశాడు.


అంబులెన్స్‌ పల్లెను సమీపిస్తోంది.

వెనుకే కారులో నా కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను.


హైదరాబాద్‌లో ఉన్న నా సర్కిల్‌ నుంచి ఫోన్స్‌ వస్తూనే ఉన్నాయి.


‘‘ఇప్పుడే విషయం తెలిసింది... ఎలా జరిగింది? సారీ, అంత దూరం రాలేకపోతున్నాను. ఇక్కడికి రాగానే ఇంటికొచ్చి కలుస్తాను.’’


కమ్యూనికేషన్‌ పెరిగిన ఈ కాలంలో ఈ తరహా ఓదార్పుకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే!


అంబులెన్స్‌ పంచాయితీ ఆఫీసు సమీపించింది. అప్పటికే అక్కడ నేను ఎప్పుడూ పట్టించుకోని బంధుమిత్రులు పదిమంది వరకూ ఉన్నారు.


వాళ్ళలో ఒకరిద్దరు అంబులెన్స్‌ దగ్గరకొచ్చి ఫ్రీజర్‌ని కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు.


అప్పుడు...అప్పుడు ముందుకొచ్చాడు...రమేష్‌!


‘‘ఆగండి...’’


అందరం అతడికేసి చూశాం.


‘‘మాస్టార్ని ఇక్కడ దించొద్దు.’’


‘‘ఎ... ఎందుకని?’’ నా గొంతు వణికింది.


‘‘ఏ పార్థివ దేహమైనా ఇంటినుంచి లాంఛనాలతో శ్మశానం చేరుకోవాలి. కేవలం అనాధశవాలు మాత్రమే మార్చురీ నుంచో, పంచాయితీ ఆఫీసుల నుంచో శ్మశానానికి చేరుకుంటాయి.’’


నాలో... భయం, బాధ, దుఃఖం, కోపం కలగలిసిన నిస్సహాయత. ‘మా నాన్న దగ్గర చదువుకున్న వీడు... చివరికి ఆయనను అనాధశవంలా కూడా సాగనంపకుండా అడ్డుపడుతున్నాడా?’


నేనేదో అనబోయేంతలో రామ్మోహన్‌ వాడిని అడిగాడు ‘‘అయితే ఇప్పుడేమంటావ్‌?’’


‘‘ఆయన నాకు చదువు చెప్పారు. ‘తల్లీ తండ్రీ గురువూ దైవం’ అన్నారు. తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో, గురువు పట్ల కూడా అంత బాధ్యత చూపించడం ధర్మం. అందుకే ఆయన పార్థివ దేహాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను.’’


అక్కడున్న వాళ్ళందరూ వాడికేసి నమ్మలేనట్టు చూశారు.


నాకు మాత్రం అదో అద్భుతంలాగే అనిపించింది. అంతకుమించి ‘మనిషి మరణించలేదు’ అనుకున్నాను. ఎందుకంటే, ఏ రక్త సంబంధమూ లేకుండా శవాన్ని తన ఇంటినుంచి సాగనంపే మానవత్వం ఎందరికుంటుంది.


శవం రమేష్‌ ఇంటికి చేరుకుంది.


అప్పటివరకూ పట్టుమని పదిమంది లేరు. కానీ, శవం శ్మశానానికి బయలుదేరగానే వూరు వూరంతా వెనుక నడిచొచ్చింది.


నా స్థితీ, హోదాల కారణంగా వారెవరూ రాలేదు.


అది మా నాన్న చేసుకున్న పుణ్యం! ఎందుకంటే ఆయన "టీచర్" కాబట్టి. ఆ ఊరిలో వేలమందికి ఆయన జ్ఞానభిక్ష పెట్టారు కాబట్టి.


మనిషి బతికుండగా ఇష్టమైన ప్రదేశాలు చూడాలని యాత్రలు చేస్తాడు. కానీ, మరణం సమీపించాక తనకిష్టమైన చోటే తనువు ఆగిపోవాలని ఆశిస్తాడు. అయితే చాలా కొద్దిమందికే ఆ కోరిక తీరుతుంది, తనకత్యంత ఇష్టమైనచోట శాశ్వత విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది.


మా నాన్న ఆ విధంగా అదృష్టవంతుడు!


కర్మకాండలన్నీ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ తిరిగొచ్చాం.


ఆ రాత్రి ప్రమద్వర నా భుజంమీద తల వాల్చి, గుండెల మీద చెయ్యేసింది. ఆ చేతి స్పర్శలో మునుపెన్నడూ లేనంత ఆప్యాయత కనిపించింది.


‘‘ఏమండీ...’’


‘‘వూ...’’


‘‘నేను చనిపోతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోరుగా! అత్తయ్యగారి పక్కన మామయ్య ఉన్నట్టు మీరూ నా పక్కనే ఉంటారుగా...’’


ఒక సంఘటన ఎందరికో ఉత్తేజాన్నిస్తుంది. ‘నాన్న శవాన్ని అమ్మ దగ్గరకు చేర్చనవసరంలేదన్న’ ఆమె, మరణించాక కూడా నాతో కలసి గడపాలనుకుంటోంది.


నేను తనచుట్టూ చేతులేసి ‘‘అలాగే’’ అన్నాను.


* * 

ఆ రాత్రి నాకో కల వచ్చింది...


అమ్మ నిద్ర లేచింది. పక్కనే పడుకుని ఉన్న నాన్నను నిద్ర లేపుతోంది. ‘‘ఏమండీ... ఏమండీ...’’


నాన్నకు మెలకువ వచ్చింది. ‘‘సారీ జానకీ, శాశ్వత నిద్ర కదా...త్వరగా మెలకువ రాలేదు.’’


‘‘ఫరవాలేదులెండి... ఏదో పక్కనే ఉన్నారు కనుక మిమ్మల్ని పిలవగలిగాను... అదే ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేసేదాన్ని. ఏదో మన పుణ్యం కొద్దీ ఇద్దరం ఒక్కచోటే ఉండే అదృష్టం దక్కింది.’’


‘‘మనిద్దరం కలిసే ఇకపై మన పిల్లల్ని దీవించొచ్చు’’ నాన్న ఆనందంగా అన్నాడు.


వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోసాగారు.


నాకు మెలకువ వచ్చింది. మనసంతా ఏదో తెలియని ఆనందం.


అరవై ఏళ్ళు కలసి జీవించి ఆరేళ్ళుగా దూరమైన ఆ తనువులు... ఒకేచోట మట్టిలో కలసిపోవడం... బిడ్డలు తలచుకుంటే సాధ్యమేనేమో!


హృదయాన్ని కదిలించే...అవార్డు పొందిన రచన...


" మానవ సేవే మాధవ సేవ "


 🙏🙏సేకరణ🙏🙏

15జనవరి పండుగ.

*2026 మకరసంక్రమణం* సూర్యసిద్ధాంతం ప్రకారం 14జనవరి సుమారు రాత్రి8.30 పైన ప్రవేశం జరిగినది.. ఇది కచ్చితం..ఇటువంటి సందర్భంగా ధర్మశాస్త్రం మరుసటి రోజున తర్పణాలు ఉదయం 8.30 లోపు జరపమని సంక్రాంతి పండుగ 15 జరుపాలని భారతీయ ధర్మశాస్త్రం తెలియచేస్తుంది.. భారతీయ గణితగ్రంథం సూర్యసిద్ధాంతం ప్రకారం ఇది పాటించేవారికి ఈ ప్రకారం గణితం చేసేపంచాంగకర్తలు వారి వారి గణితాలు వ్రాసి ఉన్నారు.. కావున భారతీయ సూర్యసిద్ధాంతం ప్రకారం 15జనవరి పండుగ.. కప్పగంతు సుబ్బరామసోమయాజులు.

షష్టిపూర్తి

                      *షష్టిపూర్తి*

                    ➖➖➖✍️


*"షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?"* 

                        

```

మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 

60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ‘ఉగ్రరథుడు’ అను పేరుతో, 

70 వ యేట ‘భీమరథుడు’ అను పేరుతో, 

78 వ యేట ‘విజయరథుడు’ అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.


బృహస్పతి,శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.


మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.


షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము… ‘ఆయుష్కామనయజ్ఞము’


పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు..


తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు అడ్డగీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం. అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.


పక్షములను, తిధులను, వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లను ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.


అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపములను కూడా చేస్తారు. 


తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.


పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.


పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. 


ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. 


బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి."✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

నల్లద్రాక్ష

  

*మన ఆరోగ్యం…!


                 *నల్లద్రాక్ష...*

               ➖➖➖✍️

 ఆరోగ్య చిట్కాలు..



*స్త్రీల ఆరోగ్యానికి రక్ష:*


పుల్లగా, తీయగా ఉండే ద్రాక్షలో పోషకాలు ఎక్కువే. 


అందులోనూ నల్లద్రాక్షలో మహిళలకు మేలు చేసే సుగుణాలెన్నో! 


మరి వాటి గురించి తెలుసుకుందాం ...


*నల్లద్రాక్ష ముందస్తు వృద్ధాప్య ఛాయల్ని అదుపులో ఉంచుతుం దట. 

*ముఖ్యంగా కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం తాజాగా మెరిసిపోతుంది.


*ఈ పండ్లలో ఉండే రెస్వెరాట్రాల్ సహజ ఈస్ట్రోజన్లా పనిచేసి హార్మోన్ల అసమతుల్యత రాకుండా చేస్తుంది. వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్ వంటి వాటిని అదుపులో ఉంచుతుంది. ఎముక బలాన్ని కాపాడుతుంది.


*రెస్వెరాట్రాల్, పాలీఫెనాల్స్ నల్లద్రాక్షలో మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో రొమ్ముక్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుం టాయి. దీంతో ఆ ముప్పు తగ్గుతుంది.


*మెనోపాజ్ తర్వాత మహిళలు గుండెజబ్బుల బారిన పడుతుంటారు. నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి కండరాలకు మేలుచేస్తాయి. 


*రక్తపోటు అదుపులో ఉండటమే కాదు... గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


*బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను తీసుకుంటే సరి. వీటిలోని యాంటీఆ క్సిడెంట్లు శరీరంలోని వ్యర్థా లను తొలగించి, బరువు తగ్గించేందుకు కారణం అవు తాయి.✍️-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*616 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


ఇంద్రుడు శంబరుడు

భీష్ముడు ఇంకా " ధర్మనందనా ! ఈ విషయంలో ఇంద్రుడికి శబరుడికి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను విను. శంబరుడు జటాసురుడి కొడుకు. జటాసురుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు జటాసురుడి వద్దకు వెళ్ళి " నీకు ఈ ఉన్నత స్థితి ఎలా వచ్చింది. జటాసురుడు " నాకు బ్రాహ్మణుల మీద కోపము అసూయ లేవు. నేను ఎల్లప్పుడు బ్రాహ్మణులను రక్షిస్తాను. అందుకే నాకు ఈ వైభవము కలిగింది. దేవాసురయుద్ధములో బ్రాహ్మణుల అనుగ్రహము వలనే కదా దేవతలు గెలిచారు. అది చూసి నా జనకుడు చంద్రుడితో " ఆహా ! విప్రులు మహానుభావులు కదా అందుకే దేవతలు గెలిచారు " అన్నాడు. అప్పుడు నా జనకునితో చంద్రుడు " బ్రాహ్మణులు, తపస్సు, వేదాధ్యయనము ఎల్లప్పుడు ఆచరిస్తారు. బ్రాహ్మణుడు ఎంత దూరము వెళ్ళి అయినా గురుశుశ్రూష చేసి విద్యను అభ్యసిస్తాడు. తరువాత తపస్సు చేస్తాడు. అది బ్రాహ్మణుడికి విధించిన కర్మ. కనుక బ్రాహ్మణుడు అందరికీ అధికుడు. అటువంటి బ్రాహ్మణులను ఆదరించిన శుభములు, అవమానించిన అశుభములు కలుగుతాయి అనడంలో సందేహం లేదు " అని చెప్పగా నేను విన్నాను. చంద్రుడి మాటలు మన్నించి నా జనకుడు బ్రాహ్మణులను పూజించాడు. అందుకనే తేజస్సుతో వెలుగొందుతున్నాడు. నా తండ్రి మాదిరి నేను కూడా బ్రాహ్మణులను పూజించి ఇంతటి ఉన్నత స్థితికి చేరాను " అని శంబరుడు ఇంద్రుడికి చెప్పాడు. కనుక ధర్మనందనా ! నీవు కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజించి ఆదరించి శుభములు పొందుము " అని భీష్ముడు చెప్పాడు.

రాజు ఆదరించ తగిన వారు

ధర్మరాజా " పితామహా ! సదా తనవెంట ఉండేవారు దూరంనుండి వచ్చినవారు వీరిలో ఉత్తములెవ్వరు. ఎవరిని ఆదరించాలి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! క్రోధమూ, ఈర్ష్య లేని వారు, స్నేహితులు, బంధువులు, సంబంధులు, ఋత్విజులు, పురోహితులు వీరంతా ఆదరించతగిన వారే. దూరం నుండి వచ్చిన వారిలో తెలియని వారిలో ఆచారశీలురు, విద్యావంతులు, గౌరవనీయులు అందరూ పూజింపతగిన వారు " అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు " పితామహా ! లోకంలో ఉన్న పాపాలన్నింటికీ స్త్రీలు మూలకారణం అంటారు కదా ! అలా ఎందుకు అంటారో చెప్పండి " అని అడిగారు. భీష్ముడు " ధర్మనందనా ! స్త్రీలు నీవు చెప్పినటువంటి వారే. ఈ సందర్భంలో నీకు నారదుడికి పంచచూడ అనే అప్సరసకు జరిగిన సంవాదము తెలుపుతాను. ఒకసారి నారదుడు లోక సంచారము చేస్తూ పంచచూడ అనే అప్సరసను చూసి " లలనా ! నిన్ను ఒక విషయము అడుగుతాను చెప్పు " అని అడిగాడు. పంచచూడ " మహాత్మా ! అడగండి నాకు తెలిసినంత వరకు చెప్తాను " అని పలికింది. నారదుడు " వనితల స్వభావము ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాడు. పంచచూడ " అదేమిటి మహామునీ ! నేను వనితను. వనితలు మరొక వనితల గురించి చెడుగా ఎలా చెప్తారు " అనుకున్నావు. నారదుడు " నీవు నిజము చెప్పిన నీకు దోషము ఏమీ రాదు చెప్పు " అని అడిగాడు. పంచచూడ " మహాత్మా ! స్త్రీస్వభావములు మీరు ఎరుగనివా ! అయినా మీరు అడిగారు కనుక చెప్తాను. మంచి కులమున పుట్టీ, గౌరవమర్యాదలు కలిగి ఉండీ, ఒకరికి భార్య అయి ఉండీ స్త్రీ పరపురుషుడితో తిరుగుతుంది. ఇంది స్త్రీ స్వభావము ఇందుకు ఏమని చెప్పాలి. ఇది ఎవరికి అర్ధము కాదు. స్త్రీలు సర్వదోషముకు కారణము. పురుషుల మంచితనము మగువలకు అర్ధము చేసుకొనక పరాయి పురుషులను పొగుడుతుంటారు. రాజదండన భయము లేకపోతే స్త్రీలను అదుపు చేయడం కష్టమే. ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తి ఉండదు. ఎన్ని నదులు కలిసినా సముద్రుడికి తృప్తి ఉండదు. ఎంత మంది ప్రాణాలు హరించినా మృత్యుదేవతకు తృప్తి ఉండదు " అని చెప్పిన పంచచూడ మాటలకు నారదుడు తృప్తి చెందాడు. ధర్మనందనా నీ ప్రశ్నకు ఇదే సమాధానము " అని భీష్ముడు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ జగన్నాథ పెరుమాళ్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1353


⚜  తమిళనాడు : తిరుమజిసై - తిరువళ్లూరు


⚜  శ్రీ జగన్నాథ పెరుమాళ్ ఆలయం


 

💠 జగన్నాథ పెరుమాళ్ ఆలయం (తిరుమళిసాయి ఆలయం అని కూడా పిలుస్తారు) దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని చెన్నై నగరంలోని తిరుమళిసాయిలో  విష్ణువుకు అంకితం చేయబడింది. 


💠 ఇది ద్రావిడ శైలి నిర్మాణ శైలిలో నిర్మించబడింది, జగన్నాథ పెరుమాళ్‌గా మరియు అతని భార్య లక్ష్మిని తిరుమళివల్లిగా పూజిస్తారు. 


💠 ఈ ఆలయం పన్నెండు మంది ఆళ్వార్లలో ఒకరైన తిరుమళిసాయి ఆళ్వార్ జన్మస్థలం అని నమ్ముతారు, వీరి రచన దివ్య ప్రబంధంగా సంకలనం చేయబడింది.


💠 హిందూ పురాణం ప్రకారం, సప్తఋషులు , ఏడుగురు ఋషులు, మధ్య జగన్నాథుడిని (అక్షరాలా మధ్యలో ఉన్న జగన్నాథుడు అని అర్థం) చూడాలనుకున్నారు. 


💠 హిందూ పురాణం ప్రకారం, పూరి జగన్నాథ ఆలయంలోని జగనాథుడిని వాడ జగన్నాథ (ఉత్తరంలో ఉన్న) అని పిలుస్తారు , తిరుమజిసై వద్ద ఉన్న జగన్నాథుడు మధ్యమ జగన్నాథ మరియు తిరుపుల్లనిలోని ఆది జగన్నాథ పెరుమాళ్ ఆలయంలో ఉన్న దానిని కీళ జగన్నాథ అని పిలుస్తారు . 


💠 జగన్నాథుడు తిరుపుల్లనిలో శయన భంగిమలో, పూరీలో నిలబడి కనిపిస్తాడు, ఇక్కడ ఆయన కూర్చున్న రూపంలో దర్శనం ఇస్తారు .

అందుకే ఈ ప్రదేశాన్ని మధ్య జగన్నాథం మరియు పూర్ణ జగన్నాథం అని పూజిస్తారు. 

ఇది తిరుమళిశాయి ఆళ్వార్ జన్మస్థలం కాబట్టి, ఈ ప్రదేశానికి ఆ సాధువు పేరు కూడా పెట్టారు.


💠 ఋషుల కోరిక మేరకు, విష్ణువు ఈ ప్రదేశంలో మధ్య జగన్నాథుడిగా కనిపించాడని నమ్ముతారు. 


💠 చోళ మరియు విజయనగర కాలంలో ఇక్కడ స్థిరపడిన వేద ప్రజల సంఖ్య కారణంగా తిరుమళిశైని మొదట చురుకురవల్లి, చతుర్వేదిమంగళం, పక్కతురైవల్ల,, మహిషారం మరియు మహాక్షేత్రం వంటి వివిధ పేర్లతో పిలిచేవారు.


💠 జగన్నాథ పెరుమాళ్ సన్నిధికి ఎడమ వైపున దక్షిణం వైపు తిరుమళిశాయి ఆళ్వార్ సన్నిధి ఉంది. మూలవర్ దేవత యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే అతను మూడవ కన్నుతో కనిపిస్తాడు.


💠 ఈ ప్రదేశంలో తిరుమళిశాయి ఆళ్వార్ యోగ తపస్సు చేస్తున్నాడని తెలిసి ఆ ప్రదేశం మీదుగా ఎగురుతూ వెళ్తున్న శివుడు మరియు పార్వతి అతని తపస్సుకు సంతోషించి తిరుమళిశాయిలో దిగారు. 


💠 వరం కోరినప్పుడు, తిరుమళిశాయి ఆళ్వార్ ముక్తిని మాత్రమే అడిగాడు, కానీ విష్ణువుకు మాత్రమే మోక్షం ఇచ్చే శక్తి ఉంది కాబట్టి తిరస్కరించాడు.

తరువాత అతను తన చిరిగిన బట్టలు కుట్టడానికి ఉపయోగించే సూదిలోకి చిన్న దారం వేయమని అడిగాడు. 


💠 ఈ కోరికతో కోపంతో శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. తిరుమళిశాయి ఆళ్వార్ నారాయణుడి ఆశీస్సులను కోరాడు మరియు వెంటనే తిరుమళిశాయికి కూడా మూడవ కన్ను ఉద్భవించింది, శివుని మూడవ కన్ను నుండి రగులుతున్న అగ్నిని చల్లబరచడానికి నీరు బయటకు వచ్చింది. తిరుమళిశాయి ఆళ్వార్ భక్తికి సంతోషించిన శివుడు

అతనికి 'భక్తి సారన్' అనే బిరుదును ఇచ్చాడు.


💠 అతను సుదర్శన చక్రం యొక్క అవతారంగా నమ్ముతారు.  తిరుమజిసాయి ఆళ్వార్ ఇక్కడ జన్మించినప్పటికీ, ఇక్కడ పెరుమాళ్‌ను కీర్తిస్తూ పాడలేదు.


💠 ఇక్కడ జగన్నాథ పెరుమాళ్ రుక్మిణి మరియు సత్యభామలతో కలిసి కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు.  

కుడి కాలు వంచి, ఎడమ కాలు వేలాడుతూ, రుక్మిణి మరియు సత్యభామలతో కలిసి కూర్చున్న భంగిమ.

ఇక్కడ ప్రధాన విగ్రహం స్వయంభూ.

ఈ ఆలయాన్ని తిరుమజిసై ఆళ్వార్ దేవాలయం అని కూడా అంటారు. 


💠 ఈ ఆలయం వైకాసన ఆగమ సంప్రదాయం ఆధారంగా తెంగలై ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. 


💠 ఈ ఆలయం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తెరిచి ఉంటుంది.


💠 ఆలయ పూజారులు పండుగల సమయంలో మరియు ప్రతిరోజూ పూజలు (ఆచారాలు) నిర్వహిస్తారు. తమిళనాడులోని ఇతర విష్ణు దేవాలయాల మాదిరిగానే, పూజారులు బ్రాహ్మణ ఉప కులమైన వైష్ణవ సమాజానికి చెందినవారు. 


💠 ఆలయంలో వివిధ పండుగలు జరుపుకుంటారు, అక్టోబర్ - నవంబర్ నెలల్లో ఆణి బ్రహ్మోత్సవం, మనవాళ మాముని పండుగ మరియు ఫిబ్రవరి - మార్చిలో జరిగే మాసి తెప్పోత్సవం అత్యంత ప్రముఖమైనవి. 


💠 చెన్నై నుండి పూనమల్లి - తిరువళ్లూరు-తిరుపతి రహదారిపై సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమజిసైలో మధ్యమ జగన్నాథ పెరుమాళ్ ఆలయం ఉంది


రచన


©️ Santosh Kumar

గరుడ’ పథకం

  📢 *ఏపీ ప్రభుత్వం – కీలక ప్రకటన*


🕉️ పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.


🔹 బ్రాహ్మణ కుటుంబంలో మరణం సంభవిస్తే

👉 సంబంధిత కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సాయం అందజేయనున్నారు.


🔹 ఈ పథకం కష్ట సమయంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు రూపకల్పన చేయబడింది.


🔹 ఇప్పటికే పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది.


🔹 అమరావతి సచివాలయంలో

మంత్రి సవిత గారు – బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ గారితో సమావేశమై

👉 గరుడ పథకం అమలు విధానంపై చర్చించారు.


📌 అధికారిక మార్గదర్శకాలు విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలియజేయబడతాయి.


🙏 ఈ సమాచారం అవసరమైన వారికి షేర్ చేయండి

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః 

జ్ఞానయజ్ఞేన తేనాహమ్, ఇష్టః స్యామితి మే మతిః (70)


శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః 

సో௨పి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్

  మ్ (71)


మన వుభయులకీ మధ్య జరిగిన ఈ ధర్మసంవాదాన్ని చదివినవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా వుద్దేశం. ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయలేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొంది, పుణ్యాత్ములుండే శుభలోకాలను చేరుతాడు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

విజయాన్ని సాధించగలరు.*

  *నేటి సూక్తి*


*ఓటమి నేర్పిన అనుభవాన్ని గుర్తు పెట్టుకొని జాగ్రత్త పడినప్పుడే విజయాన్ని సాధించగలరు.*


*క్రాంతి కిరణాలు*


*కం. ఓటమి కలిగిన గెలుపును*

 *ధీటుగ సాధించబూని తెలివిని పెంచున్*

*చేటును కలిగిన విధమును*

*బాటననుభవమున వేయు ఫలితము కొరకై*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

శ్రీహరి స్తుతి 28*

  *శ్రీహరి స్తుతి 28*


*కం. నిరతము నీ ధ్యానంబును*

 *మరువకనే చేయుచుందు మహిమాన్వితుడా*

*తిరుమంత్రము సేవించితి*

 *పరదైవము లేడు నాకు పరమాత్ముండా*


*పద్య కవితా శిల్పకళానిధి. ‌ మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*617 వ రోజు*

అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము


స్త్రీలరక్షణ

ధర్మరాజు " పితామహా ! మరి అలాంటి స్త్రీలను ఎలా కాపాడు కోవాలి ? " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! స్త్రీలు అసురుల మాయల కంటే మించిన మాయలు కల వారు. ఈ సందర్భంలో నీకు ఒకకథ చెప్తాను. మొదట స్త్రీలు దోషము, మాయా మర్మము లేక సాధువులుగా ఉండే వారు. అందుకే స్త్రీలకు దైవత్వము లభించింది. ఇది చూసి అసూయ పడిన దేవతలు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. బ్రహ్మ అప్పుడు మాయలు మర్మాలు స్త్రీల లక్షణముగా ఏర్పరిచి స్త్రీలకు మోహము ఎక్కువగా ఉండేలా చేసాడు. అందు వలన స్త్రీలు మోహపరవశులై పురుషులను వారి కోరికలకు బలి చేయసాగారు. పురుషులు స్త్రీల కొరకు రోషము, కోపముకు లోనై దైవత్వము కోల్పోయారు. ఇది చూసి దేవతలు తృప్తి చెందారు. కనుక స్త్రీల మాయామర్మములు కలవారు కనుక వారి మనసు గ్రహించడం పురుషులకు కష్టమే. ఇందుకు నీకు ఒకకథ చెప్తాను. పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞము కార్యము మీద పోతూ తన శిష్యుడైన విపులుడిని చూసి " విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెడతాను. ఇంద్రుడికి పరుల భార్యలమీద కన్ను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి " అని చెప్పాడు. విపులుడు " గురువుగారూ ! మీరు చెప్పినట్లే చేస్తాను. కాని ఇంద్రుడు మాయావి కనుక ఏరూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలాగ ? " అని అడిగాడు. దేవశర్మ " విపులా ! నీవు చెప్పినది నిజమే ! మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి. దేవేంద్రుడు నా భార్య మీద కన్ను వేసి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అందులో సందేహం లేదు. నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు. కనుక నీవు జాగరూకత వహించాలి " అని చెప్పాడు. విపులుడు " గురుదేవా ! మీరు చెప్పినట్లు చేస్తాను " అన్నాడు. దేవశర్మ నిశ్చింతగా యాగము చేయడానికి వెళ్ళాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తున్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చి " నేను గురు పత్నిని యోగశక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగ శక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశము లేదు " అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్ర పోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వము వహించినందు వలన ఇంద్రుడికి జవాబు ఇవ్వ లేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో " ఇంద్రా ! నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి ? " అని అడిగుతూ ఆమెను స్పృహ తప్పేలా చేసాడు. ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు. శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో " గౌతముడి శాపంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా ? దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా. ఇలాంటి పని చేస్తే నా గురువు గారి కోపాగ్నికి భస్మము కాగలవు జాగ్రత్త " అన్నాడు. దేవేంద్రుడు తన యోగబలముతో విపులుడి శక్తి గ్రహించాడు. విపులుడు తిరిగి " మా గురువు దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను కాని మనసు రావడం లేదు బ్రతికి పోయావు వెళ్ళు " అని అన్నాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అంటూ వెళ్ళి పోయాడు. గురువు గారు వచ్చిన తరువాత " గురువు గారు ! మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడకు వచ్చాడు. కాని నా యోగబలానికి భయపడి వెళ్ళి పోయాడు " అని చెప్పి తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం చెపితే గురువు గారు ఏదైన అనుకుంటాడని చెప్ప లేదు

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ముఖ్యమైన విషయాలు :-_*

  



*_జీవితంలో అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు :-_*

                ➖➖➖✍️


 1. BP: 120/80

 2. పల్స్: 70 - 100

 3. ఉష్ణోగ్రత: 36.8 - 37

 4. శ్వాస : 12-16

 5. హిమోగ్లోబిన్:

     పురుషులు -13.50-18

     స్త్రీ - 11.50 - 16

 6. కొలెస్ట్రాల్: 130 - 200

 7. పొటాషియం: 3.50 - 5

 8. సోడియం: 135 - 145

 9. ట్రైగ్లిజరైడ్స్: 220

 10. శరీరంలో రక్తం మొత్తం:

       PCV 30-40%

 11. చక్కెర స్థాయి:

      పిల్లలకు (70-130)

      పెద్దలు: 70 - 115

 12. ఐరన్: 8-15 మి.గ్రా

 13. తెల్ల రక్త కణాలు WBC:

      4000 - 11000

 14. ప్లేట్‌లెట్స్:

      1,50,000 - 4,00,000

 15. ఎర్ర రక్త కణాలు RBC:

      4.50 - 6 మిలియన్లు..

 16. కాల్షియం:

       8.6 - 10.3 mg/dL

 17. విటమిన్ D3:

      20 - 50 ng/ml

18. విటమిన్ B12:

    200 - 900 pg/ml



*సీనియర్స్ అంటే 40/ 50/ 60 ఏళ్ల వారికి ప్రత్యేక చిట్కాలు:*


1- *మొదటి సూచన:*

మీకు దాహం లేదా ఆవశ్యకత అనిపించకపోయినా ఎల్లప్పుడూ నీరు త్రాగండి…, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో చాలా వరకు శరీరంలో నీటి కొరత కారణంగా ఉంటాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి.


2- *రెండవ సూచన:*

శరీరం నుండి మరింత ఎక్కువ పని చేయడానికి, శరీరం కదలాలి, నడక లేదా ఈత... లేదా ఏదైనా క్రీడ ద్వారా మాత్రమే.


3- *మూడవ సూచన:*

 తక్కువ తినండి...

ఎక్కువ ఆహారం కోసం తృష్ణ విడిచిపెట్టండి... ఎందుకంటే ఇది ఎప్పుడూ మంచి ఆరోగ్యాన్ని అందించదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ మొత్తాన్ని తగ్గించండి. ఎక్కువ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలను ఉపయోగించండి.


 4- *నాల్గవ సూచన*

 అత్యవసరమైతే తప్ప వీలైనంత వరకు వాహనాన్ని ఉపయోగించకండి... , మీరు ఎక్కడికైనా కిరాణా సామాన్లు తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి... లేదా ఏదైనా పని కోసం మీ కాళ్లపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్, ఎస్కలేటర్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.


5- *ఐదవ సూచన*

 కోపం వదలండి...

 చింతించడం మానేయండి... విషయాలను పట్టించుకోకుండా ప్రయత్నించండి...

అవాంతరాలలో చిక్కుకోకండి.... అవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మరియు ఆత్మ యొక్క వైభవాన్ని దూరం చేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి!


6- *ఆరవ సూచన*

 ముందు డబ్బు వదులుకో

మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి, నవ్వండి మరియు మాట్లాడండి!

డబ్బు జీవించడం కోసం సంపాదించబడింది, జీవితం డబ్బు కోసం కాదు.


7- *ఏడవ సూచన*

 మీ గురించి, మీరు సాధించలేనిది లేదా మీరు స్వంతం చేసుకోలేని దేని గురించి జాలిపడకండి.

 దానిని విస్మరించండి మరియు మరచిపోండి.


8- *ఎనిమిదవ సూచన*

డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం....

ఇవన్నీ మనిషిలో అహంకారాన్ని నింపేవే....

వినయం అనేది ప్రేమతో ప్రజలను మీకు దగ్గర చేస్తుంది.


9- *తొమ్మిదవ సూచన:*

 మీ వెంట్రుకలు తెల్లగా మారినట్లయితే, అది జీవితాంతం అని కాదు. ఇది మెరుగైన జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి. ప్రత్యేక జ్ఞాపకాలను చేసుకోండి!


10- *పదో సూచన:*

మీ చిన్నారులను ప్రేమతో, సానుభూతితో కలవండి! వ్యంగ్యంగా ఏమీ అనకండి! మీ ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంచండి!

గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అన్నింటికి కట్టుబడి ఉండండి.✍️

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝   *అశఙ్కితేభ్యో శఙ్కేత*

 *శఙ్కితేభ్యశ్చ సర్వశః* |

           *అశఙ్క్యాద్ భయముత్పన్నం*

 *అపి మూలం నికృతతి* ||


తా𝕝𝕝 *"ఇబ్బంది లేదనుకునేవారిని కూడా అనుమానిస్తూనే ఉండాలి. ఇబ్బంది పెడతాడనుకునే వారి విషయంలో ఇంకా జాగరూకతతో ఉండాలి. అనుమానించదగినవాడు భయానికి కారకుడైతే సర్వనాశనం చేయగలుగుతాడు."*


✍️🌹💐🌸🙏

నక్షత్ర స్తోత్ర మాలిక* - రోజు 9

  *🌟 *నక్షత్ర స్తోత్ర మాలిక* - రోజు 9


*​నక్షత్రం: ఆశ్లేష* (Aslesha)


*అధిపతి: బుధుడు* (Mercury)


*ఆరాధించాల్సిన దైవం: నాగ దేవత / ఆదిశేషుడు / విష్ణువు*


​ఆశ్లేష నక్షత్ర జాతకులు మరియు సర్ప దోషాలు, భయాలు ఉన్నవారు పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం: *"నవనాగ స్తోత్రం"*.


​🙏 నవనాగ స్తోత్రం 🙏


​అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ ।

శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ॥ 1 ॥


​ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్ ।

సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః ॥ 2 ॥


​తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ।

సంతానం ప్రాప్నుయాత్ పుత్రం ధనధాన్య సమన్వితః ॥ 3 ॥


​సకలార్థప్రదం చైతత్ సర్వకామఫలప్రదమ్।

ముక్తిదం మోక్షదం చైవ నాగలోకం స గచ్ఛతి ॥ 4 ॥


​నాగ ప్రార్థన:


నమస్తేస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను।

యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ॥


​యేఽదో రోచనే దివో యే వా సూర్యస్య రశ్మిషు ।

యేషామ్ అప్సు సదస్కృతం తేభ్యః సర్పేభ్యో నమః ॥


​విశేషం: ఈ స్తోత్రం చాలా చిన్నదైనప్పటికీ, తొమ్మిది మంది ప్రధాన నాగరాజుల పేర్లను స్మరించడం వల్ల జాతకంలోని నాగ దోషాలు తొలగి, బుధ గ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది.

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా 

కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ (72)


పార్థా.. నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా ధనంజయా.. అవివేకంవల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా.. 


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

అవివేకి

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *సంసారయతి కృత్యాని* 

          *సర్వత్ర విచికిత్సతే* 

          *చిరం కరోతి క్షిప్రార్థే*  

          *స మూఢో భరతర్షభ*  


తా𝕝𝕝 *తన పనులను ఇతరులపై నెట్టువాడు.... అన్నిటికీ సందేహించు వాడు.... శీఘ్రముగా చేయవలసిన చోట ఆలసించువాడు.... అట్టివాడు అవివేకి....!!!!!*


✍️🌹💐🌸🙏

ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి,

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝    *విపత్తిష్వవ్యథో దక్షో*

           *నిత్యముత్థానవాన్నరః* |

           *అప్రమత్తో వినీతాత్మా* 

           *నిత్యం భద్రాణి పశ్యతి* ||


తా𝕝𝕝 *"ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి, కార్యనిర్వహణలో నేర్పు కలవాడికి, అప్రమత్తంగా మెలిగేవాడికి, వినయవిధేయతలు కలవాడికి ఎల్లప్పుడు శుభాలే చేకూరతాయి"*


✍️🌸💐🌹🙏

నక్షత్ర స్తోత్ర మాలిక

  🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - 8 వ రోజు*


*నక్షత్రం*_ *పుష్యమి* (Pushyami)


*అధిపతి_ శని* (Saturn)


*ఆరాధించాల్సిన దైవం. శనీశ్వరుడు*.


*పుష్యమి నక్షత్ర జాతకులు మరియు శని ప్రభావం (ఏలిననాటి శని, అర్ధాష్టమ శని) ఉన్నవారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.*


*శ్రీ శనైశ్చర స్తోత్రం* 


( *దశరథ కృతం* ) 


*కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః* ।

*సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః* ॥ 1 ॥


*ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్* ।

*శనైశ్చర కృతా పీడా న కదాచిద్ భవిష్యతి* ॥ 2 ॥


*నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ* ।

*నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః ॥ 3 ॥


*నమో నిర్మాంస రూపాయ ధీర్ఘశ్మశ్రు జటాయ చ* ।

*నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక* ॥ 4 ॥


*నమః పరుషగాత్రాయ స్థూలరోమ్ణే చ వై నమః* ।

*నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః* ॥ 5 ॥


*నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కపాలినే* ।

*నమస్తే సర్వభక్షాయ బలీముఖ నమోఽస్తుతే* ॥ 6 ॥


*సూర్యపుత్ర నమస్తేఽస్తు భాస్కరో భయదాయక* ।

*అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తుతే* ॥ 7 ॥


*నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోఽస్తుతే* ।

*తపసా దగ్ధదేహాయ నిత్యం యోగరతాయ చ* ॥ 8 ॥


*జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజ సూనవే* ।

*తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో హరసి తత్క్షణాత్* ॥ 9 ॥


*దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః*।

*త్వయా విలోకితాః సర్వే నాశం యాంతి సమూలతః* ॥ 10 ॥


*ప్రసాదం కురు మే సౌరే వరిష్ఠో వరదో భవ*।

*ఏవం స్తుతస్తదా సౌరిర్గ్రహరాజో మహాబలః* ॥ 11 ॥


॥ *ఇతి శ్రీ దశరథ విరచిత శనైశ్చర స్తోత్రం సంపూర్ణమ్* ॥


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

నహుషుని ప్రశ్నలు:*

  *నహుషుని ప్రశ్నలు:*```

ధర్మరాజు “అయ్యా! నీవు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను. అడుగు” అన్నాడు. 


కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు మొదటి ప్రశ్న ఇలా వేసాడు… “ఏ గుణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విషయమేమిటి?” అని అడిగాడు. 


జవాబుగా ధర్మరాజు “సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖ-దుఃఖముల ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య” అన్నాడు. 



నహుషుని మరొక ప్రశ్న “పరులకు అపకారం చేసి, అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించినవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను ఎందుకు పొందింది?” అని అడిగాడు.


ధర్మరాజు “దానం చెయ్యడం, ఇతరులకు ఉపకారం చెయ్యడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మములు కాని వాటిలో అహింస విశేషమైంది. దేవతా జన్మ, జంతుజన్మ, మానవజన్మ అనునవి మానవునికి కలుగు జన్మలు. దానము మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చేయువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమ ధర్మంగా పరిగణించ బడుతుంది” అని జవాబిచ్చాడు. 


ఈ సమాధానం విని నహుషుడు భీముని వదిలాడు. తన అజగర రూపం వదిలి దివ్యమైన మానుషరూపం పొందాడు.

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️  పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐


ఆదివారం, జనవరి 11, 2026


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - బహుళ పక్షం

తిథి:అష్టమి మ12.22 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:చిత్ర రా8.25 వరకు

యోగం:సుకర్మ రా8.00 వరకు

కరణం:కౌలువ మ12.22 వరకు తదుపరి తైతుల రా1.11 వరకు


వర్జ్యం:రా2.31 - 4.15

దుర్ముహూర్తము:సా4.10 - 4.54

అమృతకాలం:మ1.32 - 3.15

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 -1.30


సూర్యరాశి:ధనుస్సు

చంద్రరాశి:కన్య


సూర్యోదయం:6.37

సూర్యాస్తమయం:5.37


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము - నరసాపురం, ఆంధ్రప్రదేశ్ - 534 275

Mobile: 91 75698 87915, 91 83280 14080


శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక 577 139 ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.


https://www.facebook.com/vedavidyalayamu

ఒంటి బ్రాహ్మణుడు*

 ఒంటి బ్రాహ్మణుడు*

               ➖➖➖✍️


*ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా ?*


*చాలా మంది ఆఖరికి బ్రాహ్మణులకి తో సహా ఈ అపోహ ఉంది.*


*అసలు తోటి బ్రాహ్మడు [అతను వేద పండితుడే కానక్కరలేదు, అసలు అతడు  బ్రాహ్మణుడు అయితే చాలు చుట్టమైనా పక్కమైనా] ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు.*


*ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు.*


*నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం.*


*పూర్వం గురుకులాల్లో  ప్రతీ రోజూ గురువుగారు తనవద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని  బిక్షాటనకు ఊరిలోకి పంపేవారు.*


*ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్లి గృహస్తుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిక్ష సేకరించి తెచ్చేవారు.*


*ఆ కాలంలో ఎవరైనా గృహస్తు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో, అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ  బ్రహ్మచారి గానీ ఎదురయితే, వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన బిక్షవేసి పంపించే వారు.*


*అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురయి నప్పుడు అతన్ని చూసి, అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా వెళ్లడం అతన్ని అవమానపరచి నట్టు ఉంటుందని, అలా ఆ విధంగా బిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి, లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించు కోకుండా వెళ్లడం దోషం.*


*అందుకే అలా [బిక్ష వేయకుండా] వెళ్ళకూడదు అంటారు.*


*అంతే తప్ప అది అపశకునం కాదు.* 


*ఒక వేద పండితుడు, జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు.*


*ఒక్కో సారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చలకో, లేక ఏ జప హోమాలకో వెళ్తూన్నారని అర్ధం.*


*ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు [ ఒకవేళ ఉన్నా అక్కడడక్కడా ఉండచ్చు గాక ]. అలా రోజు వారి విద్యార్థుల చేత బిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు.*


*కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంత మంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి*.  


*అయితే  ఇక్కడ ఒక్క విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి.*


*మనం బయటకి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరయినా ఎదురయితే  అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడే కానీయండి వీలయితే అతనికి మీకు చేతనైన సహాయము నిష్కామకర్మతో చేసి కదలండి.*


*అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.*


*మీరనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది.*


*సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన మెంత? మన కున్న జ్ఞానమెంత? ఒక్కసారి ఆలోచించండి!*


*అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.*                     లోకా సమస్తా సుఖినోభవన్తు!

పంచాంగం