24, సెప్టెంబర్ 2023, ఆదివారం

భారత్ గౌరవ్‌ - ఊలా రైల్‌

 భారత్ గౌరవ్‌ - ఊలా రైల్‌


### సప్తమోక్ష క్షేత్ర యాత్ర లో టిక్కెట్‌ ధరల తగ్గింపు ###


### మిడిల్‌, అప్పర్‌ బెర్తులు మాత్రమే కలవు ###


 టిక్కెట్ పై 20 శాతం వరకు డిస్కౌంట్‌ కలదు 

 బుకింగ్‌ ఆఖరు తేదీ -సెప్టెంబర్‌ 28, సోమవారం 


అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో 

ద్వారక, పుష్కర్‌, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్‌, బృందావనం, మధుర, ఉజ్జయిని - నాగేశ్వర-ఓంకారేశ్వర  క్షేత్రాల్లో మీకు దర్శనం చేయించి తిరిగి మీ గమ్యస్థానాలకు చేరుస్తుంది..


#%# సమయానుకూలతను బట్టి జైపూర్‌, ఆగ్రా నగరాల సందర్శన కూడా ఏర్పాటు చేయడమైనది #%#


అక్టోబర్‌ 1న చెన్నైలో బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, గుంటూరు, మిర్యాలగూడ, హైదరాబాద్‌, కాజీపేట, రామగుండం స్టేషన్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొనును. 


ఈ రైలులో ప్రయాణించే వారికి క్షేత్ర సందర్శన సమయంలో భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును. ఏసీ తరగతుల వారికి ఏసీ రూమ్‌లు, స్లీపర్‌ క్లాసుల వారికి నాన్‌ ఏసీ రూములు ఏర్పాటు.

రైల్వే స్టేషన్‌ నుంచి ఆలయాలకు, మరలా స్టేషన్‌ చేర్చడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయబడును..


రైలులో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కిచెన్‌లో ఆహారం తయారీ 


ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం

మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం

సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

రాత్రి - అల్పాహారం అందించబడును


మన రైలులో పది మంది పురోహితుల బృందం ఆధ్వర్యంలో పూజ, పితృతర్పణ కార్యక్రమాల నిర్వహణ


బృందావనంలో ప్రత్యేక పూజలు, పుష్పగిరి పీఠాధిపతి  అభినవోద్దండ శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారిచే 

''మహా సుదర్శనహోమం'' వేదాశీర్వచనం


భద్రత

----

1. యాత్రికుల సేవల కోసం వంద మంది రైల్వే సిబ్బంది, ప్రత్యేక వాలంటీర్లు

2 . క్షేత్ర దర్శనాల్లో ఒక్కో బోగి నుంచి ఇద్దరు వాలంటీర్ల సహాయం

3. రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.

4. రైలులో లగేజీ ఉంచి సందర్శనకు వెళ్ళవచ్చును, సెక్యూరిటీ సౌకర్యం కలదు.

5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

6. ఆరోగ్య పర్యవేక్షణకు మెడికల్‌ అసిస్టెంట్‌


బుకింగ్‌ విధానం

---------

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బుకింగ్‌ అమౌంట్‌ జిపే, ఫోన్‌ పే, అకౌంట్‌ పే

3. బుకింగ్ సమయంలో మీకు బెర్తు నెంబరు కేటాయించబడును.

4. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ''ఎల్టీసీ'' వర్తించును.


ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను ఒక్కరికి

3rd AC........Rs.50,000/- గాను

స్లీపర్ క్లాస్..........38000/-లుగాను నిర్ణయించడమైనది.

ఈ ధరలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ కలదు


వెంటనే సంప్రదించండి..

రమేష్‌ అయ్యంగార్‌, 83310 08686, 83320 08686

Weight lifting by Sri Ramu GoldeMedal winner🏆🎉🏆


 

Puja



 

Andagaa


 

Vinayak


 

Vinayak celebrations


 

Shambu tanaya


 

Lord vinayaka in the sky


 

Kandi pachadi


 

Garika pachadi


 

Velaga pandu pachadi


 

Panchaag


 

Hindu


 

⚜ శ్రీ చండిమాత మందిర్

 🕉 మన గుడి : నెం 188







⚜ ఛత్తీస్‌గఢ్ : మహాసముండ్ 


⚜ శ్రీ చండిమాత మందిర్ 


💠 మన దేశంలోని అనేక దేవాలయాలు వాటి అద్భుతాలు మరియు ఆధ్యాత్మిక శక్తుల కారణంగా ప్రసిద్ధి చెందాయి.  

కానీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఉన్న చండీదేవి ఆలయం ప్రతిరోజూ జరిగే ఒక సంఘటనకు ప్రసిద్ధి చెందింది.  

ఈ ఆలయంలో కేవలం మనుషులే కాదు, ప్రతిరోజు ఎలుగుబంట్ల కుటుంబం మొత్తం కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటాయి. 

ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి సాయంత్రం, హరతి ముగిసినప్పుడు, అడవి నుండి ఎలుగుబంట్లు సందర్శిస్తాయి మరియు అవి ఎటువంటి హాని  కలిగించకుండా యాత్రికులు ఇచ్చే ఆహార ప్రసాదాన్ని తీసుకుంటాయి.


💠 ఇక్కడ ఒక ఆడ ఎలుగుబంటి మరియు దాని రెండు పిల్లలు ప్రతిరోజూ సాయంత్రం

హారతి అయ్యాక ఇక్కడికి వచ్చి పడుకుని దర్శనం చేసుకుని, పూజారి దగ్గర ప్రసాదం తీసుకుని తిని మౌనంగా తమ దారిలో వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. 

ఈ ఎలుగుబంట్లు చాలా కాలం నుండి ఇక్కడకు వస్తున్నాయి, వాటిలో పెద్ద మగ ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి చనిపోయాయి, వాటి సంప్రదాయాన్ని ఇప్పుడు వారి చిన్న పిల్లలు ముందుకు తీసుకువెళుతున్నాయి.

ఇప్పటి వరకు బహిర్భూమికి వస్తున్న ఈ ఎలుగుబంట్లు సందర్శకులకు ఎలాంటి హాని కలిగించలేదు. భక్తులు వారికి తమ చేతులతో ప్రసాదం తినిపిస్తారు. అయితే, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, ఆలయ ట్రస్ట్ జవాబుదారీతనం లేదని మద్దతుగా పలు చోట్ల నోటీసు బోర్డులను ఉంచింది.


💠 అమ్మవారి దర్శనం కోసం ఎలుగుబంట్లు తమ కుటుంబాలతో కలిసి ప్రతిరోజూ మధ్యాహ్నం మరియు సాయంత్రం మధ్య మా ఆదిశక్తి చండీ మాత ఆలయానికి వస్తాయి.  దీన్ని చూసేందుకు సాయంత్రానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరుగుతుంది.

 మీరు ఎలుగుబంటిని చూడటానికి వస్తున్నట్లయితే, మీరు నవరాత్రి రోజుల్లో తప్ప ఎప్పుడైనా రావచ్చు, ఈ సమయంలో రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.

ఇది అడవిలో ప్రమాదకరమైన జంతువుగా పరిగణించబడుతున్నప్పటికీ, ఆలయంలోని భక్తులతో స్నేహానికి ఉదాహరణగా నిలుస్తుంది.


💠 చండీమాత ఆలయం 150 ఏళ్ల నాటిది కావడం గమనార్హం. ఆలయానికి సంబంధించి ఇక్కడి చండీమాత విగ్రహం సహజసిద్ధమైనదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మాత ఆలయం పూర్వం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందింది. ఎందరో ఋషులు, సాధువులు ఇక్కడ విడిది చేసేవారు. ఇది తంత్ర సాధన కోసం రహస్యంగా ఉంచబడింది కానీ 1950లో ఈ ఆలయం సాధారణ పౌరుల కోసం తెరవబడింది. ఈ ఆలయంలో సహజంగా ఏర్పడిన 23 అడుగుల ఎత్తులో దక్షిణ ముఖంగా విగ్రహం ఉంది.


⚜ చరిత్ర ⚜


💠 మాతా చండీ గురించి చాలా కథలు మరియు ఇతిహాసాలు వినబడుతున్నాయి, వీటిలో బిర్కోని అకర్‌లో నివసించే మాతా చండీ కథ చాలా ప్రజాదరణ పొందింది. చండీ తల్లి గతంలో బిర్కోని నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరింగ్ గ్రామంలో నివసించేదని స్థానికులు చెబుతారు. వారి అసలు గ్రామం ఇప్పటికీ భోరింగ్‌గా పరిగణించబడటానికి ఇదే కారణం. అయితే గ్రామస్థుల నుంచి గౌరవం లభించకపోవడంతో తల్లి చండీదేవి అవమానానికి, ఆగ్రహానికి గురై ఇద్దరు పిల్లలతో ఊరు విడిచి వెళ్లిపోయిందని..ఆమె భోరింగ్ గ్రామం నుండి దట్టమైన అడవుల వైపు బయలుదేరింది మరియు సాయంత్రం అక్కడ, ఆమె తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి రాయి రూపంలో స్థిరపడింది, తరువాత ఇదే స్థలం బీర్కోనిగా మారింది. 


💠 ప్రధాన ఆలయానికి కుడి వైపున,హనుమాన్ యొక్క మరో రెండు భారీ విగ్రహాలు మరియు శివుని ఆలయం ఉన్నాయి.

ఈ ఆలయాల ఆకర్షణ చూడదగినది. 

ఆలయ ప్రవేశ ద్వారం వద్ద  రెండు పెద్ద సింహాల విగ్రహాలు కూడా నిర్మించబడ్డాయి.


💠 ప్రతి సంవత్సరం రెండు నవరాత్రులలో ఇక్కడ జనసందోహం ఎక్కువగా ఉంటుంది.

ప్రతి నవరాత్రులలో భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఆలయంలో సుమారు 8000 నుండి 10000 దీపాలను వెలిగిస్తారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సప్తమి మరియు నవమి మధ్య ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి దర్శనం పొందవచ్చు.


💠 మా చండీ మాత ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లా నుండి 15 కిలోమీటర్ల దూరంలో మరియు రాజధాని రాయ్‌పూర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిర్కోని గ్రామంలో ఉంది.

తండ్రి ఆశీర్వాదం

 తండ్రి ఆశీర్వాద శక్తి....

 

#తండ్రి ఆశీర్వాదం* 


 అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. 


కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. 


ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. 


తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.


ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై  చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.

క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.  


త్వరలోనే  నగరంలోని సంపన్నులలో , ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. 


తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ,  ప్రామాణ్యతను కానీ  కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. 

ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.


ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” 


ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." 


ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.


సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. 


నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్  కుతూహలపడ్డాడు. 


ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.  


ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని  చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,  ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . 


భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు.


ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.  


తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 


నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.


జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు.


ఎవరని వాకబు చేయగా ఆయన  స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. 


వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. 


అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." 


సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.


సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా  కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా,వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. 


అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది.  వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని  అడిగాడు.


సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.


ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. 


అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం.


ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్  చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.


 అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.

" లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. 

అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.

“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక  మీరు ఏం సంపాదిస్తారు? ”

ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”


సుల్తాన్ ఇలా అడిగాడు,  “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" 


అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, “మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు",  అని ఆ మాటలు మాట్లాడుతూ , ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.


ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి,  ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 


ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.


సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. 


“ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” .


అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. 

అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. 


ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."


సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.

కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.


తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం. 


వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.


ఈ  ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.

సేకరణ...... From FB...

..............................

ఓం అసతోమా సద్గమయ, 

తమసోమా జ్యోతిర్గమయ,

 మృత్యోర్మా అమృతంగమయ.. 

ఓం శాంతి: శాంతి: శాంతి:


తాత్పర్యం:- సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము ( మిధ్య ) నుంచి సత్యమునకు గొనిపొమ్ము. ( అజ్ఞానం అనే ) అంధకారము నుండి ( జ్ఞానస్వరూపమైన ) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.

వజ్ర గణపతి

 *600 కోట్ల వజ్ర గణపతిని చూశారా.?*




గుజరాత్ సూరత్ లోని వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 


182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువున్న ఏడాదికి ఒక్క రోజు మాత్రమే బయటకు తీసి, 


ఆ రోజున భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. 



ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు.



 మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. 



15 ఏళ్ల క్రితం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలు తీసుకొచ్చారు

ప్రశాంత జీవన దివ్య పథంలో

 " విశ్వ జీవ ప్రశాంత జీవన దివ్య పథంలో విశ్వ మానవాళి పాత్ర "



తరతరాల పవిత్ర  ఆధ్యాత్మిక సనాతన ధార్మిక జీవన గమనం ! 


అపౌరుషేయమై వెలువడిన పవిత్ర వేదనాదం, తరతరాల సుసాంప్రదాయ ధార్మిక సంస్కృతి !


విశ్వ కాల చక్ర భ్రమణంలో నేటికీ విశ్వ సురక్షా కవచమై వెన్నంటి నిలిచిన దార్శనికత !


" బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే సుసాంప్రదాయ, విశ్వ సుసంక్షేమ దివ్య జీవన పథం !


" కలసి ఉంటే కలదు సుఖం ", అనెడి మహోన్నత సుహృద్భావ దృక్పథ నేపథ్యం !


తమ అభివృద్ధిలో సాటి వాని సామర్థ్యానికీ ప్రాధాన్యత నిచ్చెడి  అత్యుత్తమ సువ్యక్తిత్వ చైతన్య స్రవంతి ! 


విశ్వ నిత్య సత్య సుప్రకాశ తేజోభివృద్ధికై విశ్వ మానవాళి సమైక్యంగా నడవాల్సిన సమయం !


అవమానాలు, విద్వేషాలు, విడనాడి, అందరి కోసం అందరై, అందరిలో ఒక్కరై, ముందుకు సాగాల్సిన నేపథ్యం !


భారతీయ సంస్కృతి, తరతరాల వేద ధార్మికత, ఎల్లవేళలా విశ్వ సురక్షా జీవన పథంలో చక్కని మార్గదర్శి !


 విశ్వ మానవాళి నేడు యోచించాల్సిన ముఖ్య విషయం, యావత్ విశ్వ జీవ సురక్షాత్మక జీవనం ! 


వసుధైక కుటుంబక నిర్మాణంలో, విశ్వ మానవాళికి  కావాల్సిన ప్రధాన ఇతివృత్తం, విశ్వ జీవకారుణ్యతా భావన !


సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిర్భయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! 


రచన : 


గుళ్లపల్లి ఆంజనేయులు


మొబైల్ ఫోన్ నెంబర్ : 


9848369618


Gullapalli Anjaneyulu

శ్రీరామ వైభవం "

          " శ్రీరామ వైభవం "


సకల విశ్వ జీవ పరిరక్షణలో వెన్నుదన్నై నిలచెడి శ్రీరామ నామం !


సర్వోన్నతమై, మహత్తర ఆదర్శ భావాన్ని సకల లోకాలకు తెలిపెడి మంత్రం !


పరమశివుని మనోఫలకంపై నిరంతరం సకల లోక రక్షణకై జపించబడు మంత్రం !


ఎట్టి క్లిష్ట పరిస్థితులనైననూ,  సులభంగా పరిష్కరించే మంత్రం !


సకల జన హితమై, సకల మనోరంజకమై, ఎల్లవేళలా రక్షా కవచం, శ్రీరామ మంత్రం !


మర్యాదపురుషోత్తముడైన శ్రీరామ నామ స్మరణమే, అన్ని వేళలా శుభకరం !


మహాలక్ష్మీ స్వరూపిణి, సీతమ్మను మహా పురుషోత్తముడు, శ్రీరాముని చెంతకు చేర్చడంలో, మహోన్నతమైన మంత్రం !


శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని మమ్మారు మనఃపూర్వకంగా తలచిన మదిని ప్రశాంతమొనర్చెడి మంత్రం ! 


ఏ యుగాన్నైనా, ఏ సందర్భమైనా, శ్రీరామ మంత్ర జపోచ్ఛారణ సకల జీవ శుభకరం !


🌹💐🌹💐🌹


రచన:-


గుళ్లపల్లి ఆంజనేయులు 


మొబైల్ ఫోన్ నెంబర్స్ :


9848369618 & 


7901238168

दीपक चौरसिया

 दीपक चौरसिया ,

ने लिखा है भाजपा मोदी से पहले और मोदी के बाद,

जब तक "भाजपा" "वाजपेयी" जी के "विचारधारा"

 पर चलती रही, 

वो "राम" के 

बताये  "मार्ग पर" चलती रही।

 "मर्यादा"

 "नैतिकता", और "शुचिता", इनके लिए "कड़े मापदंड"

 तय किये गये थे। "परन्तु" कभी भी "पूर्ण बहुमत" "हासिल नहीं"

 कर सकी,


फिर होता है

" नरेन्द्र मोदी"  का "पदार्पण! ........ मर्यादा पुरुषोत्तम "राम के चरण" चिन्हों पर "चलने वाली"

 "भाजपा" को 

"मोदी जी", कर्मयोगी "श्री कृष्ण" की राह पर ले आते हैं !


श्री कृष्ण "अधर्मी" को "मारने में"

 किसी भी प्रकार की "गलती नहीं" करते हैं। ...........

"छल हो" तो "छल से"

 "कपट हो" तो "कपट से"

 "अनीति हो" तो "अनीति से" , "अधर्मी" को "नष्ट करना"

 ही उनका "ध्येय" होता है!


"इसीलिए" वो 

अर्जुन को "केवल कर्म"

 करने की शिक्षा देते हैं !


"बिना सत्ता" के

 आप "कुछ भी नहीं" कर सकते हैं ! इसलिए  "कार्यकर्ताओं" को चाहिए कि "कर्ण" का "अंत करते" समय कर्ण के "विलापों पर"

 ध्यान ना दें! .........

केवल "ये देखें

"कि"अभिमन्यु" की 

"हत्या के समय" उनकी "नैतिकता" "कहाँ" चली गई "थी" ?


कर्ण के "रथ" का "पहिया" जब 

"कीचड़" में धंस गया, तब

 भगवान श्री कृष्ण ने अर्जुन से कहा: पार्थ, देख क्या रहे हो ? ......

इसे समाप्त कर दो!


"संकट" में घिरे

 "कर्ण ने" कहा: 

यह तो "अधर्म "है !


भगवान 

"श्री कृष्ण" ने कहा: "अभिमन्यु" को घेर कर "मारने वाले", और "द्रौपदी" को भरे दरबार में 

"वेश्या" कहने वाले के "मुख से" आज "धर्म की" बातें करना "शोभा"

 नहीं देता है !!


आज 

"राजनीतिक" गलियारा जिस तरह से "संविधान"

 की "बात" कर रहा है, तो "लग रहा" है जैसे हम "पुनः" "महाभारत युग"

 में आ गए हैं !


"विश्वास रखो", महाभारत का "अर्जुन नहीं चूका" था ! 

"आज का अर्जुन" भी नहीं चूकेगा !


यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत!

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् !


"चुनावी जंग" में "अमित शाह" जो कुछ भी 

"जीत" के लिए "पार्टी" 

के लिए कर रहे हैं, वह "सब उचित" है!


साम, दाम, दण्ड , भेद ,राजा या क्षत्रिय द्वारा अपनाई जाने वाली नीतियाँ हैं, जिन्हें उपाय-चतुष्टय (चार उपाय) कहते हैं !


राजा को राज्य की व्यवस्था सुचारु रूप से चलाने के लिये सात नीतियाँ वर्णित हैं !


राजनीतिक गलियारे में ऐसा "विपक्ष नहीं" है, जिसके साथ "नैतिक-नैतिक"

 खेल "खेला जाए"! सीधा 

"धोबी पछाड़" ही"आवश्यक" है !


एक बात और!

"अनजाना इतिहास"


बात "1955"

 की है! "

"सउदी" अरब के बादशाह "शाह-सऊदी"  प्रधान मंत्री "जवाहरलाल नेहरू" के "निमंत्रण पर" "भारत आए" थे, वे 4 दिसम्बर 1955 को दिल्ली पहुँचे, "शाह-सऊदी" दिल्ली के बाद, "वाराणसी" भी गए!


"सरकार ने"

 दिल्ली से "वाराणसी"

 जाने के लिए, "शाह-सऊदी" के लिए एक "विशेष ट्रेन" में, "विशेष कोच" की व्यवस्था की! शाह सऊदी 

"जितने दिन" वाराणसी में रहे "उतने दिनों" तक "बनारस" की सभी "सरकारी इमारतों" पर 

"कलमा तैय्यबा" लिखे हुए "झंडे लगाए" गए थे!

"वाराणसी में" जिन-जिन रास्तों-सडकों से "शाह-सऊदी " को "गुजरना" था, 

उन सभी "रास्तों-सड़कों" में पड़ने वाले मंदिरों और मूर्तियों को पर्दों से ढक दिया गया था!


इस्लाम की तारीफ़ में, और हिन्दुओं का मजाक उड़ाते हुए शायर "नज़ीर बनारसी" ने एक शेर कहा था: -

अदना सा ग़ुलाम उनका,

गुज़रा था बनारस से,

मुँह अपना छुपाते थे,

ये काशी के सनम-खाने!


अब खुद ही सोचिये कि क्या आज मोदी और योगी के राज में, किसी भी बड़े से बड़े तुर्रम खान के लिए, ऐसा किया जा सकता है ? आज ऐसा करना तो दूर, करने के लिए सोच भी नहीं सकता!


हिन्दुओ , उत्तर दो, तुम्हें और कैसे अच्छे दिन चाहिए ?


आज भी बड़े बड़े ताकतवर देशों के प्रमुख भारत आते हैं, और उनको वाराणसी भी लाया जाता है! लेकिन अब मंदिरों या मूर्तियों को छुपाया नहीं जाता है, बल्कि उन विदेशियों को गंगा जी की आरती दिखाई जाती है, और उनसे पूजा कराई जाती है!


*जब था कांग्रेसियों का हिंदुत्व दमन!*                     *अब है भा ज पा का *"लक्ष्य  हिंदुत्व के द्वारा हिंदू राष्ट्र"*


*कम से कम पांच  ग्रुपों में फॉरवर्ड करें!🙏

कुछ को मैं जगाता हूँ!

कुछ को आप जगाऐं!


 राष्ट्रधर्म :सर्वोपरि

🚩जय श्री  राम 🙏

అనంత గుణరాశి లో


: ಸುಭಾಷಿತ . 609 .


ಅನಂತರತ್ನಪ್ರಭವಸ್ಯ ಯಸ್ಯ ಹಿಮಂ ನ ಸೌಭಾಗ್ಯವಿಲೋಪಿ ಜಾತಂ | ಏಕೋ ಹಿ ದೋಷೋ ಗುಣಸನ್ನಿಪಾತೇ ನಿಮಜ್ಜತೀಂದೋಃ ಕಿರಣೇಷ್ವಿವಾಂಕಃ ||


ಹಿಮಾಲಯದಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಸ್ತುಗಳಿವೆ . ಆದುದರಿಂದ ಎಲ್ಲೆಡೆಯಲ್ಲಿಯೂ ಹಿಮವಿದ್ದರೂ ಅದರ ಹೆಚ್ಚಿಕೆಯನ್ನು ಹೋಗಲಾಡಿಸಲಿಲ್ಲ . ಚಂದ್ರನ ಕಾಂತಿಯಲ್ಲಿ ಅವನ ಕಳಂಕವು ಮರೆಯಾದಂತೆ ಅನೇಕ ಗುಣಗಳಿಂದ ಒಂದು ದೋಷವು ಮರೆಯಾಗುತ್ತದೆ .


ಕುಮಾರಸಂಭವ .

 అనంత రత్న రాసులు, ఔషధములు ఉన్న హిమాలయముల కీర్తిని, ఆ పర్వతములను కప్పి ఉన్న మంచు తగ్గించలేదు. చంద్రుని మచ్చ, అ చంద్ర కిరణప్రకాశములో కలిసిపోయినట్లు.

అనంత గుణరాశి లో ఒక్క దోష మున్నను అది లెక్కించ దగినది కాదు.

మహాభారతములో - ఆది పర్వము* *ప్రథమాశ్వాసము* *4*

 *మహాభారతములో - ఆది పర్వము*


*ప్రథమాశ్వాసము*


           *4*


*ఉదంకోపాఖ్యానము*


వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామనసాయిత అనే అణిమాది  అష్టసిద్ధులు వంటి విద్యలను పోందాడు. ఒకరోజు అతడు తన వయసు మీరి పోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధ పడగా గురువు అతడిని ఊరడించి తన కహమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వాడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు. ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్యపురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారుమాటాడక అలాగే చేసాడు. ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి "నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను" అని అడిగాడు. ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు " మహాత్మా ! నాభార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి " అని బదులిచ్చాడు.


ఉదంకుడు అలాగే పౌష్య మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా ! నాకు ఆమెకనిపించ లేదు. కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి. అన్నాడు. మహారాజు ఆమె మహాత్మా ! ఆమె మహా పతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి." అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గోమయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యా దేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ " ముని కుమారా ! ఈ కుండలములు " కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఈ కుండలములు అతడి కంట బడకుండా జాగ్రత్తగా తీసుకుని పో" అని చెప్పింది.

విఠ్ఠల విఠ్ఠల

 *" విఠ్ఠల విఠ్ఠల " అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!*


పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. 

విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ' ఠ్ఠ ' అనే అక్షరం నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది. 

రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది. 

పదిరోజులపాటు , రోజుకు 9 నిమిషాలు శాంత చిత్తంతో విఠ్ఠల నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.

సంస్కృత భారతీ* *దశమ పాఠః* *10*

 *సంస్కృత భారతీ*

      *దశమ పాఠః*

              *10*

*భోజనాలయ సంభాషణం*

అన్నం/ఓదనం = అన్నము, పాయసం = పరమాన్నము, భక్ష్యం = పిండి వంటకం(నమిలి తినేది), భోజ్యం =సాధారణంగా తినగలిగినది, లేహ్యం/వ్యంజనం = పచ్చడి(నాకుతూతినగలిగేది), చోష్యం = పులుసు(పీల్చుతూ తినగలిగేది), ఘృతం/సర్పిః = నెయ్యి, శాకం = కూర, రసం = చారు, అపూపం = అప్పచ్చి,  తైలాపూపం/ తైలపక్వం  = నూనె లో వేచిన వంటకం, తక్రం = మజ్జిగ, దధి = పెరుగు, సూపం = పప్పు, పానీయం = త్రాగగలిగే పదార్థం, అల్పాహారం = స్వల్ప భోజనం(టిఫిన్), లవణం = ఉప్పు మధు = తేనె, శర్కరా = పంచదార, గుడం = బెల్లం, నవనీతం = వెన్న,ఖండ శర్కరా = పటికబెల్లం, తైలం= నూనె

****

పరివేషయ(తు) = వడ్డించుము, స్థాపయ(తు) = ఉంచుము, అలం = చాలు, వాంఛితం / ఈప్సితం = కావలెను. పరివేషయన్తు = వడ్డించండి, స్థాపయన్తు = ఉంచండి,

*ప్రయోగ విభాగః*

భోజనార్థం/ అశనార్థం భోజనశాలాయామ్ సర్వే ఆగఛ్ఛన్తు = భోజనం చేయుటకు భోజనశాల కు అందరూ దయచేయండి(రండి),

భోజన పత్రం జలేన ప్రక్షాలయన్తు = భోజనపత్రాలను నీటి తో కడుగండి. 

ప్రథమతః స్థాపిత భోజన పాత్రేషు ఘృతేన అభిఘారయన్తు = ముందుగా ఉంచిన భోజన పాత్రలపై నేతితో అభిఘారం చేయండి.

తతః అన్నం,పాయసం, భక్ష్యం,ఘృతం, వ్యంజనాదికాని పరివేషయన్తు = తర్వాత అన్న ము,పాయసము, భక్ష్యం, నెయ్యి, పచ్చళ్ళు మొదలైన వి వడ్డించండి.

అంతే పునరభిఘారం ఘృతేన కుర్వన్తు = చివరగా నేతితో మరలా అభిఘారం చేయండి.

అధునా సర్వైః గోవింద నామముక్త్వా పరిషేచనం కృత్వా భోజనారంభం కుర్వన్తు = ఇప్పుడు అందరూ గోవింద నామం జపిస్తూ పరిషేచనం చేసి భోజనం ప్రారంభించండి.

*ఏకభోక్తః*(ఒక భోజనం చేయువాడు):-- మహ్యం పాతుం తాపోదకం వాంఛితం(అవశ్యం) = నాకు త్రాగుటకు వేడినీరు కావాలి (అవసరం).

*అన్యః ఏక భోక్త*:-- ముద్గసూపం బహు(బృహత్) సమీచీనమస్తి = పెసరపప్పు చాలా బాగుంది.

*అన్యః ఏకభోక్త*:-- మమ చోష్యం పరివేషయన్తు భోః = నాకు పులుసు(సాంబారు) వడ్డించండి, తతః కించిత్ పరివేషణానంతరం(తర్వాత కొంత వడ్డించిన తర్వాత) = అలమలం మహాశయా అహం హస్తిర్నాస్మి , మనుష్య ఏవ( చాలు చాలు మహానుభావా నేను ఏనుగు ను కాదు మనిషినే)...... అంతే తాంబూలం స్వీకృత్య గఛ్ఛన్తు సర్వే = చివరకు తాంబూలం తీసుకుని వెళ్ళండి అందరూ.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సంస్కృత భారతీ* *నవమ పాఠః* *9*

 *సంస్కృత భారతీ*

  *నవమ పాఠః*

          *9*

*ప్రాదయః - ఉపసర్గాః*

పదమునకు ముందు చేరే అవ్యయాక్షరములను *ఉపసర్గలు* అంటారు. *ఉదా* నిర్దయ... నిర్ + దయ... దయలేని వాడు.

ఇవి "ప్ర" తో మొదలై చాలా ఉండుటచే వీటిని ప్రాదులు(ప్ర ఆదులు) అంటారు. ఉపసర్గ చేరుటచే అర్థం రకరకాలుగా మారుతుంది. కొన్ని మాత్రం సాధారణముగా ఒకేరకమైన అర్థాన్నిస్తాయి.

************"

*ప్ర*= గొప్ప... ఉదా:- ప్రభాస= గొప్ప ప్రకాశం.ఇలాగే ప్రభావం, ప్రయత్నం, ప్రకారం, ప్రమోద, ప్రయాస,ప్రసిద్ధ...

*పర,అప,అవ,నిస్,నిర్,దుస్,దుర్,ని,ప్రతి* ఇవన్నీ సాధారణంగా వ్యతిరేక అర్థాన్నిస్తాయి.

*ఉదా*:-- పరలోకం= వేరే లోకం, అప నమ్మకం = నమ్మకం లేకపోవడం, అప జయం = జయం లేకపోవడం (పరాజయం),ఇలాగే  అవయోగం, నిష్క్రమణ, నిష్ప్రయోజనం, నిశ్చల,నిర్గమనం, నిర్భయం, దుష్ప్రభావం, దుశ్శాసన, దుర్మార్గ, దుర్యోధన, ప్రతి నాయక ...

*వి* = విశేష లేదా వ్యతిరేక,

ఉదా:-- విజ్ఞానం = విశేష జ్ఞానం, విస్పష్ట = విశేష(బాగా) స్పష్టం,ఇలాగే విశిష్ట, విస్తృత, విజయ,... విజాతి = వేరే జాతి, ఇలాగే విముఖ, వికృత,విలోమ...

*అధి*= గొప్ప, ఉదా:--అధినేత = గొప్ప నాయకుడు, ఇలాగే అధిగమనం,అధ్యయనం...

*సు*:-- మంచి, ఉదా:-- సుగంధ = మంచి వాసన, సుప్రభాతం = మంచి ఉదయం,ఇలాగే సునిశిత, సుజన,సుదీర్ఘ, సుదూర...

*ఉత్*:-- పైకి, ఉదా:-- ఉత్ప్లవనం = పైకి తేలుట, ఉత్తిష్ఠ = పైకి లేచు, ఇలాగే ఉన్మరీచిక,ఉన్నత,ఉద్భవ,ఉత్తీర్ణ,ఉత్పత్తి,...

*అభి* = ఎక్కువ, ఉదా = అభిరుచి = ఎక్కువ రుచి,ఇలాగే అభివృద్ధి, అభిప్రాయం, అభిసారిక,...

*పరి*:-- ఎక్కువ, ఉదా:-- పర్యావరణ = ఎక్కువ వ్యాపించిన,ఇలాగే పరిపూర్ణ, పరిపూజ,పరిపాలన... 

*ఉప*:-- సమీప,  ఉపవాసం = దగ్గరగా (దైవానికి) నివసించుట,ఇలాగే ఉపయోగ, ఉపమాన, ఉపపాలక, ఉపాధికారి,ఉపపతి...

*అను*:-- అనుసరించి, ఉదా:-- అను గమనం = అనుసరించి(వెంటబడి) వెళ్ళు, ఇలాగే అను భూతి, అను ప్రహరణం...

*సం*:-- గొప్ప, ఉదా:-- సంగీతం = గొప్ప గీతం,ఇలాగే సంప్రోక్షణ, సమ్మానం,సమ్మోహన, సమ్మేళన, సంభాషణ,...

*కు*:-- చెడు, ఉదా:-- కుయుక్తి = చెడు ఆలోచన, ఇలాగే కుష్ఠు, కుసంస్కారం,కుమతి,కునిష్ఠ, ..

*సూచన*:-- ఈ ఉపసర్గల వలన అర్థాలు అన్నిమార్లూ ఒకేవిధంగా ఉండవు. పైన ఉదహరించినవి కొన్ని సామాన్య ప్రయోగాలు మాత్రమే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

వినాయక చవితి శుభాకాంక్షలు సందేశం 9/11

 ॐ    వినాయక చవితి శుభాకాంక్షలు 

        

                        సందేశం 9/11 


        

             పంచాయతనం - గణపతి 


     సర్వమూ గణపతియే అని శ్రీ గణపతి అథర్వ శీర్షమ్ తెలుపుతోంది. అంతా నీవేనయ్యా! అని ఆయనని స్తుతిస్తోంది. 

    అందులో కొన్ని 


* సృష్టి - స్థితి - లయాలు గణపతియే! 


సమస్త ప్రపంచమూ 

  - నీ నుండే ఉద్భవిస్తోంది (పుడుతోంది), 

  - నీలోనే అది నిలిచి ఉంటోంది (సృష్టికి ఆధారం నీవే), 

  - నీలోనే అది మళ్ళీ లయమవుతోంది. 

    కర్మ సంస్కారాలకు చేతనత్వం ఇచ్చి, 

    ఈ ప్రపంచంలో ఆయా జీవులు ప్రవర్తించేలా చేస్తున్నది నీవే! 


* పంచభూతాలూ గణపతియే! 


    భూమీ, నీరూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూగా పిలవబడే పంచభూతాలూ నీ స్వరూపమే! 


* వాక్కు కూడా గణపతియే! 


    పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ అనే 

  - ఆలోచన రూపంలో ఉండే వాక్ స్థితీ, 

  - ఆలోచనను స్పష్టంగా చూడగల వాక్ స్థితీ, 

  - చూడగలిగిన వాక్కుకు భాషను వెతుకుతున్న స్థితీ, 

  - భాషగా ప్రకటనమౌతున్న వాక్కూ, 

    ఈ నాలుగూ నీవే! 


సర్వం జగదిదం త్వత్తో జాయతే 

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి 

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి 

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి 

త్వం భూమి రాపోఽనలోఽనిలోనభః 

త్వం చత్వారి వాక్పదాని I 

    - శ్రీ గణపతి అథర్వ శీర్షమ్ 


ప్రత్యేక వివరణ 

  

    మరి శివుడూ - విష్ణువూ - అంబికా - సూర్యులకు కూడా ఈ లక్షణాలు ఆపాదిస్తూ, అథర్వ శీర్షాలున్నాయి కదా! 

  - అనే సందేహం కలుగుతుంది. 

    ఈ ఐదుగురూ కూడా, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరూ, ఒకరి తరువాత ఒకరుగా 

  - ఆయా రూపాలలో 

  - ఆయా క్రియలు నిర్వర్తిస్తారు. 

    అందఱూ అన్ని కల్పాలలోనూ ఆరాధింపబడతారు. 

   

    ఏ కాలాలలో అయినా, ఈ ఐదుగురినీ ఆరాధించేవారుంటారు. 

  - గణపతిని ఆరాధించేవారు గాణాపత్యులు,  

  - విష్ణువుని ఆరాధించేవారు వైష్ణవులు, 

  - శివుని ఆరాధించేవారు శైవులు, 

  - సూర్యుణ్ణి ఆరాధించే మతం సౌరం, 

  - దుర్గారాధకులు శాక్తేయులు, 

   

    పంచ భూతాలకీ సంబంధించి, ఒక్కొక్క దానికీ ఒక్కొక్క దేవతగా, ఈ ఐదుగురూ 

  - విడివిడిగానూ,  

  - కలసి పంచాయతనంగానూ ఆరాధింపబడతారు. 


ఆదిశంకరులు - పంచాయతన ఆరాధన 


    ఆదిశంకరులు నిత్యదేవతార్చనలో భాగంగా పంచాయతన పూజని ప్రవేశపెట్టారు.     

    పంచాయతనంలో శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, సూర్యుడు ఉంటారు. 

    ఏ సంప్రదాయానికి చెందినవారైతే ఆ మూర్తిని మధ్యలో ఉంచి, మిగిలిన వాటిని నలువైపులా ఉంచి, పంచాయతన పూజ చేస్తారు. 

    

సాలగ్రామ పంచాయతనం 


    పంచాయతనంలో కరచరణాదులతో ఉన్న మూర్తుల ఆరాధనయే కాకుండా, సాలగ్రామాల పూజావిధానం ఉంది. 

    ఆ విధానంలో సాలగ్రామాలు 

  - నర్మదానది వద్ద లభించే బాణ లింగం శివ సాలగ్రామం; 

  - నేపాల్ గండకి నది వద్ద లభించే విష్ణు సాలగ్రామం; 

  - కాళహస్తి సువర్ణముఖి నది వద్ద లభించే అంబికా సాలగ్రామం; 

  - శోణభద్రా నది వద్ద లభించే గణపతి సాలగ్రామం; 

  - తంజావూరు వెల్లాం వద్ద లభించే సూర్య సాలగ్రామం. 

    అనే ఈ ఐదు సాలగ్రామాల కలయికతో పంచాయతన ఆరాధన జరుగుతుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

Maternity leave for gents


 

Grateful


 

Break fast combo at bangalore


 

Nagumomu


 

Dance


 

⚜ శ్రీ హాటకేశ్వర్ మందిర్

 🕉 మన గుడి : నెం 586





⚜ ఛత్తీస్‌గఢ్ : రాయపూర్


⚜ శ్రీ హాటకేశ్వర్ మందిర్ 


💠 ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ప్రతి పట్టణంలో మహాదేవుని పూజిస్తారు. భోలేనాథ్‌ని దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా పూజిస్తారు. అనేక దేవాలయాలలో మహాదేవుని ఆరాధన మరియు స్థాపనకు అనేక నమ్మకాలు ఉన్నాయి. ఇందులో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వందల ఏళ్ల నాటి హట్‌కేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది


💠 ఈ ఆలయం రాయ్‌పూర్ నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖారున్ నది ఒడ్డున మహాదేవ్ ఘాట్ లో ఉంది. 

దూరంలో ఉంది.

హిందువులకు ప్రత్యేకించి శైవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం

 

⚜ స్థల పురాణం ⚜


💠 మహాదేవ్ ఘాట్‌లో శివలింగ ప్రతిష్ఠాపన కథ పాతది. ఆలయ పూజారులు దీనిని త్రేతా యుగానికి సంబంధించినది అని అంటారు.

హనుమంతుడు మహాదేవుడిని తన భుజంపై వేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడని కూడా ఒక నమ్మకం.  ఈ కథ కారణంగా ఈ దేవాలయం చాలా వరకు ప్రసిద్ధి చెందింది.  

శ్రీరాముడు అరణ్యానికి వెళ్లే సమయంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతారు.  

ఈ శివలింగాన్ని లక్ష్మణుడు తన వనవాస సమయంలో చత్తీస్‌గఢ్‌లోని ఈ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు స్థాపించాడు.  స్థాపన కోసం, హనుమాన్ తన భుజంపై శివుని విగ్రహంతో బయలుదేరాడని చెబుతారు, తరువాతి బ్రహ్మ దేవుడిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు, చాలా ఆలస్యం అయింది.  ఇక్కడ లక్ష్మణుడికి ఆలస్యమైనందుకు కోపం వచ్చింది, ఎందుకంటే సంస్థాపన సమయం ఆలస్యమైంది. 

 స్థాపన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, అనుకున్న చోట ఏర్పాటు చేయకుండా, ఖారున్ నది ఒడ్డున ఏర్పాటు చేశారు.

ఈ కారణంగా ఈ ఆలయం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుండి బోల్నాథ్ భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. 

ఆలయ ప్రాంగణంలో శివలింగానికి సమీపంలో రామ్, జానకి మరియు లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి.


💠 అదే సమయంలో, 500 సంవత్సరాలుగా ఆలయంలో అఖండ ధుని నిరంతరం మండుతూనే ఉంది. మహాదేవుని భక్తులు ప్రతిరోజూ తమ నుదుటిపై పూసుకోవడానికి ఇక్కడి ధునిని ఇంటికి తీసుకువెళతారు.


💠 మత విశ్వాసాలతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం మహాదేవ్ ఘాట్ వద్ద నదికి రెండు చివరలను కలుపుతూ లక్ష్మణ్ ఝులాను నిర్మించింది. 

నదిపై భక్తుల కోసం నిర్మించిన రాష్ట్రంలో ఇది మొదటి లక్ష్మణ్ జూలా. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి చేరుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు లక్ష్మణ్ జూలాను ఆనందిస్తారు. 


💠 పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఖారున్ నది మధ్యలో పిండ ప్రధానాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. గయ, కాశీ లాగానే ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 రాయ్‌పూర్‌ నగరం యొక్క ప్రారంభ స్థావరం ఖరున్ నది ఒడ్డున ఉన్న మహాదేవ్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. రాయ్‌పూర్‌కు చెందిన కల్చూరి రాజులు మొదట ఈ ప్రాంతంలో తమ రాజధానిని స్థాపించారు. 

ప్రస్తుతం ఖరున్ నది ఒడ్డున అనేక చిన్న మరియు పెద్ద దేవాలయాలు నిర్మించబడ్డాయి. కానీ చాలా ముఖ్యమైనది హటకేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం వెలుపలి నుండి ఆధునికంగా కనిపిస్తుంది, కానీ మొత్తం నిర్మాణాన్ని చూస్తే ఇది మధ్యయుగ కాలం నాటిదని అంచనా వేయవచ్చు. 

కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడ పెద్ద జాతర నిర్వహిస్తారు. 

వివేకానంద ఆశ్రమ స్థాపకుడు స్వామి ఆత్మానంద (1929-1981) సమాధి కూడా మహాదేవ్ ఘాట్‌లోనే ఉంది.


💠 ఆలయ బయటి గోడలపై రామాయణం మరియు మహాభారత కథలు చిత్రించబడ్డాయి.  ఇది కాకుండా చాలా చిత్రాలు కూడా ఉన్నాయి.  ఆలయ గోడపై వివిధ జంతువులు, నృత్యకారులు మరియు సంగీతకారుల శిల్పాలు ఉన్నాయి.  ఆలయ సముదాయం చాలా పెద్దది.

  

💠 ఈ ఆలయానికి ఉన్న ఇంకొక  ఆదరణ వింటే ఆశ్చర్యం వేస్తుంది

మహాదేవుని దర్శనం కోసం ఉజ్జయినిలోని మహాకాల్‌కు వెళ్లలేని భక్తులు, బ్రహ్మ ముహూర్తంలో ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, వారి ప్రార్థనలన్నీ అంగీకరించబడతాయి మరియు వారి ప్రతి ప్రార్థనను మహాదేవ్ అంగీకరిస్తాడు అని నమ్మకం.


💠 ఆలయంలోకి ప్రవేశించడానికి అనేక మెట్లు ఎక్కినప్పుడు ఈ ఆలయ గర్భగుడి కనిపిస్తుంది.  ఆలయ గర్భగుడిలోకి వెళ్లే దారిలో ఎన్నో శిల్పాలు కనిపిస్తాయి.  ప్రజలు ఈ ఆలయానికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు, వారు తమతో పాటు కొంత బియ్యాన్ని లోపలికి తీసుకుని, గర్భగుడిలోకి వెళ్ళే మార్గంలో ఉన్న అన్ని విగ్రహాలకు అన్నం పెడతారు. 


💠 ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగ మహా శివరాత్రి.  ఈ సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వస్తుంటారు.  

వారు దేవతకు పాలు, తేనె, తీగ ఆకులు, పువ్వులు మరియు పండ్లు సమర్పిస్తారు.  పరిశుభ్రమైన మనస్సుతో పూజించిన వారికి ఇక్కడి పరమేశ్వరుడు  స్పందిస్తారని ప్రజలు నమ్ముతారు

అనవసరంబగు వాదన

 *1925*

*కం*

అనవసరంబగు వాదన

మనుషుల యెడ దూరములను మరిమరి పెంచున్.

మనుషుల బంధుత్వ మహిమ

లనతులకడ నతి వివాద మణచును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అనవసరమైన వాదనలు మనుషుల మధ్య దూరాలను మరింత గా పెంచుతాయి. మనుషుల బంధుత్వాలలోని విలువలు చిన్న చిన్న విషయాలలోని వివాదములు అణచివేస్తాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

పూజారిని పోషించే వ్యవస్థ

 మన పూజారులకు దక్షిణ ఇస్తే అది వారికే చెందాలని, వారి కుటుంబం కోసమే ఉపయోగపడాలనే అనుకుని ఆ దక్షిణ ఇస్తారు. 

 

ఈ విషయంలో వ్యవస్థను  కాపాడాలని ప్రయత్నిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారి కేసు గమనార్హం. 

   

ఈ పోస్ట్ పంచుకుని మంచి పనిచేశాను.


*గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !*

 కాదు కనుమరుగు చేశారు .


ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! 

.

గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు! 

.

అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!

.

 మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ...ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి ! 

.

పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది ! 

.

మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ? 

.

ఎక్కువలో ఎక్కువ 5000 / 

ఆడబ్బుతో ఇల్లు జరుపుతాడా?

పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ? 

రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ? 

.

అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! 


అదే దేవాదాయశాఖ లో పని చేసే వాచ్ మెన్ కూడా 15000 తక్కువ ఉండదు ఇంక ఈవో సంగతి చెప్పక్కర్లేదు 50,000 వేలు పైమాటే కమిషనర్ వాళ్ళ గురించి చెప్పకలేదు. 


రోజు వచ్చి భాగంతుని కి కైకర్యాలు నిర్వహించే పూజరికి 5000 వేలు అసలు నెలకి ఒకసారి కూడా రాని ఈవో కి 50,000 వేలు... 

.

గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !

.

పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి ! 🙏🙏🙏

నవగ్రహ పురాణం - 63 వ అధ్యాయం* 🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷 *చంద్రగ్రహ చరిత్ర - 1*

 *నవగ్రహ పురాణం - 63 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*చంద్రగ్రహ చరిత్ర - 1*



ద్వారం దాటి మందిరం లోపలకి వస్తున్న నారదమహర్షిని చూసి , చంద్రుడు కూర్చున్న చోటి నుంచి లేచి , ఆయనకు ఎదురుగా నడిచాడు. చంద్రుడి నడకలో ఉత్సాహం లేదు , వేగమూ లేదు.


*"ప్రణామం , మహర్షీ !"* చంద్రుడు చేతులు జోడిస్తూ అన్నాడు. 


*"కళ్యాణమస్తు !"* నారదుడు చిరునవ్వుతో దీవించాడు. *“ఇంకా గతంలోనే కూరుకుపోయి , నిరాశగా ఉన్నావని నీ వాలకం చెస్తోంది సుమా !”.*


చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు. *"మీకు నిజం చెప్పాలి ! గతం గుండెను కెలుకుతూనే ఉంది !"* 


నారదుడు చిరునవ్వు నవ్వాడు. *"గురుపత్నితోటి అక్రమ బంధం గుండెను కెలుకుతూనే ఉంటుంది , చంద్రా ! తార ఈ మందిరంలోంచి వెళ్లిపోయింది. నీ హృదయ మందిరంలోంచి ఆమె జ్ఞాపకాలు కూడా వెళ్ళిపోవాలి !"*


చంద్రుడు విరక్తిగా నవ్వాడు. *“అది అంత సులభం కాదు !"* 


*“నారాయణ ! 'చాలా సులభం' అని తార నిరూపించిందిగా !"* నారదుడు నవ్వుతూ.. అన్నాడు , కూర్చుంటూ.


చంద్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు.


*"ఔను చంద్రా ! తార గతాన్ని పూర్తిగా మరిచిపోయింది ! పతిదేవుడి పాద సేవలో పరవశిస్తోంది !"*


చంద్రుడు దయనీయంగా చూశాడు.


*“తన గృహిణీ ధర్మానికి ఆమె పునరంకితమవడానికి కారణం ఏమిటో తెలుసా ?”* నారదుడు చిరునవ్వుతో అన్నాడు. *“ఆమెకి అక్కడ లభించిన తోడు ! భర్త సాహచర్యం !"* 


చంద్రుడి కళ్ళల్లో ఏదో అర్థం కాని ఆవేదన కదలాడుతోంది.


నారదుడు మళ్ళీ తనే అన్నాడు: *“ఎందుకు చెప్తున్నానంటే , కాంత లేని ఏకాంతం నీలాంటి సరసుడికి నిత్య శిక్షే ! నీకూ ఇక్కడ ఒక 'ఆడతోడు' ఉందనుకో ! ఎలా ఉండేవాడివి ? ఒకసారి ఆలోచించు ! బృహస్పతి తన అనురాగంతో , ఆదరణతో తార అంతరంగం మీద వాలి ఉండే నీ నీడను తరిమివేసినట్టే , నీ 'ఆడతోడు' ఇంకా తొందరగా నీ గుండెను కప్పివేసిన తార నీడను వెళ్ళగొట్టి ఉండేది !”*


నిజమేనేమో అన్నట్టు చంద్రుడు తలను బలహీనంగా ఆడించాడు. చెప్తున్నానంతే - వివాహం చేసుకోవాలి , నువ్వు ! 'వివాహం విరహనాశని' *“ఎందుకు సుమా !”* నారదుడు నవ్వాడు.


చంద్రుడు కూర్చున్న చోటు నుంచి లేచి , నారదుడి వైపు వీపు త్రిప్పి , గోడవైపు నెమ్మదిగా అడుగులేశాడు.


కన్యను ఎవరిస్తారంటూ నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ! నువ్వు చూడ చక్కని వాడివి గురుపత్ని వెంటపడిందంటే - ఆ చంద్రుడు ఎంత అందగాడో అని అందరూ అనుకుంటున్నారు ! దక్షప్రజాపతి తెలుసు కదా ! ఆ దంపతుల అంతఃపురం నిండా ఆడపిల్లలే ! ప్రస్తుతానికి ఒక ఇరవై ఏడుగురు 'చక్కని చుక్కలు' వివాహానికి సర్వసిద్ధంగా ఉన్నారు ! ఈ నారదుడు ప్రతిపాదిస్తే , ఆ దక్షుడు కాదనడు...! తన వైపు తిరిగి చంద్రుణ్ణి చూస్తూ ఆపేశాడు నారదుడు 


చంద్రుడి ముఖం మీద ఏదో కొత్త ఉత్సాహం కదలాడ సాగింది. నారదుడు చిరునవ్వు నవ్వాడు.


*"నీ అభిప్రాయం చెప్పు , చంద్రా ! దక్షప్రజాపతి దంపతులను మెల్లగా..."* 


*"ముందుగా నా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం మంచిదనిపిస్తోంది !"* చంద్రుడు అడ్డువస్తూ అన్నాడు. 


*"ఆ పని చేయాల్సింది నారదుడు కాదు , దక్షుడు మనం అనుమానించాల్సిన అవసరం లేదు ! దక్షుడు కార్యదర్శులు  కూడా !"* 


చంద్రుడు మొదటిసారిగా చిరునవ్వు నవ్వాడు నారదుడు అతని కళ్ళల్లోకి సూటిగా , తదేకంగా చూశాడు *"నీకు ఒక చిన్న నీతి బోధిస్తాను. తారా మునుపటి తార కాదు. మానసికంగా పునర్జన్మ ఎత్తింది బృహస్పతికి 'ధర్మపత్ని'గా మారిపోయింది. తార ఇప్పుడు 'పరదార' ! పరధారల గురించి పగటి కలలు కనకూడదు సుమా !"* 


దక్ష ప్రజాపతి నారదుడి ప్రతిపాదనను లోలోపలే పరిశీలిస్తూ ఉండిపోయాడు. 


*"ఆత్రేయుడు గురుతల్పగతుడై అపఖ్యాతిని మూటగట్టుకున్నాడుగా ,  నారద?"* ప్రశ్నించాడు దక్షుడు 


*"నారాయణ తల్పగతుడుకాక ఏం చేస్తాడు , పాపం ? ఆ తార అందాలరాశి ఆ చంద్రుణ్ణి ఒంటరివాణ్ణి చేసి , పైటతో విసిరింది ! చివరికి ఆ అమాయకుణ్ణి కొంగుతో ముడివేసుకొని , వలచింది ! వలపించింది అయినా , ఆ ఇద్దరి పాపాలు ప్రక్షాళనమై పోయాయి గదా!"*

🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం, 36వ శ్లోకం*


*అవాచ్య వాదాంశ్చ బహూన్‌ వదిష్యంతి తవాహితాః |*

*నిందం తస్తవ స్వామర్థ్యo తతో దుఃఖతరం ను కిమ్ || 36*


*ప్రతిపదార్థం* 


తవ = నీ యొక్క ; అహితాః = శత్రువులు; తవ=నీ; సామర్ధ్యమ్ = సామర్ధ్యమును; నిందంతః = నిందించుచు ; బహూన్ = అనేకములైన ; అవాచ్యవాదాన్ చ  = అనరాన్ని మాటలను గూడా ; వధిష్యంతి = పలికెదరు ; తతః = అంతకంటేను ; దుఃఖతరమ్ = అధికమైన దుఃఖము;కిమ్,ను = ఇక ఏముండును ? ;


*తాత్పర్యము*


 నీ శత్రువులు మీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందరూ అంతకంటే విచారకరమైన విషయము ఏముండును ?


 *సర్వేజనా సుఖినోభవంతు*

*హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 334

 రామాయణమ్ 334

..

ఒక్క కోతి వచ్చి మన లంకను ,లంకానగరాధిదేవతను ,లంకానగరపౌరులను నానా చికాకు పరచి లంకేశుడనైన నన్ను ధిక్కరించి ,హుంకరించి లంకను తగులపెట్టి భద్రముగా తిరిగి వెళ్ళినది!

.

ఏమైనది మన రక్షణ వ్యవస్థ ? 

ఎటుపోయింది  శత్రుదుర్నీరక్ష్యమైన మన శౌర్యం!

.

మనమిప్పుడు ఏమి చేయవలెను?

ఏది యుక్తము

మనకు ఏది హితము నాకు తెలియ చెప్పండి!

.

ఓ మహాబుద్ధిమంతులారా ! సరి అయిన మంత్రాంగమే సకల కార్యసిద్ధికి మూలము!

.

రాముని విషయమున ఆలోచించండి !

.

ధీరులు ,శూరులు అయిన వేలకొలది వానరులతో కలసి లంకానగరము పైకి రాముడు శీఘ్రమే రానున్నాడు.

.

లోకములో ఉత్తములు ,మధ్యములు,అధములు అయిన కార్యసాధకులైన పురుషులు ఉన్నారు.

.

ఎవడు సమర్ధులు,తన హితము కోరువారు అయిన మంత్రులతో మంత్రాంగము చేయునో అలా చేసి పనులను ప్రారంభించి విజయవంతముగా దైవానుగ్రహముతో వాటిని పూర్తి చేయునో అతడు ఉత్తముడు.

.

ఎవడు ఒంటరిగానే ఆలోచన చేసి ఒంటరిగానే ధర్మమును నిర్ణయించుచూ ఒంటరిగానే పనులు చేయునో అతడు మధ్యముడు

.

గుణదోషములు నిర్ణయించకుండా పూర్తిగా దైవము మీదనే ఆధారపడి ,"చేయవచ్చునులే" అని కార్యమును ఉపేక్షించువాడు అధముడు ...

.

అనుచూ రావణుడు తన మంత్రులతో ప్రసంగము కొనసాగించుచున్నాడు.

.

వూటుకూరు జానకిరామారావు

Robot


 

Gaatram


 *మహద్భుతం.ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు. వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఇది రుగ్వేదంలోని మన్యు సూక్తం. దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని రుగ్వేదంలో రాయబడింది.

Surystakam


 

నాత్మీయులున్

 మ॥

ఎవరాదిక్కరు లిచ్చటన్ తమరి ప్రౌఢిన్మించు నిర్దేశకుల్ 

ఎవరా శక్తిని కల్గియుండిరిట పాండిత్యాబ్ధి శీతాంశుడా! 

భవదీయానుభవమ్ము జ్ఞానమును వాత్సల్యతన్ బంచవే! 

చెవులన్ నిక్కగజేసి చక్కనరయన్ సిద్ధమ్ము *నాత్మీయులున్*

ఎల్లప్పుడూ నా నమస్కారములు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

                   *భక్తిసుధ*



𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం*

*నమస్సురారి నిర్జనం నతాధికాపదుద్ధరం*

*సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం*

*మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం*


*గణేశ పంచరత్నమ్* - 2


𝕝𝕝తా𝕝𝕝

భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -56🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -56🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల శ్రీవారి ఆభరణాలు:*


ధృవబేరం అనబడే స్వామి మూలవిగ్రహానికి, ఇతర ఉత్సవ విగ్రహాలకూ అనేక విలువైన ఆభరణాలున్నాయి. స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్ను తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తి.తి.దే. 19 రికార్డులను నిర్వహిస్తోంది. తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. 

 

శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం (1450) లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయులు పాలించిన 21 ఏళ్లు (1509-1530)  స్వర్ణయుగమేనని చెప్పవచ్చును. తిరుమల ఆలయాన్ని ఏడుసార్లు సందర్శించిన శ్రీకృష్ణ దేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు 10-02-1513న శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించారు. 2-5-1513 న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నఖచిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించారు. 


 తంజావూరు రాజులు పాండ్యన్ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా... మహ్మదీయ రాజ్యం, బ్రిటిష్ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ ఇలా ఆలయ నిర్వహణ పలు పుంతలు తొక్కినప్పటికీ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామి వారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది. స్వామి వారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు.


బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన థామస్ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. 

స్వామివారి 'అష్ట దళ పాదపద్మారాధన' పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ముస్లిం సమర్పించడం విశేషం. 

అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్కు చెందిన సయ్యద్మీరా సమర్పించారు.

వేంకటేశ్వర హెచరీస్ సంస్థ 13 కిలోల కిరీటం సమర్పించింది

గోయెంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది.

పెన్నా సిమెంట్స్ సంస్థ రూ.5 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను సమర్పించింది.

తితిదే కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారుచేయించింది

 

స్వామి వారికి ప్రస్తుతం ముఖ్యమైన

6 - కిరీటాలు

20 - ముత్యాల హారాలు

50 - కాసుల దండలు

ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి.


స్వామివారి ఇతర ఆభరణాలు ఇలా ఉన్నాయి...

సువర్ణపద్మపీఠం

సువర్ణపాదాలు

నూపురాలు

పగడాలు

కాంచీ గునము

ఉదర బంధము

దశావతార హారము

దశావతార వడ్డాణం

చిన్న కంఠాభరణము

బంగారు పులిగోరు

గోపు హారము

సువర్ణ యజ్ఞోపవీతం

తులసీ పత్రహారం

4 - కిలోల చతర్భుజ లక్ష్మీహారం

అష్టోత్తర శతనామహారం

32 - కిలోల సహస్రనామ హారం

సూర్య కఠారి (ఖడ్గం)

కటి వరద హస్తాలు

కడియాలు

భుజదండ భూషణాలు

నాగాభరణాలు

భుజకీర్తులు

కర్ణపత్రాలు

శంఖుచక్రాలు

ఆకాశరాజు కిరీటం

సాలిగ్రామహారం

తిరుక్కాళం

వజ్ర అశ్వర్షథపత్రహారం

అయిదుపేటల కంఠి

చంద్రవంక కంఠి

ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో...

రత్నకిరీటం_

మేరు పచ్చ

రత్నాలతో చేసిన శంఖుచక్రాలు

రత్నాల కరపత్రాలు

రత్నాల కఠి వరదహస్తాలు

7 - కిలోల రత్నాల మకర కంఠి

బంగారు వస్త్రాలు తదితరాలు ఉన్నాయి. 


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *35వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

. *🪐నవగ్రహా పురాణం🪐*  

. *35వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

 

. *శుక్రగ్రహ జననం - 2*


త్రిమూర్తుల సన్నిధిలో పులోమ పుత్రుడి నామకరణోత్సవం జరిగింది. బాలునికి 'ఉశనుడు' అని నామకరణం చేశాడు భృగుమహర్షి.


*"కుమారా ! నీ కుమారుడు కారణజన్ముడు ! దైవికమైన ఆ కారణమే - తనకు ఎలాంటి పుత్రుడు కావాలో నీ అర్ధాంగి పులోమ నోట పలికించింది !"* బ్రహ్మ అన్నాడు. భృగుడితో.


*"భృగూ ! భవిష్యత్తులో ఉశనుడు నవగ్రహాలలో ఒకడుగా అభిషిక్తుడవుతాడు. అందరికీ ఆరాధ్యుడవుతాడు."* అన్నాడు శ్రీమహావిష్ణువు.


*"ఉశనుడికి శాస్త్రబోధ చక్కగా జరగాలి సుమా !”* శివుడు అందుకుంటూ అన్నాడు. *"జపవిధానం , తపోవిధానం , ధ్యాననిష్ఠా ఉశనుడికి కరతలామలకాలుగా చేయాలి నువ్వు"*


*"ఆజ్ఞ !"* భృగువు చేతులు జోడిస్తూ అన్నాడు..


*"దేవదేవులైన మీ ఆశీస్సులే నా బిడ్డడిని అద్వితీయుడిగా రూపొందిస్తాయి. ఈ భృగువు నిమిత్తమాత్రుడు!"*


*"పులోమా ! నీ పుత్రుడు నీ ఆశయాలను నెరవేరుస్తాడు"* విష్ణువు పులోమతో అన్నాడు.


*“ఆ సాధ్వీమణి కలలు కన్నది ; కావలసిన పుత్రుణ్ని కన్నది !”* నారదుడు నవ్వుతూ అన్నాడు.


అందరూ నవ్వారు.


సకాలంలో బాల ఉశనుడికి విద్యాభ్యాసం ప్రారంభించిన భృగుమహర్షి - కుర్రవాడి ధారణ శక్తికి అబ్బుర పడిపోయాడు.


తండ్రి బోధించే విషయాలను అవగాహన చేసుకోవడంతో తృప్తిచెందని ఉశనుడు , తనలో ఉద్భవించే రకరకాల సందేహాలను ప్రశ్నల రూపంలో అడుగుతూ - సమాధానాలు తెలుసుకుంటూ , ఇతోధికంగా విషయ గ్రహణం చేయసాగాడు.


భృగుమహర్షి ఆశ్రమంలో లేని సమయాల్లో , ఉశనుడు తనతోపాటు పూలమొక్కల మధ్య , ఫలవృక్షాల మధ్య తిరుగాడే సమయాల్లో - పులోమ అతనికి దేవరాక్షసుల మధ్య నెలకొన్న విరోధం గురించీ , త్రిమూర్తుల సహాయ సహకారాలతో దాయాదులైన అసురులకు దేవతలు కలిగిస్తున్న కష్టాల గురించి వివరించసాగింది. రానురాను , పులోమ బోధనల వల్ల రాక్షసకులం నిస్సహాయంగా దేవతల వల్ల పీడనకు గురి అవుతోందన్న భావం బాలఉశనుడిలో వేళ్ళు తన్నుకోసాగింది. వయసుతోబాటు అసురులు పట్ల ఉశనుడిలో సానుభూతి కూడా పెరగసాగింది.


నూనూగు మీసాల వయసు వచ్చేసరికి ఉశనుడి విద్యాభ్యాసం ముగిసింది. తల్లిదండ్రులను సేవిస్తూ , తండ్రివద్ద తపస్సమాధి శిల్పాన్ని నేర్చుకుంటూ , తన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు ఉశనుడు.


అన్నలకూ , ఉశనుడికీ మధ్య మాటతీరులో , ప్రవర్తనలో ఉన్న భేదాన్ని విశ్లేణాత్మకంగా గమనిస్తున్న పులోమ తాను ఆశించిన , కలలుగన్న లక్షణాలన్నీ ఉశనుడిలో వున్నాయన్న సత్యాన్ని గ్రహించి , ఆనందంలో మునిగిపోయింది.


రాక్షసరాజు వృషపర్వుడు సభలో కొలువుదీరి వున్నాడు. దేవతల గురించి చారులు విన్నవిస్తున్న విషయాలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు.


భటుడు దగ్గరగా వచ్చి , తలవంచి నమస్కరించాడు. *"రాక్షసచక్రవర్తికి జయం ! ప్రభూ , నారదమహర్షి వచ్చి కొలువు కూటం ముందున్నారు. ప్రవేశపెట్టమని సెలవా ?”*


*"ఊ ! వద్దంటే , తిరిగి వెళ్తాడా , ఆ మాటకారి ? ప్రవేశపెట్టు !"* వృషపర్వుడు విసుగ్గా అన్నాడు.


*“ఆ నారదుడు వెళ్ళిపోయాక... విన్నవించుకో , శూర్పకర్ణా !"* అన్నాడు చారుడితో.. 


*"నారాయణ ! నారాయణ !"* అంటూ ప్రవేశించాడు నారదుడు.


*"ప్రణామాలు, నారదమునీ !”* వృషపర్వుడు సింహాసనం మీంచి లేవకుండానే , చేతులు జోడించకుండానే అన్నాడు. 


*"నారాయణార్పణం !"* నారదుడు అప్రయత్నంగా అన్నాడు.


*"అది మా అసురవీరులను అవమానించే మాట , నారదా !"* వృషపర్వుడు గంభీరంగా అన్నాడు. *"ఆ నారాయణుడో , ఏ నారాయణుడో - మాకు ఆగర్భశత్రువని నీకు తెలియదా ?"*


*"ఓహ్... తెలిసింది...” నారదుడు నాలుక కరచుకున్నట్టు నటిస్తూ అన్నాడు. అలవాటు కదా , అసుర చక్రవర్తీ ! నోరు జారుతూ వుంటుంది !"*.


*"ఏమిటి నారదా , ఏదైనా విశేషం వుందా , పనిగట్టుకుని వచ్చారు !"* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు , తన సమీపంలో ఆసనం మీద కూర్చున్న నారదుణ్ని చూస్తూ. 


*"విశేషం ఏముంటుంది , రాక్షసేంద్రా ! నా కార్యక్రమం తెలిసిందే కద ! విషయ సేకరణ , విషయ విస్తరణ , విషయ వితరణ ! ఈ నిత్యసంచారి నిత్యకృత్యం ఇవేకదా వృషపర్వా !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


*“ఇప్పుడు - ఇక్కడికెందుకు దయచేసినట్లు ? సేకరణకా ?"* వృషపర్వుడు నవ్వుతూ

అడిగాడు.


*"అన్నింటికీ కలిపి అనుకోరాదా?”* నారదుడు నవ్వాడు.


*"ఆ విధంగా అపార్ధం చేసుకోలేంలే నారదా ! విషయ సేకరణకూ , విస్తరణకూ మాత్రమే వచ్చి వుంటావు ! నువ్వు - నిత్యమూ నీ నోట్లో నానే వ్యక్తిలాగా - సురపక్షపాతివే కదా !"*


*"సరే ! విషయ వితరణం చేసి , మీ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాను”* నారదుడు నవ్వుతూ అన్నాడు. *“విషయం ఏమిటంటే... ఇంద్రుడు - అంగిరసపుత్రుడు బృహస్పతిని దేవతల గురువుగా , మంత్రాంగం నెరిపే నేర్పరిగా , వ్యూహ కర్తగా నియమించుకున్నాడు...”*


వృషపర్వుడి గుబురు కనుబొమలు మధ్యలో కలుసుకుని , ముడిపడ్డాయి. *"బృహస్పతినా ? అంత తెలివైన వాడా , ఆ ఋషి పుత్రుడు ?”*


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 31*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 31*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*చతుషష్ట్యా తంత్రైః సకల మతిసన్ధాయ భువనం*

*స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః |*

     *పునస్త్వన్నిర్బన్ధా దఖిల పురుషార్థైక ఘటనా*

*స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ ‖*


ఏ దేవత ఉపాసనైనా స్థూల రూప, మంత్ర, తంత్రములుగా ఉంటుంది. ఒక దానిని మించి ఒకటి సూక్ష్మం. తంత్రమంటే ఒక మంత్రము ద్వారా ఆ మంత్ర దేవతను ఎలా ఉపాసించాలో తెలియచెప్పే విధానం.


సౌందర్యలహరిలో అమ్మవారి స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ రూపాలను చెప్పారు శంకరులు. 


స్థూల రూపం = ధ్యానయోగ్యమైన దివ్యమంగళ విగ్రహ రూపం.


సూక్ష్మ రూపం = మంత్ర రూపం 


సూక్ష్మతర రూపం = కుండలినీ రూపం 


సూక్ష్మతమ రూపం = నిరుపాధిక (ఉపాధి లేని) నిర్గుణ సత్వ రజస్తమో గుణములకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపం.


ఇక్కడ నుండి మూడు శ్లోకాల్లో అమ్మవారి మంత్ర విద్యను ఆవిష్కరిస్తున్నారు.


సకలమతి సంధాయ భువనం స్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః = అమ్మవారి కోరికపై పరమేశ్వరుడు సకల భువన వాసులకు లౌకిక, పారలౌకిక సిద్ధులనిచ్చేటటువంటి


చతుః షష్ట్యా తంత్రైః = 64 శాక్తేయ తంత్రములను చేశారు. 


అయితే  అమ్మవారు ఈ మంత్రములు గొప్పవైనా మోక్షమును ఇవ్వగలిగేవిగా లేవని అభిప్రాయపడి 


పునస్త్వన్నిర్బంధా = పునః పునః నిర్బంధించింది ఆయనను అందుకు తగిన తంత్రమును చేయమని.


అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ =  భూమండలంలో అసమానమైనది ముందు చెప్పిన 64 తంత్రములకు స్వతంత్రంగా ఉండేది అయిన శ్రీవిద్యా తంత్రమును అప్పుడు ఆయన దక్షిణామూర్తిగా చేశారు.


లలితా సహస్ర నామములలో *స్వతంత్రా సర్వతంత్రేశీ*, *దక్షిణామూర్తి రూపిణీ*, *శివజ్ఞానప్రదాయినీ*  ఈ తంత్ర విద్యా రచనకు సంకేతాలు. అలాగే *చతుఃషష్ట్యుపచారాఢ్యా*, *చతుష్షష్టి కళామయీ |*

*మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా* అనే నామాలు కూడా.


64 తంత్ర గ్రంథములు చేసి  సమస్త ప్రపంచమును తన మాయ చేత మోహింపచేసిన శివుడు, స్థిమితముగా నుండెను. అయినను భక్తులయడల ప్రేమతో అమ్మ కోరిక మేరకు  ఈ శ్రీవిద్యాతంత్రమును మానవులకి అవతరింప చేసెను.


విశ్వమంతా నిండి ఉన్నది బ్రహ్మవిద్య. తనగురించి చెప్పునది ఆత్మవిద్య. ఈ రెండింటినీ సమన్వయ పర్చునది శ్రీవిద్య. ఇది మోక్ష ప్రదాయిని. మిగిలిన విద్యలన్నిటికంటే అతి ఉత్తమమైనది.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పద్యాల నైవేద్యం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*వినాయకునికి పద్యాల నైవేద్యం*


అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!


వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!


నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!


వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?


నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!


వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...


నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?


వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.


నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...


వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!


నేను: అవునా స్వామీ! అదేం?


వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.


నేను: శుక్లాంబరధరం విష్ణుం...


వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?


నేను: తోండము నేకదంతమును...


వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.


నేను:

తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్

కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై

యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!


వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!


నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!


వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!


నేను: అలాగా!


వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.


నేను:

అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా

వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!


వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.


నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!


వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.


నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.

గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా

మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం

పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా

దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!


వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!


నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.


వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?


నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!


వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.


నేను: చిత్తం.

తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ

ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై

చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా

జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!


వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.


నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!


వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.


నేను:

దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం

గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న

త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ

స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!


వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!

నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!


నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!


వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?


నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.


వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!


నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం

సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా

చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్

మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!


వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?


నేను: చిత్తం సిద్ధం!


చంద్రఖండ కలాపు జారు వామనరూపు

గలిత చంచలకర్ణు గమల వర్ణు

మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు

భద్రేభవదను సద్భక్తసదను

సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు

ననుదినామోదు విద్యాప్రసాదు

బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు

నురుతరఖ్యాతు నాగోపవీతు


లోకవందిత గుణవంతు నేకదంతు

నతుల హేరంబు సత్కరుణావలంబు

విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు

బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!


వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?


నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!


కలితశుండాదండ గండూషితోన్ముక్త

సప్తసాగర మహాజలధరములు

వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ

మేదినీధర రత్నమేఖలములు

పక్వ జంబూఫల ప్రకటసంభావనా

చుంబిత భూభృత్కదంబకములు

వికట కండూల గండక దేహమండలీ

ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు


శాంభవీశంభు లోచనోత్సవ కరములు

వాసవాద్యమృతాశన వందితములు

విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు

మించి విఘ్నోపశాంతి గావించు గాత!


వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!

అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?


నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.


వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.


నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.


ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు

పరుగెత్తి వచ్చిన పందెకాడు

ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో

పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు

"నల్లమామా!" యంచు నారాయణుని పరి

యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ

వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని

నూఱేండ్లు నోచిన నోముపంట


అమరులందగ్ర తాంబూలమందు మేటి

ఆఱుమోముల జగజెట్టి అన్నగారు

విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె

ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!


వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!

మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!

కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.


నేను: లోటా! ఏవిటి స్వామీ?


వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?


నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.


వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.


నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!


శ్రీకంఠుని సతి ప్రేమకి

ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ

త్నాకృతి దాల్చిన గజముఖ!

చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!


*నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!*


 *సేకరణ:- వాట్సాప్ పోస్ట్.* 

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹