చ.అమలిన వర్తనమ్ము వినయమ్మున నొప్పు హితార్థ కృత్యముల్
సమయము నెంచి జూపెడు యశస్కరమైన యథార్థ భాషణల్
సముచిత మైన శీలము ప్రశాంత మనోజ్ఞ విశేష దృష్టి స
త్త్వము శుభలక్షణమ్ములు హిత మ్మొనరించెడు సజ్జనాళికిన్౹౹ 93
చ.సముచితమైన ప్రజ్ఞ సువిశాల మనోహర దృక్పథమ్ము ను
త్తమమగు యోచనల్ పరమ ధార్మిక కర్మల యందు రక్తి చి
త్తమున మహోన్నతమ్మునగు తాత్త్వికమైన విశిష్ట యోచనల్
ప్రముఖములైన భూషలుగ రాజిలు నెప్పుడు సజ్జనాలికిన్౹౹ 94
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి