*🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*
3. అరణ్యక మహర్షి
అరణ్యక మహర్షి
అరణ్యం అంటే అర్థం మీకు తెలుసుకదా ... అరణ్యం అంటే దట్టమయిన అడవి అని . అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే , పెరిగింది అడవిలోనే , తపస్సు చేసిందీ అడవిలోనే . ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు . అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది . ఈ మహర్షి ఆశ్రమం రేవానదీ ఒడ్డున ఉండేది . చాలా ప్రశాంతంగా ఉండేది . పెద్ద పెద్ద జంతువులు కూడ అక్కడ కలిసి మెలిసి ఉండేవి . ఆయన ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండేవాడు . ఆయన రామనామ జపం ఎప్పుడూ చెయ్యడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ రామనామం వినపడుతూ ఉండేది . అది ఎలా వినపడుంది ? అని మీ సందేహం కదూ ... నేను చెప్తాను కదా .... ! పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు , ఎండిపోయిన పుల్లలు విరిగి కింద యుకున్నప్పుడు , చీమలు పాకుతున్నప్పుడు , గాలి వేసినప్పుడు , చెట్లు ఊగుతున్నప్పుడు
ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది . అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రం , రామ ధ్యానం , రామ స్మరణం , రామ పూజనం , రామ చింతనం , రామ మననం , మొత్తం రామ మయంగా ఉండేవాడు . ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి , ఆయన రామ భక్తి చూసి స్వామీ ! నేను ఎప్పుడు రాముడితోనే ఉంటాను , అయినా నాకంటే మీకే ఎక్కువ రామ భక్తి ఎలా వచ్చింది ? అని అడిగాడు . అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పాడో చదవండి మరి .... నేను ఎప్పుడు ఈ అడవి వదిలి ఎక్కడికీ వెళ్లలేదు . అయినా నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది . కాని నాకు గురువు లేడు కదా ... ఇలా అనుకుంటూ ఉండగా లోమశ మహర్షి వచ్చి నీకు గొప్ప మంత్రం , సంసార సాగరం నుంచి బయట పడేసేది చెప్తాను అని మంత్రం ఉపదేశించాడు . ఆ మంత్రం ఏమిటో మీకు తెలుసా ... ' రామనామం ' . ' రామ ' అనే రెండు అక్షరాల్ని ఎప్పుడూ మనస్సులో జపిస్తూ వుంటే వేరే వ్రతాలు , పూజలు , యాగాలు , దానాలు , మౌనవ్రతాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు . అందుకని ' రామ నామం జపించుకో అని చెప్పాడు . తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకుని రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకుని రామ నామం చేసుకుంటున్నాడు .
తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకుని ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకుని రామ నామం చేసుకుంటున్నాడు . ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగనమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకి పంపించాడు . ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడు . అరణ్యక మహర్షి సరయూనది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముడ్ని చూసి ఆనందంతో కళ్లనుంచి జలజల నీళ్ళు రాలుతుంటే భక్తితో ఆయన తన దేహాన్నే మరిచిపోయాడు . శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి మహర్షిని కౌగిలించుకుని , చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చో పెట్టాడు . అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాలమీద పడి నమస్కారం చేసి స్వామీ ! ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను . నా తపస్సు పండింది . నా జన్మధన్యమైంది . నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు . వెంటనే ఆయన కపాలం పగిలి అందులోంచి ఒక తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది . చూశారా ! అరణ్యక మహర్షి ' రామ ' అనే నామంతోనే భగవంతుడిలో ఎలా కలిసిపోయాడో !
3. అరణ్యక
*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి