24, సెప్టెంబర్ 2023, ఆదివారం

సంస్కృత భారతీ* *దశమ పాఠః* *10*

 *సంస్కృత భారతీ*

      *దశమ పాఠః*

              *10*

*భోజనాలయ సంభాషణం*

అన్నం/ఓదనం = అన్నము, పాయసం = పరమాన్నము, భక్ష్యం = పిండి వంటకం(నమిలి తినేది), భోజ్యం =సాధారణంగా తినగలిగినది, లేహ్యం/వ్యంజనం = పచ్చడి(నాకుతూతినగలిగేది), చోష్యం = పులుసు(పీల్చుతూ తినగలిగేది), ఘృతం/సర్పిః = నెయ్యి, శాకం = కూర, రసం = చారు, అపూపం = అప్పచ్చి,  తైలాపూపం/ తైలపక్వం  = నూనె లో వేచిన వంటకం, తక్రం = మజ్జిగ, దధి = పెరుగు, సూపం = పప్పు, పానీయం = త్రాగగలిగే పదార్థం, అల్పాహారం = స్వల్ప భోజనం(టిఫిన్), లవణం = ఉప్పు మధు = తేనె, శర్కరా = పంచదార, గుడం = బెల్లం, నవనీతం = వెన్న,ఖండ శర్కరా = పటికబెల్లం, తైలం= నూనె

****

పరివేషయ(తు) = వడ్డించుము, స్థాపయ(తు) = ఉంచుము, అలం = చాలు, వాంఛితం / ఈప్సితం = కావలెను. పరివేషయన్తు = వడ్డించండి, స్థాపయన్తు = ఉంచండి,

*ప్రయోగ విభాగః*

భోజనార్థం/ అశనార్థం భోజనశాలాయామ్ సర్వే ఆగఛ్ఛన్తు = భోజనం చేయుటకు భోజనశాల కు అందరూ దయచేయండి(రండి),

భోజన పత్రం జలేన ప్రక్షాలయన్తు = భోజనపత్రాలను నీటి తో కడుగండి. 

ప్రథమతః స్థాపిత భోజన పాత్రేషు ఘృతేన అభిఘారయన్తు = ముందుగా ఉంచిన భోజన పాత్రలపై నేతితో అభిఘారం చేయండి.

తతః అన్నం,పాయసం, భక్ష్యం,ఘృతం, వ్యంజనాదికాని పరివేషయన్తు = తర్వాత అన్న ము,పాయసము, భక్ష్యం, నెయ్యి, పచ్చళ్ళు మొదలైన వి వడ్డించండి.

అంతే పునరభిఘారం ఘృతేన కుర్వన్తు = చివరగా నేతితో మరలా అభిఘారం చేయండి.

అధునా సర్వైః గోవింద నామముక్త్వా పరిషేచనం కృత్వా భోజనారంభం కుర్వన్తు = ఇప్పుడు అందరూ గోవింద నామం జపిస్తూ పరిషేచనం చేసి భోజనం ప్రారంభించండి.

*ఏకభోక్తః*(ఒక భోజనం చేయువాడు):-- మహ్యం పాతుం తాపోదకం వాంఛితం(అవశ్యం) = నాకు త్రాగుటకు వేడినీరు కావాలి (అవసరం).

*అన్యః ఏక భోక్త*:-- ముద్గసూపం బహు(బృహత్) సమీచీనమస్తి = పెసరపప్పు చాలా బాగుంది.

*అన్యః ఏకభోక్త*:-- మమ చోష్యం పరివేషయన్తు భోః = నాకు పులుసు(సాంబారు) వడ్డించండి, తతః కించిత్ పరివేషణానంతరం(తర్వాత కొంత వడ్డించిన తర్వాత) = అలమలం మహాశయా అహం హస్తిర్నాస్మి , మనుష్య ఏవ( చాలు చాలు మహానుభావా నేను ఏనుగు ను కాదు మనిషినే)...... అంతే తాంబూలం స్వీకృత్య గఛ్ఛన్తు సర్వే = చివరకు తాంబూలం తీసుకుని వెళ్ళండి అందరూ.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: