☘️ జాతీయ రైతు దినోత్సవం
సీసపద్యము
సీ. వేకువనే లేచి వేగమే తినియును
చల్దియన్నము మూట సర్దుకొనియు
నరక గట్టుకొనియు నాలితో కూడియు
పొద్దు పొడుపు ముందె పొలము వెళ్ళి
సాలును దప్పక సవరించి గింజలు
వేయుచూ ముందుకు వేగ నడచి
పగలు రే యనకను పడుచున్న శ్రమనెల్ల
సంక్రమింపగ జేసి సర్వ ప్రజకు
తే. దేశమునకు వెన్నెముకగ తేజరిల్లి
వాన వరదల కెదురొడ్డి వసుధ నిలచి
యనయ మాహార మిచ్చెడి యన్నదాత !
వరలు వినయాన నొనరింతు వందనములు🙏🙏
సాహితీ శ్రీ జయలక్ష్మి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి