5, అక్టోబర్ 2023, గురువారం

హిందూ ధర్మం* 🌹

 🌹 *మన హిందూ ధర్మం*  🌹



   ప్రతి రోజు పూజ గదిలో మాలిన్యాన్ని తీసి శుభ్రపరిచినట్టు హృదయాన్ని, మనసుని శుభ్రపరిచి ఆరాధించ మని చెప్పేది హిందూ ధర్మం! ప్రతి బాధ్యత పవిత్రమైనదే

బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునికి మనం చేయ గలిగే అత్యుత్తమ అర్చన! భగవంతుడు లేడని చెప్పిన వానిని మత ద్రోహిగా పరిగణించమని హిందూ ధర్మం చెపుతుంది! కనీసం వారానికి రెండుసార్లు ఐనా దైవ దర్శనం చేసుకోమని హిందూ ధర్మం చెపుతుంది!

ఆరాధ్య జన్మలో పుట్టిన వారికి, ఇతర బ్రాహ్మణ మతముల వారికి,  కాశీకో, లేక రామేశ్వరానికో తప్పని సరిగా ఒక్కసారైనా శివ దర్శనం చేసుకోమని హిందూ ధర్మం చెపుతుంది! హిందూ ధర్మాల ప్రకారం నిబంధనలు పాటించి సనాతన ధర్మాన్ని రక్షించమని హిందూ ధర్మం చెపుతుంది! హిందూ మతానికి మత మార్పు చేయమని చెప్పదు, ఎవరి దైవాని వారు మనస్ఫూర్తిగా ఆరాధించ మని చెపుతుంది పరమత దూషణ, ఇతర దైవం ఎవరైనా దూషించవద్దు మన దైవాన్ని గురించి గొప్పగా చెప్పమని చెప్పే ధర్మం హిందూ ధర్మం ఎలా బ్రతకాలో మనిషికి ఇలా బ్రతకాలి అని తెలియ పరిచేది హిందూ ధర్మం మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి మనిషిగా బ్రతకడానికి దారి చూపించేది ఒక్క హిందూ మతం మాత్రమే సనాతన ధర్మం అంటే అతి పురాతనమైనది, ప్రాచీయినమైనది అని అర్ధం!హిందూ మతానికి ప్రత్యేక మైన పీఠాధిపతులు, ఉప పీఠాధిపతులు ఉండరు!

సన్యాసులు కానీ, స్వామీజీలు కానీ, మత పెద్దలు కానీ, అన్యులు ఎవరైనా కానీ తప్పులు చేసిన నిలదీసి ప్రశ్నించే హక్కు హిందువులకు ఉంది!

హిందువులు ప్రకృతి పార్వతి దేవి అంశ అని, ఆకులు, పూలు వృక్షాలను, రాళ్లలో కూడ రత్నం లాంటి రామేశ్వరాన్ని దర్శిస్తారు! వృక్షాలలో కూడ త్రిమూర్తులను దర్శించే సంకల్పం ఉన్నవారు హిందువులు!  నీటిని గంగా దేవిగా, గాలిని వాయు లింగ రూపంలో ఉన్న శివాంశతోను

వానరములను,  హనుమంతునితోను, కుక్కలని,కూడ కాశీలోని కాలభైవ దర్శనం అనగా, కాలభైరవునితోను, పందులను, వరాహ స్వరూపంతోను, మన వేదాలు, పురాణాలూ, ఇతిహాసాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత,  బాగోతాలు శాస్త్రాలు గ్రంధాలు వీటన్నిటిని కూడ హిందూ ధర్మం కింద ఆరాధిస్తారు హిందువులు! ప్రతి జీవిలోనూ శివతత్వం చూస్తుంది! అన్ని మతాలను గౌరవించేది మన హిందూ మతం! పరమత దూషణ చేయనిది, ధర్మం, హిందూ ధర్మం! ఇంత గొప్పది మన భారత దేశం, ఇక్కడి ధర్మాలు అందుకే విదేశీయులు కూడ మన మత ధర్మాల మీద ఆశక్తి చూపుతారు!


*హిందూధర్మం వర్ధిల్లాలి*

కామెంట్‌లు లేవు: