24, డిసెంబర్ 2024, మంగళవారం

చక్కని శిల్పములై యిల

 *2089*

*కం*

చక్కని శిల్పములై యిల

ముక్కలు కానట్టి శిలలె మొక్కుల నొందున్.

చెక్కుటకోర్వని శిలలే

తొక్కబడెడి బండలౌను తూర్ణము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ముక్కలు కానంత బలమైన శిలలే శిల్పాలు గా చెక్క బడి పూజలనందుకొనును. చెక్క డానికి తట్టుకోలేని శిలలు తొక్కబడే బండలుగానే మిగిలిపోవును.

*సందేశం*:-- మొక్కబడే అంతటి గొప్ప స్థితిని పొందాలంటే ఉలిదెబ్బలకు తట్టుకునే సామర్ధ్యం కూడా ఉండాలి. అసమర్థుడు నన్ను అందలం ఎక్కించలేదనీ, నన్ను అణగదొక్కుతున్నారని చెప్పిననూ వాడిని ఉద్ధరించడానికి ప్రయత్నాలు చేయడం అవివేకమవుతుంది, అనర్థాలకు దారి తీస్తుంది. అంటే పరీక్షలలో ఉత్తీర్ణత నొందినవారికే పదవులను ఇవ్వాలి. పరీక్షలలో తప్పిన(ఫెయిల్) వారి కి పదవులు ఇవ్వరాదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: