9, జులై 2024, మంగళవారం

మీరు భాగస్వాములు కండి

మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు


తెలుగు వంటకములు

 🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏


పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు

కాకినాడ కాజ కజ్జికాయ

బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న

తీయనైన భాష తెలుగు భాష!


మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు

తాటిముంజలు మేటి సీతాఫలాలు

మెరయు చక్కెరకేళి మాధురులకన్న

తీయనైనది నా భాష తెలుగు భాష!


పెసర పిండి  పైన  ప్రియమగు నల్లంబు

దాని పైన మిర్చి దద్దరిల్ల 

జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు   

సాటి తెలుగు  భాష మేటి భాష


స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు

తాగ లెక సురులు ధరణి లొన 

ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు     

ఆవ కాయ కొఱకు నంగలార్చి.


కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు

రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ 

కారమింగువలను  తగిలించి తిను వాడు 

ఘనుడు తెలుగు వాడు కాదె భువిని


ఆట వెలది యనిన అభిమానమెక్కువ

తేట గీతి యనిన తియ్య దనము

సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు

కంద పద్యమెంత సుందరమ్ము !! 


తెలుగు భాష.. తెలుగు వంటకములు, తెలుగు తీపి👍🤝👍

ప్రసాదం తింటారా

 అజ్మీర్ రైల్వే స్టేషన్ ఆరోజు చాలా రద్దీగా ఉంది. ఒక బెంచీ వద్ద బురఖా ధరించిన ఒక ముస్లిం స్త్రీ, ఒక హిందూ యువకుడు ఉన్నారు.


ఆమె అతనిని అడిగింది: మీరు అజ్మీర్ వాసులా? లేక చూడడానికి వచ్చారా?


అతను అన్నాడు: నా తల్లి దండ్రులతో పుష్కర్ లోని బ్రహ్మ దేవుని ఆలయం చూడడానికి వచ్చాను. (బ్రహ్మ దేవుని కి ఆలయం అక్కడే ఉంది. మరెక్కడా లేదు)


ఆమె అడిగింది: మరి అజ్మీర్ షరీఫ్ దర్గా దర్శనం చేసుకున్నారా? అని. (బ్రహ్మ దేవుని ఆలయం కు వచ్చిన హిందూ యాత్రికులు అందరూ దర్గా కి కూడా వెళ్లి, అక్కడ కూడా దణ్ణం పెట్టుకోవడం ఆనవాయితీ)


యువకుడు ఆమెను అడిగాడు : మీరు ఎప్పుడైనా బ్రహ్మ దేవుని ఆలయం దర్శించారా?


ఆమె ముఖం ముడుచుకుని, వారి అల్లాను ఒకసారి తలుచుకుని, మేము అలా ఇతర మతస్తుల గుడులకు వెళ్లడానికి మా మతం ఒప్పుకోదు, అని చెప్పింది.


అలాంటప్పుడు మేము మాత్రం ఎందుకు వెళ్లాలి? అని ప్రశ్నించాడు యువకుడు.

 దాంతో ఆమెకు ఒళ్ళు మండి, యువకునిపై, అతని తల్లికి ఫిర్యాదు చేసింది:


 చూడండి, మీ అబ్బాయి లాంటి వ్యక్తుల వల్లనే దేశం లో సర్వమత సౌభాతృత్వం కు విఘాతం కలుగుతోందని.


తల్లి చిరునవ్వు తో జవాబు ఇచ్చింది ఇలా: మాలాంటి హిందువుల వల్లనే ఈ దేశంలో సర్వమత సమానత్వం ఉంది, మేమే గనుక మా పిల్లలకు ఆ దర్గాలో, సమాధిలోని ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ , ముస్లిం మతంలోకి మారడానికి నిరాకరించిన హిందూ రాజు పృధ్వీరాజ్ చౌహాన్ ను ఎలా హింసించినదీ, అతని భార్య సంయోగిత ను వివస్త్రను చేసి అందరిముందూ బలాత్కారం ఎలా చేసినదీ వివరిస్తే ఏ హిందువు ఆ దర్గా కి వెళ్లి తలవంచి నమస్కరించడు - అన్నది.


పృధ్వీరాజ్ దయగల హిందూ రాజపుత్ర రాజు. మహమ్మద్ ఘోరీని 17 సార్లు ఓడించి కూడా అతన్ని సంహరించలేదు. కానీ పృధ్వీరాజ్ ఓడినప్పుడు అతని కళ్ళు పొడిపించాడు ఘోరీ. శబ్దభేధి విద్య తెలిసిన పృధ్వీరాజ్ బాణం ఘోరీ కంఠంలో దిగి అతడు చనిపోయాడు.

ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ కూడా పృధ్వీరాజ్ కొడుకుల చేతిలో చనిపోయాడు.


ముస్లిం సైనికులు పృధ్వీరాజ్ భౌతిక కాయాన్ని ఆఫ్ఘనిస్తాన్ తరలించి అక్కడే సమాధి చేసారు. ముస్లిం ఆచారం ప్రకారం రోజూ ఆ సమాధి ని చెప్పులతో కొట్టేవారు.


ఈ విషయం తెలిసి షేర్ సింగ్ రాణా అని రాజపుత్ర వీరుడు ఆ దేశం వెళ్లి, పృధ్వీరాజ్ కు దహన సంస్కారాలు చేసి, తిరిగి వచ్చి ఆ అస్తికలను గంగా నదిలో కలిపాడు. ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ తన జీవిత కాలంలో 90 లక్షల మంది హిందువులను ముస్లింలుగా మార్చాడని వారు అతనిని కీర్తిస్తారు.


 అతనే ఘోరీ ని ఉత్సాహ పరిచాడని కూడా చెబుతారు. అలాంటి వాడి సమాధికి రోజూ వందలాది మంది హిందువులు వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.


ముస్లిం లకుగానీ, క్రైస్తవుల కుగానీ లేని ఈ సర్వమత సమానత్వం మనకు మాత్రం ఎందుకు?


వారి పండగలకు మన వాళ్ళు వెళ్లి, వాళ్ళ మతానికి జై కొట్టి, వాళ్ళు పెట్టింది తిని వస్తున్నారు. మన పండగలకు ఇతర మతాల వారు వచ్చి, మన చేత బొట్టు పెట్టించుకుని, మనం పెట్టిన ప్రసాదం తింటారా?


హిందూ దేవాలయాలపై పెత్తనం చేసే మన రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర మతాల దేవాదాయాల విషయంలో వేలు పెట్టగలవా?

ఎందుకు మనకీ " సెక్యులర్" పదం?


ధర్మో రక్షతి రక్షితః

వివేక చూడామణి

 *వివేక చూడామణి విశిష్టత* 


అద్వైత సిద్ధాంతాన్ని సుస్పష్టం గా తెలియ చెప్పడానికి శ్రీ ఆదిశంకర భగవత్పాదులు రచించిన ఉత్తమ గ్రంథాలలో వివేక చూడామణి కూడా ఒకటి. ఈ గ్రంథంలో ఆయన వివిధ సిద్ధాంతాలు వాటి యొక్క అన్ని దశలను సంక్షిప్తంగానే కాకండా స్పష్టంగా వివరించారు. ప్రధానంగా ఈ గ్రంధంలో వేదాంత తత్త్వాన్ని తెలుసుకోవటానికి కావలసిన యోగ్యతను, జ్ఞాని అయిన శిష్యుడు తన గురువుని తత్త్వాన్ని అడిగే విధానాన్ని, అటువంటి శిష్యునికి తత్త్వాన్ని సక్రమంగా బోధించే గురువుయొక్క న్యాయాన్ని చెప్పారు. 

మన పరమ గురువు జగద్గురువులు శ్రీశ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఈ గ్రంథంపై చక్కని ఉపన్యాస భాష్యం రాశారు. దాని ద్వారా ఈ గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. శ్రీ శంకర భగవ త్పాదులు ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని చివరి శ్లోకంలో చెప్పారు.

అంటే మోక్షమార్గం గురించి ఈ గ్రంథంలో చెప్పబడింది. అంటే, భగవత్ భక్తులకు ఆ మార్గం గురించి ప్రధానంగా చెప్పారు.

మోక్షం పట్ల ఆసక్తి ఉన్నవాడు విషంలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టాలి. తృప్తి, దయ, ఓర్పు, నిజాయితీ, శాంతి, నియంత్రణ ఇత్యాది విషయాలను అమృతాన్ని సేవించినట్లే అలవర్చుకోవాలి. ఈ యోగ్యతను పొందినవాడు మాత్రమే మోక్షమార్గంలో ప్రవేశించగలడని అర్థం. 

ఎన్నో అద్భుతమైన విషయాలతో కూడిన ఈ వివేకచూడామణిని అందరూ చదవండి. బాగా అర్ధంచేసుకుని భగవత్ ప్రసాదమైన ఈ జీవితానికి న్యాయం చేయండి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

వేదాలలో సత్యమే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


       శ్లో𝕝𝕝 *సత్యం వేదేషు జాగర్తి*

            *ఫలం సత్యే పరం స్మృతమ్* l

             *సత్యాద్ధర్మో దమశ్చైవ* 

            *సర్వం సత్యే ప్రతిష్ఠితమ్* ll


             *... _మహాభారతమ్_ …*


తా𝕝𝕝 "వేదాలలో సత్యమే నిలచి ఉంటుంది. సత్యఫలమే శ్రేష్ఠమైన ఫలం.... సత్యం ద్వారానే ధర్మం, ఇంద్రియ నిగ్రహం కలుగుతాయి..... *సర్వమూ సత్యము మీదనే ఆధారపడి నిలుస్తుంది"* ....

_జూలై 9, 2024_*

 ॐశుభోదయం  ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

     *_జూలై 9, 2024_*  

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*గ్రీష్మ ఋతువు*

*ఆషాఢ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *చవితి* పూర్తి

వారం: *భౌమవాసరే*

నక్షత్రం: *ఆశ్రేష* ఉ7.51

*మఖ*

యోగం: *సిద్ధి* తె3.04

కరణం: *వణిజ* సా5.58

వర్జ్యం: *రా8.50-10.34*

దుర్ముహూర్తము: *ఉ8.10-9.02*

*రా10.58-11.42*

అమృతకాలం: *లేదు*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *మిథునం*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.35*

సూర్యాస్తమయం: *6.35*

 లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

భగవంతునిపై నమ్మకం*

 *భగవంతునిపై నమ్మకం*


ఆ గురువుగారు ఎల్లప్పుడు అంటే వారానికి ఒక సారైనా సత్సంగాన్ని నిర్వహిస్తూనే వుంటారు. వారికి ఆ కాలనీలో ఎందరో శిష్యులు ఉన్నారు. గురువు గారు ఏదో కాషాయ వస్త్రాలు ధరించిన వారు కాదన్నట్టు. శిష్యులంటే ఆ కాలనీ వాస్తవ్యులే. ఆ గురువు గారు ఆధ్యాత్మికంగా ఎంతో విలువైన విజ్ఞానాన్ని సముపార్జించినవారు. ఆ శిష్యబృందం అంతా వయోవృద్ధులు, వారి ప్రవచనాలకు చెవి కోసుకొంటారు. 


ఒకానొక సత్సంగ సమయాన్న ఒక వ్యక్తి కనబడలేదు. వెంటనే వాకబు చేయగా వారు కొంత అస్వస్థతకు లోనయ్యారని ఇంకా కోలుకోవడానికి సమయం పట్టగలదని తెలిసింది. 


వెంటనే గురువు గారు ఆనాటి సత్సంగ సమయాన్ని ఆ అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రులు త్వరగా  కోలుకోవడానికి ప్రార్థిద్దాం అని చెప్పగా అందరూ సరేనని భగవత్ప్రార్థనలో నిమగ్నమయ్యారు. అంటే ఆ మిత్రుని తలుచుకుంటూ వారి ఆరోగ్యం కుదుట పడాలని ఆలోచిస్తూ కొద్ది సేపు కళ్ళు మూసుకొని మౌనంగా భగవంతుని వేడుకొన్నారు. 


ఆ సత్సంగంలో ఒకానొక సభ్యుడికి ఇలాంటివాటిపై నమ్మకం లేదన్నట్టు. వెంటనే వారు మీరందరూ వేడుకున్నంత మాత్రాన వారు కోలుకోగలరా అని వేళాకోళం చేసారు. 


అంతే, ఆ గురువుగారు కోపం ప్రదర్శిస్తూ ఆ సభ్యుడితో మీకేమైనా మతి పోయిందా, ఏదో ఒక మంచి పనిచేయడానికి పూనుకొంటే ఇలా అపశకునంగా మాట్లాడటమేంటి, మీకు భగవంతునిపై  నమ్మకం లేకపోతే ఇక మీదట మీరు రానక్కరలేదు అని చెడామడా చెప్పేసారు. 


ఆ సభ్యుడు కూడా మిక్కిలి కోపంతో నాకు బుద్ధి లేదంటారా, మీరు క్షమాపణ అడగకపోతే మిమ్మల్ని నేను కొట్టగలను సుమా అని అరిచాడు. 


వెంటనే గురువు గారు *నేను కావాలనే లేని కోపాన్ని ప్రదర్శిస్తూ కేవలం మీకు మతిపోయిందానని అడిగినంత మాత్రానే నేను చెప్పింది నిజమన్నట్టు మీకు మతిపోయినట్టే అనుకొని కోపం వచ్చింది కదా, అంటే నా తిట్టుపై నమ్మకం ఉంచికదా నాపై విరుచుకుపడుతున్నారు. మీరు ఇంతగా మాపై విశ్వాసం కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు భగవంతునిపై మాకు నమ్మిక కలగడంలో తప్పేముంది. వారు తప్పక మా ప్రార్థనలకు తొలి ఒగ్గగలరని మాకూ పూర్తి విశ్వాసము ఉంది* అని అన్నారు. 


అంటే భగవంతునిపై నమ్మకం ఉంచి ఏది ప్రార్థించినా తప్పక నెరవేరగలదన్న పూర్తి విశ్వాసం ఎంతైనా అవసరం.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం  -‌ తృతీయ -  ఆశ్రేష -‌‌ భౌమ వాసరే* (09.07.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పరిష్కారం సూచించగలిగే వాడు గురువు🙏.*

 *💥ఓ ఉపాధ్యాయుడు,ఓ పోలీస్ అధికారి,ఓ  బ్యాంక్ అధికారి గారు  ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు.సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు.మిమల్ని తినేస్తా అని పెద్దగా కేకలు పెడుతున్నాడు.*


*ముగ్గురూ భయంతో వణికి పోతున్నారు.వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది.వాళ్ళతో యిలా అన్నాడు,మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రం లోకి విసిరి వేయండి.*

 

*నేను తెచ్చి యిస్తే గెలుపునాదే. వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను.వాళ్లకు నేను జీవితాంతము బానిసగా వుంటాను అన్నాడు.సరే నని* *ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు.*

*సముద్రం లో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు.*

*తరువాత పోలీస్ గారు తన చేతికున్న ఖరీదైన వాచీ ని నీళ్ళలోకి విసిరేశాడు.*


*రాక్షసుడు సముద్రం లోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.*


*ఇంక ఉపాధ్యాయుడి వంతు వచ్చింది.*


*అతను కొంచెం యోచన చేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్ళను సముద్రం లోకి ధారగా పోశాడు.నా మంచి నీళ్ళను నాకు తెచ్చి యివ్వు అన్నాడు.*


*ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగి పోయింది.*

*ఇది ఉపాధ్యాయుడి దెబ్బ ఎలావుంది? అన్నాడు రాక్షసుడితో.*

*రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు.*

*నా స్నేహితుల నిద్దరినీ బ్రతికించు అని ఆజ్ఞాపించాడు,వాడు వాళ్ళని కక్కేశాడు.*


*మంచి పని చేశావు.యింక ఎవ్వరినీ యిలా బాధించకుండా వుంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు. రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రం లోకి దూకి మాయమయ్యాడు. ఎంతటి ఆపద వచ్చిన ఆలోచించే వాడు  ఉపాధ్యాయుడు*

*🙏సమాజానికి సమస్య వస్తే తగు పరిష్కారం సూచించగలిగే వాడు గురువు🙏.*

తమని తాము మెచ్చుకుంటారు

 పద్యం:☝️

*చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు*

*మేలు వచ్చెనేని మెచ్చు తన్ను*

*చేటు మేలు తలప చేసిన కర్మముల్*

*విశ్వదాభిరామ వినురవేమ*


భావం: చెడు జరిగితే దైవాన్ని దూషిస్తారు. మేలు జరిగితే తమని తాము మెచ్చుకుంటారు. జరిగిన చెడు మేళ్ళు, మునుపు చేసిన పాప పుణ్యాల ఫలితాలని గ్రహించలేరు.

పంచాంగం 09.07.2024 Tuesday.

 ఈ రోజు పంచాంగం 09.07.2024 Tuesday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్ల పక్ష తృతీయా తిధి భౌమ వాసర: ఆశ్రేష నక్షత్రం సిద్ది యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ ఉదయం 06:09 వరకు .

ఆశ్రేష ఉదయం 07:53 వరకు.


సూర్యోదయం : 05:52

సూర్యాస్తమయం : 06:51


వర్జ్యం : రాత్రి 09:04 నుండి 10:50 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:28 నుండి 09:20 వరకు తిరిగి రాత్రి 11:15 నుండి 11:59 వరకు.


అమృతఘడియలు : ఉదయం 06:09 నుండి 07:53 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

సామాజిక అన్వయము

 *పురాణ, ఇతిహాస, ప్రాచీన గాథలకు సామాజిక అన్వయము  - సుందరాకాండ* 




సుందరకాండ పారాయణము చేస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని లోక ప్రతీతి. సుందరకాండ రామాయణములో ఐదవ కాండ. సుందరకాండను *పారాయణకాండ* అని గూడా అంటారు. సుందరకాండలోని ముఖ్యాంశాలు...శ్రీ ఆంజనేయ స్వామి సాగరమును లంఘించుట, సీతాన్వేషణ, లంకా దహనము, సీతమ్మ తల్లి జాడను శ్రీ రామచంద్రుల వారికి తెలియ జేయుట.

పైన తెలియ జేసినట్లుగా  సుందరకాండ పారాయణము తో పనులు పూర్తవుతాయని పెద్దలు చెప్పిన ఉద్దేశ్యము కేవలము పారాయణము చేసినంత మాత్రాన *శ్రీ హనుమత్ఛక్తి* క్రిందికి దిగి వచ్చి మన పనులన్నీ పూర్తి చేసిపెడ్తుందని గాదు.

ఆలా చెప్పడములో పెద్దల అభిప్రాయము...సుందరకాండ మొత్తము సావకాశంగా, సావధానంగా, శ్రద్ధగా పారాయణము చేస్తే, కార్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని  ఏరకంగా తొలగించు కోవాలో అవగాహన చేసుకుని విజయము వైపు సాగగలము అని.

*నిజానికి ఏ విషయమైనా సంపూర్ణ అవగాహన చేసుకుని ఆచరణలో పెడ్తే కానీ పని ఉండదు*.


ఆటంకములను మూడు విధములుగా  విభజిద్దాము. *సాత్వికాటంకము, రాజసాటంకము, మరియు తమొగుణాటంకము*.

వివరంగా పరిశీలిద్దాము... సాత్వికాటoకము ఏర్పడినప్పుడు మర్యాద పాటించి సాధు వర్తనముతో బయట పడడము (మైనాక పర్వత ఉదంతము). రాజసాటంకము నుండి సూక్ష్మ బుద్ధి మరియు ఉపాయముతో  తప్పించుకోవాలి (సురస రాక్షసి వ్యవహారము). ఇక తమోగుణాటoకాలను ధైర్యము, బల ప్రయోగాలతో ఎదుర్కొన వలసి ఉన్నది (సింహిక ఛాయా గ్రహణి).

 ఇంకో మాటలో చెప్పాలంటే దండనతో బదులు చెప్పాలి.


మనం ఏదైనా గొప్ప కార్యము/లక్ష్యము సాధించాలంటే ఎదురయ్యే ఆటంకాలు ఏరకమైనవో గ్రహించి, ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. ముఖ్యంగా తీవ్రవాదం లాంటి సమస్యలను, అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కు పాదంతో అణచి వేయాలి, అక్కడ సాత్విక, రాజస ఉపాయాలు పని చేయవు.


ఒక వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మకమైన వ్యూహము పనికొస్తుంది.


ఈ రకంగా సుందరకాండలోని  ఘట్టాలను అవగాహన చేసుకుని, మన జీవితానికి అన్వయించుకొని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉండదు.

*అందుకోసరము సుందరకాండ పారాయణము అందరూ చేయాలి, కపీశ్వరుని కార్యసాధకత్వవాన్ని అవగాహన చేసుకుని అనుసరించాలి*.

అందరికీ గల సాధారణ సందేహము...రామాయణము నందున్న తక్కిన కాండలకు తత్కాండాoతర్గత కథా సూచకములైన నామములుండగా, ఈ కాండకు విడిగా *సుందరకాండ* అనుటకు కారణమేమి.

ఈ సందేహ నివారణా సమాధానము... *సుందర హనుమత్ మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించడము వలన సుందరకాండ అను పేరు వచ్చినది*.


శ్లోకము....

*సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథః, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం?*.


🙏🙏🙏

బంధకుడు-బంధమోచకుడు!


           చొప్పకట్ల.


బంధకుడు-బంధమోచకుడు!


ఆలంచున్మెడగట్టి,దానికి నపత్యశ్రేణిఁగల్పించి,త

ద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొను సంబంధంబుఁగావించి,యా

మాలార్కంబున బాంధవంబనెడు ప్రేమం

గొందరంద్రిప్పుచున్,

సీలంసీలయమర్చినట్లొదవితో శ్రీకాళహస్తీశ్వరా!

        కాళహస్తీశ్వర శతము,-ధూర్జటి.


"బంధకుడవు నీవేనయ్యా! నన్నీ సంసారమున నిపుణముగా బంధించి వింతచూచుచున్నావా?పైగానిన్నుమరచితి ననుచున్నావా?

అసలుదీనికంతకు కారకుడవు నీవేగదా!

           ఇది ఆలి యనిమెడకుఁగట్టితివి.అంతతోనూరుకుంటివా?దానికి పిల్లలు,ఆపిల్లలకు,పెండ్లి పేరంటములు,(ఇచ్చిపుచ్చుకొనుట)

దానికిబాంధవ్యమని పేరుబెట్టి( సీలను నట్టుతోబిగించినట్లు) నన్ను మాయాసంసారమందుబిగించినావు.ఆమాయలోబడి,

 నేను కొట్టుమిట్టాడ వేడుకజూచుచుంటివి.

ఇదంతయూనీవలననేగదాస్వామీ!!యని కవి పరమేశ్వరునియందే దోషమారోపించుచున్నాడు.


నిజమే!బంధకుడైనవాడు బంధమోచకుడుగూడకావలెనుగదా?

అదియికనీచేతనే కావలెను.అనికవివాదము.

   

సత్యమును పరిశీలింతముగాక!


ఈషణయత్రయమువలన బంధనముకలుగును.దారేషణ,ధనేషణ,

పుత్రేషణ,వీనినే యీషణ త్రయమందురు.(కావలెననుకోరికే యీషణము)కావలెననుకొంటయే 

 బంధనము,వలదనుకొనుటయేవిముక్తి,


ఈయీషణత్రయముతోబాటు వీనికివంతగా రాగద్వేషములు,-ఇలాచిలవలుపలవలై,

ఈమాయాజాలము పెరిగిపోవును.పెరిగిన కొద్దీజీవుడు గట్టిగా బంధింపబడుచున్నాడు.మరి ఎన్నడీబంధవిముక్తి?సంసారమునకు,క్రమంగాదూరముగాజరిగి,వివిక్తుడైమనస్సును భగవదర్పితము గావించుకున్ననే విముక్తి సాధ్యము.

"సంసారిదుఖీ-సన్యాసిసుఖీ! యనిలోకముననొకపాట!నిజానికతడు సుఖముగానున్నాడా?యనుమానమే!

అంతకన్న సంసారమున నుండియు,కర్తవ్యములను నెరవేర్చి,

భహవత్పదాశ్రయణ ముచే ముక్తినొందుట యుత్తమము.దానికిగూడ

భగవత్సంకల్పమే గావలెను.అందుకు సాధనయవసరము.ఆసాధనకై యిక నుపక్రిమింతము.

                                    స్వస్తి!🙏🙏👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏