*సంస్కృత భారతీ*
*నవమ పాఠః*
*9*
*ప్రాదయః - ఉపసర్గాః*
పదమునకు ముందు చేరే అవ్యయాక్షరములను *ఉపసర్గలు* అంటారు. *ఉదా* నిర్దయ... నిర్ + దయ... దయలేని వాడు.
ఇవి "ప్ర" తో మొదలై చాలా ఉండుటచే వీటిని ప్రాదులు(ప్ర ఆదులు) అంటారు. ఉపసర్గ చేరుటచే అర్థం రకరకాలుగా మారుతుంది. కొన్ని మాత్రం సాధారణముగా ఒకేరకమైన అర్థాన్నిస్తాయి.
************"
*ప్ర*= గొప్ప... ఉదా:- ప్రభాస= గొప్ప ప్రకాశం.ఇలాగే ప్రభావం, ప్రయత్నం, ప్రకారం, ప్రమోద, ప్రయాస,ప్రసిద్ధ...
*పర,అప,అవ,నిస్,నిర్,దుస్,దుర్,ని,ప్రతి* ఇవన్నీ సాధారణంగా వ్యతిరేక అర్థాన్నిస్తాయి.
*ఉదా*:-- పరలోకం= వేరే లోకం, అప నమ్మకం = నమ్మకం లేకపోవడం, అప జయం = జయం లేకపోవడం (పరాజయం),ఇలాగే అవయోగం, నిష్క్రమణ, నిష్ప్రయోజనం, నిశ్చల,నిర్గమనం, నిర్భయం, దుష్ప్రభావం, దుశ్శాసన, దుర్మార్గ, దుర్యోధన, ప్రతి నాయక ...
*వి* = విశేష లేదా వ్యతిరేక,
ఉదా:-- విజ్ఞానం = విశేష జ్ఞానం, విస్పష్ట = విశేష(బాగా) స్పష్టం,ఇలాగే విశిష్ట, విస్తృత, విజయ,... విజాతి = వేరే జాతి, ఇలాగే విముఖ, వికృత,విలోమ...
*అధి*= గొప్ప, ఉదా:--అధినేత = గొప్ప నాయకుడు, ఇలాగే అధిగమనం,అధ్యయనం...
*సు*:-- మంచి, ఉదా:-- సుగంధ = మంచి వాసన, సుప్రభాతం = మంచి ఉదయం,ఇలాగే సునిశిత, సుజన,సుదీర్ఘ, సుదూర...
*ఉత్*:-- పైకి, ఉదా:-- ఉత్ప్లవనం = పైకి తేలుట, ఉత్తిష్ఠ = పైకి లేచు, ఇలాగే ఉన్మరీచిక,ఉన్నత,ఉద్భవ,ఉత్తీర్ణ,ఉత్పత్తి,...
*అభి* = ఎక్కువ, ఉదా = అభిరుచి = ఎక్కువ రుచి,ఇలాగే అభివృద్ధి, అభిప్రాయం, అభిసారిక,...
*పరి*:-- ఎక్కువ, ఉదా:-- పర్యావరణ = ఎక్కువ వ్యాపించిన,ఇలాగే పరిపూర్ణ, పరిపూజ,పరిపాలన...
*ఉప*:-- సమీప, ఉపవాసం = దగ్గరగా (దైవానికి) నివసించుట,ఇలాగే ఉపయోగ, ఉపమాన, ఉపపాలక, ఉపాధికారి,ఉపపతి...
*అను*:-- అనుసరించి, ఉదా:-- అను గమనం = అనుసరించి(వెంటబడి) వెళ్ళు, ఇలాగే అను భూతి, అను ప్రహరణం...
*సం*:-- గొప్ప, ఉదా:-- సంగీతం = గొప్ప గీతం,ఇలాగే సంప్రోక్షణ, సమ్మానం,సమ్మోహన, సమ్మేళన, సంభాషణ,...
*కు*:-- చెడు, ఉదా:-- కుయుక్తి = చెడు ఆలోచన, ఇలాగే కుష్ఠు, కుసంస్కారం,కుమతి,కునిష్ఠ, ..
*సూచన*:-- ఈ ఉపసర్గల వలన అర్థాలు అన్నిమార్లూ ఒకేవిధంగా ఉండవు. పైన ఉదహరించినవి కొన్ని సామాన్య ప్రయోగాలు మాత్రమే.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి