అక్కడ అందరు బ్రాహ్మలే
సత్ ప్రవర్తన, సాత్వికాహార భోనజం, నిత్య దైవ ధ్యానము, సదాచారం, సనాతన సాంప్రదాయ అనుసరణ, శిఖ ధారణ, మొదలగునవి బ్రాహ్మణ లక్షణాలుగా మనం తీసుకుంటే అక్కడ ఉన్నవారంతా నిస్సందేహంగా బ్రాహ్మలే అనేక తప్పదు.
అదే సూక్ష్మం గా ఇస్కోన్ అని పిలిచే అంతర్జాతీయ శ్రీకృష్ణ చెతన్య సంఘం. అక్కడి సాధువులు అందరు నిత్యం సాత్విక ఆహరం భుజిస్తూ, శిఖను ధరిస్తూ, పంఛను కట్టుకొని ముమ్మూర్తులా ఒక సదాచార బ్రాహ్మణుల వలెనె ఉంటారన్నది సత్యం. నిరంతర హరినామ స్మరణము చేస్తూ వారి చేతులలో జప మాల తిరుగుతూ ఉంటుంది, శ్రీమత్ భగవత్ గీత పారాయణమే వారి నిత్యా కృత్యం. శ్రీకృష్ణ చెతన్య సంఘం శాఖలు ప్రపంచం మొత్తం చాలా దేశాలలో విస్తరించి వున్నాయి. వారు ఆచరించే భజనలు కానీ, కృతనాలు కానీ, పండగలు కానీ, ప్రవచనాలు కానీ చూపరుల మనస్సు దోచుకొంటుంది అంటే అతిశయోక్తి లేదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని జీవితం మీద విరక్తి కలిగిన వారు ఎందరో ఈ రోజు శ్రీకృష్ణ చెతన్య సంఘం లో చేరి భగవాన్ శ్రీకృష్ణ పాద సన్నిధిలో ఆనందంగా జీవనం గడుపుతున్నారు. మీరు ఏ మతానికి చెందిన వారు, ఏ కులానికి, వర్ణానికి చెందిన వారు అన్నది అక్కడ చూడరు. అందరు భగవాను శ్రీకృష్ణ పాద దాసులే. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ISCON టెంపులుకు వెళ్ళారా లేకపోతె ఒక ఆదివారం మీకు అందుబాటులోని ISCON గుడికి వెళ్ళండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక భజనలు, కిర్తనలు, ప్రవచనాలు చూసే మీ రెండు కళ్ళు చాలవు. మధ్యాన్నం పూర్తి సాత్విక మైన భోజనం ఉచితంగా వితరణ చేస్తారు.
ISCON ఎలా పుట్టింది.
1966 వ సంవస్త్సరము న్యూయార్క్ నగరంలో భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద స్థాపించారు అది 40 సంవత్సరాలలో చాలా దేశాలలో మరియు ముఖ్యమైన నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ లాంటి లాభాపేక్ష లేని ఈ సంవస్ధ శ్రీ కృష్ణ భగవానుని దివ్య సంకీర్తనా ఉద్యమాన్ని ప్రతి పట్టణానికి గ్రామానికి అందుబాటులోకి తీసుకొని పోవటం అనే లక్ష్యంతో పనిచేస్తున్నది. ఆంగ్ల వర్ణమాలలో A- Z అక్షరాలతో మొదలయ్యే అన్ని దేశాలలోను ఈ సంఘం వ్యాపించింది అంటే ఈ సంఘ కార్యకర్తలు ఎంతగా కృషి చేసి వుంటారో మనం ఊహించగలం. ప్రతి సభ్యుని అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, కృష్ణ భగవానుని ఫై వున్న నమ్మకం ఈ నాడు ఈ సంఘం ఇంతగా వృద్ధి చెంది కోట్లాది మంది నేడు శ్రీ కృష్ణ భగవానుని శరణ్ పొందే విధంగా ప్రోత్సహించిందంటే అందులోని ప్రతి సభ్యుడు అభినందనీయుడే. కృష్ణ భక్తితో మోక్ష సాధన పొంద వచ్చానే వారి తలంపు సర్వదా ప్రశంసనీయం. ఈ సంఘం దిన దినాభివృధి చెంది విశ్వవ్యాప్తంగా మనహిందూ జ్ఞాన సంపదను విస్తరింపచేయాలని మనమంతా కోరుకుందాము.
ఇంటర్ నెట్ వెతుకగా నాకు దొరికిన సమాచారం మేరకు ఈ సంఘం క్రింది దేశాలలో విస్తరించి వున్నది.
A : Argentina, Australia, Azerbaijan,
B: Bangladesh, Belarus, Belgium, Bolivia, Botswana, Brazil, Bulgaria, Burma(Myanmar),
C : Canada, Chile, Colombia, Costa Rica, Croatia, Czech Republic,
D : Denmark, Dominican Republic
E: Ecuador, El Salvador, Estonia,
F: Fiji,Finland,France,
G: Georgia,Germany,Ghana,Guyana,
H :Hong Kong,Hungary,
I :India,Indonesia,Ireland,Israel,Italy,Ivory Coast,
J : Japan,
K: Kenya,Kyrgyzstan
L: Latvia,Lithuania
M: Macedonia,Malaysia,Mauritius,Mexico,Moldova,
N :Nepal,Netherland,Nigeria,Norway,
P:Panamá,Paraguay,Peru,Philippines,Poland,Portugal,
R: Romania,Russia,
S: Scotland,Singapore,Slovakia,South Africa,Spain,Sri Lanka,Suriname,Swaziland,Sweden,,Switzerland
T: Taiwan,Tajikistan,Thailand,Togo,
U:Uganda,Ukraine,United Kingdom,United States Of America,Uruguay,Uzbekistan
V: Venezuela
W: West Indies,
Z:Zimbabwe