16, అక్టోబర్ 2021, శనివారం

శ్రీమద్భాగవతము

 *16.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2293(౨౨౯౩)*


*10.1-1427-వ.*

*10.1-1428*


*క. "చెప్పెద మా గురునందనుఁ*

*దప్పుగలుగఁ జూచి నీవు దండనమునకుం*

*దెప్పించినాఁడ వాతని*

*నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!"* 🌺



*_భావము: అమితమైన క్రోధముతో వచ్చిన యమధర్మరాజు బలరామకృష్ణులను చూసి, వారు శ్రీమహావిష్ణువు యొక్క అవతారపురుషులని గ్రహించి, భక్తి, శ్రద్ధలతో పరిచర్యలు చేసి, సర్వవ్యాపి, సకలభూతాత్ముడగు శ్రీకృష్ణునకు నమస్కరించి, "నా వలన ఏమి కావాలో ఆజ్ఞాపించండి", అన్నాడు. ఆ మహితాత్ముడు యమునితో: "ఓ ఉత్తమచరితుఁడా! మా గురువు గారి కుమారుని దోషములకు ప్రతిగా దండించుటకు ఇక్కడకు తెప్పించినావు. ఆతని అవసరము మాకున్నది, తెచ్చి అప్పగించుము."_* 🙏



*_Meaning: Fretting and fuming, YamaDharmaraja rushed there and found Balarama and Sri Krishna. Realising that they were the incarnation of Sri Maha Vishnu, offered his obeisance, served them diligently. He prostrated before Sri Krishna and told Him that whatever He wishes, would be fulfilled. The Omnipotent and Omniscient Sri Krishna told him about His Guru's son and instructed Yama to entrust the boy to Him._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215)*

*Pavan Kumar (9347214215).*

రామో విగ్రహవాన్

 రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ।

రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ॥ (3.37.13)

- వాల్మీకి రామాయణం

శ్రీమద్భగవద్గీతాhషష్ఠోఽధ్యాయః

శ్రీమద్భగవద్గీతా షష్ఠోఽధ్యాయః


అథ షష్ఠోఽధ్యాయః ।


శ్రీభగవానువాచ ।

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।

స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ॥ 1 ॥


యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ ।

న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ॥ 2 ॥


ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ॥ 3 ॥


యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే ।

సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥ 4 ॥


ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ॥ 5 ॥


బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః ।

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ॥ 6 ॥


జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।

శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ॥ 7 ॥


జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః ।

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ॥ 8 ॥


సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు ।

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ॥ 9 ॥


యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ।

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ॥ 10 ॥


శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।

నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ॥ 11 ॥


తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః ।

ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే ॥ 12 ॥


సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ॥ 13 ॥


ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః ।

మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ॥ 14 ॥


యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।

శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ॥ 15 ॥


నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।

న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ॥ 16 ॥


యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 17 ॥


యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే ।

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ॥ 18 ॥


యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా ।

యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ॥ 19 ॥


యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।

యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ॥ 20 ॥


సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ ।

వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ॥ 21 ॥


యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।

యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ॥ 22 ॥


తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।

స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ॥ 23 ॥


సంకల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః ।

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ॥ 24 ॥


శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ।

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ॥ 25 ॥


యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ ।

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ॥ 26 ॥


ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ ।

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ॥ 27 ॥


యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।

సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ॥ 28 ॥


సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥ 29 ॥


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥ 30 ॥


సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।

సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ॥ 31 ॥


ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ॥ 32 ॥


అర్జున ఉవాచ ।

యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।

ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్స్థితిం స్థిరామ్ ॥ 33 ॥


చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ ।

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ॥ 34 ॥


శ్రీభగవానువాచ ।

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ 35 ॥


అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।

వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ॥ 36 ॥


అర్జున ఉవాచ ।

అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।

అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥ 37 ॥


కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి ।

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥ 38 ॥


ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ।

త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ॥ 39 ॥


శ్రీభగవానువాచ ।

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ।

న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి ॥ 40 ॥


ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ॥ 41 ॥


అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ॥ 42 ॥


తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।

యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ॥ 43 ॥


పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః ।

జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ॥ 44 ॥


ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।

అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ ॥ 45 ॥


తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ॥ 46 ॥


యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా ।

శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ 47 ॥


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే


ఆత్మసంయమయోగో నామ షష్ఠోఽధ్యాయః ॥6 ॥


ఉపదేశ సారం (రమణ మహర్షి)

 ఉపదేశ సారం (రమణ మహర్షి)


కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్ ।

కర్మ కిం పరం కర్మ తజ్జడమ్ ॥ 1 ॥


కృతిమహోదధౌ పతనకారణమ్ ।

ఫలమశాశ్వతం గతినిరోధకమ్ ॥ 2 ॥


ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతమ్ ।

చిత్తశోధకం ముక్తిసాధకమ్ ॥ 3 ॥


కాయవాఙ్మనః కార్యముత్తమమ్ ।

పూజనం జపశ్చింతనం క్రమాత్ ॥ 4 ॥


జగత ఈశధీ యుక్తసేవనమ్ ।

అష్టమూర్తిభృద్దేవపూజనమ్ ॥ 5 ॥


ఉత్తమస్తవాదుచ్చమందతః ।

చిత్తజం జపధ్యానముత్తమమ్ ॥ 6 ॥


ఆజ్యధారయా స్రోతసా సమమ్ ।

సరలచింతనం విరలతః పరమ్ ॥ 7 ॥


భేదభావనాత్ సోఽహమిత్యసౌ ।

భావనాఽభిదా పావనీ మతా ॥ 8 ॥


భావశూన్యసద్భావసుస్థితిః ।

భావనాబలాద్భక్తిరుత్తమా ॥ 9 ॥


హృత్స్థలే మనః స్వస్థతా క్రియా ।

భక్తియోగబోధాశ్చ నిశ్చితమ్ ॥ 10 ॥


వాయురోధనాల్లీయతే మనః ।

జాలపక్షివద్రోధసాధనమ్ ॥ 11 ॥


చిత్తవాయవశ్చిత్క్రియాయుతాః ।

శాఖయోర్ద్వయీ శక్తిమూలకా ॥ 12 ॥


లయవినాశనే ఉభయరోధనే ।

లయగతం పునర్భవతి నో మృతమ్ ॥ 13 ॥


ప్రాణబంధనాల్లీనమానసమ్ ।

ఏకచింతనాన్నాశమేత్యదః ॥ 14 ॥


నష్టమానసోత్కృష్టయోగినః ।

కృత్యమస్తి కిం స్వస్థితిం యతః ॥ 15 ॥


దృశ్యవారితం చిత్తమాత్మనః ।

చిత్త్వదర్శనం తత్త్వదర్శనమ్ ॥ 16 ॥


మానసం తు కిం మార్గణే కృతే ।

నైవ మానసం మార్గ ఆర్జవాత్ ॥ 17 ॥


వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః ।

వృత్తయో మనో విద్ధ్యహం మనః ॥ 18 ॥


అహమయం కుతో భవతి చిన్వతః ।

అయి పతత్యహం నిజవిచారణమ్ ॥ 19 ॥


అహమి నాశభాజ్యహమహంతయా ।

స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్ ॥ 20 ॥


ఇదమహం పదాఽభిఖ్యమన్వహమ్ ।

అహమిలీనకేఽప్యలయసత్తయా ॥ 21 ॥


విగ్రహేంద్రియప్రాణధీతమః ।

నాహమేకసత్తజ్జడం హ్యసత్ ॥ 22 ॥


సత్త్వభాసికా చిత్క్వవేతరా ।

సత్తయా హి చిచ్చిత్తయా హ్యహమ్ ॥ 23 ॥


ఈశజీవయోర్వేషధీభిదా ।

సత్స్వభావతో వస్తు కేవలమ్ ॥ 24 ॥


వేషహానతః స్వాత్మదర్శనమ్ ।

ఈశదర్శనం స్వాత్మరూపతః ॥ 25 ॥


ఆత్మసంస్థితిః స్వాత్మదర్శనమ్ ।

ఆత్మనిర్ద్వయాదాత్మనిష్ఠతా ॥ 26 ॥


జ్ఞానవర్జితాఽజ్ఞానహీనచిత్ ।

జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరమ్ ॥ 27 ॥


కిం స్వరూపమిత్యాత్మదర్శనే ।

అవ్యయాఽభవాఽఽపూర్ణచిత్సుఖమ్ ॥ 28 ॥


బంధముక్త్యతీతం పరం సుఖమ్ ।

విందతీహ జీవస్తు దైవికః ॥ 29 ॥


అహమపేతకం నిజవిభానకమ్ ।

మహదిదంతపో రమనవాగియమ్ ॥ 30 ॥

భూతల స్వర్గం సుందర కాశ్మీర్లో

 కొన్ని వందల సం. ల కిందట భూతల స్వర్గం సుందర కాశ్మీర్లో హిందూత్వం వెల్లివిరిసేది. ఆ మంచుకొండల మధ్య కొన్ని వందల దేవాలయాలు, ఉదయాన్నే ఆ నిశ్శబ్ద వాతావరణంలో వినిపించే గుడిగంటలు, ఉచ్ఛస్వరంతో వినిపించే వేద మంత్ర ఘోషలు....భారతీయ సంగీత నృత్య శిక్షణలు.... ఇలా ఒకటేమిటి పూర్తి భారతీయత ఉట్టిపడే వాతావరణం వుండేది.


కానీ విదేశీ మతస్తుల దండయాత్రలు, ఆక్రమణలతో అన్నీ కనుమరుగయ్యాయి. ఈ శతాబ్దంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల వల్ల మిగిలి ఉన్న ఆ కొద్దీ ఆనవాళ్ళు కూడా దాదాపుగా కనుమరుగు అయిపోయాయి. అసలు కాశ్మీరం మాదే. ఎప్పుడూ అది హిందువులది కాదు అనే పరిస్థితికి తెచ్చుకున్నాం.


ఒక ప్రదేశం లో మత పరంగా జనాభా మారితే వచ్చే పరిణామాలు ఏమిటో కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మన కళ్ళముందు ఉదాహరణ. 


మన పూర్వీకులు ఇచ్చిన సంస్కృతి వారసత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనకెందుకులే. అది లేకపోతే ఇప్పుడు మనం బతకలేమా అన్న మన ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక రాష్ట్రంలో దాని ప్రాచీన సంస్కృతి దాదాపుగా కనుమరుగు అయింది. దేశంలో ఇతర ప్రదేశాల్లో గల తమ మతస్తులైన ప్రజల నిర్లిప్తత కారణంగా, కావలసిన మద్దతు వారికి లభించని కారణంగా కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగిన కొన్ని వేల కుటుంబాలు కట్టు బట్టలతో కాశ్మీర్ లో వారి స్వస్థలాలను విడిచిపెట్టి పోయి ఈ దేశంలోనే కాందిశీకులుగా జీవితాలు వెళ్ళ దీస్తున్నారు. వారి బాధలకు కారణం మనలో చైతన్యం లేకపోవడమే.


సరిగ్గా ఇటువంటి నిర్లక్ష్య ఆలోచన విధానం ఉండడం వల్లే అతి పురాతన సంస్కృతులైన మాయన్, గ్రీక్, ఈజిప్షియన్, జోరాష్ట్రీయన్ సంస్కృతులు ఆనవాళ్ళు లేక కాల గర్భంలో కలసి పోయాయి. విదేశీ మతస్తుల ఇన్ని దాడుల తరువాత కూడా ఈ భారతీయ సంస్కృతి ఇంకా మిగిలి ఉంది అంటే పూర్వీకులు హిందూ ధర్మాన్ని , సంస్కృతిని కూడా సామాన్య ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మలిచిపెట్టడం వల్లే.


అందుకే విదేశీమతాల వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వారు అనుకున్నంతగా మత మార్పిడులు చెయ్యలేకపోతున్నాం అని భావించి ఇక్కడ సాంప్రదాయాలను పద్ధతులను తమ మత విశ్వాసాలకు జోడించి వాటిని అనుకరిస్తు అమాయకులను మోసపూరితంగా మత మార్పిడి చేస్తున్నారు. 


హిందూ ధర్మం లో ఇలాగే పూజించాలి. ఫలానా వారినే పూజించాలి అని లేకపోవడం వల్ల ఎవరి వ్యక్తి గత లేక సామాజిక విశ్వాసాలకు ఆధారంగా వారి ఇష్టదేవతలను తయారు చేసుకోవడం పూజించడం జరుగుతోంది. ఏ ఒక్కరూ ఇతరుల నమ్మకాలని తక్కువ చేసి చూడరు.


అందుకే వీధి వీధికో అమ్మవారు, గ్రామ గ్రామానికో గ్రామ దేవత, అడవుల్లో ఒక్కో కొండ తెగకూ ఒక కొండదేవత.


పట్టణాల నుండి హిందూ ధర్మగురువులు కొండల్లోకి పోయి ఈ పద్దతి తప్పు ఫలానాలాగా పూజిస్తేనే మోక్షం కలుగుతుంది అని బలవంతం పెట్టరు. పట్టణాల వారు అడవులకు పోయినప్పుడు ఆ కొండ దేవతలను కూడా వీరు దండాలు పెట్టుకుని గౌరవిస్తారు అంతే కానీ వారి ఆచార వ్యవహారాలను, కట్టుబొట్టును, వివిధ రూపాల్లో వుండే వారి దేవతా మూర్తులను హేళన చేయడం కానీ విమర్శించడం కానీ చెయ్యరు. అలాగే మీరు ఫలానా శివుణ్ణి, రాముణ్ణి లేదా కృష్ణుడినీ పూజించ కపోతే నరకానికి పోతారని వారిని ఎప్పుడు 

భయపెట్టరు.


అందువల్లే ఈ పవిత్ర భూమి మీద ఇంత సామరస్యం తో కూడిన వైవిధ్యం వెల్లి విరుస్తోంది.


ఇంత వైవిధ్యం కల ఇక్కడ ప్రజల జీవన విధానం పై విదేశీ మతస్తుల దాడి వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ముఖ్యంగా ఎడారుల్లో పుట్టిన ఒకే దేవుడు, ఒకే పద్దతి, ఒకే పుస్తకం అని ఒకే మూస గల క్రిస్టియనిటీ, ఇస్లాం

ఈ వైరుధ్యానికి పెను ప్రమాదంగా పరిణిమించాయి. వీరు అడవుల్లోకి కూడా పోయి అక్కడ కొండప్రజలను వారి ప్రాచీన సంస్కృతులకు దూరం చేస్తున్నారు.


అది కొండ ప్రాంత నివాసం కావచ్చు, గ్రామం కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు. మత ప్రాతిపదికన జనాభా మారితే అక్కడ ప్రాచీన సంస్కృతి కనుమరుగు అవుతుంది.


కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు. అలాగే ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా వుండే కొండజాతుల వారు తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను దాదాపుగా పోగొట్టుకున్నారు. అక్కడ ప్రజలలో 90% మంది క్రిస్టియానిటి లోకి పోయి తమ ప్రాచీన సంప్రదాయాలను, పూజ పద్ధతులకు క్రమంగా దూరం జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ మతం మారిన ప్రజల్లో కూడా తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి అన్న తపన మొదలైంది. ఇదే ట్రెండ్ ఇప్పుడు గ్రీక్, ఈజిప్ట్ మొదలగు దేశాల్లో కూడా మొదలు అయ్యింది.


ఈ దేశంలో గల ఈ వైవిధ్య వాతవరణం ఇలాగే కొనసాగాలి అంటే నిర్మొహమాటంగా వివిధ ప్రాంతాల్లో పాటిస్తున్న మన ప్రాచీన పద్దతులు, సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికతపై జరుగుతున్న దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. 


అయితే దురదృష్టవశాత్తూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన హిందువులలోనే ఒక మేధావి వర్గం(?) ఉత్తరాది, దక్షిణాది అంటూ, రాముడు.. కృష్టుడు అంటూ హిందూవులలో బేధాలు సృష్టిస్తున్నారు. ఉత్తరాది వారు వచ్చి దేశం అంతా రాముణ్ణి రుద్దుతున్నారు అనే ఈ మేధావి వర్గానికి ఎక్కడో ఎడారుల్లో ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడి ప్రజల మీద రుద్దడం, ఆ మతం మారుతున్న వాళ్ళు ఈ దేశ సహజ సిద్ధ వైవిధ్యానికి దూరం జరుగుతూ ఇక్కడ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ద్వేషించడం వీరి గుడ్డి కళ్ళకు కనిపించదు. 


దేశం అంతా రాముణ్ణి రుద్దినా శివుణ్ణి రుద్ధినా ఈ సనాతనధర్మం లో వుండే వైవిధ్యానికి ఏదీ లోటు వుండదు. ఎందుకంటే ఉత్తరాది కాశ్మీర్ లో శివుణ్ణి పూజించే వాడు దక్షిణాది రామేశ్వరం వచ్చి అదే శివుణ్ణి పూజిస్తాడు, పశ్చిమాన సోమనాథుని, తూర్పున వైద్య నాథ్ నీ కూడా పూజిస్తాడు. అలాగే రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా పూజిస్తారు. అందువల్ల ఏ రాముణ్ణి లేదా కృష్ణుణ్ణి లేదా శివుణ్ణి దేశం అంతా రుద్దడం వల్ల ఈ ధర్మానికి వచ్చే నష్టం లేదు.


అసలు ఈ పవిత్ర నేలలో వుండే వైవిధ్యానికి నిజంగా తూట్లు పొడుస్తున్న ఎడారి మతాల గురించి ఒక్క మాట కూడా మరి ఈ మేధావులు మాట్లాడరు ఎందుకని? 


అందుకే కాబోలు ఒక మిత్రుడు అన్నాడు.

క్రిస్టియన్ లేదా ఇస్లాం లోకి మతం మారిన ఒకరిని కష్టపడి మళ్లీ హిందూ ధర్మంలో తీసుకు రావడం సులభం ఏమో కానీ... ఒక మేధావి(?) హిందువుని హిందువుగా మార్చడం చాలా కష్టం.

పరమత హిందూ ద్వేషులు బహిరంగంగా హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అడ్డుకోవచ్చు. కానీ ఈ మేధావి(?) ఉదార హిందువులు కర్రకు చేదపట్టినట్లు పైకి కనిపించకుండా హిందూ ధర్మం లోపల వుండే హిందూ ధర్మాన్ని బలహీన పరుస్తారు జాగ్రత్త అన్నాడు. అవును ఇది నూటికి నూరు శాతం నిజం.


ముఖ్యంగా మనకెందుకులే, ఎవరి పాపాన వారే పోతారు అన్న ఉదాసీనత మనం వదిలించుకోవాలి. ఎవరి మీదా ద్వేషం కానీ శతృత్వం కానీ నూరిపొయ్యక్కరలేదు. అదే సమయంలో మన ధర్మానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని...కుట్రలను.. గురించి మన వారిని మనం ఈ విషయాలపై జాగృతం చేస్తే చాలు.


స్వస్తి ..

.....చాడా శాస్త్రి....

Lనేను చూసిన ప్రదేశముల

 Lనేను చూసిన ప్రదేశముల సంక్షిప్త వివరములు -

      2-  నేను చూసిన 102 శ్రీ వైష్ణవ దివ్యదేశములు అనగా శ్రీరంగం, మేలుకోటె, బదరి, తిరువళ్ళూరు తదితరములతో పాటు ప్రసిద్ద శైవ క్షేత్రములు 1. కంచి ఎకంబరేశ్వర దేవాలయం 2. బృహదీశ్వర ఆలయం, తంజావూరు, 3. అరుణాచలం 4. రామేశ్వరం 5 . కుంబకోణం 6. కాశి 7. మహాకాళేశ్వర దేవాలయం,ఉజ్జయని 8. ఓంకరేశ్వర దేవాలయం 9. కాల బైరవ దేవాలయములు, 10. ధర్మస్తలం  తదితరములు,నవగ్రహంలకు చెందిన శైవ మరియు శ్రీ వైష్ణవ దేవాలయములు , శక్తి పీఠములు ఐన 1.కంచి కామాక్షి, 2. మధుర మీనాక్షి, 3. ముకాంబిక 4. కన్యాకుమారి తదితర దేవాలయములు, మన హిందూమతమునకు ఆదిగురువులు ఐన శ్రీ రామానుజా చార్యులు, శ్రీ శంకరా చార్యులు , శ్రీ మధ్వాచార్యుల గారల జనన ప్రదేశములు / వారి తిరిగిన విశిష్ట ప్రదేశములు, దేశములో శిల్ప సౌందర్యమునకు ప్రసిద్ది చెందిన హంపి, బేలూరు, హలేబేడు, రామేశ్వరం, మహాబలిపురం, కోణార్క్, గ్వాలియర్, జైపూర్, తాజమహల్  లాంటి చాలా ప్రదేశములు, దేశములోని అతి పెద్ద జలపాతములు 1. జోగా 2. ఉంచాలి 3. హెబ్బ 4. హిమాలయము లలోని పెద్ద పెద్ద జలపాతములు, కొల్లేరు, చిలుకా లాంటి అతిపెద్ద సరస్సులు, రాజస్తాన్ లోని ఎడారులు, హిల్ స్టేషన్లు ఐన 1. ఊటి, 2. డెహ్రాడున్ 3. ముస్సోరీ, కులు-మనాలి,4. సిమ్లా లాంటి అనేక  చల్లని ప్రదేశములు, మదుమలై , బందిపూర రిజర్వు ఫారెస్ట్ లు, అతి పెద్ద బీచ్ లు ఐన బంగాళాఖాతం సముద్రంలో కల  మద్రాస్ బీచ్, మహాబలిపురం బీచ్, గోవా బీచ్, పాండిచేరి, రామేశ్వరం  బీచ్ లాంటివి ఎన్నో బీచ్ లు, హిందూ మహాసముద్రం నకు ఆనుకొని వున్నా కన్యాకుమారి , అరేబియా సముద్రం నకు అనుకోని ఉన్న ఉడిపి, గోకర్ణం, గోవా లలోని బీచ్ లు ( 3 సముద్రములు),    పక్షుల, పాముల, మొసళ్ళ సంరక్షణ కేంద్రములు వగైరా ఎన్నో చూసినాము. చారిత్రక ప్రదేశములు ఐన గ్వాలియర్ , ఝాన్సీ, ఆగ్రా, ఢిల్లీ , మధుర బృందావనం, కురుక్షేత్రం, పానిపట్ , జైపూర్, ఉదయపూర్ , చితోర్ ఘడ్ , ప్రతాప్ ఘడ్, అమృతసర్ లలో కోటలు అనేక చారిత్రక ప్రదేశములు చూసినాము. మనదేశ సరిహద్దు లలో పాకిస్తాన్ బోర్డర్ గ్రామం వాఘను మరియు చైనా బోర్డర్ గ్రామము ఐన “మన “   ను (11000 అడుగుల ఎత్తు ఫైన)  కూడా చూసినము.  

                                                          (వివరములు తరువాయి భాగంలో )

                                   వేదాంతం రాఘవాచార్యులు, తహసిల్దార్ (రిటైర్డ్)

                                              ఖమ్మం ,    9666695787

తత్వం తలకెక్కింది

 తత్వం తలకెక్కింది రోకలి తేరా తలకు చుడదాం అన్నాడట వెనకటికి ఒకడు అని మనం సహజంగా కొన్ని సందర్భాలలో వాడుతూ ఉంటాం.  బహుశా రోకలి కూడా బ్రహ్మ పదార్థం కాబట్టి తలకు చుట్టవచ్చని అని వుండొచ్చని నేను అనుకుంటున్నా. 

ఈ రోజుల్లో ఉదయం టీవిలో వచ్చే జాతకాల అదే రాశిఫలాలు కార్యక్రమం చుస్తే నాకు ఈ కోవకు చెందినట్లు అనిపిస్తున్నది. ఎందుకంటె టీవిలో వచ్చే ప్రముఖ జ్యోతిస్యులవారు ఇలా చెపుతున్నారు 

ఈ రోజు మీరు ధరించవలసిం వస్త్రం రంగు ఇలా ఉండాలి, ఈ రోజు మీరు ఫలానా దిక్కుకు ప్రయాణం చేయాలి, మీరు ఫలానా ది దైవాన్ని పూజించాలి, ఫలానా పూలతో, ఫలానా పండ్లతో పూజించాలి అని ఇలా చెపుతుంటే ఎంతమంది ఆచరిస్తున్నారో కానీ అది ఎంతవరకు సమంజసమో మాత్రం నాకు తెలియటం లేదు. 

రాసి ఫలాలు అంటే ఏమిటో అవి ఒక జాతకుని మీద ఎంతవరకు ప్రభావితం చేస్తాయో ఒకసారి పరిశీలిద్దాం . 

మనం చూసే రాశిచక్రం 12 గదులు కలిగి ఉంటుంది. అంటే ఒక పూర్ణం అంటే వృత్తం 360 డిగ్రీలు ఉంటే దానిని 12 తో భాగిస్తే ఒక్కో గదికి 30 డిగ్రీలు వస్తాయి. 

ఇక మనకు వున్న 27 నక్షత్రాలను వాటి పాదాలతో రాశి చెక్రన్ని విభజిస్తే అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి అంటే 27x 4 పాదాలు వెరసి 108 పాదాలు వస్తాయి  ఈ 108 పాదాలను 12 గదులలో విభజిస్తే అంటే 108/12=  9 పాదాలు వస్తాయి. అంటే ఒక్కొక్క గదిలో మనకు 3 నక్షత్రాల పాదాలు వస్తాయి. 

ఒక్కొక్క రాసి గదిలోని ఫలితాలను రాసి ఫలితాలుగా చెపుతారు అంటే అవి ఒక నిర్దుష్ట జాతకునికి సంబందించిన ఫలితాలు కావని మనం గుర్తుంచుకోవాలి. ఫలితాలు అనేవి ఒక నక్షత్ర జాతకులకు  కూడా వారి వారి నక్షత్ర పాదాలను బట్టి ఫలితాలు ఉంటాయి అని గమనించండి. ఈ సందర్భంలో నేను ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నా కొద్దీ సమయ తేడాతో జన్మించిన కవలపిల్లలు ఒకే రాశికి చెంది  వుంటారు. అంటే మనం రాసి ఫలితాలను నిర్దుష్టంగా ఆపాదించుకుంటే ఆ ఇద్దరికీ ఒకేరకమైన ఫలితాలుఉండాలి.  కానీ ఇద్దరిలో కొన్ని విషయాలు సామ్యం ఉంటే ఉండొచ్చు కానీ పూర్తిగా మాత్రం ఉండదు.  అది మనం చూస్తూ  వున్నాం. కవలపిల్లలలో ఒకరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళితే ఇంకొకరు అందుకు భిన్నంగా కూడా ఉండొచ్చు.  అంతేకాక ఒకరు దీర్ఘాయుష్కులు అయితే ఒకరు అల్పాయుష్కులు  కావచ్చు. ఒక రాసి ఫలితం అని చెప్పేది ఆ రాశిలో జన్మించిన 3 నక్షత్రాలు మరియు 9 పాదాల సమగ్రపు అంచనా మాత్రమే ఒకరకంగా ఆలోచిస్తే ఆ రాశిలో జన్మించిన వారిలో చాలా కొద్దిమందికో లేక వారికీ కూడా కాకుండా వర్తించవచ్చు లేక వర్తించక పోవచ్చు. అటువంటప్పుడు ఈ రాశివారు ఈ రంగు వస్త్రాలు ధరించాలి,  ఈ దిశకు మాత్రమే ప్రయాణం చేయాలని చెప్పటం ఎంతవరకు సబబో విఘ్నుల వివేకానికే వదిలి వేస్తున్నాను.  దయచేసి టివిలో చూపెట్టేది ప్రతిదీ మూర్ఖంగా ఆచరించవలదని ప్రార్ధన. 

దయచేసి ఇది జాతకాలను, రాసి ఫలాలను విమర్శించటానికి వ్రాసిందిగా భావించవలదు.  కేవలం రాశిఫలాలు మూర్ఖంగా నమ్మవలదని తెలిపే ఉద్దేశ్యమే కానీ మరొకటి కాదు.   జాతక ఫలితాలు జ్యోతిష్యుని సమర్ధత మీద దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్క జ్యోతిష్క్యునికి ఒక్కొక్క విధంగా జాతకం  గోచరించవచ్చు. వరాహమిహురుని వృత్తాంతమే ఇందుకు నిదర్శనం. జాతకాన్ని నమ్ముకొని జీవనం గడపటం కన్నా భగవంతుని త్రికరణ శుద్ధిగా నమ్ముకొని జీవనం సాగిస్తే ఆ దైవం ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటాడు, ఇది సత్యం. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ బుధజన విధేయుడు 

భార్గవ శర్మ 

*వారము-పూజ-దోషపరిహారం

 లక్ష్మీ లలితా వాస్తు, జ్యోతిష నిలయం.

శ్రీనివాస సిద్ధాంతి.9494550355.


 *వారము-పూజ-దోషపరిహారం*


కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.


ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.


సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.


మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.


బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.


గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.


శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.


శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.


ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన.


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.  

 *ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న,వాస్తు విశారద,C V రామన్ అకాడమీ అవార్డు గ్రహీత membership in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.*

*9494550355*

_plz forward the message_🌹

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అన్నదానం..అభిప్రాయబేధం..*


ఆషాఢమాసం లో వచ్చే పౌర్ణమి ని గురుపౌర్ణమి గా వ్యవహరిస్తారని అందరికీ తెలుసు..పది పన్నెండేళ్ల క్రితం దాకా..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద గురుపౌర్ణమి నాడు పెద్దగా భక్తులు వచ్చేవారు కాదు..మొగలిచెర్ల గ్రామస్థులు కొద్దిమంది మరి కొద్దిమంది ఇతర భక్తులూ వచ్చేవారు..మేము కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసేవాళ్ళం..క్రమంగా ఒక్కొక్క సంవత్సరం గడిచేకొద్దీ..భక్తుల రాక ఎక్కువైంది..గురుపౌర్ణమి నాడు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయాలని దశాబ్దం క్రితం నిర్ణయం తీసుకున్నాము..అందుకు తగ్గ ఏర్పాట్లనూ చేసుకున్నాము..శ్రీ స్వామివారి కృప వలన ఎన్నడూ ఏ ఆటంకమూ లేకుండా గురుపౌర్ణమి నాడు అన్నప్రసాద వితరణ జరిగిపోతున్నది..క్రమంగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు కూడా భాగస్వాములు కాసాగారు..


ఇలా ఉండగా..ఒక సంవత్సరం.."గురుపౌర్ణమి నాడు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నానండీ..మా అబ్బాయికి ర్యాంక్ వస్తే శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేయాలని సంకల్పించాను..ఆ స్వామి దయవల్ల అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది..ఒక నెల క్రితమే అనుకున్నాను కానీ ఇంట్లో కుదరక, అప్పుడు చేయలేదు..ఎలాగూ గురుపౌర్ణమి దగ్గరలోనే వుందికదా..ఆరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు భరిద్దామని అనుకున్నాను.." అన్నారు గుంటూరు నుంచి వచ్చిన కృష్ణారెడ్డి గారు..కానీ ఆ సంవత్సరం గురుపౌర్ణమి కి అన్నదానం చేయడానికి అంతకు ముందు వారమే మరొక భక్తుడు మాకు చెప్పివున్నాడు.. పైగా అన్నదానానికి కావాల్సిన సరుకులకోసం కొంత నగదు కూడా ఇచ్చి వెళ్ళాడు..ఆమాటే కృష్ణారెడ్డి గారికి చెప్పాము.."మీరు గురుపౌర్ణమి తరువాత వచ్చే శని, ఆదివారాల్లో ఏదో ఒక రోజు అన్నదానం చేయండి.." అని తెలిపాము..కానీ కృష్ణారెడ్డి గారు వినలేదు..తనకు ఆరోజు తప్ప, మరోరోజు వీలుకాదనీ..తాను గురుపౌర్ణమి నాడే అన్నదానం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాననీ మాతో చెప్పారు..ఒకవేళ మేము కాదంటే..శ్రీ స్వామివారి మందిర సమీపం లోనే ఆరోజు అన్నదానం చేస్తానని చెప్పారు..ఒకే స్థలంలో ఇద్దరు విడి విడిగా అన్నదానం చేయడం అంతగా బాగుండదని మా భావన..


ఏమి చేయాలో పాలుపోలేదు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని.."స్వామీ..చిన్న విషయమే కానీ..ముందు ముందు ఇటువంటి సంఘటనలు తరచూ జరిగితే..ఒక నియంత్రణ లేకుండా పోతుంది..మీరే పరిష్కారం చూపాలి.." అని వేడుకున్నాను..


అనవసరంగా కృష్ణారెడ్డి గారు పంతానికి పోతున్నారనిపించింది..సరే..ఈ రెండో వ్యక్తికి ఈ మాట చెప్పి చూద్దాం అని..ఆయనతో చెప్పాము.."నేను మీకు ముందే చెప్పి ఉంచాను కదండీ..అయినా సరే..శ్రీ స్వామివారి వద్ద నేను పంతానికి పోను..మీకు ఇబ్బంది గా అనిపిస్తే..నేను ఆ ప్రక్క ఆదివారం నాటి మధ్యాహ్నం అన్నదానానికి ఈ సరుకులు ఉపయోగిద్దాము..నా వల్ల స్వామివారి వద్ద ఎటువంటి అసౌకర్యమూ జరుగకూడదు.." అని పెద్ద మనసుతో చెప్పారు..మేము ఊపిరి పీల్చుకున్నాము..


సరిగ్గా గురుపౌర్ణమి కి ఒక్కరోజు ముందు..కృష్ణారెడ్డి గారు హడావిడిగా ఫోన్ చేశారు.."ప్రసాద్ గారూ..నేను పట్టుబట్టి గురుపౌర్ణమి నాడే అన్నదానం చేస్తానని చెప్పాను..కానీ నిన్న రాత్రి నుంచి నాకు మనసులో ఏదో తెలీని అశాంతి కలుగుతున్నది..రేపటి అన్నదానానికి వేరొకరు ఉన్నారని అన్నారు కదా..మీరు ఆయనకు నచ్చచెప్పుకొన్నారని తెలిసింది..వారి నెంబర్ వుంటే నాకు ఇవ్వండి....నాకెందుకో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని అనిపిస్తోంది..దానివల్లనే నాకు ఈ ఆందోళన అని అనిపిస్తున్నది..ఆయనకు నేను ఫోన్ చేసి..క్షమాపణలు చెప్పుకుంటాను..రేపటి రోజు ఆయన చేతులమీదుగానే అన్నదానం జరిపించమని వేడుకుంటాను..ఆ పై శని, ఆదివారాలు రెండు పూటలూ నేనే అన్నదానం చేస్తాను.." అన్నారు..వారి ఫోన్ నెంబర్ కృష్ణారెడ్డి గారికి ఇచ్చాను..మరో అరగంట కల్లా ఆ భక్తుడు ఫోన్ చేసి..తనతో కృష్ణారెడ్డి మాట్లాడారనీ..తాను ఉదయానికే వచ్చి..అన్నదానానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పారు..


ఆ గురుపౌర్ణమి రోజు ఎటువంటి అభిప్రాయబేధాలూ లేకుండా అన్నదానం జరిగింది..విశేషమేమంటే..కృష్ణారెడ్డి గారు స్వయంగా ఆ అన్నదానం లో పాల్గొని..వడ్డన కూడా చేశారు..ఆ సాయంత్రం..మాతో మాట్లాడుతూ..ఇప్పుడు తన మనసులోని ఆందోళన తగ్గిపోయిందనీ..తాను మొండితనానికి పోకుండా శ్రీ స్వామివారు ఆపారని చెప్పారు..ఆ ప్రక్క శని, ఆదివారాలు కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారి మందిరం వద్ద సంతోషం తో అన్నదానం చేశారు..


మేము ఎక్కువగా ఊహించుకున్న సమస్య..చాలా సులభంగా తీరిపోయింది..మౌన సాక్షి మాత్రం శ్రీ స్వామివారే..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీరాముని శివలింగ ప్రతిష్ఠ - శివభక్తి సందేశం*

 *ॐ శ్రీరాముని శివలింగ ప్రతిష్ఠ - శివభక్తి సందేశం* 

  

*రామచరితమానస్ - వాల్మీకి రామాయణం - కూర్మపురాణం* 


 *1. రామచరిత మానస్* 


(i) వారథి నిర్మాణాన ప్రారంభంలో శ్రీరాముడు 

   "నేనిచట పరమశివుని (శివలింగమును) ప్రతిష్ఠిస్తాను. ఇది నా సంకల్పం" 

   "కరిహఉఁ ఇహాఁ సంభు థాపనా I 

   మోరే హృదయఁ పరమ కలపనా ॥" 

    - లంకా కాండ 2/2 


(ii) శివలింగమును ప్రతిష్ఠించి, యథావిధిగా పూజించి, ఈ విధంగా పలికాడు.

* *శివునివలె ప్రియమైనవారు నాకెవ్వరునూ లేరు.* 

* *శివునకు ద్రోహము తలపెట్టి, నాకు భక్తుడనని పలికెడువాడు స్వప్నంలోకూడా నన్ను పొందజాలడు.* 

* *శంకరునకు విముఖుడై నా యెడ భక్తిని ప్రకటించువాడు మూర్ఖుడు, అల్పబుద్ధి. వానికి నరకము తప్పదు.* 

* *శంకరుని ప్రేమించి, నా యందు వైరము పూనువారును,* 

    *శంకరునికి వైరులై నాకు దాసులగు వారును కల్పాంతంవరకు రౌరవాది నరకయాతనలను అనుభవింతురు.*  

* *రామేశ్వరమును దర్శించినవారు శరీరత్యాగం చేసినపిమ్మట నా లోకమును చేరెదరు.*  

* *గంగా జలములతో శివునకు అభిషేకము చేసినవారికి సాయుజ్యముక్తి లభిస్తుంది.* 

* నిష్కాముడై కపటమును త్యజించి, శ్రీరామేశ్వరుని సేవించినవానికి శంకరుడు నా భక్తిని ప్రసాదిస్తాడు. 

* నేను నిర్మించిన ఈ సేతువును దర్శించినవాడు ఎట్టి ప్రయాస లేకుండానే సంసారసాగరాన్ని దాటతాడు. 


లింగ థాపి బిధివత కరి పూజా I 

సివ సమాన ప్రియ మోహి న దూజా ॥

సివ ద్రోహీ మమ భగత కహావా I 

సో నర సపనెహుఁ మోహి న పావా ॥ 

సంకర బిముఖ భగతి చహ మోరీ I 

సో నారకీ మూఢ మతి థోరీ ॥ 

          - లంకాకాండ చౌ 2/3,4 


సంకరప్రియ మమ ద్రోహీ, సివ ద్రోహీ మమ దాస I 

తే నర కరహిఁ కలప భరి, ఘోర నరక మహుఁ బాస ॥ 

          - లంకాకాండ దో 2 

          

జే రామేశ్వర దరసను కరిహహిఁ I 

తే తను తజి మమ లోక సిధరిహహి ॥ 

జో గంగాజలు ఆని చఢాఇహి I 

సో సాజుజ్య ముక్తి నర పాఇహి ॥

హోఇ అకామ జొ ఛల తజి సేఇహి I 

భగతి మోరి తెహి సంకర దేఇహి ॥ 

మమ కృత సేతు జొ దరసను కరిహీ I 

సో బిను శ్రమ భవసాగర తరిహీ ॥ 

          - లంకాకాండ చౌ 3/1,2 


*2. వాల్మీకి రామాయణం* 


    పుష్పక విమానంలో లంకనుంచి వస్తున్నప్పుడు, సీతమ్మకు చూపుతూ శ్రీరాముడు 


    ఈ ప్రదేశము మహిమాన్వితమైన సాగరముయొక్క తీరము. 

    దీనిని "సేతుబంధం" అని పిలుస్తారు. 

    సేతునిర్మాణం ఇక్కడినుండే ప్రారంభమైనది. 

    *ఇది ఒక మహాపుణ్యక్షేత్రం.* 

    *దీనిని దర్శించివారి సమస్త పాపాలూ నశిస్తాయి.*  

    *పూర్వం ఈ పవిత్రప్రదేశమునందే పరమశివుడు నన్ను అనుగ్రహించాడు.* 


ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః I 

సేతుబంధ ఇతిఖ్యాంతం త్రైలోక్యేనాఽభిపూజితమ్ ॥ 

ఏతత్ పవిత్రం పరమం మహాపాతకనాశనమ్ I

అత్రపూర్వం మహాదేవః ప్రసాదమ్ అకరోత్ ప్రభుః ॥ 

            యుద్ధకాండ 126/16,17 


*3. కూర్మపురాణం* 


    సేతునిర్మాణానికి ముందే శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి, చర్మాంబరధారియైన ఆ మహాదేవుని పూజించాడు. 

    అంతట ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితోగూడి ప్రత్యక్షమై శ్రీరామునకు శ్రేష్ఠమైన ఒక వరాన్ని ఇచ్చాడు. 

   "రామా! మహాపాపకృత్యాలొనర్చిన ద్విజులుసైతము నీవు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శిస్తే, వారి పాపాలన్నీ వెంటనే నశిస్తాయి. 

    *ఈ మహాసముద్రతీరాన స్నానమొనర్చి శివలింగాన్ని దర్శించినంతమాత్రాననే వారి ఇతర దోషాలూ తొలగిపోతాయి. ఇందు సందేహంలేదు.*" 

    

సేతుమధ్యే మహాదేవమ్ ఈశానం కృత్తివాససమ్ I 

స్థాపయామాస వై లింగం పూజయామాస రాఘవః ॥ 

తస్య దేవో మహాదేవః పార్వత్యా సహ శంకరః I 

ప్రత్యక్షమేవ భగవాన్ దత్తవాన్ వరముత్తమమ్ ॥ 

యే త్వయా స్థాపితం లింగం ద్రక్ష్యంతీహ ద్విజాతయః I 

మహాపాతకసంయుక్తాః తేషాం పాపం వినశ్యతి ॥ 

అన్యాని చైవ పాపాని తీరే తత్ర మహోదధేః I 

దర్శనాదేవ లింగస్య నాశం యాంతి న సంశయః ॥ 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

               భద్రాచలం

సంస్కృత మహాభాగవతం

 *16.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఉపాసకస్య మామేవం యోగధారణయా మునేః|*


*సిద్ధయః పూర్వకథితా ఉపతిష్ఠంత్యశేషతః॥12805॥*


యోగధారణ పూర్వకముగా నన్ను ఇట్లు ఉపాసించునట్టి యోగికి ఇంతవరకును నేను తెలిపిన సిద్ధులన్నియును సమగ్రముగా వశమగును.


*15.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*జితేంద్రియస్య దాంతస్య జితశ్వాసాత్మనో మునేః|*


*మద్ధారణాం ధారయతః కా సా సిద్ధిః సుదుర్లభా॥12806॥*


ఉద్ధవా! బాహ్యేంద్రియములను, అంతఃకరణములను జయించి, ప్రాణాయామపరాయణుడై, చిత్తమును నాయందే ధారణచేసిన యోగికి ప్రాప్తింపని సిద్ధియే యుండదు. అతనికి అన్ని సిద్ధులును సులభముగనే లభించును. 


*15.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*అంతరాయాన్ వదంత్యేతా యుంజతో యోగముత్తమమ్|*


*మయా సంపద్యమానస్య కాలక్షపణహేతవః॥12807॥*


భక్తియోగము, జ్ఞానయోగము మొదలగు యోగములను సాధనచేసి సాయుజ్యముక్తిని పొందగోరెడివారికి ఈ సిద్ధులు విఘ్నహేతువులని కొందరు జ్ఞానులు పేర్కొందురు. ఏలయన వీటివలన పరమపదప్రాప్తికి విలంబమేర్పడును.


*15.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*జన్మౌషధితపోమంత్రైర్యావతీరిహ సిద్ధయః|*


*యోగేనాఽఽప్నోతి తాః సర్వా నాన్యైర్యోగగతిం వ్రజేత్॥12808॥*


యోగసాధనవలన ప్రాప్తించెడి సిద్ధులు అన్నియును, ఉత్తమజన్మలు, ఓషధులు, తపశ్చర్యలు, మంత్రోపాసనలు మున్నగువాటివలన గూడ లభించును. కానీ యోగసాధనకు పరమలక్ష్యములైన సాలోక్యాది మోక్షములు మాత్రము నాయందు చిత్తమును పూర్తిగా నిలుపకుండా, ఎట్టి సాధనవల్లనూ లభించుట కల్ల.


*15.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*సర్వాసామపి సిద్ధీనాం హేతుః పతిరహం ప్రభుః|*


*అహం యోగస్య సాంఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినామ్॥12809॥*


ఈ సకల సిద్ధులకును ప్రాపకుడను (హేతువును), నిర్వాహకుడను, ప్రభుడను నేనే. అంతేగాదు, బ్రహ్మవాదులు ప్రతిపాదించిన ఆత్మోపాసనమైన సాంఖ్యశాస్త్రమునకును, భగవదుపాసనాత్మకమైన యోగమునకును, స్వర్గాది ప్రాపక యజ్ఞాదిరూపధర్మములకును ప్రవర్తకుడను నేనే.


*15.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*అహమాత్మాంతరో బాహ్యోఽనావృతః సర్వదేహినామ్|*


*యథా భూతాని భూతేషు బహిరంతః స్వయం తథా॥12810॥*


సకలజీవుల (ప్రాణుల) యందును నేను అంతర్యామిగా నుందును. కానీ, ఆ దేహములకు మాత్రమే పరిమితుడను (పరిచ్ఛిన్నుడను) గాను. నేను వాటికి బయటకూడ వ్యాపించియుండువాడను. అనగా ఆవరణ రహితుడను (అపరిచ్ఛిన్నుడను). ప్రాణులలోపల ద్రష్టగను, బయట దృశ్యమాన జగత్తుగను, సకలప్రాణుల లోపల, బయట ఉండెడి పంచమహాభూతములవలె వ్యాపించియుండు వాడను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే పంచదశోఽధ్యాయః (15)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు* అను పదునైదవవ అధ్యాయము (15)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*457వ నామ మంత్రము* 16.10.2021


*ఓం మాత్రే నమః*


అనంతకోటి జీవరాశులకు తల్లి వంటిదైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మాతా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం మాత్రే నమః* అని ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరించు భక్తులకు, ఆ తల్లి వారికి తానొక మాతగా సర్వకాల సర్వావస్థలయందును వెన్నంటి యుంటూ శాంతిసౌఖ్యములు, ధనకనకవస్తువాహనసమృద్ధి, కీర్తిప్రతిష్టలను అనుగ్రహించును.


జగన్మాత అనంతకోటి జీవరాశులను సృష్టించినది గనుక అనంతకోటి జీవరాశులకు తల్లివంటిది గనుక, శ్రీమాత *మాతా* యని అనబడినది. ఆ తల్లి సర్వమంత్రాత్మిక. 


మూలవిద్యనుండి పుట్టిన సప్తకోటి మంత్రములకు స్వరూపిణియై విరాజిల్లు పరబ్రహ్మస్వరూపిణి సర్వమంత్రాలకు మాతృక. అందుచే అమ్మవారు *మాతా* యని అనబడినది.


అన్ని విద్యలకూ ఆదివిద్యను మూలవిద్య అందురు. అటువంటి మూలవిద్యనుండి ఉద్భవించిన సప్తకోటి మహామంత్రాలకు మంత్రాధ్యయని అనిపేరు. ఇట్టి మంత్రాధ్యయనియే పరమేశ్వరి స్వరూపము.  


మంత్రము అంటే *మననాత్ త్రాయతే ఇతి మంత్రః* - దేనిని మననం చేయుకొలదీ రక్షణ చేయగలదో దానిని మంత్రం అన్నాము. 


మంత్రం అనేది బీజాక్షరముల సముదాయముతో ఏర్పడినది. ఉదాహరణకు మర్రిచెట్టు స్థూలపదార్థమయితే ఆ మర్రిచెట్టుకు మూలమయిన బీజము (మర్రివిత్తనము) సూక్ష్మమయినది. ఈ సూక్ష్మమయినదే మంత్రము. 


మంత్రము అనేది బీజాక్షరము గాని బీజాక్షరముల సముదాయముగాని అవుతుంది అనుకున్నాంగదా! . ఉదాహరణకు బాలాత్రిపురసుందరీ మంత్రములో *ఐం క్లీం సౌ* తీసుకుంటే ఇందులో మొదటి బీజము *ఐం* ఈ బీజం జపిస్తే వాక్ వస్తుంది. గనుక ఈ *ఐం* అనేది వాగ్బీజము. తరువాత *క్లీం* ఇది కామరాజ బీజము. అనగా కోరిన కోరికలు తీర్చు బీజము. ఈ బీజం జపిస్తే కోరికలు సిద్ధిస్తాయి. మూడవది *సౌ* అనగా శక్తి బీజము. ఈ బీజం జపిస్తే మనసుని, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. 


ఈవిధమైన బీజములు మూలవిద్యలో ఏడు కోట్లు ఉన్నాయి. వీటన్నిటికీ పరమేశ్వరి తల్లి వంటిది గనుక అమ్మవారు *మాతా* యని అనబడినది.


జగన్మాత మూలప్రకృతిస్వరూపిణి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహములు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, పంచభూతములు, జీవకోటి ఏర్పడ్డాయి. వీనిలో దేనిని ఆరాధించిననూ, జగన్మాతయే మూలమగుటచే,ఆ తల్లి మూలప్రకృతియనియు అన్నాము. ఏ మంత్రముతో ఏ దేవతను ఆరాధించిననూ, అన్నిటికీ శ్రీమాతయే మూలము అనగా మాతృక గనుక ఆ తల్లి *మాతా* యని అనబడినది.


సర్వమంత్రములలోను ఆ తల్లి మాతృకాక్షరస్వరూపురాలైనది గనుక *మాతా* యని అనబడినది. నామ పారాయణమునందు దశమీతిథి నిత్యామంత్రమునకు మాత అను నామము ఉండుటచే పరమేశ్వరి *మాతా* యని అనబడినది.


లయకాలమునందు సృష్టి అంతయు ఆ తల్లి గర్భమునందు నిక్షిప్తమై, మరల సృష్టి కార్యమునందు ఆ తల్లి గర్భమునుండి బయల్వెడలుటచే, సకల సృష్టికి తల్లియైనది గనుక అమ్మవారూ *మాతా* యని అనబడినది.


బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అనవారు అష్టమాతృకలు. ఈ అష్టమాతృకల స్వరూపిణియై పరమేశ్వరి అలరారుతున్నది గనుక జగన్మాత *మాతా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మాత్రే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*458వ నామ మంత్రము* 16.10.2021


*ఓం మలయాచల వాసిన్యై నమః*


మలయపర్వత నివాసిని అయిన శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మలయాచలవాసినీ* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం మలయాచల వాసిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులు పిల్లపాపలతోను, సిరిసంపదలతోను, శాంతిసౌఖ్యములతోను, కీర్తిప్రతిష్టలతోను చల్లగా ఉందురు. 


పరమేశ్వరి మలయ పర్వత నివాసిని యగుటచే *మలయాచలవాసినీ* యని అనబడినది. ఈ అమ్మవారు మలబారు ప్రాతంలో  మలయ (చందన) వనంలో భగవతిగా పూజింపబడు దేవిస్వరూపురాలు. మలయజము అనగా చందనవృక్షము. చందనవృక్షములుగల పర్వతము మలయాచలము అందురు. పరమేశ్వరికి చందనవృక్షములనినను, కదంబవృక్షములనినను అంతులేని ప్రీతి. ఆ తల్లి అందుకనే సుమేరు పర్వతంపై గల చందనవృక్షముల నడుమ అమ్మవారు ఉంటుంది గనుక అమ్మవారు *మలయాచలవాసినీ* అని యనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మలయాచల వాసిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *

సంస్కృత మహాభాగవతం

 *15.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునైదవ అధ్యాయము*


*వేర్వేరు సిద్ధుల నామములు - వాటి లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*15.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*విహరిష్యన్ సురాక్రీడే మత్స్థం సత్త్వం విభావయేత్|*


*విమానేనోపతిష్ఠంతి సత్త్వవృత్తీః సురస్త్రియః॥12799॥*


దేవతలు విహరించునట్టి ఉద్యానవనములందు క్రీడింపదలచిన యోగి శుద్ధసత్త్వమయమైన నా స్వరూపమును ధ్యానింపవలెను. అప్పుడు సత్త్వగుణాంశ స్వరూపులైన దివ్యాంగనలు విమానములపై ఎక్కి అతని సమీపమునకు చేరుదురు.


*15.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*యథా సంకల్పయేద్బుద్ధ్యా యదా వా మత్పరః పుమాన్|*


*మయి సత్యే మనో యుంజంస్తథా తత్సముపాశ్నుతే॥12800॥*


మత్పరాయణుడైన యోగి సత్యసంకల్ప రూపుడనైన నా యందు తన చిత్తమును స్థిరముగా నిల్పినచో అతనికి సంకల్పసిద్ధి కలుగును. అతని మనస్సులోని సంకల్పము తత్ క్షణమే సిద్ధించును.


*15.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*యో వై మద్భావమాపన్న ఈశితుర్వశితుః పుమాన్|*


*కుతశ్చిన్న విహన్యేత తస్య చాజ్ఞా యథా మమ॥12801॥*


నేను *ఈశిత్వము*, *వశిత్వము* అను సిద్ధులకును స్వామిని. అందువలన ఎవ్వరును నా ఆజ్ఞను ఉల్లంఘింపజాలరు. అందరును నా శాసనమునే అంగీకరించెదరు. నా ఈ రూపమును మనస్సున భావించుచు చింతనము చేసినచో, ఆ యోగియొక్క ఆజ్ఞనుగూడ నా ఆజ్ఞనువలె ఎల్లరును శిరసావహింతురు.


*15.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*మద్భక్త్యా శుద్ధసత్త్వస్య యోగినో ధారణావిదః|*


*తస్య త్రైకాలికీ బుద్ధిర్జన్మమృత్యూపబృంహితా॥12802॥*


యోగి భక్తి భావముతో తన చిత్తమును నా యందు ధారణ చేయగా చేయగా అది పూర్తిగా పరిశుద్ధమగును. తత్ప్రభావమున అతని బుద్ధి సహజముగా అగోచర విషయములైన జననము, మరణము మొదలగు విషయములను తెలిసికొనగల్గును. అతనికి భూత, భవిష్యద్వర్తమానకాలముల విషయము లన్నియును కరతలామలకములగును.


*15.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*అగ్న్యాదిభిర్న హన్యేత మునేర్యోగమయం వపుః|*


*మద్యోగశ్రాంతచిత్తస్య యాదసాముదకం యథా॥12803॥* 


యోగి తన చిత్తమును ఏకీభావముతో నాయందు స్థిరమొనర్చినచో జలములలో నివసించు ప్రాణులకు జలములవలన ఎట్టి హానియు కలుగనట్లు, అతని యోగమయ శరీరమునకు అగ్ని, జలము మొదలగువాటివలన ఎట్టి కీడూ సంభవింపదు.


*15.30 (ముప్పదియవ శ్లోకము)*


*మద్విభూతీరభిధ్యాయన్ శ్రీవత్సాస్త్రవిభూషితాః|*


*ధ్వజాతపత్రవ్యజనైః స భవేదపరాజితః॥12804॥*


శ్రీవత్సాది చిహ్నములతోడను, శంఖ, చక్ర, గదా, శార్ ఙ్గాది ఆయుధములతోడను, అట్లే ధ్వజము, ఛత్రము, చామరములు మొదలగు లాంఛనములతోడను సుసంపన్నమైన నా విభూతులను (నా అవతారములను) ధ్యానించువానికి పరాజయము ఉండదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

జమ్మిచెట్టు

 పాండవులు ఆయుధాలు జమ్మిచెట్టు పైనే ఎందుకు దాచారు?

ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.

జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.

జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.

ఆంధ్రవ్యాసుల వారిని ఒక సారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అని అడిగాడు.

దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది.

జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.

రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.

ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.

దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.

నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.

సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.

ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.

ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,

అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః | 

కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)

పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు

(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం, 

యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి | 

తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).


జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.

అంతగా దాన్ని ఆరాధిస్తారు.


అందరికీ దసరా శుభాకాంక్షలు 💐🚩🙏🏻


సర్వంశ్రీపరమేశ్వరార్పణమస్తు🙏🏻🙏🏻🙏🏻

ఆరాధన

 ఆరాధన.


మనుజులెందరో భువనిలో

తలంపులెన్నో అవనిలో

పండుగలెన్నో లోకంలో

నేటి ‌దశరా ఇలలో....


దుష్ట శిక్షణ శిష్ట రక్షణ

ధర్మో రక్షతి రక్ష తహః

ఆదికి అమ్మ ఆమెనే

ఆమని రూపం తల్లినే.


పలు రూపాలలో గౌరమ్మ

అక్కున చేర్చుకునే 'అమ్మ'

దుష్టుల పాలిట దుర్గమ్మ

బిడ్డను లాలించే మాయమ్మ.


వసుదైక కుటుంబానికి 

ఆలన,పాలన నేర్పే తల్లి

లోక మాతవు నీవేనుగా

సృష్టికి మూలం నీవమ్మా!.


శోభితం రూపం నీదే

ఆగ్రహంలో ఆదిశక్తి

ఆదరణలో అమ్మవి

అమ్మ పలుకు నీవే.


అమ్మ పలుకు జగదాంబ పలుకు

ముగ్గురమ్మల మూల పుటమ్మ

కాళివీ నీవే పోలేరమ్మ నీవే

అన్నింటా నీవే అమ్మవు నీవే..


క్షమత్వం నీ గుణం

కరుణత్వం నీ తత్వం

ఆగ్రహం నీ ప్రకోపం

దయ చూపు అర్ధనారీశ్వరీ.


ఆక్రందనలు తుడిచేయి

మాయత్వం మసిచేయి

లోక పయనంలో మార్చేయి

మంచి రోజులు ఇచ్చేయి.


దశరా రోజున పలికేయి

కనకదుర్గవై నడిచేయి

కరుణ మాపై చూపమ్మా

మమ్ము కాపాడ రావమ్మా .


ఎంగిలి బతుకమ్మవై

సద్దుల బతుకమ్మగా

పూజించు నవరాత్రి

వేడుక చేయు ధరిత్రి.


లోకాన కష్టాలు పోవాలిక

మంచి తరుణం వచ్చిందిక

అమ్మకు పూలతో ఆరాధన

ప్రకృతి మురిసే సమస్తాన.


దశరా పండుగ శుభాకాంక్షలు.



అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

9391456575.