24, డిసెంబర్ 2024, మంగళవారం

Panchang



మంగళవారం🍁* *🌹24, డిసెంబర్, 2024🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🍁మంగళవారం🍁*

*🌹24, డిసెంబర్, 2024🌹*

    *దృగ్గణిత పంచాంగం*


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి  : నవమి* రా 07.52 వరకు ఉపరి *దశమి*

*వారం :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : హస్త* మ 12.17 వరకు ఉపరి *చిత్త*


*యోగం  : శోభన* రా 08.54 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : గరజి* రా 07.52 *వణజి* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.30 - 10.30 సా 04.00 - 06.00*

అమృత కాలం  : శేషం ఉ 07.19 వరకు

అభిజిత్ కాలం  :  ప 11.45 - 12.30


*వర్జ్యం             : రా 09.19 - 11.07*

*దుర్ముహూర్తం  : ఉ 08.47 - 09.31 రా 10.50 - 11.42*

*రాహు కాలం : మ 02.54 - 04.18*

గుళికకాళం     : *మ 12.07 - 01.31*

యమగండం    : *ఉ 09.20 - 10.44*

సూర్యరాశి : *ధనుస్సు*

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 06.33*

సూర్యాస్తమయం :*సా 05.42*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.33 - 08.47*

సంగవ కాలం    :*08.47 - 11.00*

మధ్యాహ్న కాలం  :*11.00 - 01.14*

అపరాహ్న కాలం : *మ 01.14 - 03.28*

*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ నవమి*

సాయంకాలం  :  *సా 03.28 - 05.42*

ప్రదోష కాలం   :  *సా 05.42 - 08.16*

రాత్రి కాలం   :  *రా 08.16 - 11.42*

నిశీధి కాలం     :*రా 11.42 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.50 - 05.42*

________________________________

         *🌹ప్రతినిత్యం🌹*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీరామజయం శ్రీరామజయం* 

          *శ్రీరామజయం*


*దూరీకృతసీతార్తిః* 

*ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః*

*దారితదశముఖకీర్తిః*

*పురతో మమ భాతు* *హనుమతో మూర్తిః*

*Continues next saturday*

           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

       🌷🍃🍁🍁🍃🌷

       🌷🍁🍁🍁🍁🌷

కృషీవలుడే..ఇలభీమబలుడు.

 కృషీవలుడే..ఇలభీమబలుడు...

సీ..

పుడమికి చెలికాడు పుష్టిగూర్చెడివాడు

       కష్టనష్టములెల్ల కాడితోనె

పైరుల కాపరై ప్రకృతికి నెదురొడ్డి

     ఆ..ధైర్యపయనంబు హలముతోనె

జోడెడ్లు తలపాగ జోదైన బలిమిగా

       సేద్యంపు భూమితో సిరులు తానె

రైతురాజ్యముగదా రామరాజ్యమనంగ

     భారతావనికెల్ల వరము తానె

తేగీ..

పృథ్వి నిలువంగ నన్నిటన్ వెన్నెముకగ

కృషికి నిలువెత్తు రూపమై గెలిచెననగ

పదుగురకునీడనిచ్చెడు పాదపమన

రైతు కష్టంబె లోకాన రక్షయగుగ..

అట్టికర్షకమూర్తికే నంజలింతు...



రైతు దినోత్సవం సందర్భంగా...

రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి..

జాతీయ రైతు దినోత్సవం

 ☘️  జాతీయ రైతు దినోత్సవం 

 

 సీసపద్యము


 సీ. వేకువనే లేచి వేగమే తినియును

               చల్దియన్నము మూట సర్దుకొనియు

     నరక గట్టుకొనియు నాలితో కూడియు

               పొద్దు పొడుపు ముందె పొలము వెళ్ళి

     సాలును దప్పక సవరించి గింజలు

              వేయుచూ ముందుకు వేగ నడచి

      పగలు రే యనకను పడుచున్న శ్రమనెల్ల

            సంక్రమింపగ జేసి సర్వ ప్రజకు                             

తే. దేశమునకు వెన్నెముకగ తేజరిల్లి

      వాన వరదల కెదురొడ్డి వసుధ నిలచి

      యనయ మాహార మిచ్చెడి యన్నదాత !

      వరలు వినయాన నొనరింతు వందనములు🙏🙏


సాహితీ శ్రీ జయలక్ష్మి

అమలిన వర్తనమ్ము

 చ.అమలిన వర్తనమ్ము వినయమ్మున నొప్పు హితార్థ కృత్యముల్

సమయము నెంచి జూపెడు యశస్కరమైన యథార్థ భాషణల్

సముచిత మైన శీలము ప్రశాంత మనోజ్ఞ విశేష దృష్టి స 

త్త్వము శుభలక్షణమ్ములు హిత మ్మొనరించెడు సజ్జనాళికిన్౹౹ 93


చ.సముచితమైన ప్రజ్ఞ సువిశాల మనోహర దృక్పథమ్ము ను

త్తమమగు యోచనల్ పరమ ధార్మిక కర్మల యందు రక్తి చి

త్తమున మహోన్నతమ్మునగు తాత్త్వికమైన విశిష్ట యోచనల్

ప్రముఖములైన భూషలుగ రాజిలు నెప్పుడు సజ్జనాలికిన్౹౹ 94

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్లోనింగ్ నామ సంవత్సరం దక్షిణాయణం - హెమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - నవమి - హస్త / చిత్ర -‌‌ భౌమ వాసరే* (24.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం 24.12.2024 Tuesday

 ఈ రోజు పంచాంగం 24.12.2024 Tuesday,


Y

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష నవమి తిథి భౌమ వాసర హస్త నక్షత్రం శోభన యోగః: గరజి  కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

బ్రాహ్మణులు పితృ దేవతా కార్యములలో

 బ్రాహ్మణులు పితృ దేవతా కార్యములలో అత్యంత విలువైనది పితృ దేవతలను సంతృప్తి పరచ్చే ముఖ్యమైన కార్యం.  అందరం విధిగా ఆచరించ వలసిన క్రియ 

షణ్నవతి శ్రాద్దములు 

అనగా అమావాస్యలు         12

మన్వాదులు.                        14

యుగాదులు.                       04

సంక్రాంతులు.                      12

వైధృతి యోగములు.         13

వ్యతీ పాద్యోగములు.          13

మహాలయములు.             16

త్రిసోష్టకాలు.                       12

మొత్తం.     96 శ్రాద్దములు 

ప్రతీ సంవత్సరం మాత పితృ అబ్దీకములు  కాక ఆచరించ వలసినవి 

ఇందు అపరాణ్హ వ్యాప్తమైన 

అమావాస్యలలో ధర్మ శ్రాద్దం చేయవలెను. ఇందు సపత్నీక పితృ సపత్నీక మాతామహాయును షడ్దైవత్యం విశ్వ దేవ సహితంగా చేయవలెను 

ఇందు తిల తర్పణం ముందుగానే చేయవలెను 

ఇవి అన్ని కూడా పంచాంగం లో లభిస్తాయి 

తప్పకుండా ఆచరిస్తే ఫలితం అనుభవిస్తారు. పితృ దేవతలా దీవెనలు ఆశీస్సులు తప్పకుండా పొందుతారు 

పూజలు చేయకపోటీనా విధిగా వీటిని ఆచరించాలి 

ఇది కాశీలో పెద్దల మాట. ఆచరిస్తున్న వారి ప్రేరణ 

మీకు కూడా తెలియచేయాలని ఈ మెస్సేజి పంపుతున్నాను.

మన్వాదులు 

చైత్ర శుద్ధ తదియ -ఉత్తమ మన్వాదీ 

చైత్ర పౌర్ణమి.           రౌచ్యక 

జ్యేష్ట పౌర్ణమి.         భౌచ్యక 

ఆషాడశుద్ధ దశమి చాక్షుప

అషాడ బహుళ అష్టమి 

.              రుద్ర సావర్నిక 

శ్రావణ బహుళ అమావాస్య 

.             అగ్ని సావర్నిక 

భాద్రపద శుద్ధ తదియ       

.                తామస 

భాద్రపద బహుళ అష్టమి 

. సూర్య సావర్నిక 

ఆశ్వీజ శుద్ధ నవమి 

              స్వారొచిష 

కార్తీక శుద్ధ ద్వాదశి 

            స్వాయుంభువ

కార్తీక పౌర్ణమి 

.          ఇంద్ర సావర్నిక 

పౌష  శుద్ధ ఏకాదశి 

.         రైవత 

మాఘ శుద్ధ సప్తమి 

.         వైవస్వత

పాల్ఘున పౌర్ణమి 

.         బ్రహ్మ సావర్నిక 

ఈ మన్వాదులు నందు జరుపు శ్రాద్ధములు పిండ రహితంగా చేయవలెను 

హిరణ్య విధంగా ఆచరించవచ్చు 

ఈ మన్వాదులు నందు పితురలకు శ్రాద్ధం చేయుట వలన2000 సంవత్సరములు 

పితృదేవతలు తృప్తి నొందుతారు షడ్దైవత్యం గా ధను రుచి విశ్వ దేవతలలకు అర్పించివలెను.  శ్రాద్ధం నకు ముందుగానే తిల తర్పణం. చేయండి వలెను

యుగాదులు 

1.,కార్తీక శుద్ధ నవమి 

కృతయుగాది 

2. వైశాఖ శుద్ధ తదియ 

త్రేతా యుగాది

3. మాఘ బహుళ అమావాస్య-ద్వాపర యుగాది 

4. ⁠ భాద్రపద బహుళ త్రయోదశి. - కలి యుగాది 

యుగాదులలో మన్వాదుల వలానే శ్రాద్ధ నియామములు ఆచరించవలెను.

వైధృతి , వ్యతీ పాత్ లు 

నక్షత్రముల వలెనే 27 యోగములు కలవు. అందు 17 వది  వ్యతి పాద్యోగం.

27 వది  వైద్రుతి యోగం.

పంచాంగం ననుసరించి ఈ యోగములు వచ్చిన రోజు ఆ శ్రాద్ధంను ఆచరించవలెను 

ప్రతి సంవత్సరమునకు 13 వైదృతులు 13 వ్యతీపాత్ లు వచ్చును. మొత్తం 26. శ్రాద్ధములు పూర్వంవలే పిండ రహితంగా షడ్దైవత్యంగా ముందే తిల తర్పణాలతో చేయవలెను

మహాలయం 

మహాలయ శ్రాద్ధములు 16

మహాలయములు భాద్రపద కృష్ణ పాడ్యమి నుండి అమావాస్య పర్యంతం 15 రోజులు పక్ష శ్రాద్ధం చేయవలెను. 

అనగా పక్ష మహాలయ శ్రాద్ధంలో నవదైవత్వం నర్పించవలెను 

పిత్రాదిత్రయం 1 పార్వణ 

మాత్రాది త్రయం 1 పార్వణ 

సపత్నికులు, మాతామహులు 

1 పార్వణ , ధురి, విలోచన సన్జకులు విశ్వదేవతలు - శ్రాద్ధాంతమందు అంగ తిల తర్పణం చేయవలెను. ఇది చేయుటకు ఆసక్తులైనచో ఒక్క దినమున సర్వదైవత్వంగా అనగా మాతృత్రయ పితృ త్రయము. 1. సపత్నీక మాతా మహత్రయం,  2. ఆత్మ పత్యాది కారుణ్య వర్గము 

3. విశ్వేదేవులు 

4. ⁠4 గురు భోక్తలతో అన్న శ్రాద్ధం చేయుట దీనికి పరేహాని తిల తర్పణం చేయ

వలెను 

ఈ మహాలయములు శుభ కర్మలను ఆచరించిననూ అన్న శ్రాద్ధం చేయవలెను. 

మరియును ఈ మహాలయం అమ, హిరణ్యాదులతో చేయండి కూడదు 

అన్నశ్రాద్ధమే చేయవలెను 

ఇవి 15 పక్ష మహాలయ శ్రాద్ధములు 

1. సకృన్మహాలయం 

2. ⁠ఇది ఆశ్వయజ శుద్ధ ప్రతిపత్తిధినాడు మాతామహలను ఉద్దేశించి ఒక మహలయం పెట్టవలెను. 

ధురి,  విలోచన , విశ్వదేవతలు శ్రాద్దానంతం నందు తర్పణం - ఇది జీవ పితృకుడైననూ అవశ్యం చేయవలెనని నిబంధన గ్రంధంలందు కన్పించు చున్నది

సంక్రాంతులు 

సంక్రాంతి అనగా సూర్యుడు రాసిలో ప్రవేశించుట అని అర్ధం.  సూయుడు మేషరాశి ప్రవేశం మేష సంక్రాంతి అందురు. సవంత్సరానికి 12 సంక్రాంతులు వచ్చును 

మేష సంక్రమణం వృషభ మిధున ఇలా 12 సంక్రాంతులు 

సహజంగా ప్రతి సంక్రాంతికి 16 ఘడియలు ముందు వెనుకలు పుణ్య సమయమే 

సంక్రమణములకు పూర్వోత్తరం 16 ఘడియల కాలం శుభ కర్మార్హం కాదు 

సంక్రమణ శ్రాద్ధమును పిండ రహితముగా షడ్దైవత్వంగా ఆచరించవచ్చు. తిల తర్పణం ముందే చేయవలెను. అన్ని సంక్రమణ శ్రాద్ధములు ఆచరించ లేకపోయినా కనీసం కర్కాటక మకర సంక్రమణ శ్రాద్దాములైన ఆవశ్య మాచరణీయములు

ఇవి అన్ని చేయలేని/ శక్తి లేనివారు కనీసం తిలతర్పణాలు అయినా చేయవలెను.  దర్భా రవికిరణ్ శర్మ🙏శ్రీమాత్రేనమః

విధులను తప్పించుకొనగ

 *2090*

*కం*

విధులను తప్పించుకొనగ

విధి నిన్నిల వేరు విధుల వేధించునయా,

విధులను నిర్వర్తించగ

విధి నీవెంబడి సహకరించు వివిధము(వితతము) సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విధులను(కర్తవ్యాలను అంటే తప్పకుండా చేయవలసిన పనులను) తప్పించుకుంటే విధి(బ్రహ్మ) నిన్ను వేరే రకరకాలుగా బాధపెడుతుంది. అదే విధులను నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తే ఆ విధి (బ్రహ్మ) యే నీకు తోడుగా ఉండి పలువిధాలుగా సహాయం చేస్తుంది.

*సందేశం*:-- కర్తవ్యాలను ఎన్నడూ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయవద్దు, దాని వలన ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. చెడ్డ పేరు కూడా వస్తుంది. అదే కర్తవ్య నిర్వహణ చేస్తే కష్టాలు తగ్గుతాయి, మంచి పేరు కూడా వస్తుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

చక్కని శిల్పములై యిల

 *2089*

*కం*

చక్కని శిల్పములై యిల

ముక్కలు కానట్టి శిలలె మొక్కుల నొందున్.

చెక్కుటకోర్వని శిలలే

తొక్కబడెడి బండలౌను తూర్ణము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ముక్కలు కానంత బలమైన శిలలే శిల్పాలు గా చెక్క బడి పూజలనందుకొనును. చెక్క డానికి తట్టుకోలేని శిలలు తొక్కబడే బండలుగానే మిగిలిపోవును.

*సందేశం*:-- మొక్కబడే అంతటి గొప్ప స్థితిని పొందాలంటే ఉలిదెబ్బలకు తట్టుకునే సామర్ధ్యం కూడా ఉండాలి. అసమర్థుడు నన్ను అందలం ఎక్కించలేదనీ, నన్ను అణగదొక్కుతున్నారని చెప్పిననూ వాడిని ఉద్ధరించడానికి ప్రయత్నాలు చేయడం అవివేకమవుతుంది, అనర్థాలకు దారి తీస్తుంది. అంటే పరీక్షలలో ఉత్తీర్ణత నొందినవారికే పదవులను ఇవ్వాలి. పరీక్షలలో తప్పిన(ఫెయిల్) వారి కి పదవులు ఇవ్వరాదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా*

          *విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా*।

          *తురఙ్గమః శస్త్రనిపాతధీరః"*

          *భూమణ్డలస్యాభరణాని పఞ్చ*॥ 


తా𝕝𝕝 *తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా నిలిచే గుఱ్ఱం - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు."* 


 ✍️🌷💐🌹🙏

గురువాయురప్పన్ శ్రీ కృష్ణ ఆలయం

 🕉 మన గుడి : నెం 968


⚜ కేరళ  : గురువాయూర్


⚜ గురువాయురప్పన్ శ్రీ కృష్ణ ఆలయం



💠 స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం 3 లోకాలూ కలిసిన భూలోక వైకుంఠం, గురువాయూరులోని శ్రీ గురువాయూరప్పన్ కృష్ణ దేవాలయం. 

అప్పన్ అంటే ప్రభువు లేదా తండ్రి కాబట్టి  గురువాయూర్ ప్రభువు అని అర్థం.  


💠 జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించవల్సిన క్షేత్రాలలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి గురువాయూర్.

5 వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని గురువాయరప్పన్ విగ్రహం ఎంతో పౌరాణిక ప్రాశస్త్యమైనది. 


💠 గురువాయూర్ ఆకర్షణలలో ఈ కృష్ణుడి విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ. 

విగ్రహానికి 4 చేతులలోను శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి మరియు ఒక పద్మం ఉంటాయి. ఈ దేవాలయం అక్కడకు వచ్చే భక్తుల సంఖ్యను బట్టి దేశంలో 4వ పెద్ద దేవాలయంగా చెపుతారు. 

ఈ దేవాలయం భూలోక వైకుంఠమని ఇక్కడ విష్ణుమూర్తి నివసిస్తాడని విశ్వసిస్తారు.

ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. 


🔆 స్థల పురాణం 


💠 ఈ ఆలయాన్ని గురించీ, ఆలయంలోని విగ్రహాన్ని గురించీ నారదపురాణంలో విచిత్రమైన వృత్తాంతం ఉంది.

పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశ రుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి.


💠 స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. 

ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి (గురువు)- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. 

అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. 

అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం.

ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. 


💠 గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. 

ఇప్పుడు మనం దర్శించే విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుఁడు స్వయంగా అర్చించిన అర్చామూర్తి, కాబట్టి ఈ గురువాయరప్పన్ మహిమలు వర్ణనాతీతం. 

ప్రతినిత్యం వివధ అలంకారాలతో దర్శనమిస్తాడు గురువాయారప్పన్. 


💠 ఇక్కడి శ్రీకృష్ణుడి చిన్న విగ్రహం ప్రత్యేక ఔషధ గుణాలు కలిగి ఉన్న అయస్కాంత రాయి.  

ప్రతిరోజు ఉదయం స్వామికి నూనెతో అభిషేకం చేస్తారు.  అప్పుడు అతను "వాకా" అని పిలవబడే మూలికలతో తయారు చేయబడిన ఒక ప్రత్యేక ప్రక్షాళన పొడితో చల్లబడుతుంది.  ఈ పొడి లేత గోధుమ రంగులో ఉంటుంది మరియు విగ్రహానికి అదనపు రంగును ఇస్తుంది.  

ఈ మనోహరమైన దృశ్యాన్ని చూసేందుకు జనాలు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయానికి వెళతారు.  ఆ తర్వాత ఆలయంలోని నీటిని, మంత్రాలతో పవిత్రం చేసి, అతని కర్మ స్నానం కోసం విగ్రహంపై పోస్తారు.  ఈ పవిత్ర జలాన్ని భక్తులు ఆసక్తిగా తాగుతారు, ఎందుకంటే విగ్రహం తయారు చేయబడిన రాయి యొక్క అద్భుత లక్షణాలను కలిగి ఉంటుంది.


💠 స్వామి విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది. శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతుల్లో ధరించి తులసిమాల మెడలో వేసుకుని భక్తుల కోరికలను కోరకుండానే తీర్చేందుకు సిద్ధంగా కూర్చున్న చిన్ని కృష్ణయ్యను చూస్తేనే పాపాలు పరిహరించినట్టు తోస్తుంది. 


💠 తెల్లవారు జాము 3 గంటల నుండి రాత్రి పది గంటల వరకు పూజలు, సేవలు జరుగుతూనే ఉంటాయి. 

మధ్యాహ్న సమయంలో వివాహ కార్యక్రమాలు బహుళంగా జరుగుతాయి. 

ఇక్కడ వివాహం చేసుకుంటే గృహస్థు జీవితం మంగళకరంగా ఉంటుందని పెద్దలు చెప్పారు. చాలామంది 'తులాభారం' చేస్తామని మొక్కుకుంటారు. 

తక్కెడలో ఒకవైపు తాము కూర్చుని, మరోవైపు తమతో సరితూగే వెండిగాని,బంగారం కానీ, మరేదయినా ఇష్టమైన పదార్థం కానీ పెట్టి స్వామికి సమర్పిస్తారు. 


💠 స్వామికి ఎన్నో ఆభరణాలు భక్తులు సమర్పించినవి ఉన్నాయి. అన్నింటిని పదిలంగా భద్రపరిచేందుకు ఒక ప్రత్యేకమైన, గది ఉంది. దాని దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్ళరు. అందులో పంచ నాగులని ఐదు పాములు ఉన్నాయట.


💠 సంగీత, నృత్య కార్యక్రమాలు కూడా ఆలయంలో జరుగుతాయి. స్వామికి రుద్ర తీర్థంలో అభిషేకం చేయిస్తారు. 

సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. జయదేవుని గీత గోవిందం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం. 

శ్రీ కృష్ణ జన్మాష్టమి ఇక్కడ వైభవోపేతంగా జరుగుతుంది. అంతే కాక ఏకాదశికి సంబంధించిన పండుగలు కూడా చాలా జరుగుతాయి. 


💠 ఏనుగులకు ఈ ఆలయంలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఏనుగు పందాలు (పోటీలు) కూడా చాలా ఉత్సాహంతో వేడుకగా జరుగుతాయి.


💠 గురువాయూరు చాలా మహిమగల క్షేత్రం. అందువల్ల ఇక్కడ నియమాలూ, ఆచారాలూ ఎక్కువ.

 'శ్రీ కృష్ణ కర్ణామృతం' వ్రాసిన బిల్వమంగళ ఠాకూర్ ఈ ఆలయాన్ని పలుమూరులు దర్శించారు. 

పారమార్ధిక వైభవం గల ఈ పుణ్యక్షేత్రం నిజంగా భూలోక వైకుంఠమే,


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -97*

 *తిరుమల సర్వస్వం -97* 


*పురాణేతిహాసాల ననుసరించి:* 

*శ్రీరంగనాథుడు* 

*తిరుమల వేంకటేశుడు* 

*కంచి వరదరాజస్వామి* 

ఈ ముగ్గురి మూర్తులు మూడుకోణాలుగా ఏర్పడే త్రిభుజాకారంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం వెండివాకిలి దాటినది మొదలు, శ్రీవారి దర్శనం పూర్తయ్యేంత వరకూ ఈ త్రిభుజాకారం లోనే గడుపుతాం. ఎంతో దూరాలోచనతో, మన పూర్వీకులు ఆలయ సందర్శనార్ధం వచ్చే భక్తులకు అపారమైన దైవికశక్తిని ప్రసాదించడం కోసం ఈ మూర్తులను ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన ఆ ద్రష్టలను మనసులోనే స్మరించుకొని శ్రీవారి దర్శనార్థం ముందుకు సాగుదాం.

*గరుడాళ్వార్ సన్నిధి*

శ్రీరంగనాథస్వామి కుడ్యప్రతిమకు ఎడంప్రక్కన ఉన్న కటాంజన ద్వారంలో ప్రవేశించి, క్యూ మార్గంలో కుడిప్రక్కకు తిరగగానే, కొన్ని అడుగుల దూరంలో మనకు తూర్పుదిశగా, పంచభూతాల సమ్మేళనం గా భావించబడే *"గరుడు"* ని ఆలయం కనబడుతుంది. అదే *"గరుడాళ్వార్ సన్నిధి".* 

1512వ సం. లో ఎవరో అజ్ఞాతభక్తుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింప జేశాడు. శ్రీమహావిష్ణువు పరివారదేవత, వారి సేవకులలో ముఖ్యుడైన గరుత్మంతుని గురించి ఇంతకుముందే *"శ్రీవారి బ్రహ్మోత్సవాలు – గరుడవాహనం"* ప్రకరణంలో విస్తారంగా తెలుసుకున్నాం.

 సరిగ్గా శ్రీవారి బంగారువాకిలికి ఎదురుగా, శ్రీవారిని సతతం దర్శించుకుంటూ, నమస్కారభంగిమలో, రెక్కలు విప్పార్చుకున్నట్టి ఆరు అడుగుల గరుత్మంతుని విగ్రహం నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. ఈ సన్నిధి గోపురంపైన ఉన్న మూడు బంగారు కలశాలను మనం విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే, శ్రీరంగనాథుని మూర్తి ఉపరితలభాగంపై చూడవచ్చు. శ్రీవారి ముల్లోకవిహారానికి ఎల్లవేళలా సన్నద్ధుడై, అబద్ధునిగా ఉండే గరుత్మంతుణ్ణి మనఃపూర్వకంగా నమస్కరించుకుని, ఆ తరువాతే తన దర్శనం చేసుకోవడం శ్రీనివాసునికి సంతోషదాయక మని చెప్పబడుతుంది

. *మహామణి మండపం లేదా, తిరుమామణిమండపం* 

క్యూ మార్గంలో నడుస్తూనే గరుత్మంతుని దర్శనం చేసుకుని, ఆనందనిలయానికి ప్రధాన ద్వారమైన బంగారువాకిలి ఎదురుగా ఉన్న *"ఘంటామండపం"* లేదా *"మహామణిమండపం"* లోనికి ప్రవేశించాము. ఈ మంటపం ఈ క్రింది విధంగా అనుసంధానిస్తూ, దాదాపుగా చతురస్రాకారంలో ఉంటుంది. తూర్పుదిక్కున గరుడాళ్వార్ సన్నిధిని, పడమరదిక్కున బంగారువాకిలిని, ఉత్తరదిక్కున హుండీని, 

తూర్పుదిక్కున విమానప్రదక్షిణాపథాన్ని. 

ఈ మండపం పైకప్పుకు ఆధారంగా ఉన్న 16 శిలా స్తంభాలపై శ్రీమహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరుడు, వరదరాజస్వామి, ఆదివరాహస్వామి యొక్క ఆకృతులు కడు రమణీయంగా చెక్కబడి ఉంటాయి. పైకప్పు అంతా అత్యద్భుతమైన పౌరాణిక ఘట్టాలు మలచబడి, బంగారు తాపడంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. 15వ శతాబ్దం ప్రారంభంలో, చంద్రగిరికి చెందిన ఓ విజయనగర పాలకుని ద్వారా నిర్మింపబడ్డ ఈ మండపంలోనే, ప్రతిరోజు సుప్రభాత సమయంలో స్వామివారికి మేలుకొలుపులు పాడుతారు. ప్రతి బుధవారం, ఈ మంటపంలోనే, ఆర్జిత సేవయైన *"సహస్రకలశాభిషేకం"* కూడా జరుగుతుంది. ఈ మండపంలో, బంగారువాకిలికి ఎడమప్రక్కగా రెండు పెద్ద ఘంటలు వ్రేలాడదీయబడి ఉంటాయి. తమిళంలో *"మహామణి"* అంటే *"పెద్దఘంట"* అని అర్థం. అందువల్లనే ఈ మంటపానికి ఆ పేర్లు వచ్చాయి. ఈ ఘంటలను మ్రోగించే ఆలయ పరిచారకులను *"ఘంటాపాణి"* గా పిలుస్తారు. ఈ ఘంటానాదం విన్న తరువాతనే, చంద్రగిరిలో నివసించే స్వామివారి వీరభక్తులైన విజయనగర రాజులు ఆహారాన్ని స్వీకరించేవారట. ఆ సాంప్రదాయం చాలామంది తిరుమల వాసులు నేటికీ కొనసాగిస్తున్నారు. 

ఈ రెండు ఘంటలలో ఒక దానిని *"నారాయణఘంట"* గానూ, రెండవ దానిని *"గోవిందునిఘంట"* గానూ వ్యవహరిస్తారు. ఒకప్పుడు బంగారువాకిలికి ఇరు ప్రక్కలా ఉండే ఈ రెండు ఘంటలను ప్రస్తుతం ఒక పార్శ్వానికి చేర్చి, రెండింటిని ప్రక్క- ప్రక్కనే అమర్చారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406