చొప్పకట్ల.
బంధకుడు-బంధమోచకుడు!
ఆలంచున్మెడగట్టి,దానికి నపత్యశ్రేణిఁగల్పించి,త
ద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొను సంబంధంబుఁగావించి,యా
మాలార్కంబున బాంధవంబనెడు ప్రేమం
గొందరంద్రిప్పుచున్,
సీలంసీలయమర్చినట్లొదవితో శ్రీకాళహస్తీశ్వరా!
కాళహస్తీశ్వర శతము,-ధూర్జటి.
"బంధకుడవు నీవేనయ్యా! నన్నీ సంసారమున నిపుణముగా బంధించి వింతచూచుచున్నావా?పైగానిన్నుమరచితి ననుచున్నావా?
అసలుదీనికంతకు కారకుడవు నీవేగదా!
ఇది ఆలి యనిమెడకుఁగట్టితివి.అంతతోనూరుకుంటివా?దానికి పిల్లలు,ఆపిల్లలకు,పెండ్లి పేరంటములు,(ఇచ్చిపుచ్చుకొనుట)
దానికిబాంధవ్యమని పేరుబెట్టి( సీలను నట్టుతోబిగించినట్లు) నన్ను మాయాసంసారమందుబిగించినావు.ఆమాయలోబడి,
నేను కొట్టుమిట్టాడ వేడుకజూచుచుంటివి.
ఇదంతయూనీవలననేగదాస్వామీ!!యని కవి పరమేశ్వరునియందే దోషమారోపించుచున్నాడు.
నిజమే!బంధకుడైనవాడు బంధమోచకుడుగూడకావలెనుగదా?
అదియికనీచేతనే కావలెను.అనికవివాదము.
సత్యమును పరిశీలింతముగాక!
ఈషణయత్రయమువలన బంధనముకలుగును.దారేషణ,ధనేషణ,
పుత్రేషణ,వీనినే యీషణ త్రయమందురు.(కావలెననుకోరికే యీషణము)కావలెననుకొంటయే
బంధనము,వలదనుకొనుటయేవిముక్తి,
ఈయీషణత్రయముతోబాటు వీనికివంతగా రాగద్వేషములు,-ఇలాచిలవలుపలవలై,
ఈమాయాజాలము పెరిగిపోవును.పెరిగిన కొద్దీజీవుడు గట్టిగా బంధింపబడుచున్నాడు.మరి ఎన్నడీబంధవిముక్తి?సంసారమునకు,క్రమంగాదూరముగాజరిగి,వివిక్తుడైమనస్సును భగవదర్పితము గావించుకున్ననే విముక్తి సాధ్యము.
"సంసారిదుఖీ-సన్యాసిసుఖీ! యనిలోకముననొకపాట!నిజానికతడు సుఖముగానున్నాడా?యనుమానమే!
అంతకన్న సంసారమున నుండియు,కర్తవ్యములను నెరవేర్చి,
భహవత్పదాశ్రయణ ముచే ముక్తినొందుట యుత్తమము.దానికిగూడ
భగవత్సంకల్పమే గావలెను.అందుకు సాధనయవసరము.ఆసాధనకై యిక నుపక్రిమింతము.
స్వస్తి!🙏🙏👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి