ఆరాధన.
మనుజులెందరో భువనిలో
తలంపులెన్నో అవనిలో
పండుగలెన్నో లోకంలో
నేటి దశరా ఇలలో....
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
ధర్మో రక్షతి రక్ష తహః
ఆదికి అమ్మ ఆమెనే
ఆమని రూపం తల్లినే.
పలు రూపాలలో గౌరమ్మ
అక్కున చేర్చుకునే 'అమ్మ'
దుష్టుల పాలిట దుర్గమ్మ
బిడ్డను లాలించే మాయమ్మ.
వసుదైక కుటుంబానికి
ఆలన,పాలన నేర్పే తల్లి
లోక మాతవు నీవేనుగా
సృష్టికి మూలం నీవమ్మా!.
శోభితం రూపం నీదే
ఆగ్రహంలో ఆదిశక్తి
ఆదరణలో అమ్మవి
అమ్మ పలుకు నీవే.
అమ్మ పలుకు జగదాంబ పలుకు
ముగ్గురమ్మల మూల పుటమ్మ
కాళివీ నీవే పోలేరమ్మ నీవే
అన్నింటా నీవే అమ్మవు నీవే..
క్షమత్వం నీ గుణం
కరుణత్వం నీ తత్వం
ఆగ్రహం నీ ప్రకోపం
దయ చూపు అర్ధనారీశ్వరీ.
ఆక్రందనలు తుడిచేయి
మాయత్వం మసిచేయి
లోక పయనంలో మార్చేయి
మంచి రోజులు ఇచ్చేయి.
దశరా రోజున పలికేయి
కనకదుర్గవై నడిచేయి
కరుణ మాపై చూపమ్మా
మమ్ము కాపాడ రావమ్మా .
ఎంగిలి బతుకమ్మవై
సద్దుల బతుకమ్మగా
పూజించు నవరాత్రి
వేడుక చేయు ధరిత్రి.
లోకాన కష్టాలు పోవాలిక
మంచి తరుణం వచ్చిందిక
అమ్మకు పూలతో ఆరాధన
ప్రకృతి మురిసే సమస్తాన.
దశరా పండుగ శుభాకాంక్షలు.
అశోక్ చక్రవర్తి.నీలకంఠం.
9391456575.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి