ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
18, అక్టోబర్ 2023, బుధవారం
అపుత్రస్య గతిర్నాస్తి
🌹 సంతానం తోనే స్వర్గంమా? 🌹 🍀🌺🍀🌺🍀🌺🍀🌺 అపుత్రస్య గతిర్నాస్తి ..?! 'ఇది ఎంతవరుకు నమ్మాలి ?'
( పిల్లలు లేకపోతే నరకమేనా ?)
పిల్లలు లేని వారి పరిస్థితి ఏమిటి? వారి ఆత్మ పరిస్థితి ఏమిటి? అని చాలా మంది అనుకుంటారు. వంశోద్ధారణ చేసే కొడుకు లేక పోతే.. అంటే, చనిపోయాక తలకోరివి పెట్టెవారు లేకపోతే తమ గతేమిటి? అనీ, పితృ కార్యాలు ఆగిపోతాయనీ వ్యధ పడుతూ ఉంటారు చాలామంది. దీనికి సంబంధించి, ప్రాచీన గ్రంధాలు ఏమి చెబు తున్నాయి? శాస్త్ర నిర్ణయం ఏమిటి?
పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు!
వేదోక్త కర్మలు చేసేవారూ, జ్ఞాన సంపాదన చేసేవారూ, ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసే వారూ, పిల్లలున్నా, లేకున్నా, వారి వారి సత్కర్మల వల్ల ఉద్ధారం అవుతారు. పాపులూ, దుష్కర్మలు చేసినవారూ, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యం తోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మల తోనో, పిండ ప్రదానాల తోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప, పిల్లలు లేరని నరకం లేదు.
మనకు భగవద్భక్తి లేక, సాధన చేయక పోతే, దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే, నరకమే. తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే 'సద్గతి'. అదే శాస్త్రం..
శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది..
పుత్రులు ఆరు రకాలు..
1. ఔరసుడు,
2. దత్తకుడు,
3. కృత్రిముడు,
4. గూఢోత్పన్నుడు,
5. అపవిధ్ధుడు,
6. క్షేత్రజుడు..
వీరికి రాజ్యములో కానీ, ఆస్తిలో కానీ భాగం ఉంటుంది..
ఇంకొక రకమైన పుత్రులు, ఆరుగురు ఉన్నారు..
1. కానీనుడు,
2. సహోఢుడు,
3. క్రీతుడు,
4. పౌనర్భవుడు,
5. స్వయందత్తుడు,
6. జ్ఞాతుడు..
వీరు కూడా పుత్ర సమానులే కానీ, వీరికి రాజ్యాధికారము కానీ, ఆస్తిలో భాగము కానీ వుండదు..
మనుమడు, కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. అందుకే, మన తర్పణ విధులలో, ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికీ, అటు తల్లి వైపు మూడు తరాల వారికీ పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము..
కాబట్టి, ఎవరికీ కొడుకు లేడని బాధ పడవలసిన పనిలేదు. యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా, అవి ఆ తండ్రికి అందుతాయి..
తమకు వేరు లోకమున ఉత్తమ గతులు లభించుటకు పుత్రులు కావలయును అనుకుంటారు.. తమకు పుత్రులు కలగని వారు, అయ్యో, మాకు పుత్రులు కలుగ లేదు.. మాకు ఎట్లు ఉత్తమ గతులు కలుగును? అని అనుకుంటారు..
'కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా'..
కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగిననూ, వారి మూలమున అతడు ఏ ఉత్తమ లోకములు పొంద గలిగాడు? బ్రహ్మచారిగనే యుండి, సంతతి యే లేకున్న శుకునకు దుర్గతి ఏమయినా కలిగిందా? కనుక పుత్రులు లేని వానికి మోక్ష పదము లభించక పోవడము వుండదు. పుత్రులు గల వారికి కూడా ఉత్తమ గతులుగానీ, మోక్షముగానీ సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేని వారికి అవి రెండూ సిద్దించనూ వచ్చును..
కావున, కొడుకులు లేరని ఎవరూ బాధ పడకూడదు. మన పుణ్యం మనమే సంపాదించు కోవాలి. మన ఉద్ధారణ కోసం మనమే పాటు పడాలి. మనకు ఆ ఈశ్వరుని దయ వలన ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై, మన ఉత్తమ గతులను మనమే సాధించుకోవాలి..
సర్వేజనాసుఖినోభవంతు.
నిర్జలీకరణం (డీహైడ్రేషన్)*
*నిర్జలీకరణం (డీహైడ్రేషన్)*
➖➖➖✍️
*వృద్ధాప్యంలో ఏమిటీ గందరగోళం?*
*"నాల్గవ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు క్లినికల్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా, ఈ క్రింది ప్రశ్న అడుగబడుతుంది …*
*"వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి?"*
*కొందరి సమాధానం: "తలలో కణితులు".*
*జవాబు : కాదు!*
*మెడికల్ విద్యార్థులు : "అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణాలు".*
*జవాబు : కాదు!*
*సమాధానాల తిరస్కరణతో, వారి నుంచి స్పందన ఆగిపోయింది.*
*సరియైన సమాధానం విని వాళ్లంతా నోరు తెరిచేసారు.*
జవాబు : *-నిర్జలీకరణం (డీహైడ్రేషన్)*
*ఇది ఒక జోక్ లాగా ఉండవచ్చు; కానీ అది నిజం!*
*60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో సాధారణంగా దాహం అనుభూతి ఆగిపోతుంది. తత్ఫలితంగా, ద్రవాలు తాగడం మానేస్తారు. ఫ్లూయిడ్స్ తాగమని గుర్తు చేయడానికి ఎవరూ లేనప్పుడు, వారు త్వరగా డీహైడ్రేట్ అవుతారు.*
*నిర్జలీకరణం తీవ్రమైనది మరియు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆకస్మిక మానసిక గందరగోళం, రక్తపోటు తగ్గడం, గుండె దడ పెరగడం, ఆంజినా (ఛాతీ నొప్పి), కోమా మరియు మరణానికి కూడా కారణం కావచ్చు.*
*ద్రవాలు తాగడం మరచిపోయే ఈ అలవాటు 60 ఏళ్ల వయస్సులో ప్రారంభమవుతుంది, మన శరీరంలో కేవలం 50% కంటే ఎక్కువ నీరు ఉంటే, 60 ఏళ్లు పైబడిన వారికి తక్కువ నీటి నిల్వ ఉంటుంది. ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో భాగం.*
*ఇక్కడ మరొక ఇబ్బంది ఉంది. అదేమిటంటే వారు నిర్జలీకరణానికి గురైనప్పటికీ, వారు నీరు త్రాగాలని భావించరు, ఎందుకంటే వారి అంతర్గత సమతుల్య విధానాలు సరిగా పనిచేయకపోవడం వలన.*
*ముగింపు:*
*60 ఏళ్లు పైబడిన వ్యక్తులు సులభంగా డీహైడ్రేట్ అవుతారు, వారికి తక్కువ నీటి సరఫరా ఉన్నందున మాత్రమే కాదు; వారు శరీరంలో నీటి కొరతను అనుభూతి చెందరు కాబట్టి.*
*60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, ప్రతిచర్యలు మరియు రసాయన విధుల పనితీరు వారి మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది.*
*అందువల్ల రెండు విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి.*
*1). నీరు & ద్రవాలు తాగడం అలవాటు చేసుకోండి. ద్రవాలలో నీరు, రసాలు, గ్రీన్ టీలు, కొబ్బరి నీరు, సూప్‌లు మరియు పుచ్చకాయ, పీచెస్ మరియు పైనాపిల్ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు ఉన్నాయి; ఆరెంజ్ మరియు టాన్జేరిన్ కూడా పని చేస్తాయి.*
*ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి రెండు గంటలకు, తప్పనిసరిగా కొంత ద్రవాన్ని త్రాగాలి.*
*ఇది బాగా గుర్తుంచుకోండి:*
*2). కుటుంబ సభ్యులకు హెచ్చరిక: 60 ఏళ్లు పైబడిన వారికి నిరంతరం ద్రవాలను అందించండి. అదే సమయంలో, వారిని గమనించండి.*
*వారు ద్రవాలను తిరస్కరిస్తున్నారని మరియు ఒక రోజు నుండి మరొక రోజు వరకు వారు చికాకుగా, ఊపిరి పీల్చుకోకుండా లేదా శ్రద్ధ లేకపోవడాన్ని ప్రదర్శిస్తున్నారని మీరు గ్రహించినట్లయితే, ఇవి దాదాపుగా నిర్జలీకరణం యొక్క పునరావృత లక్షణాలు అని గ్రహించండి.*
*ఈ సమాచారాన్ని ఇతరులకు పంపండి! ఇప్పుడే చేయండి! మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ముఖ్యంగా…*
*60 ఏళ్లు పైబడిన వారితో పంచుకోవడం మంచిది*
మిత్రులు గా నటించడం
*1964*
*కం*
మనసున శత్రుత్వము తో
కనబరచెడు మిత్ర నటన కడు ఘాతుకమౌ.
మనసున గల మిత్రత్వమె
మనుచును బంధములనెల్ల మహిలో సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనసు లో శత్రుత్వం ఉంచుకుని మిత్రులు గా నటించడం చాలా ప్రమాదకరం. మనసు లో ఉన్న మిత్రత్వమే బంధాలను బతికించగలదు.
*సందేశం*:-- మనసు లో శత్రుత్వం ఉంచుకుని నటించే మిత్రత్వము ఏదో ఒకనాడు బహిర్గతమవుతుంది.నిజమైన(మనస్పూర్తిగా ఉండే మిత్రత్వము) మిత్రత్వము నటించక కలకాలం నిలుస్తుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
ఉద్ధవగీత
ఉద్ధవగీత
శ్లో)అర్చాదిషు యదా యత్ర శ్రద్ధా మాం తత్ర చార్చయేత్ | సర్వభూ తేష్వాత్మని చ సర్వాత్మాహమవస్థితః ||
అ)ప్రతిమాదులయందు ఎప్పుడుఎచట శ్రద్ధ కలుగునో అప్పు డుఆప్రతిమయందు నన్ను పూజింపవలెను. ఏలయన,నేనుసర్వాంతర్యామి.రూపముతో.సర్వభూతములయందు, నా హృదయమనందు ఎల్లపుడు నున్నాను
విదురనీతి
విదురనీతి
విరోచన ఉవాచ - విరోచను డిట్లున్నాడు.
శ్లో)హిరణ్యం వా గవాశ్వం వా య ద్విత్త మసురేషునః
సుధన్వన్ విపణేతేన ప్రశ్నం పృచ్చావ యే విదుః
అ)ఓ సుధన్వుడా! సువర్ణము కాని, గోవులు అశ్వాలుకాని, మారాక్షసులు ధనమేదైనా కాని దానితో పందెం కడతాను. మనలో శ్రేష్టులెవరనే విషయం తెలిసిన వారి నడుగుదాము
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
* శ్రీహరి తాళధ్వజుడిని ఓదార్చడం
వరదలా పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బేలగా విలపిస్తున్న తాళధ్వజమహారాజును చూసి
శ్రీహరికి హృదయం ద్రవించింది. మెల్లగా చెంతకు చేరాడు. రాజేంద్రా! ఏమిటి దుఃఖిస్తున్నావ్? ఎక్కడికి
వెళ్ళింది నీ ప్రియాంగన? నువ్వు శాస్త్రాలు చదవలేదా? ఏ పండితులను ఆశ్రయించలేదా? ఆమె ఎవరు?
నువ్వు ఎవరు? సంయోగమంటే ఏమిటి? వియోగమంటే ఏమిటి? ఇదంతా ఒక ప్రవాహం. కలుస్తూ
ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఎవరి నావలో వారు దాటిపోతుంటారు. దుఃఖించి ప్రయోజనం లేదు.
ధైర్యం తెచ్చుకో. ఇంటికి వెళ్ళు. సంయోగవియోగాలు దైవాధీనాలు. ఆమెతో నీకు ఇక్కడే ఈ జన్మలోనే
సంయోగం కలిగింది. సుఖాలు అనుభవించావు. బాగానే ఉంది. ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు
తెలుసా? వారిని ఎప్పుడైనా చూశావా? లేదు. కాకతాళీయంగా కలుసుకున్నారు. అలాగే విడిపోయారు.
గతం గతః. ఇప్పుడు శోకించి ప్రయోజనం ఏమిటి? ఎందరు ఎంతగాదుఃఖిస్తే మాత్రం పోయినవాళ్ళు
వస్తారా? ఎప్పుడైనా వచ్చారా? కాలో హి దురతిక్రమః. అందుచేత, లే, లేచివెళ్ళు. వెళ్ళి రాజభోగాలు
అనుభవించు. యథావిధిగా పరిపాలన సాగించు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వూ
అంతే. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. కర్తవ్యం ఆచరించు. యోగమార్గం తెలుసుకో. మనస్సుమ
చిక్కబట్టుకో. ప్రాణికోటి యాతాయాతాలకు సంబంధించి వాస్తవదృష్టిని అలవరుచుకో. భోగాలు కాలవశావ
వస్తాయి, కాలవశాన పోతాయి. శోకించడం వ్యర్థం. ఇదొక నిష్ఫలమైన సంసారమార్గం. కేవల సుఖయోగమూ
ఉండదు, కేవల దుఃఖయోగమూ ఉండదు. ఘటికాయంత్రంలా రెండూ ఒకదానివెంట ఒకటి
తరుముకుంటూ తిరుగుతుంటాయి. మనస్సుకి ధైర్యం చెప్పుకుని రాజ్యపాలన సాగించు, లేదా
దాయాదులకు అప్పగించి వానప్రస్థం స్వీకరించు
18-10-2023* *బుధవారం *రాశి ఫలితాలు
*18-10-2023* *బుధవారం*
*సౌమ్య వాసరః*
*రాశి ఫలితాలు*
*మేషం*
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన సంభందిత వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. భూ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి.
*వృషభం*
భాగసౌమ్య వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం లేదు. బంధు మిత్రులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనులందు ఆటంకములు తప్పవు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.
*మిధునం*
ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
*కర్కాటకం*
నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
*సింహం*
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలొ ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. ఆర్థిక వ్యవహారాలలొ ఒడిదుడుకులు ఉంటాయి.
*కన్య*
వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి.
*తుల*
నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగ పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.
*వృశ్చికం*
దూరపు బంధువుల నుండి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.
*ధనస్సు*
చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
*మకరం*
ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. చెయ్యని పనికి ఇతరుల నుండి నిందలు పడవలసి వస్తుంది. ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
*కుంభం*
సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ సభ్యుల నుండి అరుదైన బహుమతులు అందుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
*మీనం*
ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి. సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది .ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.
🕉️
చేతిలో ఫోన్..వెన్నెముక డౌన్!*
*🔊📱చేతిలో ఫోన్..వెన్నెముక డౌన్!*
*🔶ఒకప్పుడు రైల్లోనో, బస్సులోనో కూర్చునే చోటు దొరక్క నిలబడాల్సి వచ్చిందని మాత్రమే చింతించేవారు.. మరి ఇప్పుడు మనం మొబైల్‌ను మిస్ అవుతున్నామని అంతకు మించి చింతిస్తున్న పరిస్థితి. (నిలబడీ మొబైల్ వాడేవాళ్లూ ఎక్కువే ఉన్నారనుకోండి). కూర్చునేందుకు కాస్త చోటు దొరికితే చాలు.. టక్కున ఫోన్‌లో తలదూర్చేస్తున్నారు.*
*🔷ఇదొక్కటే కాదు.. కూర్చున్నా, బెడ్‌పై ఉన్నా, బయట ఎక్కడైనా తిరుగుతున్నా, నడుస్తూ వెళుతున్నా మొబైల్ ఫోన్ చేతిలోనే ఉంటోంది. కానీ ఇదే అతిపెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. ఫోన్ చూడటం కోసం మెడ వంచడం, చేతులను ఎక్కువ సేపు పైకెత్తి ఉంచడం, కూర్చున్నా, పడుకున్నా ఫోన్ చూడటం కోసం ఏదో ఓవైపు వంగిపోతుండటం, స్క్రోలింగ్, టైపింగ్ కోసం వేళ్లను విపరీతంగా వినియోగిస్తుండటం వంటి వాటితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.*
*💥టెక్ నెక్.. సమస్యతో..*
*🍥స్మార్ట్‌ఫోన్‌తో గంటల కొద్దీ గడిపేవారు, ఇందులో ముఖ్యంగా టీనేజర్లు ‘టెక్ నెక్’, లేదా ‘న్యూ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని తాజా పరిశోధనలు గుర్తించాయి. దీనిద్వారా మెడ, వెన్నునొప్పితోపాటు తలనొప్పి, భుజాల నొప్పులు, చేతుల్లో జలదరింపు, కండరాలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.*
*🌀చాలాసేపు మెడ వంచి చూడటం వల్ల.. మెడలోని స్నాయువులు, కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతోందని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ఐఎస్‌ఐఈ) మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్‌ఎస్ ఛబ్రా హెచ్చరించారు. దీర్ఘకాలికంగా, మెడ కండరాలు అపసవ్యంగా సంకోచించడం వల్ల పుర్రెతో అనుసంధానమైన ఉన్నచోట మంట, నొప్పిని కలిగిస్తుందని.. ఈ నొప్పి ఫాసియా ద్వారా మెడ నుంచి తలకు వ్యాపిస్తుందని వివరించారు.*
*💥భంగిమ సరిగా లేక.. భారంగా..*
*💠మొబైల్‌ను చేతిలో పట్టుకున్నప్పుడు కేవలం వేళ్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. కానీ మన చేతులు, మోచేయి, కండరం, మెడ ఇవన్నీ వినియోగిస్తాం. మొబైల్‌ను చూస్తున్నప్పుడు మెడను కిందకు వంచుతాం. దీనివల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్’కథనం ప్రకారం.. ఇలా మెడ వంచి చూసే భంగిమ వల్ల వెన్నెముకపై తల బరువు పెరుగుతుంది.*
*🥏‘‘వాస్తవానికి తల నిటారుగా ఉన్న స్థితిలో దాదాపు 5–8 కిలోల బరువుపడుతుంది. తల వంగుతున్నప్పుడు 15 డిగ్రీల దగ్గర.. మెడపై భారం సుమారు 12 కిలోలు, 30 డిగ్రీల దగ్గర 18.14 కిలోలకు 45 డిగ్రీల దగ్గర 22.23 కిలోలకు 60డిగ్రీల దగ్గర 27.22 కిలోలకు పెరుగుతుంది. ఇలా మెడ అతిగా వంగడంతో వెన్నెముక, సపోర్టింగ్ లిగమెంట్లు, కండరాలపై ప్రభావం పడుతుంది..’’అని ఆ కథనం స్పష్టం చేసింది.*
*💥కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం*
*🌼ఫోన్ మాట్లాడే సమయంలో నిలబడే, కూర్చునే భంగిమలో లోపాలు మసు్క్యలోస్కెలెటల్ సమస్యలకు కారణం అవుతున్నాయని.. గర్భాశయ, థొరాసిక్, నడుము ప్రాంతాలలో వెన్నెముక దెబ్బతినడంతో అనేక మంది ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు.*
*🏵️సాధారణంగా కీళ్ల పనితీరు బాగున్నప్పుడు ఒత్తిడికి గురైనా, విశ్రాంతి సమయంలో మరమ్మతు అవుతాయని వివరిస్తున్నారు. కానీ కీళ్లను అసాధారణ భంగిమలో ఎక్కువసేపు ఉంచడం, ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంచడం వల్ల తీవ్రమైన ఒత్తిడి పడి.. అరిగిపోయి, తిరిగి బాగయ్యేందుకు అవకాశం లేనంతగా దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు.*
*💥నిపుణులు ఏమంటున్నారంటే?*
*♦️ మెడ భుజం ముందుకు సాగినప్పుడు.. ముందువైపు కండరాలు బిగుతుగా మారుతూ, వెనుక వైపు బలహీనపడతాయి. కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు భంగిమపై శ్రద్ధ చూపడం తప్పనిసరి.*
*♦️ శరీర భంగిమ అనేది ఫిట్‌నెస్‌కు కీలకం. ట్రెడ్‌మిల్, క్రాస్ ట్రైనర్ వంటివాటి మీద ఉండగా.. మొబైల్ ఫోన్ వినియోగించడం వంటివి చేయవద్దు.*
*♦️ నిలబడి ఉన్నప్పుడు, ఎవరికైనా మెసేజీలు పంపుతున్నప్పుడు తల పైకి, భుజాలు కిందకు ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్‌ను కళ్లకు సమాంతరంగా ఉంచడం సరైన భంగిమ.*
*♦️ కురీ్చలో లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ వంగిపోవడం ఏ విధంగానూ ఆరోగ్యకరం కాదు. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఫోన్ చూడటానికి లేదా టెక్ట్స్ చేయడానికిగానీ మెడ ఎక్కువగా వంచకూడదు.*
*♦️ పడుకున్నప్పుడు ఫోన్ పట్టుకోవడానికి.. మోచేతికి దిండు లేదా మరేదైనా మెత్తని దాన్ని ఆసరాగా తీసుకోవాలి.*
*♦️ భోజనం చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ వినియోగిస్తూ, డ్రైవ్ చేస్తూ.. ఇలా పలు సందర్భాల్లో ఫోన్‌ను కూడా ఉపయోగించడమనే మల్టీ టాస్కింగ్ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా ఆరోగ్యానికి చేటు తెస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.*
భక్తుని బాధ..తక్షణ ఉపశమనం..
*భక్తుని బాధ..తక్షణ ఉపశమనం..*
అరుణాచలం లో వుండే శ్రీ శ్రీనివాసరావు గారు మొన్న శనివారం 4వతేదీ నాడు మొగిలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని దర్శించుకున్నారు..వారు పొందిన అనుభూతిని వారే అక్షరబద్దం చేశారు..శ్రీ శ్రీనివాసరావుగారి అనుభవాన్ని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను..ఈ ముందుమాటగా వ్రాసిన నాలుగు పదాలు..చివరలో శ్రీ స్వామివారి మందిరం చిరునామా తప్ప..మిగిలిన ప్రతి పదమూ శ్రీ శ్రీనివాసరావు గారు స్వయంగా వ్రాసి పంపినదే..
*జై గురుదత్త-శ్రీ గురుదత్త*
అయ్యా,.. నమస్కారమండీ...నా పేరు శ్రీనివాసరావు, మాది పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు గ్రామం, మేము *అరుణాచలం* లో ఉంటాము.మేము సుమారు ఆరు సంవత్సరాల క్రితం *మొగలిచెర్ల* వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామి వారి భోజన ప్రసాదం కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో చాలాసార్లు వచ్చి స్వామివారి ని దర్శనం చేసుకుని నిద్ర చేసి వెళ్లాలని చాలా సార్లు అనిపించి తమరికి కూడా ఫోన్ చేసి తెలియచేయడం నేను రేపు శనివారం వస్తాను నాకు రూము ఏర్పాటు చేయాలని చెప్పడం తిరిగి మరలా బయలుదేరే ముందురోజు ఏదో ఒక అవాంతరం రావడం వలన ప్రయాణం ఆగిపోయేది...
ఇది ఇలా ఉండగా క్రితం నెల అనగా నవంబర్ 29 వ తేదీ రోజున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కృష్ణాజిల్లా కైకలూరు గ్రామం నుండి సుమారు 450 మంది షిర్డీసాయిబాబా గారి భక్తులకు సేవ చేసే భాగంలో నడుస్తూ ఉండగా నాకు కాలు బెణికి క్రింద పడిపోయాను...ఊరికే పడిపోయాను కదా అని వైద్యం ఏమి చేయించకుండా నిర్లక్ష్యం చేసాను... అనుకోకుండా ఒక చిన్న పని రావడం వలన మా గ్రామమైన ఆకివీడు ఆర్జంటుగావెళ్ళవలసిన అవసరం ఏర్పడింది.. సరే కదా అని ఆకివీడు బయలుదేరి ప్రయాణం చేసే సమయంలో... కుడికాలు బరువుగా అనిపించడం జరిగింది...అక్కడ ఉన్న వైద్యుల వారిని సంప్రదిస్తే వారు మీకు ఈ ఇబ్బంది తగ్గేంత వరకూ పూర్తి మంచం మీదనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని తెలియచెప్పారు.. నేను ఆకివీడు లోనే ఉండి సుమారుగా ఇరవై రోజులు పూర్తి విశ్రాంతి తీసుకున్నాను...
నాకు తెలిసిన వారికి ఎవరికైనా మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్ధికంగా గానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్న యెడల వారికి మన "తండ్రి" మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఫోటో పంపించి.. వారిని ఫోటో పట్టుకుని మీకు ఉన్న ఇబ్బంది ఏదైతే ఉంటుందో..అది ఆ స్వామివారికి తెలియచేయండి...అలాగే "మేము మా ఇబ్బందులు నుండి బయట పడిన యెడల మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దర్శించుకుని..మీ దగ్గర నిద్రచేసి..పల్లకీ ఉత్సవం లో పాల్గొని...,మీ ప్రసాదం తీసుకుని వస్తాము"..అని నమస్కారం చేసుకోండి... అని చాలా మంది కి చెప్పేవాడ్ని. వారు అలా చేసిన తర్వాత వారు ఆ ఇబ్బందులు నుండి బయట పడడం, అలాగే వారు మ్రొక్కుకున్న ప్రకారం మ్రొక్క చెల్లించడం జరిగింది...
క్రి0దటి సంవత్సరం అనగా 26/12/2019 వ తేదీ ఉదయం 09:00 గంటల సమయంలో నా మొబైల్ ఫోన్ లో ఉన్న స్వామి వారి ఫోటో పట్టుకుని(నా తండ్రి) పాదాల మీద చేయి వేసినాకు ఈ కాలునొప్పి రెండు లేక మూడు రోజుల వ్యవధిలో తగ్గిపోయిన యెడల ఒకటి లేదా రెండు రోజుల సమయం తీసుకుని వచ్చి నా మ్రొక్కులు చెల్లించుకుంటాను అని నమస్కారం చేసుకున్నాను. నేను అడిగిన విధంగా నాకు కాలునొప్పి ని తీసేసారు. సరే కదా అని నేను మరలా పవని నాగేంద్ర ప్రసాద్ గార్కి ఫోన్ చేసి.. "అయ్యా నేను బయలుదేరి వస్తున్నాను నాకు వసతిసౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా" కోరడం జరిగింది...
శనివారం ఉదయం ఆకివీడు నుండి కారు లో బయలుదేరి రావడం తో మళ్ళీ నా కాలు కొంచెం నొప్పి చేసింది. సరే కదా అని ఏదోవిధంగా సర్దుకొని 04/01/2020 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నా *తండ్రి* శ్రీ దత్తాత్రేయ స్వామివారి దగ్గరకు వచ్చాను...నా *తండ్రి* ని చూసాను... శరీరమంతా పులకించిపోయింది. ఏదో తెలియని బాధ. అయినా.." నీ దగ్గరకు రావాలని మీరు ఆజ్ఞాపించారు.. తండ్రీ..నేను వచ్చేసాను అన్నిటికీ నీదే భారం. తండ్రీ..నువ్వుండగా నాకేంటి?"అనుకుంటున్నానే కానీ అప్పుడప్పుడు కాలు నొప్పి చేస్తున్నది...నా త0డ్రి దగ్గరకు వెళ్లే ముందు ప్రసాద్ గారిని కలిసి వారిని సంప్రదించగా వారు ఏర్పాటు చేసిన వసతి గృహానికి వెళ్లి రండి అని వారు చెప్పారు..కానీ.. మేము ముందుగా.. శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తాము అని వారికి చెప్పి నా తండ్రి ని దర్శనం చేసుకున్నాము. అప్పుడు ప్రసాద్ గారు మమ్మల్ని "మీరు తిరిగి ఆరు గంటల ముప్పై నిమిషాల కు రండి. పల్లకీ ఉత్సవంలో పాల్గొనవచ్చును"..అని చెప్పడంతో మేము కూడా వారు చెప్పినట్లుగా హాజరు అయ్యాము.
కొంచెం సేపటికి శ్రీ దత్తాత్రేయ స్వామివారి పూజ పూర్తి అయ్యింది...పల్లకీ ఉత్సవంలో కూడా పాల్గొన్నాము. నా తండ్రి పల్లకీ సేవ కూడా పూర్తి అయ్యింది...పల్లకీ ని లోపలికి తీసుకు వచ్చి గుమ్మం దగ్గర కొంతమంది భక్తులు నా తండ్రి పల్లకీని పైకి ఎత్తి పట్టుకోవడం జరిగింది. అప్పుడు బయట ఉన్న భక్తులు ఒక్కొక్కరు పల్లకీ క్రింద నుంచి లోపలికి వస్తున్నారు. నేను కూడా వారితో కలిసి నా తండ్రి పల్లకీ క్రింద నుండి వచ్చి ఉయ్యాలలో ఉన్న నా తండ్రికి వింజామరంతో కొంత సమయం విసిరి..ఆ తర్వాత కొంచెం ప్రక్కగా వెళ్లి నిలబడ్డాను. అప్పుడు ఒక మగమనిషి దొర్లుకుంటూ వచ్చారు.. అతని చేయి నా కాలు కు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ గట్టిగా తగిలింది..నాకు భరించలేని బాధ వచ్చింది...
పది నిమిషాలు సమయం గడిచిన తర్వాత నా తండ్రి ఆ అవధూత శ్రీ దత్తాత్రేయుడు నాకు ఒక అద్భుతం చేశారు. అది ఏంటో తెలుసా?...నా కాలునొప్పి పూర్తిగా తీసేసారు..."తండ్రీ..ఈ శరీరం లో శ్వాస ఉన్నంతవరకూ మీ చేయి వదలను. మరలా మీరు ఎప్పుడు అజ్ఞాపిస్తే అప్పుడు వచ్చేస్తాను..." అని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని తలుచుకుంటూ..
*జై గురుదత్త-శ్రీ గురుదత్త*
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
ఆలోచనాలోచనాలు
***** ఆలోచనాలోచనాలు ***** అవధాన మధురిమలు ***** శతావధాని శ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రి ***** సమస్యాపూరణములు;---- 1* "" ఉత్తరమున భానుదేవుఁడుదయంబయ్యెన్."" పూరణము---- కం. " నెత్తమ్ములు దళ్కొత్తగ / మొత్తములై యంధతమసములు పోవంగా/ క్రొత్తగ నల్లదె పూర్వ న/ గోత్తరమున భానుదేవుఁడుదయంబయ్యెన్." 2*"" తండ్రీ! యని పిల్చె నొక్క తన్వి స్వనాధున్."" పూరణము;--- "కం. గండ్రయయియల్ల బేరుల / యాండ్రవలెన్నేఁడు సరసమాడెదనంచున్ / పండ్రెండేడుల కొమరుల / తండ్రీ! యని పిల్చె నొక్క తన్వి స్వనాధున్." 3*"" నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్."" పూరణము;----" కం. స్మేరానన యగుచు మణి / స్ఫార ముకురమందు తనదు చాయంగని త / న్జేరెడు చెలికత్తియకున్ / నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్." వర్ణణాంశములు 1* జూదము. --- సీ. ఆదియందు తమాస యామీదఁ బేరాస పిదపను పలుబాస తుదకు మోస దుష్టులతోఁబొత్తు తోరంబుగా హత్తు నభిమానమును మొత్తు నఘము మెత్తు కైపున నాడించు గౌరవము హరించు తప్పుత్రోవల దించు దగవుబెంచు ధనమెల్ల నూడ్చు నిద్రాహారముల మాన్చు మృచ్చులలోఁ జేర్చు మోడ్పుగూర్చు తే.గీ. బిచ్చమెత్తించు నలుగడఁబేరడంచు / జూదమునకు మదిరకును లేదు భేద / మరయ దీని నివారింప నగునుగాని / మేటియగువాడు ప్రేరేపఁజేటుగాదె." 2* సుకవి, దుష్కవులు. సీ. రసమునేగొను బంభరముమాడ్కి సుకవి, దోషములనే గొనునీగ చాయకుకవి, మంచిపోకలనె వీక్షించు నాసుకవి, మెచ్చును చెడ్డపోకలఁజూచి కుకవి. పరకావ్యముల గౌరవము జూపు సుకవి, యయ్యవి యీసడించుఁ బాయకయ కుకవి. కల యర్థములను జక్కగజెప్పు సుకవి, గ్రచ్చులు గొట్టి బల్ సున్నజుట్టు కవి. .. తే. గీ. సార సారస్వతాపగా చంచదూర్మి / చకచకారావ మిళిత హంసకవి సుకవి / శ్రుత్య సహ్య పదానేక రూడ పద్య / గర్గరారావ ఘటితకాక కవి కుకవి. ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అ ధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో) తేది 18--10--2023, బుధవారం, శుభోదయం.
ముల్లోకాలలోనూ సౌఖ్యములుండి
*1962*
*కం*
సజ్జన సాంగత్యంబున
ముజ్జగముల సౌఖ్యముండి మోదము విరియున్.
సజ్జనులతొ వైరంబున
నెజ్జగమందైన తుదకు నెగడరు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మంచి వారి తో కలిసి జీవించడం వలన ముల్లోకాలలోనూ సౌఖ్యములుండి సంతోషం వెల్లివిరియును. మంచి వారి తో శత్రుత్వం వలన ఏ లోకంలో అయినా చివరకు గెలవరు.
*ఉదాహరణ*:-- భారతంలో దుర్యోధనాది కౌరవుల పక్షాన ఉన్న ద్రోణ,భీష్మాది యోధులంతా దుర్మరణం చెందగా శ్రీ కృష్ణ పరమాత్మ పక్షాన ఉన్న పాండవులు చిరవిజయులై రాజసూయయాగం కూడా చేయగలిగారు. దుర్జన సావాసం తాత్కాలిక సుఖములు కలిగించిననూ నిత్యం కాదు, కానీ సజ్జన సాంగత్యం తాత్కాలిక కష్టాలు కలిగించిననూ శాశ్వత సౌఖ్యకరము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
*శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీస్తుతి*
ది:18-10-2023
శా॥
సంతోషించినచో మనోరథములన్ సాకారముం జేసెదో
వింతై యాగ్రహమంద వైభవముం బెంపొందగా జేసెదో
దాంతిం బొందగ జ్ఞానమార్గమును పాదాక్రాంతముం జేసెదో
భ్రాంతుల్దొల్గగ జేయవే జనని! సంప్రార్థింతు నే నెమ్మదిన్ -9
(దాంతి=బ్రహ్మచర్యాది తపఃక్లేశము నోర్చు తనము.)
(జ్ఞానమార్గము=మోక్షజ్ఞానమార్గము)
(నెఱ+మది=నెమ్మది)
శా॥
జ్ఞానమ్మంది చరింతునో విమలమౌ సద్వర్తనన్ బొంది య
జ్ఞానమ్మంది వరింతునో కుటిలమౌ చండాలసంసర్గముల్
నేనావిజ్ఞత నేర్వ లుప్తమతినై నీముందు నిల్చుంటినే
జ్ఞానాజ్ఞానవిచారసారకలితా! జ్ఞానమ్ము నీయంగదే!
*~శ్రీశర్మద*
8333844664
సుభాషితమ్
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
*_శ్లోకమ్-_*
*_రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్_*
*_సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్_*
*_ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే_*
*_తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...._*
*_దక్షిణాముర్తి స్తోత్రమ్-6 -_*
*రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును....అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును....ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును.....ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు..... ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు*....
🧘♂️🙏🪷 ✍️🙏
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం - చతుర్థి - అనూరాధ - సౌమ్య వాసరే* *(18-10-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/wg1ywqeZj5k?si=uDfjv0KkRR6Gnhfb
🙏🙏
⚜ గోవా : ఫర్మాగుడి, పొండా
🕉 మన గుడి : నెం 211
⚜ గోవా : ఫర్మాగుడి, పొండా
⚜ శ్రీ గోపాల్ గణపతి దేవాలయం
💠 పురాతన మరియు ఆధునిక వాస్తుశిల్పం
ఇక్కడి గణేశుడు.
గణేశుడు అంతటా అందరిచే ఆరాధించబడే దేవతలలో ఒకరు. కుల, మతాలకు అతీతంగా భక్తులు వినాయకుడు 'సర్వ దుష్టనాశకుడని' నమ్మకంతో ప్రార్థనలు చేస్తారు.
వినాయకుడికి అంకితం చేయబడిన అటువంటి ఆలయం గోవా ప్రాంతంలో ఫార్మగుడిలో ఉంది.
ఇక్కడి విగ్రహం పంచలోహాలతో తయారుచేయబడింది.
💠 శ్రీ గోపాల్ గణపతి దేవాలయం ఉత్తర గోవాలో ఉంది. పోండా తాలూకాలోని ఫార్మాగుడి వద్ద అందమైన సహజ పరిసరాల మధ్య శ్రీ గోపాల్ గణపతి దేవాలయం అని కూడా పిలువబడే శ్రీ గణేష్ దేవాలయం ఉంది.
⚜ చరిత్ర ⚜
💠 సుమారు 90-100 సంవత్సరాల క్రితం, బండివాడే రాజు సౌంధేకర్ వద్ద పశువుల కాపరి ఉద్యోగం చేస్తున్న హాపో అనే ఆవుల కాపరి అడవిలో రాతి గణేశ విగ్రహాన్ని కనుగొన్నాడు.
అతను కొబ్బరి కొమ్మలతో చేసిన మండపంలో ప్రతిష్టించాడు.
💠 గోవా మొదటి ముఖ్యమంత్రి దివంగత శ్రీ దయానంద్ బందోద్కర్ నిర్మించిన ఆలయంలో 24 ఏప్రిల్ 1966న లోహ మిశ్రమంతో తయారు చేయబడిన విగ్రహం ప్రతిష్ఠించబడింది.
💠 శ్రీ గణేష్ దేవాలయం ప్రాచీన మరియు ఆధునిక వాస్తుశిల్పం రెండింటినీ సంశ్లేషణ చేస్తుంది మరియు భారతీయ ఆలయ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ
🔅 పండుగలు :
ప్రతి మంగళవారం జరిగే ప్రధాన పూజతో పాటు, ఆలయంలో గణేష్ చతుర్థిని కూడా గొప్ప వైభవంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు.
💠 ఆలయం ఉదయం 06:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు మధ్యాహ్నం 03:00 నుండి రాత్రి 08:30 వరకు తెరిచి ఉంటుంది.
💠 పంజిం కదంబ బస్ స్టాండ్ నుండి 26 కి.మీ దూరంలో, వాస్కోడగామా రైల్వే స్టేషన్ నుండి 36 కి.మీ మరియు మార్గోవ్ రైల్వే స్టేషన్ నుండి 22 కి.మీ దూరం
అక్టోబర్ 18,2023*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*అక్టోబర్ 18,2023*
*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *చవితి* రాత్రి 11గం॥25ని॥ వరకు తదుపరి *పంచమి*
*వారం : సౌమ్యవాసరే (బుధవారము)*
*నక్షత్రం* : *అనూరాధ* రాత్రి 08గం॥25ని॥ వరకు తదుపరి *జ్యేష్ఠ*
*యోగం* : *ఆయుష్మాన్* ఉదయం 08గం॥55ని॥ వరకు తదుపరి *సౌభాగ్యము*
*కరణం* : *వణిజ* ఉదయం 11గం॥40ని॥ వరకు తదుపరి *భద్ర*
*రాహుకాలం* : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 11గం॥21ని॥ నుండి 12గం॥08ని॥ వరకు తిరిగి రాత్రి 01గం॥57ని॥ నుండి 03గం॥32ని॥ వరకు
*వర్జ్యం*: రాత్రి 12గం॥14ని॥ నుండి 01గం॥51ని॥ వరకు
*అమృతకాలం* : ఉదయం 09గం॥55ని॥ నుండి 11గం॥32ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹56ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *05గం॥34ని॥*
చరిత్ర-జ్ఞాపకం*
*అక్టోబర్ 17 - చరిత్ర-జ్ఞాపకం*
శ్రీ గురూజీ మరియు రాజు హరి సింగ్‌ల చారిత్రక సమావేశం
1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్యంతో పాటు అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. ఒకవైపు దేశ విభజన కారణంగా పంజాబ్, బెంగాల్ నుంచి సర్వం కోల్పోయి హిందువులు వస్తుంటే మరోవైపు కొందరు వ్యక్తులు భారతదేశంలోనే అంతర్యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. బ్రిటీష్ వారు వెళ్లిపోతూ భారీ కుట్ర పన్నారు. వారు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరవచ్చు లేదా వారి కోరిక మేరకు స్వతంత్రంగా ఉండవచ్చని అన్ని రాచరిక రాష్ట్రాలకు హక్కును ఇచ్చారు.
ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని, భారతదేశంలోని కొన్ని రాచరిక రాష్ట్రాలు పాకిస్తాన్‌లో చేరాలని లేదా స్వతంత్రంగా ఉండాలని భావించాయి. సర్దార్ పటేల్ సామ, దానం, దండ మరియు భేద సహాయంతో అటువంటి రాచరిక రాజ్యాలన్నింటినీ భారతదేశంలో విలీనం చేశాడు; కానీ ప్రధాన మంత్రి నెహ్రూ జమ్మూ మరియు కాశ్మీర్ విలీనం ప్రశ్నను ఒక్క దానిని తన చేతుల్లోకి తీసుకున్నారు; ఎందుకంటే వారి పూర్వీకులు కాశ్మీర్ నివాsuలు .దీనితో పాటు, అక్కడ పాకిస్తాన్ ప్రేమించే ముస్లిం నాయకుడు షేక్ అబ్దుల్లాతో అత్యంత వ్యక్తిగత మరియు లోతైన సంబంధాలను కలిగి ఉన్నాడు. వారు అతనిని కూడా కట్టడి చేయాలనుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ రాచరిక రాష్ట్రానికి చెందిన రాజు హరి సింగ్ అనిశ్చిత స్థితిలో ఉన్నాడు. పాకిస్తాన్‌లో చేరడం వల్ల తమ రాష్ట్రంలోని హిందువుల భారీ ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం జరుగుతుందని వారికి తెలుసు; కానీ నెహ్రూజీతో ఉన్న చేదు సంబంధాల కారణంగా, అతను భారతదేశానికి రావడానికి వెనుకాడాడు. స్వతంత్రంగా ఉండటం కూడా ఒక ఎంపిక; కానీ ఇదే జరిగితే జిత్తులమారి పాకిస్థాన్ దాడి చేసి పట్టుకోవడం ఖాయం. జిన్నా, షేక్ అబ్దుల్లా ఈ కుట్రను అల్లుతున్నారు.
కాశ్మీర్ లోయలోని కొంతమంది ముస్లింలను మినహాయించి, మొత్తం రాష్ట్ర ప్రజలు భారతదేశంలో చేరాలని కోరుకున్నారు. ఈ రాష్ట్రంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క సంఘచాలక్, పండిట్ ప్రేమనాథ్ డోగ్రా, కాశ్మీర్ యొక్క అనేక సామాజిక మరియు రాజకీయ సంస్థల తరపున, భారత దేశం తో కలవడానికి ఆలస్యం చేయవద్దని మరియు పాకిస్తాన్ తో విలీనంపై సంతకం చేయవద్దని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించి రాజుకు పంపారు. పంజాబ్ సంఘచాలక్ బద్రీదాస్ జీ స్వయంగా రాజును కలిశాడు; కానీ రాజు కంగారు పడ్డాడు.
మరోవైపు పాకిస్థాన్, కశ్మీర్ లోయ ముస్లింల ధైర్యం పెరుగుతోంది. ఆగస్ట్ 14, 1947న, శ్రీనగర్‌లోని పోస్ట్ మరియు టెలిగ్రాఫ్ ఉద్యోగులు పోస్టాఫీసులో పాకిస్తాన్ జెండాను ఎగురవేశారు. ఈ కుట్రలన్నీ సంఘ్ స్వయంసేవక్ లకు తెలుసు. రాత్రే ఆ జెండాను దించేశారు. అంతే కాదు వేలాది త్రివర్ణ పతాకాలను సిద్ధం చేసి నగరమంతటా పంచిపెట్టారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా, పాకిస్థాన్ మద్దతుదారుల ముఖాలు పాలిపోయాయి.
ఇక్కడ సర్దార్ పటేల్ చాలా ఆందోళన చెందారు. కాశ్మీర్ విలీన బాధ్యత నెహ్రూజీదే, అందుకే ఆయన నేరుగా ఏమీ చేయలేకపోయారు. చివరగా, అతను సంఘ్ యొక్క సర్సంఘచాలక్ శ్రీ గురూజీని కాశ్మీర్ వెళ్లి రాజు హరి సింగ్‌తో మాట్లాడి విలీనానికి సిద్ధం చేయవలసిందిగా అభ్యర్థించాడు. అక్టోబరు 17, 1947న శ్రీ గురూజీ విమానంలో శ్రీనగర్ చేరుకుని మహారాజా హరిసింగ్‌ను కలిశారు. గురూజీ తో రాజు హరిసింగ్ సమావేశం పలప్రథమై భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి ఆమోదం తెలిపాడు.
శ్రీ గురూజీ శ్రీనగర్‌లో రెండు రోజులు ఉండి అక్టోబర్ 19న ఢిల్లీకి వచ్చారు. దీని తరువాత కూడా అనేక అడ్డంకులు వచ్చాయి ; కానీ చివరకు అక్టోబర్ 26, 1947 న, మహారాజా హరి సింగ్ విలీన పత్రంపై సంతకం చేయడం ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిగా విలీనానికి అంగీకరించారు. ఇంతలో, పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ లోయలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకుంది. రాజకీయ నాయకుల అలసత్వం మరియు ముస్లింల బుజ్జగింపుల కారణంగా, కాశ్మీర్ సమస్య నేటికీ తీవ్రరూపం దాల్చుతూనే ఉంది; కానీ జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు శ్రీ గురూజీ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.
పదిమంది మాటలువిని
*1963*
*కం*
పదుగురి మాటలు విని మరి
పదునగు నీ మార్గమొకటి పరికించదగున్.
పదునగు నీ మార్గములో
పదపడు కష్టములు నీకు బలమిడు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పదిమంది మాటలువిని సరైన నీ మార్గమును సిధ్ధం చేసుకొనవలెను. అటువంటి నీ మార్గం లో కలిగే కష్టాలు నీకు బలమునిస్తాయి.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
భవిష్యత్తు బాగుపడగలదు
*కనీస జ్ఞానం కూడా లేనివాడికి వోటు హక్కు నిచ్చేదాన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యం అనాలి!!?? అప్పుడు తాగుబోతు మందుపోసేవాడినీ,సోమరిపోతు ఉచితంగా డబ్బు ఇచ్చే వాడినే గెలిపిస్తాడు కదా!! సమాజంలో50% పైగా ఇలాంటి వారే ఉంటారు కదా!! ఈ ప్రశ్న ఏ ఒక్క డూ ఎందుకు వేయడు!!?? లక్షసూక్తులు ఒక్క మందుచుక్క తో మరచిపోయే జనాలున్న ఈ రోజుల్లో ధనస్వామ్యం గా మార్చగలిగే ఈ ప్రజాస్వామ్యాన్ని మార్చవలసిన అవసరం లేదా!!?? కనీసం ఒక చిన్న పరీక్ష పెట్టి, మీమీ ప్రాంతాల్లో అసలు రాజకీయ పార్టీ లేవి!!?? అభ్యర్థులెవరు!!?? పాలిస్తున్న పార్టీ ఏమిటి!!? పౌరహక్కులు,విధులు ఏమిటి!!?? ఇలాంటి కనీస జ్ఞానమైనా లేని ప్రతి ఒక్కరికీ వోటు హక్కు ను పప్పు బెల్లాల్లా పంచేస్తే నీతి మంతులైన నేతలు,నిజాయితీ గల ప్రభుత్వాలు ఎక్కడ నుండి వస్తాయి!!?? ప్రజలంతా ఈ మాటలు ఖచ్చితంగా అమలయ్యేలా చేసే వారి కే వోట్లు వేస్తామని వక్కాణిస్తే భవిష్యత్తు బాగుపడగలదు.*
*జైహింద్.*
నవరాత్రులు ఎందుకు ఎలా వచ్చాయో
https://youtu.be/B5zXqM4rFT8?si=gCarZ5h0kIqGNoMM
శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న ఈ సమయంలో..ఈ నవరాత్రులు జరుపుకోవలసిన అవసరం గురించి, ఆ జగన్మాతను అర్చించవలసిన విధానం గురించి ఈ ఎపిసోడ్ లో ఎంతో చక్కగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త డా. మసన చెన్నప్ప గారు. ఆ పరాశక్తి లీలలు అనుపమానం. చాలా పవిత్రమైన ఈ నవరాత్రులలో ఆమె గురించి తెలుసుకోవడం పూర్వ పుణ్య విశేషం. నవరాత్రులు ఎందుకు ఎలా వచ్చాయో చెన్నప్ప గారి మాటల్లో నే వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
భక్తిసుధ
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
*_శ్లోకమ్-_*
*_రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్_*
*_సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్_*
*_ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే_*
*_తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...._*
*_దక్షిణాముర్తి స్తోత్రమ్-6 -_*
*రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును....అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును....ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును.....ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు..... ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*శ్రీ విఘ్నేశ్వరుని అనుగ్రహం
*శ్రీ విఘ్నేశ్వరుని అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, శుభోదయ శుభాకాంక్షలతో, మీ శ్రేయోభిలాషి, నిష్ఠల సుబ్రహ్మణ్యం.*
https://youtu.be/FlgFRVHprfs?si=mYH3I9Mt8oq2N9dC
మనస్సుకు స్థిరత్వమును ప్రసాదించు.
*శాంతహో శ్రీ గురుదత్తా*
*మమ చిత్తా శమవీ ఆతా*
*తూ కేవళ మాతా జనితా*
*సర్వథా తూ హితకర్తా*
*భయకర్తా తూ భయహర్తా*
*దండధర్తా తూ పరిపాతా*
*తుజవాచుని న దుజీ వార్తా*
*తూ ఆర్తా ఆశ్రయ దత్తా*
*శాంతహో శ్రీ గురుదత్తా*
*మమ చిత్తా శమవీ ఆతా*
శ్రీ గురుదత్తా! శాంతించు. నా మనస్సుకు స్థిరత్వమును ప్రసాదించు.
నువ్వే నా తల్లివి, తండ్రివి. ఎల్లప్పుడూ నా శ్రేయస్సును కోరేవాడవు నీవే! భయపెట్టేదీ నువ్వే, భయాన్ని పోగొట్టేదీ నువ్వే! దండమును ధరించి, పరిపాలించేదీ నువ్వే. నిన్ను తప్ప నేను కోరుకునే వస్తువు ఏదీ లేదు. ఆర్తితో ప్రార్థించినవారికి ఆశ్రయమిచ్చేది నువ్వే!
శ్రీ గురుదత్తా! శాంతించు. నా మనస్సుకు స్థిరమును ప్రసాదించు.
రచన : *పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి.*
Modern Digital Inventions
👌 *O M G ! Where this Modern Digital Inventions will Lead us.? Now You Can Carry DRONE in Your Pocket & Use it Easily for Various ACTIVITIES! Great..!* 👌🎻😛🙏☕🎻
యువ తరం
*యువ తరం ఎటువైపు పయనిస్తోంది*?
ఇది *డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కాదు కోరమంగళలో డ్రగ్ అడిక్ట్ కేసు*! పోలీసులకు అప్పగించిన తల్లిదండ్రులు.!
తల్లిదండ్రులూ ..మీకు ఎన్ని పనులు ఉన్నా .. దయచేసి మీ పిల్లలపై దృష్టి పెట్టండి. ఆధునికత పేరుతో అనేక పోకడలకు పోతున్న యువత పెడదోవపడుతోంది. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే...!
దసరా పండుగ మహోత్సవాలు
కర్ణాటకలో దసరా పండుగ మహోత్సవాలు ఏంతో వేడుకగా జరుగుతాయి వరల్డ్ ఫేమస్ అటువంటి ఉత్సవాలని జరుపుకోవాలంటే లంచాలు ఇచ్చి జరుపుకోవాలంటే లేదంటే జరుపనియ్యము అని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతోందంట హిందూ బంధువులారా గమనించండి కాంగ్రెస్ హిందూసంస్కృతిని హిందువులను సర్వనాశనము చెయ్యడానికి పూనుకొంది మీకేమో ఫ్రీగా పథకాలు ఇస్తామంటే పార్టీతో పనిలేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ఓటు వేస్తారు మీకు అభివృద్ధి పట్టదు పిల్లల భవిష్యత్తు పట్టదు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినప్పటినుండి ఎంతమంది హిందువుల ప్రాణాలు మరకలు గాల్లో కలిపేశారు btv లో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ వీడియో చూసి తరించండి. జైశ్రీరామ్. జైహింద్. రాజారెడ్డి. ఏటీపీ.
భక్తిసుధ
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
*_శ్లోకమ్-_*
*_రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్_*
*_సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్_*
*_ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే_*
*_తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...._*
*_దక్షిణాముర్తి స్తోత్రమ్-6 -_*
*రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును....అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును....ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును.....ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు..... ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
నవగ్రహా పురాణం🪐* . *57వ అధ్యాయం*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *57వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*కేతుగ్రహ జననం - 2*
కశ్యప పత్ని దనూదేవి ఆతృతగా ఆశ్రమంలోకి వచ్చింది. ఆమె చేతుల్లో ఒక చిన్నారి శిశువున్నాడు.
*"స్వామీ ! స్వామీ !"* అంటూ భర్తను పిలిచిందామె.
*"ఏమిటి దనూ !"* అంటూ వచ్చాడు కశ్యపుడు.
*"చూశారా ! చూశారా ! బాలుడు ! ఆశ్రమం వెనక తోటలోని ముళ్ళ పొద నీడలో హాయిగా ఆడుకుంటూ , పరవశంగా ఉన్నాడు !".
*"ఎవరి బిడ్డదో..."* కశ్యపుడు బాలుడిని చూస్తూ అన్నాడు.
*"నాకు దొరికాడు కాబట్టి నా బిడ్డడే ! చూడండి... ఆ ముఖమూ , ఆ కళ్ళూ... అన్నీ నా బిడ్డలకు లాగానే ఉన్నాయి !"* దనూదేవి ఉత్సాహంగా అంది. *"వీడు నా బిడ్డడే ! ఏమిటలా చూస్తున్నారు ! నా బిడ్డడే ! నేను పెంచుకుంటాను !"*
*"సరే ! ఎవరు కాదన్నారు ! అంతా దేవేచ్ఛ కదా !"* కశ్యపుడు చిరునవ్వుతో అన్నాడు.
*" పిల్లవాడికి... పేరు ?"* దనూ దేవి ఆవేశంగా అడిగింది. *“చక్కటి పేరు పెట్టండి !”*
*"పేరు...ఏ పేరు పెట్టమంటావు ?"* కశ్యపుడు ఆలోచిస్తూ అన్నాడు.
*"కేతువు అని సృష్టికర్త బ్రహ్మదేవులు పెట్టేశారుగా !"* లోపలికి వస్తూ అన్నాడు. నారదుడు.
*"నారద మునీంద్రా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు.
*“నారాయణ ! ఆ విషయం చేరవేయడానికి వచ్చాను. బాలుడికి నామకరణం చేశాక , మీకు అందేలా చూశారు మా జనకులు. మీ బిడ్డగా స్వీకరించి , పోషించి , ప్రయోజకుణ్ణి చేయమన్నారు !"*
*"అలాగా ! మహా భాగ్యం !"* కశ్యపుడు చేతులు జోడించాడు.
*"అందుకేనేమో వీణ్ణి చూడగానే నా బిడ్డడే అనిపించి , స్తన్యం కురిసింది!"* అంటూ లోపలకి వెళ్ళింది దనూదేవి ఉత్సాహంగా.
రోజులు కాలాన్ని ఖండిస్తూ తమ గణన కార్యాన్ని కొనసాగిస్తున్నాయి. దనూదేవి పెంపుడు కొడుకు కేతువూ , సింహిక కుమారుడు రాహువు ఒకరిని వదిలి మరొకరు. ఉండలేనట్లు మసులుతున్నారు.
రాహుకేతువుల సాహచర్యం నేల మీద పాకే వయస్సులోనే మొగ్గ తొడిగింది ! ఇద్దరూ జంటగా పాకడం ప్రారంభించారు. ఇద్దరూ ఒకరిపక్కనొకరు దోగాడసాగారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని తప్పటడుగులు వేశారు.
కశ్యప మహర్షి రాహువు కేతువులకు విద్యాభ్యాసం ఆరంభించారు. విద్యార్జనలో కూడా అంతే ! ఒకరికి చెప్తే చాలు - మరొకరు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన దనూదేవికి సందేహం కలిగించింది. ఒకనాడు భర్తతో ఇలా అంది.
*"స్వామీ ! కన్నబిడ్డతో సమానంగా కేతువుకి పాలిచ్చి పెంచాను కద ! బాలుడు నా బిడ్డలతో కలిసి మెలిసి ఉండడానికి మారుగా , ఆ సింహిక బిడ్డడితో కలిసిపోయాడెందుకు ?"*
*“వాడి చిన్ని మనసులో ఏముందో , ఎవరికి తెలుసు ! కేతువు ఒక్కడే కాదు సుమా , రాహువుని చూడు ! వాడు కూడా కేతువు నీడలా ఉంటున్నాడు ! ఇద్దరి మధ్యా మనకు అర్ధం కాని అజ్ఞాత సంబంధం ఏదైనా ఉందేమో !”* అన్నాడు కశ్యపుడు.
దనూదేవి సాలోచనగా తల పంకించింది.
*"రాహుకేతువులిద్దరూ అన్యోన్యంగా పెరగాలనీ , రాణించాలనీ బ్రహ్మదేవుల సంకల్పం అయి ఉండవచ్చు. ఎందరో మానస పుత్రులూ , వారి సంతతులూ ఉండగా ఈ కశ్యపుడికే ఆ అవకాశం ఎందుకు వరించింది ? కేతువు మన పోషణలో పెరగాలన్న లక్ష్యం కన్నా , రాహుతో కలిసి మమేకంగా పెరగాలన్న సంకల్పమే అందుకు కారణమనిపిస్తోంది సుమా !"* కశ్యప మహర్షి విశ్లేషించాడు.
*"ఏది ఏమైనా అదంతా నా అదృష్టమే !"* దనూదేవి సగర్వంగా అంది.
రాహుకేతువులు యువకులయ్యారు. రాహువు సింహిదేవి అనే స్త్రీని , కేతువు చిత్రలేఖనూ పత్నులుగా స్వీకరించారు.
కాలక్రమాన సింహిదేవీ రాహు దంపతులకు 'మేఘహాసుడు' అనే కుమారుడు. జన్మించాడు.
రాహుకేతువుల సహోదరానుబంధం వాళ్ళతో పాటే వృద్ధి చెంది , వికసిస్తూనే ఉంది.
నిర్వికల్పానంద నవగ్రహాల జన్మవృత్తాంతాల కథనం ముగించి ఇలా అన్నాడు. శిష్యులతో. *"ఇప్పటి దాకా మనం నవగ్రహాల పుట్టుకల గురించి తెలుసుకున్నాం. అయితే , మన నిత్య వ్యవహారంలో , జాతక గణనంలో పేర్కొంటున్న 'సూర్య , చంద్ర , కుజ , బుధ , గురు , శుక్ర , శని , రాహు , కేతు' అనే క్రమంలో కాకుండా వాళ్ళ ఆవిర్భావ క్రమంలో శ్రవణం చేశాం*
*"నవగ్రహాల ఆవిర్భావాలలో లాగే , వాళ్ళ చరిత్రలలో కూడా ఆసక్తిని రేకెత్తించే అద్భుత సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనల సమాహారంగా , ఆ గ్రహదేవతల చరిత్రలను సూర్యుడి నుండి కేతువు దాకా , మనం స్మరించే వరస క్రమంలో శ్రవణం చేద్దాం.”*
*"ముందుగా సూర్య గ్రహ చరిత్ర ఒక్క సారి గుర్తుచేసుకుంటే , శివానందా ! సూర్యుడి తల్లిదండ్రులు ఎవరో గుర్తున్నారా ?”* అంటూ అడిగాడు చిరునవ్వుతో నిర్వికల్పానంద.
*"అదితీ , కశ్యపులు గురువుగారూ !"* శివానందుడు సమాధానం చెప్పాడు.
*"చిదానందా , నువ్వు చెప్పు , సూర్యపత్ని ఎవరు ?”* నిర్నికల్పానంద అడిగాడు.
*"విశ్మకర్మ పుత్రిక - సంజ్ఞ గురువుగారూ..."* చిదానందుడు అన్నాడు. *''సంజ్ఞ తన నీడను 'ఛాయ' అనే పేరుతో తన స్థానంలో సూర్యుడి భార్యగా నియమించింది !"*
*"బాగుంది !"* నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. *“ఇప్పుడు సంజ్ఞ బిడ్డలు ఎవరో , ఛాయ బిడ్డలు ఎవరో మన శివానందుడూ , విమలనందుడూ చెప్తారు !”*
*"వైవస్వతుడు , యముడు , యమి - సంజ్ఞ సంతానం , గురువుగారూ !"* శివానందుడు గుర్తు చేసుకుంటూ అన్నాడు.
*"ఛాయ సంతతి శనైశ్చరుడు , సావర్ణి , తపతి !"* విమలానందుడు చెప్పాడు.
*"గుర్తుంచుకున్నారు. సంతోషం !”* నిర్వికల్పానంద అన్నాడు. సంజ్ఞకూ , ఛాయకూ జన్మించిన సూర్యుని సంతానం ఆరుగురూ ఛాయ పోషణలో పెరుగుతున్నారనీ , సంజ్ఞ బిడ్డల పట్ల ఛాయ ప్రేమ తగ్గుముఖం పట్టిందనీ చెప్పుకున్నాం కదా ! ఇక వినండి ! ఒక రోజు ఏమైందంటే...
*ఇప్పటి వరకు నవగ్రహల జననం గురించి చదువుకున్నాము రేపటి నుండి నవగ్రహల చరిత్ర ప్రారంభం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 67*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 67*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
'భగవంతుడు లేడు; ఒకవేళ ఉన్నప్పటికీ, ఆయనను గురించి చింతనచేసి ప్రయోజనం లేదు' అని నిరూపించడానికి నేను ప్రయత్నించడంతో నేను నాస్తికుజ్జయిపోయాను, దుష్టులతో కలిసి మధుపానం చేస్తున్నాను, వెలయాళ్ల ఇంటికి పోతున్నానని ఏ మాత్రం సంశయించకుండా మాట్లాడసాగారు!
ఎవరికీ అణగిమణగి మెలగే నైజం చిన్నతనం నుండే నాకు లేదు. అది ప్రస్తుతం తప్పుడు పుకారు వలన ఘనీభవించి కరడుగట్టింది. 'ఈ దుఃఖమయమైన సంసారంలో ఏదో కొంతసేపయినా ఆ దుఃఖాలను మరచిపోవడానికి మధుపానం చేయడమో, వెలయాళ్ల వద్దకు వెళ్లడమో కించిత్తు కూడా తప్పు కాదు. ఈ రీతిలో సుఖం లభిస్తుందని నాకు నిశ్చయంగా తెలిస్తే ఎవరికీ భయపడకుండా నేనూ ఆ మార్గాన్ని అనుసరిస్తాను' అంటూ వాళ్లు అడగకుండానే అందరితోను చెప్పసాగాను.
"ఈ వార్త గాలికన్నా వేగంగా వ్యాపించింది. శ్రీరామకృష్ణులకూ, ఆయన భక్తులకు చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజం తెలుసుకోగోరి కొందరు వచ్చారు. 'శిక్ష పడుతుందని భయపడి భగవంతుణ్ణి విశ్వసించడం పిరికి తనం' అంటూ ఉద్వేగంతో చెప్పి హ్యూమ్, పెయిన్, మిల్, కామ్టేలాంటి పలువురు పాశ్చాత్య తాత్వికులను ఉదాహరణగా చూపి, 'భగవంతుడు ఉన్నాడనడానికి ఎలాంటి ఆధారమూ లేదు' అంటూ తీవ్ర ఉద్వేగంతో వాదించాను. సంస్కరించ లేనంతగా నేను చెడిపోయాను అని నిశ్చయించుకొని వారు వెళ్లిపోయారు. నాకు చాలా సంతోషం కలిగింది.
"శ్రీరామకృష్ణుల గురించి ఆలోచన మెదలినప్పుడు మనస్సు సందిగ్ధావస్థలో పడిపోయింది. ఇవన్నీ విని ఆయన కూడా బహుశా నమ్ముతారేమోననిపించింది. ఒక్క క్షణమే, 'ఇలాంటి నిరాధారమైన పుకార్లు విని నేనెటువంటి వాడినో ఆయన నిర్ధారణ చేసే పక్షంలో అలాగే చేసుకోనీ, నేను కలత చెందును అని మరుక్షణమే సరిపెట్టుకొన్నాను. కాని ఆయన దీనికి ఎలా స్పందించారో విని ఆశ్చర్యపోయాను. మొదట ఆయన ఎలాంటి బదులు చెప్పలేదు.
ఆ తరువాత భవనాథ్ విలపిస్తూ, 'మహాశయా! నరేంద్రుడు ఇంతగా దిగజారిపోతాడని నేను కలలో సైతం ఊహించలేదు' అని చెబుతున్నప్పుడు ఆగ్రహంతో, 'మూర్ఖుడా! వాగ బోకు! నోరు ముయ్యి. నరేంద్రుడు ఆ రకంగా వ్యవహరించడని జగజ్జనని నాతో చెప్పింది. ఇలాగే నువ్వు మరోసారి మాట్లాడావంటే నీ ముఖం కూడా చూడను' అని అతడితో నిష్కర్షగా చెప్పారట.
"కాని అహంకరించి ఈ విధంగా నాస్తికులమైతే ఏం ప్రయోజనం? చిన్న తనం నుండి, అందునా ప్రత్యేకించి శ్రీరామకృష్ణులను దర్శించాక నేను పొందిన అద్భుతమయిన దివ్యదర్శనాలు నా హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తు న్నాయి కదా! కనుక, 'నిశ్చయంగా భగవంతుడు ఉన్నాడు. ఆయనను సాక్షాత్కరించుకొనే మార్గమూ ఉంటుంది. లేకపోతే జీవించనవసరం లేదు.
అన్ని దుఃఖాలకూ, ఆటంకాలకూ మధ్య ఆ మార్గాన్ని కనుగొనే తీరాలి' అని భావించాను. ఈ విధంగా రోజులు దొర్లిపోసాగాయి. మనస్సు సందేహానికీ స్పష్టతకూ మధ్య ఊగిసలాడింది. మెల్లమెల్లగా ప్రశాంతత వైదొలగిపోసాగింది, దారిద్య్రమూ ఏ విధంగాను తగ్గేటట్లు కనిపించడం లేదు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 57*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 57*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పలరుచా*
*దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే |*
*అనేనాఽయం ధన్యో భవతి న చ తే హానిరియతా*
*వనే వా హర్మ్యే వా సమకరనిపాతో హిమకరః ‖*
అమ్మా, దరదలిత నీలోత్పల రుచా = అరవిరిసిన నల్ల కలువల వలెనున్న నీ నేత్రముల నుండి
స్నపయ కృపయా = నీ దయను నాపై వర్షించు
దవీయాంసం దీనం = దూరంగా, దీనంగా వున్న నన్ను, అనగా భగవచ్చింతనకు దూరమైన నన్ను అని భావం.
దృశా ద్రాఘీయస్యా = ఎంత దూరమైనా ప్రసరింపజేయగల శక్తి కలిగిన నీ చూపులను అమ్మవారివి విశాల నేత్రాలు కదా!
కృపయా మామపి శివే = అమ్మా శివే, దయతో నాపై కూడా ప్రసరింపజేయి తల్లీ!
అనేనాయం ధన్యో భవతి = అనేన అయం ధన్యో భవతి అడుగుతున్న వీడు ధన్యుడై పోతాడు.
న చ తే హానిరియతా = నీకు ఇసుమంత కూడా నష్టము లేదు. ఎలాగంటే
వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః = వెన్నెల పెద్ద భవనం పైననూ, అడవి పైననూ ఒకే విధముగా ప్రసరించినట్లు మహాయోగులపై నీ కరుణను ఎలా ప్రసరింపజేస్తావో దూరంగా దీనంగా వున్న నాపై కూడా అలాగే ప్రసరింపజేయి తల్లీ అని భావము.
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹.
వేద ఆశీర్వచనం.
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం - చతుర్థి - అనూరాధ - సౌమ్య వాసరే* *(18-10-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/wg1ywqeZj5k?si=uDfjv0KkRR6Gnhfb
🙏🙏