19, జూన్ 2021, శనివారం

విటమిన్లు

 విటమిన్లు మరియు అవి లభించే పదార్ధాలు -  1.


* A విటమిన్  - 


   అనేక రకాలైన శాకాహారం  నుంచి కెరొటిన్ రూపములో లభిస్తుంది. క్యారట్ , బొప్పాయి , టమాటో , బటాణీ , మామిడిపళ్ళు , బచ్చలి , మునగ , కరివేపాకు , కొత్తిమీర వంటి ఆకుపచ్చ , పసుపు రంగు కలిగిన కూరగాయలలో కెరొటిన్ లభించును . మాంసాహారంలో లివరు మరియు గుడ్డులో లభించును . 


 *  B విటమిన్  - థయమిన్ . 


    తృణధాన్యాలు , గోధుమలు , ఉప్పుడు బియ్యం , దంపుడు బియ్యం , తైదలు , జొన్నలు , పెసలు , శెనగలు , మినుములు , కందులు వంటి పప్పు దినుసులలోను , నువ్వులు , వేరుశెనగలు , జీడిపప్పు , పిస్తా , బాదం , బటాణీ వంటి గింజలలోను , సోయా చిక్కుడు , చిక్కుడు , బీట్రూట్ , బంగాళాదుంప , గుడ్డు మొదలైన వాటిలో థయమిన్ లభ్యం అగును. 


 *  B2 విటమిన్ - రైబోఫ్లేవిన్ . 


     పాలు , పెరుగు , పాలకోవా , పాలపొడి వంటి పాలఉత్పత్తులలో , గోధుమపిండి , రాగులు , జొన్నలు , సజ్జలు , బార్లి, బియ్యం లాంటి తృణధాన్యాలలో వేరుశెనగ , కంది , మినప , పెసర , సోయాబీన్ , శెనగ లాంటి పప్పు గింజలలో విటమిన్ B2 లభ్యం అగును. 


 *  B3 విటమిన్  -  నియాసిన్ . 


      గోధుమలు , బియ్యం , జొన్నలు , మొక్కజొన్నలు వంటి తృణధాన్యాలలో వేరుశెనగ మిగతా పప్పు దినుసులలో , కాలేయం , మాంసం , చేపలు లాంటి మాంసాహారాలలో నియాసిన్ లభ్యం అగును. 


       తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందిస్తాను . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: