బ్రాహ్మణులు పితృ దేవతా కార్యములలో అత్యంత విలువైనది పితృ దేవతలను సంతృప్తి పరచ్చే ముఖ్యమైన కార్యం. అందరం విధిగా ఆచరించ వలసిన క్రియ
షణ్నవతి శ్రాద్దములు
అనగా అమావాస్యలు 12
మన్వాదులు. 14
యుగాదులు. 04
సంక్రాంతులు. 12
వైధృతి యోగములు. 13
వ్యతీ పాద్యోగములు. 13
మహాలయములు. 16
త్రిసోష్టకాలు. 12
మొత్తం. 96 శ్రాద్దములు
ప్రతీ సంవత్సరం మాత పితృ అబ్దీకములు కాక ఆచరించ వలసినవి
ఇందు అపరాణ్హ వ్యాప్తమైన
అమావాస్యలలో ధర్మ శ్రాద్దం చేయవలెను. ఇందు సపత్నీక పితృ సపత్నీక మాతామహాయును షడ్దైవత్యం విశ్వ దేవ సహితంగా చేయవలెను
ఇందు తిల తర్పణం ముందుగానే చేయవలెను
ఇవి అన్ని కూడా పంచాంగం లో లభిస్తాయి
తప్పకుండా ఆచరిస్తే ఫలితం అనుభవిస్తారు. పితృ దేవతలా దీవెనలు ఆశీస్సులు తప్పకుండా పొందుతారు
పూజలు చేయకపోటీనా విధిగా వీటిని ఆచరించాలి
ఇది కాశీలో పెద్దల మాట. ఆచరిస్తున్న వారి ప్రేరణ
మీకు కూడా తెలియచేయాలని ఈ మెస్సేజి పంపుతున్నాను.
మన్వాదులు
చైత్ర శుద్ధ తదియ -ఉత్తమ మన్వాదీ
చైత్ర పౌర్ణమి. రౌచ్యక
జ్యేష్ట పౌర్ణమి. భౌచ్యక
ఆషాడశుద్ధ దశమి చాక్షుప
అషాడ బహుళ అష్టమి
. రుద్ర సావర్నిక
శ్రావణ బహుళ అమావాస్య
. అగ్ని సావర్నిక
భాద్రపద శుద్ధ తదియ
. తామస
భాద్రపద బహుళ అష్టమి
. సూర్య సావర్నిక
ఆశ్వీజ శుద్ధ నవమి
స్వారొచిష
కార్తీక శుద్ధ ద్వాదశి
స్వాయుంభువ
కార్తీక పౌర్ణమి
. ఇంద్ర సావర్నిక
పౌష శుద్ధ ఏకాదశి
. రైవత
మాఘ శుద్ధ సప్తమి
. వైవస్వత
పాల్ఘున పౌర్ణమి
. బ్రహ్మ సావర్నిక
ఈ మన్వాదులు నందు జరుపు శ్రాద్ధములు పిండ రహితంగా చేయవలెను
హిరణ్య విధంగా ఆచరించవచ్చు
ఈ మన్వాదులు నందు పితురలకు శ్రాద్ధం చేయుట వలన2000 సంవత్సరములు
పితృదేవతలు తృప్తి నొందుతారు షడ్దైవత్యం గా ధను రుచి విశ్వ దేవతలలకు అర్పించివలెను. శ్రాద్ధం నకు ముందుగానే తిల తర్పణం. చేయండి వలెను
యుగాదులు
1.,కార్తీక శుద్ధ నవమి
కృతయుగాది
2. వైశాఖ శుద్ధ తదియ
త్రేతా యుగాది
3. మాఘ బహుళ అమావాస్య-ద్వాపర యుగాది
4. భాద్రపద బహుళ త్రయోదశి. - కలి యుగాది
యుగాదులలో మన్వాదుల వలానే శ్రాద్ధ నియామములు ఆచరించవలెను.
వైధృతి , వ్యతీ పాత్ లు
నక్షత్రముల వలెనే 27 యోగములు కలవు. అందు 17 వది వ్యతి పాద్యోగం.
27 వది వైద్రుతి యోగం.
పంచాంగం ననుసరించి ఈ యోగములు వచ్చిన రోజు ఆ శ్రాద్ధంను ఆచరించవలెను
ప్రతి సంవత్సరమునకు 13 వైదృతులు 13 వ్యతీపాత్ లు వచ్చును. మొత్తం 26. శ్రాద్ధములు పూర్వంవలే పిండ రహితంగా షడ్దైవత్యంగా ముందే తిల తర్పణాలతో చేయవలెను
మహాలయం
మహాలయ శ్రాద్ధములు 16
మహాలయములు భాద్రపద కృష్ణ పాడ్యమి నుండి అమావాస్య పర్యంతం 15 రోజులు పక్ష శ్రాద్ధం చేయవలెను.
అనగా పక్ష మహాలయ శ్రాద్ధంలో నవదైవత్వం నర్పించవలెను
పిత్రాదిత్రయం 1 పార్వణ
మాత్రాది త్రయం 1 పార్వణ
సపత్నికులు, మాతామహులు
1 పార్వణ , ధురి, విలోచన సన్జకులు విశ్వదేవతలు - శ్రాద్ధాంతమందు అంగ తిల తర్పణం చేయవలెను. ఇది చేయుటకు ఆసక్తులైనచో ఒక్క దినమున సర్వదైవత్వంగా అనగా మాతృత్రయ పితృ త్రయము. 1. సపత్నీక మాతా మహత్రయం, 2. ఆత్మ పత్యాది కారుణ్య వర్గము
3. విశ్వేదేవులు
4. 4 గురు భోక్తలతో అన్న శ్రాద్ధం చేయుట దీనికి పరేహాని తిల తర్పణం చేయ
వలెను
ఈ మహాలయములు శుభ కర్మలను ఆచరించిననూ అన్న శ్రాద్ధం చేయవలెను.
మరియును ఈ మహాలయం అమ, హిరణ్యాదులతో చేయండి కూడదు
అన్నశ్రాద్ధమే చేయవలెను
ఇవి 15 పక్ష మహాలయ శ్రాద్ధములు
1. సకృన్మహాలయం
2. ఇది ఆశ్వయజ శుద్ధ ప్రతిపత్తిధినాడు మాతామహలను ఉద్దేశించి ఒక మహలయం పెట్టవలెను.
ధురి, విలోచన , విశ్వదేవతలు శ్రాద్దానంతం నందు తర్పణం - ఇది జీవ పితృకుడైననూ అవశ్యం చేయవలెనని నిబంధన గ్రంధంలందు కన్పించు చున్నది
సంక్రాంతులు
సంక్రాంతి అనగా సూర్యుడు రాసిలో ప్రవేశించుట అని అర్ధం. సూయుడు మేషరాశి ప్రవేశం మేష సంక్రాంతి అందురు. సవంత్సరానికి 12 సంక్రాంతులు వచ్చును
మేష సంక్రమణం వృషభ మిధున ఇలా 12 సంక్రాంతులు
సహజంగా ప్రతి సంక్రాంతికి 16 ఘడియలు ముందు వెనుకలు పుణ్య సమయమే
సంక్రమణములకు పూర్వోత్తరం 16 ఘడియల కాలం శుభ కర్మార్హం కాదు
సంక్రమణ శ్రాద్ధమును పిండ రహితముగా షడ్దైవత్వంగా ఆచరించవచ్చు. తిల తర్పణం ముందే చేయవలెను. అన్ని సంక్రమణ శ్రాద్ధములు ఆచరించ లేకపోయినా కనీసం కర్కాటక మకర సంక్రమణ శ్రాద్దాములైన ఆవశ్య మాచరణీయములు
ఇవి అన్ని చేయలేని/ శక్తి లేనివారు కనీసం తిలతర్పణాలు అయినా చేయవలెను. దర్భా రవికిరణ్ శర్మ🙏శ్రీమాత్రేనమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి