26, సెప్టెంబర్ 2022, సోమవారం

చండీ యాగం

 #చండీ యాగం ఎందుకు చేస్తారు??


యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం!


చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది


చండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచీ, మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకూ ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆంతేకాదు! గ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం.


మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.


పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ.... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు....


#శ్రీమాత్రే నమః 🙏🙏

కూర్మి యడిగెదరందరు

 కూర్మి యడిగెదరందరు కుశలములను

ఎచట కుశలమ్ము లుండు ? తా నెంచి చూడ 

మనుజునకు సత్య మరయంగ మహిని యెపుడు

దిన దినమ్ముల యాయువు తీరుచుండ ?

_నువ్వెళ్ళినా

 *_నువ్వెళ్ళినా నీ పాట మాతోనే.._*


🎼🎼🎼🎼🎼🎼🎼


ఒకటా..రెండా..

*_నలభై వేల పాటలు.._*

సుమారు నాలుగు తరాలు..

పరవశించిపోయిన 

*_కోట్లాది హృదయాలు.._*

ప్రతి మనిషి జ్ఞాపకంలో 

ఆయన పాట..

ఏ వయసు వారికి 

ఆ అనుభూతి..

బాల్యమా.. యవ్వనమా..కౌమారమా.. వార్ధక్యమా..జీవితంలోని 

అన్ని దశలకు 

అన్ని రకాల పాటలు..

ప్రేమా.. విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా..

ఎప్పుడు ఏదడిగినా 

చిటికెలో 

తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక..

*_అసలు పాటకు_* 

*_ఆయనే పీఠిక...!_*


ఇక భక్తి గీతాలా..

*అయ్యప్ప దేవాయన మహ..*

అంటే పలకడా 

శబరిగిరీశుడు...

*జయజయ వినాయకా* 

*శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక..*

అని స్తుతిస్తే

నీ రూపంలోనే కదిలి రాలేదా గణపయ్య..

*నీవూ మా వలె మనిషివని..నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బతికేది..*

అంటే సమాధి చీల్చుకురాడా

షిర్డీ సాయిబాబా..

ఆ గళం విని 

మురిసిపోలేదా మల్లన్న..

ఏడుకొండలూ 

దిగిరాడా వెంకన్న.. 

మీటింగులో నీ గీతమే..

పెళ్ళిలో నీ గొంతే..

గుడిలో నీ పాటే..

మా గుండె గుడిలో 

నీ గళమే...

నువ్వు మా హృదయాలలో నింపిన జాలమే..

మా బ్రతుకులో 

*_నీ పాటలు కలకాలమే..!_*

         

*చేయెత్తి జై కొట్టు తెలుగోడా..*

ఈ ఒక్క పాట రాష్ట్రం మొత్తం మీద ప్రకంపనై..

తెలుగుదేశం పార్టీకి అలంబనై..

*ఎన్టీఆర్ విజయగీతికై..*

ఆ యుగపురుషుడి 

రాకకు సంకేతమై.. మారుమ్రోగిపోయి..

పల్లె..పట్నం ఊగిపోయి..

నాటి చరిత్రలో 

*నందమూరి మాట..*

*బాలసుబ్రమణ్యం పాట...* 

కూలిపోయె తెలుగునాట కాంగ్రెస్ కంచుకోట..!


*సంగీతమే నీ ప్రపంచం..*

మాకు వినిపించేవి 

నలభై వేల పాటలే..

వాటి వెనక 

ఎన్ని లక్షల రిహార్సల్స్ ..

ఎంత సాధన..

ఇంకెంత శోధన..

నిదురలో..మెలకువలో

*నీ గొంతు కువకువ..*

*నీ పాట మెళకువ..* 

సంగీత ప్రపంచానికి 

*_నీ స్వరమే వేకువ.._*

సంగీత సరస్వతికి 

*_దొరకునా ఇటువంటి సేవ.._*

*_నీ పదరాజీవముల చేరు_* 

*_నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ..!_*

         

నువ్వెళ్లిపోయావంటే 

చెప్పలేని బాధ..

గుండెలు పిండేస్తున్న ఆవేదన.. మౌనరోదన..

అంతలో నీ పాట.. 

నేల నలు చెరగులా 

అదే ప్రతిధ్వని.. 

అరె..అన్ని చోట్లా నువ్వున్నావే..

ఎక్కడ విన్నా 

నీ గొంతే..

అంటే నువ్వున్నావు..ఉంటావు. 

నేనున్నంత కాలం 

నా గుండెలో..

నా తర్వాత నా బిడ్డ గొంతులో..

సినిమా ఉన్నంత కాలం 

ప్రతి పాటలో..సంగీతమనే 

ఒక పాఠంలో..

ప్రతి పుటలో..!


షాదీలో..షామియానాలో..

ఖానాలో..ఖాందాన్లో..

హాల్లో..హల్లోలో..

షోలో..సోలోలో..

*తానాలో..*

*ప్రతి మనిషి* 

*తానా తందానాలో.!*


*అమర గాయకుడు ఘంటసాల

తరవాత, నిరంతర గాయకుడు బాలసుబ్రమణ్యం..*


*మనిషికే మరణం..*

*గొంతుకు కాదు..*


బాలు కనిపించరేమో

ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది.


*ఎక్కడికి వెళ్ళినా* 

*ఏదో ఒక భాషలో..!*

         

మూగవాడి గొంతులో కూడా *భలేభలే మగాడివోయ్*

అంటూ..అనిపిస్తూ..

తనలో తనకే వినిపిస్తూ..

బాలూ పాట..తేనెల ఊట..

చిన్నప్పటి నుంచి నాతోనే..

*ప్రతి వయసులో..*

*ప్రతి శ్రుతిలో..*

*నేను పాడే* 

*అపశృతిలో..*

*నిరంతరం నా స్మృతిలో..!*


**************

గానగంధర్వుడు దూరమై

రెండేళ్లు..

ఇది నా నివాళి..

✍️✍️✍️✍️✍️✍️✍️

     

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

           9948546286

ఆయుర్యాతి దినేదినే

 శ్లోకం:☝

*లోకః పృచ్ఛతి సద్వార్తాం*

  *శరీరే కుశలం తవ ।*

*కుతః కుశలమస్మాకం*

  *ఆయుర్యాతి దినేదినే ॥*


భావం: లోకంలో బంధువులు, ఆత్మీయులు, మిత్రులు ఎదురైనప్పుడు _‘క్షేమంగా ఉన్నారా?’_ అని ఆప్యాయంగా కుశల ప్రశ్నలడుగుతుంటారు. అనుదినం పగలు రాత్రి మన ఆయువు తరిగిపోతుంటే ఇంకా కుశలమేమిటి? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణముండగానే అపరోక్షజ్ఞానం సంపాదించుకోవాలి. లేకపోతే కనీసం మళ్ళీ మానవజన్మ వచ్చేలా పుణ్యకార్యాలు ఆచరించాలి. *ఆయుర్యాతి దినేదినే* అనే సంస్కృత నానుడి చాలా ప్రసిద్ధం.

లంకాయాం శాంకరీదేవి*

 *లంకాయాం శాంకరీదేవి*                 


*ఇది 18వ శతాబ్దంలో జరిగిందట.*

       *శ్రీలంక కూడ అప్పట్లో భారతదేశపు అనుబంధమే.*


*అనేక పల్లెకారులు సముద్రమార్గం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు శ్రీలంకకు వెళ్లి చేసుకుంటుండేవారు.* 


*ఒక సమయంలో తమిళపులులుగా కొన్ని ఉద్యమాలు , అల్లరులు, గొడవలు జరిగిన విషయం మనందరికి తెలిసినదే!!!*


*ఆసమయంలో జరిగిన సంఘటన ఇది. హఠాత్తుగ జరిగిన ఈ సంఘటనతో భయభ్రాంతులైన పల్లెజనం తమ తమ వర్తకసామగ్రిని హుటాహుటిన ఓడలలోనికి ఎక్కించి ఉరుకులు పరుగులమీద స్వస్థలాలకు చేరుకుని’బతుకుజీవుడా’ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.*


*అయితే తూర్పుగోదావరి కాకినాడ దగ్గర తాళ్లరేవు అనే ఒక కుగ్రామంకు చెందిన ఒక ఓడలోని వస్తువులను తాళ్లను ఖాళీ చేస్తుండగా అందులోనుండి ఒక అమ్మవారి విగ్రహం తాళ్లమధ్యలో పడుకుని కనిపించిందట.*


*గ్రామస్తులంతా తెల్లబోయి “ఈ విగ్రహం ఎక్కడిది?ఎలా వచ్చింది?ఎవరీఅమ్మ?ఏంచెయ్యాలి?” అని ధర్మమీమాంసలో పడ్డారు.* 


*పల్లెజనం.....అమాయకులు.. ఇప్పటంత communication లేదు. మాయలు, కుతంత్రాలు తెలియవు. ఊరిపెద్దలను కలిశారు. శ్రీలంకనుండి వచ్చిన ఓడలలో వచ్చింది ‘శాంకరీదేవి’ అని తెలుసుకునేటంత విజ్ఞానులు కారు వాళ్లు.*


*“అమ్మ తనంత తానుగా మనలను కాపాడటంకోసం వచ్చిన దేవీస్వరూపం“ అని మాత్రమే వాళ్లకు అర్ధమైంది.*


*గురువారంనాడు (లక్ష్మీవారంనాడు) దొరికింది కనుక మహాలక్ష్మి అని పేరు పెట్టి అదే ప్రదేశంలో ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకోవటము మొదలు పెట్టారు.*


*అప్పటినుండి 2016 ఫిబ్రవరి వరకు శ్రీలంకలో శాంకరీదేవి పీఠంలో పీఠంమాత్రమే వున్నది......విగ్రహం లేదన్న విషయం మనందరికీ తెలుసు.* 


*శక్తిపీఠంకోసమే శ్రీలంకకు (తీసుకు) వెళ్తున్న యాత్రికులను తృప్తిపరచటం కోసంశ్రీలంక ప్రభుత్వంవారు (commercial purpose &income కోసం) ఆ పీఠంపై శాంకరీదేవి పేరుతో2016 ఫిబ్రవరిలో మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.*


*అసలు “శాంకరీమాత” లంక రాక్షసులమధ్య, సీతామాత అన్నికష్టాలుపడ్డ ఆప్రదేశంలో“ వుండటానికి ఇష్టపడక మనవాళ్లతో మనదేశానికి తనంత తానుగా తరలివచ్చింది.*


*తూర్పుగోదావరిజిల్లా కాకినాడనుండి యానాం వెళ్లేరోడ్డులో తాళ్లరేవు దగ్గర “మట్లపాలెం మహాలక్ష్మి”పేరుతో కొలువై వున్నది.* 


*కేవలం శక్తిపీఠంకోసమే యాత్ర చేయాలనుకున్నవారు యానం వెళ్లి దర్శించుకోండి. ఈ విషయం 9 వ తరగతి పాఠ్యాంశాలలో కూడ వున్నది.*