5, అక్టోబర్ 2023, గురువారం

Panchaag

Land regulation

అద్భుతమైన విషయం

 - :అద్భుతమైన విషయం పూర్తిగా చదవండి:-

______________________________________

 .భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…!!

భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి. 

1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం 

2. గాయత్రి మంత్రం...

ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…

“యుగ సహస్ర యోజన పర భానూ!

లీల్యోతాహి మధుర ఫల జానూ”!!

దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…

యుగ= 12,000 దివ్య సంవత్సరములు

సహస్ర=1000

యోజన్= 8 మైళ్ళు

యుగ x సహస్ర x యోజన= పర్ భాను

12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు

1 మైళు = 1.6 కిలో మీటర్లు

96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు = 

153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)

ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.

హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.

ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.

అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…

ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…

గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.

గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.

ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.

వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!

ఇదీ మన భారత వైశిష్ట్యం…

ఇదీ మన వేద విఙ్ఞాన సారం…

ప్రతి భారతీయుడికి గర్వకారణం… 

మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!!- :అద్భుతమైన విషయం పూర్తిగా చదవండి:-

మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!!

దివ్య దక్షణ యాత్ర* -

 *దివ్య దక్షణ యాత్ర* - 

జ్యోతిర్లింగాల తో కలిపి*..

ఈ అక్టోబర్ 31 వతేదీ నాడు సికిందరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ప్రత్యేక భారత్ గౌరవ్ ట్రైన్ లో 

ప్రముఖ పుణ్య క్షేత్రాలు అయిన

అరుణాచలం :  అరుణాచలం దేవాలయం 

రామేశ్వరం : రామ లింగేశ్వర స్వామి దేవాలయం 

మధురై : మీనాక్షీ అమ్మన్ దేవాలయం  

కన్యాకుమారి: వివేకానంద రాక్ గార్డెన్ , కుమారి అమ్మన్ దేవాలయం 

ట్రివేండ్రం : శ్రీ పద్మానాభ దేవాలయం 

తిరుచ్చి : శ్రీ రంగనాధ్ స్వామి దేవాలయం 

తంజావూరు : బృహదేశ్వర   ఆలయం 

మొదలైన దేవాలయాలను సందర్శించే అవకాశం 

రైలు ప్రయాణం , లోకల్ ప్రయాణం భోజనం తో కూడిన ప్రత్యేక టూర్ 

టిక్కెట్ ధరలు : 

*స్లీపర్ క్లాస్* : 14.100/-

*3rd AC* : 21,500/-

*2nd ఏ‌సి* : 27,900/- 

మరిక ఆలస్యం ఎందుకు ? 

నేడే మీ కుటుంభ సభ్యులకు దక్షణ భారత దేవాలయాల్ని ఒకేసారి సందర్శించే అవకాశం కల్పించండి 

టిక్కెట్స్ కోసం 

*ట్రావెల్ ఇండియా* 

ప్రభుత్వ రంగ పర్యాటక బుకింగ్ ఏజన్సీ 

బేగం పేట్ 

హైదారాబాద్ .

ఫోన్ : *9848829574, 8801393100*

Talli mahatripura sundari

*Bank Training

 *Bank Training Centre*

ప్రపంచపు మొదటి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి విద్యార్థులకు క్లాసు పూర్తి చేసిన తర్వాత ఒకసారి శర్మగారు బ్యాంకింగ్ సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే అడగమని చెప్పారు.

ఒక విద్యార్థి లేచి ప్రపంచంలో పురాతనమైన బ్యాంకింగ్ వ్యవస్థ బ్రిటిష్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏనా అని అడుగుతాడు.

దానికి చిరునవ్వుతో శర్మగారు ఇలా సమాధానం చెప్పారు.

ప్రపంచపు తొలి బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశం లోనే ఉంది.

*ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతి నగరమే దానికి మూలస్థానం*

The First Banking Transaction :

కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు.సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ప్రపంచ మొదటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ గా చెప్పుకోవచ్చు.

The First Banker:

శ్రీనివాసడికి అప్పిచ్చిన కుబేరుడిని మించిన బ్యాంకర్ ఎవరున్నారు.

The First Promissory Note :

కుబేరుడికి శ్రీనివాసుడు రాసిన ప్రామిసరీ నోట్ ప్రపంచంలోని

The First Bill of Exchange:

మొట్టమొదటి బిల్ ఆఫ్ ఎక్సేంజ్ అని చెప్పుకోవచ్చు.

The Good loan repayment

శ్రీనివాసునికి ఉన్న వడ్డీ కాసులవాడు అనే పేరు అప్పటికే ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థని ఋజువు చేస్తుంది.

తను సంపాదించి క్రమం తప్పకుండా *లోన్ రిపేమెంట్* చేస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్న వారందరికీ ఆదర్శవంతుడు.

ఇలా ఈనాడు మనం చెప్పుకుంటున్న చెలామణి లో ఉన్న ఎన్నో పథకాలు ఆ కాలంలోనే అమలు జరిగాయి.

The First lease Agreement:

వరాహ స్వామి దగ్గర స్థలం లీజుకి తీసుకుని

The First Mortgage:

ఆ లీజ్ హోల్డ్ రైట్స్ మీద శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు.

The First Income source certificate:

తనకి రాబోయే ఆదాయం హామీగా చూపించాడు. అంటే అసైన్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ అన్నమాట.

కుబేరుడిని మించిన బ్యాంకరు, శ్రీనివాసుని మించిన హై క్రెడిట్ రేటింగ్ బారోయరు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు?

ఇలా బ్యాంకింగ్ సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలియజేసే తిరుపతిని ప్రతి బ్యాంకు ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాలి అని శర్మ గారు తన సమాధానం పూర్తి చేయగానే విద్యార్థులందరూ ఆశ్చర్యంగా, వేద కాలం నాటి బ్యాంకింగ్ వ్యవస్థ - ఈనాటి బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటే కదా అని గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేశారు.

గోవింద నామస్మరణతో క్లాస్ అంతా ప్రతిధ్వనించింది.

🙏🙏🙏

ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏

✍...

శ్రీ ప్రాచీన బాలహనుమాన్ మందిర్

 🕉 మన గుడి : నెం 199

⚜ ఢిల్లీ : కన్నాట్ ప్లేస్‌

⚜ శ్రీ ప్రాచీన బాలహనుమాన్ మందిర్

💠 ఇది భారతదేశంలోని పురాతన హనుమాన్ దేవాలయాలలో ఒకటి, ఇది న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో ఉంది.  

ఇది శ్రీ దక్షిణ ముఖి బాల్ హనుమాన్ యొక్క పురాతన హిందూ దేవాలయం మరియు ఢిల్లీలోని మహాభారత కాలంలోని దేవాలయాలలో ఒకటి.

💠 ఈ ఆలయంలో చిన్ననాటి రూపంలో హనుమంతుని స్వయంభూ మూర్తి ఉంది, దీనిని దక్షిణ్ ముఖి హనుమాన్జీ అని కూడా పిలుస్తారు.  

ఈ కారణంగా, హనుమ విగ్రహం యొక్క ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది.  

దక్షిణ ముఖి హనుమంతుడు ఒక చేతిలో గధను పట్టుకుని ఉన్నాడు మరియు మరొక చేతిలో  శ్రీరాముని మాల పట్టుకొని ఉన్నాడు.

💠 బాల్ హనుమంతుని స్వయంభూ మూర్తి యొక్క మందిరాన్ని మొదట పాండవులు నిర్మించారు.  

పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు పాండవులు ఇంద్రప్రస్థం నుండి మరియు కౌరవులు హస్తినాపూర్ నుండి పాలించారు.  

ఆ రోజుల్లో ఢిల్లీ నగరం పేరు ఇంద్రప్రస్థ.

తరువాత, ఈ ఆలయాన్ని అంబర్‌కు చెందిన రాజా మాన్ సింగ్ నిర్మించారు మరియు 1724లో జైపూర్‌కు చెందిన రాజా జై సింగ్ పునర్నిర్మించారు

💠 హిందూ విశ్వాసం ప్రకారం, పాండవులలో రెండవవాడైన భీముడు హనుమంతుని సోదరుడిగా పరిగణించబడ్డాడు . ఇద్దరినీ వాయు పుత్రులు అంటారు . ఇంద్రప్రస్థ స్థాపన సమయంలో పాండవులు ఈ నగరంలో ఐదు హనుమాన్ ఆలయాలను స్థాపించారు. 

 ఈ ఆలయం ఆ 5 లో ఒకటి.

💠 శ్రీరామునిగా అవతరించిన శ్రీమన్నారాయణుడు మనకు ధర్మం ద్వారా పరిపాలనను చూపి వైకుంఠానికి బయలుదేరాడు. రామాయణంలోని పాత్రలన్నీ వైకుంఠానికి బయలుదేరాయి, కానీ హనుమంతుడు రామరాజ్యాన్ని మరియు ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ప్రపంచంలో మనతో పాటు ఇక్కడే ఉన్నాడు. అంతే కాదు, అతను తదుపరి యుగంలో శ్రీకృష్ణునిగా శ్రీమన్నారాయణుడిని చూశాడు.

ఆ సమయంలో హనుమంతుని ఉనికి గురించి మహాభారతంలో ఒక ఉదంతం ఉంది.

💠 పాండవుల వనవాస సమయంలో భీముని  అహంకారాన్ని అణచివేయడానికి

 హనుమంతుడు అడవిలో బలహీనమైన వృద్ధాప్య కోతి వేషంలో, భీముడు, అడవిలో ద్రౌపది కోరిన సువాసనగల సౌగంధికా పుష్పము  కోసం వెతుకుతున్నప్పుడు, హనుమంతుడు తన తోకను అడ్డం పెట్టుకుని పడి ఉండడాన్ని చూసి, హనుమంతుని గుర్తింపును తెలియక, అతని తోకను తీసివేయమని హేళనగా కోరాడు.  .కానీ హనుమంతుడు భీముడికి తోక ఎత్తమని చెప్పాడు.

భీముడు దానిని ఎత్తలేకపోయాడు, 

అప్పుడు భీముడు అది సాధారణ కోతి కాదు అని గ్రహించాడు.  

తన సొంత సోదరుడు తప్ప అంత బలవంతుడు మరెవరూ లేరు అని తన దురహంకార ప్రవర్తనకు క్షమాపణలు చెప్పి, తన నిజస్వరూపాన్ని తనకు చూపించమని హనుమంతుడిని అభ్యర్థించాడు.

అప్పుడు హనుమంతుడు భీముడిని అనుగ్రహించాడు.

కౌరవులతో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత పాండవులు హనుమంతుడు మరియు ఇతర దేవతల కోసం 5 ఆలయాలను నిర్మించినట్లు చెబుతారు.

💠 శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీ రామచరితమానస్, తులసీ రామాయణం మొదలైన చారిత్రక గ్రంథాలను రచించిన శ్రీ గోస్వామి తులసీదాస్ (1532–1623), దక్షిణ ముఖి హనుమాన్‌జీ దర్శనం కోసం 16వ శతాబ్దంలో శ్రీ తులసీదాస్ ఈ మందిరానికి వచ్చారు.  

ఇక్కడ, అతను శ్రీ హనుమాన్ చాలీసా రాయడానికి ఈ బాల హనుమాన్ మందిర్ నుండి ప్రేరణ పొందాడు.  మరియు ఇక్కడే అతను శ్రీ హనుమాన్ చాలీసా యొక్క మొదటి చౌపాయిని ప్రారంభించాడు.

💠 మొఘల్ రాజు అక్బర్ (1542-1605) కూడా ఈ మందిరానికి వచ్చి శ్రీ దక్షిణ ముఖి హనుమంతుని శక్తులను పరీక్షించడానికి ప్రయత్నించి మరియు ఆలయంపై దాడి చేశాడు.  కానీ చక్రవర్తి అక్బర్ బాల్ హనుమాన్ శక్తుల ముందు నిలబడలేకపోయాడు.  

హిందుస్తాన్‌లోని మొఘల్ రాజవంశం సమయంలో, ప్రతి ముస్లిం రాజు అన్ని పురాతన హిందూ దేవాలయాలలో ఇలా చేసారు.  కాబట్టి, అక్బర్ బాల్ హనుమాన్ ముందు తన ఓటమిని అంగీకరించాడు.

అప్పుడు క్షమాపణపై, అతను ఇస్లామిక్ నెలవంకను శ్రీ బాల్ హనుమాన్‌కు సమర్పించాడు. 

ఈ హనుమాన్ మందిర శిఖరంపై అక్బర్ ఇస్లామిక్ మూన్ ఇప్పటికీ ఉంది. 

ఆ ఓటమి తరువాత నుండి ఏ మొఘల్ చక్రవర్తి ఈ ఆలయం వైపు మళ్లీ తన కన్ను ఎత్తలేదు.

💠 మొఘల్ చక్రవర్తి అక్బర్ చాలా కాలంగా కొడుకును కనలేనప్పుడు, అతను కన్నాట్ ప్లేస్‌లోని ఈ ఆలయానికి వచ్చి పూర్తి విశ్వాసంతో కొడుకు కోసం ప్రార్థించాడని చెబుతారు. చివరకు, భజరంగ్ బాలి దయతో, అతని కోరిక సలీం రూపంలో నెరవేరింది.

💠 1964 ఆగస్టు 1 నుంచి ఆలయంలో ‘శ్రీరాం, జై రామ్, జై జై రామ్’ మంత్రాన్ని 24 గంటల పఠించడం కొనసాగుతోంది. 

ఈ నిరంతర జపం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

💠 కష్టాల రక్షకుడైన శ్రీ హనుమంతుని స్తోత్రం మానవుని యొక్క అన్ని వ్యాధులు, దుఃఖాలు, నొప్పులు మరియు జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

ఏ భక్తుడైనా 7 శనివారాలు నిరంతరం ఇక్కడ మనసులో సద్బుద్ధితో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా ఆశించిన ఫలితాలు లభిస్తాయి

💠 ఆలయం అన్ని రోజులు తెరిచి ఉన్నప్పటికీ, మంగళ, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

Sangala basavaiah

Indian train

Toll gate fast tag

Laxmi narasimha

Bike air bag

Opposed pistons

Electric car burning

Atibala

Atibala

Kaasilo

 https://youtube.com/shorts/Gxw5afNXyCk?si=tg6d3dIImDRlVuQZ

Kalla pagullu

Fan regulators

Ushasree bharatham

Srikalahastieesears

High rpm fan

Ceiling fan opening

Trains

Vijayas

సన్యాసం" పునర్జన్మ తో సమానమని

 "సన్యాసం" పునర్జన్మ తో సమానమని,ఈ జన్మలో చేసిన కర్మంతా నశించి పోతుంది..సన్యాసి తల్లి దండ్రులే గాక ,అతని ఏడు పురుషాంతరముల వరకూ అందరూ తరిస్తారని శాస్త్రం చెబుతూ ఉంది.. లోకంలో తల్లిదండ్రులు,పుత్రులు మొదలైన వారు గల సముదాయాన్ని "కుటుంబం" అంటారు.. జగద్గురు శంకరాచార్యుల వారు ఒక చిన్న కుటుంబానికి చెందిన వారుగా,ఫలానా వారి పుత్రుడిగా,ఫలానా వారి తండ్రిగా ఉందాలనుకోలేదు..ప్రపంచమంతా వారి కుటుంబం కావాలని కోరి 8సంవత్సరాల వయస్సు లోనే  తల్లి అనుమతితో సన్యసించారు..వీరు వారి తల్లి దండ్రులకు ఒక్కరే కుమారుడు..తండ్రి ముందే పరమపదించారు.."తనకు భిక్షా ప్రదానం చేసిన వారంతా తన తల్లులు,తనకు జ్ఞానం ఉపదేశించిన గురువులు, తండ్రులు, శిష్యులే తన కుమారులు "అని సన్యాసి భావిస్తాడు..అటువంటి విశాల భావంతో శంకరులు సన్యసించి మనకు మహోపకారం చేశారు..అద్వైత జ్ఞానం మనకందించారు..అంత్య కాలంలో తనను స్మరిస్తే వస్తానని తల్లికి చెప్పి  శంకరులు నర్మదా నదీ తీరానికి వెళ్లారు...మన వైదిక సంస్కృతిని నిలబెట్టింది మాత్రం శంకరుల వారే..వీరు మన ధర్మానికి మూల స్తంభం లాంటి వారు. వీరికి 3వ సంవత్సరం నుండే అనేక శాస్త్రాలు స్పురించాయి..5వ ఏట ఉపనయనం జరిగింది..8 ఏళ్లు వయస్సు వచ్చే నాటికి సర్వ శాస్త్రాలు,వేదాలు అభ్యసించి,పూర్ణత్వాన్ని పొంది సన్యసించారు.. గోవిందా యోగీంద్రుల శిష్యరికం చేశారు..అద్వైతాన్ని ఒక జీవన విధానం గా అలవాటు చేసేందుకు గాను  దేశానికి నలువైపులా నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు..కంచిలో "మూలామ్నాయ " శంకర పీఠం ' నెలకొల్పినారు..

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*

         *ప్రథమాశ్వాసము*

                      *14*

*ప్రమద్వరను బ్రతికించుట*

రురుడు శోకిస్తూ ప్రమద్వరను బ్రతికించమని దేవతలను " ఓ దేవతలారా ! ఓ బ్రాహ్మణులారా ! నేను దేవ యజ్ఞములు, వేదాధ్యయనం, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే, నేను ఘోరమైన తపసు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన విషం నుండి విముక్త కాగలదు" అని ప్రార్థించాడు. తిరిగి " మంత్ర తంత్రములు తెలిసిన వారు విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపః ఫలమును, అధ్యయన ఇలమును ధారపోస్తాను. " అని రోదించాడు. అప్పడు ఆకాశం నుండి ఒక దేవత " బ్రాహ్మణోత్తమా !ప్రమద్వర కాలవశమున మరణించింది. ఆయుస్షు తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం. అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఎవరైనా తమ ఆయుష్షులో సగం ఇస్తే ఆమె ముందరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను " అని పలికాడు. రురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్ధాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు.

రామాయణమ్ 345 ...

 రామాయణమ్ 345

...

నీవు చెప్పినది నాకు ఆనందము కలిగించినది .ఒక విశ్వాస పాత్రుడైన సేనాపతి తన ప్రభువు ఆనందము కోసము ఆలోచించవలె.నీ ఆలోచన ఆరీతిగనే వున్నది .

.

కానీ !

.

స్త్రీల విషయములో నేను శాపగ్రస్తుడను తనంతతానై నా దరికి వచ్చిన వనితను తప్ప ఇతరులను బలాత్కారముగా అనుభవించ తలపెట్టితినా అదే నా చివరి రోజు !

.

ఒక సారి నేను బ్రహ్మ లోకమునకు వెళ్లినప్పుడు పుంజికస్థల అను అతిలోక సౌందర్యరాశి అయిన అప్సరసను ఒంటరిగా చూడటము తటస్థించినది.

.

కాముడి శరములు నామదిని తూట్లు పొడిచినవి. శరీరమునందు సెగలు పుట్టినవి . మదన జ్వరపీడితుడనై ఆపుకొనలేక ఆమెను వివస్త్రను చేసి బలాత్కారముగా అనుభవించితిని .

.

ఆమె బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనినది.

.

బ్రహ్మదేవుడు అంత ఆగ్రహించి ," రావణా ఈనాడు మొదలుకొని నీవు ఏ పడతినైనా ఆమె ఇష్టములేక బలాత్కరించి అనుభవించితివా ! నీ తల నూరు వ్రక్కలగును " అని శపించినాడు....నీకు ఇంకొక రహస్యము కూడ చెప్పెదను వినుము ....

.

రంభ అందమును చూసి మహాసంరంభమున బలవంతముగా ఆమెను అనుభవించితిని . నలకూబరుడు నన్ను ఇదేవిధముగా శపించినాడు .

అది ఆరంభము !...

.

ఆ! నలకూబరుని శాపము నన్నేమిచేయునని లెక్కచేయలేదు ...

.

కానీ ఈ సారి శపించినది సాక్షాత్తూ విధాత ! ...అందుకే నాకు భయము ,దిగులు ..ఆ శాపమే లేకపోయెనా ! ఈ పాటికి సీతాదేవిని ఎప్పుడో వశము చేసుకొని యుండెడి వాడను....

.

వీరి మాటలు విభీషణుడు వింటున్నాడు ...ఇక లాభము లేదు హితము చెప్పవలెనని అనుకొన్నాడు.....తన ఆసనమునుండి పైకి లేచినాడు.

.

వూటుకూరు జానకిరామారావు

తప్పులతో ముప్పు లు

 *1946*

*కం*

తప్పక తప్పొనరించిన

తప్పుగనే ఒప్పదగును తప్పక నెపుడున్.

తప్పుల ముప్పులు నిప్పుడు

తప్పిన నెప్పటికినైన తప్పవు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తప్పనిసరి పరిస్థితుల్లో చేసినప్పటికీ తప్పు ను తప్పు గానే భావించవలెను. తప్పులతో ముప్పు లు ఇప్పుడు తప్పి‌ననూ ఏదో ఒకనాటికి తప్పకుండా పొందెదరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

LED repair

Gas stove

సాక్ష్యం చెప్పిన శ్రీ సుబ్రహ్మణ్యుని లీల

 ॐ   కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన శ్రీ సుబ్రహ్మణ్యుని లీల 

అది 1972 వ సంవత్సరం 

తమిళనాడు లోని పళని అనే గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు.వారు పేర్లు పళనివేల్ , తారక మణి.ఇద్దరూ జీవనోపాధికై వ్యాపారాలు చేసేవారు.

పెళ్లినా ఎన్నో సంవత్సరాలు పిల్లలు కలగని కారణం చేత పళనివేల్ తల్లిదండ్రులు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సంతాన బిక్షను ప్రసాదించమని మ్రొక్కుకున్నారు.వారు అలా మ్రొక్కుకుని ముడుపు కట్టిన సంవత్సరం లోపే వారికి పండంటి మగ శిశువు జన్మించాడు.సుబ్రహ్మణ్యుని వర ప్రసాదం వలన జన్మించినందుకు ఆ శిశువుకు పళని వేల్ అనే పేరు పెట్టారు.

పళని వేల్ కు చిన్నతనం నుండే దైవ భక్తి మెండుగా ఉండేది.ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించేవాడు.వృత్తి పరంగా అనేక వ్యాపారాలు చేసినా వాటిలో ధర్మం పాటించేవాడు.వ్యాపారంలో వచ్చే లాభాలలో సగం పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించేవాడు.

తారక మణి అనే వ్యక్తితో పళని వేల్ కు చిన్నతనం నుండి మంచి స్నేహం ఉండేది.ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేవారు.తారక మణికి కూడా దైవభక్తి ఎక్కువే.

ఇదిలా ఉండగా ఒక సంవత్సరం తారక మణి చేసిన వ్యాపారంలో నష్టం వచ్చి తనకున్న ఆస్తితో సహా మొత్తం కోల్పోయాడు.తన స్నేహితుని కష్ట దశను అర్ధం చేసుకున్న పళని వేల్ తారక మణిని పళని సుబ్రహ్మణ్య ఆలయానికి పిలిపించి ఆ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో తన ఆస్తిలో సగభాగం ఇచ్చాడు.

తారక మణి ఆనందభాష్పాలతో తన స్నేహితుడు చేసిన సహాయానికి కృతజ్ఞతతో నమస్కరించాడు.అడుగకుండానే సహాయపడిన నీ గొప్ప మనస్సుకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.నీ బాకీని తీర్చగాలనేమో కానీ నీ వాత్సల్యానికి జన్మంతా ఋణపడే ఉంటాను అన్నాడు.

పళని వేల్ ఇలా అన్నాడు,ఇది అప్పు కానే కాదు,ఇందులో ఋణం అనే పదానికి చోటేలేదు.నా స్నేహితుని ఆపదలో ఆడుకోవడం నా కనేస ధర్మం.నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు అని.

ఇదంతా చూస్తున్న ఆ గుడి ఆవరణలో పూల వ్యాపారం చేసుకుంటున్న మురుగన్ అనే వ్యక్తి వారితో ఇలా అన్నాడు.మీలాంటి స్నేహితులను నేను ఇంతవరకూ చూడలేదు.ఎటువంటి బంధాలనైన త్రుంచే ప్రమాదమైన పదార్ధం " ధనం ".

ధనం ప్రభావం వలన మనుషుల మనస్తత్వం మారిపోతుంది.పళని వేల్ గారూ, మీరు చేస్తున్న సహాయానికి ఒక " ప్రామిసరీ నోటు " వ్రాసుకుంటే ఇరువురికీ మంచిది కదా అన్నాడు.

అందుకు పళని వేల్,ఇది అప్పుగా ఇస్తున్న ధనం కాదు,నా స్నేహితుని కష్టదశలో ఆడుకోవడం నా కనీస ధర్మం.ఇందులో ఋణ ప్రసక్తే లేదు అన్నాడు.

తారక మణికి పళని వేల్ వ్యక్తిత్వం అర్ధం అయ్యింది.తను వ్యాపారంలో లాభాలు పొందితే వాటి నుండి తన సంతోషం కోసం పళని వేల్ కు ఏదైనా కానుకగా ఇచ్చినప్పుడు అంగీకరిస్తాను అని ఒప్పుకుంటేనే ఈ సహాయం స్వీకరిస్తాను అని పట్టుబట్టాడు.

అందుకు పళని వేల్,నువ్వు నాకు కనుకలు ఇస్తే నువ్వు సంతోష పడవచ్చు నిజమే కానీ నేను కూడా సంతోష పడాలంటే నువ్వు మరొక పని చేయాలి అన్నాడు.

అదేమిటంటే నువ్వు నాకు కానుకలు ఇచ్చేబదులు వాటిని ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలకూ, ఆలయ అభివృద్ధికీ , స్వామి వారిని దర్శించడానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు , అన్నదానం కొరకు కర్చు పెట్టు నేను చాలా సంతోషిస్తాను అన్నాడు.అందుకు సంతోషంగా అంగీకరించాడు తారక మణి.

కొన్ని రోజులలోనే పళని వేల్ ఒక వర్తక నిమిత్తం విదేశాలకు వెళ్ళ వలసి వచ్చింది . తన స్నేహితుడు తారక మణిని పిలిచి తన ప్రయాణం గురించి వివరించి కొన్ని సంవత్సరాలు తాను విదేశాలలో వ్యాపారం చేసుకుని తిరిగి వస్తానని,నీకు వ్యాపారంలో లాభాలు వస్తే వాటిలో కొంత పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి కర్చు చేయమని ఒకవేళ లాభాలు రాణి పక్షంలో తన ఇంట్లో వారిని అడిగి తీసుకుని ఆలయానికి కర్చు చేయమని చెప్పాడు.అలాగే అని అంగీకరించాడు తారక మణి.

పళని వేల్ విదేశాలకు వెళ్ళి ఆరు సంవత్సరాలకు తిరిగి స్వదేశం వచ్చాడు.తన స్నేహితుడు తారక మణిని కలవడానికి ఆతృతతో తన ఇంటికి వెళ్ళాడు.అప్పటికే కోట్లు సంపాదించిన తారక మణి పళని వేల్ ను గుర్తు పట్టనట్లు ప్రవర్తించాడు.ధన మదంతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అర్ధం చేసుకున్న పళని వేల్ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఏమైనా కర్చు చేస్తున్నాడా అని వాకబు చేసాడు.

తారక మణి గత ఆరు సంవత్సరాలుగా ఆలయానికి ఏమి చేయలేదు అని , పళని వేల్ ఇంటి సభ్యులే కర్చు చేస్తున్నారని తెలుసుకున్నాడు.తన స్నేహితుడు ఇంతలా మారిపోయినందుకు , తనను గుర్తుపట్టనట్లు నటించినందుకు కూడా పళని వేల్ అంతగా బాధపడలేదు కానీ దేవుడ్ని మోసం చేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు.

మరొక్కసారి తారక మణిని కలుసుకుని దేవుడి సొత్తును దొంగిలించడం మంచిది కాదు,నువ్వు దేవుడికి చేయవలసిన కర్చును ఇప్పటికైనా చెల్లించు అని చెప్పాడు.అందుకు తారక మణి నేను దేవునికి చేస్తాను అని చెప్పాను అంటున్నావు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు.

దేవుడిని సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ దేవుడే సాక్షి అన్నాడు.సరే అయితే ఆ దేవుడ్నే వచ్చి నాకు చెప్పమను అప్పుడు చేస్తాను అన్నాడు.తారక మణి వ్యంగ్య ధోరణికి మనస్తాపం చెంది,సరే కోర్టులోనే కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు.

పళని వేల్ తరఫున వాదిస్తున్న వకీలు,మన దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేవూ ,కేవలం నోటి మాటలను కోర్టు నమ్మదు కనుక మనం ఈ కేసులో గెలవకపోవచ్చు అన్నాడు.అందుకు పళని వేల్ ఈ సొత్తు దేవునిది,ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తులను ఎలా రక్షిస్తాడు.దేవుడిపై ఉండే నమ్మకం తరిగిపోతుంది కదా,మన ప్రయత్నం మనం చేద్దాం , తుది నిర్ణయం ఆ దేవునికే వదిలేద్దాం అన్నాడు.

ఆ రోజు రాత్రి పళని వేల్ కు ఒక స్వప్నం వచ్చింది.ఆ స్వప్నంలో అతను పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళాడు.స్వామిని దర్శించుకుని తన మనసులోని బాధను,తను స్నేహితుడు చేసిన మోసాన్ని,దేవుడ్ని కూడా మోసం చేయాలనుకునే ఆలోచనల్ని తలచుకుని బాధపడుతుండగా వెనుక నుండి," అయ్యా ఎలా ఉన్నారు , చాలా సంవత్సరాల తరువాత మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాను,మీ వ్యాపారం ఎలా ఉంది , మీ స్నేహితుడు స్వామికి సేవ చేస్తాను అన్న మాటను నిలబెట్టుకున్నడా ? " అని ప్రశ్నించాడు.

అప్పుడు గుర్తొచ్చింది పళని వేల్ కు,నువ్వు మురుగన్ కదా,చాలా సంవత్సరాలు అయ్యింది కదా కనుక వెంటనే గుర్తుపట్టలేకపోయాను.నువ్వు ఎలా ఉన్నావు,ఎక్కడ ఉంటున్నావు,నా స్నేహితుడు నన్ను , దైవాన్ని కూడా మోసం చేసాడు.తను చేస్తాను అన్న సేవలేవి చేయలేదు,నన్ను కూడా ఎరుగనట్లు మాట్లాడుతునాడు.అందుకే కోర్టులో కేసు వేసాను.కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు,అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాను అన్నాడు.

అందుకు మురుగన్,మీరేమి దిగులు పడకండి,మీ దగ్గర నోటు లేకపోవచ్చు కానీ నేను ప్రత్యక్ష్య సాక్షిని కదా,నేను వచ్చి మీ తరఫున సాక్ష్యం చెబుతాను అన్నాడు.చాలా సంతోషం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు పళని వేల్.ఇక్కడు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఉంటున్నాను అన్నాడు మురుగన్.

వెంటనే పళని వేల్ కు మెలకువ వచ్చింది.తనకు వచ్చింది స్వప్నం అని గ్రహించాడు కానీ అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలుసుకోవాలని కలలో మురుగన్ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు.మురుగన్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి చూడగా అక్కడ మురుగన్ కనిపించాడు.ఆశ్చర్యం , ఆనందం కలిగిన పళని వేల్ జరిగినదంతా చెప్పాడు.ఆ స్వప్నం కూడా సుబ్రహ్మణ్యుని లీలే అని ఆనందించారు.

కోర్టులో కేసు విచారణకు వచ్చింది.అప్పుడు పళని వేల్ తరఫున సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మురుగన్ ను చూసి భయపడిపోయాడు తారక మణి.మురుగన్ మాటను నమ్మిన కోర్టు తారక మణి చేసిన మోసాన్ని గుర్తించి తన ఆస్తిలో పావు వంతు స్వామి వారికీ ఇవ్వాలని తీర్పునిచ్చింది.

కోర్టు ఆవరణలో పళని వేల్ ను కలిసి తారక మణిని ఇలా అడిగాడు,ఈ మురుగన్ ఎలా వచ్చాడు, ఎక్కడ నుండి వచ్చాడు,నేను నమ్మలేకపోతున్నాను అని.అందుకు పళని వేల్ నీతో మాట్లాడి వెళ్ళిన రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది అందులో నాకు మురుగన్ కనిపించాడు,తన చిరునామా చెప్పాడు,నేను ఉదయాన్నే తను చెప్పిన ఊరికి వెళ్లి చూసాను,అక్కడ నిజంగానే మురుగన్ కనిపించాడు.తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను అన్నాడు.ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు అన్నాడు.

అందుకు తారక మణి,అసలు ఈ మురుగన్ మూడు సంవత్సరాల క్రితమే మన ఊరిలోనే మరణించాడు.తను నీకు కలలో కనిపించడం,చిరునామా చెప్పడం,నువ్వు వెళ్లి నిజంగానే కలవడం,తను ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం అంతా విచిత్రంగా ఉంది.ఆ మురుగన్ ఎవరో కాదు సాక్షాతూ ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారే.నేను తప్పు చేశాను,కోర్ట్ చెప్పిన దానికి రెండింతలు స్వామి వారి చేల్లిస్తాను అన్నాడు.

అప్పుడు అందరికీ అర్ధం అయ్యింది నిజంగానే సుబ్రహ్మణ్య స్వామి వారే వచ్చి సాక్ష్యం చెప్పి నిజాన్ని నిరూపించారు అని.ఇక్కడ సుబ్రహ్మణ్యుని పిలిస్తే పలుకుతాడు.

వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి .

దయచేసి అందరికీ షేర్ చేయండి 

అందరం " ఓం శరవణభవ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం 

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ 

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ 

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ

మనుషులు చేజారుతారు

 Chaluvagali CSR:

“మనుషులు చేజారుతారు”....!!

ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా?

          —.....

‘భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్‌ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్‌ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్‌ జోకర్‌’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. 

ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్‌ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా?

‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్‌. హీరో తన కొడుకే రిషికపూర్‌. హీరోయిన్‌ కొత్తమ్మాయి డింపుల్‌ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్‌చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్‌– ప్యారేలాల్‌ ఇంకా కెరీర్‌ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్‌ రెమ్యూనరేషన్‌. ఆ రోజుల్లో ప్రాణ్‌ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం.

 ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్‌. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్‌ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్‌ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్‌ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్‌ లక్ష రూపాయల చెక్‌ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్‌ ఆ చెక్‌ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్‌కపూర్‌ని కలవలేదు. జారిపోయాడు....

‘షోలే’ రిలీజ్‌ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్‌. రాసిన సలీమ్‌–జావేద్‌ ఆందోళన చెందారు. ఫ్లాప్‌ కావడానికి స్క్రిప్ట్‌ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్‌ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్‌ వేషం వేసిన అంజాద్‌ఖాన్‌ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్‌ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్‌ బ్లేమ్‌ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్‌గా అంజాద్‌ఖాన్‌ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్‌–జావేద్‌ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్‌ చేయలేదు. చేజారిపోయాడు....

దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. 

రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్‌. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్‌ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్‌ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్‌. వారి మాట మీద రామానాయుడుకు గురి.  ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని  సినిమా రిలీజయ్యి సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్‌ వాడాలనుకోలేదు. 

బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హటాత్తుగా చిన్నచూపు వస్తుంది....

ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. 

వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ,ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల ‘మనసు చిట్లుతున్న చప్పుడు’ మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు.....

మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు.

హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా?

 అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా.......???

*శ్రీ దేవీ భాగవతం

 *శ్రీ దేవీ భాగవతం*

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||

శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||

శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||

తల్లి ఎంత చెప్పినా దమయంతి వినిపించుకోలేదు. తన నిశ్చయం మార్చుకోలేదు. ఇంకా

స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది.

అమ్మా! ధనమూ రూపమూ అందమైన ముఖమూ ఇవ్వి ఉండి ఏమి లాభం, మనిషి

మూర్ఖుడయ్యాక. రసమార్గం తెలియని మనిషికి రాజ్యం ఉండి ఏమి ప్రయోజనం ? నాదమాధుర్యాన్ని

ఆస్వాదిస్తూ అరణ్యాలలో హాయిగా సంచరించే హరిణీబృందాల బ్రతుకు ధన్యం. అవి ఆ మాధుర్యానికి

వివశలై మూర్ఖమానవుల చేతికి చిక్కి ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. నారదుడు సప్తస్వరాత్మకమైన

సంగీతవిద్యకు నిధి. అందులో అతడికి సాటివచ్చేవాడు ముల్లోకాలలోనూ లేడు ఒక్క శివుడు తప్ప

ఇలాంటి విద్వాంసుడిని వదలుకుని ఒక మూర్ఖుడితో కాపురం చెయ్యడం క్షణం క్షణం మరణం. ధనమూ

రూపమూ ఉన్నా గుణం లేకపోతే అతడిని పరిత్యజించవలసిందే. గర్వగరిష్ఠులైన రాకుమారులతో మైత్రి

అంటేనే నాకు అసహ్యం. అంతకంటే గుణగరిష్ఠుడైన భిక్షువుతో చెలిమి నాకు ఇష్టం. ఇతడు సర్వజ్ఞుడు.

సంగీతంలో గ్రామమూర్ఛనాభేదాలను కూలంకషంగా ఎరిగినవాడు. దుర్బలుడైనా ఎనిమిది రసాలూ

తెలిసినవాడు. ఇటువంటి వరుడు దొరకడమే ఒక అదృష్టం. గంగా సరస్వతినదులు ఎలా కైలాసానికి

తీసుకువెడతాయో అలాగ స్వరజ్ఞాన విశారదుడైన ఈ నారదుడు నన్ను తీసుకువెడతాడు. స్వరప్రమాణాలు

తెలిసినవాడు మానవుడైనా దేవతకింద లెక్క. సప్తస్వరాలు తెలియనివాడు ఇంద్రుడైనా పశువుతో

సమానం.

స్వరమావం తు యో వేద సదేవో మామషోఽపి పవ్

సప్తభేదం న యో వేద స పశుః సురరాడపి

మూర్ఛనా తానమార్గం తు శ్రుత్వా మోదం నయాతి యః ప సపశుస్సర్వథా జ్ఞేయో హరిణాః పశవో న హి |

వరం విషధరః సర్పః శ్రుత్వా వాదం మవోహరమ్ ।

అశ్రోత్రోఽపి ముదం యాతి ధిక్సకర్ణాంశ్చ మానవావ్

బాలోఽపి సుస్వరం గేయం శ్రుత్వా ముదితమానసః ।

జాయతే కింతు యే వృద్ధా నజానంతి ధిగస్తు తాన్||

హిందూ ధర్మం* 🌹

 🌹 *మన హిందూ ధర్మం*  🌹

   ప్రతి రోజు పూజ గదిలో మాలిన్యాన్ని తీసి శుభ్రపరిచినట్టు హృదయాన్ని, మనసుని శుభ్రపరిచి ఆరాధించ మని చెప్పేది హిందూ ధర్మం! ప్రతి బాధ్యత పవిత్రమైనదే

బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునికి మనం చేయ గలిగే అత్యుత్తమ అర్చన! భగవంతుడు లేడని చెప్పిన వానిని మత ద్రోహిగా పరిగణించమని హిందూ ధర్మం చెపుతుంది! కనీసం వారానికి రెండుసార్లు ఐనా దైవ దర్శనం చేసుకోమని హిందూ ధర్మం చెపుతుంది!

ఆరాధ్య జన్మలో పుట్టిన వారికి, ఇతర బ్రాహ్మణ మతముల వారికి,  కాశీకో, లేక రామేశ్వరానికో తప్పని సరిగా ఒక్కసారైనా శివ దర్శనం చేసుకోమని హిందూ ధర్మం చెపుతుంది! హిందూ ధర్మాల ప్రకారం నిబంధనలు పాటించి సనాతన ధర్మాన్ని రక్షించమని హిందూ ధర్మం చెపుతుంది! హిందూ మతానికి మత మార్పు చేయమని చెప్పదు, ఎవరి దైవాని వారు మనస్ఫూర్తిగా ఆరాధించ మని చెపుతుంది పరమత దూషణ, ఇతర దైవం ఎవరైనా దూషించవద్దు మన దైవాన్ని గురించి గొప్పగా చెప్పమని చెప్పే ధర్మం హిందూ ధర్మం ఎలా బ్రతకాలో మనిషికి ఇలా బ్రతకాలి అని తెలియ పరిచేది హిందూ ధర్మం మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి మనిషిగా బ్రతకడానికి దారి చూపించేది ఒక్క హిందూ మతం మాత్రమే సనాతన ధర్మం అంటే అతి పురాతనమైనది, ప్రాచీయినమైనది అని అర్ధం!హిందూ మతానికి ప్రత్యేక మైన పీఠాధిపతులు, ఉప పీఠాధిపతులు ఉండరు!

సన్యాసులు కానీ, స్వామీజీలు కానీ, మత పెద్దలు కానీ, అన్యులు ఎవరైనా కానీ తప్పులు చేసిన నిలదీసి ప్రశ్నించే హక్కు హిందువులకు ఉంది!

హిందువులు ప్రకృతి పార్వతి దేవి అంశ అని, ఆకులు, పూలు వృక్షాలను, రాళ్లలో కూడ రత్నం లాంటి రామేశ్వరాన్ని దర్శిస్తారు! వృక్షాలలో కూడ త్రిమూర్తులను దర్శించే సంకల్పం ఉన్నవారు హిందువులు!  నీటిని గంగా దేవిగా, గాలిని వాయు లింగ రూపంలో ఉన్న శివాంశతోను

వానరములను,  హనుమంతునితోను, కుక్కలని,కూడ కాశీలోని కాలభైవ దర్శనం అనగా, కాలభైరవునితోను, పందులను, వరాహ స్వరూపంతోను, మన వేదాలు, పురాణాలూ, ఇతిహాసాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత,  బాగోతాలు శాస్త్రాలు గ్రంధాలు వీటన్నిటిని కూడ హిందూ ధర్మం కింద ఆరాధిస్తారు హిందువులు! ప్రతి జీవిలోనూ శివతత్వం చూస్తుంది! అన్ని మతాలను గౌరవించేది మన హిందూ మతం! పరమత దూషణ చేయనిది, ధర్మం, హిందూ ధర్మం! ఇంత గొప్పది మన భారత దేశం, ఇక్కడి ధర్మాలు అందుకే విదేశీయులు కూడ మన మత ధర్మాల మీద ఆశక్తి చూపుతారు!

*హిందూధర్మం వర్ధిల్లాలి*

🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️ *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* *శివస్తుతి - 4* *వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం౹* *వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం౹* *వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం౹* *వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* ॥తా॥ భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా, బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

            *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_*

*శివస్తుతి - 4*

 *వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం౹*

*వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం౹*

*వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 

॥తా॥

భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా,   బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*

*ఆచార్యుల అనుభవాలలో తిరుమల*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

భగవద్రామానుజులకు ఆచార్యులైన పెరియ తిరుమల నంబిగారు (రామానుజాచార్యుడు) తమ ఆచార్యులైన ఆళవన్దారుల ఆదేశానుసారం ఇక్కడే వేంచేసియుండి తీర్థకైంకర్యంతో పాటు అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేయుచుండెడివారు.

 ఒక నాడు వీరు పాపనాశనం నుండి తిరుమంజనం తీర్థం తెచ్చుచుండగా స్వామి మారువేషంలో వచ్చి "తాతా! దాహంగా ఉంది కాస్త తీర్థం ఇవ్వవూ" అని ప్రార్థించి వీరొసంగిన తీర్థం కడుపార త్రావి నిజరూపంతో సాక్షాత్కరించాడు.

 కావుననే వీరిని "పితామహస్యాపి పితామహాయ" అంటారు సంప్రదాయ వేత్తలు (అహంహి సర్వలోకానాం మాతాథాతా పితామహ:అని చెప్పిన సర్వేశ్వరునిచే "తాతా" అని పిలువబడుటచే పితామహునకు కూడా పితామహుడై నారు)

*తిరుమలై అనన్దాళ్వాన్ అను మహనీయులు రామానుజుల వారి శిష్యులు.* 

వీరు ఆచార్యాజ్ఞను శిరసావహించి తిరుమలలో వేంచేసి యుండి నందనవనమును పెంచి పెరుమాళ్లకు పుష్ప కైంకర్యము చేసెడివారు. 

వీరు ఆనాడు పెంచి పోషించిన నందనవనం నేటికిని అనన్తాళ్వాన్ తోటగా ప్రసిద్దమై నానాపుష్పలతా గుల్మతరుశోబితమై అలరారు చున్నది.

 వీరి యీ కైంకర్యమునకు సంతసించిన భగవద్రామానుజులు వీరిని "అనన్దాన్ పిళ్ళై" అని అనేవారట. 

ఒక పర్యాయం పద్మావతీ శ్రీనివాసులు రాజకుమారిక రాజకుమారుల వేషంలో అనన్దాళ్వాన్ తోటలోని పుష్పములను కోసికొని అలంకరించుకొంటున్నారు. ఇంతలో అనన్దాళ్వాన్ రావడం చూచి వారు సన్నిధికి అప్రదక్షిణంగా పరుగెత్తి ఉద్యానవనం దగ్గర అంతర్థానమై నారట. దీనికి సూచకంగా బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు స్వామివారు అప్రదక్షిణంగా ఉద్యానవనంలోనికి వేంచేస్తారట.

*భగవద్రామానుజుల కైంకర్యములు*

భగవద్రామానుజులు ఈ సన్నిధిలో గావించిన కైంకర్యములు అనేకములు.

 అవినేటికిని మనకు మనకు దర్శనీయములై యున్నవి.

 వీరు వేంకటాచలపతికి శంఖచక్రములను ప్రసాదించారు. స్వామి వక్షస్థలమున ద్విభుజయగు వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన రత్నమాలికా యోగమున సమర్పింప జేసినారు. 

కావుననే ప్రతి శుక్రవారం స్వామికి తిరుమంజనం జరుపుచున్నారు.

పూర్వం ఈస్వామి బ్రహ్మోత్సవములు "తిరుచానూరు" (తిరుచ్చుగనూరు) లో జరిగేవట-

కానీ రామానుజులవారు ఈ ఉత్సవములు కొండమీదనే జరిగేలాగున అచటి సన్నిధి చుట్టు వీధులను నిర్మింపజేసి భక్తులకు అవాస యోగ్యము గావించి అది మొదలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్కడే జరిగేటట్లు చేశారు.

ఈ సన్నిధిలో కౌతుక బేరంగా ఉండిన "మలైకువియా నిన్ఱపెరుమాళ్ళను" ఉత్సవమూర్తిగాను అప్పటివరకు ఉత్సవమూర్తిగా ఉండిన "వేంగడత్తుఱైవార్" అనువారిని కౌతుక బేరంగాను ఆలయ వైభవాభివృద్ధికై మార్పు చేయించినారట రామానుజులవారు.

 ఈ "మలైకువియా నిన్ఱ పెరుమాళ్లనే" మలైయప్పన్ అని అంటారు.

ఇట్లే ఈ సన్నిధిలో అర్చకులుగా "శెంగవిరాయన్" అను వైఖానస ఆచార్య సత్తముల వంశీయులే ఉండవలయునని నియమించారు.

 స్వామి పుష్కరిణీ తీరమునగల వరాహ ప్పెరుమాళ్ల సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులా (అల్పిశి) మాసం శ్రవణం నాడు తిరునక్షత్రోత్సవమును నిత్య తిరువారాదనమును యథావిధిగా జరుగునట్లు కట్టడి చేసారు.

ఒకప్పుడు ఈ ఆలయం శత్రు సమాకాస్తం కాగా పర పురుష స్పర్శనొల్లని పెరియపిరాట్టి (శ్రీదేవి) స్వామి వక్షస్థలమును చేరగా భూపిరాట్టి (భూదేవి) ఉద్యానవనమున గల " అళగప్పిరానార్" " అను బావియందు ప్రవేశించినారట.

శ్రీ ఆళవందారులు తిరుమలైకి వేంచేసినపుడు ఒక సందర్భంలో "మారిమారాద తణ్ణమ్మలై" అనునట్లు సంతత వర్షాతిశయమును చూచి ఇట్టి వర్షాతిశయ సమయములలో తిరుమంజన తీర్థము పాపవినాశం నుండి తేనవసరం లేదని ఈ నందనో ద్యానమునగల " అళగప్పిరానార్" " అను ఈ బావితీర్థమును వినియోగింప వచ్చునని ఆనతిచ్చిరట. 

ఈ బావికి "అళగప్పిరానార్" అను దివ్యనామము నుంచినవారు శ్రీఆళవందారులే. స్వామి రామానుజులు ఆనామమునే స్థిరపరచి దాని సమీపంలో భూదేవిని శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠింపజేసినారు.

ఈ బావిని త్రవ్వించినవాడు రంగదాసు అను గొప్ప భక్తుడు. అతడు స్వామివారికి ఆలయ ప్రాకార గోపురాదులను నిర్మింప సంకల్పించి ప్రాకార నిర్మాణమునకు అడ్డుగా ఉన్న తింత్రిణీ వృక్షమును; (ఈ నిర్ణిద్ర తింత్రిణీ వృక్షము క్రిందినే స్వామి వేంచేసియుండేవారు) స్వామి దక్షిణ పార్శ్వమున అమ్మవారు వేంచేసియున్న చంపక వృక్షమును అడ్డుతొలగవలసినదని సవినయంగా భక్తితో ప్రార్థించారట.

 ఆరాత్రి ఆరెండు వృక్షములు వెనుకకు తగ్గగా కట్టడములను నిర్మింపజేశారట. నేడు ఈవృక్షములు గలప్రాకారాన్ని చంపక ప్రాకారమని ఆబావిని పూలబావియని వ్యవహరిస్తున్నారు. 

రామానుజులవారు ఈ వృత్తాన్తాన్ని విని ఆరెండు వృక్షములు ఆదిశేషాంశములని భావించి వానికిని నిత్య తిరువారాధన జరిగేలా నియమించినారట.

మరియొకప్పుడు "వీరనరసింహదేవరాయలు" అను రాజు తిరుమలైకు యాత్రగా వచ్చి స్వామిని సేవించి స్వామికి గోపురము నిర్మించాలని సంకల్పించి పెద్దల అనుమతితో గోపురం కట్టనారంభించినారట.

ఒకరోజు రాత్రి ఒక సర్పం ఆరాజు కలలో కనిపించి "రాజా! నీవు ఈగోపురము నిర్మిస్తుంటే నాశరీరం నానా బాధలు పడుతున్నది" అని పలికిందట. రాజు ఆశ్చర్యపడి మరునాడు స్వామిని సేవింపగా ఆ సర్పం స్వామియొక్క వైకుంఠ హస్తమును చుట్టుకొని దర్శనమిచ్చి అంతర్ధానమైనదట.

 ఆ సన్నివేశం చూచిన రాజు ఆ పర్వతం ఆదిశేషుడే యని విశ్వసించి గోపుర నిర్మాణమును అంతటితో ఆపివేసినాడు. ఆ వృత్తాన్తమును విన్నపెద్దలు స్మారకంగా స్వామివారికి స్వర్ణనాగాభరణమును సమర్పించినారట. రామానుజులవారు దానిని విని రెండవ శ్రీహస్తమునకును నాగాభరణం సమర్పింపజేసినారట.

స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీశంకరాచార్యులవారికి శ్రీనరసింహస్వామి సాక్షాత్కరించి నందువలన అచట శ్రీనరసింహస్వామి సన్నిధియుండెడిది. 

కానీ లక్ష్మీసాహచర్యం లేనందువలన ఆస్వామి మహోగ్రంగా యుండె వారట. అందుచే వారిని ఆరాధింపరాదని కొందరు పలుకగా రామానుజులవారు అదిసరికాదని భావించి ఆస్వామిని శ్రీవేజ్కటాచలపతి సన్నిధి ప్రాకారములోనే ఈశాన్య దిక్కున విమానాభిముఖముగా ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించినారట.

 ఇట్లే పురాణ ప్రసిద్ధి ననుసరించి కొండనెక్కే మార్గంలోను నరసింహమూర్తిని ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాదన జరిగేలా ఆదేశించారట.

శత్రువుల వలన కలిగిన ఒక మహోపద్రవ సమయంలో తిల్లై తిరుచ్చిత్తర కూడమున (చిదంబరం) వేంచేసియున్న గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో

తిరుపతికి వేంచేసి మలై ఆదివారంలో కొంతకాలం ఆరాధింపబడినారట.

అట్లె శ్రీరంగము నుండి నంబెరుమాళ్ళు (శ్రీరంగనాథులు) దెవెరులతో తిరుమలైకు వేంచేసి ద్వజస్తంభమున కెదురుగనుండు రంగమండపమున కొంతకాలం భక్తులకు సేవసాయించినారట. 

ఈ సన్నిధిలో స్నపన బేరముగా నున్న "అలగప్పిరానార్" అనుమూర్తియే శయ్యా బేరముగను సేవలనందుకొనుచున్నారు. కాని దనుర్మాసం నెలరోజులు మాత్రం శ్రీవైఖానసాగమం ప్రకారం శ్రీకృష్ణమూర్తియే శయ్యా బేరముగ శయన సేవను అనుగ్రహించు చుండును.

*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *44వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *44వ అధ్యాయం*

*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ జననం - 7*

కూర్చోబోతున్న చంద్రుడి చూపులు ఆశ్రమం వైపు

ఒక్కసారిగా దూసుకు వెళ్ళాయి. వాతాయనం ముందు నిలుచుని తీక్షణంగా చూస్తున్న తార , గిరుక్కున వెనుదిరిగింది.

అర్ధరాత్రి దాటింది. చంద్రుడు పొదరింటి సమీపంలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తార. ఎందుకు రాలేదు ? వస్తుందా ? రాదా ? వస్తానంటూ సంకేతం ద్వారా సందేశం అందించిందే ! బృహస్పతి మీద ఎందుకో కోపమొస్తోందతనికి.

ఇలా తిరుగుతూ ఉంటే - విద్యార్థులో , పరిచారికో - ఎవరైనా చూసే అవకాశం ఉంది ! చంద్రుడు... ఆ ఆలోచన తట్టిన వెంటనే పొదరింట్లోకి దూరాడు. 

ఉన్నట్టుండి గాలి సరికొత్త సౌరభాన్ని మోసుకొచ్చింది. ఇంతసేపూ ఆ ప్రదేశంలో లేని ఆ కొత్త సువాసనను వెంబడిస్తూ సన్నగా , లీలగా... అందెల సవ్వడి ! చంద్రుడి హృదయం ఉత్సాహంతో స్పందించింది.

*"చంద్రా !"* తార తగ్గు స్వరంతో పిలిచింది.

చంద్రుడు పొదరింట్లోంచి అవతలకి వెళ్ళాడు. వేగంగా తార అతని దగ్గరగా నడిచింది. తార కంటే ముందుగా , ఆమె పైట కొంగు గాలికి ఎగురుతూ , చంద్రుడి వైపు దూసుకుంటూ వచ్చింది. చంద్రుడనే గండు చేపను పట్టడానికి తార విసరిన వలలా - ఆ పైట చంద్రుడి ముఖాన్ని కప్పింది. పైటను వెంటాడుతూ వచ్చిన తార తనువు చంద్రుడి శరీరాన్ని తాకింది.

తక్షణం యాంత్రికంగా ఆమె చేతులు అతడినీ , అతడి చేతులు ఆమెనూ చుట్టేశాయి. తార పెదవులు చంద్రుడి చెవి దగ్గరగా కదుల్తూ గుసగుసగా 'చంద్రా !' అన్నాయి. సమాధానం అందజేస్తూ చంద్రుడు తన చెవిని ఆమె పెదాలకేసి నొక్కాడు.

ఇద్దరి ఆలోచనలూ ఒక్కటిగానే ఉన్నట్టు , ఇద్దరి శరీరాలు ఒకే విధంగా ప్రతిస్పందిస్తునట్టూ - అసంకల్పితంగా ఒకర్నొకరు నడిపించుకుంటూ పొదరింట్లోకి వెళ్ళారు. ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు.

*"తారా..."* చంద్రుడు బరువుగా అన్నాడు. *"ఈ రెండు రోజులూ అంతులేనివిగా అనిపించాయి...”*

*"మనం జాగ్రత్తగా నడుచుకోవాలి... లేకపోతే ప్రమాదం ! అందుకే... రాలేదు...”* తార అంది.

*"తారా !”* చంద్రుడు మత్తుగా, పారవశ్యంతో పిలిచాడు. *"నిన్ను అలా పిలుస్తూనే ఉండాలనిపిస్తోంది !".*

తార చెయ్యి ప్రేమలతలా కదిలి , చంద్రుడి మెడ చుట్టూ అల్లుకుని , అతన్ని కిందికి లాగింది. చంద్రుడు వాలాడు. క్షణంలో తార ఒడిలో.

*“నిన్ను నోరారా పిలవాలనిపిస్తోంది...కానీ..నా పిలుపు ఇక్కడ ఇతర్లు వింటారేమో అన్న భయం నన్ను పీడిస్తూనే ఉంటుంది !”* చంద్రుడు ఆవేశంగా అన్నాడు. 

తార చెయ్యి చంద్రుడి జుత్తును ప్రేమగా నిమిరింది. *"మనది రహస్య ప్రణయం. ఇలాగే చాటుమాటుగా... "*

చంద్రుడు ఆవేశంగా లేచి కూర్చున్నాడు. *"అది నాకు నచ్చదు !"* అతని కంఠంలో ఆవేశం గంటలా ధ్వనించింది. *"వడ్డించిన విస్తరి ముందు చేతులు కట్టివేయబడి కూర్చోవడం నాకు నచ్చదు.”*

"చంద్రా !"

*"నువ్వూ... నేనూ... అంతే ! మరెవ్వరూ ఉండకూడదు. మనల్ని ఎవ్వరూ - చాటుగా అయినా సరే - చూడకూడదు. మన మాటల్ని వినకూడదు.”*

తార చేత్తో చంద్రుడి బుగ్గ నిమిరింది. *“నువ్వు వర్ణిస్తుంటే - అలా ఉండాలని , శాశ్వతంగా అలాగే ఉండిపోవాలనీ నాకు అనిపిస్తోంది , తెలుసా ?"*

*"తారా ! నిన్ను...నాతో తీసుకెళ్ళిపోతాను !"* చంద్రుడు ఉద్రేకంతో అన్నాడు. 

*“ఎక్కడికి ?”*

*“నాకు నువ్వూ , నీకు నేనూ మాత్రమే కనిపించే చోటికి !"*

*“ఎక్కడికి ?”* తార ప్రశ్నతో నవ్వు జత కలిపింది.

*“మనిద్దర్నీ ఎవ్వరూ చూడలేని...”*

*“ఎక్కడికి ?”*

*“మనిద్దర్నీ ఒక్కటిగా ఉంచే ఏకాంత ప్రదేశానికి !”*

*“ఎక్కడికి ?”* తార తన రెండు చేతుల్తో చంద్రుడి ముఖాన్ని , తన వైపు తిప్పుకుని , నవ్వుతూ అడిగింది.

*"నా మందిరానికి !”*

*"నీ మందిరమా !"* తార కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది. *“నీ తల్లిదండ్రులు ఆశ్రమానికా ?”*

*“కాదు. నా మందిరానికి ! నా కోసం విశ్వకర్మ మందిరం నిర్మించాడు ! విద్యాభ్యాసం పూర్తయ్యాక , వివాహం చేసుకుని , నేను ఆ మందిరంలో నివాసం ప్రారంభించాలి... "*

*"ఓహ్...”*

*“నా విద్యాభ్యాసం ఇక్కడికి వచ్చిన రోజే - ఆశ్రమ వాతాయనంలో నీ కళ్ళను చూసిన క్షణంలోనే పూర్తయింది !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు.

ప్రతిస్పందనగా తార అరచేతులు చంద్రుడి బుగ్గల్ని సున్నితంగా నొక్కాయి. చంద్రుడి అరచేతులు ఆమె చేతుల మీదికి చేరి , నిమురుతున్నాయి. 

*"వివాహం... అది కూడా అయిపోయింది ! నీతో ! నీ చెయ్యి పట్టుకున్నాను. పాణిగ్రహణం అయిపోయింది ! త్వరలో నిన్ను రహస్యంగా తీసుకెళ్ళిపోతాను. దాంతో'రాక్షసం' కూడా అయిపోతుంది !"*

*"చంద్రా...”* తార కంఠంలో పారవశ్యం జీరగా ధ్వనిచేసింది.

*"నువ్వు నా కోసమే పుట్టావు. నా కోసమే బృహస్పతిని పెళ్లి చేసుకున్నావు. నా కోసమే దాంపత్య శిల్పం నేర్చుకుని , సిద్ధంగా ఉన్నావు !"*

ఏదో ఆవేశం , ఏదో ఉద్రేకం తారని చంద్రుడి కౌగిలిలోకి తోసింది. అతని చెవి దగ్గరగా ఆమె పెదవులు కదుల్తున్నాయి. *"మొదట్లో నీకు మాటలు రావేమో అనుకున్నాను. భయపడి పారిపోతావేమో అనుకున్నాను. నిన్ను... నీ సౌందర్యాన్ని నా దారికి తెచ్చుకోగలనో , లేనో అని నాలో నేనే నలిగిపోయాను. కానీ... ఎంత త్వరగా - ఎంతగా ఎదిగిపోయావ్ !".*

*"ఎప్పుడు ఎదిగానో చెప్పనా ?"* చంద్రుడు తార చెవిలో అన్నాడు. చెప్పమన్నట్టు తార చెంప అతని చెంపను నొక్కింది.

*"సౌందర్యరాశి అయిన తార కౌగిలిలో మొదటి సారిగా ఒదిగినప్పుడు , ఎదిగిపోయాను !"*

*"మీ గురుదేవులు రేపు ఉదయం... ఇంద్రసభకు వెళ్తున్నారు..."* తార ఉన్నట్టుండి. మాట మారుస్తూ అంది.

*“శుభసూచన ! ఆయన అలా నిష్క్రమించాక , విద్యార్థులు సమిధల కోసం అరణ్యానికి వెళ్తారు. పుంజికస్థల జల గ్రహణం కోసం నదికి వెళుతుంది"* చంద్రుడు సాలోచనగా అన్నాడు.

*"మనిద్దరం..." అంటూ ప్రశ్నార్థకంగా అంది తార.*

*"ఒక్కటై - పోదాం ! ఒక్కటైపోదాం !".*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 55*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 55*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

అమ్మమ్మ వాళ్ళఇంట్లో నరేంద్రుని చదుకొనే గదికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు వెళ్లీనప్పుడు ఆధ్యాత్మిక సాధనల గురించి అనేక విషయాలను  ఉపదేశించేవారు. తల్లితండ్రుల నిర్బంధం కారణంగా వివాహబంధంలో చిక్కుకోవద్దని అతడ్డి హెచ్చరించేవారు; బ్రహ్మచర్య మహత్వాన్ని తెలియజెప్పేవారు. "పన్నెండు సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా బ్రహ్మచర్యం పాటిస్తే మేధానాడి జనిస్తుంది. అందువలన సూక్ష్మమయిన, అతి  సూక్ష్మమైన విషయాలలో చొచ్చుకొనిపోయి వాటినన్నిటినీ  కూలంకషంగా అవగతం చేసుకోగలుగుతాడు. 

ఈ మేధాశక్తి సహాయంతోనే భగవదనుభూతి పొందడం సాధ్యమవుతుంది. ఇటువంటి పావనమైన బుద్ధిగల వ్యక్తికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు"  అంటూ వివరించేవారు..

శ్రీరామకృష్ణులు సాన్నిహిత్యం వలననే నరేంద్రుడు వివాహానికి విముఖంగా ఉన్నాడని అతడి ఇంట్లోనివారు భావించారు. ఈ విషయంగా నరేంద్రుడు ఇలా చెప్పాడు: "ఒక రోజు అలవాటు ప్రకారం శ్రీరామకృష్ణులు నేను చదువుకొనే గది లోకి వచ్చి బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నారు. రహస్యంగా మా అమ్మమ్మ ఆ మాటలు విని, నా తల్లితండ్రులతో చెప్పేసింది. ఒక సన్న్యాసితో మెలగుతున్న నేను కూడా సన్న్యాసం పుచ్చుకొంటానేమోనని భయపడి ఆ రోజు నుండి వివాహపు ఏర్పాట్లు తీవ్రతరం చేశారు మా వాళ్ళు. కానీ ఏం ప్రయోజనం?

 శ్రీరామకృష్ణుల దివ్యసంకల్పం ముందు వారి ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయి. కొన్ని సంబంధాలు ఖాయమై, ఇక వివాహమే తరువాయి అనే స్థితికి కూడా వచ్చాయి. కాని ఏదో చిన్న విషయంలో రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయం తలెత్తి వివాహం ఆగిపోయేది."

నరేంద్రుడు తరచు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేక పోయినా, అతడితో ఆ విషయం ప్రస్తావించడానికి ఎవరికీ ధైర్యం లేదు.  "ఇది చెయ్యి, అది చెయ్యవద్దు" అంటూ నియమాలు విధిస్తే పర్యవసానం విపరీతంగా ఉంటుందని ఇంట్లో వారికి తెలియకపోలేదు. కనుక నరేంద్రుడు శ్రీరామకృష్ణుల4 వద్దకు నిరాటంకంగా వెళ్లగలిగాడు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 44*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 44*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్యలహరీ*

 *పరీవాహ స్రోతస్సరణిరివ సీమన్తసరణిః |*

*వహంతీ సిందూరం ప్రబల కబరీభార తిమిర*

*ద్విషాం బృందై ర్బన్దీకృతమివ నవీనార్క కిరణమ్ ‖*

అమ్మవారి పాపిట సిందూరాన్ని వర్ణిస్తూ *సౌందర్యలహరి* అనే మాట ఇక్కడ వాడారు శంకరులు.

తనోతు క్షేమం = మా క్షేమాన్ని విస్తరింపజేయుగాక! ఏది?

తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ

సీమన్త సరణిః = నీ ముఖ సౌందర్యం ఒక ప్రవాహంలాగా వుంటే ఈ ప్రవాహం ప్రసరించటానికి కాలువ వలె వున్నది నీ పాపిట. 

సీమంత  సరణిః వహంతీ సిందూరం = ఆ కాలువ చివర మెరుస్తున్నది సిందూరం. అది ఎలా వున్నది?

ఉదయిస్తున్న సూర్యుని కిరణము వలె వున్నది.

ప్రబల కబరీభార తిమిర ద్విషాం బృందై ర్బందీకృత మివ = దట్టమైన జుట్టు అనే చీకట్లు బృందముగా ఏర్పడి సూర్యకిరణమును బంధించినట్లు వున్నది.

ఈ సిందూర కాంతి నందనవనము నుండి నీ కబరీభరమును అలంకరించిన సుగంధభరితమైన దివ్యపుష్పములు మా అజ్జ్ఞానాంధకారాన్ని తొలగించుగాక! 

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

అహంకార రాహిత్యం

 అహంకార రాహిత్యం

ఆదిశంకర భగవత్పాదులు ఈ దేశంలో జన్మించినటువంటి మహోత్కృష్టమైన దార్శనికులు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతార స్వరూపం. ఒక కాలంలో మనదేశంలో ధర్మం క్షీణించిపోయిన సమయంలో దేవతల ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో అవతారం చేయడం జరిగింది. ఆయన కేరళ దేశంలో కాలడి అనే గ్రామంలో అవతరించారు. కేవలం చిరు వయస్సులోనే సకల వేద శాస్త్రములను ఔపోశన పట్టారు. 

ఎనిమిది సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నారు. పదహారు సంవత్సరముల లోపల అనేక గ్రంధాలను వ్రాశారు. 32 ఏళ్ళ వయస్సులో యావద్భారతంలోనూ మూడుమార్లు సంచరించి జనులకు ధర్మ ప్రబోధం చేసి అపారమైన లోకోపకారం చేశారు. అటువంటి వ్యక్తిత్వమును అన్యత్ర ఎక్కడా మనం చూడలేము. అందువలననే ఆయనను మనం పరమ ఆరాధ్యుడిగా, పరమ పూజ్యుడిగా సేవించుకుంటున్నాము. ఆయనయొక్క పవిత్ర నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాము. అందరినీ భగవంతుడి యొక్క కృపా పాత్రులను చేయడానికి ఆయన కృషి చేశారు.

ఆయన ఒక చోట ఇలా చెప్పారు- "నాయనలారా! మొట్టమొదట మీయొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి. "మా కురు ధన జన యౌవన గర్వం" మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని, అహంకారం. ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురుని వలె  తప్పుడు పనులు చేస్తాడు. సీతాపహరణమనే మహాపరాధం చేశాడు. 

ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. పెడచెవిని పెట్టాడు. చివరికి సర్వనాశనం అయ్యాడు. ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం చేసుకోవాలి. భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు.

తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా

అమానినా మానదేన కీర్తనేయః సదా హరిః!!

ఎవరైతే లవలేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో,  ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట "మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం" నువ్వు వేటిని చూసి అయితే అహంకార పడుతున్నావో అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే భగవదనుగ్రహం. భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా ఉంటుంది. కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణం అవుతుంది.

Sound proof technology

Laksyam

Automatic candle control

Love towards monkey

Asoucham

Sautyavratudu

High speed DC motor

Samosa

Samosa making

 https://youtu.be/spV67l0WnJA?si=ZfyoPzTTe0YSjyPe

భగవద్గీత ఏం చెబుతుంది?

 ❤️ *భగవద్గీత ఏం చెబుతుంది?*

💕 *ధర్మాధర్మాల గురించి చెబుతుంది.*

💕 *కర్తవ్యం గురించి చెబుతుంది.*

💕 *నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు,అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.*

💕 *ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.*

💕 *సుఖం,శాంతి,త్యాగం,యోగం అంటే ఏమిటో చెబుతుంది.*

💕 *ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.*

💕 *పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.*

💕 *ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.*

💕 *స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.*

💕 *జ్ఞానం,మోక్షం,బ్రహ్మం, ఆధ్యాత్మికంఅంటే ఏమిటో చెబుతుంది.*

💕 *ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.*

💕 *ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.*

💕 *మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.*

💕 *పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.*

💕 *కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవం దగ్గరకు చేరుస్తుంది.

💕 *నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.*

🌺 *ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’*

 ❤️ *సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి*

💕 *”సంతోషంగా ఉండాలి” అనుకుని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.* 

💕 *తన పనిని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ఫలితం లభిస్తుంది.*గీత చెప్పేదే అది. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*

💕 *’సన్యాసం’అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*

💕 *ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు.* *ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*

💕 *ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది.* 

💕 *కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది.*

💕 *’నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.*

❤️ *అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను, నన్ను,మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత.*

💕 *మానవుడి అభ్యున్నతికి మార్గదర్శనం చేస్తుంది భగవద్గీత.* 

🍁హరి🍁 నామ స్మరణ చేయండి ఆనందంగా ఉండండి.

 ☘️🌹శ్రీవేంకటేశాయ నమః🌹🍀

ఋషులు జాబితా

 🚩🙏🚩

హిందూ ఋషులు జాబితా

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు

అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న

ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష

దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి‎

అమహీయుడు

అజామిళ్హుడు‎

అప్రతిరథుడు‎

అయాస్యుడు‎

అవస్యుడు

అంబరీషుడు

ఇరింబిఠి‎

ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి

ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి

కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు

గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు

చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎

జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎

తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి

దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎

నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు

పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు

భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు

మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎

రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు

వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు

శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు

సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి

హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి

🙏🏽

Bhojanaalu

Tamota

వ్యాధులు 2 రకములు

 ಸುಭಾಷಿತ . 639 .

ದ್ವಿವಿಧೋ ಜಾಯತೇ ವ್ಯಾಧಿಃ ಶಾರೀರೋ ಮಾನಸಸ್ತಥಾ | ಪರಸ್ಪರಂ ತಯೋರ್ಜನ್ಮ ನಿರ್ದ್ವಂದ್ವಂ ನೋಪಲಭ್ಯತೇ ||

ಶಾರೀರಿಕ , ಮಾನಸಿಕ - ಎಂದು ಎರಡು ಬಗೆಯ ರೋಗ ಹುಟ್ಟುತ್ತದೆ . ಅದು ಒಂದನ್ನೊಂದು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ಹುಟ್ಟುತ್ತದೆ .  ಶಾರೀರಿಕವಿಲ್ಲದೆ ಮಾನಸಿಕ ರೋಗವಿಲ್ಲ . ಮಾನಸಿಕವಿಲ್ಲದೆ ಶಾರೀರಿಕ ರೋಗವಿಲ್ಲ .

ಮಹಾಭಾರತ .

 వ్యాధులు 2 రకములు. శారీరకం, మానసికం. రెండు ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి.

*05-10-2023* *గురు వారం* *బృహష్పతి వాసరః* *రాశి ఫలితాలు

 *05-10-2023*

   *గురు వారం*  

 *బృహష్పతి వాసరః*

 *రాశి ఫలితాలు*

*మేషం*

ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. 

*వృషభం*

ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు.  గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది.

*మిధునం*

 అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.  వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

*కర్కాటకం*

స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన  ఫలితం అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర  విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో  మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.

*సింహం*

ఆకస్మిక ధనలబ్ది పొందుతారు.  చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో  విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు.  వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి.

*కన్య*

బంధు మిత్రులతో  స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి  వ్యాపారాలు  మందకొడిగా సాగుతాయి. చేపట్టిన  వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.  ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

*తుల*

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో  నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు   నిరాశ పరుస్తాయి. నూతన  రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. 

*వృశ్చికం*

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

*ధనస్సు*

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో  పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

*మకరం*

నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక  వ్యవహారాలలో సన్నిహితుల  నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన   వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితులుంటాయి. 

*కుంభం*

ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో  మానసిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృధా  ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

*మీనం*

గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన  వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సంఘంలో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది. 

🕉️ 🚩📱🇮🇳

శివస్తుతి - 4*

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

            *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_*

*శివస్తుతి - 4*

 *వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం౹*

*వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం౹*

*వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం౹*

*వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹* 

॥తా॥

భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా,   బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

విష్ణువైనా సరే శివుడైనా సరే

 *శ్లో|| ఏకో దేవః కేశవోవాశివోవా*, 

*ఏకో వాసః పట్టణం వా వనం వాl*

*ఏకం మిత్రంభూపతిర్వా యతిర్వా* 

*ఏకో నారీ సుందరీ వా దరీ వా ll*

*తాత్పర్యము, విష్ణువైనా సరే శివుడైనా సరే ఒక్కడే దేవుడని నమ్మాలి. పట్టణం కానీ అడవి కానీ ఏదైనా నివాసయోగ్యమైనదే. రాజు కానీ సన్యాసితో గానిస్నేహంచేయవచ్చు .అందమైన గుణవతి అయిన భార్యతో కాపురంచేయవలసినదే లేదా కొండ గుహలో కూర్చొని తపస్సు అయిన చేసుకోవాలి*.

కర్మాచరణము

 కర్మాచరణము నందున

కర్మంబుల మర్మమెరుగు కర్మము కన్నన్

కర్మను విధినిర్దిష్టపు

ధర్మ ముగా నెరుగు శర్మ ధరణిన సుజనా.

🙏🙏🙏

ఎన్నడూ కాలుష్యం ఉండదు

 *1945*

*కం*

మర్మంబెరిగిన వారల

కర్మంబుల కలుషమెపుడు కనరాదెటులన్.

ధర్మాధర్మంబులలో

మర్మంబులనెరుగువారె మాన్యులు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధర్మాధర్మ ముల మధ్య మర్మం తెలిసిన వారి కర్మలలో ఎన్నడూ కాలుష్యం ఉండదు. ఆ మర్మం తెలిసిన వారే మహనీయులు.

*సందేశం*:-- రెండు విరుధ్ధ వ్యవస్థ ల మధ్య ఆంతరంగిక భావం తెలుసుకున్న వారి కి ఎవరి తోనూ విరోధం ఉండదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-66🌹*

*ఆచార్యుల అనుభవాలలో తిరుమల*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

భగవద్రామానుజులకు ఆచార్యులైన పెరియ తిరుమల నంబిగారు (రామానుజాచార్యుడు) తమ ఆచార్యులైన ఆళవన్దారుల ఆదేశానుసారం ఇక్కడే వేంచేసియుండి తీర్థకైంకర్యంతో పాటు అనేక కైంకర్యాలను స్వామి సన్నిధిలో చేయుచుండెడివారు.

 ఒక నాడు వీరు పాపనాశనం నుండి తిరుమంజనం తీర్థం తెచ్చుచుండగా స్వామి మారువేషంలో వచ్చి "తాతా! దాహంగా ఉంది కాస్త తీర్థం ఇవ్వవూ" అని ప్రార్థించి వీరొసంగిన తీర్థం కడుపార త్రావి నిజరూపంతో సాక్షాత్కరించాడు.

 కావుననే వీరిని "పితామహస్యాపి పితామహాయ" అంటారు సంప్రదాయ వేత్తలు (అహంహి సర్వలోకానాం మాతాథాతా పితామహ:అని చెప్పిన సర్వేశ్వరునిచే "తాతా" అని పిలువబడుటచే పితామహునకు కూడా పితామహుడై నారు)

*తిరుమలై అనన్దాళ్వాన్ అను మహనీయులు రామానుజుల వారి శిష్యులు.* 

వీరు ఆచార్యాజ్ఞను శిరసావహించి తిరుమలలో వేంచేసి యుండి నందనవనమును పెంచి పెరుమాళ్లకు పుష్ప కైంకర్యము చేసెడివారు. 

వీరు ఆనాడు పెంచి పోషించిన నందనవనం నేటికిని అనన్తాళ్వాన్ తోటగా ప్రసిద్దమై నానాపుష్పలతా గుల్మతరుశోబితమై అలరారు చున్నది.

 వీరి యీ కైంకర్యమునకు సంతసించిన భగవద్రామానుజులు వీరిని "అనన్దాన్ పిళ్ళై" అని అనేవారట. 

ఒక పర్యాయం పద్మావతీ శ్రీనివాసులు రాజకుమారిక రాజకుమారుల వేషంలో అనన్దాళ్వాన్ తోటలోని పుష్పములను కోసికొని అలంకరించుకొంటున్నారు. ఇంతలో అనన్దాళ్వాన్ రావడం చూచి వారు సన్నిధికి అప్రదక్షిణంగా పరుగెత్తి ఉద్యానవనం దగ్గర అంతర్థానమై నారట. దీనికి సూచకంగా బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు స్వామివారు అప్రదక్షిణంగా ఉద్యానవనంలోనికి వేంచేస్తారట.

*భగవద్రామానుజుల కైంకర్యములు*

భగవద్రామానుజులు ఈ సన్నిధిలో గావించిన కైంకర్యములు అనేకములు.

 అవినేటికిని మనకు మనకు దర్శనీయములై యున్నవి.

 వీరు వేంకటాచలపతికి శంఖచక్రములను ప్రసాదించారు. స్వామి వక్షస్థలమున ద్విభుజయగు వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన రత్నమాలికా యోగమున సమర్పింప జేసినారు. 

కావుననే ప్రతి శుక్రవారం స్వామికి తిరుమంజనం జరుపుచున్నారు.

పూర్వం ఈస్వామి బ్రహ్మోత్సవములు "తిరుచానూరు" (తిరుచ్చుగనూరు) లో జరిగేవట-

కానీ రామానుజులవారు ఈ ఉత్సవములు కొండమీదనే జరిగేలాగున అచటి సన్నిధి చుట్టు వీధులను నిర్మింపజేసి భక్తులకు అవాస యోగ్యము గావించి అది మొదలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్కడే జరిగేటట్లు చేశారు.

ఈ సన్నిధిలో కౌతుక బేరంగా ఉండిన "మలైకువియా నిన్ఱపెరుమాళ్ళను" ఉత్సవమూర్తిగాను అప్పటివరకు ఉత్సవమూర్తిగా ఉండిన "వేంగడత్తుఱైవార్" అనువారిని కౌతుక బేరంగాను ఆలయ వైభవాభివృద్ధికై మార్పు చేయించినారట రామానుజులవారు.

 ఈ "మలైకువియా నిన్ఱ పెరుమాళ్లనే" మలైయప్పన్ అని అంటారు.

ఇట్లే ఈ సన్నిధిలో అర్చకులుగా "శెంగవిరాయన్" అను వైఖానస ఆచార్య సత్తముల వంశీయులే ఉండవలయునని నియమించారు.

 స్వామి పుష్కరిణీ తీరమునగల వరాహ ప్పెరుమాళ్ల సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులా (అల్పిశి) మాసం శ్రవణం నాడు తిరునక్షత్రోత్సవమును నిత్య తిరువారాదనమును యథావిధిగా జరుగునట్లు కట్టడి చేసారు.

ఒకప్పుడు ఈ ఆలయం శత్రు సమాకాస్తం కాగా పర పురుష స్పర్శనొల్లని పెరియపిరాట్టి (శ్రీదేవి) స్వామి వక్షస్థలమును చేరగా భూపిరాట్టి (భూదేవి) ఉద్యానవనమున గల " అళగప్పిరానార్" " అను బావియందు ప్రవేశించినారట.

శ్రీ ఆళవందారులు తిరుమలైకి వేంచేసినపుడు ఒక సందర్భంలో "మారిమారాద తణ్ణమ్మలై" అనునట్లు సంతత వర్షాతిశయమును చూచి ఇట్టి వర్షాతిశయ సమయములలో తిరుమంజన తీర్థము పాపవినాశం నుండి తేనవసరం లేదని ఈ నందనో ద్యానమునగల " అళగప్పిరానార్" " అను ఈ బావితీర్థమును వినియోగింప వచ్చునని ఆనతిచ్చిరట. 

ఈ బావికి "అళగప్పిరానార్" అను దివ్యనామము నుంచినవారు శ్రీఆళవందారులే. స్వామి రామానుజులు ఆనామమునే స్థిరపరచి దాని సమీపంలో భూదేవిని శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠింపజేసినారు.

ఈ బావిని త్రవ్వించినవాడు రంగదాసు అను గొప్ప భక్తుడు. అతడు స్వామివారికి ఆలయ ప్రాకార గోపురాదులను నిర్మింప సంకల్పించి ప్రాకార నిర్మాణమునకు అడ్డుగా ఉన్న తింత్రిణీ వృక్షమును; (ఈ నిర్ణిద్ర తింత్రిణీ వృక్షము క్రిందినే స్వామి వేంచేసియుండేవారు) స్వామి దక్షిణ పార్శ్వమున అమ్మవారు వేంచేసియున్న చంపక వృక్షమును అడ్డుతొలగవలసినదని సవినయంగా భక్తితో ప్రార్థించారట.

 ఆరాత్రి ఆరెండు వృక్షములు వెనుకకు తగ్గగా కట్టడములను నిర్మింపజేశారట. నేడు ఈవృక్షములు గలప్రాకారాన్ని చంపక ప్రాకారమని ఆబావిని పూలబావియని వ్యవహరిస్తున్నారు. 

రామానుజులవారు ఈ వృత్తాన్తాన్ని విని ఆరెండు వృక్షములు ఆదిశేషాంశములని భావించి వానికిని నిత్య తిరువారాధన జరిగేలా నియమించినారట.

మరియొకప్పుడు "వీరనరసింహదేవరాయలు" అను రాజు తిరుమలైకు యాత్రగా వచ్చి స్వామిని సేవించి స్వామికి గోపురము నిర్మించాలని సంకల్పించి పెద్దల అనుమతితో గోపురం కట్టనారంభించినారట.

ఒకరోజు రాత్రి ఒక సర్పం ఆరాజు కలలో కనిపించి "రాజా! నీవు ఈగోపురము నిర్మిస్తుంటే నాశరీరం నానా బాధలు పడుతున్నది" అని పలికిందట. రాజు ఆశ్చర్యపడి మరునాడు స్వామిని సేవింపగా ఆ సర్పం స్వామియొక్క వైకుంఠ హస్తమును చుట్టుకొని దర్శనమిచ్చి అంతర్ధానమైనదట.

 ఆ సన్నివేశం చూచిన రాజు ఆ పర్వతం ఆదిశేషుడే యని విశ్వసించి గోపుర నిర్మాణమును అంతటితో ఆపివేసినాడు. ఆ వృత్తాన్తమును విన్నపెద్దలు స్మారకంగా స్వామివారికి స్వర్ణనాగాభరణమును సమర్పించినారట. రామానుజులవారు దానిని విని రెండవ శ్రీహస్తమునకును నాగాభరణం సమర్పింపజేసినారట.

స్వామి పుష్కరిణీ తీరంలో శ్రీశంకరాచార్యులవారికి శ్రీనరసింహస్వామి సాక్షాత్కరించి నందువలన అచట శ్రీనరసింహస్వామి సన్నిధియుండెడిది. 

కానీ లక్ష్మీసాహచర్యం లేనందువలన ఆస్వామి మహోగ్రంగా యుండె వారట. అందుచే వారిని ఆరాధింపరాదని కొందరు పలుకగా రామానుజులవారు అదిసరికాదని భావించి ఆస్వామిని శ్రీవేజ్కటాచలపతి సన్నిధి ప్రాకారములోనే ఈశాన్య దిక్కున విమానాభిముఖముగా ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాధన జరిగేలా ఆదేశించినారట.

 ఇట్లే పురాణ ప్రసిద్ధి ననుసరించి కొండనెక్కే మార్గంలోను నరసింహమూర్తిని ప్రతిష్ఠింపజేసి వారికి నిత్య తిరువారాదన జరిగేలా ఆదేశించారట.

శత్రువుల వలన కలిగిన ఒక మహోపద్రవ సమయంలో తిల్లై తిరుచ్చిత్తర కూడమున (చిదంబరం) వేంచేసియున్న గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో

తిరుపతికి వేంచేసి మలై ఆదివారంలో కొంతకాలం ఆరాధింపబడినారట.

అట్లె శ్రీరంగము నుండి నంబెరుమాళ్ళు (శ్రీరంగనాథులు) దెవెరులతో తిరుమలైకు వేంచేసి ద్వజస్తంభమున కెదురుగనుండు రంగమండపమున కొంతకాలం భక్తులకు సేవసాయించినారట. 

ఈ సన్నిధిలో స్నపన బేరముగా నున్న "అలగప్పిరానార్" అనుమూర్తియే శయ్యా బేరముగను సేవలనందుకొనుచున్నారు. కాని దనుర్మాసం నెలరోజులు మాత్రం శ్రీవైఖానసాగమం ప్రకారం శ్రీకృష్ణమూర్తియే శయ్యా బేరముగ శయన సేవను అనుగ్రహించు చుండును.

*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సుభాషితమ్ శివస్తుతి - 4*

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

*శివస్తుతి - 4*

 *_వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం౹_*

*_వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం౹_*

*_వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం౹_*

*_వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం౹౹_* 

*భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా,   బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు*  . .... 

🧘‍♂️🙏🪷 ✍️🙏

గురువారం, అక్టోబరు 5, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*

*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*

గురువారం, అక్టోబరు 5, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:షష్ఠి ఉ8.47 వరకు  

వారం:గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:మృగశిర రా11.28 వరకు

యోగం:వ్యతీపాతం ఉ10.28 వరకు

కరణం:వణిజ ఉ8.47 వరకు తదుపరి విష్ఠి రా8.59 వరకు

వర్జ్యం:ఉ.శే.వ6.07వరకు

దుర్ముహూర్తము:ఉ9.50 - 10.38 &

మ2.35 - 3.22

అమృతకాలం:మ2.22 -4.01

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి: కన్య 

చంద్ర రాశి: వృషభం/ మిథునం 

సూర్యోదయం:5.54

సూర్యాస్తమయం: 5.46

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

ఆచరిస్తూ మంచి ని బోధిస్తే

 *1944*

*కం*

మంచిని చేయుచు నొరులకు

మంచి ని బోధించినంత మంచి ఫలించున్.

సంచితముగ మంచిగుణము

పెంచగ జగమెల్ల నెపుడు వెలుగు ను సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనం ఆచరిస్తూ మంచి ని బోధిస్తే అది సత్ఫలితాలను ఇస్తుంది. మంచి ని పెంచడం వలన ఎల్లప్పుడూ ఈ ప్రపంచం వెలుగుతుంది.