13, మే 2023, శనివారం

వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు

 ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు చెప్పిన రిటైర్డు ఫ్యామిలీ (సుప్రీమ్) కోర్టు జడ్జి గారు.🙏🎋🌾


(1) ఎటువంటి పరిస్థితుల్లో కూడా 

మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండ మనండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో 

మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి.


(2) మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి. లేదా ఒక ఫ్రెండ్ గానే చూడండి. అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు. మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు. అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది.


(3) మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య. మీకు అసలు సంబంధం లేదు, అనవసరం కూడా.


(4) ఒక వేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి. వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు. ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే 

ఆ పని మీరు చేయండి. మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి.


(5) మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి. సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు.


(6) మీ మనుమలు పూర్తిగా 

మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి. వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం .


(7) మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు, అలా ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు 

మీ కుమారుడికి చెప్పండి .


(8) మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.

(9) రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం. ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి. మీ డబ్బులు మీకు పనికి రాకుండా పోయేలా చూసుకోరాదు.


(10) మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చిన వరం.


సాధ్యమైనంత వరకూ ఈ మెసేజ్ ఎక్కువ మంది షేర్ చేసుకునేలా చూడండి. ఇది తన జీవిత కాలం సుప్రీం కోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జిగారి అనుభవ సారం.

🙏💐

హనుమజ్జయంతి ప్రత్యేకం

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం -  2/11

       (ఈ నెల 14వ తేదీ హనుమజ్జయంతి) 


II. హనుమంతుడు - పరమాత్మకి మెచ్చిన దూత 


* మొదటి కలయిక 


    ఋశ్యమూక పర్వతము వద్దనుంచి వచ్చి, 

    శ్రీరాముని తొలిసారి కలసి మాట్లాడిన హనుమ మాటలు విన్న శ్రీరాముడు, 

    హనుమ గూర్చి లక్ష్మణునితో ప్రశంసిస్తూ, 

   "ఇట్టి దూత లేని రాజు తలపెట్టీన పనులు ఎలా సిద్ధిస్తాయి? 

    ఇట్టి గుణగణములు కల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, అతని కార్యాలు ఆ దూతలచే నిర్వర్తించబడి, సిద్ధిస్తాయి" అంటాడు.  


* సీతాదర్శనానంతరం 


    హనుమ విషయాలను శ్రీరామునికి నివేదించిన తరువాత,

   దూతలు మూడు తరగతులని శ్రీరాముడు పేర్కొన్నాడు. 

      (యుద్ధకాండ - 1వ సర్గ) 


(i) ఉత్తమ దూత:

       స్వామి శ్రేయస్సు దృష్టియందుంచుకొని, చేసికొని రమ్మన్న పనిని మాత్రమే గాక, దానికి అనుబంధంగా స్వామి ధ్యేయాన్ని సాధించే ఇతరపనులను కూడ సర్వాంగ సౌష్ఠవంగా సాధించువాడు ఉత్తమ దూత:

(ii) మధ్యమ దూత

         చేసికొని రమ్మన్నపని తూ.చ. తప్పకుండా అంతమటుకే చేసికొని వచ్చువాడు మధ్యమదూత. 

(iii) అధమదూత: 

          చేసుకొని రమ్మన్నపనిని సావధానమూగా చేయనివాడు అథమదూత. 


    ఈ సందర్భంలో సముద్రందాటి తిరిగి వచ్చిన కార్యసాధకుడైన హనుమను రాముడు "హనుమ ఒనర్చిన ఘనకార్యములు లోకములోనే 

అత్యద్భుతములైనవి, 

ఊహకందనివి, 

అనితరసాధ్యమైనవి" అని ప్రశంసించాడు.  

    హనుమకు తాను తన గాఢాలింగన సౌఖ్యాన్ని మాత్రమే ఇయ్యగలనని తెలిపాడు. 

    అదియే హనుమకు పరమ సుఖానుభవములను కల్గించగలదని పేర్కొన్నాడు. 

    అప్పటికి తానీయగలిగిన సర్వస్వము అదియే అన్నాడు.  

    పులకితగాత్రుడై, తాను అప్పగించిన కార్యమును సఫలమొనర్చిన హనుమని తన హృదయానికి హత్తుకొన్నాడు. 



* ఉత్తమ దూతయైన హనుమ దౌత్యము నెరిపిన సందర్భములు నాలుగు. అవి 


అ) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము. 

ఆ) రాముని దూతగ సీతకు సందేశమందించడం. 

ఇ) సుగ్రీవుని దూతగ రావణునితో ముచ్చటించుట. 

ఉ) రాముని దూతగ భరతునితో సమావేశము. 


అ) సుగ్రీవుని దూతగ రామ సందర్శనము: 

    రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. 

    హనుమ భయాన్ని వీడమన్నాడు. అప్పుడు ఆ రామలక్ష్మణుల వివరాలను తెలుసుకొని రమ్మని  హనుమంతునే పంపాడు సుగ్రీవుడు. 

    రామలక్ష్మణులు సుగ్రీవుని మైత్రికై ప్రయత్నిస్తున్న విషయం పసిగట్టి హనుమ, 

    కపిరాజ్యాన్ని సుగ్రీవునకు సంపాదించిపెట్టే పథకము రూపొందించుకొన్నాడు. 

    చూచి రమ్మన్నదానికన్న చాల ముందుకుపోయి ఆ ధ్యేయ సాధనకు రాచబాట పరిచాడు. 


ఆ) రాముని దూతగ సీతకు సందేశం: 

    సీత జీవించియున్నదో లేదో చూచిరమ్మని పంపిన వేరెవరైనా, చూచిన వెంటనే వెనుదిరిగి పోయి ఉండెడివాడు. 

    లేదా ఆ సంతోషంలో ఆమె ముందు దూకి కార్యము చెడగొట్టేవాడు కావచ్చు. 

    కానీ హనుమ అన్ని విషయాలని తర్కించుకొని 

  - సీతకు రాముని సందేశమూ, 

  - అంగుళీయకమూ అందించాడు. 

    సీత నుంచీ కబురూ, చూడామణీ తీసుకుని, తిరిగి రాముని వద్దకు వెళ్ళాడు. 


ఇ) సుగ్రీవుని దూతగ రావణునితో: 

    రావణునితో దౌత్యము నెరపమని హనుమకెవ్వరూ చెప్పలేదు. 

    అయినా వానర బలపరాక్రమాలు రావణునకు తెలిపి, 

    రాక్షసులలో మనోధైర్యాలు శిథిలపరచుట తన స్వామి కార్యమునకు అనుకూలములని ఆలోచించి నిర్ణయించుకున్నాడు.   


ఈ) రాముని దూతగ భరతునితో సమావేశము: 

    14 సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తిచేసుకున్నాడు రాముడు. 

    తెల్లవారి అయోధ్యకు చేరకపోతే, భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు. 

    హనుమకు రాముడు సంగతి తెలిపి, భరతుని వద్దకు పంపాడు. 

    తనరాక భరతునకు ఆనందమైతే సరే. అట్లుకాక భరతునికి రాజ్యకాంక్ష ఉన్నట్లనిపిస్తే, 

    హనుమను వెంటనే తిరిగి తన వద్దకు వచ్చివేయమన్నాడు. 

    భరతుని అభిప్రాయం తెలిసికొనడం తేలికగాదు. 

    హనుమ పూర్వము నడిపిన దౌత్యములు రామునకు ప్రీతికల్గించాయి. 

    అట్లే హనుమ రామునికి సరియైనదౌత్యాన్ని భరతునితో నడిపాడు. 


          ఈ విధంగా హనుమ సుగ్రీవునికీ శ్రీరామచంద్రునికీ అత్యంత ప్రీతిపాత్రుడైన ఉత్తమ దూత. 


    విశ్వంలో ఏ దౌత్యమైనా, ఏ విధంగా ఉండాలో అందరూ తెలుసుకొనేలా, 

     తాను ఆచరించి చూపిన ఆదర్శవంతుడైన దూత హనుమంతుడు. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

నాల్గవ కుమార్తె ఉండివుంటే?

 నాల్గవ కుమార్తె ఉండివుంటే?


చెన్నై హార్బర్ లో పరిపాలనాదికారిగా పనిచేస్తున్న నేను, నా పైఅధికారి అయిన శ్రీ యస్. గణేశన్ గారిని ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళాను.


వారి ఇంటి సభ్యుల గురించి, ఉద్యోగం చేసిన ప్రదేశాల గురించి అడిగిన తరువాత మహాస్వామివారు వారిని, “నువ్వు రోజూ సంధ్యావందనం చేస్తావా?” అని అడిగారు.


“లేదు, నా ఉద్యోగం రీత్యా నాకు అది కుదరని పని, పరమాచార్య నన్ను క్షమించాలి” అని బదులిచ్చారు.


ఒక నిముషం పాటు మౌనంగా ఉన్న స్వామివారు, “అందుకు నేనొక ప్రాయశ్చిత్తం చెప్పనా? నువ్వు చేస్తావా?” అని అడిగారు.


“తప్పక చేస్తాను”


“నీకు ముగ్గురు కుమార్తెలు అని చెప్పావు కదా, నీకు నాలుగవ కుమార్తె ఉండివుంటే ఏమి చేసేవాడివి?”


“ఆ అమ్మాయిని కూడా బాగా చదివించి మంచి ఇంట పెళ్లి చేసేవాడిని”


“నీకు నలుగురు కుమార్తెలు అని తలచి, ఆ నాల్గవ కుమార్తెకు ఏమేమి చేసేవాడివో, ఆ డబ్బును నేను చెప్పబోయే కార్యానికి వినియోగించు.


మన శాస్త్రాల ప్రకారం, నిత్యకర్మానుష్టానము, వేదాభ్యాసము వారి వారి సూత్రమును అనుసరించి వేరువేరుగా ఉంటుంది. సంధ్యావందన మంత్రాలు కూడా అందరికి ఒకలా ఉండవు. పండితుల సూచనల మేరకు, ఆ మంత్రాలను పరిశీలింపజేసి, శాఖ-గోత్ర-ప్రవరాదులను బట్టి వాటిని వర్గీకరించి, చిన్ని చిన్ని పుస్తకాలను ప్రచురణ చెయ్యి. ఆ పుస్తకాలను కళాశాల విద్యార్థులకు, పాలిటెక్నిక్స్ చదువుతున్న వారికి ఉచితంగా పంచు. కనీసం కొద్దిమందైనా భవిష్యత్తులో వారి సాంప్రదాయాన్ని బట్టి కర్మానుష్టానాన్ని మొదలుపెడతారు. మైలాపూర్ సంస్కృత కళాశాల పండితులను మీ ఇంటికి పిలిపించి, వారితో చర్చించి, ప్రచురణ చెయ్యి. . .”


ఎంతో ఉత్సాహంతో నా పైఅధికారి అందుకు అంగీకరించాడు. తరువాతి తరాలపై పరమాచార్య స్వామివారికి ఉన్న కరుణ అటువంటిది.


--- టి. ఎ. భాష్యం, ఉత్తర మాడ వీధి, చిన్న కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6 


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్

 పుణ్యక్షేత్రాలలో కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్ 

లు అచ్చటికి వెళ్లేవాళ్ల కి వసతి, భోజన సౌకర్యాల నిమిత్తం ఉపయోగపడతాయి. 

క్షేత్రం పేరు     మేనేజర్ ఫోన్ నెంబర్ 

1.శ్రీశైలం            8333907784

2.మహానంది     8333907803

3.భద్రాచలం      8333907796

4.అలంపూర్     8333907806

5.షిర్డీ               8333907800

                    & 7675012727

6.కర్నూలు       8333907808

7.యాదాద్రి      8333907815

8.వారణాసి      8333907790 &

4సత్రాలు ఉన్నాయి8333907791

9.రామేశ్వరం   8333907793

10.త్రిపురాంతకం 8333907794

                 &    9493772068

11.విజయవాడ   8333907807

(వృద్ధాశ్రమం)    & 9292805204


సూచన: ఈ విలువైన సమాచారం ను మీకు తెలిసిన గ్రూప్లలలో పెట్టి 

యాత్రికులకు సహకరించండి.

కష్టాలవల్ల కలిగే క్షోభను

 .


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ఉత్తమః క్లేశవిక్షోభం*

*క్షమః సోఢుం న హీతరః|*

*మణిరేవ మహాశాణ*

*ఘర్షణం న తు మృత్కణః||*


తా𝕝𝕝 

*కష్టాలవల్ల కలిగే క్షోభను ఉత్తముడు మాత్రమే తట్టుకోగలడు....సాన మీద ఒరిపిడిని మాణిక్యమే సహించగలదు కానీ మట్టిపెడ్డ సహించగలదా*.....